
SNEAK PEAK

నిశ్శబ్దంగా గడుస్తున్న నైట్...
ఓ చిన్న 1BHK ప్లాట్ లో......
సారిక బెడ్‌పై మౌనంగా పడి ఉంది. తలపైకి చేతులు వేసి ఆలోచనల్లో మునిగిపోయింది. బయట వీధిలో బల్బు వెలుగుతో గదిలో కొద్దిగా కనిపిస్తోంది. ఆమె భర్త మధు, పక్కన పడుకున్నాడు. కష్టమైన పని ఒత్తిడి వల్ల అలసిపోయి ఆలోచించకుండా నిద్రలోకి జారిపోయాడు.
సారిక దిండు క్రిందనున్న మెాబైల్ తీసుకొని చూసింది —
**"ఆన్‌లైన్ 11:48 PM - Aryan ?"**
ఆమె ఫోన్‌ను మళ్లీ పక్కకు పెట్టింది.
తన మనస్సులో మాట:
"ఇవన్నీ బాగా ఉండాలి కదా…"
ఎందుకో నాకు మనస్సులో అల్లకల్లోలంగా ఉంది నా వేడి వేడి ఆలోచనలు వడివడిగా వేగంగా పరిగెడుతున్నాయి
బ్రతుకంతా భారంగా శూన్యంలా తోస్తోంది...
మధు మంచివాడే… కాని, ఒకరిని ప్రేమించాలి అనిపించాలే కదా!"
ఆమె నిద్రపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ మదిలో ప్రశాంతత లేదు.
❤ రాజా వారి ప్రోడక్షన్స్ ❤