Thread Rating:
  • 3 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రకృతి
#1
1. అమ్మతనం 


 నేను ప్రాణాలు పోసుకొని కన్నులు తెరువగా నన్ను చుట్టేసిన వలయాన్ని కాళ్ళతో పగలకొట్టి బయటకు వచ్చి ఊపిరి పీర్చుకున్నాను. 

పక్కనే మరికొన్ని వలయాలలో నా సహోదరులు ప్రాణాలు పోసుకోడానికి సిద్ధపడుతున్నారు. 

మా చుట్టూ ఒక రక్షణ గోడ ఉంది. 

మా అమ్మ మా భద్రత కోసం కట్టించిందేమో.

 నా వలయం పక్కనే ఒక ఉత్తరం కంట పడింది. అందులో ఇలా వ్రాసుంది.

“ నా ప్రియమైన బుజ్జాయిలారా, నా మాట మేరకు మీరు కొంత పెద్దగా అయ్యేవరకు ఇక్కడే ఉండి మీ చుట్టూ ఉన్న గోడను తినాలి. అదే మీకు తిండి. మీరు పెద్దయ్యే వరకు మీ కడుపు నింపుతుంది ఆ గోడ. ఆ పిమ్మట మీరు వేటకు వెళ్ళవచ్చు. ”

మా అమ్మ మమ్మల్ని విడిచి గోడ కట్టి ఎక్కడికి పోయింది?

నేను ఉత్తరంలో సందేశం చదువుతుండగా సహోదరులు ప్రాణం పోసుకున్నారు. వాళ్ళకి అమ్మ సందేశాన్ని ప్రకటించి, మా ఆహారాన్ని తినడం మొదలు పెట్టాము. 

రోజులు గడుస్తున్నాయి, మేము పెద్దగవుతున్నాము. గోడ తిరిగిపోతూ, మా కడుపులో అరిగిపోతుంది. 

పాతికమంది మేము, మాకు అమ్మ అందించిన ఆహారం రెండు నెలలు కూడా సరిపోలేదు. మూడు రోజులు ఆకలికి అలమటించి ఇక మీదట మేము వేటకి వెళ్ళక తప్పదనుకొని విడిపోయి ఎవరి దారి వాళ్ళము చూసుకున్నాము. 

నేను నాకంటూ ఒక చీకటి గృహని స్థావరంగా మలచుకున్నాను. 

ఆకలేసినప్పుడు వేటకి వెళ్లడం దొరికిన దానితో తృప్తి పడడం. మరి నా సహోదరులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. 

నా వయసు నాకు చెప్పింది, వయసుకొచ్చానని. ఒక జంట కోసం వెతికాను. 

అప్పుడు నాకు ఎదురయ్యాడు ఒకతడు. నాకు ఇవ్వాల్సిన బహుమతిని ఇచ్చేసాడు. దాన్ని నా గృహముకు తీసుకెళ్ళి ప్రేమగా దాచుకున్నాను. 

చూస్తుండగానే నేను కూడా అమ్మలాగే కొన్ని వలయాలను పట్టించాను. అతడు ఇచ్చిన బహుమానాన్ని నా నాలుకతో వలయాలకు గంధం పూసుకున్నాను.

ఆ పనిలో అలసిపోయాను. నేను తిండికోసం ఎక్కడికీ పోలేను. నా చిన్ని వలయాలను విడిచిపోతే వాటిని ఎవరైనా ఎత్తుకుపోతారు. కావున కడుపు మాడ్చుకొని, నన్ను అడ్డుగోడగా మలుచుకొని వలయాలను కంటికి రెప్పలా కాపాడుకున్నాను. 

ఆకలికి అలమటించి నాకు ప్రాణం పోయేలా ఉంది. ఇంకొన్ని రోజులు బ్రతకలేనేమో. 

ఆ క్షణం నా బాధ్యత నాకు గుర్తొచ్చింది. నేను ఒక అమ్మని కాబోతున్నాను. 

అమ్మగా ఆఖరి బాధ్యత ఒకటి మిగిలుంది. ఉత్తరం రాసి పెట్టాలి. 

“ నా ప్రియమైన బుజ్జాయిలారా, నా మాట మేరకు మీరు కొంత పెద్దగా అయ్యేవరకు ఇక్కడే ఉండి మీ చుట్టూ ఉన్న గోడను తినాలి. అదే మీకు తిండి. మీరు పెద్దయ్యే వరకు మీ కడుపు నింపుతుంది ఆ గోడ. ఆ పిమ్మట మీరు వేటకు వెళ్ళవచ్చు, ” అని ఉత్తరం రాసాను.

కళ్ళు మూసుకొని నా తుది శ్వాస విడిచేముందు, నా జీవితంలో నన్ను వెంటాడుతున్న ప్రశ్నకి సమాధానం దొరికింది. 

ప్రశ్న: మా అమ్మ మమ్మల్ని విడిచి గోడ కట్టి ఎక్కడికి పోయింది. 

సమాధానం: అమ్మ మమ్మల్నీ విడిచి ఎక్కడికీ పోలేదు. మా రక్షణకై మా చుట్టూ గోడగా మారి, మాకు ఆహారం అయిపోయింది.

అమ్మా... ఇప్పుడు నేను అమ్మనైనాను కాబట్టి నీ ప్రేమ కొంతైనా తెలిసొచ్చింది. లేకుంటే నీ ప్రేమ ఎవరికైనా ఏమైనా ఏమని అర్థం అవుతుంది. నీ ప్రేమ మా పుట్టుక, నీ త్యాగం మా ఎదుగుదల. నీ అడుగుల్లో అడిగేస్తూ నీవు నేర్పింది ఇప్పుడు నా పిల్లలకి నేర్పుతాను. ఇక సెలవు. 
ఇట్లు మీరు చెప్పూ, చీపురు, అందుకొని చంపే, జెర్రి.
.
.
.
.
.
[+] 8 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
yourock
Like Reply
#3
Nice update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#4
Interesting intro.
[+] 1 user Likes hisoka's post
Like Reply
#5
Completely alag story. Insects mother  sacrifice you are unimaginable. brother. Waiting for next update.
[+] 1 user Likes GodNika's post
Like Reply
#6
2. గిజి



నమస్తే, అందరూ మంచిగున్నరానుల్లా. నేను పారకీటు. 


ఇవాళ ఏం చెప్పనీకి వచ్చినా అంటే, మా దోస్తు గిజికి ఓ తంట అచ్చి పడ్డది. 

మొన్న జామ చెట్టుకి జామ కాయలు కొరుకుతుంటే కలిసిండు. 

“ ఏమిరా గిజీ ఎండకి మొహం మాడిందా ఏంది, మాడు మొహం పెట్టుకున్నవు? ” అని అడిగిన. 

వాడేమో నెత్తి గోక్కుంట, “ అది కాదన్నా ఈడు వచ్చింది అమ్మాయిని మనువాడాలి కదా. ” అన్నాడు. 

నేను నా ఎత్తు పన్నేసుకొని నవ్విన. 

“ అవును. ఏంది మరి పిల్ల దొరుకుతలేదా? ” అని అడిగిన. 

“ పిల్ల దొరికింది అన్నా, కానీ పిల్లకోసం మన ఊర్ల ఇంకో నలుగురు ఉన్నరూ. ఆ పిల్ల ఏమో ఒక షరతు పెట్టింది. ” అని చెప్పుకున్నాడు. 

“ షరతు పెట్టిందా, యెహే ముద్దిచ్చి గుంజు సంగతి తేలిపోతది. ”

మళ్ళీ మొహం పక్కకి తిప్పుకున్నాడు. 

“ నీకేంది అన్నా, ఇద్దరు పెళ్ళాలు ఉన్నారు. మంచిగా పొదలల్లా మూతులు నాకుకుంట ఉంటావ్. నాకు దొరికిందే ఒక్క అమ్మాయి. అదేమో షరతు పెట్టింది. నా ఆగం నాది. ”


వాడి మొహం చూస్తే చిన్నబోయి ఉన్నడు. 

“ అరె అంత దిగులు పడకు తమ్మీ. ఆ షరతు ఏందీ చెప్పు. ” అని అడిగిన.

“ పిల్ల కోసం మంచి ఇల్లు కట్టాలంట. ఎవరి ఇల్లు సౌలతుగా ఉంటే వాళ్ల ఇంట్లో ఇల్లాలు అవుతుంది అంట. ”

“ వారిని అంటే ఇల్లుంటేనే అమ్మాయి, లేకుంటే గాలికేనా నీ బతుకు. సరే మరి ఇల్లు కట్టుకోరా అందులో ఏముంది. ”

వాడు నిమిత్తంగా చూస్తూ, “ కట్టలు తెచ్చుకోవాలి ఎక్కడైనా చూసావా ? ” అని అడిగాడు. 

నేను అటు పొలాల దిక్కు ఎండు గడ్డి చూసి, “ అటు తూర్పు దిక్కు దొరుకుతాయి. ఇంతకీ ఎక్కడ కడ్తావు నీ ఇల్లు? ”

“ చెరువు పక్కన, కడుతా, మధ్యాహ్నం చల్లగాలి, రాత్రి వెచ్చగా ఉంటది, ” అన్నాడు.

వాడి తొవ్వలో వాడు పోయి కట్టలు ఎత్తుకొచ్చుకొని ఇల్లు పని మొదలు పెట్టిండు.

ఇవాళ చూస్తుంటే అసలు ఒక్క క్షణం కూడా ఆగుతలేడు, కట్టలు పుల్లలు తెస్తుండు, అల్లుతుండు. 

అటు ఇటూ చూస్తే మిగతా నలుగురు కూడా అదే చెరువు దగ్గర కట్టడం మొదలెట్టారు. 

ఎవ్వడూ తగ్గుతలేడు. 

ఒకడేమో పొడుగూత కడుతుండు, ఇంకొడేమో చిన్నగానే ఉంది, పాపం వాడికి వీళ్ళు కట్టలు దొరకనివ్వట్లేదేమో. ఇంకొకడు ఐతే పెద్దగ కడుతున్నాడు. మనోడు బేస్మెంట్ కే రోజు గడుపుతున్నాడు మరి సమయానికి అయితదో కాదో.

నేను వీళ్ళనే చూసుకుంటా కూకుంటే అక్కడ నాకు తిండి లేకుండా పోతాది. 

పోయి నా పని నేను చూసుకున్న. 

కొన్నిరోజుల తర్వాత చూస్తే నాలుగు ఇల్లులు సిద్ధంగా ఉన్నాయి. 

మరి ఆ పిల్ల ఎవరిది మెచ్చుకుంటాదో. 

వాడొచ్చి, “ ఎట్లుండి అన్నా మెచ్చుకుంటది అంటావా? ” అని అడిగిండు. 

“ ఏమోరా నాకేం తెలుసు చూద్దాం. ”

చూస్తుండగానే ఆ అమ్మాయి వచ్చి దూరంగా నిల్చుంది. 

నాలుగు ఇల్లులని చూసుకుంటా ఉంది. 

మనోడు కూడా వాడి ఇల్లు పక్కన నిల్చొని అటూ ఇటూ నడుస్తుండు. 


కొద్దిసేపటికి ఆమె మధ్యలో రెండో ఇంట్లోకి పోయింది. 

అయ్యో మనోడి ఇల్లు నచ్చలేదా ఏంది అనుకున్న, కానీ మళ్ళీ ఆమె బయటకి వచ్చింది. 

నాలుగు ఇల్లుల చూస్తూ తిరిగీ తిరిగీ తుర్రుమని మనోడి ఇంట్లో చొచ్చింది. వీడు కూడా వెనకాలే లోపల చొచ్చిండు. 


మిగతా వాళ్ళ మొఖాలు నారాజ్ అయ్యాయి.

అబ్బా గిజిగానికి మనువు కుదిరింది అనుకొని నేను కూడా ఇగ ఇంటికి వెళ్ళిపోయాను. 


అయినా ఇల్లు మంచిగా ఉంటేనే పెళ్ళి చేసుకుంటాను అని అనడం ఏందో. నాకలా లేదు చాలు.


ఇట్లు,
పారకీటు, ఎండుగడ్డితో కొమ్మలకు వేలాడే ఇల్లు కట్టే గిజిగాడి స్నేహం.
.
.
.
.
.

Next : 


3. శుబ్రం శృంగారం
Like Reply




Users browsing this thread: 2 Guest(s)