27-07-2025, 08:26 PM
(This post was last modified: 27-07-2025, 11:13 PM by ramscrazy. Edited 1 time in total. Edited 1 time in total.)
ముప్ఫై ఏళ్ల భార్గవ హైదరాబాద్ లో ఒక ఫేమస్ ఆర్టిస్ట్. చాలా ప్రశాంతమైన మొఖం, విశాలమైన ఛాతి, దృఢమైన శరీరం అతడి సొంతం. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆ మొఖం వెనుక అగ్నిపర్వతం లాంటి ఆవేదన ఉంటుంది.
23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ శిరీష, వయసుకు తగ్గ అందం, కలల పట్ల మక్కువ, వయసుకు మించిన ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్వతంత్రంగా బ్రతికే తెగువ, చలాకీతనం ఆమె సొంతం.
వారం మొత్తం సాఫ్ట్వేర్ జాబ్ లో బిజీగా ఉండే శిరీష, వారాంతాల్లో ఆర్ట్స్ ని అన్వేషిస్తూ ఉంటుంది. ఎప్పటిలానే ఒక శనివారం సాయంత్రం, బంజారా హిల్స్ లోని ఒక ఆర్ట్ గేలరీకి వెళ్తుంది శిరీష.
ప్రపంచంలో చాలా ఆర్ట్ గ్యాలరీస్ తిరిగింది కానీ, ఈ ఆర్ట్ గేలరీ ఆమెకి చాలా ప్రత్యేకం.. కారణం, అక్కడ ఉండే ఒక విభిన్నమైన ఆర్ట్ కలెక్షన్. ఆ కలెక్షన్ మీద ఆర్టిస్ట్ సిగ్నేచర్ ఉండదు. తొలిసారి చూసినప్పుడే, శిరీషకి చాలా బాగా నచ్చేశాయి. అప్పటినుండి ప్రతి నెల కనీసం ఒకట్రెండు సార్లయినా ఆ గేలరీకి వెళ్ళటం ఆమెకు అలవాటైపోయింది. ఆ ఆర్టిస్ట్ ఎవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది కానీ సఫలం కాలేదు.
ఆ ఆర్ట్స్ ఏంటో? శిరీష ఆ రహస్య కళాకారుడిని ఎలా కనుగొంటుందో? భార్గవ ముఖం వెనుక ఉన్న ఆ ఆవేదన ఏంటో? ఆ బాధను శిరీష ఎలా తీరుస్తుందో, ఈ కథ ద్వారా తెలియచేసే ప్రయత్నం చేస్తాను.
గమనిక: నేను ఉత్తర అమెరికా లో, మన తెలుగువారెవరూ లేని ప్రాంతంలో ఉంటున్నాను. ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినప్పుడు ఈ సైట్కి వచ్చి స్టోరీస్ చదువుతూ ఉంటాను. ఈ సైట్ వల్ల చాలా రోజుల తరువాత నాలో కథలు రాయాలన్న ఆశ చిగురించింది. నా ఈ ప్రయత్నం మిమ్మల్ని ఆకట్టుకుంటుందని ఆశిస్తూ… ఒక ఒంటరి తెలుగోడు!