Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
22-05-2025, 06:44 PM
(This post was last modified: 01-08-2025, 05:54 PM by Haran000. Edited 8 times in total. Edited 8 times in total.)
అయస్కాంతాలు
ఎందుకని ఎక్కువగా అబ్బాయి లేదా అమ్మాయి ఎదుటి వారి వెంటపడి వాళ్ళు తిరిగి ప్రేమించేలా చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మొదటి పరిచయంలోనే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకరికొకరు ఎందుకు నచ్చకోడదు?
పైగా అనిపిస్తుంది, ఎప్పుడూ ఎక్కువగా మా మగాళ్లే ఆడవారి వెంట పడాలా? ఏ అందం అంటే ఆడవారే ఎందుకు గుర్తు రావాలి? మగాడి తెగింపులో అందం లేదా, పోరాటంలో అందం లేదా? కుటుంబాన్ని
భుజాన ఎత్తే బాధ్యతలో అందం లేదా, తన ఇంటి ఇల్లాలి జెడకి మల్లెపూలు తెచ్చే ప్రేమలో అందం లేదా, పడకలో అర్థాంగి చెప్పే ముద్దు మాటల్లో అర్థం లేకున్నా అంగీకరించే అణుకువలో అందం లేదా?
హ్మ్మ్... !
పేరు శశాంక్. ఎత్తు ఐదడుగుల ఎనిమిది అంగుళాలు. చామన ఛాయ, ముక్కు కింద నీడలాంటి చిన్న మీసం. అదేంటో నాకు గడ్డం పెరగట్లేదు. ఏదో ఎడారిలో గడ్డిలా అక్కడక్కడా ఉన్నట్టు ఉంటుందని, మీసంతో సహా మొత్తం క్లీన్ షేవ్ మెయింటైన్ చేస్తాను. ఈ ఇయర్ ఏ డిగ్రీ అయిపోయింది. సివిల్స్ కి చదవాలి అనుకుంటున్న. కోచింగ్ తీసుకుందాం అనుకున్నా కానీ మా రజిత పెద్దమ్మ కూతురు మేఘనా అని బోయినపల్లిలో ఉంటుంది. తనూ ఐదు సంవత్సరాల క్రితం సివిల్స్ కి చదువుకొని నాలుగు సార్లు రాసి ఎగ్జామ్ ఇంటర్వ్యూ వరకూ పోయినా సెలెక్షన్ అవ్వక అది మానేసి ఇక వచ్చిన ఒక బ్యాంకు క్లర్కు ఉద్యోగం చేసుకుంటుంది. నేనిప్పుడు గోదావరిఖని నుంచి సికింద్రాబాదుకి లక్జరీ బస్సులో మేఘనా అక్క ఇంటికే వెళ్తున్నాను. ఆరు నెలలు అక్క ఇంట్లోనే, అక్కనే నాకు మెంటర్ గా నాకు సివిల్స్ చదివిస్తుంది. లక్షలు పోసి కోచింగ్ ఎందుకు మంచి అనుభవం ఉన్న అక్కయ్య ఉండగా అన్నట్టు. నేను మంచిగా బుద్దిగా కష్టపడి చదవాలి అంతే.
అలా ప్రయాణం చేస్తూ ఉండగా, బస్సు కరీంనగర్ బస్టాండ్ లో ఆగింది. ఇక్కడ ఐదు నిమిషాలు ఇంజన్ ఆఫ్ చేస్తాడు డ్రైవర్, నాకుడా కోకకోలా తాగి బ్లాడర్ నిండిపోయింది. అలా దిగి పోయి ఉచ్చపోసుకొని తిరిగి బస్సు ఎక్కాను.
వెళ్ళేటప్పుడు నా నల్ల లెదర్ బ్యాగు పక్క సీటు ఖాళీగానే ఉంది కదా అని పెట్టి పోయాను. ఇప్పుడేమో నేను కూర్చున్న చోట నా బ్యాగు ఉంది, పక్కనేమో ఎవరో అమ్మాయి కురుల్లో క్లిప్పు పెట్టుకుంటుంది.
అబ్బ నా పక్కన ఎవరో అమ్మాయి పడింది, దేవుడున్నాడు అనుకున్న.
అప్పుడే ఇంజన్ స్టార్ట్ అయ్యింది. ముందుకి పోయి, “ కొంచెం జరగరా ” అని అడిగాను అమ్మాయిని.
అప్పుడు తాను జుట్టు వెనక్కి వేసుకొని క్లిప్పు బిగించి మోకాళ్ళు పక్కకి జరుపుతూ నాకు దారిచ్చింది.
కూర్చున్న వెంటనే ఒక తాజా పెర్ఫ్యూమ్ సువాసన వచ్చింది. ఏదో నా పక్కన గులాబీ తోట కూర్చున్నట్టుగా.
నేను అమ్మాయిని వైపే మొహం తిప్పుకొని ఉన్నా మరుక్షణం తను నన్ను చూసింది.
దెయ్యం.
అవే చిన్ని మెరుపు కళ్ళు, అవే చిన్ని గులాబి పెదాలు, ముద్దొచ్చే చిట్టిచామంతి చెంపలు, నిండు పున్నమిలా నా కలలో వెలుగులు నింపే మొహము. తన కన్నుల మీద వాలే సిల్కు ముంగురులు అంటే నాకిష్టం.
ఇప్పుడు కూడా నన్నే ఆశ్చర్యంగా చూస్తూ అడ్డు పడుతున్న ముంగురులు కుడి చెవి వెనక్కి తోసి,
“ నువ్వా మబ్బుమొహంగా.... ” అని అసహ్యించుకుంది.
నాదేం మబ్బుమొహం కాదు, నన్ను అలా తిట్టడం దానికలవాటు లేండి.
“ ఎటు పోతున్నావే దయ్యం మెహమ ”
ఇది నాకలవాటు.
ఉష్ దేవుడున్నాడు. అందుకే ఇప్పుడు ఈ నసను నాకంటగట్టాడు. దీనితో ఇంకో మూడు లేదా నాలుగు గంటలు ప్రయాణం చెయ్యాలా?
పేరు: అనుష. మేమిద్దరం చిన్ననాటి స్నేహితులం. వయసుకొచ్చాక తన అందానికి నాకు ప్రేమ పుట్టింది.
To be continued……………..
The following 29 users Like Haran000's post:29 users Like Haran000's post
• ABC24, AnandKumarpy, Babu_07, ceexey86, Chamak, gora, jaffa mahesh, jwala, K.rahul, King1969, maleforU, Meghana1508, murali1978, pandumsk, ramd420, ramkumar750521, Rao2024, sheenastevens, Skv89, sriramakrishna, stories1968, Sushma2000, Target, Tik, Uday, Uppi9848, Venrao, wraith, రకీ1234
Posts: 4,037
Threads: 0
Likes Received: 2,766 in 2,151 posts
Likes Given: 758
Joined: May 2021
Reputation:
30
•
Posts: 1,328
Threads: 17
Likes Received: 14,329 in 1,282 posts
Likes Given: 1,841
Joined: Sep 2020
Reputation:
988
Posts: 1,408
Threads: 22
Likes Received: 10,756 in 1,058 posts
Likes Given: 3,564
Joined: Jan 2021
Reputation:
1,044
చిన్నప్పుడు కధలు కంచి కి మనం ఇంటికి అనేవారు...అప్పుడు కధలు అన్ని కంచి కి ఎందుకు పోతాయో అర్ధం అయ్యేది కాదు.... ఇప్పుడు కధలు అన్ని కరీంనగర్ లో ఎందుకు పుడతాయో అర్ధం కావట్లేదు...
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
(22-05-2025, 08:28 PM)BR0304 Wrote: Good starting
•
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
(22-05-2025, 08:30 PM)కుమార్ Wrote: ఇది గీత
పార్ట్ 2 న.
•
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
(22-05-2025, 08:53 PM)Veeeruoriginals Wrote: చిన్నప్పుడు కధలు కంచి కి మనం ఇంటికి అనేవారు...అప్పుడు కధలు అన్ని కంచి కి ఎందుకు పోతాయో అర్ధం అయ్యేది కాదు.... ఇప్పుడు కధలు అన్ని కరీంనగర్ లో ఎందుకు పుడతాయో అర్ధం కావట్లేదు...
నా కథలు నా ఇష్టం ఉన్న చోట పుట్టిస్తున్న కాబట్టి.
Posts: 1,408
Threads: 22
Likes Received: 10,756 in 1,058 posts
Likes Given: 3,564
Joined: Jan 2021
Reputation:
1,044
(22-05-2025, 09:31 PM)Haran000 Wrote: నా కథలు నా ఇష్టం ఉన్న చోట పుట్టిస్తున్న కాబట్టి.
నాకు వెన్ను లో వణుకు పుడతాది బ్రో కరీంనగర్ అంటే.... అవి ఒక భయానక రోజులు... Collector ఆఫీస్ ముందు కూర్చుని అమ్మ లేదు నాన్న ledu ek నిరంజన్ అంటూ పాడుకుంటూ ఏడ్చే వాడిని... ఇప్పుడు మంచి memories నే అనుకో... But lonely గా ఫీల్ ayye వాడిని... ఎంతైనా బీచ్ గాలి అలవాటు పడితే ఎక్కడా బ్రతకలేం బ్రో
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
(22-05-2025, 09:51 PM)Veeeruoriginals Wrote: నాకు వెన్ను లో వణుకు పుడతాది బ్రో కరీంనగర్ అంటే.... అవి ఒక భయానక రోజులు... Collector ఆఫీస్ ముందు కూర్చుని అమ్మ లేదు నాన్న ledu ek నిరంజన్ అంటూ పాడుకుంటూ ఏడ్చే వాడిని... ఇప్పుడు మంచి memories నే అనుకో... But lonely గా ఫీల్ ayye వాడిని... ఎంతైనా బీచ్ గాలి అలవాటు పడితే ఎక్కడా బ్రతకలేం బ్రో
నా జీవితం మొత్తం కరీంనగర్ ఏ బ్రో. ఒకవేళ ఉద్యోగం వచ్చాక ఎలా ఉంటాదో తెలీదు.
Posts: 1,408
Threads: 22
Likes Received: 10,756 in 1,058 posts
Likes Given: 3,564
Joined: Jan 2021
Reputation:
1,044
(22-05-2025, 09:58 PM)Haran000 Wrote: నా జీవితం మొత్తం కరీంనగర్ ఏ బ్రో. ఒకవేళ ఉద్యోగం వచ్చాక ఎలా ఉంటాదో తెలీదు.
ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా బ్రతకటం నేర్చుకోవాలి బ్రో.... చాలా చాలా ఇంపార్టెంట్
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
(22-05-2025, 10:23 PM)Veeeruoriginals Wrote: ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా బ్రతకటం నేర్చుకోవాలి బ్రో.... చాలా చాలా ఇంపార్టెంట్
అవును
•
Posts: 458
Threads: 1
Likes Received: 207 in 151 posts
Likes Given: 104
Joined: Dec 2022
Reputation:
0
Good start sir..all the best..to me.. great story ga ఉండాలని కోరుకుంటున్నాము
•
Posts: 849
Threads: 0
Likes Received: 630 in 524 posts
Likes Given: 136
Joined: Sep 2021
Reputation:
8
•
Posts: 1,944
Threads: 4
Likes Received: 3,037 in 1,395 posts
Likes Given: 4,075
Joined: Nov 2018
Reputation:
60
(22-05-2025, 06:44 PM)Haran000 Wrote: ట్యూషన్ - 2
పైగా అనిపిస్తుంది, ఎప్పుడూ ఎక్కువగా మా మగాళ్లే ఆడవారి వెంట పడాలా?
పడాల్సిన అవసరం లేదు బ్రో, కానీ అది మన కంట్రోల్లో వుండదు..అంతా హార్మోన్స్ ని ప్రేరేపించే జీన్స్ తెచ్చే తంటా. ఎక్కడో చదివిన గుర్తు "ఎలాగైతే మంచి పంట దిగుబడి సాదించడానికి పొలాన్ని సారవంతం (మనం అందం, వంపుసొంపులు అనుకుందాం) చేస్తామో, అలాగే ఎదురుగా మంచి వంపుసొంపులతో అందమైన (సారవంతమైన) ఆడది (భూమి) కనిపిస్తుంటే వెంటపడడం (విత్తనమేసి, సాగుచేయడం) జీన్స్ చేసే కుట్ర". అందుకే భూమికోసం, ఆడదానికోసం అన్ని యుద్దాలు.
ఏ అందం అంటే ఆడవారే ఎందుకు గుర్తు రావాలి? మగాడి తెగింపులో అందం లేదా, పోరాటంలో అందం లేదా? కుటుంబాన్ని
భుజాన ఎత్తే బాధ్యతలో అందం లేదా, తన ఇంటి ఇల్లాలి జెడకి మల్లెపూలు తెచ్చే ప్రేమలో అందం లేదా, పడకలో అర్థాంగి చెప్పే ముద్దు మాటల్లో అర్థం లేకున్నా అంగీకరించే అణుకువలో అందం లేదా?
అయినా అవి అందం కాదు బ్రో "అవసరాలు", మగాళ్ళపై ఓ ముద్ర వేసేసారు ఆరంభం అదుర్స్...
: :ఉదయ్
•
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
(22-05-2025, 11:49 PM)Chchandu Wrote: Good start sir..all the best..to me.. great story ga ఉండాలని కోరుకుంటున్నాము
Let’s try for best.
•
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
(23-05-2025, 04:15 PM)Uday Wrote: ఆరంభం అదుర్స్...
ఏదైతే ఏంటి బ్రో ఏదో flow లో అలా వచ్చిందంతే.
•
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
(23-05-2025, 03:28 PM)Nani666 Wrote: Good starting andi..
•
Posts: 1,328
Threads: 17
Likes Received: 14,329 in 1,282 posts
Likes Given: 1,841
Joined: Sep 2020
Reputation:
988
ఇప్పుడు
ట్యూషన్ పార్ట్ వన్ చదివి,
పార్ట్ 2 కి రావాలా
Posts: 98
Threads: 0
Likes Received: 35 in 29 posts
Likes Given: 86
Joined: Mar 2025
Reputation:
0
24-05-2025, 12:59 AM
(This post was last modified: 24-05-2025, 01:00 AM by Meghana1508. Edited 1 time in total. Edited 1 time in total.)
Posts: 5,393
Threads: 28
Likes Received: 19,981 in 4,494 posts
Likes Given: 3,008
Joined: Dec 2021
Reputation:
1,185
24-05-2025, 07:21 PM
(This post was last modified: 01-08-2025, 05:47 PM by Haran000. Edited 3 times in total. Edited 3 times in total.)
ఎండ కిటికీ నుంచి మొహం మీద పడుతుంది. బస్సు కరీంనగర్ ప్రాంగణం దాటి హైదరాబాదు హైవే ఎక్కింది.
కొన్ని నిమిషాల ముందు,
“ ఎటు పోతున్నావే దయ్యం మొహమ ” అని దానికి ఎదురుచెప్పగానే గుడ్లప్పగించి చూసి టక్కున ముక్కు విరుచుకొని మొహం అటు తిప్పుకుంది.
“ నీకెందుకు చెప్పాలి. సప్పుడేక అటు చూసుకుంటా కూర్చో లేకుంటే పండు. నన్ను గెలలకు. ”
పసుపు రంగు చుడీదార్ చున్నీ మెడ వరకు కప్పుకుంది. నేనేదో అక్కడ చూస్తున్నట్టు.
“ నేనేమి చూస్తలేను... ఓ కప్పుకోకు...” అంటూ నవ్వాను. కావాలనే తనని పొడుస్తూ. “అయినా అక్కడేమంత ఉన్నాయని... ”
ఎడమ చేత్తో నా తొడ మీద గుద్దింది.
“ ఇందుకే అటు తిరుగు అన్నాను. ” మొహం తిప్పేసుకుంది. “ పోదా నీకు ఆ నోటి దూల? ” అనడిగింది.
“ పోయిందనే అనుకున్నాను, నువు వచ్చావు కదా, ఇక మళ్ళీ స్టార్ట్ అయినట్టుంది. ” అన్నాను.
“ ఐతే మూసుకొని కూర్చో. నువు కిటికీలో కనిపిస్తే అసలు బస్సే ఎక్కేదాన్ని కాదు. ”
“ అవునా... మరి దిగు. బొచ్చడి బస్సులు ఉన్నాయి బస్టాండ్ లో. ”
“ టికెట్ తీసుకున్న కదా. తప్పుద్దా? ” అని తల పట్టుకుంది.
నేను మందహంగా తన ముడుచుకున్న గులాబీ పెదవులు చూసి తన ముద్దుతనాన్నీ చూసి నాకదో తృప్తి.
“ అయినా బస్సు దిగి ఎటు పోయావురా? ” అంది నన్ను చూసి.
“ ఉచ్చకి పోయినా. ”
నా మీద చిరుకోపంతో, “ అస్సలు అస్సలు కొంచెం కూడా మారలేదు. చి... వాష్రూం పోయా అనొచ్చు కదా. ”
“ నేను చేతులు కడుక్కోడానికి పోలేదే. ఉచ్చ పోసుకోడానికి పోయిన. పోసి చేతులు కడుక్కొని వచ్చిన. ”
“ ఈ.... చ...! చాలాపు. ఇల్లొదిలి చాలా రోజుల తర్వాత బయటకొస్తే నువ్వే తగలాలా నాకు. ”
“ అంత చికాకేందుకే. సర్లే మూసుకుంటాను. ” అన్నాను కాసేపు విరామం ఇద్దాం అని.
-
బస్సు హైవే ఎక్కింది. అలా కిటికీ లోంచి చూస్తూ కూర్చున్న.
గాలి మా వైపు వీస్తుంటే తన కురులు నా ముక్కు మీద ఎందుకు ఊసులాడుతున్నాయో అర్థం కాలేదు. తన సువాసన మాత్రం ఆహా... !
అలా అలుగునూర్ దాకా పోయినాక, ఊరుకుంటుందా మొగ ప్రాణం, తెలీకుండానే మత్తుగా తన మెడ మీద గడ్డం వాల్చేశాను.
సట్క్ అని చెంప మీద కొట్టింది.
ఉలిక్కిపడి చుట్టూ చూసాను ఎవరైనా చూసారా అని, అందరూ మొహాలు ఫోనులో పెట్టేసారు.
ఏం బతుకు ఐపోయింది, స్మార్ట్ఫోనులు వచ్చాక పక్కకి ఉన్న వాళ్ళతో మాటలే కరువయ్యాయి. ఎక్కడ ఏమి జరుగుతుందో ముచ్చటలో తెలీకుండా కథలకు కొత్త విషయాలు ఎలా తెలుస్తాయి అసలు.
ఉష్... చిన్న కళ్ళు ఒకేసారి పెద్దగా ఎలా అవుతాయో తనవి. నా ముక్కు పచ్చడి చేసేలా చూస్తుంది.
నేను తుంటరిగా, “ ఆడవాసన చూసి చాలా రోజులైందే ” అన్నాను పల్లెక్కిస్తూ.
మళ్ళీ మొహం మీద చిన్నగా ఒక్కటి పీకింది. “ నీ మబ్బుమోహానికి అదొక్కటే తక్కువ. ” అని జుట్టు సరిచేసుకుంది.
బస్సులో మంది ఉంటారు కదా, కెమెరా మాత్రం మా ఇద్దరి మీదే ఉండేంటి అనుకుంటున్నారా? భూమ్మీద ఎనిమిది వందల కోట్ల జనం ఉన్నారు, వాళ్ళందరి గురించీ పట్టించుకుంటామా. ఇదీ అంతే.
పసుపు రంగు చుడిదార్, ఎర్రని సన్నగాజులూ, చిన్న టిక్లీ, చిన్న నెమలి ఆకారం స్టోన్ కమ్మలు, అవన్నీ నాకిష్టం.
మా ఇంటర్ మొదటి ఏడాది, బతుకమ్మ పండక్కి కరీంనగర్ మార్కెట్, ఎస్... బీ... ఐ... బ్యాంకు దగ్గర బండీల మీద అమ్మే జూలరీ, చూసి నచ్చాయంటే నా దగ్గరున్న రెండు వందలూ పెట్టి కొనిచ్చాను. ఇంకా అవి పెట్టుకుంటుంది. అవి ఇష్టం కానీ నేను కాదు.
ఇవాళ తను మంచి ఉల్లాసంగా ఉన్నట్టుంది. లేక ఇదేమైనా ప్లాన్ చేసే నా పక్కక్కొచ్చి కూర్చుందా? లేదు లేదు ఏదో యాదృచ్చికం అయ్యుంటుందిలే.
నన్ను చూస్తూ కళ్ళెగరేసింది. మొహం అడ్డంగా ఊపి ఏం లేదని ఊరుకున్నాను.
“ బాగున్నానా ” అనడిగింది నా భుజం దువ్వుతూ.
“ ఎప్పుడూ అలాగే ఉంటావులే దయ్యం దాన ” అన్నాను నాలో నెను నవ్వుకుంటూ.
మోకాళ్ళు నాదిక్కు తిప్పి, “ ఇంటర్ అయిపోయినప్పుడు పోయావు కరీంనగర్ వదిలి మీ వూరికి. మళ్ళీ ఒక్కసారి కూడా కనిపించలేదు. అసలేం చేసావు? ” అని ప్రశ్నేసింది.
తన మోకాళ్ళనే చూస్తూ, “ డిగ్రీ హైదరాబాద్ ఉస్మానియాలో చేసాను. ”
చిన్నగా, వ్యంగ్యపు నవ్వుతో, “ ఏంటి నీకు ఉస్మానియాలో వచ్చిందా? ”
సూటిగా చూసాను. నవ్వాపింది.
“ వచ్చింది. ” అన్నాను ఖచ్చితంగా.
“ నీకంత సీన్ అనుకోలేదు. ” అనింది.
“ ఊ ” అని బదులిచ్చి కిటికీ దిక్కు చూసాను.
ఎండా, చెట్లూ, పొలాలు, దూరంగా కొండలూ ఒకసారి బస్సు ముందు వైపు చూడగా అక్కడెక్కడో కారు మేఘాలు ఉన్నట్టుగా అనిపించింది.
వర్షం గాని కురుస్తుందా ఏంటి అనుకున్న.
“ శశీ... ” అని తియ్యగా పిలిచింది.
తను ఊరికే పిలిచినా నాకలాగే అనిపిస్తుందిలేండి.
“ చెప్పు... ” అన్నాను మొహం తిప్పకుండా.
“ డిగ్రీ పాస్ అయ్యావా అసలు? ” అనేసింది కావాలనే.
తన భుజం గిచ్చి, “ ఇంకోసారి చదువులో డౌట్ పడితే కిటికీలోంచి నూకేస్తాను బక్కముండ. ” అని కొంచెం గట్టిగా అనేసాను.
నన్ను గుడ్లప్పగించి చూసి, “ ఏంట్రా ఎక్కువ అవుతున్నాయి మాటలు ” అని కొట్టింది.
ఆ నిండు జాబిలి మొహంలో, ఒక నిమిషం నెమలి కళ్ళు, మరు నిమిషం గుడ్లగూప కళ్ళు ఎలా పెడతాదో అసలు.
“ నేను నిజమే చెప్తున్న, నాకు నేనేమి డబ్బా కొట్టుకుంటలేను. సరేనా…. నువు ఊకె నన్ను ప్రతీదానికి ఫెయిల్ అయినట్టు చూడకు. ”
“ సరేలే.... ”
ఆ తరువాత, “ ఇంతకీ నీసంగతేంటే ” అనడిగాను.
గాజుల చేతి వేలు చూపి, “ నీకస్సలు చెప్పను ” అని విసుక్కుంది.
“ ఒసేయ్ నువ్వు అడిగితే నేను చెప్పలేదా? ”
“ నువు వెళ్ళిపోయినప్పుడు నీకు చెప్పాలనిపించలేదు. ఇప్పుడు నాకు చెప్పాలని లేదు. చెప్పను అంతే... ” అంటూ మూతి ముడుచుకుంది.
తెలుసు, మన గురించే పట్టించుకునే వారికి ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కోపం రాదా. ఇక్కడ కూడా అదే పొరపాటు జరిగింది.
అయస్కాంతాల గోల ఇది. దూరంగా నెట్టే తప్పులున్నా, మరో దిక్కు దగ్గర చేసే జ్ఞాపకాలు కూడా ఉన్నాయి.
తన చేతు పట్టుకోబోయే అటు పెట్టేసుకుంది.
“ అనూ చెప్పు. ఏం చేసావు? ”
“ MMBS చేసాను. చాలా. ” అంది.
పూర్తిగా ఒళ్ళు తన దిక్కు తిరిగింది.
“ ఇది చెప్పడానికి ఎందుకు విసుక్కుంటావు మరి? ”
“ ఏం లేదు... ”... అంటూ చేతులు కట్టుకుంది.
తనని చూస్తూ ఉండిపోతాను. అది తనకి కూడా తెలుసు. చూడలేక ఇటు చూడదు అంతే.
“ నేనేమి కావాలని చెప్పకుండా పోలేదు. ” .... కొద్దిగా తన కుడి చూపుడు వేలు ముట్టుకున్న. “ ఎందుకు పోయామో తెలుసా? ”
నా చేతిని కొట్టింది తీయమ్మంటూ. “ తెలుసు... రవి చెప్పాడు. మీ నాన్నమ్మ చనిపోయిందంట కదా. ”
“ హ... మా తాతని మేమే చూసుకుంటూ అక్కడే ఉండిపోయాము. ”
చప్పుడు చెయ్యలేదు.
మూడేళ్ళు ఫోను లేదు, ఫోటో లేదు. నెంబర్ కూడా తీసుకోలేదు. చామంతి చెంపలను ఊహించుకుంటూ ఉండిపోయాను.
మళ్ళీ చెయ్యి ముట్టుకున్న, ఈసారి ఏమి అనలేదు.
“ అక్కడ ఎలా ఉంది మరి. కొత్త పరిచయాలు ఏమైనా అయ్యాయా ” అనడిగింది.
“ హ్మ్మ్... గోదావరిఖనిలో అమ్మాయిలైతే బాగున్నారే... ”. నవ్వి, “ నీలాంటి దయ్యం మొహాలైతే లేవులే అక్కడ. ”
కొట్టింది. దూరం జరిగిన.
“ నేను అమ్మాయిల గురించి అడగలేదు. ” నా మాటలో అర్థం దానికర్థమయ్యే ఉంటుందిలే. “ ఏదో కొత్తగా ఫ్రెండ్స్ గురించి అడిగాను అంతే. ”
“ తరువాత నేనున్నది ఎక్కువ హైదరాబాదులోనే. అక్కడేం ఉన్నా. అంతా మాములులే. ”
“ మరి హైదరాబాదులో? అంది. నన్ను సూటిగా చూస్తూ తన కళ్ళు చిన్న అనుమానంగా అనిపించాయి. “ అదే ఉస్మానియా అన్నావు కదా. ”
మొహం ముందుకు పొడిచి, “ నీకెందుకు ” అన్నాను పొగరుగా.
“ అవునులే... నాకెందుకు ” అని టక్కున మొహం తిప్పుకుంది నీకే ఉందా పొగరు అన్నట్టు.
మౌనంగా కూర్చున్నాము. తను ఫోను తీసి చూస్తూ కూర్చుంది.
బ్యాగులోంచి ఎయిర్పోన్స్ తీసి పెట్టుకుంది.
ఇక నేనేమి మాట్లాడేది ఉంది. కళ్ళు మూసుకొని వెనక్కి ఒరిగాను.
పదేళ్ళ క్రితం, బడిలో మాకు సైన్స్ ఫేర్ ఉంటే, తను మా క్లాస్ టాపర్ కదా. ఏదో చేద్దాం అనుకుంది.
రేపు సైన్స్ ఫేర్ అనగా ముందు రోజు నేను సాయంత్రం మా పక్కింట్లోకి పోయాను. ఇంటి రేకుల కింద, అనుష బంక మట్టిని చార్ట్ పేపరుకి అద్దుతూ దాన్ని ఒక వట్టముక్కుపై నిలబెట్టాలని చూస్తుంది.
“ ఏం చేస్తున్నావే ” అని నేనడిగితే, “ వొల్కానో (అగ్నిపర్వతం) చేస్తున్న. ” అని చెప్పింది.
అప్పట్లో మన థమ్సప్ డెక్కనుతోని కొవ్వొత్తి కరిగించి నీళ్ళు పోస్తే బుస్సనీ పొంగేది.
తన ఆలోచన ఏంటి అంటే మట్టి అధిమిన పేపరుని చిప్పలా నిల్చోపెట్టి దాని మధ్యలో అలా పొంగించాలి అని.
అప్పట్లో బడుల్లో అన్నీ సరిగ్గా చెప్పేవారు కాదు. ఇదే అగ్నిపర్వతం లాంటివి ఎన్నో చేసేవాళ్ళు. ప్రతీ సంవత్సరం చేసేవాళ్ళు. దాని సంబరానికి ఆది చేసుకుంటుంది.
నన్ను సహాయం పట్టిమంది. సర్లే అని రెండు గంటల పాటు అంతా సిద్ధం చేసాము.
నా నోటి దూల ఉంది కదా అది ఊకుంటుందా.
“ అనుష... ఒకసారి ఇక్కడ చేద్దాం. మళ్ళీ రేపు మనం బడిలో చేసినాక అది రాకపోతే వేస్ట్ అవుతాది. ” అన్నాను.
తను ఒప్పుకుంది. ఇద్దరం కలిసే లోపల డెక్కన్ పెట్టాము. కింద క్యాండిల్ పెట్టాము.
తనని దూరంగా ఉండమని చెప్పి నేను నీళ్ళు పోసాను. అనుకున్నట్టే పైకి పొగలు లేచి పొంగింది.
తరువాత రోజు ఇంటి నుంచి బయల్దేరుతూ పట్టుకొమ్మని చెప్తే పట్టుకునాను.
బడికి పోయాము. మా క్లాసులో నలుగురూ నాలుగు రకాలు చేసారు.
అసలు సమయానికి వచ్చేసరికి అనుష కొంచెం భయపడింది నీళ్ళు పోసాక వెనక్కి జిల్లితే ఎలా అని.
తనని పక్కకి తప్పించి నేనే అంతా చేసాను.
ఏదో పిల్లల సంతోషమని అందరూ చప్పట్లు కొట్టి, ప్రిన్సిపాల్ గారు నాకు అభినందనలు చెప్పారు.
ఇంటి నుంచీ తీసుకొచ్చింది నేను, అందరూ నన్నే చూసారు. నేను చేసాను అనుకున్నారు. వాళ్ళ ముందు ప్రదర్శన చేసింది కూడా నేనే.
ప్రిన్సిపాల్ అందుకే నన్నే మెచ్చుకున్నాడు. కానీ నేను కాదు అని చెప్పేద్దాం అనుకుని చెప్పకుండా ఆగిపోయి పొరపాటు చేసాను.
సాయంత్రం వరకూ మాములుగానే ఉంది. ఇంటికి పోయాక వెనక నుంచి నన్ను దొబ్బితే నేను గేటు దగ్గర పడి నా మోచేతికి దెబ్బ తగిలింది.
నొప్పిలో కోపం వచ్చి లేచి అనుష చెంప మీద ఒక్కటి సరిచాను.
ఏడుస్తూ ఇంట్లోకెళ్లింది.
మా కోపం మా పేరెంట్స్ దాకా వెళ్ళింది. మా నాన్న, వాళ్ళ నాన్న కూడా. మీ అబ్బాయిదే తప్పు అని ఆయన అంటే, నీ కూతురిదే తప్పు అని మా నాన్న.
నాన్న నాతో అనుషతో స్నేహం వొద్దన్నాడు. పైగా తన పని నేనెందుకు చేసాను అని తిట్టాడు.
వాళ్ళ నాన్న కూడా సహాయం ఎందుకు తీసుకున్నావని తిట్టే ఉంటారు.
కొన్ని రోజులు మేమిద్దరం దూరంగా ఉన్నాము.
అది నాతో మాట్లాడట్లేదు. ఎంత పొగరు అనుకున్నాను. కావాలనే దాని జీబుంబా పెన్సిల్ దొంగతనం చేసాను.
సాయంత్రం ఇంట్లో పెన్సిల్ తో రాసుకుంటుంటే అది వచ్చి చూసింది.
నా దగ్గరనుంచి లాక్కుంటూ గొడవ పడ్డాము. పెన్సిల్ విరిగింది.
కొన్ని రోజులకు ఎగ్జామ్స్ అయ్యాయి, నాకు తక్కువ మార్కులు వచ్చాయి.
ప్రోగ్రెస్ రిపోర్టు తీసుకొని, “ మబ్బుమొహమా రోజూ పందిలా నిద్రపోతాడు ” అని వెక్కిరించింది.
నేను “ దయ్యం ” అని కొట్టాను.
“ ముప్పైకి రెండు... ముప్పైకి రెండు... లేత కంకులు... ముప్పైకి రెండు... బాబు... ” అని అరుపుకి నిద్రలేచాను.
ప్రజ్ఞాపూర్ వచ్చింది. ఇక్కడ బస్టాప్ దగ్గర కంకులూ, చిప్స్, కూల్ డ్రింక్స్ అమ్ముతారు.
అనుషని చూస్తే పాటలు వింటూ ఉంది.
సర్లే అని నేను ముప్పై ఇచ్చి రెండు వేడివేడి కంకులు తీసుకున్నాను.
తన ఎడమ చెవిలో ఒక bud తీస్తే చూసింది. కంకి తీసుకోమని ఇస్తే, “ నాకేం వద్దు నేను కొనుక్కుంటాను. ” అంది.
కిటికీ దగ్గరున్న ఆవిడని పిలిచి ఇంకోటివ్వమంది. నేను వద్దని సైగ చేసాను.
అనుష కోపంగా, “ నేను తీసుకోనన్నానా? నువ్వెధిచ్చినా నేను తీసుకోను. ” అని చెప్పి హ్యాండ్బాడ్ నుంచి ఇరవై నోటు తీసి నా చేతిలో పెట్టి, కుడి చేతిలో కంకి తీసుకుంది.
“ నాకేమొద్దు నీ పైసలు. తీస్కో. ” అని మళ్ళీ ఇచ్చేసాను.
కొరికి ఎంగిలి చేసిన కంకి నాకిచ్చేసింది.
ఇంత బెట్టెందుకే. ప్రతీ సారీ నీకు సహాయం చేయాలనే కదా అనుకునేది.
.
.
.
.
To be continued………….
The following 24 users Like Haran000's post:24 users Like Haran000's post
• AB-the Unicorn, Anand, Babu143, BR0304, ceexey86, Chamak, cherry8g, Dexter_25, gora, Jagan1991, k3vv3, King1969, Meghana1508, murali1978, pandumsk, ramkumar750521, Saaru123, shekhadu, Skv89, Uday, Uppi9848, vikas123, vinny_sdpt, wraith
|