10-04-2025, 07:24 PM
(This post was last modified: 27-04-2025, 09:12 PM by Haran000. Edited 11 times in total. Edited 11 times in total.)
Haran - Quarks
Haran - Quarks
|
10-04-2025, 07:24 PM
(This post was last modified: 27-04-2025, 09:12 PM by Haran000. Edited 11 times in total. Edited 11 times in total.)
Haran - Quarks
11-04-2025, 12:28 PM
(This post was last modified: 11-04-2025, 12:58 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
బాగుంది అంటే.. రాత బాగున్నట్టా.. కథ బాగున్నట్టా. కథ బాగుంది.. కానీ మళ్ళీ చదవాలని లేదు. ఎందుకంటే..
మాటలతో మనసుల్ని పిండేసావ్.. ఊహల్లో మమ్మల్ని నిస్సహాయుల్ని చేసి నిలబెట్టావ్.. మరోసారి వాడి బాధని పంచుకోలేను.. ఐ హేట్ యూ బ్రో..
11-04-2025, 01:52 PM
మనసు పిండేసావు బ్రో, రాజు స్థానంలో వుండి ఊహించుకుంటే...తలచుకోవడానికే భయమేస్తుంది..విప్లవాలు మరి ఊరికేరావు కదా. ఏదైనా మంచి పత్రికకు పంపించొచ్హుకదా ఈ కథను.
:
![]() ![]()
11-04-2025, 02:00 PM
Uday గారి సలహా పాటిస్తూ ఈ కథని పత్రికలో వేయించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ deleted.
Thanx for commenting brothers
11-04-2025, 02:17 PM
Continue
11-04-2025, 06:59 PM
నీతో ఇదే తలనొప్పి బాసూ.. కథ నచ్చింది.. మళ్ళీ చదువుదామని వస్తే డిలీట్ చేసేశావు..
![]()
11-04-2025, 07:19 PM
11-04-2025, 08:09 PM
(This post was last modified: 20-06-2025, 09:43 AM by A V C. Edited 1 time in total. Edited 1 time in total.)
.....
11-04-2025, 08:37 PM
bro..enti ??? why deleted...i missed...please re post
11-04-2025, 11:28 PM
(11-04-2025, 02:00 PM)Haran000 Wrote: Uday గారి సలహా పాటిస్తూ ఈ కథని పత్రికలో వేయించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ deleted. ![]()
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
12-04-2025, 09:13 PM
Whoever missed the vetti story, don’t worry, I’ll post another good small story here soon. Please wait.
27-04-2025, 08:53 PM
(This post was last modified: 27-04-2025, 09:11 PM by Haran000. Edited 5 times in total. Edited 5 times in total.)
Quark - 1
చిన్నోడి కష్టం
“ పెద్దన్నా సరుకు దొరికింది. దొరికింది... ఈ మాసం అంతా సరిపోతుంది. ” అని పక్కోడితో చెప్పాడు చిన్నోడు. విన్న బృందం ఒక్కసారిగా అప్రమత్తం అయ్యి చిన్నోడి దిక్కు చూసారు. మాట మందిలో పాకుతూ పెద్దోడి దాకా వచ్చింది. బృందం వెనక ఉన్న పెద్దోడు, “ ఎక్కడరా... చూసావా నువ్వు? ” అని మాట ముందుకి చేరవేశాడు. “ చూసాను పెద్దన్న, ఇక్కడినుంచి మూడువేల అడుగుల దూరంలో, మనవాళ్ళకు ముప్పై మంది ఎత్తు గోడ ఎక్కితే మట్టి ప్రదేశంలో ఒక చెట్టు కింద పెద్ద కంచంలో ఉన్నాయి. ” అని బదులు వచ్చింది. అప్పుడు పెద్దోడు, “ వార్తా.... వెళ్ళు... గూడెంలో మనవాళ్ళంద్రికీ చెప్పు. చిన్నోడితో ముందు మేము వెళతాము, నువు వాళ్ళని తీసుకొని ఇక్కడికి రారా. ” అవునని తలూపి, చకచకా పరిగెత్తుకుంటూ, గూడెం బాట పట్టాడు వార్తా. చిన్నోడి వెనకే పెద్దోడి అడుగు జాడల్లో పదహారు మంది బృందం సరుకు కోసం ప్రయాణం మొదలెట్టింది. ఎత్తుకు దాటి, గడ్డలు దాటి, మట్టి పెళ్ళలు దాటి, సున్నపు కుప్పల పల్లం దాటి చేరుకున్నారు పెద్ద గోడను. పెద్దోడు ముందు బృందాన్ని ఆగమని చెప్పి, “ చిన్నోడు... ముందు నువు వెళ్ళు. కిరిజాకి నువు వాడి వెనక ఎక్కు. మీ వెనక మేము ఎక్కుతాము. ” “ సరే పెద్దన్న ” అని ఒప్పుకొని చిన్నోడి వెనకే గోడ ఎక్కసాగాడు కిరిజాకి. కిరిజాకిని వెంబడిస్తూ పెద్దోడి బృందం ఎక్కసాగింది. చిన్నోడు, కిరిజాకి గోడ పై అంచు చేరుకోగానే, కళ్ళముందున్న పెద్ద చెట్టు కింద, ఇత్తడి కంచంలో, వెండి ఇటుకల్లా మెరిసే తీపి సరుకుని చూసి కరిజాకి కన్నులు మెరిసాయి. కానీ వీళ్ళ ఆశ్చర్యానికి అక్కడ మరో బృందం ఉంది. శత్రువు బృందం సంగతి పెద్దోడికి చేరవేయగానే, బృందం మొత్తం పైకి చేరింది. “ కుణాహీ.... మన వాళ్ళని తీసుకురాపో .. ” అని పెద్దోడి మాట విని, కుణాహీ వచ్చిన దారిన గోడ దిగి పరుగులు తీశాడు. “ కిరిజాకి.... దాడి చెయ్యండి... ” అన్నాడు పెద్దోడు. అంతే ఈ బృందం ముందుకు సాగి శత్రు బృందం మీద దాడి మొదలు పెట్టింది. రెండు బృందాల పోరులో, కొందరి కాళ్ళు విరుగుతుంటే, ఇంకొందరి చేతులు విరుగుతూ, మరికొందరి మొహాల మీద రక్తపు చీలికలతో గాయాలయ్యి సమరం ఉద్రిక్తంగా మారింది. చిన్నోడు శత్రువు తల మీద కొడుతున్నా, బలహీనంగా ఉండడం వలన శత్రువు తనని నెట్టేసి మీద ఎక్కి కొడుతుంటే, పెద్దోడు వచ్చి కాపాడుతూ, శత్రువుని దొబ్బి ఎదుర్కున్నాడు. “ కిరిజాకి ఏరీ మనవాళ్ళు....” అంటూ పెద్దోడు శత్రువునీ వెనక్కి తోస్తున్నాడు. వీళ్ళ బృందంలో నలుగురు మృతి చెందారు. సహాయం కోసం చూస్తున్న వీళ్లకి అప్పుడే గోడ ఎక్కి వచ్చిన కుణాహీ కనిపించగానే, చిన్నోడు మరలా పోరాటం కొనసాగించాడు. ఐదు క్షణాల్లో మిత్రు సైన్యం దాడికి దిగి శత్రువులను నేల కూల్చింది. తొమ్మిది శవాలు. శత్రువుల్లో ఒక్కరు కూడా మిగల్లేదు. సైన్యం వరుస కట్టి, చచ్చిన నలుగురు మృతదేహాలను మోసుకెళ్లడానికి పది మందికి అప్పజెప్పాడు పెద్దోడు. మిగతావాళ్ళు సరుకు దిశగా అడుగువేస్తుంటే, పై పెద్ద నీళ్ళ జల్లు కురిసింది. వెంటనే సైన్యమంతా నేలని గట్టిగా పట్టుకొని స్థిరంగా నిల్చున్న, నీళ్ళ వరదకు కొందరు గోడ దాకా కొట్టుకుపోయారు. “ తులసి చెట్టుకి పట్టకురా... అక్కడ అమ్మ చెక్కర పెట్టింది కన్పిత్తలేదా. ” అని మా చెల్లి చెప్పగానే పైపు ఇటు తిప్పి జామ చెట్టు పక్కన మొక్కలకి నీళ్లు పట్టాను. “ ఛ..... చీమలను డిస్టర్బ్ చేసాను.” ————————— 1 —————————
27-04-2025, 09:14 PM
Will posts quarks whenever possible.
Like
Rate
Comment
![]()
28-04-2025, 12:46 PM
కథ మధ్యలో అనిపించింది ఇలాంటిదేదో వుంటుందని
![]()
:
![]() ![]()
28-04-2025, 01:33 PM
29-04-2025, 12:46 PM
పిట్ట కథ
May 21, 2025, నేను హరణ్, మా ఇంటి పై పోర్షన్లో నాకంటూ ఉన్న ఒక్కగదిలో ఉంటాను. ఏం చేస్తాను గదిలో? simple గా చెప్పాలంటే, education, story creation, imagination, masturbation అంతే. 10 AM కి స్నానం చేసి ఇడిచిన బట్టలు కింద washing machine లో వేద్దాం అని డోర్ తీసి బయట అడుగు పెట్టిన. ఎండ భగ్గుమంటోంది. కింద slab కాళ్ళు కాలుతున్నాయి, slippers వేసుకొని మెట్లు దిగి, కింద ఇంటి సందు వెనక్కి పోయి washing macine ముందున్న బకెట్టులో బట్టలు వేసి వచ్చి ఇంట్లోకి పోయి బాటిల్ నీళ్ళు తాగిన. ఇంకో 600ml milton bottle లో cool water నింపుకొని మెట్లెక్కి నా గదికి పోతుంటే, అక్కడ ఉండే tap దగ్గర ఒక నల్లనీ పిచ్చుక కూస్తుంది. బహుశా అది, “ రేయ్ బద్ధకం బ్రాండంబాసిడర్, నాకూడా కొన్ని నీలు ఇవ్వురా ధూపైతుంది ” అంటుందో ఏమో అనిపించింది. నేను tap దగ్గరకి పోతే అదేమో తుర్రుమని ఎగిరిపోయింది. నేనసలే pure nonveg, దాన్ని తినేస్తానేమో అనుకుందో. సర్లే నేను మొక్కలకు నీళ్ళు పోసే చిన్న ప్లాస్టిక్ బకెట్టులో tap తిప్పి, బకెట్టు నిండా నీళ్ళు నింపి గదిలోకి వచ్చేసాను. తలుపు తెరిచే పెట్టుకున్న, indian physical geography NCERT class 11 book తీసి ముందు పెట్టుకొని చదువుతూ ఒకసారి బయటకు చూసాను. వచ్చింది పిట్ట. బకెట్ చుట్టూ నిదానంగా తిరిగి, బకెట్టు అంచున నిల్చుని తాగింది. పాపం నిజంగానే ఎంత దూప మీద ఉందో. ఎండకి నాకే నీళ్ళు తాగి తాగి చెంబంత ఉన్న పొట్ట బిందేదంత ఉబ్బుతుంది మరి. నీళ్ళు తాగి ఒకసారి మెడ అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ నా గది పక్కన సందులోకి తుర్రుమంది. తర్వాత రోజు ప్రొద్దున్నే నేను లేచేసరికి గోడ మీద కూతలు పెడుతుంటే చూసాను. నా phone తీసుకొని ఆ పిట్టని photo తీద్దాం అనుకున్న. ముందు నా గదిలోంచి బయట అడుగుపెట్టగానే అది ఎగిరిపోయింది. నిన్ను నేనేం చెయ్యట్లేదే పిచ్చి పిట్ట అలా ఎగిరిపోతావు. నా గదిలో ఉండి కొంతసేపు చూసాక తిరిగి వచ్చి అక్కడే ఆగింది. నిదానంగా అడుగు బయట పెడుతూ, ఫోన్ తీసి ఫోటో తీస్తుంటే ఇంకో బ్రౌన్ రంగు పిచ్చి వచ్చింది, ఇది ఎగిరిపోయింది. సర్లే ఇంకెప్పుడైన తీద్దాం అనుకున్న. గంట గడిచాక, నా గది ముందే కీచుకీచుమని కూస్తుంటే చూసాను. అది అటూ ఇటూ ఆడుతూ ఉంది. టక్కున పక్కన సందులోకి పోయింది. ఇది సందులోకి ఊకె పోతుంది ఎంటా అని చూస్తే, మా ఇంటి terrace water down pipe చాటున గోడలో ఉన్న చిన్న రంధ్రంలో ఇది గూడు పెట్టుకుంది. అంటే ఇది ఇక్కడే ఉంటుంది. బకెట్టులో నీళ్ళు నింపి పెట్టిన. నా పనులు నాకున్నాయి, చదవాలి, i చూడాలి, గీత స్టోరీ రాయాలి, కట్టుకోవాలి. నా పని నేను చేసుకుంటున్న. పిట్ట సంగతి తెల్వదు. Lunch కోసం కిందికి పోయి పైకి వచ్చేటప్పుడు పిట్ట కూడా ఏదైనా తినాలి కదా, అందుకే మా అమ్మని నూకలు ఉన్నాయా అని అడిగిన. పిడికెడు నూకలు ఇచ్చింది. అవి పట్టుకొని పైకి వచ్చి tap దగ్గర గోడ మీద చిన్న కుప్ప పోసి, పక్కనే slab మీద కొన్ని జల్లెసాను. నేను గదిలోకి పోయాక, అది ఒక్కటి మాత్రమే కాదు ఇంకో రెండు పిట్టలు కూడా వచ్చి తిన్నాయి. సాయంత్రం కొన్ని సార్లు దాన్ని చూసాను. Photo తీద్దాం అంటే ఒక చోట నిల్చోలేదు. తరువాత మూడు రోజులు గడిచాక, 26 వ తారీకు, ప్రొద్దునే స్నానం చేసి నా అండర్వేర్ ఎండకి ఆరేద్దాం అని బయటకు పోతే, కాలికి ఏదో తాకింది. కింద చూస్తే ఆ పిట్ట. వారిని తొక్కేసానా, సచ్చిందా? లేదు నేను దాన్ని తొక్కలేదు, కాస్త నా కాలు అలా తాకింది అంతే. కానీ అది కధలట్లేదు. చీమలు కూడా ఉన్నాయి. దాచిపోయింది, ముందే ఏ రాత్రో సచ్చిపోయింది. కానీ ఎందుకు? నీళ్ళు నూకలు ఉన్నాయిగా. మరి ఎందుకు సచ్చింది అది? రాత్రి పూట ఎందుకు? పిల్లి వేటాడిందా? పిల్లి ఐతే గుటుక్కున మింగేసేది. విషయం మా అమ్మకి చెప్పాను. మా అమ్మ అది నిన్న సాయంత్రం కుంటడం చూసిందట. అంటే దానికి ఏదో దెబ్బ తగిలింది. చనిపోయింది. . . ------------------------- 2 --------------------
|
« Next Oldest | Next Newest »
|