Thread Rating:
  • 1 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"యంగేజ్" మెంట్"
#1
ఇంకో కథ. చిన్న కాన్సెప్ట్. మూడు, నాలుగు భాగాల్లో అయిపోతుంది. పాత్రలు ఎక్కువ మాట్లాడుకునే కథ. మీకు ఎలా అనిపిస్తుందో చూద్దాం.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
"ఒరేయ్ సుబ్బారావు, ఎక్కడున్నావురా?"

"ఇంట్లోరా. కొబ్బరి నీళ్ళు తాగుతున్నా"

"తాగుతూ ఇంట్లోనే ఉండు. ఎక్కడికీ వెళ్లకు. మీ ఇంటికే వస్తున్నా. ముఖ్యమైన విషయం మాట్లాడాలి"

కాల్ కట్ చేసిన సౌండ్.

"ఎవరయ్యా ఫోన్?"... కొబ్బరి నీళ్ళ గ్లాస్ భర్తకిస్తూ అంది లక్ష్మి.

"ఇంకెవరు చేస్తారు నాకు. మన రంగనాథమే. ఏంటో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఏంటో మరి. వస్తున్నాడు"... అన్నాడు సుబ్బారావు.

పది నిముషాల్లో వచ్చాడు రంగనాధం.

వస్తునే... "చెల్లెమ్మా, నువ్వు కూడా నేను చెప్పేది విను. కాకపోతే కాస్త చల్లగా ఏమైనా తేమ్మా. బయట బాగా ఎండగా ఉంది"... అంటూ కుర్చీలో కూర్చున్నాడు.

"ఏవిట్రా, ముఖ్యమైన విషయం అన్నావు. మా ఆవిడ కూడా వినాలంటున్నావు, ఏంటి సంగతి?"... స్నేహితుణ్ణి అడిగాడు సుబ్బారావు.

"చెప్తాగా. చల్లగా ఏదన్నా తాగనీరా. నోరు ఎండిపోయింది"... బదులిచ్చాడు రంగనాథం.

చల్లటి మజ్జిగతో వచ్చింది లక్ష్మి.

లక్ష్మి ఇచ్చిన మజ్జిగ గటగట తాగేసాడు రంగనాథం.

"అబ్బా హాయిగా ఉందిరా. చెల్లెమ్మా మజ్జిగ ఇచ్చిన చేత్తోనే ఆ ఫ్యాన్ స్పీడ్ కొంచెం పెంచమ్మా. మళ్ళీ అదే చేత్తో ఇంకొంచెం మజ్జిగ ఇవ్వమ్మా."... అంటూ కుర్చీలో వెనక్కి కూలబడి కళ్ళు మూసుకున్నాడు రంగనాథం.

"ఒరేయ్... నీకు సేవలు చేయించుకోవాలనుకుంటే మీ ఇంటికెళ్ళి చేయించుకోవచ్చు కదరా, మా ఇంటికెందుకు రావడం"... విసుక్కున్నాడు సుబ్బారావు.

"చెయ్యరా. చెయ్యి. నాకు సేవలు చేసిన ప్రాక్టీస్ మీకు ముందు ముందు పనికొస్తుంది"... అంటూ పెద్దగా నవ్వాడు రంగనాథం.

"అర్ధమయ్యేలా చెప్పరా. వెధవ గోల"... ఈ సారి కోపంగా అన్నాడు సుబ్బారావు.

"నీ కూతురుకి ఒక సంబంధం తెచ్చానురా. ఇంత కన్నా పెద్ద వార్త ఉందా నీకు"... నవ్వాడు రంగనాథం.

"అమ్మాయికి సంబంధమా. అమ్మాయికి సంబంధాలు చూడట్లేదు కదరా. అయినా దానికి ఇంకా ఇరవై రెండేళ్ళే కదరా. అసలింత వరకూ పెళ్ళి అనే మాట అనలేదు అమ్మాయితో"... ఆశ్చర్యపోతూ అన్నాడు సుబ్బారావు.

"నిజమేరా. కాని ఇది మంచి సంబంధం. పెద్ద స్థాయుంది అబ్బాయికి"

"అంత పెద్ద స్థాయుంటే మనమెలా తూగుతామురా"

"అమ్మా, నాన్నా మామూలేరా. మన లాంటి వాళ్ళే. అబ్బాయిది పెద్ద స్థాయి"

"అంటే? సరిగా చెప్పరా. నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు"... కోపంగా అన్నాడు సుబ్బారావు.

"అబ్బాయి ఉండేది అమెరికారా"

"వామ్మో అమెరికా సంబంధమా. ఒరేయ్ నేను తూగలేనురా. నా దగ్గర అంత లేదురా. నీకు తెలుసు కదా. ఆ కట్నాలు, కానుకలు నా వల్ల కాదు. నువ్వేదో మనకి తగ్గ సంబంధం తెచ్చావనుకున్నా. ఈ ముక్కేదో ఫోన్లో చెప్పుంటే సరిపోయేది కదా. నేను వద్దని అనేవాడిని. నువ్వు మా ఇంటికి వచ్చేవాడివి కాదు. నాకు రెండు గ్లాసుల మజ్జిగ ఖర్చు తప్పేది."

"నోరు మూసుకోరా... మజ్జిగ ఇచ్చి ఏదో రక్తదానం చేసినట్టు చెప్తున్నావు"... ఈ సారి తను కోపం చూపించాడు రంగనాథం.

"మజ్జిగ గురించి ఆపండి ఇద్దరూ"... కసురుకుంది లక్ష్మి.

ఇద్దరు మగవాళ్ళు మాటలు ఆపారు.

"ఔను అన్నయ్యా... అమెరికా సంబంధం అంటే మా వల్ల ఎలా చెప్పు. దాని కోసం రూపాయి రూపాయి పోగు చేసినవి అన్నీ అమెరికా అల్లుడి సూట్ కోసం ఖర్చు చేస్తే, అసలు పెళ్ళి ఇంకెలా చెయ్యగలం చెప్పు. మా మీద నీకున్న అభిమానం నాకు తెలుసు. కాని అమెరికా సంబంధం అంటే నేను కూడా వద్దనే అంటాను"... వివరంగా చెప్పింది లక్ష్మి.

"చెల్లెమ్మా నాకు తెలీదా మీ దగ్గర ఏముందో. వినండి ముందు"... అంటూ చెప్పనారంభించాడు రంగనాథం.


ఏం చెప్తాడో... అసలు కథేంటో ముందు భాగాల్లో చూద్దాం.
[+] 2 users Like earthman's post
Like Reply
#3
Super
Like Reply
#4
intro bagundi
Like Reply




Users browsing this thread: 1 Guest(s)