30-03-2025, 09:40 PM
(This post was last modified: 30-03-2025, 11:44 PM by Ranjith62. Edited 1 time in total. Edited 1 time in total.)
Chapter 1
రేపు పదిహేనేళ్ల తర్వాత, మొదటి సారి జైలు నుండి బయట వెళ్తున్నాను. ఆ ఆలోచనే భయంగా ఉంది. జైలు వచ్చిన కొత్తల్లో, "నేను ఏమీ తప్పు చేయలేదు కదా? misunderstand అయింది, త్వరగా రిలీజ్ అవుతాను," అని అనుకున్నా. కానీ, కోర్టు హియరింగ్స్ జరుగుతూ జరుగుతూ, మెల్లగా నా ఆశ కూడా చచ్చిపోయింది. చివరికి, కోర్టు 15 ఏళ్ల శిక్ష అని తీర్పు ఇచ్చింది.
ఆ తీర్పు వినగానే, నా జీవితం ఇక్కడే ఆగిపోయిందేమో అనిపించింది. ఇక చేసేది లేక, మెల్లగా ఈ జైలు జీవితానికి అలవాటు పడ్డాను. మొదటి రోజులు కష్టంగా అనిపించినా, తరువాత ఇక్కడ ఎలా ఉండాలో, ఎలా బతకాలో నేర్చుకున్నాను. ఆ ప్రాసెస్‌లో చాలా మందిని కలిశాను, వాళ్లతో మాట్లాడుతూ, వాళ్లతో ఉంటూ, చాలా నేర్చుకున్నాను.
జైల్లో ఇన్ని ఏళ్ళు ఉండి, ఇప్పుడు బయట ప్రపంచానికి వెళ్లాలి అంటే భయం గా ఉంది. నేను జైల్లో ఉన్న ఈ ఏళ్ళలో చాలా మారిపోయింది. అదే ఆలోచిస్తూ ఉండగా, టైం అయింది అని లైట్స్ ఆఫ్ చేసారు. ఈ ఒక్క రాత్రి దాటితే, నాకు ఇష్టమొచ్చినట్టు స్వేచ్ఛగా ఉండచ్చు. ఇంకెన్ని గంటలు ఇక్కడ ఉంటానో అనుకుంటూ, ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలియలేదు.
సెల్‌మేట్: "అన్నా లే అన్నా, చాలా లేట్ అయ్యింది."
నేను: "ఏంట్రా పొదునే నె గోల?"
సెల్‌మేట్: "ఈ రోజు నీ రిలీజ్ ఉంది, మర్చిపోయావా?"
నేను: "లేదు రా, అదే ఆలోచిస్తూ రాత్రి సరిగ్గా నిద్ర పోలేదు."
సెల్‌మేట్: "ఏ అన్నా, బయటికి పోయే భయం గా ఉందా?"
నేను: "తెలీదు రా… జైలు నుండి వెళ్లిన తరువాత నాకు ఏ పని దొరకుతుందో కూడా తెలియదు."
ఒక గంట తర్వాత, గార్డ్ వచ్చి పిలిచారు. రిలీజ్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అవడానికి మరో రెండు గంటలు పట్టింది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని, జైలు నుండి బయటకు వచ్చాను. చుట్టూ చూస్తూ, నెమ్మదిగా ముందుకు నడుస్తున్నాను… ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచం ప్రశాంతంగా ఉంది అనిపించింది.
"అర్జున్! అర్జున్!" అని ఎవరో పిలుస్తుంటే, అటు వైపు చూశాను. అక్కడ అన్నయ్య నా కోసం వెయిట్ చేస్తున్నాడు. వాడిని చూస్తుంటే కొంచెం లావు అయ్యాడు. దాదాపు 10 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. ఆనందంలో ఏం చేయాలో తెలియక అక్కడే నిలిచిపోయా. అన్నయ్య దగ్గరకు వెళ్లి హగ్ చేసుకున్నాను. నాకు తెలియకుండానే కళ్లలో నీళ్లు వచ్చాయి. ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు.
"చాలా మిస్ అయ్యాను రా," అన్నాడు. గొంతు వణికిపోతుంది.
ఆ మాట వినగానే కళ్లలో నీళ్లు పెరిగాయి. ఇంకా గట్టిగా పట్టుకున్నాను.
"సారీ అన్నా..." అన్నాను. నిజంగా ఎందుకు క్షమాపణ అడుగుతున్నానో నాకే అర్థం కాలేదు. కోల్పోయిన సమయానికా? అతన్ని ఒంటరిగా వదిలేసినందుకా? లేక తిరిగి రావడానికి ఆలస్యం చేసినందుకా?
"చాలు రా… ఇంటికి వెళదాం," అన్నాడు నెమ్మదిగా.
అన్నతో కలిసి కారులో కూర్చున్నాను. అన్న ఏమి అడగలేదు. నేను కూడా ఏమీ మాట్లాడకుండా, కిటికీ నుంచి బయట చూస్తూ ఉండిపోయాను. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ట్రాఫిక్. అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. అలా చూస్తూ నిద్రపోయాను.
కారు ఆగితే లేచాను. చూసేసరికి ఇంటికి వచ్చాము. ఇద్దరం దిగిపోయి లోపలికి వెళ్లాము. అక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్ద అమ్మాయి 10 ఏళ్ల ఉంటుంది, చిన్నవాడు 5 ఏళ్ల వాడి.
చిన్నవాడు మా దగ్గరకు వచ్చి, "ఎవరు నువ్వు?" అని అడిగాడు.
"నీ బాబాయి రా…" అని అన్న చెప్పాడు.
పెద్ద అమ్మాయి వాళ్ల నాన్న వెనకాల వెళ్లి నిలబడి చూసింది.
చిన్నోడు, "బాబాయి, ఇన్ని రోజులు ఎక్కడున్నావు?" అని అడిగాడు.
ఏం చెప్పాలో తెలియక చూస్తుంటే, వదిన లోపల నుండి వచ్చింది. నన్ను చూసి, "ఎప్పుడూ వచ్చావు, అర్జున్?" అంది.
నాకు ఏం మాట్లాడాలో తెలియక, "ఇప్పుడే అన్నాను…"
వదిన నవ్వింది. "అర్జున్, నీ గురించి చాలా వినాను. కానీ నా గురించి చెప్పలేదు కదా? నా పేరు ప్రియా. నీ వదిన. వీళ్ళు మా పిల్లలు. అమ్మాయి సౌమ్య, వాడు రోషన్. అందరూ 'చోటు' అంటారు."
నేను తల ఊపాను .
వదిన అందర్నీ భోజనానికి పిలిచింది. అందరం కలిసి డిన్నర్ తిన్నాము. పిల్లలు నన్ను చాలా ప్రశ్నలు అడిగారు. నాకు తోచిన సమాధానాలు చెప్పాను. రాత్రివరకు వాళ్లతో కలిసి ఆడుకుంటూ ఉన్నాను.
రాత్రి అన్న నా గదికి వచ్చాడు. నా గురించి చాలా అడిగాడు. జైలు గురించి, అక్కడ ఎలా ఉందో అడిగాడు. నేను నా జైలు లైఫ్ గురించి చెప్పాను.
"నేను రేపు ఇంటి నుంచి వెళ్తా…"
"ఎక్కడకి రా? మా తోటే ఉండు!" అన్నాడు.
"నేను ఇప్పడు మొదటి నుంచి ప్రారంభించాలి… నా జీవితం నాకు నేనే సృష్టించుకోవాలి."
అన్న మాటాడకుండా నన్ను చూస్తూ ఉన్నాడు. "ఇక్కడే ఉండి స్టార్ట్ చేయొచ్చు కదా?” అన్నాడు.
"ఇక్కడ ఉండడం నాకు ఈజీ కాదు," అన్నాను.
అన్న డీప్ బ్రెత్ తీసుకుని, "ఒకే… మనకు బెంగళూరులో ఇల్లు ఖాళీగా ఉంది. నువ్వు అక్కడ ఉండు?"
తనని చూసి, "అన్నా… నేను…" అని స్టార్ట్ చేస్తుండగా…
"నేను నీ మాట వింటున్నాను కదా? నువ్వూ నా మాట విను…" అన్నాడు.
కొంచెం ఆలోచించి, "ఓకే అన్నా…" అని అన్నాను.
అన్న నాకు ఓ ఫోన్ ఇచ్చాడు. "నీ కోసమే కొనాను రా."
"నాకు ఎందుకు అన్నా? నాకు ఇది ఎలా వాడాలో కూడా తెలియదు," అన్నాను.
"రెండు రోజులు వాడితే అదే వచ్చేస్తది," అన్నాడు నవ్వుతూ.
అలా అన్న వాళ్ల ఫ్యామిలీతో 10 రోజులు ఉన్నాను. నాకూ చాలా సంతోషంగా అనిపించింది. పిల్లలు నాతో బాగా కలిసిపోయారు. వాళ్లతో ఆడుతూ, వాళ్లే నాకు మొబైల్ వాడటం నేర్పించారు. వదిన కూడా చాలా మంచిది. నన్ను ఒక కొడుకు లాగా చూసుకుంది.
10 రోజుల తర్వాత, నేను బెంగళూరు వెళ్ళడానికి రెడీ అయ్యాను. అందరూ నన్ను పంపేందుకు రైల్వే స్టేషన్ కి వచ్చారు. అందరికీ బై చెప్పి, "మళ్ళీ వస్తాను…" అన్నాను.
ట్రైన్ వచ్చింది. నేను ట్రైన్ ఎక్కి, డోర్ దగ్గర నిలిచాను.
అన్న, "వెళ్ళాక, నాకు కాల్ చెయ్యి…" అన్నాడు.
ట్రైన్ స్టార్ట్ అయ్యింది.
నా జీవితం కూడా…