Posts: 3,282
Threads: 35
Likes Received: 42,339 in 2,220 posts
Likes Given: 8,737
Joined: Dec 2021
Reputation:
9,149
నిన్ను కోరే వర్ణం
E1
అమెరికా లోని ప్రముఖ డల్లాస్ పురం, మూడో వీధి జోసెఫ్ మిఠాయి కొట్టు దాటితే కుడివైపున నాలుగో ఇల్లు.
చాలా విశాలంగా ఉంది చుట్టూ కాళీ స్థలం మధ్యలో ఇల్లు కట్టుకున్నారు, ఇది కూడా ఇప్పుడు అమ్మేసారు ఎందుకంటే ట్రంపు గెలిచాడు, మనోళ్ళని దొబ్బెయమన్నాడు. ఇంక చేసేదేముంది తట్టా బుట్టా సర్దుకోవడమే.
లోపల అదే జరుగుతుంది.
"ఇండియా వెళ్లడం నాకు ఇష్టం లేదే" అని బాధతొ చెప్పింది నిధి. కూతురు మాటలు విని సురేఖ నవ్వుతుంటే పక్కనే ఉన్న సురేఖ చెల్లలు గౌరి "ఊరుకో అక్కా నువ్వు మరీను పాపం పిల్లలు వాళ్లకేం తెలుసు. ఇండియా బాగుంటుంది నిధి నేను చెపుతా కదా" అని బైటికి తీసుకెళ్ళింది.
అంతా సర్దుకుని తెల్లారి ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటి పెద్ద కోడలు సురేఖ మొగుడు సుభాష్ తో మాట్లాడుతుంది. మీరు చేసేది నాకు నచ్చలేదండి, వాడిని మోసం చేస్తున్నారు. ఎవరినీ అన్నాడు సుభాష్
మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉన్నామంటే వాడు అక్కడ గొడ్డులా కష్టపడ్డాడు కాబట్టే కాదంటారా, ఇన్నేళ్లు మన వ్యాపారాలు చూసుకున్నాడు. ఇప్పుడు వాడిని వెళ్లిపొమ్మనటం న్యాయమా, బైటవాళ్ళైతే అనుకోవచ్చు. వాడు మీ మేనల్లుడు. మీ సొంత చెల్లెలి కొడుకు. మొగుడికి నచ్చజెప్పడానికి ఎన్నో రోజులుగా ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంది సురేఖ.
సుభాష్ : ఏం చేస్తున్నానో నాకు తెలుసు నువ్వు నోరు మూసుకో, నువ్వు చెప్పేది ఎలా ఉందొ తెలుసా అన్నీ వాడికి రాసిచ్చి నేను నా కొడుకు వాడి ముందు అడుక్కు తినాలా
సురేఖ : అలా కాదండి, ఉన్నదాంట్లో వాడికి ఓ వాటా ఇవ్వండి. ఇది న్యాయమే కదా
సుభాష్ కోపంగా చూసేసరికి సురేఖ భయపడింది. "నువ్వు ఇంకో సారి ఈ విషయాల్లో దూరావు అనుకో చెప్పు తీసుకుని కొడతా, పెట్టింది తిని బుద్దిగా ఉండటమే నీకు మంచిది. అర్ధమైందా" అని కోప్పడితే కన్నీళ్లు పెట్టుకుంది సురేఖ.
ఇంకో గదిలొ చిన్న కోడలు గౌరి తన మొగుడు ధీరజ్ తొ కూడా ఇదే విషయంపై మాట్లాడుతుంది.
"మీరంటే గౌరవం పోయింది నాకు, వాడు మనకోసం ఎంత చేసాడు. మన వ్యాపారాల కోసం వాడి చదువు కూడా ఆగిపోయింది. ఉన్నపళంగా అన్నీ లాగేసుకుంటే వాడెలా బతుకుతాడు అన్న ఆలోచన కూడా లేదు మీ అన్నాతమ్ముళ్ళకి. సరే వాడు గురించి వదిలెయ్యండి కనీసం మీ చెల్లెలయినా గుర్తుందా, వాడికి అన్యాయం చేసి ఏం మొహం పెట్టుకుని మీ చెల్లితొ మాట్లాడతారు. వాడికి అన్యాయం చేసి మీరు బాగుపడతారనే అనుకుంటున్నారా ?" గౌరి అడగాలనుకున్నన్నీ అడిగేసింది.
ధీరజ్ కోపంగా "ఏంటే నోరు లెగుస్తుంది, ఎంతలో ఉండాలో అంతలో ఉండు" అంటే గౌరి తగ్గలేదు. "నేను అక్కని కాదు తగ్గడానికి. మీరు చేసేది తప్పండి, ఇన్నేళ్లు వాడిని వాడి కష్టాన్ని వాడుకుని ఇప్పుడు నిర్ధాక్షిణ్యంగా వదిలేస్తారా ఎంత తప్పు" అని భర్త కళ్ళలోకి చూసింది. ధీరజ్ సమాధానం చెప్పలేకపోయాడు, సరే మా అన్నయ్య వాడికి ఎంత రాసిస్తే నేనూ వాడికి అంత రాసిస్తాను. మా అన్న వాడికి ఇవ్వకపోతే నేనూ ఇవ్వను. ఇక విసిగించకు అని ఇంకో వైపు తిరిగి పడుకున్నాడు. గౌరి గది నుంచి బైటికి వచ్చేసరికి సురేఖ కూడా బైటే కనిపించింది.
గౌరి : బావ ఏమంటున్నాడు అక్కా అని అడిగితే సురేఖ జరిగింది చెప్పింది. అక్కా పోనీ ఇక్కడ వీళ్ళు ఏం చెయ్యాలని అనుకుంటున్నారో వాడికి చెపుదామా వాడు జాగ్రత్త పడతాడు కదా అంటే సురేఖ వెంటనే వదినకి ఫోను కొట్టింది, ఇంతలోనే ఏమనుకుందో వెంటనే కట్ చేసింది. ఏమైంది అక్కా
సురేఖ : మనం చెపితే వదిన తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది, అది కాక వీళ్ళకి తెలిస్తే ఊరుకోరు. మనకిక మనశాంతి ఉండదు.
గౌరి : అక్కా నా దెగ్గర ఒక ఐడియా ఉంది. ఒక వేళ మన నిధిని వాడికిచ్చి పెళ్లి చేస్తే. అప్పుడు వాడికి కట్నం ఇవ్వాలిగా అప్పుడు వాడికి కూడా న్యాయం జరుగుతుంది. ఏమంటావ్
సురేఖ : వాడికి అన్యాయం జరుగుతుంటే బాధగా ఉంది కానీ నా కూతురిని ఇచ్చేంత కాదు. తెలిసి తెలిసి ఆస్తి లేనోడికి, చదువు లేనోడికి నా కూతురిని ఎలా ఇవ్వను, నీకూ కూతురుందిగా నీకు అంత బాధగా ఉంటే నీ కూతురిని ఇచ్చి చేసుకో అంది
గౌరి : నిధి పెద్దది కదా అని అన్నాను అక్కా. అయితే నా కూతురినే ఇస్తాను.
సురేఖ : ప్రియ చాలా పాష్ గా పెరిగిన పిల్ల, నువ్వు ఏదేదో ఊహించేసుకోకు. ముందు అక్కడికి వెళ్ళని అప్పుడు ఆలోచిద్దాం.
తలుపు దెగ్గర నిలుచున్న నలుగురు పిల్లలు సురేఖ, గౌరి మాట్లాడుకుంటున్న మాటలు వింటున్నారు. సురేఖ పిల్లలు నిధి, నితిన్. గౌరి పిల్లలు ప్రియా, ప్రవీణ్ నలుగురు గదిలోకి వచ్చేసారు.
ప్రియ : చూసారా అనయ్యా మన అమ్మలు ఏం ప్లాన్ చేస్తున్నారో
ప్రవీణ్ : అవును, వీళ్ళ ప్లాన్ అస్సలు సక్సెస్ అవ్వకూడదు
నితిన్ : వాడు జస్ట్ పనోడు, పనోడిని పనోడిలానే చూడాలి. అయినా మనం ఏం చెయ్యాలో మనకి తెలుసుగా
అందరూ నిధి వైపు చూసారు. అందరికంటే నిధి యే పెద్దది.
నిధి అందరి వంకా చూసి హా.. అని ఆవులించి "నాకు నిద్రొస్తుంది బై" అని లోపలికి వెళ్ళిపోయింది.
తెల్లారి ఫ్లైట్ ఇండియాలో ల్యాండ్ అయ్యింది, అక్కడి నుంచి ఊరికి వచ్చేసారు. తన ఇద్దరు అన్నయ్యలు శాశ్వతంగా ఇక్కడే ఉండటానికి వస్తున్నారని మాత్రమే తెలిసిన వసుధ పలకరిద్దామని సంతోషంగా వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళింది. లోపల ఎవ్వరు కనిపించలేదు.
"అమ్మా, నాన్నా అన్నయ్యలు ఏరి. ఎవ్వరు కనిపించరే" అని అడిగితే వసుధ నాన్న కోపంగా "వాళ్ళని నేను నా ఇంట్లోకి రానివ్వలేదు, రానివ్వను కూడా" అన్నాడు కఠినంగా.
వసుధ : అమ్మా ఏంటి నాన్న అలా అంటాడు, ఏమైంది అని అడిగింది కంగారుపడుతూ
వసుధ అమ్మ రాజ్యం సరిగ్గా చెప్పలేదు, చెప్పినవన్నీ ఏవేవో చెపుతున్నట్టుగా అనిపించింది వసుధకి. "ఇంటికి వచ్చిన వాళ్ళని అలా పంపించేస్తారా మీరు. మీరు ఆగండి పాత ఇంట్లో ఉన్నారా నేనెళ్ళి తీసుకొస్తాను" అని ఆనందంగా అన్నయ్యల కోసం పరిగెత్తింది.
నచ్చితే Rate & Like
Comment కూడా...
The following 27 users Like Pallaki's post:27 users Like Pallaki's post
• ABC24, amarapremikuraalu, Anamikudu, Anand, Babu_07, Coinbox, DasuLucky, Energyking, gora, Gurrala Rakesh, hijames, Iron man 0206, jackroy63, jwala, K.rahul, k3vv3, King1969, Mahesh12, Nivas348, Raaj.gt, ramd420, ramkumar750521, Ravi_sri, shiva9, Speedy21, TheCaptain1983, Uppi9848
Posts: 4,829
Threads: 0
Likes Received: 4,019 in 2,986 posts
Likes Given: 15,889
Joined: Apr 2022
Reputation:
68
Bro ee story meru edho story lo start chesaru but middle drop chesaru malli fresh ga rasthunaru super bro.
Posts: 1,886
Threads: 18
Likes Received: 4,902 in 1,357 posts
Likes Given: 8,585
Joined: Oct 2023
Reputation:
254
చాలా చాలా బాగుంది..సాజల్ గారు.... కానీ మేనల్లుడు ఏవరు... అసలు ఇంతకీ ఏం జరిగింది...... తొందరగా పెద్ద అప్డేట్ ఇవండీ...సాజల్ గారు
Posts: 47
Threads: 0
Likes Received: 31 in 24 posts
Likes Given: 64
Joined: Jul 2024
Reputation:
1
Posts: 3,282
Threads: 35
Likes Received: 42,339 in 2,220 posts
Likes Given: 8,737
Joined: Dec 2021
Reputation:
9,149
నిన్ను కోరే వర్ణం
E2
ఊళ్ళో చీకటి పడింది, అందరూ వీధి చివర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చాలా మంది ఆడపిల్లలు కూడా ఉండటంతొ ఈ పిల్లలు నలుగురు కూడా వెళ్లారు. ప్రియ, ప్రవీణ్, నితిన్ అందరూ దేని గురించి మాట్లాడుకుంటున్నారా అని చూస్తుంటే నిధి కళ్ళు మాత్రం ఎవరినో వెతుకుతూనే ఉన్నాయి. ఊరిలో అడుగుపెట్టినప్పటి నుంచి అంతే, ఓపికగా ఒక్క మాట మాట్లాడకుండా, ఎవ్వరిని అడగకుండా కళ్ళతో వెతుకుతూనే ఉంది. ఇంకా కనిపించలేదేమో కళ్ళలో ఆనందం లేదు.
ఈసారి వినాయకచవితి బాగా చెయ్యాలి బాబాయి, పోయినసారి కంటే ఇంకా బాగా చెయ్యాలి
మేము పక్కనే ఉండి చూసుకుంటాం, ఎప్పుడూ మీ చేతుల మీద గానే కదరా జరిగేది. అలానే కానివ్వండి. ఇంతకీ మన శివుడేడి అన్నాడు ఓ పెద్దాయన
ఏంట్రా అందరూ వచ్చేసారా, మొదలుపెట్టండి. ఎలా చేద్దాం ఎంతలో చేద్దాం ముందే ఒక మాట అనేసుకుంటే అయిపోతుంది కదా. ఇంతకీ మన శివుడేడి
"ఇంకా రాలేదు అంకుల్ అన్నయ్య కోసమే చూస్తున్నాం" అన్నారు ఆడపిల్లలు. "మీరెందుకు వచ్చార్రా ఇప్పుడు" అని అరిస్తే అంతా ఒకేసారి "మేము మీ కోసం రాలేదు శివ అన్నయ్య కోసం వచ్చాము" అన్నారు. అందులో శివ అన్నది గట్టిగా వినపడినా అన్నయ్య అనే పదం మాత్రం కొంతమంది నోటి నుంచే వినపడింది. పెద్ద వాళ్ళు కొంతమంది నవ్వుకున్నారు కూడా
ఈ సారి కూడా బొమ్మని వాడే కొనిస్తానంటే నేను ఒప్పుకోను, ఎప్పుడు వాడేనా అన్నాడు బుల్లిరాజు, ఈయన ఊళ్ళో బాగా ధనికుడు, వడ్డీలకి డబ్బు తిప్పుతుంటాడు.
అవును మాకు కూడా అవకాశం ఇవ్వాల్సిందే అన్నాడు ఇంకో పెద్దాయన దానికి ఇంకొంత మంది కూడా అవునని వంత పాడారు.
"ఏంటి బాబాయి నా గురించేనా" అన్న గొంతు వినగానే అందరూ తల తిప్పి చూసారు. కూర్చున్న పెద్దవాళ్ళు తల ఎత్తి చూసారు. నిధి ఉలిక్కిపడింది, తల ఎత్తి వెతికి ఆ గొంతు కోసం చూసింది. చీకట్లో సరిగ్గా కనిపించలేదు, ఇప్పటి వరకు దూరంగా కూర్చున్న వాళ్ళు అందరూ గుంపుగా చేరారు.
నిధి చెప్పకుండా ముందుకు వెళ్లిపోతుంటే ప్రియ అక్క చెయ్యి పట్టుకుని ఆపేసింది, చెయ్యి విధిలించి కొట్టి మరీ ముందుకు వెళ్ళిపోయింది నిధి.
రారా వచ్చావా, నీకోసమే చూస్తున్నాం. ముందే చెపుతున్నాం ఈ సారి బొమ్మని మేమే కొనిస్తాము. ఎనిమిదేళ్ళ నుంచి నువ్వే కొనిస్తున్నావ్ ఈ సారి ఆ అవకాశం మాకూ కావలి. కావాలంటే నువ్వు ఈసారికి మండపం కట్టించు అంటే శివ నవ్వుతూ అలాగేలే బాబాయి అన్నాడు.
అడిగిన వెంటనే శివ ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు, ముందు ఆశ్చర్యపోయినా వెంటనే ఒప్పుకున్నందుకు సంతోషించారు. పెద్దవాళ్ళు అందరూ శివతో మంచి చెడు మాట్లాడుతుంటే కుర్రోళ్ళు, ఆడపిల్లలు శివ వెనక నిలబడి వింటున్నారు.
ప్రియ వాళ్ళకి బోర్ కొట్టింది. వెళ్ళిపోదామని నిధిని పిలిస్తే పలకలేదు. ప్రియ వెంటనే తన చెయ్యి పట్టుకుని లాగింది. నిధి మిగతా ముగ్గురి వంక చూసి ఇంటికి నడిచింది. వెన్నక్కి తిరగలేదు కాని చేతులు చూసుకుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. ఇంట్లోకి వెళ్లిపోయారు.
సుభాష్ : ఎక్కడికి వెళ్ళార్రా
ప్రియ : వీధి చివర గణపతి ఉత్సవాల గురించి మాట్లాడుకుంటుంటే వెళ్ళాం పెద్దనాన్న. తాతయ్య కూడా అక్కడే ఉన్నారు.
ధీరజ్ లేచి పద అన్నయ్యా మనం కూడా వెళదాం. ఎప్పుడో వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు కుదిరింది అంటే సుభాష్ కూడా లేచాడు. అందరికంటే వెనక వచ్చిన నితిన్ అందరూ వెళ్లిపోతున్నారు కూడా, వాడెవడో శివ అట, వచ్చేవరకు ఒకటే గోల చేసారు. వాడు రాగానే మాట్లాడుకుని వెళ్లిపోతున్నారు అన్నాడు.
సుభాష్ : మన శివ గాడేనా, పిలవాల్సింది కదా
ప్రియ : ఆ శివ ఎవరో మాకేం తెలుసు పెద్దనాన్న
ధీరజ్ : ఏమే నిధి, నీకు వాడు తెలుసుగా
నిధి : ఏమో బాబాయి, నాకు వాడి పేరే గుర్తులేదు ఇక మొహం ఏమి గుర్తుంటుంది. అయినా ఫోన్ చేస్తే వస్తాడు కదా అని లోపలికి వెళ్ళిపోయింది.
లోపలికి వెళ్లి మంచం మీద పడుకుంది, చెయ్యి మొహం మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది.
"నేనే శివుడిని, నువ్వే పార్వతివి" - శివ
"బావా ఎలా ఉన్నాను, ఈ గాజులు నీకు నచ్చాయా" - నిధి
"నన్ను మర్చిపోకుండా నీ చేతికి కడుతున్నాను, నా గుర్తుగా భద్రంగా దాచుకో" అని బుగ్గ మీద ముద్దు పెట్టాడు శివ.
నిక్కరులొ పొడుగ్గా శివ కర్రపుల్ల బాడీ గుర్తుకురాగానే మొహంలొకి నవ్వొచ్చేసింది. తీసుకునే ఊపిరి ఇంత వెచ్చగా, ఇంత భారంగా ఎప్పుడు అనిపించలేదు అలానే నిద్రలోకి జారుకుంది.
వీధి చివర సమావేశాలు అయిపోయాయి. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్లిపోయారు. శివ ఇంటి గేటు తీసుకుని లోపలికి వచ్చి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాడు. లోపల వసుధ మొహం వాచిపోయినట్టు కనిపించింది. కొడుకుని చూడగానే ఏడుపు ఆపుకోలేక లేచి నిలబడింది.
శివ : ఎందుకు ఏడుస్తున్నావ్. నిన్ను వాళ్ల దెగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు. వాళ్ళతో గొడవ పెట్టుకున్నావా అంటే లేదంది. నువ్వేం మాట్లాడకు, నేను చూసుకుంటా కదా. ఎప్పుడు నువ్వేం సంపాదించావ్ ఎప్పుడు వాళ్లకి సంపాదించిపెట్టడమే కదా అని గోల చేసేదానివి కదా, నేనేం సంపాదించానో ఇక నీకు కనిపిస్తుందిలే అని నవ్వాడు.
వసుధ : నీకు వాళ్ళ మీద కోపంగా లేదా
శివ : నాకెందుకే కోపం, అది మన ఆస్తి కాదుగా. నాది ఏదైనా లాక్కుంటే నాకు కోపం వస్తుంది, నాదేం లేదుగా అన్నాడు.
వసుధ : అయినా కూడా.. గొడ్డు చాకిరీ చేసావ్, చివరికి నీకేం మిగిలింది, కళ్ళు తుడుచుకుంది
శివ : నేనేం సంపాదించుకున్నానో నువ్వు చూస్తావులే, అయినా ఇదేంటే కొత్తగా ఏడుస్తున్నావ్. మనకి కష్టం రాలేదు, ఒకరు మనల్ని మోసం చేసారనో ఇంకొకరి చేతిలో మనం మోసపోయామనో ఏడుస్తామా, నేను నిన్ను సాకలేనని ఏడుస్తున్నావా ?
వసుధ : ఛీ కాదు
శివ : మరి.. నీ చెయ్యి ఎప్పుడు ఒకరి కడుపు నింపడానికి, దీవించడానికే వాడాలి తప్పితే ఇలా నీ కళ్ళు తుడుచుకోవడానికి కాదు. మనం ఒకరి మీద పడి ఏడ్చేవాళ్ళం కాదు.. కదా ?
వసుధ : అవును
శివ : ఇంక చాలు
వసుధ : నాన్న ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా
శివ : ఇప్పుడు మనకేం తక్కువయిందని, ఇప్పుడు బాగుంది, నాన్న ఉంటే ఇంకా బాగుండేది.
వసుధ "పోరా" అంటే మంచం మీద కూర్చోపెట్టాడు. "ఎలా ఉన్నారు మీ అన్నలు, మీ ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలు" అంటే "వాళ్లకేం బానే ఉన్నారులే" అంది.
"ఇంకా చెప్పు ఎలా ఉన్నారు అంతా, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారట కద నాకు అడక్కపోయావా" అంటే కోపంగా చూసింది వసుధ. "ఆమ్మో వద్దులే ఊరికే అన్నా అన్నాడు."
కొడుకు చెప్పినదంతా ఆలోచించాక వాడి ఆలోచనలకి గర్వపడింది. కోపం అంతా తీసేసి లేచి వెళ్లిపోతుంటే "భవతీ భిక్షాందేహి" అని కడుపు పట్టుకున్న కొడుకుని చూసి నవ్వుతూ అన్నం వడ్డించడానికి కిచెన్లోకి వెళ్ళింది.
అమ్మతొ కలిసి భోజనం చేసాక, ఆరు బైట మంచం వేసి కూర్చుంటే వసుధ కూడా వచ్చి కూర్చుంది. కాసేపు రాబోయే వినాయక చవితి గురించి, కాసేపు చిన్నప్పుడే చనిపోయిన నాన్న గురించి, ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు.
నచ్చితే Rate & Like
Comment కూడా...
The following 25 users Like Pallaki's post:25 users Like Pallaki's post
• ABC24, amarapremikuraalu, Anamikudu, Anand, Babu143, Babu_07, DasuLucky, Energyking, gora, Gurrala Rakesh, hijames, Iron man 0206, jwala, King1969, KRS123, [email protected], Mahesh12, Raaj.gt, ramd420, Ravi_sri, shiva9, TheCaptain1983, Uday, Uppi9848, Venrao
Posts: 3,282
Threads: 35
Likes Received: 42,339 in 2,220 posts
Likes Given: 8,737
Joined: Dec 2021
Reputation:
9,149
నిన్ను కోరే వర్ణం
E3
శివ పొద్దున్నే లేచి స్నానం చేసి, దేవుడికి దణ్ణం పెట్టుకుని రెడీ అయ్యి తీరిగ్గా మంచం మీద కూర్చున్నాడు. వసుధ చూసింది కానీ ఏం అడగలేదు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎవరో వస్తున్న మాటలు వినిపించి తల తిప్పి చూసారు. ఆడబిడ్డలు సురేఖ, గౌరి లోపలికి వస్తుంటే చూసి లేచి నిలబడ్డారు. ఇద్దరు మంచం మీద కూర్చుంటే శివ లోపలికి వెళ్లి కుర్చీలు తెచ్చాడు.
సురేఖ పలకరిస్తూ "ఎలా ఉన్నావ్ వదినా ?" అని శివ వంక కూడా చూసి, "మేము ప్రయత్నించాం కానీ నీకు న్యాయం చెయ్యలేకపోయామురా శివా" అనేసింది బాధగా
వసుధకి వీటి గురించి మాట్లాడటం ఇష్టంలేదు అందుకే వెంటనే "అవన్నీ మగవాళ్ళు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే సురేఖ. మనం మధ్యలో దూరి వాటిని పెద్దది చెయ్యకపోవడమే మంచిది. మీరు చెప్పండి ఏం గౌరి పిల్లల్ని తీసుకురావాల్సింది అంటే గౌరి అటు ఇటు చూసి అవును ఇదేది అని నిధి.." అని పిలిస్తే గోడ చాటు నుంచి బైటికి వచ్చింది నిధి.
"ఏం చేస్తున్నావే అక్కడా ?" అంటే దెగ్గరికి వచ్చింది. వసుధ వెంటనే లేచి నిధి పక్కకి వెళ్లి "ఏమే నిధి, చిన్నప్పుడు నా కొంగు వదిలేదానివి కాదు. ఇప్పుడు కనీసం దెగ్గరికి కూడా రావట్లేదు. మమ్మల్ని మర్చిపోయావా ?" అని అడుగుతుంటే నిధి అవేమి పట్టించుకోకుండా "మీరు బట్టలు కూడా కూడతారా ?" అని అడిగింది.
నిధి మీరు అనగానే వసుధకి అదోలా అనిపించింది. చిన్నప్పుడు తను చూసిన నిధి కాదని అర్ధమయ్యి భుజం మీద నుంచి చెయ్యి తీసేసి, పైకి మాత్రం నవ్వుతూ "అవునమ్మా జాకెట్లు, లంగా ఓణిలు కుడుతుంటాను" అని సురేఖ వైపు తిరిగి "వాడికి నచ్చదు కానీ నాకేం తోచదు, ఒక్కదాన్నే ఎంతసేపని కూర్చొను అందుకే ఓ కాలక్షేపంలా.." అని నవ్వేసింది.
వసుధ శివ వైపు చూసింది. శివ కనీసం నిధి వంక చూడనైనా చూడలేదు. "కూర్చో నిధి, నేను టీ పెట్టుకొస్తాను" అని లోపలికి వెళ్ళింది.
నిధి పైకి కుర్చీలో కూర్చున్నా లోపల కొంచెం బెరుకుగానే ఉంది. ఎప్పటిలానే చేతులు చూసుకుంటే వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. చూసి చూడనట్టు శివ వంక చూసింది, శివ తన వైపు చూడలేదు.
సురేఖ తన వదిన ఇంట్లోకి వెళ్లగానే శివ వైపు చూసి, "ఏరా శివా నీకు వాళ్ళ మీద కోపం రావట్లేదా. ఎందుకు నువ్వేమి అడగలేదు వాళ్ళని, ఎందుకు అన్నిటికి మౌనంగా తల ఊపుతున్నావ్ అంటే గౌరి కూడా అవును శివా నీకు రావాల్సింది నువ్వు గొడవ చేసి తీసుకో" అంది. శివ మామూలుగానే ఉన్నాడు, నిధి కూడా శివ ఏం అంటాడా అని చూసింది.
"నాకెంత రావాలో చెప్పండి అడుగుతాను" అన్నాడు నవ్వుతూ. సురేఖ ఏదో అనబోతుంటే ఆపేసాడు. "ఇన్ని రోజులు నేను పని చేశాను, వాటిని పైకి తీసుకొచ్చాను, అంత మాత్రాన అవన్నీ నాకు ఇచ్చేయాలంటే ఎలా. అయినా ఇప్పుడు నాకు ఒరిగేది ఏమి లేదు. నేను అందులో పని చేసినన్ని రోజులు నా జీతం నేను బాగానే తీసుకున్నాను. కావాల్సినన్ని పరిచయాలు ఉన్నాయి, కావాల్సినంతమంది స్నేహితులు ఉన్నారు. సాయం కావాలంటే ఒక్క పిలుపు చాలు వచ్చేస్తారు."
గౌరి : మరి అలాంటప్పుడు నేను ఇక పని చెయ్యను అని ఎందుకు చెప్పావు ?
శివ : నా చేతికి మావయ్య వాళ్ళు ఆ షాపులు అప్పగించినప్పుడు అవి బడ్డీ కోట్లు. నేనూ తాతయ్య కలిసి వాటిని ఎలా పైకి తీసుకొచ్చమో, వాటి కోసం ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. అలాంటిది మావయ్యవాళ్ళు తాతయ్యని లెక్కచేయ్యట్లేదు, ఇది మొదటి కారణం అయితే రెండవది దాని కోసం అంత చేశాను కాబట్టి న్యాయంగా వచ్చే లాభాల్లో నాకూ వాటా కావాలన్నాను దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే బైటికి వచ్చేసాను.
మాట్లాడుతుంటే వసుధ లోపలి నుంచి టీ తెచ్చి అందరికి ఇస్తూ శివ చేతిలో ఫోను పెట్టి దీని సంగతి చూడు ఆపకుండా మొగుతూనే ఉంది అంటే ఎత్తాడు.
శివ : ఇంట్లోనే బాబాయి, ఒక రెండు రోజులు షాపులు తీయ్యట్లేదు బాబాయి. ఆ.. నిజమే.. లెక్కలు చూసుకున్నాక అప్పుడు తెరుస్తారేమో. నేను సాయంత్రం మాట్లాడతాలే అని ఫోన్ పెట్టేసి అందరి వైపు చుసాడు.
వసుధ : ఎవరు ?
శివ : సామాను కోసంలే
వసుధ : లెక్కలు చూస్తున్నారా అక్కడా, నువ్వు వెళ్ళవా మరి
శివ : అన్ని సరిగ్గానే ఉన్నాయి, అక్కడ గిరి, ప్రసాదులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అన్ని
వసుధ : వాళ్ళ సంగతి ఏంటి ? ఆ గిరి, ప్రసాదు ఎప్పుడు నీ వెనకే తిరుగుతారుగా
"ఇప్పుడు నాకే ఏం లేదు, వాళ్ళని తిప్పుకుని నేనేం చేసేది" అంటుంటే అది వింటున్న సురేఖకి, గౌరికి ఇబ్బందిగా అనిపించింది. సురేఖ లేచి "సరే వదినా మేము వెళతాం" అంటే గౌరి కూడా లేచేసరికి అందరూ లేచారు. వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మా కొడుకు ఇద్దరు మంచం మీద కూర్చున్నారు. వసుధ కొడుకుని చూసి "నిధి బాగుంది కదరా" అంది. శివ నవ్వు అప్పుకుంటూ "ఏమో నేనా అమ్మాయి మొహం కూడా చూడలేదు. నీకు నచ్చిందా ?"
వసుధ : నాకు నచ్చిందా అంటే ?
శివ : అదే నీకు నచ్చిందంటే చెప్పు పెళ్లి చేసుకుంటా అని అమ్మకి కనిపించకుండా నవ్వాడు.
వసుధ : దొంగవిరా నువ్వు, అస్సలు దొరకవు. నేను కవితా వాళ్లకి బట్టలు ఇచ్చోస్తాను, నువ్వు ఇంట్లోనే ఉంటావా అని అడిగితె ఉంటానన్నాడు శివ.
ఒక్కడే మంచం మీద పడుకుని ఫోన్ చూస్తుంటే అడుగుల చప్పుడు వినిపించి చూసాడు. నిధి వచ్చింది. లేచి నిలబడితే దెగ్గరికి వచ్చింది. "అత్తయ్య లేదా" అని అడిగితే లేదని తల ఊపాడు తప్పితే నోరు తెరిచి సమాధానం చెప్పలేదు.
నిధి "జాకెట్ కుట్టాలి" అంటే ఆది తెచ్చావా అని అడిగాడు. లేదంది. "కొలతలు తీసుకుంటా రా" అని ఇంట్లోకి నడిస్తే నవ్వుకుంటూ వెనకే ఇంట్లోకి వెళ్ళింది.
నిధి : నీకు జాకెట్ కుట్టడం కూడా వచ్చా
"నాకింకా చాలా వచ్చు" అని టేప్ చేతుల్లోకి తీసుకున్నాడు. శివ దెగ్గరికి వస్తున్నకొద్ది నిధి ఒంట్లో ఊపిరి కష్టమైపోతుంది. "చేతులు పైకి ఎత్తు" అని టేప్ నడుము చుట్టూ వేసి దెగ్గరికి లాగాడు. బొమ్మలా శివకి అతుక్కుపోయింది నిధి. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. నిధి ఎడమ కంట్లో కన్నీటి చుక్క కనిపించగానే బొటన వేలు పెట్టి తుడిచేసాడు.
నిధి : నన్ను మర్చిపోయావేమో అనుకున్నాను
శివ : ఏడవకు, నీకు మా అమ్మకి ఆనందం వచ్చినా బాధ వచ్చినా కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి.
శివ కళ్ళు తుడుస్తుంటే, ముక్కులో చేరిన తడి పైకి పీల్చి శివ నడుము మీద చేతులు వేసి ఇంకా దెగ్గరికి లాక్కుంది. తలని శివ గుండె మీద పెట్టుకుని ఇంకా గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. శివ చెయ్యి నిధి మెడ మీద పడగానే కళ్ళు తెరిచింది. "బావా చిన్నప్పటి నుంచి ఎన్నో అడిగాను, అన్నీ ఇచ్చావ్. ఇన్నేళ్ల తరువాత ఒకటే కోరిక, తీరుస్తావా ?"
శివ : చెప్పు
"నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నిన్ను వాడుకుని వదిలేసిన వాళ్ళు నీ కాళ్ళ మీద పడాలి, నన్ను పెళ్లిచేసుకోమని నిన్ను బతిమిలాడుకోవాలి. అది నేను చూడాలి బావా. నా కోరిక తీరుస్తావా ?" అని తల ఎత్తి శివ కళ్ళలోకి చూసింది. నీకు గుర్తుందో లేదో "నువ్వే నా శివుడివి" అని నిధి అంటుంటే శివ మధ్యలో కల్పించుకుంటూ "నువ్వే నా పార్వతివి" అన్నాడు.
ఇప్పటి నుంచి చూస్తుందో కానీ వసుధ గొంతు వినిపించేసరికి ఉలిక్కిపడ్డారు ఇద్దరు. "అమ్మ నంగనాచి దానా" అన్న గొంతు వినపడగానే ఇద్దరు విడిపడి చూసారు. వసుధ లోపలికి వచ్చి నిధి ఎదురుగా నిలుచుంటే వెంటనే కౌగిలించుకుని "ఎలా ఉన్నావ్ అత్తా" అని బుగ్గ మీద ముద్దు పెట్టింది. "అంటే ఇందాక నటించావా ? నేను ఎంత బాధ పడ్డానో తెలుసా" అని ప్రేమగా గడ్డం కింద చెయ్యి వేసింది.
ఇంకా వెచ్చగా అనిపించి నిధి కూడా గట్టిగా పట్టుకుంది తన అత్తని, "నిన్నెలా మర్చిపోతాను అత్తా, అది జరిగే పనేనా. కానీ అత్తా నాకు నేనుగా నీ దెగ్గరికి వచ్చేవరకు నువ్వు నాకు దూరంగానే ఉండాలి"
వసుధ : ఎందుకే
నిధి "అది అంతే మాటివ్వు" అంటే వసుధ ప్రేమగా ముద్దు పెట్టి "సరే మీరేది చేసినా మీకోసమే, నేను ఉన్నది మీకోసమే. నువ్వు చెప్పినట్టే వింటాను. మమ్మల్ని అస్సలు మర్చిపోలేదే నువ్వు అందుకు గర్వంగా ఉంది నిన్ను చూస్తూంటే"
నిధి : నిన్నే కాదు నువ్వు చేసే సగ్గుబియ్యం పాయసం రుచి కూడా నాకింకా గుర్తుంది. నేనొచ్చి చాలా సేపయ్యింది. వెళతాను అని శివ వంక చూస్తే కొడుకుని కోడలి మీదకి నెట్టింది వసుధ. నిధి సిగ్గుపడుతూ వెళ్లిపోతుంటే కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఆనందపడింది వసుధ.
నచ్చితే Rate & Like
Comment కూడా..
The following 32 users Like Pallaki's post:32 users Like Pallaki's post
• ABC24, amarapremikuraalu, Anamikudu, Anand, Babu143, Babu_07, Coinbox, DasuLucky, Energyking, gora, Gurrala Rakesh, hijames, Iron man 0206, jwala, K.rahul, King1969, [email protected], Mahesh12, Mohana69, prash426, Raaj.gt, ramd420, ramkumar750521, shekhadu, shiva9, Speedy21, spicybond, Stsrv, TheCaptain1983, Uday, Uppi9848, Venrao
Posts: 414
Threads: 0
Likes Received: 353 in 292 posts
Likes Given: 10
Joined: Sep 2021
Reputation:
3
Nice story andi.. congratulations new story.. bagundi andi.
Posts: 273
Threads: 0
Likes Received: 181 in 125 posts
Likes Given: 23
Joined: Sep 2024
Reputation:
0
Posts: 2,290
Threads: 0
Likes Received: 1,098 in 917 posts
Likes Given: 8,306
Joined: May 2019
Reputation:
18
Posts: 360
Threads: 0
Likes Received: 644 in 243 posts
Likes Given: 4,835
Joined: Nov 2018
Reputation:
24
శుభం
పాత మధురాల బూజు దులిపి
సిద్దం అవుతున్నాయి
మొత్తం కంప్లీట్ చెయ్యండి
సర్వేజనా సుఖినోభవంతు...
Posts: 151
Threads: 0
Likes Received: 120 in 77 posts
Likes Given: 700
Joined: Mar 2022
Reputation:
4
mi story edaina leenam aipovalsinde bhayya
mallalni travel chepistav story loki
as usual adiripoindi
Posts: 47
Threads: 0
Likes Received: 31 in 24 posts
Likes Given: 64
Joined: Jul 2024
Reputation:
1
Posts: 90
Threads: 0
Likes Received: 33 in 25 posts
Likes Given: 110
Joined: Jul 2024
Reputation:
0
19-02-2025, 11:31 PM
(This post was last modified: 19-02-2025, 11:31 PM by Speedy21. Edited 1 time in total. Edited 1 time in total.)
Meru stories ela rastaru andi me kadhalu chala different ga vuntadhi me stories na favourite "vadina" meru movies lo ga writer ga try chayachu ga
Posts: 3,282
Threads: 35
Likes Received: 42,339 in 2,220 posts
Likes Given: 8,737
Joined: Dec 2021
Reputation:
9,149
నిన్ను కోరే వర్ణం
E4
వసుధ : ఇలాంటి అమ్మాయి దొరకాలంటే పెట్టి పుట్టాలి, మనం అదృష్టవంతులం. నిధిని నీకు అడిగే ధైర్యం నాకివ్వు శివుడు. ఎట్టి పరిస్థితుల్లొ అది నాకు కోడలిగా రావాలి
శివుడు : నేను బైటికి వెళ్ళొస్తా
వసుధ : పనా ?
శివుడు : గాలి తిరుగుళ్ళు తిరిగి చాలా రోజులైంది, ఊరు చుట్టి వస్తా
ఇంతలో "అమ్మాయి" అన్న కేక వినగానే ఇద్దరు నవ్వుతూ హాల్లోకి వచ్చారు.
వసుధ : రా నాన్నా, ఉండు టీ పెట్టుకొస్తాను అని వంటింట్లోకి వెళ్ళింది
శివ : ఏంటి రామరాజు గారు మనవళ్లు, మనవరాళ్ళని వదిలి ఇటొచ్చారు
రామరాజు : మరి నువ్వెవడివే గోసిగా, తన్నులు పడతాయి గాడిద కొడకా నవ్వుతూనే పంచలో మంచం మీద కూర్చున్నాడు.
శివ : అమ్మోయి నిన్ను తాత గాడిద అంటున్నాడే
రామరాజు : ఏడిసావ్ లే.. ఎక్కడికి రెడీ అయ్యావ్
శివ : మన కొట్టుకే
రామరాజు : అయిపోయిందిగా వాళ్ళు చేసింది చాల్లేదా, మళ్ళీ దేనికి ?
శివ : నా మొహం కనిపించకపోతే సామాను ఎవడు కొంటాడే
రామరాజు : అది ఆ గాడిద కొడుకులకి త్వరలోనే తెలుస్తుందిలే, నువ్వేం వెళ్లనవసరం లేదు. మూసుకుని కూర్చో
వసుధ టీ ఇచ్చింది
శివ : అమ్మా.. మనం అందరం గాడిదలమే తాత దృష్టిలో, చివరికి ఆయన కూడా అదేనట
వసుధ : ఊరుకో.. ఏంటి వేళాకోళాలు, తాత తోనా.. ఏదో పనుంది అన్నావు వెళ్ళు
శివ : వెళుతున్నా.. తాత గారు పొయ్యి వస్తా
రామరాజు : నువ్వేమి వాళ్ళని ఉద్దరించాల్సిన అవసరం లేదు, వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు.
శివ నవ్వుతూనే "అలాగే" అని అరుస్తూ బైటికి వెళ్ళిపోయాడు. వసుధ ఏంటి అని అడిగితే చెపుతున్నాడు రామరాజు. బైటికి వచ్చిన శివ ఫోన్ తీసి గ్రూప్ కాల్ చేసాడు.
శివ : ఎక్కడున్నార్రా ?
నవీన్ : కొట్టంలో రా
ప్రతీక్ : రోడ్డు మీద రా
చింటు : షో రూములో
కార్తిక్ : కాళీ రా
సాత్విక్ : నేను కాళీనే బా
ప్రణయ్ : నేను కూడా
శివ : సరే కాళీగా ఉన్నవాళ్లు కూల్ కొచ్చెయ్యండి క్రికెట్ ఆడదాం
అందరూ "అలాగే మావా" అని పెట్టేసారు. రోడ్డు మీద నడుస్తుంటే ప్రతీ ఒక్కళ్ళు శివని పలకరించేవాళ్ళే అందరిని పలకరిస్తూనే షాపు దెగ్గరికి వచ్చాడు. ఎదురుగా ఉన్న షాపుని చూడగానే ఎనిమిదేళ్ళ క్రితం గతం గుర్తుకు వచ్చింది.
ఒకప్పుడు ఇది చిన్న గుడిసె కొట్టు, పదిహేను వేల రూపాయలతొ మొదలయిన షాపు, నాన్న పోయాక ఏం చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు తాతయ్య తన ఇద్దరి కొడుకుల దెగ్గర అప్పుగా పదిహేను వేలు ఇప్పించి పెట్టించాడు. గుంజలు పాతడం నుంచి తాటాకుల కప్పు వరకు మొత్తం శివ వేసిందే. ఇప్పుడు ఇంత పెద్ద షాపు అయ్యింది. ఆ రోజు ఒక్కడే ఈ రోజు ముగ్గురు మేనేజర్లు, ముప్పై మంది పనోళ్లు.
చుట్టు పక్కన ముప్పై ఊళ్లలో దొరకని ఏ సామాను అయినా ఇక్కడ దొరుకుతుంది. ఈ ఊరు పేరు అందరికీ వినపడడానికి కారణమే ఈ షాపు, ఇక్కడ బస్సు స్టాపు, అడ్డా, చుట్టు పక్కన కిరాణా, కేంద్రాలు, ఆఫీసులు అన్నిటికి కారణం ఈ షాపు. సోమవారం పొద్దున ఏడు నుంచి రాత్రి తొమ్మిది వరకు జాతరలా అనిపించే జనం. ఇల్లు కట్టాలా ఇదే షాపు, ఆటోమొబైల్స్ ఇదే షాపు, సైకిల్ నుంచి లారీ వరకు, నట్ నుంచి బోల్ట్ వరకు దొరకనిదంటూ లేదు.
"ఏరా అక్కడే నిలుచున్నావ్, లోపలికిరా" అన్న పెద్ద మావయ్య సుభాష్ మాట విని తల దించి లోపలికి చూసాడు. ఒక కుర్చీ స్థానంలో రెండు కుర్చీలు, తాతయ్య కొడుకులు ఇద్దరు కూర్చున్నారు. లోపలికి నడుస్తుంటే అందరూ నమస్తే శివా అంటుంటే చెయ్యి ఎత్తాను. ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు.
సుభాష్ : ఇంకా చెప్పరా, రేయి పిల్లల్ని పిలుపు. అస్సలు ఇంటికి రాలేదేంట్రా. మా మీద కోపం ఏమైనా పెంచుకున్నావా ?
ధీరజ్ : వస్తున్నారు, అని శివని చూసి మన షాపు చూస్తానంటే రమ్మన్నాను.
నలుగురు ప్రియ, నిధి, ప్రవీణ్, నితిన్ వస్తున్నారు.
శివ : అదేమి లేదు మావయ్యా, నిజం చెప్పాలంటే నన్ను ఆదుకున్నది మీరే. మీరే గనక ఆ పదిహేను వేలు ఇవ్వకపోతే నా బతుకు ఇంకోలా ఉండేదేమో
సుభాష్ : ఊరుకోరా మా చెల్లి కొడుకు కోసం ఆ మాత్రం చెయ్యమా కానీ తాతయ్య మేమేదో నిన్ను మోసం చేసినట్టు మాట్లాడాడు. పదిహేను వేలు నీకు అప్పు ఇచ్చిన మాట వాస్తవమే, నువ్వు తిరిగిచ్చేటప్పుడు ఆ రోజు నీ ఇబ్బంది చూసి వద్దులేరా మాకు లాభాలు ఇవ్వు చాలు అన్నాను. దానికి నువ్వు ఒప్పుకున్నావ్
శివ మొహం ప్రశాంతంగా ఉంది. (అబద్ధం.. అప్పు తీరుస్తుంటే షాపు ఎదగడం చూసి బలవంతంగా ఒప్పించారు, ఆ రోజు బతిమిలాడిన మనుషులు ఈ రోజు సంజాయిషీ ఇస్తున్నారు) మొహంలో నవ్వు చెక్కు చెదరలేదు.
సుభాష్ ఇంకేదో చెపుతుంటే "అయిపోయినవి ఇప్పుడెందుకులే మావయ్యా, వీళ్లేనా మీ పిల్లలు" అన్నాడు నలుగురిని చూసి. తన నాన్న మాటలు విన్న నిధి మొహం మాత్రం కోపంతొ ఎర్రబడటం చూసిన శివకి నవ్వొచ్చింది.
ధీరజ్ : అవునురా అదిగో వాడు ప్రవీణ్, ఇది ప్రియ నా పిల్లలు. ఇక వాళ్ళు నితిన్, నిధి పెద్ద మావయ్య పిల్లలు. నిధి నీకు తెలుసుగా చిన్నప్పుడు తెగ ఆడుకునేవాళ్ళు
శివ హాయ్ అని చెయ్యి ఊపితే హాయ్ అన్నారు. గ్రౌండుకి వెళుతున్నా క్రికెట్ ఆడదాం వస్తారా
నితిన్ : వాట్ క్రికెట్, నొ నొ ఐ డోంట్ లైక్ క్రికెట్. ఐ ప్లే బేస్ బాల్
శివ : ఏంటి మావయ్య నీ కొడుక్కి తెలుగు రాదా
సుభాష్ : వచ్చురా అక్కడ అలవాటు అయ్యి
లోపల నుంచి మేనేజర్ బిల్ తెచ్చాడు. సుభాష్, ధీరజ్ ఇద్దరు ఫైల్ చూస్తూ బిల్ వేస్తుంటే. మేనేజర్ శివ వైపు చూసి అన్నా అని సైగ చేసాడు. ఇదంతా నిధి చూస్తుంది. ఆగమన్నాడు శివ, మేనేజర్ ఇంకో పది నిమిషాలకి మళ్ళీ శివ వైపు చూసి అన్నా టైం అని చెయ్యికి ఉన్న వాచీ చూపించాడు. దణ్ణం పెడుతూ చేతులు ఎత్తితే
శివ : సరే నేను వెళ్ళాలి, మావయ్య బిల్ నేనేసిస్తా ఇవ్వండి
ధీరజ్ : పర్లేదు లేరా మాకూ అలవాటు కావాలి కదా, మేము చూస్తాంలే
శివ లేచి "నేను వెళతా అయితే" అన్నాడు. నిధి వంక చూసి చూడనట్టు చూసి బైటికి నడుస్తుంటే. సుభాష్ గొంతు వినపడింది, "ఏరా ఏదో పెడుతున్నావని విన్నాను, పెట్టుబడికి సాయం ఏమైనా కావాలా ?"
వెనక్కి తిరిగి చూస్తే నిధి పళ్ళు కొరుకుతూ తన నాన్నని చూసిన చూపుకి, శివ గట్టిగా నవ్వాడు.
శివ : పెట్టుబడి ఉందిలే మావయ్యా అని బైటికి నడిచాడు. "బానే వెనకేశావ్ అయితే" అన్న ధీరజ్ మాటలు వినినట్టే బైటికి నడిచాడు.
క్రికెట్ గ్రౌండ్ కి వెళ్లి చూస్తే అక్కడో ఇరవై మంది పోగై ఉన్నారు. అందరూ ఈ ఊరి వాళ్ళే, అందరూ స్నేహితులే
శివ : మీరెంట్రా ఇక్కడా
చాలా రోజులు అయిపోయింది కద మావా, దా ఓ ఆట ఆడదాం.
శివ : ఈ పొట్టతొ ఆడదామనే అంటే నవ్వారు
టీమ్స్ ఏర్పాటు చేసాక, టాస్ పడ్డాక శివ బాటింగ్ తీసుకున్నాడు. ఫోను మోగింది. షాపు మేనేజర్ నుంచి.
శివ : హలో
సుభాష్ : శివా నేను మావయ్యని, ఇందాక బిల్ దెగ్గర కస్టమర్ మాట వినట్లేదు.
శివ : ఏం ఏం తీసుకున్నారు ?
సుభాష్ : పెద్ద లిస్టే ఉంది
శివ : ఒకసారి మేనేజర్ కివ్వు
మేనేజర్ : శివా..
శివ : ఎవరు అన్నా
మేనేజర్ : మద్దిపాలెం నుంచి మహేష్
శివ : వాడా ఏం తీసుకున్నాడు ?
మేనేజర్ చెపుతుంటే వేళ్ళ మీద బిల్ వేసి డెబ్భై ఐదు వేలు చేసాడు. ఫోన్ వెంటనే సుభాష్ చేతికి వెళ్ళింది.
సుభాష్ : మేము బిల్ చేస్తే లక్షా ఇరవై ఐదు వేలు వచ్చింది, నువ్వు డెబ్భై ఐదు చేసావ్
శివ : అక్కడున్న ఫైల్ రేట్లు ఊళ్లలో నడవవు మావయ్యా.. అవన్నీ మీకు మేనేజర్ తరువాత చెప్తాడులే, బిల్ డెబ్భై ఐదు అయింది, డిస్కౌంట్ కింద మీరో ఐదు తీయండి, బేరం కింద వాడో ఐదు తీస్తాడు. అరవై ఫైనల్ చెయ్యండి. లిమిటెడ్ లాభం. వాడి పేరు మీద పది మంది వస్తారు, ఎక్కువ లాభం చూడకూడదు. ఉంటాను.
"ఒరేయి బాబు, ఆపరా నీ పత్తాపారం"
శివ : అయిపోయింది అయిపోయింది. ఫోను జేబులో దూర్చాడు.
ఆట మొదలయింది.
xxx xxx xxx
అర్ధరాత్రి సుభాష్ ఇంటి గేటు నుంచి ఒక శాల్తీ బైటికి దూకింది. అప్పుడే ఉచ్చోసుకుందామని బైటికి వచ్చిన రామరాజుకి అది కనిపించి మెల్లగా చెట్టు చాటున నీడలో వెళ్ళాడు. సమయం చూసుకుని ఒక్క ఉదుటున పులిలా మీదకి దూకి ఒడిసి పట్టుకున్నాడు.
"దొంగా దొంగా" అని కేకలు వేస్తుంటే రామరాజు తొడ మీద గట్టిగా గిచ్చారు. "అమ్మా అమ్మా " అని నొప్పికి అరుస్తుంటే వెంటనే చేత్తో నోటిని మూసి "తాతయ్యా ఎందుకు అరుస్తున్నావ్" అని కోపంగా అరిచింది.
రామరాజు : నిధి !
నిధి : ఆ నేనే
రామరాజు : ఈ యేళప్పుడు ఎందమ్మా ఇదీ
నిధి : నిద్ర రాక బైటికి వచ్చాను
రామరాజు : గేటు తీసుకుని రావచ్చు కదా
నిధి : నా కర్మ అని తల కొట్టుకుంది.
"ఓయి ముసలోడా, నిద్ర పోకుండా ఎందుకు నీకయన్ని" అన్న గొంతు వినగానే ఆశ్చర్యపోతు చెట్టు చాటున నీడలో ఉన్న మనవడు శివని చూసి నిధి వంక చూసాడు.
రామరాజు : ఆ పోతన్నా.. నాకేం తెలీదు, నేనేం చూడలేదు. నాకేం తెలీదు, నేనేం చూడలేదు అనుకుంటూ వెళ్లిపోతుంటే ఇద్దరు వచ్చి వాటేసుకున్నారు. బావా మరదలు బుగ్గల మీద ఇద్దరికీ చెరో ముద్దు ఇచ్చి చల్లగా ఉండండి, చలిలో తిరగకండి అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు.
నిధి గట్టిగా ఊపిరి పీల్చుకుని నడుము మీద చేతులు పెట్టి శివని చూస్తే శివ నవ్వాడు.
నచ్చితే Like, Rate
Comment కూడా..
The following 29 users Like Pallaki's post:29 users Like Pallaki's post
• ABC24, amarapremikuraalu, Anamikudu, Anand, Babu143, Babu_07, BR0304, Coinbox, DasuLucky, Energyking, Gangstar, gora, Gurrala Rakesh, hijames, Iron man 0206, jwala, [email protected], Mahesh12, prash426, Raaj.gt, ramd420, ramkumar750521, shekhadu, shiva9, Speedy21, TheCaptain1983, Uday, Uppi9848, yekalavyass
Posts: 47
Threads: 0
Likes Received: 31 in 24 posts
Likes Given: 64
Joined: Jul 2024
Reputation:
1
•
Posts: 56
Threads: 0
Likes Received: 64 in 34 posts
Likes Given: 46
Joined: Nov 2018
Reputation:
5
Boss is back welcome back bro…????
•
Posts: 4,829
Threads: 0
Likes Received: 4,019 in 2,986 posts
Likes Given: 15,889
Joined: Apr 2022
Reputation:
68
•
Posts: 3,533
Threads: 0
Likes Received: 2,505 in 1,919 posts
Likes Given: 512
Joined: May 2021
Reputation:
29
•
Posts: 784
Threads: 0
Likes Received: 1,249 in 699 posts
Likes Given: 3,177
Joined: Jun 2020
Reputation:
43
(19-02-2025, 07:54 PM)Pallaki Wrote: నిన్ను కోరే వర్ణం
E3
నిన్నే కాదు నువ్వు చేసే సగ్గుబియ్యం పాయసం రుచి కూడా నాకింకా గుర్తుంది. నేనొచ్చి చాలా సేపయ్యింది. వెళతాను అని శివ వంక చూస్తే కొడుకుని కోడలి మీదకి నెట్టింది వసుధ. నిధి సిగ్గుపడుతూ వెళ్లిపోతుంటే కొడుకు భుజం మీద చెయ్యి వేసి ఆనందపడింది వసుధ.
నచ్చితే Rate & Like
Comment కూడా..
Nice episodes with the restart, TakulSajal/Pallaki !!!
Posts: 767
Threads: 2
Likes Received: 747 in 509 posts
Likes Given: 646
Joined: Dec 2020
Reputation:
14
this is what we want..... super update bro....
•
|