10-01-2025, 06:02 PM
(This post was last modified: 10-01-2025, 08:18 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
చిన్న కధ...
Quote:ట్రైలర్
"ఆహ్" అని ఆవలిస్తూ టీవీ ఓపెన్ చేయగా... టీవిలో యాంకర్ ఒకటే పనిగా చెప్పుకొస్తుంది.
కత్తితో కళ్యాణం...
పెద్దింట్లో జరిగిన వింత విదంతం... సమయానికి పెళ్లి కూతురు రాలేదని, కత్తిని తీసుకొచ్చి పెళ్లి కొడుకు చేత దానికి తాళి కట్టించారు. పెళ్లి కొడుకు అడిగితే మొట్టికాయ వేసి మరీ ఇది ఆచారం అంటూ 'మమ' అనిపించారు.
విషయానికి వస్తే... 'యస్' మరియు 'యమ్' కుటుంబాలు కలిసి రాష్ట్రంలో పెద్ద పెద్ద వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేబడుతూ వచ్చారు. ఇరువురి కుటుంబాలు స్నేహితుల స్థాయి నుండి వియ్యంకులు అవ్వాలని అనుకుని 'యస్' కుటుంబానికి చెందినా అబ్బాయి మిస్టర్ శేఖర్ మరియు 'యమ్' కుటుంబానికి చెందిన అరుణ అనే అమ్మాయికి పెళ్లి నిశ్చయించారు. సరిగ్గా పెళ్లి కూతురుని తీసుకురావాల్సిన సమయంలో అరుణ గారు తన పాత బాయ్ ఫ్రెండ్ కోసం పెళ్లి వదిలేసి మరీ వెళ్ళిపోయారు.
ఇంటర్వ్యూ "ఇక్కడ జరిగింది చూశారు కదా... ఏం జరిగింది?"
ఒక పెద్దావిడ "అదేంటంటేనండి.... పెళ్లి కూతురు తరుపోళ్ళు ఒకళ్ళు వచ్చి పెళ్లి కూతురు తల్లికి తండ్రికి ఎదో చెప్పారండి... ఆ తర్వాత పెళ్లి కొడుకు తల్లిదండ్రులు వెళ్లి కోపంగా వచ్చారండి.. తర్వాత వాళ్ళు వాళ్ళు ఎదో మాట్లాడానుకొని కత్తిని తీసుకొని వచ్చి తాళి కట్టమన్నారు అండి.. అప్పటికి శేఖర్ గారు ఏంటి? ఇది అన్నారండి..."
"శేఖర్ అంటే పెళ్లి కొడుకేనా..."
ఒక పెద్దావిడ "అవునండి.... అయ్... పెద్దోళ్ళం మమ్మల్ని అడిగేంత వాడివా... అని మొట్టికాయ వేసి ఏదేదో చేసేసి పెళ్లి అయిపొయింది అన్నారండి"
"చూశారు కదా..."
మరో చానల్ మరో వ్యక్తీ ఇంటర్వ్యూ...
"అంటే పెళ్లి కూతురుకి ఈ పెళ్లి ఇష్టం లేకుండా సెట్ చేశారా..."
ఒక పెద్దాయన "అదేం లేదు అమ్మా.... అబ్బాయి అమ్మాయి కి మధ్య ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాలు నుండి స్నేహం ఉంది"
"బయట అందరూ బిజినెస్ డీల్స్ పాడు కాకుండా ఉండడం కోసం ఇలా చేశారు అని చెబుతున్నారు. అరుణ గారికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి సెట్ చేశారా..."
ఒక పెద్దాయన సీరియస్ గా "మీరు నిజాలు మార్చకండి... అరుణ మరియు శేఖర్ గారు ఇద్దరూ మూడు సంవత్సరాలుగా లవ్ లో కూడా ఉన్నారు... ఆమెకు పెళ్ళికి ఇష్టం లేక పోతే, ముందే చెప్పేది"
"అంటే అరుణ గారు మోసం చేశారు అంటారా..."
ఒక పెద్దాయన సీరియస్ గా "అది కాదు అండి..."
"అంటే శేఖర్ గారు మోసం చేశారు అంటారా..."
ఒక పెద్దాయన గట్టిగా "శేఖర్ గారి గురించి మాట్లాడకండి... సర్ ఇప్పటికే అరుణ మేడం ఆ కుమార్ గాడితో లేచిపోయిందని బాధలో ఉన్నారు" అని వెళ్లి పోయాడు.
"అసలేవరు ఈ కుమార్?"
మరో చానల్
త్వరలో 'యమ్' అండ్ 'యస్' గ్రూప్స్ కలిసి ప్రభుత్వం చేయబోతున్న పెద్ద ప్రాజెక్ట్ కి సంబంధించిన సంతకాలు జరగబోతున్నాయి.
అసలు వస్తారా...
మరో చానల్
ఎవరో వ్యక్తీ పెళ్లి కొడుకు వేషం వేసుకొని ఏడుస్తూ ఉన్నాడు.
ఒక వ్యక్తీ వచ్చి "ఏమయింది ఎందుకు ఏడుస్తున్నావ్?" అని అడిగాడు.
"నాకు కత్తితో పెళ్లి చేశారు.... ఇవ్వాళ నాకు కత్తికి శోభనం అంటున్నారు... నేనేం చేయాలి...." అంటూ ఏడుస్తున్నాడు.
ఆ వచ్చిన వ్యక్తీ షాక్ అయ్యాడు.
మరో ఛానల్..
...
మరో ఛానల్..
..
...
సుమారుగా ఇలాంటి న్యూస్ వస్తున్నాయి.
శేఖర్ ఫోటో వేసి అతని తల మీద మొట్టికాయ వేస్తున్నట్టు మీమ్ తయారు చేసి వైరల్ చేస్తున్నారు.
సుమతి ఆవలిస్తూ "శేఖర్.... మ్....." అని పైకి లేచి... టీవీ పక్కనే గోడ మీద ఉన్న శేఖర్ మరియు తను ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో చూస్తూ "ఏం చేయబోతున్నావ్ రా.... అసలేంటి ఇదంతా... నువ్వు అమాయకుడువి అంటే ఎలా నమ్ముతున్నారు రా... అందరూ..." అంది.
త్వరలో....
......శకుని...
![[Image: CLUTqb-MNgfimx-P8tq-ZAp9-Hl3w-L59k-W81-L...Kx0-SO.gif]](https://i.ibb.co/VqTkydp/CLUTqb-MNgfimx-P8tq-ZAp9-Hl3w-L59k-W81-Lxf-WJ3e-V58-Uh0-YFd-Ce-X8h-Rlt-XH4h-Psk-WFa-PXEBlwsi-BKx0-SO.gif)