07-01-2025, 08:20 PM
ఇంకో కథ. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను, చూద్దాం.
"అభిమాని"
|
07-01-2025, 08:20 PM
ఇంకో కథ. మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను, చూద్దాం.
07-01-2025, 08:22 PM
"ఏం కావాలి మేడం?"... షాపులోకి వస్తున్న యువతిని చూస్తూ అడిగాడు షాప్ ఓనర్.
"నెట్ చున్నీలు కావాలి. మా ఫ్రెండ్ ఈ షాపులోనే కొన్నాను అంది. ఉన్నాయా?"... కూర్చోకుండానే అడిగింది యువతి. "ఉన్నాయి మేడం. పొద్దునే కొత్త స్టాక్ వచ్చింది. పైన ఉన్నాయి, తెప్పిస్తాను, కూర్చోండి"... యువతితో అంటూ ఎవరికో ఫోన్ చేసాడు ఓనర్. కుర్చీలో కూర్చుంటూ... చుట్టూ ఉన్న రకరకాల వస్త్రాలు చూడసాగింది యువతి. ఫోన్ చేస్తే ఎత్తకపోవడంతో మళ్ళీ చేసాడు ఓనర్. రింగ్ అవుతున్నా ఎత్తకపోవడంతో, షాపులో కస్టమర్ ఉండటంతో కోపం రాసాగింది. తను అడిగినవి వస్తున్నాయేమో అని తల తిప్పి వెనక్కి చూసింది యువతి. యువతి ఎందుకు చూసిందో అర్ధమైన ఓనర్ మళ్ళీ ఫోన్ చెయ్యసాగాడు. "మా ఫ్రెండ్ జయ చెప్తే వచ్చాను. లేవు అంటే చెప్పండి, నేను వెళ్తాను. మళ్ళీ వస్తాను"... అంది యువతి. "జయగారా మీ ఫ్రెండ్. మరి చెప్పరేం. జయగారి అమ్మగారు కొనేది ఇక్కడే. పొద్దున వచ్చిన స్టాక్ పైన ఉంది. పని చేసే కుర్రాడు పైన ఉండాలి, లేడు, బయటకి వెళ్ళినట్టున్నాడు. ఫోన్ చేసినా ఎత్తలేదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. రెండు నిమిషాలు కూర్చోండి. వెంటనే వస్తాను"... అంటూ బయటకి వెళ్ళాడు. "కాఫీ, కూల్ డ్రింక్, ఏది కావాలో చెప్పండి, అమ్మాయి ఇస్తుంది"... అని యువతితో అంటూ... అక్కడే ఉన్న అమ్మాయి వైపు చూస్తూ వేగంగా బయటకి వెళ్లాడు. "ఏం తీసుకుంటారు మేడం?"... అడిగింది అమ్మాయి. "ఏమీ వద్దమ్మా. నీ పేరేంటి?"... అమ్మాయితో మాట్లాడసాగింది యువతి. రెండే నిమిషాల్లో కోపంగా కనిపిస్తూ లోపలికొచ్చాడు ఓనర్. ఓనర్ వెనకే ఓ ఇరవై ఏళ్ళ కుర్రాడు. లోపలికొస్తూ... "పెద్ద కస్టమర్లురా... మనది చిన్న షాపైనా మన దగ్గర మంచి సరుకు ఉంటుందని వస్తారు... ఇలా వెయిట్ చేయిస్తే ఎలారా. పని పట్ల శ్రద్ధ ఉండాలి. మేడంగారికి సారీ చెప్పు"... అరుస్తున్నట్టు అన్నాడు ఓనర్. తల ఎత్తకుండా అలానే ఉన్నాడు కుర్రాడు. "అయ్యో. అన్నట్టుగానే రెండు నిమిషాల్లో వచ్చారు మీరు. మరేం పరవాలేదు"... అంది యువతి. "అయ్యో"... అని ఒకలాగా వినిపించడంతో... ఆ గొంతు తెలిసిన గొంతు అనిపించడంతో ఒక్కసారిగా తల ఎత్తాడు కుర్రాడు. ఎదురుగా మెరూన్ చుడీదార్ వేసుకుని, చేతిలో గ్లాసెస్ పట్టుకుని వెలుగుతున్నట్టు ఉన్న ముఖంతో ఉన్న యువతి కనిపించింది. తల ఎత్తిన కుర్రాడిని చూస్తూ... "నాకు కావల్సింది సారీ కాదు, చున్నీ. ఎంత తొందరగా తెస్తావో చూద్దాం"... అంటూ నవ్వుతూ చెప్పిన ఆ యువతిని చూడగానే ఆ కుర్రాడి శరీరం, మనసు, మెదడు అన్నీ కొంచెం కంపించాయి. "పొద్దున వచ్చిన కొత్త చున్నీలు తీసుకురాపో"... గదిమాడు ఓనర్. తలూపుతూ పరుగు లాంటి నడకతో పైకి వెళ్ళాడు. నవ్వుకుంటూ కూర్చుంది యువతి. నిమిషంలో ఒక పెద్ద బాక్స్ తీసుకుని వచ్చాడు. "ఇంకో బాక్స్ ఉంది... తెస్తాను. ఇవి పొద్దునే వచ్చాయి"... అంటూ చూపించసాగాడు. తెచ్చినవి చూడసాగింది యువతి. "ఇవి బానే ఉన్నాయి... ఆ రెండో బాక్స్ కూడా తెస్తే... అవెలా ఉన్నాయో చూస్తాను"... తలెత్తకుండా చూసుకుంటూ చెప్పింది యువతి. మళ్ళీ వెంటనే వెళ్లాడు కుర్రాడు. పైన చిన్న శబ్దం. ఏమైందోనని ఓనర్ కదలబోయేంతలో కిందకొచ్చాడు కుర్రాడు. "ఏమైందిరా?" తల దించుకునున్నాడు కుర్రాడు. "నిన్నేరా, ఏమైంది?" "కుండ పగిలింది" "పగలకొట్టి పగిలింది అంటావా"... పిచ్చి కోపం వస్తున్నా ఎదురుగా పెద్ద కస్టమర్ ఉందని తమాయించుకుని... "వెధవా, ఎందుకు పగలకొట్టావురా"... అన్నాడు ఓనర్. "కింద కస్టమర్ వెయింటింగ్ అని, తొందరగా వద్దామని వస్తుంటే బాక్స్ కుండకి తలిగి కింద పడింది"... తల వంచుకుని చెప్పాడు కుర్రాడు. "ఏమన్నా తడిసాయా?"... ఈ సారి ఎక్కువ కోపంగా అన్నాడు ఓనర్. "లేదు. పగిలింది రెండో రూంలో ఉన్న చిన్న కుండ. రెండో రూంలో పొద్దున వచ్చిన స్టాక్ తప్ప ఇంకేమీ లేవు"... నష్టం ఏమీ జరగలేదు కాబట్టి ఓనర్ ఏమీ అనడని తల ఎత్తుతూ అన్నాడు కుర్రాడు. "అయితే అతివృష్టి లేదా అనావృష్టి. చేస్తే పని మానేసి బయట పెత్తనాలు, లేదా హడావిడి. నా వ్యాపారం సర్వనాశనం చేసి, నన్ను దివాలా తీయించే దాకా మీరు నిద్రపోరురా. వచ్చినవన్నీ చూపించరా... చూడండి మేడం"... కుర్చీలో కూలబడుతూ అన్నాడు ఓనర్. నవ్వుకుంది యువతి. ఎదురుగా ఉండి అన్నీ చూపించసాగాడు కుర్రాడు. చూపిస్తున్నవి నచ్చుతున్నట్టుగా యువతి మొహం ఇంకా వెలుగుతున్నట్టు అనిపించసాగింది కుర్రాడికి. తెలిసిన మనిషిగా అనిపిస్తున్నా... ఇంకా నమ్మకం కలగని కుర్రాడు యువతి చెవుల వంక చూడసాగాడు. విరబోసుకున్న కురులు చెవులని కప్పగా... చెవులు కనిపించకుండా ఉండటంతో అతని కోరిక ఫలించలేదు. అన్నీ ఒక్కొక్కటీ చూడసాగింది యువతి. ఇంతలో యువతి మొబైల్ మోగింది. "హల్లో...జయా... నూరేళ్ళే నీకు. మీ బట్టల షాపులోనే ఉన్నాను. చున్నీల కోసం వచ్చాను, కొత్త స్టాక్ వచ్చిందిట, బాగున్నాయి, చూస్తున్నాను. వద్దే, నువ్వేమీ ఇప్పుడు రావక్కరలేదు. నా షాపింగ్ అయిపోయింది, వెళ్లబోతున్నా"... మాట్లాడుతున్న యువతి వైపే చూడసాగాడు. చెవుల మీద కురులు ఇంకా అలానే ఉండటంతో నిరుత్సాహంతో ఉన్న కుర్రాడి ముఖం వెలిగేలా... కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు... కుర్రాడి కోరిక ఫలించేలా... "అయ్యో రావద్దే... అయ్యో వద్దే"... అంటూ మాటలు పూర్తి చేసి... మొబైల్ టేబుల్ మీద పెడుతూ... తన కురులని చెవి వెనక్కి అనుకుంటున్న యువతిని చూడగానే కుర్రాడి ముఖం వెలిగిపోయింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. పెదవుల మీద ఒక్కసారిగా నవ్వు. పట్టలేని ఆనందం కలగసాగింది. తన ఎదురుగా ఉన్నది...
07-01-2025, 09:17 PM
super start
07-01-2025, 09:48 PM
Nice start
08-01-2025, 09:18 AM
బాగుంది ప్రయత్నం.
08-01-2025, 01:32 PM
చాలా మంది యజమానులు కస్టమర్ ముందు తిట్టరు బ్రో...ఆ కుర్రాడి ముందు ఎవరు బ్రో, అతని కలల దేవతా?
:
![]() ![]()
08-01-2025, 02:40 PM
Nice andi.. suspense lo uncharuuuu
11-01-2025, 03:33 PM
Good start
|
« Next Oldest | Next Newest »
|