Thread Rating:
  • 7 Vote(s) - 1.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అవునా! కాదా!
#1
భాస్కర్ ఒక గులాబి కొని రోడ్ పక్కనే కూర్చొని పువ్వు రేకులను ఒక్కొక్కటి ఒక్కటి తీసేస్తూ... యస్... నో... అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు, ఒక గులాబి అయిపోగానే డస్ట్ బిన్ లో పడేసి మరో పువ్వు కొని అదే పని చేస్తూ ఉన్నాడు. యస్ వచ్చినా నో వచ్చినా అతని మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు.

అతని ప్రశ్నకి సమాధానం ఏం కావాలో అతనికే అర్ధం కావడం లేదు.

పూలు అమ్మే కుర్రాడు "ఏందీ? సాబ్? ఏందీ సమస్యా...  లవ్ ప్రాబ్లమా..."

భాస్కర్ తల పైకెత్తి అతడిని చూసి మోహంలో వెలుగు లేని ఒక నవ్వు నవ్వాడు.

పూలు అమ్మే కుర్రాడు "ఏమయింది సాబ్..." అన్నాడు.

భాస్కర్ తల అడ్డంగా ఊపాడు.

పూలు అమ్మే కుర్రాడు "ఏం పేరు సర్..."

భాస్కర్ "భానూ" అన్నాడు.

పూలు అమ్మే కుర్రాడు "పేరు మంచిగా ఉంది....  ఇంతకీ 18+ కదా..."

భాస్కర్ "3 సంవత్సరాలు...  వాళ్ళ అమ్మ పేరు సుష్మ"  అన్నాడు.

పూలు అమ్మే కుర్రాడు, గుండెల మీద చేయి వేసుకొని "హమ్మా..." అనుకోని "మీ కూతురా..." అన్నాడు.

భాస్కర్ "సుష్మకి కూడా నేనంటే ఇష్టమే రా...  రేపు మా పెళ్లి కూడా.... కాని భానూ వాళ్ళ నాన్న వచ్చాడు...  అప్పటి వరకు నన్ను డాడీ డాడీ అనే భాను అతన్ని నాన్న అంటూ  అతని వెంట వెళ్లిపోయింది... పాపని తీసుకు రావడం కోసం సుష్మ కూడా వెళ్ళింది..." అని ఆగిపోయి "నాకు భయంగా ఉంది రా...." అన్నాడు.

పూలు అమ్మే కుర్రాడు, ఎవరో పూల కోసం పిలిస్తే వెళ్లిపోయాడు.

భాస్కర్ ఫోన్ మోగింది, సుష్మా కాలింగ్....

ఫోన్ ఎత్తాలంటేనే భయం భయంగా ఉంది.

భాస్కర్ దైర్యం చేసి ఫోన్ ఎత్తాడు....





భాను వాళ్ళ నాన్న వినోద్...

సుష్మ ఇంట్లో గొడవ గొడవ చేస్తూ... సుష్మ కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాడు.

పక్కనే కొంచెం దూరంలో భానూ ఏడుస్తూ ఉంది.






భాస్కర్ "హలో...." అన్నాడు.

సుష్మ "భాస్కర్.... నేను సుష్మని మాట్లాడుతున్నాను"

భాస్కర్ "చెప్పూ"

.
.
.
.
.







[+] 11 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Suspense lo apesaru, plz continue, and give update at the earliest
Like Reply
#3
good setup!
Like Reply
#4
Nice start
Like Reply
#5
బావుంది శివరాం బ్రో కొత్త కాన్సెప్ట్, ఇప్పుడు సుష్మ వినోధ్/భాస్కర్ ల మధ్య ఎవరుకావాలో నిర్ణయించుకోవాలి. పాపం భాను, మూడేళ్ళకే ఎన్ని కష్టాలో, జీవమిచ్చిన నాన్న ఒకవైపు, ప్రేమను పంచిన నాన్న ఒకవైపు...ఏమో నాకైతే ఇంతవరకే తట్టింది, మరి బ్రదర్ తలలో ఏముందో...రాస్తే చదివి తెలుసుకుంటాము Big Grin .
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#6
Superb
Like Reply
#7
Update plz sir
Like Reply
#8
ఇదేమి సెక్స్ స్టొరీ కాదు బ్రదర్....

ఒక ఫ్రెండ్ చెప్పిన ఒక స్టొరీ...

త్వరలో అప్డేట్ ఇస్తాను.... వెయిట్ చేయండి..
[+] 4 users Like 3sivaram's post
Like Reply
#9
Good start
Like Reply
#10
ఈ కధలో విలన్ ఎవరో మీరే చెప్పండి.






సుష్మ (28 ఫిమేల్), వినోద్ (31 మేల్) తన భర్త, కూతురు భాను (2 ఫిమేల్) తో కలిసి చెన్నై లో ఉంటుంది.



1. మొదటి మీటింగ్ - సుష్మ విత్ ఫ్రెండ్

సుష్మ తన ఫ్రెండ్ తో కలిసి రెస్టారెంట్ లో కలిసింది, పెళ్లి అయి వచ్చాక జాబ్ వదిలేసి ఇంట్లోనే ఉంటుంది. భాను పుట్టిన తర్వాత అసలు బయటకు వెళ్ళడం కూడా మానేసింది. సడన్ తన గా కాలేజ్ ఫ్రెండ్ అదే సిటీలో ఉందని తెలిసి భానుని తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి వచ్చి ఫ్రెండ్ తో కూర్చుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది.

ఫ్రెండ్ "ఎలా ఉన్నావే.."

సుష్మ "బావున్నాను" ఫార్మాలిటిగా చెప్పింది.

ఫ్రెండ్ "హ్మ్మ్, వినోద్ ఏం చేస్తున్నాడు"

సుష్మ "ఏం చేస్తాడు, జాబ్ చేస్తున్నాడు.. నేను ఇంటి దగ్గరకు ఖాళీగా ఉంటున్నాను.. పాప కొంచెం కాలేజ్ కి వెళ్తే నేను కూడా జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను" అడిగిన దానికంటే ఎక్కువే చెప్పేసింది.

ఫ్రెండ్ మనసులో "సుష్మ ఎదో సీరియస్ విషయం చెప్పాలని అనుకుంటుంది" అని అర్ధం అయి సుష్మ చేతిలో చేయి వేసి తన కళ్ళలోకి చూస్తూ "హుమ్మ్" అంది.

సుష్మకి తన ఫ్రెండ్ చూపు గుచ్చుతున్నట్టు ఇబ్బందిగా అనిపించింది, ఇద్దరి మధ్య మౌనమే ఉన్నా, సుష్మ కళ్ళలో ఉన్న స్యాడ్ నెస్ తన ఫ్రెండ్ పట్టేసింది.

ఫ్రెండ్ "నీకో సీరియస్ విషయం చెప్పాలి"

సుష్మ "ఏంటది?"

ఫ్రెండ్ "వినోద్ నాకు.."

సుష్మ "నీకు.."

ఫ్రెండ్ మాట్లాడడం ఆపేసి సుష్మ కళ్ళలోకి హింట్ కోసం చూస్తూ ఉంది, ఆమెకు ఎదో అర్ధం అయి పోయింది.

సుష్మకి కూడా అర్ధం అయిపోయి ఓపిక పట్టలేక "ఏమయింది? ఎదో ఒకటి మాట్లాడు.." అంటూ కోపంగా అరిచింది.

ఫ్రెండ్ "ఏం లేదు.. వినోద్ ని ఈ మధ్య ఒకమ్మాయితో చూశాను"

సుష్మ బలవంతంగా నవ్వేసి "ఆ అమ్మాయి..  సుగుణా.... వినోద్ చుట్టమే.. జాబ్ సెర్చింగ్ కోసం వచ్చింది, ఈ మద్య మా ఇంటిలోనే ఉంటుంది.. జాబ్ వచ్హాక వెళ్లిపోతుంది" అంది.

ఫ్రెండ్ నిలువుగా తల ఊపింది, సుష్మ కూడా తల ఊపుతూనే ఉంది. ఇద్దరూ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు.

సుష్మ క్యాబ్ లో కూర్చొని తన ఫ్రెండ్ తో జరిగిన సంభాషణ మొత్తం గుర్తు తెచ్చుకుంది, ఓపెన్ అవ్వాలా లేదా అని మనసులో అనిపిస్తూ ఉంటే, ఎదో తెలియని ఇబ్బంది అనిపిస్తూ ఉంది.

భానుని తీసుకొవాడానికి వెళ్లి వాళ్ళతో కొద్ది సేపు కూర్చొని మాట్లాడుతూ, యాంత్రికంగా బావున్నావా అంటే బావున్నాను, తిను అంటే లేదు అని చెప్పి... భానుని తీసుకొని  ఇంటికి బయలు దేరింది.

పొద్దున్న నుండి రాత్రి వరకు ఒక యంత్రంలో పనిచేస్తూ ఉంటే, తన ఫ్రెండ్ తో మాట్లాడిన ఆ అయిదు నిముషాల సంభాషణ అంతా మార్చేసింది. 

ఇంటికి వెళ్తూ దారిలో అందరిని నవ్వుతూ పలకరిస్తూ ఇంటి దగ్గరకు వెళ్ళింది. భానుని చూడగానే అందరూ పలకరిస్తున్నారు, మనసు కొంచెం ఉల్లాసంగా అనిపించింది.

ఇంటి దగ్గరకు వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే, ఇంట్లో నుండి నవ్వులు వినిపించాయి. గుండెలో ఎక్కడో కలుక్కు మంది. తన ఫీలింగ్ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.

వినోద్ అఫైర్ పెట్టుకున్నాడా అంటే, లేదు.. 

సుగుణ మైండ్ లో అభిప్రాయం చెడ్డగా ఉందా, తెలియదు.. 

కానీ తనకు ఇబ్బందిగా అనిపిస్తుంది, చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

తన భర్త వినోద్ తనతో కాకుండా మరో అమ్మాయితో నవ్వుతూ సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే.. ఎదో ఇబ్బందిగా  అనిపిస్తుంది. 


సుగుణ ఎదురొచ్చి "అక్కా, ఎంత సేపు అయింది వచ్చి..." అంటూ భానుని చేతుల్లోకి తీసుకొని ఆడిస్తుంది.

వినోద్ తన వైపు కాకుండా టీవీ చూస్తూ ఉన్నాడు.

సుష్మ, వినోద్ వైపు చూస్తూ చూస్తూ సైలెంట్ గా ఉండిపోయింది.



















[+] 3 users Like 3sivaram's post
Like Reply
#11
2. రెండోవ మీటింగ్ - సుష్మ విత్ ఫ్రెండ్ 




ఫ్రెండ్ "నీకు ఇబ్బందిగా ఉంటే ఎందుకు భరిస్తున్నావ్, డైరక్ట్ గా అడిగేయకపోయావా.."

సుష్మ తన ఫ్రెండ్ వైపు చూస్తూ ఉంది



సుష్మ "సుగుణ ఎప్పుడూ వెళ్లిపోతుంది?"

వినోద్ విసుగ్గా మొహం పెట్టి "అసలు ఏమయింది? నీకు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావ్? ఎప్పుడూ మా ఇద్దరినీ గుడ్లగూబలా చూస్తూ ఉంటావు? ఎందుకు నీకు ఈ అనుమానాలు? ఇలాగే ఉంటే సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాలి" అని వెళ్ళిపోయాడు.

సుష్మ కూడా కోపంగా వినోద్ ని ఫాలో అయి వెళ్తూ "ఎప్పుడూ వెళ్లిపోతుంది?" అని అడిగింది.

వినోద్ కూడా కోపంగా చూసి అరచేతిని తన నుదురు మీద రుద్దుకొని కోపం తగ్గించుకొని మాములుగా "అవునూ..  నువ్వు వంట చేసి ఎన్నాళ్ళు అవుతుంది? బట్టలు ఉతికి ఎన్నాళ్ళు అవుతుంది? ఇంటి పనులు చేసి ఎన్నాళ్ళు అవుతుంది?" అని కోపంగానే నవ్వుతూ "చెప్పూ.. హుమ్మ్..  చెప్పూ..  చెప్పూ..  ఇవన్ని కూడా సుగుణ చేస్తుంది.. నువ్వు ఏమి చేయడం లేదు" అన్నాడు.

సుష్మ మనసులో "నేను ఏమి చేయడం లేదా..." అనుకోని "నువ్వు అసలు భానుని ఎత్తుకొని ఎన్నాళ్ళు అవుతుంది, నేను కన్న దగ్గర నుండి నన్ను దూరంగా ఉంచావు"

వినోద్ "డాక్టర్ ఉంచమన్నాడు"

సుష్మ "డాక్టర్ సెక్స్ చేయొద్దు అన్నాడు, అంతే ఇద్దరూ విడిపొమ్మనో, విడాకులు తీసుకోమనో కాదు.. " అని అరిచేసింది.

ఇంతలో పాప ఏడవడంతో సుష్మ మాట్లాడడం ఆపేసి పాప దగ్గరకు వెళ్ళిపోయింది.

వినోద్ కూడా ఎదో మాట్లాడదాం అనుకోని దగ్గరకు వెళ్లి పాపను చూసి ఆగిపోయాడు.

వినోద్ "నేను బయటకు వెళ్తున్నా.." అని కోపంగా వెళ్ళిపోయాడు.




ఫ్రెండ్ "మళ్ళి ఎప్పుడూ మాట్లాడలేదా.."

సుష్మ "ఆ రోజు సుగుణ ఇంటర్వ్యూ లో పాస్ అవ్వలేదు అంట అందుకొని ఎంకరేజ్ చేద్దాం అని తనని తీసుకొని రెస్టారెంట్ కి వెళ్ళాడు, అదేంటో.. తను ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే వినోద్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు"

ఫ్రెండ్ "ఏదైనా ఉందని అనుకుంటున్నావా.."

సుష్మ "ఫోన్ చేసి వినోద్ వాళ్ళ అమ్మకి చెప్పాను.. వినోద్ వచ్చి చెంప దెబ్బ కొట్టి మరీ అరిచాడు.. తర్వాత వినోద్ వాళ్ళ చెల్లెలు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పింది. కానీ వినోద్ మరియు సుగుణ ఇద్దరూ మంచి ఫెండ్స్ లా పార్టనర్స్ లా ఉండే వాళ్ళు అంట. సుగుణ ఫ్యామిలీకి వినోద్ ఫ్యామిలీ ప్రపోజ్ చేశారు అంట, సుగుణ కాదు అని వెళ్ళిపోయింది.. ఇప్పుడు జాబ్ సెర్చింగ్ కోసం ప్రపంచంలో ఏ నగరం ఖాళీగా లేనట్టు ఇక్కడకు వచ్చి ఉంటుంది" అంది.

ఫ్రెండ్ "నిలదీయకపోయావా.."

సుష్మ "నాకు అందరిలా ఫ్యామిలీ లేదు, అమ్మమ్మ, తాతయ్యలు పెంచారు.. ఇబ్బంది పెట్టలేను.."

ఫ్రెండ్ "మిగిలిన చుట్టాలను అడుగుదాం.. పెళ్లి చేసిన పెద్దలు ఉన్నారు కదా.." అంది.

సుష్మ "నాకు తెలియదు.. ఏం చేయాలో తెలియడం లేదు.. తను ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి.. ఏదైనా అయితే అందరూ మళ్ళి నన్నే అంటారు.." అని తల పట్టుకుంది.

ఫ్రెండ్ "నువ్వు అయినా నిలదీసావా.."




వినోద్ కూల్ గా "నేను ఎవరిని?"

సుష్మ కోపంగా రొప్పుతూ ఆవేశంగా "హుమ్మ్.. వినోద్ వి.."

వినోద్ కూల్ గా "నేను నీ మొగుడిని.."

సుష్మ "..."

వినోద్ "మా ఇద్దరి మధ్య ఏదైనా జరిగేది ఉంటే ఎప్పుడో జరిగేది.. నువ్వు ఎందుకు ఇబ్బంది పడతావ్.."

సుష్మ "వినోద్.." అని అరిచింది.

ఇంతలో భాను ఏడుస్తున్న గొంతు వినపడింది.

వినోద్ "వేళ్ళు..  వేళ్ళు..  వేళ్ళు..  పాప ఏడుస్తుంది వేళ్ళు..  " అని నవ్వుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు.





సుష్మ విత్ భాస్కర్ -  మొదటి మీటింగ్


భాస్కర్ (23 మేల్) "హాయ్ అక్కా బాగున్నారా.." అంటూ వచ్చాడు.

సుష్మ ఫ్రెండ్ "హేయ్, భాస్కర్ హాయ్.. బాగున్నా.. ఇక్కడ ఏం చేస్తున్నావ్.."

భాస్కర్ "అప్పుడే మర్చిపోయావా.. అక్కా.. జాబ్ వచ్చింది.. క్యాంపస్.. వారం రోజుల్లో జాయినింగ్.. సిటి అలవాటు చేసుకుందాం అని ముందుగా వచ్చా.."

ఫ్రెండ్ "గుడ్.. గుడ్.. పెద్ద వాడివి అయిపోయావ్.. ఇంకేటి పెళ్లి ఎప్పుడూ?"

భాస్కర్ "పెద్ద వాళ్ళు మీరు ఉండగా.. మాకు తొందర ఏముంది లే.."

సుష్మ మరియు ఫ్రెండ్ "అబ్బో.. చాలా మాటలు నేర్చుకున్నావ్ రా.."

భాస్కర్ "ఎదో మీ దయ.."

ఫ్రెండ్ "ఒక పని చెయ్ రా.. నన్ను, నువ్వే పెళ్లి చేసుకో.. కట్నం కూడా ఇచ్చే పని ఉండదు.. మా పేరెంట్స్ కి.."

భాస్కర్ "నిన్నా... అహ్హ.. సుష్మ అక్కని అయితే చేసుకుంటా.."

సుష్మ మరియు ఫ్రెండ్ ఇద్దరూ స్టన్ అయ్యారు.

ఫ్రెండ్ "జోకు.. వెధవకి..." అని అతని తల మీద కొట్టింది.

సుష్మ ఆ రోజు మొత్తం భాస్కర్ ని జాగ్రత్తగా చూస్తూనే ఉంది.

భాస్కర్ ఎదో సరదాకి అన్నాడు కాని, అతనికి ఇంకేం అభిప్రాయం లేదు.

సుష్మ ఆలోచిస్తూ ఉండగా అర్ధం అయింది, సుగుణ మరియు వినోద్ ఇద్దరి మధ్య బోర్డర్ లేదు.





సుగుణ మరియు వినోద్ ఇద్దరూ హాగ్ చేసుకున్నట్టు చూడడం గుర్తు వచ్చింది.

సుగుణ "అక్కా.. నేను ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే వినోద్ ఓదారుస్తున్నాడు.. ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు.." అని వెళ్ళిపోయింది.

వినోద్ కోపంగా సుష్మని ఏదేదో అంటున్నాడు, సుష్మ ఇద్దరినీ అలా చూసిన దగ్గర నుండి షాక్ లోకి వెళ్లిపోయి ఏమి వినపడడం లేదు.

సుగుణ "అక్కా..  నా వల్ల మీ ఇద్దరూ గొడవపడడం నాకు ఇష్టం లేదు.. నేను వెళ్ళిపోతాను.."

వినోద్ "నువ్వు ఎందుకు వెళ్ళడం.. ఎవరికీ ఇష్టం లేదో.. వాళ్ళే వెళ్ళిపోతారు.."





సుష్మ మనసులో "సుగుణ మరియు వినోద్ ఇద్దరి మధ్య బోర్డర్ లేదు" అనుకుంది.

సుష్మ ఎదురుగా భాస్కర్ కనిపించాడు, హైట్, పర్సనాలిటీ, స్టైల్ అంతా బాగుంటాడు.

సుష్మకి ఒక ఐడియా వచ్చేసింది.

సుష్మ "భాస్కర్.."

భాస్కర్ "చెప్పూ అక్కా.."

సుష్మ "నాకు బాయ్ ఫ్రెండ్ గా ఉంటావా.." అని అడిగేసింది.

ఫ్రెండ్, భాస్కర్ ఇద్దరూ సుష్మని షాకింగ్ గా చూస్తూ ఉన్నారు.

సుష్మ అన్న మాట గమనించలేదు బాయ్ కి ఫ్రెండ్ కి మధ్య స్పేస్ ఉంది.



















ఈ స్పేస్ ఎన్నాళ్ళు ఉంటుందో? ఏమో?
[+] 5 users Like 3sivaram's post
Like Reply
#12
Nice update
Like Reply
#13
bagundi
Like Reply




Users browsing this thread: 1 Guest(s)