Thread Rating:
  • 20 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Adultery శకుని (అయిపొయింది)

Showing only the posts of 3sivaram: 19 of 74 posts. Show all posts
#1

.... త్వరలో ప్రారంభం ...

.... చాలా చిన్న కధ ....

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 6 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

        E1

"అయ్యొయ్యో" అనుకుంటూ శేఖర్ బాగ్స్ అన్ని తీసుకొని తన అపార్టమేంట్ నుండి బయటకు పరిగెత్తుకొని  వచ్చాడు. 

"అమ్మో కొద్ది సేపు ఉంటే దొరికేసేవాడిని, ఇవ్వాళ నా అర్దాంగి తన బాయ్ ఫ్రెండ్ ని పిలిపించుకుంది.... నేనే ఏమి తెలియక, బిజినెస్ టూర్ నుండి ముందు వచ్చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకూడదు" అనుకుంటూ కార్ ఎక్కి బయటకు వెళ్లి రౌండ్స్ కొడుతున్నాను.


ఇంతలో ఫోన్ మోగింది ఫోన్ కాంటాక్ట్ నేం... సుమతి అని బ్రాకెట్ లో 'వైఫ్ ఆఫ్ వైఫ్'స్ లవర్' అని ఉంది.

ఫోన్ ఎత్తాడు. 

సుమతి "ఎక్కడున్నావ్..."

శేఖర్ "ఇప్పుడే ఇంటి దగ్గరకు వచ్చా..."

సుమతి "అది సరే..... నా హస్బెండ్..... రాజు..."

శేఖర్ "నువ్వు అసలు కంగారు పడకు.... నీ హస్బెండ్ జాగ్రత్తగా నా వైఫ్ కౌగిట్లో ఉన్నాడు"

సుమతి పళ్ళు నూరుతూ "సచ్చినోడు.... ఫోన్ చేస్తే ఆఫీస్ లో బిజీ అని చెప్పి చచ్చాడు... అసలు ఈ నెలలో ఎన్ని సార్లు..."

శేఖర్ ఫోన్ తీసి లెక్కబెడుతూ "పన్నెండు సార్లు" అన్నాను.

సుమతి "దొంగ సచ్చినోడు... దొంగ సచ్చినోడు... "

శేఖర్ "అన్ని సార్లు సచ్చినోడు అనకు.. ఇక్కడ మా ఆవిడ హృదయం గాయ పడుతుంది"

సుమతి "రేయ్ శేఖర్ గా.... నిన్ను చంపేస్తాను రా..."

శేఖర్ "ఓహ్.... మా సుమతి గారికి కోపం వచ్చిందే... ఇప్పుడు ఎలా అబ్బా...." అంటూ నవ్వుతున్నాడు.

సుమతి కూడా నవ్వుతూ మాట్లాడుతుంది.

కొద్ది సేపటి తర్వాత....

శేఖర్ "అవునూ... నీ హస్బెండ్ ఈ మధ్య విడాకులు అని అంటున్నాడా....! మా ఆవిడ విడాకులు తీసుకోమని ఫోర్స్ చేస్తుంది. పైగా నాకు కూడా ఇనడైరక్ట్ గా చెబుతుంది. నేను అమాయకుడిని కదా... తెలుసుకోలేక పోతున్నాను"

సుమతి "నువ్వు..... అమాయకుడివి..... " అని నవ్వుతుంది.

శేఖర్ "నమ్మవా..."

సుమతి "నేనే కాదు.... నా కడుపులో ఉన్న నీ కొడుకు కూడా నమ్మడు"

శేఖర్ "ఎలా ఉంది?"

సుమతి "మా ఇంటికి వచ్చాను... వాంతులు అవుతున్నాయి"

శేఖర్ "జాగ్రత్త... జాగ్రత్త... "

సుమతి "హేయ్.... ఆగూ.... ఆగూ.... "

శేఖర్ "ఏమయింది?"

సుమతి "ఇవ్వాళ వాళ్ళ మెసేజెస్ చదవడం మర్చి పోయావ్"

శేఖర్ "సరే ఉండు!"


రెండో ఫోన్ ఓపెన్ చేసి నా అర్ధాంగి ఫోన్ లో ఈ మధ్య జరిగిన మెసేజెస్ చూస్తున్నాను.

.....   నా అర్దాంగి, అరుణ "ఎక్కడున్నావ్.... త్వరగా రా.... నిన్ను మిస్ అవుతున్నాను"

శేఖర్ "చూడండి అమ్మా! సొంత మొగుణ్ణి ఊరు వెళ్లి వారం అవుతుంది, నన్ను మిస్ అవ్వలేదు.... వీడిని మాత్రం మిస్ అవుతుంది"

సుమతి "నీకు ఫోన్ చేసి ఎప్పుడు వస్తున్నావ్ అని అడగలేదా..."

శేఖర్ "అడిగింది... మీ ఆయనని పిలిపించుకోడానికి.... ఇదిగో చూడు..."

.....   రాజు "ఇవ్వాళ మీ ఆయన వస్తాడు వద్దు అన్నావ్...."

.....   అరుణ "చెప్పాను కదా.. మిస్ అవుతున్నాను.... త్వరగా రా..."

.....   రాజు "శేఖర్ కి తెలిస్తే బాగోదు...."

.....   అరుణ "శేఖర్ రాకముందే పంపిస్తాను, సరేనా!"

.....   రాజు "దొరికిపోతే...."

.....   అరుణ "విడాకులు ఇచ్చేస్తాను.... నువ్వు కూడా ఇచ్చేస్తా అన్నావ్ కదా... "

.....   రాజు "అదే పనిలో ఉన్నాను.... తను ప్రెగ్నెంట్ అని ఆలోచిస్తున్నాను"

సుమతి నవ్వుతుంది.

శేఖర్ "ఎందుకు నవ్వుతున్నావ్"

సుమతి నవ్వుతుంది.

శేఖర్ "ఎందుకు నవ్వుతున్నావ్"

సుమతి "వాడిని తీసుకొని వెళ్లి టెస్ట్ చేయిస్తే.... స్పెర్ం కౌంట్ తక్కువ అని చెప్పారు.... ఎంత తక్కువ అంటే..... జన్మలో తండ్రి కాలేడు...."

శేఖర్ "అలా అనకు.... నా అర్దాంగి హృదయం బాధ పడుతుంది.... ఇద్దరూ కలిసి ప్రెగ్నెంట్ అయి నన్ను తండ్రిని చేయాలనీకూడా అనుకుంటున్నారు "

సుమతి "నీ యబ్బా అంతా కూల్ గా ఎలా ఉంటున్నావ్ రా..."

.....   అరుణ "త్వరగా వచ్చేయ్... నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను"


రెండూ నిముషాల మౌనం...

సుమతి "ఇంకా అంతేనా...." అని దిగులుగా చెప్పింది.

శేఖర్ "లైన్ లో ఉండు... ఒక మజా చూపిస్తా...."

సుమతి "ఏం చేయబోతున్నావ్..."

శేఖర్ మరో ఫోన్ నుండి వైఫ్ అరుణకి ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ లో "అర్దాంగి" అన్నాడు.

అరుణ రొప్పుతూ "యావండి.... యావండి.... " అని అరుస్తుంది.

శేఖర్ "నేను వచ్చేశా... బయట ఉన్నాను"

అరుణ "అప్పుడే వచ్చేశారా!"

శేఖర్ "అవునూ కార్ పార్క్ చేస్తున్నాను"

ఫోన్ లో సౌండ్స్ వస్తున్నాయి.

.....   సుమతి మెసేజెస్ పంపుతుంది "ఇద్దరూ రెడీ అవ్వడంలో కంగారు పడుతున్నారు"

.....   శేఖర్ "బిగినేర్ మిస్టేక్స్" అని నవ్వుతున్నాట్టు మెసేజ్ పెట్టాను.

.....   సుమతి "నువ్వు మా ఆయనని పట్టేసుకుంటావా..." అని బాధ పడుతున్నట్టు మెసేజ్ పెట్టింది.

.....   శేఖర్ "ఎందుకో అంత కోపం...." అని మెసేజ్ పెట్టాను.

.....   సుమతి "ఛీ.... ఇద్దరు ప్రేమికులను విడదీస్తున్నావ్...." అని తిడుతూ ఉన్నట్టు మెసేజ్ పెట్టింది.

.....   శేఖర్ "బాధ పడకు.... రివెంజ్ తీర్చుకోకుండా వదిలేదే లేదు..."

అరుణ మాట్లాడుతుంది, నేను మరియు సుమతి ఇద్దరం వింటున్నాం.

అరుణ "యావండి.... లగేజ్ చాలా ఉండి ఉంటుంది కదా... మీరు అక్కడే ఉండండి.... నేను వస్తున్నా...."

.....   సుమతి "ఎంతైనా శేఖర్ గారు అదృష్ట వంతులు..... బ్యాగ్ లు మోసే పెళ్ళాం దొరికింది"

.....   శేఖర్ "హహ్హహ్హ" అని మెసేజ్ పెట్టాను.

శేఖర్ "అర్దాంగి.... నువ్వు కష్ట పడితే నేను చూడగలనా.... నేనే వస్తున్నా...."

.....   సుమతి "ప్రేమ కారిపోతుంది"

.....   శేఖర్ సిగ్గు పడుతున్నట్టు మెమె ఫోటో పెట్టాను.

అరుణ "యావండి..... యావండి..... వచ్చే దారిలో ఐస్ క్రీం తీసుకొని రండి...."

శేఖర్ "హా.... వినపడ లేదు.... ఏంటి అంటున్నావ్..."

.....   సుమతి "కొంచెం సేపు టైం యివ్వు..... మా ఆయన ప్యాంట్ వేసుకుంటాడు.... నువ్వు తొందర పెడితే, చిట్టెలుక జిప్ లో పడిపోతుంది"

.....   శేఖర్ "అంటే మీ ఆయన జంటిల్ మ్యాన్ (జోక్ : డ్రాయర్ వేసుకోకుండా ప్యాంట్ వేసుకునే వాడు)"

.....   సుమతి "ప్లీజ్... ప్లీజ్... గివ్ దేం టైం...."

.....   శేఖర్ "సారీ..."

శేఖర్ "హా.... వినపడ లేదు" అంటూనే అరుణతో ఫోన్ కట్టేశాను.

నడుచుకుంటూ లిఫ్ట్ వరకు వచ్చాను.


రాజు ఎదురు వచ్చాడు. నా ఫోన్ చొక్కా జేబులో పెట్టుకోవడంతో నాతో పాటు సుమతి (రాజు భార్య) కూడా చూస్తుంది.

నా చెవిలో ఉన్న బ్లూ టూత్ లో నుండి సుమతి "చూడు.... చూడు.... నువ్వు తొందర పెట్టేసరికి... చెదిరిపోయిన జుట్టుతో ఉన్నాడు, పైగా ఆ చొక్కా గుండీలు కూడా పైకి కిందకు పెట్టుకున్నాడు"

రాజు నన్ను దాటేసి కంగారుగా ముందుకు వెళ్ళాడు.

నాకు కూడా నవ్వొచ్చింది. 

శేఖర్ "మిస్టర్..."

రాజు ఆగిపోయాడు. తన చేతిలో ఉన్న సూట్ కేస్ ని గట్టిగా పట్టుకున్నాడు. నేనేమైనా చేస్తే పరిగెడదాం అని ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నాడు. కాని నా వైపు తిరిగాడు.

శేఖర్ "ఈ కవర్ మీదేనా..." అని అన్నాను.

రాజు మొహం మీద చమటలు పెట్టేశాయి. దెయ్యాన్ని చూసి నట్టు నన్నే చూస్తున్నాడు.

శేఖర్ "ఈ కవర్ మీదేనా..." అని మళ్ళి అన్నాను.

రాజు తల అడ్డంగా ఊపాడు.

శేఖర్ "ఓకే" అన్నాను, లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపొయింది. రాజు పట్టుకున్న సూట్ కేస్ ఊడిపోయి లోపల కాగితాలు అన్ని కింద పడిపోయాయి.

శేఖర్, ఫోన్ లో సుమతితో "ఆఫీస్ నుండి, డైరక్ట్ గా ఇంటికి వచ్చినట్టు ఉన్నాడు, క్షణం కూడా సేవ్ చేస్తున్నారు. టైం వాల్యు తెలుసుకోవాలి అంటే మీ ఆయన దగ్గర నుండి నేర్చుకోవాలి"

ఫోన్ లో సుమతి నవ్వుతూ "రేయ్, శేఖర్ గా నువ్వు మామూలు వాడివి కాదు రా...." అంటూ నవ్వుతుంది.

నేను ఫోన్ లో మాట్లాడి ఫోన్ కట్టేసి ఇంట్లోకి వెళ్లాను.

అరుణ కంగారుగా తలుపులు తెరిచింది.

శేఖర్ "సర్పైజ్,... నా అర్దాంగి" అన్నాను.

అరుణ నవ్వుతూ నా బ్యాగ్ తీసుకొని ఇంట్లో పెట్టి వచ్చి మాట్లాడుతుంది.

నేను బెడ్ రూమ్ వైపు వెళ్లాను, నీటుగా దుప్పట్లు మార్చేసి ఉంది. 

మా ఆవిడ నిజంగా సూపర్... ఇంత స్పీడ్ గా పనిచేస్తుంది అని మెచ్చుకోకుండా ఉండలేక పోయాను.

బాత్రూం వైపు కదలగానే అరుణ అడ్డం వచ్చేసింది, ఏదేదో చెబుతుంది.

ఇప్పుడే కదా మెచ్చుకున్నాను. బాత్రూం క్లీన్ చేయలేదు అనుకుంట.... 

నేను వెళ్తా అన్నాను. తను కాదు అంది. ఇద్దరం అలా చిన్న ఆట ఆడినట్టు ఆడాము. ఏం చేస్తాం... మా ఆవిడ గెలిచేసింది.

తప్పక గెస్ట్ బాత్రూం లో స్నానం చేశాను. బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్నాను.


ఒక రాత్రి వేళ, అరుణ బాల్కనీ లో ఉండి ఫోన్ చాటింగ్ చేస్తుంది. నేను నా ఫోన్ నుండి వాళ్ళ మెసేజెస్ చూస్తున్నాను.

ఇంటికి వెళ్ళావా! మిస్ అయ్యాను! లాంటి రొట్టతో పాటు నా గురించి కూడా మెసేజ్ చేసుకుంటూ ఉన్నారు.

.....  రాజు "మీ ఆయన... ఎలాంటి వాడు"

.....  అరుణ "అంటే.."

.....  రాజు "కోపిష్టి అనుకో దొరికినపుడు ఇద్దరినీ కొడతాడు. ప్రేమిస్టి అనుకో ఎందుకు ఇలా చేశావ్ అని ఏడుస్తూ కూర్చుంటాడు... ఈ రెండింటి లో ఎలాంటి వాడు"

.....  అరుణ "తెలియదు... ట్రై చేద్దామా..."

.....  రాజు "వద్దులే...."

ఇంతలో సుమతి నుండి ఫోన్ మెసేజ్ వచ్చింది. తను కూడా రాజు ఫోన్ ని డూప్లికేట్ చేసి వాళ్ళ కన్వర్జేషన్ చూస్తుంది.

సుమతి "అవును..... శేఖర్..... నువ్వు ఎలాంటి వాడివి..." అని మెసేజ్ చేసింది.

నేను ఆలోచిస్తున్నాను. నేను ఎలాంటి వాడిని..... నా ఆలోచనలు చాలా విషయాలు ఆలోచిస్తున్నాయి. కాని సమాధానం కోసం చూస్తున్నాను.

సుమతికి రిప్లై పెట్టాను.


.....  శేఖర్ "రేపు ఆదివారం... D day, నేను ఎలాంటి వాడినో నీకే తెలుస్తుంది"

.....  సుమతి "నాకు తెలుసు.... నువ్వు ఎలాంటి వాడివో..."

.....  శేఖర్ "ఎలాంటి వాడిని..."

.....  సుమతి "మంచిగా ఉన్న వాళ్లకు శేఖర్ వి..... మోసం చేస్తే శకునివి... స్కీమింగ్ మ్యాన్"

నా పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి, నేను రిప్లై పెట్టలేదు.

అలాగే పడుకున్నాను. 






...... శకుని ......

[Image: CLUTqb-MNgfimx-P8tq-ZAp9-Hl3w-L59k-W81-L...Kx0-SO.gif]

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#3

E2


నేను పొద్దున్నే నిద్ర లేవగానే నా ప్రియమైన అర్దాంగి. ఇంటి పనులు అన్ని చేస్తుంది, సారీ చేసినట్టు నటిస్తుంది. తన చేతులు కందిపోతాయ్ అంటూ నేను ఎంత మొత్తుకున్నా వినడం లేదు. నేను ఇంట్లో అన్ని పనులు చేసి వంట చేసి ఆఫీస్ కి వెళ్తాను. మొదట్లో కుక్ ని పెడదాం అని చెప్పా. వద్దు నా వంట బాగుంటుంది అని అబద్దం చెప్పేసింది. ఏంటో నా అర్దాంగికి అబద్దం చెప్పడం కూడా రావడం లేదు. నా అర్దాంగి పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేతి వెళ్ళు అరిగిపోయేలా ఫోన్ లో తన రంకు మొగుడికి చాటింగ్ చేస్తుంది. నేను సాయంత్రం వరకు ఆఫీస్ లో పని చేసి వస్తే, నేను ఇంటికి వచ్చే సరికి నా అర్ధాంగి గబా గబా పైకి లేచి ఎదో పని చేసేస్తూ ఉన్నట్టు నటించేస్తుంది. వద్దు బంగారం చేతులు కందిపోతాయ్ అంటే అసలు వినడం లేదు వినిపించుకోవడం లేదు. అప్పటికే నీటుగా ఉన్న టీవీని ఎదో పిచ్చి గుడ్డతో తుడిచి మట్టి చేసింది. అప్పటికే రెడీగా ఉన్న కూరలో ఉప్పు వేసింది. అలాగే ఇంట్లో అక్కడక్కడ తన పంది లాంటి చేతి వెళ్ళు సారీ.... నా అర్ధాంగి కోమలమైన చేతి వేళ్ళు గోడల మీద మరకలు పెడుతుంది. 

మొత్తానికి ఎదో పెద్ద పని చేసినట్టు నటించి ఆ చేతితో నుదురు మీద లేని చమట రుద్దుకుంటూ నా ముందుకు వచ్చి ఎదో బిజీగా ఉన్నట్టు నటిస్తుంది, పైగా విసుగ్గా కూడా నటిస్తుంది. నాకు అర్ధం అయి పోయింది, బ్రతిమలాడించుకొని ఆ తర్వాత ఈ రాత్రి నాతో దెంగించుకోవాలని అనుకుంటుంది. కాని సుమతికి ప్రేగ్నేన్సి వచ్చాక తన పుట్టింటికి వెళ్ళాక నా హార్మోన్స్ నన్ను తన్నేస్తున్నాయి. ఇవ్వాళ ఎలా అయినా నా అర్దాంగిని దెంగాలి అనిపిస్తుంది. కానీ ఏ వీళ్ళ అఫైర్ గురించి తెలియగానే నేను సుమతి ఇద్దరం వీళ్ళకు దూరంగా ఉన్నాము. పాడు మనుషులు ఏ రోగాలు ఉన్నాయో ఏంటో....

శేఖర్ "అర్దాంగి..."

అరుణ "చెప్పండి" అని విసుగుని మోహంలో చూపిస్తుంది.

శేఖర్ "నేను నీకో బాధాకరమైన విషయం చెప్పాలి"

అరుణ "ఏం చేశావు?" అని విసుగ్గానే అడిగింది.

శేఖర్ "ఆదివారం నుండి రెండూ రోజులు బిజినెస్ టూర్ ఉంది"

అరుణ "అయ్యో అవునా...." మాటలో కంగారు కనిపిస్తున్నా, ఆ కళ్ళలో సంతోషం కనిపిస్తుంది.

శేఖర్ "అవునూ" అని ముందుకు నడిచి ఆమెను హత్తుకున్నాను. అరుణ సంతోషించంది, ముద్దు పెట్టడం కోసం ప్రయత్నం చేసింది కాని నేనే అమాయకుడిని కదా తెలుసుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోయాను.

బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకున్నాను. కొద్ది సేపటికి మంచం మీద నుండి అరుణ పైకి లేచి బాల్కనీ లోకి వెళ్ళింది. 





తెల్లారి మెళుకువ వచ్చింది, ఆఫీస్ కి వెళ్తూ ఫోన్ లో మెసేజెస్ చూస్తున్నాను.

సుమతి "కాల్ చెయ్" అని మెసేజ్ చేసింది.

ఫోన్ చేశాను.

శేఖర్ "గుడ్ మార్నింగ్... గుడ్ మార్నింగ్... "

సుమతి "ఎందుకు రా... ఎప్పుడూ రెండో సార్లు చెబుతావ్..... రెండో పెళ్ళాం అవుతున్నా అని కదా...."

శేఖర్ "నీకు కూడా నేను రెండో మొగుణ్ణి అవుతాను కదా..."

సుమతి నవ్వింది.

సుమతి "ఇంతకీ, ఏం ప్లాన్ చేశావ్..."

శేఖర్ "దేని గురించి..."

సుమతి "మెసేజెస్ చదివేదా..."

శేఖర్ "చదువు...."


..... అరుణ "నేను అలిగాను, బుంగ మూతి పెట్టాను"

శేఖర్ "బుంగ మూతి కాదు అది, పంది మూతి"

సుమతి "మా ఆయన కళ్ళతో చూడు... ఎంత అందంగా ఉంటుందో నీ పెళ్ళాం..."

శేఖర్ చిన్నగా నవ్వాడు.

..... రాజు "నేను ఏం చేశాను, అయ్యో, నేను నా బంగారానికి ఏం చేశాను, కోపం ఎందుకు వచ్చింది"

..... అరుణ "నేను నీతో మాట్లాడను"

..... రాజు "చాటింగ్ చెయ్... మాట్లాడొద్దు లే..."

శేఖర్ "హ్యూమర్...."

సుమతి "నవ్వమంటావా...."

శేఖర్ నవ్వు విని, సుమతి కూడా నవ్వేసింది. తర్వాత ఇద్దరూ నవ్వుకున్నారు.

..... అరుణ "దొంగ.... అన్ని దొంగ తెలివితేటలు"

..... రాజు "బంగారం.... నీ అందంతో, నా తెలివి తేటలతో ఒక బిడ్డని కనవా.."

..... అరుణ "నీ పెళ్ళాం ఉంది కదా... నీకు కనిపెట్టడానికి..."

..... రాజు "దానికి విడాకులు ఇచ్చేస్తా...."

సుమతి "పిచ్చి నా మొగుడు... నిజం తెలిస్తే ఏమవుతాడో"

శేఖర్ ఆపుకోలేక నవ్వేశాడు.

..... అరుణ "అయితే... మా ఆయన రేపు ఆదివారం ఊరికి వెళ్తున్నాడు"

..... రాజు "నిజంగానా బంగారం, ఎంత గుడ్ న్యూస్ చెప్పావ్"

..... అరుణ "నీ కోసం బ్యూటి పార్లర్ కి వెళ్లి రెడీ అయి వస్తాను"

సుమతి "అసలు దీనికి వీడు ఎలా నచ్చాడు.... నాకు అర్ధం కాదు.... "

శేఖర్ "మా ఆవిడ పంది కళ్ళతో చూడు...."

..... రాజు "నా అరుణ బంగారం"

..... అరుణ "ఈ ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాను"

..... రాజు "నీ తలుపులు తెరిచి ఉంచు..."

..... అరుణ "అలాగే..."

..... రాజు "ఆతులు కూడా గీక్కొని రెడీగా ఉండు"

..... అరుణ "తప్పకుండా..."

..... రాజు "రేపు ఆఫీస్ కి వచ్చేటపుడు... ఎర్ర చీర కట్టుకొని రా...."

..... అరుణ "హహహా అలాగే... పైగా మా ఆయన కూడా ప్రేగ్నేన్సి అని ఎదురుచూస్తున్నాడు"

..... రాజు "అవునా అయితే ప్రెగ్నెంట్ చేసేస్తా"

సుమతి "ఛీ...."

శేఖర్ "అందులో ఏమి ఉంది.."

సుమతి "శేఖర్..."

శేఖర్ "హుమ్మ్"

సుమతి "మన పెళ్ళిళ్ళు అయ్యి సుమారు 2 సంవత్సరాలు అయింది కదా... అరుణ ప్రెగ్నెంట్ అవ్వలేదా..."

శేఖర్ "తోలి ప్రేమ.... ఎప్పుడైనా విన్నావా...."

సుమతి "పవన్ కళ్యాణ్ తొలిప్రేమ.... లేదా వరుణ్ తేజ్ తొలిప్రేమ...."

శేఖర్ "కాదు నీ మొగుడు, నా పెళ్ళాం తోలి ప్రేమ"

సుమతి "వాట్..."

శేఖర్ "మనిద్దరం అప్పట్లో ఫ్రెండ్స్, కాని వీళ్లు ఇద్దరూ ప్రేమికులు అంట.... గొడవ అయ్యి విడిపోయారు. మనల్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొదట్లో మా ఇద్దరి మధ్య బాగానే ఉండేది కాని పెళ్ళైన ఆరు నెలలకు మీరు ఈ ఊరికి ట్రాన్సఫర్ తిరిగి వచ్చారు. అరుణ జాబ్ చేస్తా అంటూ, మీ ఆయన పని చేసే చోటకు వచ్చింది. మాట్లాడుకున్నారు. ఇంటికి వచ్చి నాకు చెప్పకుండానే అబార్షన్ చేయించుకుంది" అన్నాడు.

సుమతి "సారీ...."

శేఖర్ "ఎందుకు సారీ..."

సుమతి "...."

శేఖర్ "నీ మొగుడు, రాజు హీరో, మా అర్దాంగి అరుణ హీరొయిన్.... వాళ్ళ అమూల్యమైన ప్రేమకి అడ్డం వచ్చినందుకు, నేను విలన్ ని.... నా పని అల్లా ఒక్కటే.... హీరో కబంద హస్తాలలో నలిగిపోయి, కుమిలిపోయి, రగాలిపోవడమే"

సుమతి నవ్వుతూ "మరి నేను...."

శేఖర్ "హేయ్... నువ్వు సైడ్ క్యారక్టర్ వి..."

సుమతి "సెకండ్ హీరొయిన్ ని కూడా కాదా"

శేఖర్ "హహ్హహ్హ"

రెండు నిముషాల తర్వాత.....

సుమతి "అంతా సరిగ్గా జరిగుతుంది కదా...." అని ఎమోషనల్ అయింది.

శేఖర్ "రేపు ఆదివారం నువ్వు కూడా రెడీ గా ఉండు..."

సుమతి "మాట ఇచ్చావ్.... నీ మీదే నమ్మకంతో ఉన్నాను..... జాగ్రత్త..."




శేఖర్ ఆఫీస్ కి వెళ్ళాక బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. వాష్ బేసిన్ దగ్గర ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటే, గతం ఒక్క సారిగా కళ్ళ ముందు మెదిలింది. 


రెస్టారెంట్....

శేఖర్ "అరుణ... అబార్షన్ ఎందుకు చేయించుకున్నావ్..." అతని చేతుల్లో కాగితం ఉంది, అతని కళ్ళలో చెమ్మ ఉంది. చేతులు చిన్నగా వణుకుతున్నాయి.

అరుణ "ఓహ్.... రిపోర్ట్ చూశావా..." అని మౌనంగా, కూల్ గా ఉంది.

శేఖర్ "మ్మ్" అన్నాడు సమాధానం వినాలని అనుకుంటూ ఉన్నట్టు.

అరుణ "అదేమీ లేదు శేఖర్.... నేను ప్రస్తుతం జాబ్ లో నిలదొక్కుకుంటూ ఉన్నాను"

శేఖర్ "కానీ, అబార్షన్ చేయించుకోవాలని ఎందుకు అనుకున్నావ్...." అని సీరియస్ గా అరిచాడు.

అరుణ "అయినా ఎందుకు శేఖర్ సీరియస్ అవుతావ్... నిన్ను కండోం వాడమంటే వాడడం లేదు.... నువ్వు ఎప్పుడు ఇంతే నన్ను అర్ధం చేసుకోకుండా... ఇదంతా నీ వల్లే" అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

చుట్టూ అందరూ తననే చూస్తున్నారు. 

శేఖర్ పైకి లేచి నడుచుకుంటూ రెస్టారెంట్ బయటకు వెళ్ళాడు. అరుణని ఓదార్చాలని లేదు. అస్సలు లేదు.

ఎటూ నడుస్తున్నాడో, ఎలా నడుస్తున్నాడో తనకే తెలియడం లేదు...




"సర్..... సర్..... సర్..... "  అంటూ పక్క నుండి ఒకరు పిలుస్తున్నారు.

వాష్ బేసిన్ కట్టేసి వెళ్లి తన చైర్ లో కూర్చొని ఆలోచిస్తున్నాను.

ఇంతలో ఫోన్ మోగింది. అరుణ వాళ్ళ నాన్న.....

చిన్నగా నవ్వాను.
 
శేఖర్ చెస్ట్ నిండా ఊపిరి తీసుకొని ఫోన్ ఎత్తి "మామయ్య గారు....." అని చాలా ఎక్సైటింగ్ గా అన్నాను.

మామయ్య "ఎలా ఉన్నావ్ శేఖర్..."

శేఖర్ " మీ దయ మామయ్య.... బాగున్నాను"

మామయ్య "ఇదిగో మీ అత్తయ్య మాట్లాడుతుంది"

అత్తయ్య "శేఖర్ బాగున్నావా అయ్యా...."

శేఖర్ "ఇంత అందమైన అరుణ ఉండగా, ఎందుకు బాగొను, చాలా బాగున్నాను" అన్నాను

అత్తయ్య "ఏదైనా గుడ్ న్యూస్ ఉందా...."

నాకు మాటలు రాలేదు. ఎంత నవ్వుతూ నటిస్తున్నా అబార్షన్ విషయం గుర్తుకు రాగానే గుండెల్లో నొప్పి వస్తుంది.

ఒక నిముషం మౌనం...

అత్తయ్య "శేఖర్..." అంది

శేఖర్ "ప్రతి న్యూస్ గుడ్ న్యూస్ అనుకోవడమే.... ఇవ్వాళ ఉప్మాలో నాకు జీడిపప్పు ఎక్కువ వచ్చాయి అది గుడ్ న్యూస్ కాదా..."

అత్తయ్య "హహ్హహ్హ... నువ్వు భలే నవ్విస్తావు... అల్లుడు"

శేఖర్ "అత్తయ్యా.... మామయ్య.... మీకో ముఖ్య విషయం చెప్పాలి.... లౌడ్ స్పీకర్ పెట్టండి"

మామయ్య "ఏంటి?"

శేఖర్ "రేపు ఆదివారం... మా ఇద్దరి యాన్యువల్ డే.... ఊరికి వెళ్తున్నా అని చెప్పా.... మనం అందరం వెళ్లి సర్పైజ్ చేసి సెలబ్రేట్ చేద్దాం" అన్నాను.

అత్తయ్య "మీ పెళ్లి రోజు కాదు కదా...." మా అత్తకు ఉన్న తెలివితేటలు కూడా నా అర్దాంగికి లేవు అని బాధ పడ్డాను. 

శేఖర్ "పెళ్లి చూపులు జరిగిన రోజు.... మొదటి సారి తనని చూసిన రోజు...." అప్పటికప్పుడు ఎదో అలా అలా అల్లెసాను.

అత్తయ్య "పెళ్లి చూపులు" అంటూ ఆలోచిస్తుంది.

శేఖర్ "వచ్చిన వాళ్ళు అందరికి షాపింగ్ వౌచర్ గిఫ్ట్ ఇస్తాను... 5000/-...... ఇప్పటికే మూడు లక్షలు రెడీ చేశాను"  అన్నాను. 

అత్తయ్య గొంతు లో సంతోషం వచ్చేసింది. 

అత్తయ్య "డబ్బులు ఏమి ఉంది లే అయ్యా..." వావ్ డబ్బు వాడే సరికి బ్రెయిన్ ని పని చేయడం ఆపేసింది.

శేఖర్ "లేదు అత్తయ్యా..... నేను నా అర్దాంగి.... జీవితంలో మరుపురాని బెస్ట్ సర్పైజ్ అండ్ సెలబ్రేషన్ ఇవ్వాలని అనుకుంటున్నాను" అన్నాను.

నా మాటల్లో ఫైర్ ని అర్ధం చేసుకున్న అత్త గారు "సరే బాబు" అన్నారు.

శేఖర్ "మీరు తనకు చెప్పకూడదు...." అని బలమైన రూల్ పెట్టాను.

అత్తయ్య "చెప్పను కానీ.... నువ్వు చాలా మంచి వాడివి శేఖర్..."

కాసేపు పోగిడించుకొని మా బావమరిదికి కూడా ఫోన్ చేశాను.

అతనితో కూడా పోగిడించుకున్నాను. తర్వాత బాగా గొడవ చేసే కొంత మంది మ్యూచువల్ లేడీ ఫ్రెండ్స్ ని కూడా జాయిన్ చేశాను.




D day వచ్చేసింది.

సుమారు ఇరవై మందిమి అయ్యాము. అత్తయ్య, మామయ్య, బావమరిది.... తన ఆఫీస్ ఫ్రెండ్స్... మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు... ఒక కెమెరా మ్యాన్, ఫోటోలు తీయడం కోసం..... ఒక కెమెరా మ్యాన్ వీడియో తీయడం కోసం... నాది కాదు మా బావమరిది ఐడియా.... నేను కాదనలేక పోయాను.

అందరిది ఒకే మాట "శేఖర్, ఎంత మంచి వాడు.... ఎంత మంచి వాడు...." 

ఇంకా తన ఆఫీస్ ఫ్రెండ్ అయితే సంతోషంలో ఎగిరేస్తుంది.

అందరూ రెడీగా ఉన్నారు.

ఫోన్ లో చెక్ చేశాను, మెసేజ్ ల ప్రకారం... అరుణ, రాజు బెడ్ రూమ్ లో తమ గేం స్టార్ట్ చేసేసారు.



రెడీ అన్నాను. అందరూ తమ తమ ఫోన్ లు ఆయుధాలుగా చేసుకొని చెక్ చేసుకొని రెడీ అన్నారు.

నేను ముందు కింగ్ లా, బాహుబలిలో ప్రభాస్ లా నడుస్తూ ఉంటే, నా వెనక సైన్యంలా ఎదో యుద్దానికి వెళ్తున్నట్టు నడుస్తున్నారు.

అందరం ఇంటికి వెళ్ళాము. 

డోర్ దగ్గరకు వెళ్లాను. తాళంతో ఓపెన్ చేస్తున్నాను. అందరూ రెడీ గా ఉన్నారు. 

డోర్ ఓపెన్ అయింది. నేను లోపలకు వెళ్లి ఆగగా.... నన్ను దాటుకొని తన ఆఫీస్ ఫ్రెండ్ మెయిన్ బెడ్ రూమ్ లోకి వెళ్లి సర్పైజ్ అని అరిచి సర్పైజ్ అయింది.

అందరూ ఒకరి తర్వాత మరొకరు గదిలోకి వెళ్ళారు. కాని ఎవరూ ఏమి మాట్లాడడం లేదు. మెడుసాని చూసి శిలలు అయిపోయినట్టు అందరూ శిలలు అయిపోయారు.

శేఖర్ "ఏమయింది?" అనుకుంటూ గది దగ్గరకు వెళ్తూ ఉంటే, మామయ్య నాకు ఎదురు వచ్చి "అల్లుడు.... కోపం తెచ్చుకోకు.... కూర్చొని మాట్లాడుకుందాం" అన్నాడు.

నేను షాక్ అవ్వలేదు. అరుణ రాజు ల అఫైర్ వీళ్ళకు ముందు నుండి తెలుసు అని నాకు ముందే తెలుసు...

నేను గదిలోకి వెళ్ళాను. బెడ్ పై ఒకే దుప్పటిలో మంచానికి చెరో వైపు అరుణ, రాజు ఉన్నారు. బట్టలు అన్ని నేల మీద పడేసి ఉన్నాయి.

అందరూ తలలు దించుకొని ఉన్నారు.

కెమెరా మ్యాన్ లు ఫోటోస్ తీస్తూ ఉన్నారు. కొంత మంది ఫోన్ లలో వీడియోస్ కూడా తీస్తున్నారు.

అందరూ సైలెంట్ గా ఉన్నారు. రాజు బయటకు పారిపోదాం అనుకున్నాడు కాని బెడ్ చుట్టూ మనుషులు అందరూ ఉన్నారు.

ఇద్దరూ నా వైపు గిల్టీగా చూస్తున్నారు. అరుణ ఒళ్లంతా చమటలు పట్టేసి ఒణికిపోతుంది.

నాకు వీళ్ళ ఇద్దరు నా గురించి చేసుకున్న కన్వర్సేషన్ గుర్తుకు వచ్చింది. 

నేను కోపిష్టిని అయితే ఇద్దరినీ ఇద్దరినీ కుక్కను కొట్టినట్టు కొడతాను.

నేను ప్రేమిస్టిని అయితే.... అరుణ చొక్కా పట్టుకొని  ఎందుకు ఎలా చేసావ్ అని ఏడుస్తాను. వెయిట్ ఎ మినిట్, తన చొక్కా కింద పడి ఉంది కదా... తన భుజాలు పట్టుకొని ఊపుతూ ఏడుస్తాను.

కాని సుమతి చెప్పినట్టు నేను ఇవేమీ కాదు.... నేను శకునిని... స్కీమింగ్ మ్యాన్ ని....

నడుచుకుంటూ వెళ్లి రాజు మొహం మీద రెండూ పంచ్ లు కొట్టాను. 

ఎవరూ నన్ను ఆపలేదు. 

రాజు గొంతు పట్టుకొని "నా అర్దాంగి ని రేప్ చేస్తావ్ రా..." అని అరిచాను.

అరుణ వైపు తిరిగి "అర్దాంగి...    అర్దాంగి...   నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా.... నాకు ఎందుకు చెప్పలేదు...." అని నటించాను.

రాజుని రేపిస్ట్ చేసేశాను. 

దెబ్బకు నా వెనకే మా మామయ్య, బావమరిది ఇద్దరూ అందుకున్నారు, రాజుని కొడుతున్నారు.

అందరూ కూడా ఒకటే మాట....  "శేఖర్, ఎంత మంచి వాడు.... ఎంత మంచి వాడు...." అని దండాలు పెట్టేశారు.

మా బావమరిది అయితే రాజుని దుప్పటితో సహా లాగుతున్నాడు. అరుణ బిత్తరపోయింది, ఇద్దరికీ కలిపి ఒకటే దుప్పటి ఉంది... దుప్పటి అంచు పట్టుకొని ఏడుస్తూ ఉంది.

మా బావమరిది, మొరటోడు రాజుని లాగే పనిలోనే ఉన్నాడు.  మా అత్తయ్య విషయం గుర్తించి మంచానికి రెండో వైపు వచ్చి దుప్పటి లాగుతుంది.

మధ్యలో నా అర్దాంగి ఉంటే, ఒక వైపు నా బావమరిది మరో వైపు నా అత్తయ్య ఇద్దరూ దుప్పటితో టగ్ ఆఫ్ వార్ ఆడుతున్నారు. 

కాసేపు బావమరిది గెలుస్తున్నాడు, కాసేపు అత్తయ్య గెలుస్తుంది. కాసేపు బావమరిది గెలుస్తున్నాడు, కాసేపు అత్తయ్య గెలుస్తుంది. 

ఇద్దరూ కలిసి నువ్వా నేనా అన్నట్టు సాగుతున్న ఈ యుద్ధంలో మొత్తానికి బావమరిది గెలిచాడు. అరుణ నగ్నంగా అందరికి కనపడింది.

నా వెనక ఎవరో వీడియో తీస్తున్నారు. సాటి సహోదరుడుగా నేను పక్కకు జరిగి క్లియర్ వ్యూ వచ్చేలా చేశాను.

రాజుని కొడుతున్నారు. రాజు కేకలు పెడుతున్నాడు. ఇంతలో డోర్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్స్ వచ్చేశారు.

నేను పరిగెత్తుకుంటూ వెళ్లి ఇన్స్పెక్టర్ చేతులు పట్టుకొని కళ్ళనీళ్ళతో "నేనే సర్ పిలిచింది.... నా భార్య రేప్ కి గురి అయింది" అన్నాను.

ఇన్స్పెక్టర్ నా భుజం తట్టి ముందుకు వెళ్ళాడు. ఇంతలో రాజు "రేప్ కాదు... రేప్ కాదు.... తనే నన్ను పిలిచింది...  అడగండి..." అంటున్నాడు.

బింగో.... 

అరుణ ఇప్పుడు ఒప్పుకుంటే.... ఇది సాక్ష్యంగా చూపించి విడాకులు వచ్చేస్తాయి.

అరుణ ఒప్పుకోక పోతే..... రాజు సాక్ష్యాలు బయట పెడతాడు... వాటితో విడాకులు వచ్చేస్తాయి.

అటూ తిప్పినా ఇటూ తిప్పినా నేను గెలిచేస్తాను....

ఇన్స్పెక్టర్, అరుణ ని అడిగాడు... 

అరుణ ఏడుస్తూనే రాజు గురించి "తెలుసు" అని సమాధానం ఇచ్చింది.

"నో...." అని అరుస్తూ.... ఇంటి బయటకు పరిగెత్తాను. నా వెనకే నా బావమరిది, మామయ్య వచ్చారు.

సరిగ్గా సందు చివర...... సుమతి కారులో నా కోసం ఎదురు చూస్తుంది.

డోర్ ఓపెన్ చేసుకొని లోపల కూర్చున్నాను. తను ఇచ్చిన టిష్యు తీసుకొని కళ్ళు తుడుచుకొని టిష్యు బయట పడేశాను.



నా ఫోన్ మోగుతుంది. స్విచ్ ఆఫ్ చేశాను.

సుమతి "సక్సెస్" అని అడిగింది.

శేఖర్ "గ్రాండ్ సక్సెస్" 

సుమతి "అయిపోయిందా!"

శేఖర్ "అప్పుడేనా!"

సుమతి "ఇంకా ఉందా!"

శేఖర్ చిన్నగా నవ్వి "మొదటి అధ్యాయం మాత్రమే ముగిసింది" అని సమాధానం ఇచ్చాను.




ఇద్దరం కలిసి వేరే ఊళ్ళో ఉండే ఫ్రెండ్ ఫార్మ్ హౌస్ కి వెళ్ళాము.

సుమతి "ఇప్పుడు ఏం ప్లాన్ చేద్దాం...."

శేఖర్ "నో ప్లానింగ్.... జస్ట్ సెక్స్...." అంటూ సుమతిని గోడకి అదిమి పెట్టి తన పెదవులపై ముద్దు పెట్టేశాను.

సుమతి "చిన్నగా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్" అంది.
నేను చిన్నగా నవ్వి స్లోగా ముద్దు పెడుతున్నాను.




















క్షమించండి.... ఈ స్టొరీకి ఎప్పటిలా విడమరిచి సెక్స్ సీన్ రాయదలుచుకోలేదు.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#4

E3 (స్మాల్ అప్డేట్)


సుమతి తిరిగి వెళ్ళడం కోసం బ్యాగ్ సర్దుకొని ఉంది. 

శేఖర్ "అంతా జాగ్రత్తగా సర్డుకున్నావా!"

సుమతి "హుమ్మ్" అంది, ఆమె కళ్ళలో చెమ్మ కనిపిస్తుంది.

నేను ఆమెను అలా చూడలేక, సుమతిని హత్తుకున్నాను.

శేఖర్ "ఎందుకు ఏడుస్తావు... ఇప్పుడు ఏమయింది?"

సుమతి "వాళ్ళను పట్టించాము కదా... ఇంకా అయిపోలేదు అంటావు ఏంటి?" అంటూ నా భుజం మీద మొహం పెట్టి ఏడుస్తుంది.

నేను సుమతిని కొద్ది సేపు ఓదార్చి ముద్దులు హాగ్ లు యిచ్చి, ఆమె పొట్ట మీద చేయి వేసి "మన బిడ్డ బయట ప్రపంచం చూసే లోపు వాడి బర్త్ సర్టిఫికేట్ లో నా పేరు వస్తుంది. ముందుగా నా విడాకులు, తర్వాత నీవి... తర్వాత అందరిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను ఆలిగా మన బిడ్డకి తండ్రిగా కొత్త జీవితం సాగిస్తాను"

సుమతి గట్టిగా హత్తుకొని "ఇంకో రెండూ రోజులు ఆగి వెళ్ళకూడదు.... నాకు నిన్ను వదిలి ఉండాలని లేదు" అంది.

శేఖర్ "అవకాశం, టైమింగ్, మార్కెటింగ్ అన్నింటికీ మించి సరైనా ప్లానింగ్ తో ఇన్ని రోజులు లాక్కోచ్చాం... ఇంకెంత ఇంకొన్నిరోజులు ఓపిక పట్టు.... నేను చూసుకుంటాను" అన్నాను.

ఇంతలో సుమతి ఫోన్ మోగింది. రాజు కాలింగ్.....

సుమతి ఫోన్ వైపు కోపంగా చూస్తూ "నాకు ఈ ఫోన్ ఎత్తాలనే లేదు..."

శేఖర్ "ఫోన్ ఎత్తి మాములుగా, ప్రేమగా మాట్లాడు... బయట విషయం నీకు తెలియదు అన్నట్టు ఉండు..."

సుమతి "సరే..."

శేఖర్ నవ్వుతు సుమతి ఫోన్ లిఫ్ట్ చేశాడు.

రాజు కేవలం సుమతికి ఎలా ఉంది, తనకేమైనా విషయం తెలుసా అనే దాని కోసం ఎంక్వయిరీ ఫోన్ చేశాడు.

సుమతి బాగానే ఉంది, హాస్పిటల్ లో చూపించుకుంటున్నా... బిడ్డని కన్నాక వస్తా అని చెప్పింది.

రాజు బాధ నటిస్తూ "సరే... సరే..." అని చెప్పాడు.


సుమతి కోపంగా "వీడు ఇంకా చూడు... ఎలా నటిస్తూన్నాడో..." అని పళ్ళు నూరింది.

శేఖర్ "నువ్వు రిలాక్స్ గా ఇంటికి వెళ్ళు.... నేను రెండో అధ్యాయం మొదలు పెడతాను"

సుమతి ముద్దు పెట్టి బయటకు వెళ్లి కారులో వాళ్ళ ఇంటికి (పుట్టింటికి) వెళ్ళింది.

శేఖర్ భారంగా శ్వాస తీసుకొని ఇంట్లోకి వచ్చాడు. 

వాష్ బేసిన్ లో ఫేస్ వాష్ చేసుకుంటూ అద్దంలో చూస్తూ "రాజు అండ్ అరుణ ........ గెట్ రెడీ ఫర్ రౌండ్ టూ...."










-

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#5

E4



D day అయిపోయి నాలుగు రోజులు గడిచింది. 

ఇవ్వాళ పొద్దున్నే సుమతిని ఇంటికి పంపించాను. 

అద్దంలో చుసుకోగా... నా మొహం గడ్డం పెరిగిపోయి (షేవింగ్ చేసుకోక) కళ్ళు రెండూ ఎర్రగా అయిపోయాయి. మొహం పీక్కొని పోయింది. రాత్రిళ్ళు నిద్రలేదని స్పష్టంగా తెలుస్తుంది.

ఫోన్ ఆన్ చేసి బయట ప్రపంచం ఎలా ఉందొ ఒక సారి చూసుకుంటూ ఉన్నాను.

మొదటగా మా పేరెంట్స్ "ఇలాంటి అమ్మాయి అని అసలు అనుకోలేదు... రేయ్ శేఖర్ ఎక్కడ ఉన్నావ్ రా... పిచ్చి పని ఏమి చేసుకోకు..." అని మెసేజ్ పంపారు.

ఆల్మోస్ట్ అదే ఎమోషన్ తో అరుణ వాళ్ళ పేరెంట్స్ కూడా పంపారు.

ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ మెసేజెస్ మిస్స్డ్ కాల్స్ పంపారు. కొందరు అయితే విడాకులు ఇచ్చేసేయ్... మాకు తెలిసిన మంచి అమ్మాయి ఉందని సజెస్ట్ చేస్తున్నారు.

అద్దంలో చూసుకొని వరస్ట్ గా రెడీ అయ్యాను. ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళినపుడు వేసుకొన్న చొక్కా, ప్యాంట్ వేసుకొని రెడీ అయ్యాను.

ఫోన్ మెసేజెస్, అన్ని అయిపోయాక లోకల్ న్యూస్ చూశాను. నా పేరు మార్చి ఫేస్ మార్ఫ్ చేసి "మగాళ్ళు ఎందుకు పెళ్లికి ఎందుకు జడుస్తున్నారు" అనే టాపిక్ లో పెట్టారు.

కొంత మంది యుట్యూబర్లు ఒకటే పనిగా విషయాన్ని పబ్లిక్ చేస్తున్నారు. రెండూ రాష్ట్రాలలో ప్రస్తుతం నా గురించి మంచి ఫైర్ గా నడుస్తుంది.



నా ఫ్రెండ్ కి ఫోన్ చేసి అక్కడ పరిస్థితి ఏంటి? అని కనుక్కున్నాను.

మొదటి రోజు.....

నా ఇంటికి మా అమ్మ వాళ్ళు వచ్చి ఇంట్లో అందరిని బయటకు పంపారు అంట. 

మా బావమరిది వెళ్తూ వెళ్తూ అయిదు వేలు అని అడిగాడు అంట.. మా అమ్మ చెప్పు తీసుకొని సందు చివరిదాకా వెంట పడింది అంట. దొరక్కపోయే సరికి చెప్పు విసిరేసింది అంట. చెప్పు మళ్ళి దొరకలేదు, పాపం...

అప్పట్లో వద్దు ఈ అమ్మాయి వద్దు, ఎవర్నో ప్రేమించింది అని చెప్పుకుంటున్నారు అని చెప్పినా అందంగా ఉంది, కట్నం ఇస్తున్నారు అని ఒప్పించింది. 

పైగా నన్ను సుమతిని అనుమానించింది. సుమతి నేను అప్పటికి మంచి ఫ్రెండ్స్ మాత్రమే. మాకు అటువంటి అభిప్రాయం లేదు.



రెండో రోజు......

నా అర్దాంగి పుట్టింటి దగ్గర చుట్టూ పక్కల అందరూ వాళ్ళను అవమానించి మాట్లాడుతున్నారు. ఇంట్లో నుండి బయటకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇక మా బావమరిదికి పెళ్లి అయినట్టే.




మూడో రోజు......

లోకల్ న్యూస్ లో, కొంత మంది యుట్యూబర్లు ఈ విషయాన్ని పబ్లిక్ చేసేస్తున్నారు.సోషల్ మీడియా కోడై కూస్తుంది.

రాజు తన కంపనీ నుండి అరుణని ఉద్యోగంలో నుండి తీసేస్తున్నట్టు ప్రకటించాడు. రాజు పేరు బయటకు రాకుండా మనోడు జాగ్రత్తలు తీసుకున్నాడు లేండి.





నాల్గోవ రోజు......

రాజు తన డబ్బుతో విషయం ఎక్కువ చలామణి అవ్వకుండా చర్యలు తీసుకున్నాడు. పైగా అరుణ ఎక్కడ బయట పెడుతుంది అని భయపడి.. అరుణతో స్మూత్ గా చాట్ చేస్తున్నాడు.

సుమతి కి విషయం తెలియదు అని నమ్మకం వచ్చాక, అరుణతో మళ్ళి రంకు చాటింగ్ మొదలు పెట్టాడు.







సరిగ్గా ఇప్పుడు నా ఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అద్దంలో నాకు నేనే చండాలంగా ఉన్నాను.

ఇంతలో ఫోన్ మోగింది...

ఫోన్ ఎత్తి ప్రపంచంలో ఉన్న దిగులు అంతా గొంతులో పలికిస్తూ "హలో" అన్నాను.

కాబోయే ఎక్స్  మామయ్య "హమయ్య అల్లుడు" అన్నాడు. ఎదో కొత్త గ్రహం కనుక్కున్న నాసా సైంటిస్ట్ లా సంతోష పడ్డాడు.

నేను కూడా.... ఎమోషన్ పలికిస్తూ, శేఖర్ "మామయ్యా" అన్నాను.

కాబోయే ఎక్స్ మామయ్య కన్నీళ్ళు పెట్టుకొని ఎమోషన్ అయి పోయి "అల్లుడు" అన్నాడు.

నేను కూడా "మామయ్యా" అన్నాను.

ఎదో సినిమాలో బాలక్రిష చిన్న పాప మామయ్య అని పిలుస్తే ఏది ఇంకొక్క సారి పిలువమ్మా అని మళ్ళి మళ్ళి పిలిపించుకుంటాడు అలా నాలుగు సార్లు నాచేత ఫోన్ లో "మామయ్య" అని పిలిపించుకున్నాడు.

శేఖర్ "నేను మీ ఇంటికి వస్తున్నాను మామయ్యా, నేను నా అర్దాంగితో మాట్లాడాలి" అని సున్నితంగా మాట్లాడాను.

కాబోయే ఎక్స్ మామయ్య "వెరీ గుడ్ అల్లుడు... ఇక్కడకు రా..." అన్నాడు.

మా ఇంటికి కూడా ఫోన్ చేసి అరుణ వాళ్ళ ఇంటి దగ్గరకు రమ్మని చెప్పి బయలు దేరాను.

బయటకు రాగానే సుమతి నవ్వుతూ ఎదురు వచ్చింది, పైగా ఫోన్ లో ఫోటో తీసి నవ్వుతుంది.

సుమతి "నాకు తెలుసు రా.... నువ్వు ఇలాంటి ప్లాన్ ఎదో వేస్తావు అందుకే నన్ను ముందు పంపించావు" అని మళ్ళి నవ్వుతుంది.

శేఖర్ "నువ్వు వెళ్ళు... నేను బస్ లో వెళ్తా..."

సుమతి "ఈ అవతారంలో నిన్ను ఎవరూ బస్ ఎక్కించుకోరు కాని కారు ఎక్కు" అని నా చేయి పట్టుకొని లాక్కొచ్చి కారు ఎక్కించింది. పైగా బలహీనంగా కనపడాలని రెండూ రోజుల నుండి సారిగా తినలేదు

శేఖర్ "నన్ను చూస్తే నీకు వాంతు రావడం లేదా... ఈ మూడు రోజులు తెగ వాంతులు చేసుకున్నావ్ కదా" అన్నాను.

సుమతి "తెలియదు.... కాని నవ్వొచ్చింది" అంటూ నవ్వుతుంది.

కారు పొలిమేర దగ్గర ఆగింది. చుట్టూ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని కారు దిగి "బాయ్" చెప్పి  పంపించేశాను.

అప్పటి వరకు నవ్వుతున్నా నా మొహాన్ని జాలిగా బాధగా మార్చేసి నడుచుకుంటూ అరుణ ఉండే ఊళ్లోకి వెళ్లాను.

ఫోన్ చేస్తే మా కాబోయే ఎక్స్ బావమరిది వచ్చి బండి మీద తీసుకొని వెళ్ళాడు. మా కాబోయే ఎక్స్ బావమరిది మొహానికి మాస్క్ పెట్టుకొని ఎదో మాఫీలో ఉన్న సెలబ్రేటిలా రెడీ అయి వచ్చాడు. 

బండి మీదకు ఇంటికి వెళ్ళాము.

మా అమ్మ వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదు. గొడవ గొడవగా ఉంది.

నేను నా అరుణతో మాట్లాడాలి అన్నాను.

అవునూ... అవునూ... అల్లుడు మంచి వాడు... పిల్లలు పిల్లలు మాట్లాడుకుంటారు... అని చెప్పి తన గదిలోకి పంపాడు.





గదిలో ముడుచుకొని ఒక పక్కకి పడుకొని తెరిచిన కిటికీ నుండి బయటకు చూస్తూ ఉంది. ఆమె మొహం ఎప్పటిలా అందంగా కాకుండా పాలిపోయి ఉంది, పెదాలు ఎండిపోయి ఉంది. నేను గదిలోకి రావడం చూసి మెల్లగా పైకి లేచి నా కళ్ళలోకి చూడలేక తల దించుకుంది.

అరుణ గురించి నాకు బాగా తెలుసు.... తనని కార్నర్ చేస్తే ఏడుస్తుంది. అలా కాకుండా రేచ్చగోట్టాలి.... మాములుగా అయినా నాకు విడాకులు వస్తాయి కాని అసలు విషయం అది కాదు, నాకు త్వరగా కావాలి. సుమతి విషయం తెలియక ముందే నాకు విడాకులు వచ్చేయాలి.

నేను వెళ్లి ఎదురుగా కూర్చున్నాను.

ఇద్దరం ఎవరూ మాట్లాడుకోలేదు.

ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతుంది.

శేఖర్ "అర్దాంగి" అన్నాను.

అరుణ గట్టిగా కళ్ళు మూసి తెరిచింది, ఆ మాట తనకు ఇష్టం లేదు అని అర్ధం అయింది.

అందుకే మళ్ళి, శేఖర్ "అర్దాంగి, ఇప్పుడు ఏం చేద్దాం?" అన్నాను.

అరుణ కోపంగా నా వైపు చూస్తూ "నాకు నువ్వు ఇష్టం లేదు... అర్ధం అవ్వడం లేదా" అని కోపంగా చెప్పింది.

శేఖర్ "మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్...."

అరుణ కళ్ళు మూసి తెరిచింది.

శేఖర్ "నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావ్...." అన్నాను.

అరుణ "నాకు ఇష్టం లేదు..." అని అరిచింది.

శేఖర్ "ఇష్టం ఉన్నా లేక పోయినా నువ్వు నా పెళ్లానివి" అన్నాను.

అరుణ కోపంగా నన్ను తిడుతూ "విడాకులు ఇచ్చేస్తాను" అంది.

నేను ఇక ఏం మాట్లాడుతున్నా అరుణ చెవులు రెండూ చేతులతో మూసుకొని "విడాకులు.... విడాకులు.... "  అని అరుస్తూనే ఉంది.

అరుణ వాళ్ళ అమ్మ గదిలోకి వచ్చి అరుణ జుట్టు పట్టుకొని బూతులు తిడుతూ కొడుతుంది.

మా పేరెంట్స్ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళబోతూ ఉంటే, నేను వెనక్కి వెళ్లి అరుణ దగ్గరకు వెళ్లి సైకో లాగా "నువ్వు నా పెళ్లానివి, నా అర్దాంగివి" అన్నాను.

అరుణ కళ్ళలో అప్పటి వరకు నా మీద ఉన్న చులకన భావం ప్లేస్ లో సైకో నెమో అన్న భయం వేసింది.

వాళ్ళ ఇంటి ముందు గొడవ చేశాను, చుట్టూ పక్కల అందరూ వాళ్ళను చూశారు. రాత్రికి రాత్రి అరుణ ఇంటి నుండి పారిపోయింది.




నేను అనుకున్నట్టుగానే రెండు రోజుల్లోనే లాయర్ నుండి పిలుపు వచ్చింది. అరుణ భరణం వద్దు ఏమి వద్దు అసలు నాతో కాంటాక్ట్ వద్దు... అంటూ విడాకుల కాగితాల మీద సంతకం చేయించింది. నేను లాయర్ ముందు కూడా ఏడుపు మొహం పెట్టాను. 

మా పేరెంట్స్ ఇద్దరూ నన్ను చూసి మొదట షాక్ అయ్యారు. మా అమ్మ మాత్రం నేను నటిస్తున్నా అని పసిగట్టేసింది. కానీ అరుణతో విడాకులు తనకు కూడా ఇష్టం కాబట్టి ఊరుకుంది. 

సుమతితో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాను. 

సుమతి ఇంట్లో అరుణ కలిసి ఉంటుంది అని తెలిసింది. వాడి దరిద్రం ఏంటి అంటే... ఆ ఇల్లు సుమతి పేరు మీద ఉంది.

విడాకులు ప్రాసెస్ అయ్యి సాంక్షన్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది. 

సుమతికి అయిదో నెల వచ్చేసింది.

సుమతిని కలిశాను.

రాజు - అరుణ ఒకే ఇంట్లో ఉంటున్నారు. 

రాజు అప్పుడప్పుడు సుమతికి ఫోన్ చేసి విషయం ఏమయినా తెలుసా అని ఆలోచిస్తున్నాడు.

సుమతి "నీ విడాకులు అయిపోయాయి, నెక్స్ట్ నావి... నీలాగా... పిచ్చి దానిలా నేను చేయలేను" అంది.

శేఖర్ "నీ కోసం వేరే ప్లాన్ ఉంది" అంటూ చెవిలో చెప్పాను.

సుమతి "ఇదే నాకు కావలసింది" అంటూ పెద్దగా నవ్వింది.

నలుగురు బాడీ బిల్డర్స్ ని తీసుకొని రాజు-అరుణ ఇంటికి వచ్చాము.

శేఖర్ "ముందు నేను వెళ్లి సిగ్నల్ ఇస్తాను, తర్వాత నీ వంతు" అన్నాను.

సుమతి చీర బొడ్లో దోపుకొని రాజుని చీల్చి చండాడాలి అన్నట్టు రెడీ అయింది.

నేను రాజు ఇంటికి వెళ్లి తలుపు కొట్టాను.

అరుణ వచ్చి తలుపు తీసింది. నేను తలుపు మూయకుండా, సందులో కాలు పెట్టి "అర్దాంగి... ఇక్కడున్నావా..." అన్నాను.

సుమతి "మూడో స్టేజ్ స్టార్ట్ అయింది" అంది.





















All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#6

ఆఖరి ఎపిసోడ్ రేపు సోమవారం....

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#7

E5 - ద ఎండ్



రాజు "ఎందుకని ఎప్పుడూ విడాకులు... విడాకులు... అంటావ్.... ఇలా బాగానే ఉంది కదా..."

అరుణ ఒక్క సారిగా స్టన్ అయింది కాని కవర్ చేసుకుంటూ రాజుని చుట్టేసుకొని "అలా అనకు..." అంటూ ఏడుపు మొహం పెట్టింది. 

రాజు కరిగిపోయి "సరే ఏడవకు.... అయినా ఎందుకు విడాకులు అని పట్టు బట్టావ్... శేఖర్ పెద్ద పనికిరాని వాడు... నిజం తెలిసినా ఏమి అనడు అన్నావ్ కదా....."

అరుణ "నీకు అసలు తెలియదు.... నేను ఎంత నరకం అనుభావించానో... శేఖర్ ఒక సైకో లాగా నా వెంట పడ్డాడు.... నిద్ర లేకుండా చేశాడు.... రాత్రిళ్ళు పీడకలలు వచ్చాయి.... ఎవరూ నన్ను అర్ధం చేసుకున్న వాళ్ళు లేరు...." అంటూ రాజుని చుట్టుకుపోయింది.

రాజు "భయపడకు.... నేను ఉన్నాను" అంటూ హీరో లాగా ఫీల్ అవుతూ ఆమెను హత్తుకున్నాడు.

ఇద్దరూ మంచం మీద కొద్ది సేపు ఆడుకొని బాత్రూంలోకి వెళ్లారు. 

కొద్ది సేపు తర్వాత....

టక్... టక్... టక్... డోర్ మోగింది. 

రాజు లోపల ఉండి, "పార్సిల్ వచ్చి ఉంటంది వెళ్లి తలుపు తియ్..." అన్నాడు.

అరుణ "ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు...." అంటూ పాట పాడుకుంటూ వచ్చి తలుపు తీసింది. 

ఎదురుగా శేఖర్ "అర్దాంగి" అని పిలవగానే, ఒంట్లో రక్తం అంతా ఒక్క సారిగా ఆవిరి అయిపోయినట్టు నిశ్చష్టురాలు అయింది. 

అరుణ తలుపు వేసే ముందే, నేను తలుపుకి కాలు అడ్డం పెట్టాను. 

అరుణ ఎంత ప్రయత్నించినా తలపు పడక పోయే సరికి, కోపంగా "శేఖర్.... ఇక్కడ నుండి వెళ్ళు" అని అరిచింది. 

శేఖర్ "అర్దాంగి.... అర్దాంగి.... ఎందుకు నన్ను వదిలేసావ్.... వీడు నీకేమైనా మందు పెట్టాడా.... అర్దాంగి" అని కేకలు పెట్టాడు.

అరుణ ఏమి చేయలేక వదిలే సమయంలో శేఖర్ తలుపు తెరుచుకొని లోపలకు వచ్చి అరుణ చేయి పట్టుకొని బయటకు లాగాడు.

లోపల నుండి రాజు అప్పుడే స్నానం చేయడంతో టవల్ మీదనే బయటకు వచ్చాడు. అంతని వంటి మీద నీటి చుక్కలు అలానే ఉన్నాయి.

చుట్టూ పక్కల అపార్టమేంట్ వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు.

శేఖర్ "అరుణ..... కొట్టుకున్నా, తిట్టుకున్నా మనం మొగుడు పెళ్ళాలం... అలా అని నీ బాస్ ఇంటికి వచ్చి ఉంటావా!" అని అరిచాడు.

అప్పటికే చుట్టుపక్కల జనాభా గుంపు కాస్త పెరిగింది. కొంత మందిని నేను ఏర్పాటు చేశాను లేండి.

రాజు బయటకు పరుగున వచ్చి నన్ను తోసేశాడు. అలాగే అరుణని తన వెనకకు తీసుకున్నాడు.

నేను హిందీ సీరియల్ లో హీరొయిన్ లాగా గిరా గిరా మూడు రౌండ్స్ తిరిగి కింద పడి తమటా కెచ్ అప్ ని నోటి నుండి ఊసి రక్తం అన్నట్టు బిల్డ్ అప్ ఇచ్చాను.

అరుణ నా వైపు అసహ్యంగా చూసింది. జనరల్ గా హీరో పక్కన ఉంటే, విలన్ అలానే కనిపిస్తాడు, అదే ఎవరూ లేకపోతే భయపడుతుంది. తరతరాల హీరొయిన్ ల సంప్రదాయాన్ని ఫాలో అవుతుంది.

నేను పైకి లేచి నా ఫోన్ లో అరుణకి నాకు పెళ్లి అయిన ఫోటోలు, కలిసి దిగిన ఫోటోలు వీడియోలు తీసి చూపించి "అయ్యా.... అయ్యా.... నా అర్దాంగి ని వీడు మాయ చేసి తనతో ఉంచుకున్నాడు" అన్నాను.

అరుణ భయం భయంగా రాజు వెనక దాక్కుంది. రాజు తన వెనక ఆమెను దాస్తూ ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నట్టు ఉన్నాడు.

ఇంతలో గుంపులో నుండి ఒక మగతను "ఏమయ్యా.... సిగ్గు లేదా.... నీకూ.... వేరే వాళ్ళ పెళ్ళాలను ఇంటికి తెచ్చుకుంటున్నావ్" అన్నారు

ఒక ఆడ మనిషి "ఏమ్మా.... నీకు సిగ్గు లేదా..." అంది.

అరుణకి సడన్ గా ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఈ ఐడియా నేను కూడా ఊహించలేదు. 

అరుణ "ఇతను ఎవరో నాకు తెలియదు, అవన్నీ.... ఫోటోషాప్ చేసి ఉంటాడు..." అంది.

ఒక్క సారిగా నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపొయింది. దూరంగా ఉన్న సుమతి నా మొహం చూసి నవ్వుతుంది.

అరుణ "ఇతను నా భర్త..." అంటూ రాజు పక్కకు వెళ్ళింది. 

నేను పైకి లేచి "మీ ఇద్దరూ భార్యాభర్తలా" అన్నాను.

రాజు "అవునూ" అంటూ అందరి ముందు అరుణని హాగ్ చేసుకున్నాడు.

శేఖర్ "అయితే ఫోటోలు చూపించు" అన్నాను.

ఇద్దరూ ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు.

శేఖర్ "లేవు కదా... ఉండవు... సవ్యంగా కాపురం చేసే వాళ్ళు అయితేనే కదా.... అక్రమ సంబంధం" అని పెద్దగా అరిచాను.

రాజు ముందుకు వచ్చి నా కళ్ళలోకి చూస్తూ అరుణనిసైడ్ నుండి హాగ్ చేసుకొని "మేమిద్దరం భార్యాభర్తలం.... అడ్డం అయిన వాళ్లకు ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు" అన్నాడు.

చుట్టూ ఉన్న అందరూ కూడా సైలెంట్ అవ్వడంతో వాళ్లకు సపోర్ట్ అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి.

అరుణ నా వైపు కన్నింగ్ గా చూస్తూ నవ్వింది.

ఏది ఏమయినా హీరో గెలుస్తాడు. విలన్ అయిన నేను ఓడిపోతాను. కాని శుభం పడకముందే వెనక నుండి సుమతి వాయిస్ వినపడింది




సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ సుమతి వాయిస్ "మరి నేనవరిని" అని వినపడింది.

రాజు వెనక్కు తిరగక ముందే సుమతి వెనకే ఉంది అని అర్ధం అయి అరుణని పక్కకు తోసేసి వెనక్కి తిరిగి "సుమతి" అన్నాడు.

సుమతి చేతులు కట్టుకొని నిలబడి "ఇల్లు నాది, నా పేరు మీద ఉంది. నువ్వు పని చేసే జాబు మా నాన్న ఇప్పించాడు. నీ ఒంటి మీద ఉన్న తుండు గుడ్డ కూడా నా డబ్బుతో కొన్నావు. నేను పుట్టింటికి వెళ్తే.... ఇప్పుడు వేరే ఎవరి పెళ్లాన్నో తెచ్చుకొని నీ పెళ్ళాం అంటున్నావ్...." అంది.

ఈ సారి కూడా రాజు ఒంటి మీద నీటి చుక్కలు ఉన్నాయి కాని అవి నీటి చుక్కలు కాదు చమట చుక్కలు.

రాజు ముందుకు నడిచి వస్తూ "బంగారం.... అదీ..." అంటూ వచ్చాడు.

సుమతి కాలు ఎత్తి వాడి బాల్స్ మీద కొట్టింది. రాజు గొంతు యొక్క పెద్ద ఆర్తనాదం అక్కడ ఉన్న గాలిలో ప్రతిధ్వనించింది. దెబ్బకు కరెంట్ తీగ మీద వాలిన పక్షులు అన్ని ఎగిరిపోయాయి.

ఎదో బాల్ పగిలిన సౌండ్ కూడా వచ్చింది. అక్కడ ఉన్న మగాళ్ళు అందరూ అప్రయత్నంగా "స్స్" అంటూ రెండూ తొడలు దగ్గరకు పెట్టుకున్నాము. 

రాజు మొహం అంతా చిత్రవిచిత్రంగా మార్చి రెండూ కాళ్ళు దగ్గరకు పెట్టుకొని నేల మీదకు ఒరిగిపోయాడు.

అరుణ "రాజు" అంటూ రాజు పక్కనే నేల మీద కూర్చొని రెండూ తొడలు పెట్టుకొని ఓపెన్ చేసింది. దెబ్బకు మనోడు గిలగిల లాడిపోయాడు.

నేను ఆశ్చర్యంగా సుమతి వైపు చూస్తూ ఉన్నాను, ఎప్పుడూ అమాయకంగా కనిపించే సుమతి ఇలా ఉండగలదు అని నేను అసలు అనుకోలేదు.

సుమతి నా కళ్ళలోకి చూడడం లేదు. ఇంకా రాజు వైపే కోపంగా చూస్తూ ఉంది. 




కొన్ని రోజుల క్రితం యిద్దరం కాలేజ్ గెట్ టూ గెదర్ ఫన్షన్ లో కలిశాం.  నాతో మాట్లాడాలి అని పిలిచింది. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.... సుమతి తల్లిదండ్రులు కూడా నన్ను బాగా అభిమానిస్తారు. తన భర్త రాజు పిల్లలను కనలేడని కండీషన్ చెప్పి సహాయం చేయమని అడిగింది. పైగా ఈ విషయం వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు సుమతి తల్లిదండ్రులు కూడా సుమతి వైపు నిలబడ్డారు. ఆ నెల రోజులు తన కోసం జిమ్ చేస్తూ జాగింగ్ చేస్తూ నా ఫుల్ బాడీ ఫిట్ గా ఉంచుకున్నాను. అలాగే తన కోసం స్పెర్ం డొనేట్ చేశాను. ఆ తర్వాత తను ప్రెగ్నెంట్ అని తెలిసి సంతోష పడ్డాను. అరుణ అబార్షన్ చేయించుకున్నా నా బిడ్డ మరో చోట పెరుగుతుంది అని సంతోషపడ్డాను.

అప్పటికి మా ఇద్దరి బిడ్ద తన కడుపులో ఆరవ వారం. అయితే రాజు మరియు అరుణల మధ్య అఫైర్ మా జీవితాలని తలకిందులు చేసింది. నేను విడాకులు తీసుకుంటా అని చెప్పాను, కాని సుమతి మాత్రం ఏడుస్తూ సూ సైడ్ అటెంప్ట్ చేసుకోబోయింది. అప్పుడే తనకు మాట ఇచ్చాను. 

ఆమె రాజుని చాలా ఇష్టపడింది, నా వరకు అరుణ ఆన్ ఆఫ్ లాగానే అనిపించేది. ఎప్పుడూ అంత బాండ్ మా మధ్య పెరగలేదు. పైగా అబార్షన్ ఇన్సిడెంట్ నాలో అరుణ పట్ల ఒక రకమైన ద్వేషం పెంచింది.

సుమతి "నేను చచ్చిపోతాను" అంటూ ఏడుస్తుంది. 

వాళ్ళ అమ్మానాన్న కూడా బాధ పడుతున్నారు. వాళ్ళ నాన్న అయితే మనుషులను పెట్టి కొట్టిస్తా అన్నాడు.

యిద్దరం మా మా పార్టనర్స్ తో బాగా ఉండి వాళ్ళను క్షమించాలని అనుకున్నాము.

కాని ఇద్దరూ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు ఆపలేదు.

సుమతి పుట్టింటికి ఏడుస్తూ వెళ్ళింది. సుమతి వాళ్ళ నాన్న నన్ను పిలిచి విషయం చెప్పాడు. మీ ఇద్దరూ విడాకులు ఇచ్చేసి పెళ్లి చేసుకోండి అని సలహా ఇచ్చారు.

సుమతి మాత్రం తల అడ్డంగా ఊపుతూ "వాళ్ళను వదలకూడదు" అని కోపంగా అంది. ఆమె పడ్డ బాధ అటువంటిది.

సుమతి వాళ్ళ అమ్మ "నువ్వు ప్రస్తుతం కడుపుతో ఉన్నావు... ఎలాంటి పిచ్చి పనులు చేయకు..." అని చెప్పింది.

సుమతి వాళ్ళ అమ్మ మా ఇద్దరినీ మాట్లాడుకొమ్మని పక్కకు వెళ్ళింది. సుమతి బాగా డిప్రేస్ గా కనపడింది.

శేఖర్ "బిడ్డ బయటకు వచ్చే లోపు.... ముందుగా నా విడాకులు, తర్వాత నీ విడాకులు.... మన పెళ్లి అవుతాయి" అన్నాను.

సుమతి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది.

శేఖర్ "చెప్పూ" అన్నాను.

సుమతి "ఎలా సాధ్యం...."

శేఖర్ "నా మరో పేరు శకుని.... నన్ను ఆపాలి అంటే దేవుడు మరో జన్మ ఎత్తాలి" అన్నాను.

సుమతి నా చేయి పట్టుకొని తల ఊపింది.

అప్పటి నుండి నేను సుమతిని నా భార్యగా అనుకున్నాను. అరుణని తాకలేదు. సుమతి కూడా ప్రెగ్నెంట్ అనే కారణం చూపించి రాజుకి దూరంగా ఉంది.

మేమిద్దరం కలుస్తూనే ఉన్నాం. నిజానికి వీళ్ళను ఎలా అయినా నాశనం చేయొచ్చు. కాని సుమతికి నమ్మకం రావాలి.




నేను చూస్తూ ఉండగానే రాజు మరియు అరుణలను సుమతితో వచ్చిన బాడీగార్డులు కొడుతున్నారు. 

సుమతి కంట్లో కనపడిన కన్నీరుని చూసి ఆమె భుజం చుట్టూ చేయి వేసి పక్కకు తీసుకొని వెళ్లాను. 

ఆమె ఏడవడం లేదు, ఇన్నాళ్ళ మోసానికి ప్రతీకారం తీర్చుకుంది. రోజు వాళ్ళ మెసేజెస్ చదవడం కంటిన్యూవస్ మోసపోవడం గా అలా వచ్చే బాధ భరిస్తూ గడిపింది. 

తనను తీసుకొని వెళ్లి కారులో కూర్చోబెట్టాను. ఏడ్చింది, వదిలేసింది... ఇక వాళ్ళను మర్చిపోయింది. 

తన పవిట తీసుకొని నా మొహం మీద ఉన్న టమాటా కేచ్ అప్ తుడుస్తూ "పిచ్చోడిలా ఉన్నావ్..." అంటూ నవ్వుతుంది.

తర్వాత నేను ఓక జోక్ చెప్పడంతో ఇద్దరం నవ్వుకున్నాం. అలానే ఇంటికి చేరుకున్నాం.




రాజు విడాకులు ఇవ్వడం కోసం మొరాయించాడు. కానీ మన న్యాయశాస్త్రం మగాళ్ళకు అంత స్వేచ్చ ఇవ్వలేదు కదా... పైగా తన అక్రమ సంబంధానికి సంబంధించిన ప్రూఫ్ లు ఎక్కువగా దొరకడంతో, పైగా రాజు నన్ను తోయడం అందరి ముందు అరుణని పెళ్ళాం అని చెప్పడం అంతా సాక్ష్యంగా చూపించబడి, రాజు విడాకులు ఇవ్వక తప్పలేదు.

ఆ తర్వాత సుమతి తల్లిదండ్రులు మా అమ్మానాన్నని కలవడం పెళ్లి మాటలు మాట్లాడడం వేగంగా జరిగిపోయింది. మా అమ్మ నన్ను చూస్తూ "ఇదంతా నీ ప్లాన్ కదా..." అని అడిగింది.

మా అమ్మకి నేను క్రూరంగా ఉండడం అసలు ఇష్టం లేదు. జాలి ఉండాలి అవకాశాలు ఇవ్వాలి అంటూ ఉంటుంది. 

శేఖర్ "నువ్వు నన్ను ఎపుడూ నమ్మలేదు.... అరుణ కరక్ట్ కాదు అని చెప్పినా.... నా మెడ వంచి బెదిరించి తాళి కట్టించావ్.... పెళ్లి అయ్యాక అబార్షన్ సంగతి చెబితే.... నువ్వు తనకే సపోర్ట్ చేశావ్.... ఇప్పుడు కూడా నన్ను అర్ధం చెసుకుంటావ్ అని నేను అనుకోను.... రాజు-అరుణ ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు.... వెళ్లి వాళ్ళతో కలిసి ఉండు...." అన్నాను.

మా అమ్మతో ఎప్పుడూ నేను ఇంత కటినంగా మాట్లాడలేదు. ఇప్పుడు ఒక వేళ తను బాధ పడ్డా నాకు సంబంధం లేదు. 

కొన్ని రోజుల లోనే సుమతికి నాకు పెళ్లి అయింది. రాజు స్థానంలో ఆమె కంపనీలో నేను కొనసాగుతున్నాను. నేను ఎప్పటిలా ఆఫీస్ లో ఎక్కువ సమయం గడుపుతూ ఇంటికి వచ్చే వాడిని. అరుణ స్థానంలో సుమతి నా కోసం ఎదురు చూస్తూ ఉండేది. కానీ ఒక్కటే తేడా... సుమతి నేను ఒకరికొకరం లాయల్ గా ఉన్నాం.

సుమతి ఆడపిల్లను కంది. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ మా అమ్మ నాతో మాట్లాడలేదు, సుమతితో బాగానే ఉంటుంది.

... మూడు సంవత్సరాల తర్వాత ...

ఒక రోజు అందరం గుడికి వెళ్తే అక్కడ రాజు-అరుణలు కూడా వచ్చారు. అరుణ చేతిలో పిల్లాడిని చూసి అందరం షాక్ అయ్యాం. అక్కడ ఏం జరిగిందో మాకు అర్ధం అయింది.

కాని అందరం మాములుగానే ఉన్నాం. అరుణ మొహం దాటేసి వెళ్ళిపోయింది. 

కాని రాజు మాత్రం నా ముందుకు వచ్చి నవ్వుతూ "వేరే వాళ్ళ పిల్లలను, నీ పిల్లలుగా పెంచుతూ ఉంటే ఎలా ఉంది" అని అన్నాడు.

నేను వాడిని మనిషిగా కూడా లెక్కజేయకుండా సైలెంట్ గా పక్కకు వెళ్ళిపోయాను. వాళ్ళతో మాట్లాడడం, నాకు ఇక అనవసరం అనిపించింది.




మా అమ్మ మాత్రం రాజు దగ్గరకు వెళ్లి మరి రాజుకి పిల్లలు పుట్టరు అనే విషయం చెప్పి వచ్చింది. 

రాజు-అరుణ ఇద్దరూ గొడవ పడ్డారు అంట.... అరుణని రాజు ఇంటి నుండి బయటకు గెంటితే, అరుణ లవర్ వచ్చి రాజుని కొట్టి కట్టేసి అతని ముందే అరుణతో సెక్స్ చేశాడు అంట. 

రాజుకి సూసైడ్ చేసుకొనే దైర్యం లేక, అదే ఇంట్లో కకోల్ద్ గా బ్రతికి ఉన్నాడు.

ఆఫీస్ నుండి వస్తే, ఇంట్లో ఒక వేళ అరుణ తన లవర్ తో ఉంటే, కొడతారేమో అని భయపడి బయటకు పరిగెత్తి తర్వాత వెళ్ళే వాడు అంట.




అమ్మని ఇలా ఎందుకు చేశావ్.... వాళ్లతో ఇక మనకు ఎందుకు వదిలేయొచ్చు కదా అన్నాను.

అమ్మ "నీ వైపు ఉన్నాను కాబట్టి.... నేను కూడా విలన్ నే.... విలన్స్ కి ఈ రైట్స్ ఉంటాయి...." అంది.

అప్పుడే వంట గది నుండి బయటకు వచ్చిన సుమతి మా ఇద్దరినీ మార్చి మార్చి చూసింది.

సుమతి "మీ అబ్బాయి అంటే మీకు ఇష్టం అని చెప్పొచ్చు కదా అత్తయ్యా... ఈ విలన్... గిలన్... ఇవన్నీ దేనికి?" అంది

నేను నవ్వేసి మా అమ్మని హాగ్ చేసుకున్నాను. మరో చేయి జాపి సుమతిని కూడా హాగ్ చేసుకుంది.









అలా నా శకుని ప్రస్థానం ముగిసింది. 

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply
#8

ఈ కధకి మొదట ప్రేరణ ఇచ్చింది అరుణ....(పేరు మార్చాను)



ఈమె ఆ అఫైర్ మనిషిని ఇష్టపడడం లేదు అలా సీక్రెట్ గా ఉంచడాన్ని ఎంజాయ్ చేస్తుంది.


పుట్టింట్లో ఉన్నప్పుడు, పెళ్లి అయ్యాక అలా అలా నడుపుతూ పోతుంది.


కాని అసలు విషయం ఏమిటి అంటే ఈమెకు సీక్రెట్ గా ఉంచడం అసలు చేతకాదు.






రాజు, అరుణ పైట జాపగానే తనలో ఉన్న కామపు కుక్క నిద్ర లేచింది. పైగా అరుణ ఏడుస్తూ బ్రతిమాలాడడం, రాజు ఓదార్చడంతో తనని తానూ హీరోగా ఫీల్ అవుతూ వచ్చాడు.


ఆఖరికి హీరో అయ్యాడు కానీ....... కక్, వైఫ్ అండ్ బుల్ స్టొరీ లో హీరో అయ్యాడు.







ఈ కధని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను.


క్రిష్ స్టొరీ పూర్తీ అయ్యాక త్వరలో నేను కూడా క్విట్ అవ్వాలని అనుకుంటున్నాను.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 12 users Like 3sivaram's post
Like Reply
#9

(03-09-2024, 02:41 PM)Uday Wrote:  కథ విషయానికి వస్తే బావుంది, టైటిల్ శకుని కాబట్టి ఆ పాత్రను ఎలివేట్ చేసారనుకోవచ్చు. కాని రాజు పాత్రను మారీ దొబ్బేసారు, ముందే పిల్లలను పుట్టించలేడు ఆఖరికి కుకోల్డ్ ని చేసేసారు. కథలో ఇంకో డైలాగ్ 'నన్ను మార్చాలంటే దేవుడు ఇంకో జన్మనెత్తాలి ' వెరైటీగా వుంది.

ఎందుకు బ్రో ఈ నిర్ణయం...సరదాగా మమ్మల్ని అలరిస్తూ వుండొచ్చు నీ కథలతో, లేకపోతే నా లా అడ్దమైన కామెంట్లు పెట్టొచ్చు కదా...
 


ఎప్పుడైనా రిలేషన్ లో మోసపోయిన వాళ్ళతో మాట్లాడావా..... !

వాళ్ళు మోసం చేసిన పార్టనర్ ని చంపేయాలి అన్నంత కోపంలో ఉంటారు కానీ ఎవరైనా ఏమయినా అంటారేమో... తమని తప్పుగా అనుకుంటారేమో... దేవుడు/కర్మ అంటే భయం ఉంటుంది.

పైగా సుమతి తనను తాను శేఖర్ తో ఉండడాన్ని తప్పు చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంది. 

అందుకే శేఖర్ పర్శిస్టెంట్ గా విలన్ ని అని చెప్పడంతో ఆమె తనలో రాజు మీద ఇన్నాళ్ళు దాగి ఉంచుకున్న కోపాన్ని అలానే ఉంచుకోగలిగింది. అలాగే తను చేసే తప్పులను అంటే, శేఖర్ తో కలిసి ఉండడం, రాజు-అరుణలకు రూపాయి కూడా ఇవ్వకుండా విడాకులు తెప్పించుకోవడం ఇవన్నీ కూడా నేను విలన్ అనుకోని చేస్తుంది.

----  ----  ----  ----  ----  ----  ----  




ఇక ఆ డైలాగ్ మాటకు వస్తే.... అక్కడ రెండూ వర్షన్ డైలాగ్స్ ప్లాన్ చేశాను.....


మొదటి వర్షన్......

శేఖర్ "ఇక నుండి మనం భార్యాభర్తలం.... వాళ్ళకు విడాకులు ఇచ్చేసి మనం కలిసి ఉందాం...."

సుమతి "నువ్వు అలా చేయగలవా... కానీ ఎలా...."

శేఖర్ "మోసం చేస్తాను..."

సుమతి "తప్పు కాదా.... అయినా ఎలా" అని అయోమయం అయింది

శేఖర్ "సుమతి.... ఎపుడూ నువ్వు అంటావ్ కదా... నేను విలన్ ని అని..... విలన్ కి ఆ రైట్ ఉంటుంది... ruthlessness'" అని చిన్నగా నవ్వుతాడు.

సుమతి శేఖర్ ని హాగ్ చేసుకొని సంతోషంగా నవ్వుతుంది, ఆమె అతడిని నమ్మింది. అతను విలన్ అని చెప్పినా ఆమె అతడినే నమ్మింది, అతడిని మాత్రమే నమ్మగలదు....





రెండో వర్షన్......

శేఖర్ "ఇక నుండి మనం భార్యాభర్తలం.... వాళ్ళకు విడాకులు ఇచ్చేసి మనం కలిసి ఉందాం...."

సుమతి "నువ్వు అలా చేయగలవా... కానీ ఎలా...."

శేఖర్ కాన్ఫిడెంట్ గా నవ్వుతూ "మర్చిపోయావా..... నేను శకునిని..... స్కీమింగ్ మ్యాన్ ని.... నన్ను గెలవాలి అంటే.... ఆ దేవుడు మళ్ళి పుట్టాలి" 

గెలుస్తాం అలాగే వాళ్ళకు బుద్ది చెబుతాం అన్న నమ్మకం ఆమెలో కలిగింది.

సుమతి శేఖర్ ని హాగ్ చేసుకొని సంతోషంగా నవ్వుతుంది, ఆమె అతడిని నమ్మింది. అతను శకుని అని చెప్పినా ఆమె అతడినే నమ్మింది, అతడిని మాత్రమే నమ్మగలదు....





మరో విషయం...... ఆడవాళ్ళు ఎమోషన్ ఫీల్ అయితే.... మగవాళ్ళు కంటెంట్ ఫీల్ అవుతారు...

శేఖర్ వాళ్ళకు రూపాయి కూడా దక్కకుండా విడాకులు వచ్చే ప్లాన్ చేసి పగ దీర్చుకున్నా అనుకున్నాడు.

కాని సుమతి వాళ్ళను కొడితే గాని తన పగ దీరలేదు.

ఆఖరికి శేఖర్ వాళ్ళ అమ్మ పర్సనల్ గా రాజును కలిసి విషయం చెప్పి, వాళ్ళ జీవితాలు నాశనం అయితే కాని సాతిస్ఫై అవ్వలేదు.

ఆడవాళ్ళు చూసే ప్రపంచానికి మగవాళ్ళు చూసే ప్రపంచానికి తేడా ఉంటుంది.

అది కాంప్లికేటేడ్ కాని బ్యూటిఫుల్.....

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 6 users Like 3sivaram's post
Like Reply
#10

(03-09-2024, 03:45 PM)nareN 2 Wrote:  క్రిష్ స్టొరీ పూర్తీ అయ్యాక త్వరలో నేను కూడా క్విట్ అవ్వాలని అనుకుంటున్నాను.

Good.. Aa krish Story Eppatiki poorti Kaakoodadu ani memu korukuntunnamu...
[/quote]



క్రిష్ ఒక గ్రాండ్ స్టొరీ....

మొత్తం ఆరు త్రేడ్ లు....


క్రిష్ : కాలేజ్ బాయ్ (80% completed)

క్రిష్ : రష్ అవర్ (60% completed)

క్రిష్ : 'నూతన్' పరచయం  (60% completed)

క్రిష్ : వైభవ్ ERD (20% completed)

క్రిష్ : ద కర్స్ బ్రేకర్ (స్టార్ట్ చేయలేదు)

క్రిష్ : ద ఎండ్ గేం (స్టార్ట్ చేయలేదు)



ఆరు నెలలలో పూర్తీ చేసేస్తా.....


సినాప్సిస్ సిద్దంగా ఉన్నాయి. కాని సెక్స్ రాసేటపుడు ఐడియాలు రావడం లేదు, బ్రో....

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 4 users Like 3sivaram's post
Like Reply
#11

(03-09-2024, 04:39 PM)nareN 2 Wrote:  సినాప్సిస్ సిద్దంగా ఉన్నాయి. కాని సెక్స్ రాసేటపుడు ఐడియాలు రావడం లేదు, బ్రో....

Bro Meeru Create chese Patrale Matladistayi anni.. Sex lekunda idi rayaleda..

Sajal ji ki ayana reasons ayanaki undi untay.. tana stories lo kooda 80% sex undadu..

Mana readers anni stories ni encourage chestaru.. manam regular updates ivvali anthe.. danlo meeru elagu Thop..

Edo smasana vairagyam appudappudu vastu untundi.. evari kosam enduku idanta antoo.. Tappu ledu..

Uday Bro cheppinattu dont leave site...

క్రిష్ స్టొరీ మొత్తం మీద హీరొయిన్ పేర్లే పెట్టాను. సెక్స్ లేకుండా రాస్తే బాగోదు

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#12

(05-09-2024, 10:07 PM)sarit11 Wrote:  
[Image: cp-p.jpg]

or

Shakuni-(nmg).pdf  
Size: 1.3 MB

thanks

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#13

(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote:  హాయ్ శివరాం గారు ఇప్పుడే ఈ కథ చదివాను చాలా బాగుంది.

It's quite an emotional one but you disguised emotion with comedy masterfully!

Ee plot ki similar ga oka cinema undi "In the mood for love", it's considered one of the greatest, very well directed and deeply emotional and philosophical too, if you have time watch it.

పార్టనర్ ఎక్సేంజ్ ఫర్ రివెంజ్ అనేది తరతరాలుగా వస్తుంది. నేను ఆ సినిమా చూడలేదు. చైనీస్ మూవీ చూడాలని కూడా లేదు. సారీ..... ఎ బిట్ కొరియన్ చూసేవాడిని.


(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote:  " పని చేస్తున్నట్టు నటిస్తూ  ఎదో మురికి గుడ్డ తో నీట్ గా ఉన్న టీవీ ని తుడిచి మరకలు పెట్టింది, అలానే ఆల్రెడీ చేసేసిన కూర లో మళ్ళా ఉప్పు వేసింది "

పైన ఆ లైన్స్ చదవగానే పెద్ద గా నవ్వేసాను :)

This is a simple yet powerful story and very much happening in our society.

థాంక్స్



(08-09-2024, 01:53 AM)Rishabh1 Wrote:  అరుణ కి ఎంత పొగరు? తన లో ఇంత కూడా పశ్చాత్తాపం లేదు!! చివరికి రాజు లైఫ్ బిస్కెట్ అయ్యింది, కాకపోతే మళ్ళా ఈ కొత్త లవర్ ఎవడు తనని ప్రేగ్నన్ట్ చేసింది ?

అరుణ ఫోన్ నెంబర్ కావాలా! 

జస్ట్ జొకింగ్....

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#14

(08-09-2024, 10:20 PM)Sushma2000 Wrote:  Meelo intha fire vundhani anukoledhu writer gaaru.. Sex scenes lekunda chala ba rasaru

ఎందుకు నాకు నువ్వు వెక్కిరిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#15

(09-09-2024, 10:24 PM)Sushma2000 Wrote:  Idendayya idi... nijanga ba raasaru clp);

ఓకే థాంక్స్....

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
#16

(10-09-2024, 03:56 AM)Rishabh1 Wrote:  inthanki aa new boyfriend evadu cheppaledu?? I mean she found another guy after raju?

https://xossipy.com/thread-64517-post-57...pid5719610

ఇది చదివితే నీకు ఈ పాటికే అర్ధం అవ్వాలి. అరుణకి సీక్రెట్ అఫైర్ అంటే ఇష్టం, ప్రస్తుతం ఆ కొత్త బాయ్ ఫ్రెండ్ కి పార్టనర్ గా ఉన్నా, ఆమె అతనికి తెలియకుండా మరొకరిని ట్రై చేస్తుంది. ఇంకా ఇంకా రాస్తే బాగోదు అని రాయలేదు. 

రాజు కొంత కాలం కలిసి ఉండడం కోసం, అరుణ మారుతుంది అని వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే అతను అలా జరగదు అని అర్ధం చేసుకుంటాడో అప్పుడు మారతాడు. కానీ రాజు, శేఖర్ పై అటాక్ చేస్తాడు, దీని అంతటికి అతన్నే నిందిస్తాడు. రివెంజ్ తీసుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. బాగా ఆలోచించి శేఖర్ ని అటాక్ (సుమతి, శేఖర్ ల కూతురుని, అరుణతో కలిసి కిడ్నాప్) చేస్తాడు.

అప్పుడే శకుని సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. అరుణని మానిప్యులేట్ చేసి తన కూతురిని ఎలా వెనక్కి తెప్పించుకున్నాడు అనేది స్టొరీ.

కాని నాకు రాసే ఉద్దేశ్యం లేదు. ఎవరికైనా ఉంటే కొనసాగించుకోవచ్చు. 

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#17

(11-09-2024, 04:37 AM)Rishabh1 Wrote:  Yes it makes sense now that you explained a bit mottaniki aruna manchi kasak anamata  Tongue , season 2 inka dark and interesting  ga undi, wow!! please write bro if you can. 
Ideas and story evolution very natural and excellent  clp);, keep up the good work.

సీజన్ 2 లైన్ ఇస్తాను ఎవరైనా రాస్తారా.....

3 ఇయర్స్ లెటర్.....

సుమతి ప్రెగ్నెంట్ అయి ఉండి, కాలేజ్ కి వెళ్ళే సరికి తన కూతురుని ఎవరో కిడ్నాప్ చేశారు అని తెలుస్తుంది.

శేఖర్ వచ్చి ఏడుస్తూ ఉన్న సుమతిని తీసుకొని వెళ్తాడు. హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు.

పోలిసుల సమక్షంలో cc కేమెర చూస్తాడు. ఎవరో తీసుకు వెళ్తారు. వాళ్ళను అడగితే వేరే వాళ్ళకు ఇచ్చాం అని మొహం చూడలేదు అని చెబుతారు.

శేఖర్ ఆ cc కెమెరా చూసి రాజుని గుర్తు పడతాడు....

సీజన్ 2 స్టార్ట్ అవుతుంది.



రాజు ఎత్తు -  శేఖర్ పై ఎత్తు

రాజు DNA టెస్ట్ చేయించి సుమతికి అక్రమసంబంధం ఉందని ప్రూవ్ చేస్తాడు. అరుణ పట్టించుకోదు. మరో DNA లో శేఖర్ తో మ్యాచ్ అవుతుంది. 

అరుణ షాక్ అవుతుంది. శేఖర్ తనకు తెలియకుండా అఫైర్ పెట్టుకున్నాడు అంటే నమ్మలేక పోతుంది. రాజుతో చేయి కలుపుతుంది.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#18

రేపు సెకండ్ పార్ట్ లైన్ ఇస్తాను.

ఒకే అప్డేట్ లో నాలుగు భాగాలు వచేస్తాయి.

ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలాబరేట్ చేసి రాసుకోండి.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#19

deleted

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 5 users Like 3sivaram's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)