Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
ఇంకో కధ. నా గత కధలు చదివిన వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఒక్క భాగం రాస్తాడు, మళ్ళీ కొన్ని రోజులు కనిపించడు, ఏంటో అని.
రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వకపోవడానికి అందరికీ ఉండే ఇబ్బందులు నాకూ ఉంటాయి, నాకు మాత్రమే ఉండే ఇబ్బందులూ ఉంటాయి. రాయాలని ఉన్నా పరిష్కారం లేనివీ ఉంటాయి. వయసేమో పెరిగేదే కానీ తగ్గేది కాదు.
తక్కువ రాసినవి అలానే ఉంచి, కధ ముందుకు పోయినవి అన్ని పూర్తి చేస్తాను. సరే, ఇక ఈ కధ విషయానికి వస్తే, ముగింపు తట్టిన కధ. సెక్స్ లాగా అసలు ఉంటుందో లేదో కూడా చెప్పలేను. లవ్ స్టోరీ లాగా కూడా ఉంటుంది. మీకు నచ్చుతుందేమో చూద్దాం.
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
"రేయ్ ప్లేట్ కిచెన్ టేబుల్ మీద పెట్టు"... టిఫిన్ తిని లేవబోతున్న కొడుకుతో అంది మృదుల.
"అదేంటి? రోజూ తిని ఇలానే వదిలేస్తా కదా?" అర్ధం కాక అడిగాడు సంజయ్.
"లక్ష్మి రాలేదు, నేను ఆఫీసుకి తొందరగా వెళ్ళాలి, నాతో వాదించకురా. ప్లేట్ తీ"... కసురుకుంటూ బదులిచ్చింది.
"రాలేదా, అదేంటి? నిన్న రాలేదు. ఈ రోజు వస్తుంది అన్నావు కదా"
"ఏమోరా. నాకైతే ఆఫీస్ వర్క్ చాలా ఉంది. నీకు చదువుకుని రిలాక్స్ అవ్వాలని ఉంటే, కొన్ని గిన్నెలు తోము"... లోపలికి వెళ్తూ చెప్పింది.
"ఏంటి అమ్మా జోకా"
"డెడ్ సీరియస్"
"ఛీ ఛీ. నేను అంట్లు తోమాలా? మామ్, ఐ యామ్ గోయింగ్ టు బి ఎ బిగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్" అన్నాడు గొప్పగా.
వెనక్కి తిరిగి చూసి... "బట్ యు కెనాట్ ఈట్ కోడ్, యు ఈట్ ఫుడ్. సో డూ సమ్ డిషెస్"... నవ్వుతూ, ఆఫీసుకి రెడీ అవ్వడానికి లోపలికి వెళ్ళింది మృదుల.
కంప్యూటర్ ముందు ఉండి, తల్లి వెళ్ళే దాకా టైం పాస్ చేద్దాం అనుకుంటూ ఊరికే ఏవో సైట్స్ చూడసాగాడు.
తల్లి రెడీ అయ్యి గేట్ లాక్ చేసుకోమన్న పిలుపు విని బయటకి వచ్చాడు.
పొద్దున్నే ఆఫీసుకి వెళ్ళే ఆటో ఎక్కబోతున్న తల్లికి టాటా చెప్తూ ఉండగా, వెనక దూరంగా వస్తున్న లక్ష్మి కనిపించింది.
"అమ్మా, లక్ష్మి"... లక్ష్మి వస్తున్న వైపు చెయ్యి చూపించి అరిచినట్టు అన్నాడు సంజయ్.
స్టార్ట్ అవ్వబోతున్న ఆటో నించి బయటకి దిగి లక్ష్మి వైపు కాస్త కోపంగా చూడసాగింది మృదుల.
దగ్గరికొచ్చింది లక్ష్మి.
లక్ష్మికి ఏదీ చెప్పే అవకాశం ఇవ్వకుండా... "ఏంటి లక్ష్మి ఇది, నిన్న రాలేదు, ఈ రోజు వస్తాను అన్నావు, ఎక్కడి అంట్లు అక్కడే ఉన్నాయి, బట్టలు కూడా ఉన్నాయి. మా ఇంట్లో పనుల గురించి నీకు తెలుసు కదా. రాకపోతే ఎలా చెప్పు"... కాస్త కోపం, చనువు రెండూ చూపిస్తూ అంది మృదుల.
"మా నాన్న కాలికి నిన్న దెబ్బ తగిలిందమ్మా, పెద్ద కట్టు కట్టారు. నిన్నంతా ఇంట్లో లేనమ్మా. ఈ రోజే కాస్త బాగుందమ్మా. అందుకే మీకు కలిసి విషయం చెప్పాలని వచ్చాను, రేపు కూడా రానమ్మా. ఎల్లుండి వస్తే చెప్తాను"... దిగులుగా చెప్పింది లక్ష్మి.
"అయ్యో. సరే కానీ, మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నువ్వు రావక్కరలేదు, మీ నాన్నని చూసుకో. కాని మా ఇంటి పని కోసం, నువ్వు వచ్చే దాకా ఎవరినైనా పంపుతావా?"... ఆఫీస్ బిజీతో ఇంటి పని కూడా చెయ్యాలంటే తన వల్ల అవ్వదని తెలిసి, లక్ష్మి చేతిలో కొన్ని వందలు పెడుతూ అడిగింది మృదుల.
ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ, తనకి ఏదన్నా కష్టం వస్తే, జీతంతో సంబంధం లేకుండా తనకి సాయం చేసే మృదులతో... "చూస్తానమ్మా. మా చుట్టలమ్మాయి వచ్చింది. మీ వరకు చేస్తే చాలు అని చెప్పి చూస్తాను. డిగ్రీ చదువుతోందమ్మా, వస్తుందో రాదో చెప్పలేను. తను రానంటే నేనే వస్తాను. ఈ రోజు, రేపు మీరే చూసుకోండి... చెప్పింది లక్ష్మి.
"ఆ అమ్మాయిని ఒకసారి సాయంత్రం ఇంటికి పంపించు చాలు, మాట్లాడతాను"... అంది మృదుల.
"అలాగేనమ్మా"... అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి.
'ఎవరో ఒకరు, వస్తే చాలు, పని భారం తగ్గుతుంది' అనుకుంటూ నిట్టూర్చి... "సరేరా, జాగ్రత్త"... కొడుకు వీపు మీద తట్టి క్షణం కూడా ఆగకుండా ఆటోలో కూర్చుంది మృదుల.
గుర్రం లాగా సర్రుమని వెళ్తున్న తల్లి ఉన్న ఆటో వైపు, ఆటో దూరంగా వెళ్ళే దాకా చూసి... లోపలికి వెళ్లాడు సంజయ్.
'ఎంత చిన్న విషయం ఇది. కాని అమ్మకి ఇంపార్టెంట్. నిజమే, లక్ష్మి రెండు రోజులు రాకపోతే రాకపోతేనే ఇల్లు పిచ్చిగా ఉంది. వాషింగ్ మెషీన్ వాడినా, లక్ష్మి ఉతికినట్టు లేవు బట్టలు'... వేసుకున్న తన షర్ట్ చూసుకుని అనుకుంటూ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు సంజయ్.
లక్ష్మి వస్తుందో, లేదా లక్ష్మి పంపించే అమ్మాయి వస్తుందో, ఆ కధేంటో వచ్చే భాగంలో చూద్దాం.
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,757 in 5,131 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
•
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
ముగింపు తట్టింది, రాద్దాం అనుకున్నాను. ఒక్కళ్ళకి తప్ప ఎవ్వరికీ అంటే ఎవ్వరికీ నచ్చలేదు. Utter flop అయింది.
(02-08-2024, 10:55 AM)sri7869 Wrote: Good start నువ్వు కూడా లైక్, రిప్లై ఇవ్వకుండా ఉండాల్సింది. అప్పుడు ఎవరికీ నచ్చలేదు కాబట్టి అప్డేట్ అనే మాట ఉండేది కాదు. కథని మర్చిపోయి ఉండేవాడిని. కథని మర్చిపోయినా, కథ పేరు గుర్తు వస్తూ ఉండేది.
యథా స్పందన, తథా రచయిత. ఇది ఆపేసి ఇంకేదయినా రాస్తా.
Posts: 3,495
Threads: 0
Likes Received: 1,222 in 1,012 posts
Likes Given: 478
Joined: Jul 2021
Reputation:
20
•
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,795 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
(03-08-2024, 08:49 PM)earthman Wrote: ముగింపు తట్టింది, రాద్దాం అనుకున్నాను. ఒక్కళ్ళకి తప్ప ఎవ్వరికీ అంటే ఎవ్వరికీ నచ్చలేదు. Utter flop అయింది.
నువ్వు కూడా లైక్, రిప్లై ఇవ్వకుండా ఉండాల్సింది. అప్పుడు ఎవరికీ నచ్చలేదు కాబట్టి అప్డేట్ అనే మాట ఉండేది కాదు. కథని మర్చిపోయి ఉండేవాడిని. కథని మర్చిపోయినా, కథ పేరు గుర్తు వస్తూ ఉండేది.
యథా స్పందన, తథా రచయిత. ఇది ఆపేసి ఇంకేదయినా రాస్తా.
Earthman గారు, ఇక్కడ మన కష్టాలు వీళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళకి కథ ఏదో రాసానా అన్నట్టు రాసినా సరే, regular updates ఇస్తే చాలు, “ bro this is one of the best stories in xossipy ” అంటారు. Updates regular గా ఇవ్వకపోతే ఎంత గొప్పగా రాసినా ప్రోత్సాహం, likes, comments రావు. వీళ్ళకి వారానికి రెండు, మూడు సార్లు మొడ్డ కొట్టుకునే stuff ఇచ్చే కథలే నచ్చుతాయి. (Majority)
Posts: 3,495
Threads: 0
Likes Received: 1,222 in 1,012 posts
Likes Given: 478
Joined: Jul 2021
Reputation:
20
•
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,795 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
చూసారా, “ nice start ” అని కూడా అనట్లేదుగాని “ Update please ” అంట.
Posts: 584
Threads: 6
Likes Received: 217 in 169 posts
Likes Given: 567
Joined: Dec 2018
Reputation:
10
Nice start. తరువాతి భాగం ఇవ్వు బ్రదర్.
•
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
(03-08-2024, 11:31 PM)Haran000 Wrote: Earthman గారు, ఇక్కడ మన కష్టాలు వీళ్ళు అర్థం చేసుకోరు. వీళ్ళకి కథ ఏదో రాసానా అన్నట్టు రాసినా సరే, regular updates ఇస్తే చాలు, “ bro this is one of the best stories in xossipy ” అంటారు. Updates regular గా ఇవ్వకపోతే ఎంత గొప్పగా రాసినా ప్రోత్సాహం, likes, comments రావు. వీళ్ళకి వారానికి రెండు, మూడు సార్లు మొడ్డ కొట్టుకునే stuff ఇచ్చే కథలే నచ్చుతాయి. (Majority)
ఒక రకంగా ఏదో ఒక reply ఇస్తున్నారు కదా అనిపిస్తూ ఉంటుంది, కాని కొన్ని సార్లు అవి automatic, general replies అవుతూ ఉంటాయి.
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
(27-09-2024, 12:20 PM)sravan35 Wrote: Nice start. తరువాతి భాగం ఇవ్వు బ్రదర్.
నువ్వు ఉన్నావు చదివేవాడివి. కాస్త సంతోషం.
ఇంకొక్క భాగం ఉంది. కథ పేరు ఎందుకు అలా పెట్టానో తెలిపే భాగం. ఇదైతే ఇస్తాను.
Posts: 1,615
Threads: 2
Likes Received: 2,283 in 1,153 posts
Likes Given: 3,015
Joined: Nov 2018
Reputation:
45
సంతోషం బాసు...ఇవ్వాళే నీ ఈ కథ చూడటం తటస్థించించింది. ప్రేమ కథన్నారు...కాబోయే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ + డిగ్రీ అమ్మాయికా లేక పనిమనిషి వ్యాల్యూ తెలిపే ప్రేమా...?...మిగతా వాళ్ళలా మీరుకూడా ఏంటి బ్రో...కొనసాగించండి
: :ఉదయ్
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,795 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
(29-09-2024, 06:26 PM)Uday Wrote: మిగతా వాళ్ళలా మీరుకూడా ఏంటి బ్రో...కొనసాగించండి
నన్నే అంటున్నావు కదా?
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
(29-09-2024, 06:26 PM)Uday Wrote: సంతోషం బాసు...ఇవ్వాళే నీ ఈ కథ చూడటం తటస్థించించింది. ప్రేమ కథన్నారు...కాబోయే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ + డిగ్రీ అమ్మాయికా లేక పనిమనిషి వ్యాల్యూ తెలిపే ప్రేమా...?...మిగతా వాళ్ళలా మీరుకూడా ఏంటి బ్రో...కొనసాగించండి
తప్పకుండా. నిన్ను మర్చిపోగలనా. రెండో భాగం on the way
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
కథ తరువాతి భాగం ఇస్తున్నాను, స్పందన ఉంటే ఓకే, లేకుంటే ఇక్కడితో సరి.
Posts: 349
Threads: 42
Likes Received: 1,972 in 287 posts
Likes Given: 0
Joined: Mar 2019
Reputation:
122
అన్నం తిని పడుకున్నాడు సంజయ్.
కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి మెలకువ వచ్చింది. కలేమో అనుకున్నాడు. మళ్ళీ మోగింది బెల్.
టైం చూసుకున్నాడు, అయిదయింది. అమ్మ వచ్చుంటుంది అనుకుంటూ లేచి బయటకి వెళ్ళాడు.
బయటున్నది అమ్మ కాకుండా ఎవరో అమ్మాయి అవ్వడంతో ఎవరా అనుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళాడు.
"ఎవరు కావాలి?" అడిగాడు సంజయ్.
ఏమీ మాట్లాడకుండా ఉండి... ఏదో గుర్తుచేసుకుంటున్నట్టు అనిపించింది అమ్మాయి.
"మీ మమ్మీ పేరు మర్చిపోయాను. లక్ష్మక్క పంపించింది.. పని చెయ్యడానికి"... చెప్పి చిన్నగా నవ్వింది అమ్మాయి.
"లక్ష్మి పంపించిందా!"
తలూపింది.
"లోపలికి రా" అంటూ తలుపు తీసాడు.
లోపలికొచ్చింది.
"అంట్లున్నాయి. బట్టలు కూడా ఉన్నాయి. బట్టలు మెషీన్లో వెయ్యచ్చు. మమ్మీకి ఆఫీస్ పని చాలా ఉంది, అంట్లు తోమాలి"
తలూపింది.
తోమాల్సినవి చూపించి... ఆకలి వేస్తుండటంతో నూడుల్స్ చేసుకుని తిందామని కిచెలోకి వెళ్ళాడు సంజయ్.
కత్తెర కనబడక బయటకి నడుస్తుంటే గడప బయట అమ్మాయి కనిపించింది.
"గిన్నెలు చాలా ఉన్నాయి... స్క్రబ్ కొత్తది ఉందా..." అడిగింది.
"కొత్త స్క్రబ్ కావాలా?"
తలూపింది.
"లోపల ఎక్కడుందో మరి. ఆ గదిలో పెడుతుంది మమ్మీ... కింద షెల్ఫ్ చూడు" అంటూ కత్తెర తీసుకుని నూడుల్స్ చేసుకోవడానికి వెళ్ళాడు సంజయ్.
నూడుల్స్ ఉడుకుతుండగా... కలిపి.. బయటకి వచ్చాడు.
అక్కడే ఉంది అమ్మాయి.
"మళ్ళీ ఏం కావాలి?"
"స్క్రబ్"
"ఇంకో స్క్రబ్ కావాలా?" ఆశ్చర్యపోతూ అడిగాడు.
"ఇందాక అడిగాను కదా, మీరు ఇవ్వలేదు"
"లోపల ఉండాలి.. చూడమన్నా కదా... చూడలేదా?"
లేదన్నట్టు తలూపింది.
"ఏం?"
"లోపలికి వెళ్ళచ్చో లేదో తెలీదు"
"నేనే కదా వెళ్ళమంది"
"నేనెవరో మీకు తెలీదు కదా"
"అంటే?"
"మీ మమ్మీ ఏమన్నా అంటారేమో అని..."
"లక్ష్మి చెల్లెలివే కదా?"
తలూపింది.
"అయితే మాకు పరాయిదానివి కాదు... లోపలికెళ్ళి నీకు కావల్సినవి తెచ్చుకో"... చెప్పి నూడుల్స్ చూడటానికి వెళ్ళాడు.
లోపల గదిలో తనకి కావల్సినవి తెచ్చుకుని గిన్నెలు తోమసాగింది అమ్మాయి.
నూడుల్స్ అవ్వడంతో, ప్లేట్లో పెట్టుకుని, కిచెన్ కిటికి నించి బయటకి చూసాడు సంజయ్.
గిన్నెలు తోముతున్న అమ్మాయిని చూడగానే తనకి కూడా నూడుల్స్ పెట్టాలనిపించింది.
ఇంకో ప్లేట్ తీసుకుని అందులో కొంత పెట్టి బయటకి తెచ్చాడు.
"ఇదిగో తీసుకో"... ప్లేట్ చేతికిస్తూ అన్నాడు.
తిన్న ప్లేట్ ఇస్తున్నాడనుకుని... "ఇవి పొద్దున గిన్నెలు బాబు.. ఇప్పుడు తిన్నది కదా టేబుల్ మీద ఉంచండి.. ఇవి తోమిన తర్వాత అది తోముతాను"... తలెత్తకుండా గిన్నెకున్న మసి గట్టిగా రుద్దుతూ అంది.
"ఇది తిన్న ప్లేట్ కాదు"... అంటున్న అబ్బాయి ఇస్తున్నది చూసింది.
అర్ధంకానట్టు చూసింది.
"నూడుల్స్. నీకే"
"నాకా?"
"అవును నీకే... తినవా?"
"ఎందుకు బాబు?"
"ఎందుకేంటి... తింటానికి"
ఇంకా అర్ధంకానట్టు అలానే ఉంది.
"నేను చేసుకున్నాను. నీకు కూడా పెడుతున్నాను. లక్ష్మికి మమ్మీ పెడుతుంది. తీసుకో. డిస్పోజబుల్ ప్లేట్, తిని పారేసేదే. ఇదిగో ఫోర్క్" ఫోర్క్ కూడా ఇచ్చి లోపలికెళ్ళాడు సంజయ్.
తీసుకుని సంతోషిస్తూ ఎదురుగా ఉన్న చెట్లని చూస్తూ తినసాగింది అమ్మాయి.
నూడుల్స్ తీసుకుని కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో చూస్తూ తినసాగాడు సంజయ్.
గంట గడిచింది.
"బాబూ"
ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించి బయటకి వచ్చాడు.
గుమ్మం తలుపు దగ్గర పనిపిల్ల.
"అన్నీ కడిగేసాను బాబు. బట్టలు ఉంటే రేపొద్దున వచ్చి ఉతుకుతాను. మమ్మీకి చెప్పండి రేపు వస్తానని"
తలూపాడు.
"రేపు మర్చిపోకుండా రా. నీ ఫోన్ నెంబర్ తెలీదు కదా, రాకపోతే ఫోన్ చేసి రమ్మని చెప్పడానికి"
"వస్తాను బాబు"
"ఏం చదువుతున్నావు?"
"డిగ్రీ"
తలూపాడు.
బయటకి వెళ్ళింది అమ్మాయి.
"ఆగు"... వెళ్తున్న అమ్మాయిని పిలిచాడు.
ఆగి వెనక్కి వచ్చింది.
"నీ పేరేంటి? ఇంత వరకూ నేను అడగలేదు, నువ్వు చెప్పలేదు. నీ పేరు తెలీకపోతే మా మమ్మీకి నువ్వు వచ్చినట్టు చెప్పాలంటే లక్ష్మి చెల్లెలు అని చెప్పాలి"
తల దించుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుంది అమ్మాయి.
పేరడిగితే మాట్లాడట్లేదేంటి అనుకుంటూ... "నీ పేరేంటంటే మాట్లాడవేంటి?" మళ్ళీ అడిగాడు.
ఇంకా అలానే తల దించుకుని ఉంది అమ్మాయి.
'ఇదేంటి... ఇలా ఉంది' అనుకుంటూ అమ్మాయి వైపే చూడసాగాడు.
"చుక్క. చుక్కమ్మ అంటారు."
"ఏంటి?"... ఏం విన్నాడో సరిగా అర్ధంకాక అడిగాడు.
"నా పేరు చుక్క బాబు. చుక్కమ్మ అని పిలుస్తారు."
"చుక్కా?"
తలూపుతూ బయటకి నడిచింది.
"అమ్మాయి పేరు చుక్కా?... జోక్ చేస్తోందా ఏంటి... చుక్కేంటి.. అదొక పేరా.. ఎవరన్నా అలాంటి పేరు పెట్టుకుంటారా" అనుకుంటూ లోపలికెళ్ళాడు.
తన జీవితంలో ఎన్నో సార్లు ఎంతో మంది ఈ ప్రశ్న అడగటం, తను చెప్పిన మాట విని వాళ్ళు అర్ధంకానట్టు ఉండటం, తనకి కాస్త నవ్వు, కాస్త బాధ, కాస్త ఆశ్చర్యం కలుగుతూ రకరకాలుగా ఉండటం అలవాటైనా ఇదంతా ప్రతి సారి కొత్తగా అనిపిస్తూ ఉండి ఇంటి వైపు నడవసాగింది చుక్క.
Posts: 12,257
Threads: 0
Likes Received: 6,757 in 5,131 posts
Likes Given: 69,031
Joined: Feb 2022
Reputation:
86
•
Posts: 3,346
Threads: 0
Likes Received: 2,406 in 1,828 posts
Likes Given: 427
Joined: May 2021
Reputation:
26
•
Posts: 150
Threads: 0
Likes Received: 115 in 65 posts
Likes Given: 14
Joined: Sep 2024
Reputation:
0
•
Posts: 166
Threads: 0
Likes Received: 82 in 70 posts
Likes Given: 1
Joined: Jul 2022
Reputation:
0
•
|