29-05-2024, 09:56 PM
ఎంత మార్చిపోదాం అనుకున్నా గుర్తుకు వస్తునే
ఉంది తనూ... ఉదయం అంతా బానే ఉంటుంది.. సాయంత్రం అవగానే ఎక్కడ లేని నీరసం భాధ కోపం అంత వస్తుంది.
ఉంది తనూ... ఉదయం అంతా బానే ఉంటుంది.. సాయంత్రం అవగానే ఎక్కడ లేని నీరసం భాధ కోపం అంత వస్తుంది.
కానీ ఎవరీ మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ....
చిన్నపాటి నుండి ఒంటరిగా ఉండటం ఇష్టం. .అదే ఇప్పుడు నాకు ఉపయోగపడుతుంది.. నా జీవితంలో నేను అనుకోని,ఊహించని సంఘటనలు రెండు జరిగాయి. అందులో ఒకటి నేను ప్రేమించిన.. నన్ను ప్రేమించిన ఒక అమ్మాయి నన్ను వదిలేసిన రోజు...
ఇంకోటి నా హీరో మా నాన్న మరణం .... మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం.. ఇష్టం కన్నా పిచ్చి అనొచ్చు...దాదాపుగా అబ్బాయిలా అందరికి వాళ్ల నాన్ననే హీరో కదా..
ముందుగా తన గురించి..
ఇప్పటికి తనకి పెళ్లి అయ్యి సరిగ్గా ఈ మార్చి 25 కి 5 సంవత్సరాలు...
తనని చూసి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది.. రోజులు చాలా వేగంగా గడిపిపోతున్నాయి...
ఓ తన పేరు చెప్పలేదు కదా హాసిని ...
నేను చిన్నప్పటి నుండీ ఒకటే అనుకుంటూ ఉండేవాడిని . పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్ తప్పా ఎరేంజ్ మ్యారేజ్ వద్దు అని. దానికి బలమైన కారణం కూడా ఉంది .
అదే మా అమ్మా నాన్న... వాళ్ళది కూడా ప్రేమ వివాహమే .... కానీ ఇప్పుడు నాకు పెళ్లి అంటేనే బయం చిరాకు కలుగుతుంది..
నేను నా లైఫ్ లో ఇంత వరకు ఏ అమ్మాయిని కూడా ఇష్టపడలేదు .. ఒక్క తనని తప్ప చిన్నప్పటి నుండి కూడా ..
ఇప్పటికీ నా ఫ్రెండ్స్ లో చాల మందికి పెళ్ళీలు అయ్యాయి అందరు హ్యాపీగా ఉన్నారు ... నేను ఒక్కడినే పిచ్చోడి లాగా ఉన్నా...
నాలో ఉన్న బాధ ఎవరికి చెప్పుకోలేక పోతున్న ..
అమ్మ కి చెల్లి కి చెప్పలెను.. నాకు ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ కి కూడా మొన్న చెప్పా తాగుతూ ఇలా ఇలా అని అర్థం చేసుకుంటాడు అనుకుంటే వాడే ఇప్పుడు నన్ను పిచ్చోడి లా చూస్తున్నాడు...
అందుకే సెక్స్ కి అలవాటు అయిపోయా.... కానీ ఎంత అలవాటు అయిన ఒక మనిషి తో ఉండే అనుబంధం ముందు ఇవన్నీ ఎంత అండి..
అంత మర్చిపోయి ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడుల్లా తను ఏదో ఒక విధం గా కనిపిస్తుంది ..
రోడ్డు మీద, బోర్డు మీద , షాప్ కి వెళ్దాం అని చూస్తే ఆ షాప్ పేరు కూడా తనదే అయి ఉంటది ... ఆ పేరు చూడగానే మొఖం లో ఒక చిన్న నవ్వు..
నాకు అర్ధం అవుతుంది.. నా జీవితం లో ఏం జరుగుతుందో ఇలానే ఉంటే ఏం అవుదో అని కానీ ఏం చేయలేని పరిస్థితి ...
మీరూ '96' మూవీ చూసే ఉంటారు ... ఆ మూవీ కొంచెం అటు ఇటు గా జీవితం లానే ఉంటుంది ... అందునా నాది కూడా కాలేజ్ లవ్ కదా.. అందులో హీరో హీరోయిన్ ఒక రూం లో ఉండి అన్ని మాట్లాడుకుంటారు కదా..
అలా నా జీవితం లో ఒక్క రోజు అయిన జరిగితే బాగుండు అని అనుకొని రోజు లేదు ...
తన పెళ్లి జరిగినప్పుడు 19 ఇయర్స్ నాకు జాబ్ లేదు ..
చదువూ లేదు అప్పుడే ఇంటర్ చదువుతున్న అంతే ...
జాబ్ అంటే డెకరేషన్ చేసేవాడిని కొంచెం కొంచెం ఏదో పాకెట్ మనీ కోసం అంతే..
తనకి పెళ్లి అని తెలియగానే చాలా బయం కోపం.. సరిగ్గా తినే వాడిని కాదు ... ఇంటికి కూడా వెళ్ళేవాడిని కాదు ...
డెకరేషన్ చేసుకుంటూ అక్కడే ఉంటూ ఏదో ఒకటి తింటూ ఉండేవాడిని .. ఈ గ్యాప్ లో తనకి పెళ్లి జరిగిపోయింది ...
అప్పటినుంచే తాగడం కూడా అలవాటు అయ్యింది ... రోజు తాగడం పని ఉంటే వెళ్ళడం .. లేకపోతే పడుకోవడం ... ఇదే పని ...
అలా ఒక 3 ఇయర్స్ గడిచాయి ...తన జ్ఞాపకాలతో బతికేస్తు ఏ రోజు కూడా ఒక్క అమ్మాయి ని కూడా సరిగ్గా చూసేవాడిని కాదు ..
అందునా నేను ఇంట్రోవర్ట్ అవడం వల్ల ఎవరికి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు .. నేను నా లోకం అంతే .. ఈ 3 ఇయర్స్ లో తనని ఒక్కసారి కూడా చూడలేదు ..
చూడలేదు అనడం కన్న తను కనిపించలేదు ... ప్రతి దసరా కి తన ఇంటి దగ్గర గుడి కి వెళ్లి చూసే వాడిని .. తను కనిపిస్తుంది ఏమో ఈరోజు అయ్యిన అని .. ఈ ఒక్క పండగ కోసం ఇయర్ మొత్తం ఎదురు చూసే వాడిని..అలా ఆరోజు ఒక్కసారి అయినా తనని తనివి తీరా చూసీ వద్దాం అనుకున్న ప్రతిసారి నాకు నిరాశ ఎదురైంది...
కానీ వల్ల అమ్మ చెల్లెలు అందరు కనిపించే వాళ్ళు ...
అలా తన కోసం చూస్తూ చూస్తూ రాత్రి 11 గంటల దాకా అక్కడే ఉండేవాడిని .. ఇక రాలేదు అని మళ్ళీ ఒక బాటిల్ మందు తీసుకొని చెరువు దగ్గర కూర్చొని తాగుతూ ఉండేవాడిని ..
అలా రోజులు గడుస్తున్నాయి...
ఒక రోజు సడెన్ గా ప్రోగ్రామ్ వచ్చింది .. సంక్రాంతి పండగ అని లైటింగ్ , డెకరేషన్ కావాలి అని .. మామూలుగా అయితే నేను వెళ్ళే వాడిని కాదు.. కానీ ఆరోజు ఇద్దరు పనికి వచ్చే వాళ్ళు రాలేదు ...
ఇక సరే అని నేను వెళ్లి సామాన్లు దించి పని చేస్తూ ఉన్నాం అందరం ...
నాకు ఇప్పటికీ ఇంకా గుర్తు 2022 జనవరి 13 తారీఖు ...
నేను స్టూల్ ఎక్కి పనిచేస్తున్న మొబైల్ అదే పనిగా మొగుతూ ఉంది .. నేను కంపెనీ కావచ్చు అని లిఫ్ట్ చేయకుండా అలానే పని చేస్తున్న..
ఒక రెండు సార్లు ఫోన్ వచ్చింది .. నేను పట్టించుకోకుండా అలానే పని చేసి ఒక అరగంట కిందికి దిగి టైం ఎంత అయ్యిందో చూసుకుందాం అని ఫోన్ ఓపెన్ చేస్తే రెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి..
ఏదో కొత్త నెంబర్ సరే అని కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది .. సరే అని వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే ఇంతక ముందు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నెంబర్ నుండే మెసేజ్ వచ్చింది.. అందులో నేను ఇంకా గుర్తు ఉన్నానా నాని .....
మీ ఇంటికి వెళ్తే మీ అమ్మ నెంబర్ ఇచ్చింది. . ఈ నెంబర్ కి కాల్ చేయకు నేనే వీలు చూసుకొని మెసేజ్ చేస్తా అని ఉంది ...
ఆ మెసేజ్ చూడగానే అక్కడే కిందపడిపోయి కూర్చున్న ....
ఇది సెక్స్ స్టోరీ కాదు.. ఇది నా నిజ జీవితం లో జరిగిన కొన్ని మధుర జ్ఞాపకాలు ... అర్ధం చేసుకుంటారు అని భావిస్తున్న ... రేటింగ్ కోసం రివ్యూ కోసం ఈ కథ రాయట్లేదు... మీ అందరికీ చెప్పాలి అని రాస్తున్న ...తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి...