Thread Rating:
  • 8 Vote(s) - 3.13 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బియ్యం - దెయ్యం - కయ్యం
#1
బియ్యం - దెయ్యం - కయ్యం
itachi





ఏ మతాన్ని, కులాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. కేవలం కథ కోసం కొన్ని ఆచారాలు, పద్ధతులు వాడుకుంటాను. అంతా ఊహా కల్పన. ఎవరి నమ్మకం వారిది.

కొందరికి ఈ కథలో రక్తం, చావు, శవం, శ్మషాణ వాటిక, మూఢనమ్మకాలు, అనుమానాలు, లాంటివి ఇబ్బంది కలిగిస్తే చదవవద్దు.


Not for sensitive people.
[+] 3 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఒక ఊరు, మారు మూల ప్రాంతం ఎం కాదు. నేషనల్ హైవే ఆ ఊరి చెరువుని ఆనుకుంటూ పోతుంది. ఈ మధ్యే ఆ చెరువుకి రొడ్డుకీ మధ్యలో ఒక చిన్న పార్కు ఏర్పాటు చేయడం జరిగింది. పల్లెటూరు ఏం కాదు, చిన్నపాటి టౌన్ లా ఉంటుంది. చెరువు, గుడులూ, బడులూ, ప్రభుత్వ బంవంతులూ, ఉన్న వాళ్ళు పేదవాల్లు అన్ని రకముల కులాలు మతాలు వారు ఉంటారు. అయితే,


ఒక రాత్రి జోరున వర్షం, హైవే పక్కన ఒక మర్రిచెట్టు హోరు గాలికి ఊడలు రోడ్డుకి అడ్డంగా వచ్చేలా ఊగుతున్నాయి. బస్టాండు దారికి ఎదురుగా ఒక కుర్రాడు, వర్షంలో తడుస్తూ సైకిల్ తొక్కుతూ హైవే ఎక్కి తప్పు తోవలో పోతుంటే, జేబులో ఫోను మోగుతూ ఉంది, అది బయటకి తెస్తే తడుస్తుంది అని, చేసేది వాళ్ళ అమ్మ అయ్యుంటుంది అనుకొని, ఎత్తకుండా ముందు ఇంటికి చేరితే చాలు అనుకొని ఇంకా వేగంగా తొక్కుతున్నాడు.

 ఎదురుగా బస్టాండ్ వైపు నుంచి లారీ వస్తుంది. హైవే అంచుల్లో తొక్కుతూ ఉన్నాడు, లారీ ఎటు వచ్చేది తెలీదు, అసలే అటువైపు చెరువు, రోడ్డు వంకలా ఉంది. తొక్కుతూ తొక్కుతూ కుడికి మర్రిచెట్టు పక్కన నుంచి పోతుంటే, మేఘాల్లో పడేల్మని ఉరుము శబ్దానికి జనికాడు. లారీ దగ్గరవుతోంది, చెట్టు కిందకి వస్తూ ఉన్నాడు. ఎదురుగాలి వీస్తూ ఉంది. లారీ లైట్లు తప్పా ఏదీ సరిగ్గా కనిపించట్లేదు. 

పక్కనుంచి తొక్కుతూ ఉండగా ఒక ఊడ ఇటుగా ఊగి మొహానికి తగిలితే టక్కున కుడి చేతిని ఎత్తి దాన్ని పక్కకి జరుపుకుంటూ ఉండగా, రోడ్డు అంచులో గుంత చీకట్లో కనిపించక టైరు అదుపు తప్పి సైకిల్ ఎడమకి ఊగింది, మరో అడుగు ముందున్న ఊడ వచ్చి భుజాన తాకితే ఎడమకి కొట్టుకొని లారికి గుద్దుకున్నాడు. లారీ గుద్దితే సైకిల్ తో సహా ఎగిరి పోయి అదే మర్రిచెట్టుకి తలా వీపు ఢీకొని బొక్కలు చితికి, చిల్లిన రక్తం చెట్టు బెరడుకి అంటుకొని కిందకి కారుతూ కింద జారీ పడ్డాడు. కింద పడ్డాక చెట్టు కింద ఉన్న నీటి గుంత క్షణాల్లో రక్తం కలిసిన నీళ్లతో నిండింది. బయట పడి తన ఎడమ చేతి దగ్గర ఫోన్ మోగుతూ ఉంటే కొన ప్రాణాలతో కొట్టుకుంటూ స్క్రీన్ నొక్కాడు, “ హెల్లో..... కన్నా రాకు, బాబాయ్ దగ్గరే పడుకో, వర్షం ఇప్పుడే తగ్గేలా లేదు. ” అని చెపుతూ ఉంటే, గుండె ఆగిపోతూ ఆఖరి ఊపిరి జారుకుంటూ, “ హాహ్..... ” అని కుత్తుక నరాలు చీల్చుకుంటూ శ్వాస విడిచాడు. “ ప్రొద్దున రా, బాబాయ్ కి ఫోన్ ఇవ్వు చెప్తాను ” అంటూ వాళ్ళమ్మ రెండు క్షణాలు ఆగి, సమాధానం రాకపోయేసరికి, “ ఒరేయ్ వింటున్నావా? మాట్లాడు ”.


 నిమిషా నిమిషానికి చెట్టు మీద కురుస్తున్న వర్షపు ధార కొమ్మల్లోంచి జారుతూ కాండం మీద చుక్కలు కారుతూ అంటుకున్న రక్తాన్ని తడిపేస్తూ కిందకి శుభ్రం చేసుకుంది. సూర్యుని వెలుగు వెచ్చేవరకు చెట్టుకి రక్తం లేదు, మబ్బుల్లో వాన లేదు, రోడ్డు పక్కన సైకిల్ లేదు, లారీ టైర్ల అచ్చులు లేవు, రక్తం గుంతలో మొహం పెట్టి పడుకున్న శవం మాత్రమే ఉంది.
thanks
[+] 14 users Like Haran000's post
Like Reply
#3
What a entry scene
Like Reply
#4
నైస్ స్టార్ట్
Like Reply
#5
పాపం కదా, బయళ్దేరే ముందు వాళ్ళమ్మకన్నా కాల్ చేసుండాల్సింది.

హారర్ జోనర్...బావుంది భయ్యా. అసలే చిన్నపిల్లాడిని Tongue , ఎక్కువ భయపెట్టమాకేం Big Grin
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#6
Continue
Like Reply
#7
Opening good
Like Reply
#8
Nice update
Like Reply
#9
వేరే జోనర్ లో కథ బాగుంది
Like Reply
#10
Nice start
Like Reply
#11
112233445566
Like Reply
#12
(15-01-2024, 02:18 PM)Mayalodu Wrote: What a entry scene

(15-01-2024, 03:43 PM)Hrlucky Wrote: నైస్ స్టార్ట్

(15-01-2024, 04:01 PM)Uday Wrote: పాపం కదా, బయళ్దేరే ముందు వాళ్ళమ్మకన్నా కాల్ చేసుండాల్సింది.

హారర్ జోనర్...బావుంది భయ్యా. అసలే చిన్నపిల్లాడిని Tongue , ఎక్కువ భయపెట్టమాకేం Big Grin

అంత సీన్ లేదు నాకు, ఏదో ఒకటి అలా రాస్తున్న. హర్రర్ అని కూడా చెప్పలేను.

(15-01-2024, 04:03 PM)Rupaspaul Wrote: Continue

(15-01-2024, 04:32 PM)maheshvijay Wrote: Opening good

(15-01-2024, 05:13 PM)Vvrao19761976 Wrote: Nice update

(15-01-2024, 06:24 PM)ramd420 Wrote: వేరే జోనర్ లో కథ బాగుంది

(15-01-2024, 06:54 PM)kkiran11 Wrote: Nice start

(15-01-2024, 07:39 PM)ITACHI639 Wrote: 112233445566
Thanx all
[+] 1 user Likes Haran000's post
Like Reply
#13
మూడు నెలల క్రితం,




ఊరికి ఉత్తారాన, ఒక చిన్న చౌరస్తా, అక్కడి నుంచి చెరువుకి నేరుగా దారి ఉంటుంది. చౌరస్తా నుంచి చెరువు తోవకి మూడో ఇల్లు, ఆ వాడలో వాళ్ళదే ఎక్కువ డబ్బున్న కుటుంబం. అందరూ ముందు విలువ ఇస్తూ వెనక తిట్టుకుంటారు వీళ్లగురించి. ఇంటి యెజమాని వీర్రాజు. ఒక రైస్ మిల్లు, ఎనిమిది లారీలు, ఇరవై ఎకరాల పొలం, మూడు ఎకరాలలో మాగాణి మరియు మిరప తోట ఉన్నాయి. 

              అతడి భార్య లచ్చమ్మ. నా మొగుడికి ఏంటి దొర అనుకుంటూ దొరసానిలా ఉంటుంది. ఇంటి బీరువాలోడబ్బు, నగలు, వాడపొంటి ఆడవాళ్ళతో తానే పెత్తనం చేస్తూ ఇరవై మూడేళ్ల కొడుకున్నా కానీ ఇరవై ఏళ్ల పడుచుఅమ్మాయిలా నడుము ఊపుతూ తిరుగుతుంది. మొగుడు వీర్రాజుకి పొలాలలో పని చేస్తూ శాన రట్టైన గుట్టులుఉన్నాయి. పెళ్ళాన్ని పెళ్ళాం గానే చూస్తాడు అంతే, చూపులే చేతలు ఆపేసి శానా ఏళ్లు అవుతుంది. 

                               రెండంత్రాల ఇల్లు, కింద వీళ్ళు ఉంటే, పైన కూతురు కాపురం ఉంటుంది. కూతురునీ ఈఊరిలోనే ఉండే లచ్చమ్మ అన్న కొడుక్కి ఇచ్చి పెల్లిచేసింది. కూతురికి చౌరస్తా మీద ఒక పెద్ద కిరాణా కొట్టు ఉంది. అందుకే ఇక్కడే పై అంత్రంలో ఉంటారు.


సూర్యుడు అన్ని మేఘాల అంత్రాలు ఎక్కి పైన ఉన్న సమయానికి, వీళ్ళ ఇంట్లో బట్టలు ఉతికి,  బోల్లు తోమే పనికివచ్చే యువ దంపతులు, గిరీజ - కనకరాజు పని ముగించుకొని బోల్లు ఇంట్లో పెట్టి లచమ్మకి చెప్పి పోదాం అనితలుపు దగ్గర నిలబడి ఆగారు.  లచమ్మ ఈ నెల జీతం డబ్బులు తెచ్చి గిరీజకి చేతిలో పెట్టింది. 

లచ్చమ్మ: తీసుకొవే, వీడికి ఇవ్వకు, పిల్లల బడి ఫీజు కట్టుకో. 

గిరిజ: ఆ అమ్మా...

కనకరాజు గిరిజ భుజం గోకుతూ సాయంత్రం మందుకి చిల్లర అడుగుతుంటే లచమ్మ చూసింది. 

లచమ్మ: ఆ తాగుడు మానవారా నువు. 

గిరిజ: సూడమ్మ రోజు నాకు ఇదే లొల్లి గీనెతోని

కనకరాజు: మొత్తానికే తాగకుండా ఉండేదెలాగ అమ్మగారు.

లచమ్మ కనకరాజు కళ్ళలోకి చూస్తూ పెదాల్లో చిన్న నవ్వు.

లచమ్మ: ఇవాళ సారు లేడు, రేపు వచ్చాక చెప్పిస్తా ఆయనతో వీడికి అట్లైతెనే మంచిగా ఐతడు వీడు.

అది విన్నాక కనకరాజు మొహంలో చిన్న దొంగ నవ్వు. 

కనకరాజు: వెల్లోస్తాం అమ్మగారు.

బయటకి పోయారు. లచమ్మ గేటు దాకా పోయి, వాళ్ళనే చూస్తూ ఉండగా కనకరాజు వెనక్కి చూసాడు. లచమ్మగేటు మూస్తూ వేలు ఒకసారి చెరువు వైపు, మళ్ళీ ఇంటి వైపు తిప్పి రమ్మని సైగ చేసి లోపలికి వెళ్ళిపోయింది.


కనకరాజు వాల్ల ఇల్లు ఆ వాడలో చెరువు నుంచి మొదటి మెలిగే సందులో ఉంటుంది. అటుగా వెళుతూ ఒక చిన్నకిరాణా కొట్టు దాటి పోతుంటే ఒక కుర్రాడు ఇరవై ఒక్క సంవత్సరాలు. పేరు సూర్య, ఇంటి నుంచి బయటకి వచ్చి, “ నమస్తే అంకుల్ అంతా బాగేనా ” అంటూ పలకరించాడు. ”

కనకరాజు వాళ్ళు వీళ్ళింట్లో కూడా పని చేసేవారు కానీ వాషింగ్ మెషీన్ కొన్నాక వీళ్ళతో పని లేదు ఇక. 

కనకరాజు: హా బాగున్న ఎంది సంగతి ఎటో ఉరుకుతున్నవు

సూర్య: ఏం లే అట్లా పోతున్న దోస్తు దగ్గరికి


అని చెప్పి ముందుకి నడిచి, లచమ్మ ఇంటి పక్కనే ఉండే గునేపెంకుల ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంట్లోంచి తనస్నేహితుడు, అర్జున్ వచ్చాడు. 

అర్జున్: ఒరేయ్ తొమ్మిదిన్నర అని పది చేసినవ్ కదరా పా జెల్ది వాళ్ళు మనకోసమే ఆగుతుర్రు

ఇద్దరూ క్రికెట్ అడ్డానికి మైదానం కి పోయారు.


మధ్యాహ్నం తిని, మళ్ళీ సూర్య వాల్ల ఇంటి బంగళా మీద కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకున్నారు. సాయంత్రం అర్జున్ఇంటికి పోతూ, కనకరాజు చౌరస్తా దాటడం, అటుగా లచమ్మ నడుచుకుంటూ వెలుతుండడం వీళ్ళు ఇద్దరూచూసారు.

అర్జున్: అంకుల్ లేడు ఇవాళ

సూర్య: అంతే అంటావా?

అర్జున్: వాడ మొత్తం తెలుసురా

సూర్య: వీళ్ళ గురించా?

అర్జున్: హా.... 

సూర్య: మొగుడు చేస్తే ఏంటి నేను కూడా చేస్తా అనుకుంటుందో ఏమో

అర్జున్: గిసొంటోల్లే ఉండాలరా మా ఇంటి పక్కకి

సూర్య: ఏ ఉకో రా నీకు మచిగా టైంపాస్ అయితది లే వాళ్ళని చూసుకుంటా

అర్జున్: చీ డబ్బున్న చిల్లర గాల్లు, అన్నీ నింజా కథలు....


అర్జున్ వెళ్ళాక సూర్య ఇంట్లోకి వెళుతూ ఉంటే, సూర్య వాళ్ళ అమ్మ సౌందర్యకి పెద్దనాన్న భార్య శంకరమ్మ, వీళ్ళఇంటి బిల్డింగ్ ఎక్కి గోడల మీద గుప్పిట్లో బియ్యం పట్టుకొని కుప్పలు పోస్తూ ఉంది. 

సూర్య: ఏంటి అమ్మమ్మా గోడల మీద బియ్యం పోస్తున్నావు?

శంకరమ్మ: పిట్టలు తింటాయి అని

సూర్య అంతగా ఏమీ పట్టించుకోకుండా లోపలికి పోయాడు, లోపల వాళ్ళమ్మ అడిగింది.

సౌందర్య: ఎవరితో మాట్లాడుతున్నావు రా?

సూర్య: అమ్మమ్మ తో, బియ్యం పోస్తుంది ఎంది మన గోడ మీద

అప్పుడే సౌందర్య కలల్లో చిన్న గుబులు. 

సౌందర్య: నువు పట్టించుకోకు కానీ ఛాయి వేడి చేసుకొని తాగు

కాసేపటికి సౌందర్య తన చినమ్మ రామాప్రభకి ఫోన్ చేసింది. 

సౌందర్య: చిన్నమ్మా పెద్దమ్మ మళ్ళీ గోడ మీద బియ్యం పోస్తుంది, ఎందుకో అడిగితే పిట్టలకి అంటుంది. పిట్టలకిఅన్ని కుప్పలు పోసుడు ఎందుకు చెప్పు 

రమా: నువ్వు పట్టించుకోక

సౌందర్య: నా ఇల్లు మీద పోస్తే నేను కాకుంటే ఇంకెవరు పట్టించుకుంటారు

రమా: నేనేం చెయ్యాలి వాళ్ళకి మాకు మాటలు లేవు.


సౌందర్య: ఊకే పోస్తే నాకేమో అనుమానాలు వస్తున్నాయి చిన్నమ్మ, మొన్న అర్థరాత్రి ఎటో పోయి రెండు గంటలకువచ్చి, మా ఇంటి సందులోంచి, పోయి, స్నానం చేసి వాళ్ళింట్లోకి పోయింది.

రమా: అయితే?

సౌందర్య: అదీ అమావాస్య రోజు చిన్నమ్మా, నాకు పిల్లలు ఉన్నారు. నా ఇంటి ముందునుంచి పోవుడు ఎందుకుఅని. అయినా వాళ్ళకి రెండు అంతస్తుల ఇల్లుంటే నా ఇంటి మీద పిట్టలకి బియ్యం పోసుడు ఎందుకూ అని.
thanks
[+] 13 users Like Haran000's post
Like Reply
#14
Interesting chala bagundi
[+] 1 user Likes Saikarthik's post
Like Reply
#15
NICE UPDATE
Like Reply
#16
Nice start
Like Reply
#17
Bro fabulous start don't stop at any cost
Like Reply
#18
Nice update
Like Reply
#19
బాగుంది
Like Reply
#20
super
Like Reply




Users browsing this thread: 1 Guest(s)