Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
13-01-2024, 09:32 AM
(This post was last modified: 23-07-2024, 02:03 PM by Haran000. Edited 8 times in total. Edited 8 times in total.)
ఇత్రాకి ఉత్రాకి బత్తరి బిత్తర కత్రాకి
రచన - హరణ్
Rated 12+ (U/A)
ఈ కథలో నేను భారత రాజ్యాంగం Article - పంతొమ్మిదిని అధిగమించకుండా నా ఉద్దేశాలు చెప్పుకున్నాను. ఏ ప్రభుత్వాన్ని కానీ, సామాజిక వర్గాన్ని కానీ కించపరిచే ఉద్దేశం నాకు లేదు. మీ మనసుని గానీ నొప్పిస్తే అది మీ సమస్య నా సమస్య కాదు.
Caution: Non - erotic story, అన్ని రకాల కథలను చదవడం చేతకాకపోతే ఇప్పుడే చదవడం ఆపి Back button నొక్కు.
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
13-01-2024, 08:14 PM
(This post was last modified: 14-01-2024, 09:50 AM by Haran000. Edited 5 times in total. Edited 5 times in total.)
నా పేరు శివ. నేను పంతొమ్మిది వందల తొంబై తొమ్మిది నవంబర్ పదహారు న, కరీంనగర్ (తెలంగాణ) లో పుట్టాను. కరీంనగర్ అంటే తెలుసు కదా, పరిచయం అయితే ధూంధాం దోస్తాన్, ధంకీ ఇస్తే ధంధం పరేషాన్ ఉంటది మల్ల. కానీ ప్రస్తుతం ఇక్కడ నివసించట్లేదు, మా ఊరిలో ఉంటున్నాం. ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల పొడుగూ, రింగుల జుట్టు, చిన్న కల్లు, గుండ్రటి మొహానికి కొచ్చటి ట్రిమ్ చేసుకున్న గడ్డం, కొన్ని రోజులు జిమ్ము చేసి అంతోకొంతో కాస్త ఫిట్నెస్ ఉన్న బాడీ నాది. నేను కాస్త introvert అంటున్నారుగా ఈ మధ్య అటువంటి వాడిని. నాకు G - బలుపు ఎక్కువ.
గ్రంథాలయానికి వెళ్ళే ఓపిక లేక, వెళ్ళినా అక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో తెలీక, మనం ఒకరికి దిష్టర్బన్స్ అవ్వకూడదు, ఒకరు మనల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు అని ఇంట్లోనే బుక్కులు కొనుక్కొని చిన్నపాటి గ్రంథాలయం లాంటి గదిని సమకూర్చుకున్నాను. ఇంట్లోనే గ్రంథాలయం, సెపరేట్ రూం అంటే నేనేదో బలిసిన ఫ్యామిలి అనుకోకండి, నేను వృధా కర్చులు చెయ్యను, అలా అని పీసిడి వాడిని కాను, తిండి మీద కర్చుచేస్తాను, మందు లేదు, రెండు వారాలకు ఒకసారి పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ తింటాను, సిగరెట్టు లేదు. బ్రాండెడ్ బట్టలు కొంటాను కానీ ఎక్కువ కొనను. Quality over quantity అన్నమాట. రెండు పూటలా తింటాను, టిఫిన్ కి కర్చు లేదు. నూటాయాభై రీఛార్జ్ చేస్తాను, నెట్టుకి ఇంట్లో వైఫై ఉంది. గర్ల్ఫ్రెండ్ on trials. ఫ్రెండ్స్ నన్ను పార్టీ అడగరు ఎందుకంటే మర్చిపోయారా నో మందు, నో సిగరెట్టు, వాళ్ళు పార్టీ ఇస్తే నేనే స్టఫ్ అంతా మింగేస్తా. అసలు నాకు చెడు అలవాట్లు ఉన్నాయా, ఎందుకు లేవు, ఒకటి ఉంది, అది మీకు తెలుసు. చదువుతాను, యూట్యూబ్ చూస్తాను, Instagram లో హీరోయిన్ ఫొటోస్ చూస్తాను. ఖగోళ సాస్త్రం, భౌతిక సాస్త్రం, మనుషుల గురించీ అంటే, కులాలు, మతాలు, తెగలు, దేశాలు, అభివృద్ధి, సామాజిక సమస్యలు, ప్రభుత్వం, పురాణాలు, ఇంకా ఎన్నో. శృష్టి గురించి, దేవుడు దయ్యం గురించి, జంతువులూ వాటి స్వభావాల గురించి చాలా ఆసక్తితో చదువుతాను. అమ్మాయిలు, అందం, శృంగారం, సంభోగం, కామసూత్రం గురించి వీడియోలు చూస్తాను. BGMI గేమ్ పిచ్చిగా ఆడుతాను. సినిమాలు Telugu, English, Kannada, Japanese, Hindi వి చూస్తాను. (నాకు ఈ ఐదు భాషలు మాట్లాడడం వచ్చు). One Piece, Naruto, Jujutsu Kaisen లాంటి anime లు కూడా చాలా ఆసక్తిగా చూస్తాను. నాకు మా గీత టీచర్ అంటే ఫుల్ ఇష్టం అడ్రస్ కనుక్కొలేకపోతున్న, ఎక్కడుందో ఏమో. ఈ శృష్టి ఆవిర్భావం, అంతం, జీవం, జీవితం, జీవనం, కథలు, కళలు, కష్టాలు, కామం, కోరికలు, యుద్దాలు, చరిత్ర గురించి ఎవరైనా మాట్లాడితే నేను కలువుగా గంటల తరబడి మాట్లాడేస్తాను.
ఇక నాకున్న ఒకే ఒక్క టాలెంట్ కథ రాయడం, అదీ adultery కథలు, xossipy సైట్ లో ITACHI639 అనే పేరుతో. తెలిసిందే కదా, గీత - దాటేనా (going to be one of the best erotic story in telugu) కథని సాగదీసి, కొందర్కి ఇక ఆశ కోల్పోయేలా చేసాను. వాళ్ళు అసలు రొమాన్స్ మొదలయ్యే సమయానికి కథ చదవడం మానేసారు, నేను కూడా విరామం ప్రకటించాను. మళ్ళీ తప్పకుండా మొదలు పెడతాను. మీకు తెలుసా సైట్లో కొందరు నా కథలను అస్సలు ఇష్టపడరు. సరే అదంతా ఇప్పుడెందుకు లే, ఈ కథలోకి వెళ్దాం.
ఇత్రాకి ఉత్రాకి బత్తరి బిత్తర కత్రాకి
రెండు వేల ఇరవై మూడు, డిసెంబర్ పది, కరీంనగర్ లో ఉండే నా స్నేహితుడు మాటినీ షో అనిమల్ సినిమా చూద్దాం అంటే వచ్చి సినిమా చూసాక మరలా ఇంటి దారి పట్టిన నేను సాయంత్రం ఐదు గంటలా యాభై ఆరు నిమిషాలకి, కరీంనగర్ బస్టాండులో $$$$$$$$ వెళ్ళే బస్సులు ఆగే స్టేజ్ దగ్గరకి వచ్చాను. కరీంనగర్ బస్టాండ్ కనుచూపు మేరలో సగం పొగుడు ఉంటుంది. అది కూడా L ఆకారంలో రెండు వైపులా ఉంటుంది.
§§§§§§§ వెళ్ళే స్టేజ్ దగ్గర ఒక కూడ్రింక్స్ కొట్టు, నాలుగు బెంచిలూ, మూడు పిల్లర్లు ఉంటాయి. బస్సు ఆగే చోట నిలబడితే వెనక ఇంకో కిరాణా కొట్టు ఉంటుంది, దాని పక్కన ఒక హోటల్ ఉంటుంది, దానిలో సమోసాలు అంత బాగోవు కానీ ఉల్లిగడ్డ పకోడీ మాత్రం కరకరా ఎంతైనా తినాలి అనిపిస్తది. ఇక స్టేజ్ దగ్గర ఒక పిల్లర్ మీద తెల్లని ఫ్లెక్సీ లైటింగ్ బోర్డులో §§§§§§§§, $$$$$$$$ , ∆∆∆∆∆∆∆∆∆ అని ఉంటుంది. ఇంకో రెండింటి మీద, πππππππ, §§§§§§§§, ££££££ అని ఉంటుంది. ఊరు పేర్లు అవి. ఆహా మా ఊరి పేరు చెపితే వచ్చి నన్ను ఆటోగ్రాఫ్లు అడుగుదామనే, ఆశ, మెలోడీ, ఎక్లైర్స్, కచ్చా మంగో బైట్. మాది $$$$$$$$, ఈ స్టేజి దగ్గర ఆగే ఏ బస్సు ఎక్కినా మాకు ఊరులో స్టాప్ ఉంటుంది. లగ్జరీకి తప్ప.
ఒక నలుపు రంగు గల్లా హల్ఫ్ హాండ్స్ టీషర్టు, బీజ్ రంగు చినో ప్యాంటు, పాదాలకి తెలుపు స్నీకర్స్ వేసుకొని, చేతికి smuggled goods లో తక్కువ ధరకు కొన్న fossil వాచ్ పెట్టుకొని ఉన్న నేను అక్కడికి వచ్చిన వెంటనే ఆశ్చర్యం వేసింది. అక్కడంతా ఎదో జాతరలో ఉన్నట్టు జనాలు పోగాయ్యారు. ముఖ్యంగా ఆడవారి సంఖ్య మరీ ఎక్కువ. అసలు దసరా, దీపావళి, సంక్రాంతీ, ఎలక్షన్స్ కూడా కాదు. అయినా ఎలక్షన్స్ లో సరిగా ఓట్లు ఎవరు వేస్తున్నారని నేను ఎలక్షన్స్ అంటున్నానెంటి. ఇంత రద్దీ ఎందుకుందా అనుకున్నాను, అప్పుడు గుర్తు వచ్చింది, నిన్న ప్రభుత్వం ఆడవారికి బస్సు ప్రయాణం ఉచితం అను పథకం అమలులోకి తీసుకువచ్చింది. ఓహో దాని ప్రభావమే ఇది అనుకున్నాను. నేను ప్రొద్దున వచ్చేటప్పుడు ఇలా లేకుండెది.
ఇప్పుడు అసలు ఒక బస్సుగాని వస్తే ఎలా ఎగపడిపోతారో అనుకుంటూ వుండగానే ఒక ∆∆∆∆∆∆∆∆∆ వెళ్ళే ఎక్స్పెస్ బస్సు రానే వచ్చింది. అందరూ గోల గోలగా ఎక్కేస్తున్నారు.
కర్చీఫ్ వేసే వాళ్ళు కర్చీఫులు వేస్తూ సీట్లు ఆపుకుంటూ ఉంటే, ఎక్కిన వారు వాళ్ళ కుటుంబసభ్యుల కోసం స్థలాలు ఆపుకుంటున్నారు. పిల్లా జల్లా అందరూ ఆగం ఆగం ఎక్కేస్తున్నారు. ఏంటి ఇంత చెప్తున్నా నేను ఎక్కట్లేదా అనుకుంటున్నారా, నాకు ఇంటికెళ్ళి పెద్ద పీకే పనులెం లేవు లెండి. ఇంకో పావుగంట ఆగితే మరో బస్సు వస్తుంది దానికి పోదాం అనుకుంటున్న.
చూస్తూ వుండగానే బస్సు నిండిపోయింది. అంతా ఆడవారే ముందు జాగాలో గమనిస్తే అనిపిస్తుంది. బస్సు వచ్చి జనం ఎక్కినా అక్కడింకా చాలా మంది ఉన్నారు. మరో రెండు బస్సులు వచ్చినా నిండుకునేలా ఉన్నాయి.
ఇట్లా కాదు ఇక తదుపరి వచ్చే బస్సు ఎక్కేయ్యాలి లేకపోతే మరీ ఆలస్యం అవుతుంది, అసలే నాకు ఇలా నిలబడడం అంటే బద్ధకం. ఇవాళ ఎందుకో ఎక్కువ ఉక్కపోస్తుంది.
ఇంకో ఎనిమిది నిమిషాలేమో, కుడి వైపు పిల్లర్ దగ్గరకు మరో §§§§§§§§ బస్సు వచ్చింది. ఆర్డినరీ బస్సు, ఎగపడిపోతున్నారు జనాలు. తలుపులు దానికి మధ్యలో ఉన్నాయి , ఆడవాళ్లే పోటీ పడి ఎక్కేస్తున్నారు. మగవాళ్ళు సాధ్యమైనంత వరకూ సీట్లు ఆపుకున్నారు. చూస్తుండగానే బస్సు నిండిపోయింది. ఆడవాళ్లే ఉచితం కదా అని తలుపు వరకూ నిల్చొని ఉన్నారు. నేనెక్కలేదు. ఇంకొక్కటి రాకపోదా అనుకున్నాను.
బస్సు కదిలే ముందు చూస్తున్నా, తలుపు దగ్గర ఒక అతను నా అంత కుర్రాడిలా ఉన్నాడు, నీలం రంగు మాండరిన్ కలర్ షర్టూ, భుజాన బ్యాగ్ వేసుకొని లోపలి మెట్టు మీద నిలబడి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అతని ముందున్న ఆవిడ కొంచెం పెద్ద వయసే, చూస్తే పల్లెటూరు మనిషిలా ఉంది, చిరాకుగా నోట్లో ఎదో గులుక్కుంటూ అతన్ని తల మీద కొట్టేస్తుంది.
“ చెప్తే వినపడ్తలేదా పొడా, ఇంకా పైకి వస్తున్నవ్, ” అని ఇక్కడ ఉన్న నాకు వినిపించేంతలా తిట్టింది.
అతనికి కూడా కోపం వచ్చింది అలా నెత్తి మీద కొట్టేసరికి, తల దులుపుకుంటూ ఆవిడ చేతిని ఆపి, “ ఎంది కొడుతునవు ఎంది ఆంటీ, ఏమనుకుంటున్నరు? ”
క్రమేపీ అతను ఆమె చేతిని ఆపే ప్రయత్నంలో ఆమె ఒక గాజు విరిగింది. ఇంకా కోపం పెరిగిపోయింది.
“ గాజు ఇరగొట్టినవు, దిగు పోరోడా ” అంటూ వెనక్కి నెట్టింది. అతని వెనకున్న వ్యక్తి మీద తగిలాడు. ఆ మధ్య వయసు గల కళ్ళకి అద్దాలు పెట్టుకొని, పైన ఆకుపచ్చ రంగు నిలువు గీతల షర్టు జేబులో ఫోను పెట్టుకొని ఉన్న వ్యక్తి కింద పడతాడేమో అని, నాకు కనిపించింది అతను కొద్దిగా జనికాడు, భయపడి రాడ్డు గట్టిగా పట్టుకొని, “ వో అమ్మా నువ్వే లోపలికి జరగారాదు ” అని మండిపడ్డాడు.
ఆమె కసురుకుంటూ, “ లోపల జాగేడుంది ” అని చెయ్యి దులుపుకుంది. ఇంతలో బస్సు వెనక్కి కదులుతూ ఉంది. బస్సు కదలడంతో వాళ్ళు మౌనం అయ్యారు. ఆ బస్సు వెళ్ళిపోయింది.
నేను ఇంకో బస్సు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, అప్పుడు ఒకతను నా ముందుకి వచ్చి చేతిలో చిల్లర పెట్టుకొని చేయి చాచుతూ చూసాడు. నిజంగా నాకు అడుక్కునే వాళ్ళంటే నచ్చదు, నా దగ్గర డబ్బులు ఉన్నా వెయ్యను. పేదవాళ్ళ మీద నాకు జాలి ఉంది కానీ అడుక్కునే వాళ్ళ మీద కొంచెం కూడా లేదు. కుడి చెయ్యి అడ్డంగా ఊపి లేవు అని సైగ చేసాను. వెళ్ళిపోయాడు. కొంచెం వెనక్కి వచ్చి పిల్లర్ కి ఒరిగి నిల్చున్న, ∆∆∆∆∆∆ ఎక్స్ప్రెస్ బస్సు ఇటుగా వస్తుంది. ఇక్కడ ఆగకముందే వెళ్ళి ఎక్కితే మంచిది అనుకొని, పరిగెత్తుకుంటూ వెళ్ళి, నా వెనక ఇంకో నలుగురు వచ్చారు. అందుకొని ఎక్కి నేనే మొదలు బస్సు ఖాళీ, బస్సు వెనక టైరుకి ముందు సీటులో కూర్చున్నాను.
నేను ఎక్కాక నా వెనక వచ్చిన వాళ్ళు కొందరు ఎక్కి సీట్లు ఆపుకొంటున్నారు. ఒక పెద్దాయన సంచి పెట్టి డోర్ ఎదురుగా ఉన్న సీటు, ఒక అమ్మాయి డ్రైవర్ వెనక పెద్ద సీటులో ఎవరో బయట నుంచి కవర్ వేస్తే దాన్ని తీసి వెనక సీట్లో వేసి తను కూర్చుంది. ఏం తెలివిరా బాబు అనుకున్న.
క్షణాల్లో చాలా మంది ఎక్కేస్తున్నారు, ఆడవాళ్ళని బస్సులో ఇంత ఎప్పుడూ చూడలేదు, నిజంగా మన దేశంలో మగవారికంటే ఆడవారి సంఖ్య పెరిగిపోయిందేమో, ఈ జనాభా లెక్కలు ఇంకా చెయ్యట్లేదు, మనకు స్పష్టత రావట్లేదు. నూట నలభై కోట్లకు పైనే ఉన్నారు, అందులో ఇంకా వలస వచ్చిన వారు కూడా ఉంటారు, ఎప్పుడు అవుద్ధి ఈ లెక్క. ఎందుకో నాకు మన దేశంలో కొన్ని సామాజిక సమస్యలకు ఎక్కువ జనాభానే కారమనం అనిపిస్తుంది, కానీ కాదేమో ప్రభుత్వ అధికారిక నిర్వహణ లేకా నాయకుల నిర్లక్ష్య ధోరనా, లేకుంటే ప్రజలు ఈ పథకాలు, హామీలకు పడి ఎంత ఎన్నికల మీద అవగాహన ఉన్నాకాని అభివృద్ధి అభిప్రాయం అడ్డగోలుగా అడ్డుదారి పడుతుందా. చూస్తుండగానే బస్సు నిండిపోయింది.
బస్సు ఎడమ పక్కన నేను కిటికీ పక్కన కూర్చున్నా కదా బయట ఒక ఆవిడ నాకంటే కొంచెం పెద్ధ ఏమో, తన కొడుగు అనుకుంట, చిన్న బాబు చాలా ముద్దుగా ఉన్నాడు, నా ముందున్న వ్యక్తికి కిటికీ లోనుంచి ఇచ్చింది. ఇలా ఇవ్వాల్సిన అవసరం ఏంటమ్మా అనుకున్న. బాబుని అందించి టక్కున ముందుకి వెళ్ళింది బస్సు ఎక్కాలని.
లోపలేమో మంది ఎక్కేస్తున్నారు నిండుకుంటుంది, ఆవిడ కూడా ఎక్కి ముందు నుంచి ఇటుగా చూసి బాబుని చూసి ఇక్కడి దాకా నాకంటే మూడు సీట్లు ముందు, వచ్చి బాబుని తీసుకుంది. ఆమెకి వెనక ఒకతను వెనక్కి అడుగేస్తే ఈమెకి తగిలాడు. ఇంకో అడుగు ముందుకేసి జరిగింది.
కండక్టర్ “ లోపలికి పోవాలి లోపల ఇంకా ఖాళీ ఉంది లోపలికి జరగండి అందరూ ” అంటున్నాడు. ఒక అబ్బాయి అస్సలు లోపలి వైలు అడుగువెయ్యట్లేదు. అతని చెయ్యి పట్టుకొని ఇటుగా లాగుతూ, “ నీకేనోయి చెప్పేది లోపలికి పో, నా సీటు పక్కన నిల్చుంటే నేను ఎక్కడ కూకుంటా ” అంటూ అతన్ని వెనక్కి పంపి ముందున్న వాళ్ళని లోపలికి ఎక్కమన్నాడు.
ఒక్కొక్కరూ ఎక్కుతూ లోపలికి వస్తూ ఉన్నారు, కుడి వైపు నా వెనక ఉండే సీటులో నేను కూర్చునే ముందు చూస్నట్టు గుర్తు అక్కడ సంచి ఉండేది, ఇప్పుడే ఒక ఆవిడ లావుగా ఉంది, తన భర్త బక్కగా ఉన్నాడు, ఆమె ఒక పది వయసు అనుకుంటా పాప చెయ్యి పట్టుకొని వచ్చి ఆ సీటులో కూర్చుందాం అనుకుంటూ ఉండగా అక్కడ సంచి ఒక్క సీటులో ఉంది, మరో రెండు ఖాలీల్లో ఒకతను కొంచెం మీసాలు తెలుపెక్కాయి, కూర్చున్నాడు. ఆమె వచ్చీ రాగానే, “ ఆ సీటు మేము ఆపుకున్నాము మీరెలా కూర్చుంటారు అంది. ”, అతను కొంచెం ఇటుగా జరిగి సంచి దాని పక్కన ఖాళీ విడుస్తూ, “ కూర్చోండి ” అని బదులిచ్చాడు. ఆవిడ, “ లేదు మొత్తం సీటు మాదే మేము ముగ్గురం ఉన్నాం ” అంది తుత్తరపోతూ. ఆ మనిషి, “ అరె అలాంటప్పుడు రెండు సంచులు వేసుకోవాలి, నేను వచ్చి కూర్చున్న నన్ను లేవమంటున్నవ్ ” అని తెగించాడు. ఆవిడ భర్త, “ సంచి చూసి ఇంకో సీటు చుస్కోవాలి అని తెలీదా ” అన్నాడు కొద్దిగా తిరుగుబాటుగా. అతనికి కొంచెం చిరాకొచ్చింది, “ ఇగో నేను ఎక్కిన నాకు సీటు దొరికింది, ఇక్కడే వేరే సీట్లు ఖాళీ లేవు కూర్చున్న. మీరు ఇద్దరు, కూర్చోండి పాపని మీద కూర్చో పెట్టుకోండి ” అన్నాడు విసుక్కుంటూ. ఆవిడ ఊకోలేదు, “ మేము సీటు ఆపుకున్నాము, లేవ్వండి అంతే. ” ఏంటమ్మా ఆపుకుంది, సంచి ఒక్కసేటులో ఏసి, నేను నాకు సీటు దొరికింది కూకున్న. దీనికే లొల్లి చేస్తారా ” అంటూ కొంచెం గొంతు పెంచాడు. ఆవిడ భర్త, “ లోల్లేంది వ్యా నువ్వచ్చి కూర్చుంది కాక ” అన్నాడు. ఆవిడ “ అయినా ఆడాల్లతోని ఎంది నీ లొల్లి ”. వీళ్ళిద్దరూ ఇలా అనగానే అతను, కాళ్ళు బిగించి, “ ఏంది మీరే లొల్లి చేసుకుంట నన్ను అంటుర్రు, బస్సుల అన్ని సీట్లు మీవేనా ఏందీ. రెండు సీట్లు ఉన్నాయి కూకొండి అమ్మ. ” అంటూ మొహం ముడుచుకున్నాడు. రెండు నిమిషాలు అలా చూస్తూ నాకెందుకులే అనుకొని ఇటు తిరిగాను. వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు మరి, ఇక ఇదారూ రెండు సీటులో కూర్చొని పాపని ఆమె ఒళ్ళో కూర్చోపెట్టుకుంది.
అప్పుడే కిటికీ నుంచి ఎవరో ఆడ మనిషి, “ ఓ పొల్లా ఎక్కడున్నవే ” అంటూ కేకలు వేస్తున్న చప్పుడు. చూస్తే నలభై ఐదు పైనే ఉంటాయేమో ఆవిడ వయసు, నీలి రంగు చీరకట్టుకుని అటూ ఇటూ నడుస్తుంది. మొహంలో కంగారు ఎవరినో పిలుస్తుంది. “ ఓహ్... పొల్లా ఉన్నవా, ఒకసారి సూడు, పిలగాడు ఉన్నాడా ” అంటూ మొత్తుకుంటూ హైరానా పడిపోతుంది. ముందుకి వెళ్ళి అక్కడ ఎవరినో అడిగింది, “ చిన్న పిలగాన్ని ఎత్తుకొని ఉందా చూడండి, లోపల, పిలగాడు ఎర్ర అంగీ ఎస్కొని ఉంటడు. ” అని అడిగింది. అతను, “ ఏమోనమ్మ మంది ఉన్నారు ఏం తెలుస్తలేదు ” అన్నాడు. ఆమె మళ్ళీ బస్సు వెనక నుంచి అటు వైపు వెళ్ళి అలాగే కేక పెడుతుంది.
చిన్న పిల్లాడు ఎత్తుకోవడం, ఎర్ర అంగీ, అనుకున్న ఇందాక నా ముందు ఉన్న వాళ్ళ గురించేనేమో. అప్పుడు ఆమె, “ అనుషా.... ఓ.... అనుషా.... ఎడున్నవే పోల్లా ఒకసారి బయటకి సూడు ” అని అరిచింది. ఇక్కడ పిల్లాడిని ఎత్తుకున్న ఆమె ముందుకి చూస్తూ తన పక్కన ఉన్న అమ్మాయితో మా అక్క ఎక్కాలి ఇంకా ఎక్కట్లేదు అంటుండగా బయట తిరుగుతున్న ఆవిడ అరుపు విని, వెనక్కి తిరిగి అటువైపు కిటికీ దగ్గర మొహం, పెట్టి “ అక్కా ఈడున్నా ఇటూ ” అంటూ కేకేసింది. ఆలోపు ఆమె మళ్ళీ తిరిగి నావైపు వచ్చింది. నేను పిలిచాను, “ ఆంటీ ఇగో లోపల ఉన్నారు ఇక్కడ ఇటూ ” అంటే నన్ను చూసి నా దగ్గరకి వచ్చి లోపల వాల్లను చూసింది.
ఈమె, “ పిలగాడు పిలగాడు ఉన్నడా. ” ఆమె, “ ఉన్నాడు ఉన్నాడు నువు ఎక్కు అక్కా ” అని బదులిచ్చింది. ఈవిడ, “ మంది నిండుకున్నరు ఎట్లా ఎక్కాల్నో ఏమో, ఎంది ఈ మంద ” అని గులుక్కుంటూ ముందుకి వెళ్ళి ఎక్కింది. రెండో మెట్టు మీద కాలేసిందో లేదో, అక్కడ ఒక అతను ఉన్నాడు, అతన్ని పకక్కి జరగమందేమో, అతను చిరాకు పడుతూ, “ ప్లేస్ లేదు, ప్లేస్ లేదు, ఇంకో బస్సు వస్తది దాన్లో ఎక్కండి ” అన్నాడు. ఆవిడ ఎలాగోలా లోపలికి ఎక్కి అతన్ని దాటి, “ లోపల మావొళ్ళు ఉన్నరు అన్నా, ఒకసారి జరుగు నేను లోపలికి పోతా ” అంటూ ఆగంలో అడుగు ముందుకు వేసింది. అక్కడ ముందు సీటులో కూర్చొని ఉన్న వ్యక్తి కాలు తొక్కేసింది. “ ఆ... వో అమ్మా ఎంది ఎటు ఉరుకుతున్నావు ” అని అరిచాడు. ఆమె తప్పు అనుకొని ఎదో అనెలోపు, “ ఆడాలకి ఫ్రీ పెట్టుడెందో బస్సు మొత్తం మీదే అన్నట్టు చేస్తరు. ఉరుకుతుంది కాళ్ళు కూడ చూస్తలేదు ” అన్నాడు మండిపడుతూ.
వాళ్ళు మాట్లాడుకునేది నాకు వినిపిస్తుంది అంత గోలగా ఉంది మరి. ఆవిడ కూడా కొద్దిగా కోపం తెచ్చుకుంది. “ ఎంది ఆడాల్లని మాట్లుడుతున్నవ్, నువ్వెట్ల బస్సు ఎక్కినవో మేము అట్లనే ఎక్కినం. లోపలికి పోతుంటే కాలు తీయలేదు, సాపి కూకున్నవు. జరగవయ్యా మా పొల్ల లోపల ఉంది, చిన్న పోరోడు ఉన్నాడు. ” అంది.
అతను కాలు అడ్డం తీసి ఆమె ఇటు దాటాక, “ ఎందుకెక్కుతరేమో బస్సులు, ఫ్రీ అనగానే ఇంక ఎక్కువ ” అంటూ గులిగాడు. అది వినింది. “ ఇగో అయిపోయింది నేను లోపలికి పోతున్నా మళ్ళీ ఆడాల్లని అంటున్నావ్ ఏంది, ఏం మనిషి వి ” అని బెదిరించింది. “ ఏం మనీషా ఏం మాట్లుతున్నవ్, మాటలు మంచిగా రానివ్వు ” అన్నాడు. “ ముందు నీ నోరు చూస్కో, ఆడాల్లని అంటున్నావు, సెక్యూరిటీ అధికారి స్టేషన్ ల పెట్టాలా. బస్సు టౌన్ ముందు ఆగిందో ఇంటికి పోవు. ఏం. ” అంటూ రెచ్చిపోయింది. ఇదంతా నేను చూస్తున్నట్టు కండక్టర్ కూడా చూసి ఎదో అయ్యేలా ఉంది, అని “ ఓ అమ్మ నువు లోపలికి పో ” అంటూ, కండక్టర్ కి కూడా కదలోస్తలేదు. ఆమె లోపలికి నా వైపు గా వస్తూ, మధ్యలో నిలబడిన వాళ్ళతో, “ కొంచెం తప్పుకో అమ్మాయి, అసలు మెసలత్తలేదు గింత గానం ఎక్కిర్రు ఏంది ఇవాళ ” అని నసుగుతూ వాళ్ళ చెల్లి దగ్గరికి చేరుకుంది.
అప్పుడు నేను ఉన్న బస్సు కదిలింది వెనక్కి తీసుకుంటూ ఉన్నాడు డ్రైవర్. పక్కన జగిత్యాల బస్సుని చూసాను, దానిలో ఇద్దరు ఆడవాళ్ళు కొంగులు పట్టుకొని కొట్టుకుంటున్నారు. నేను ప్రొద్దున instagram లో చూసాను ఇలాంటివి, కానీ ఇప్పుడే లైవ్ లో చూసా. అదే బస్సులోంచి ఒక వ్యక్తి దిగుతూ, “ వానక్క ఫ్రీ పెట్టినాడు కొన్ని బస్సులు extra వెయ్యాలి, ఎందుకురా ఇది అంత ఆగం పుక్ కథ కాకపోతే ” అంటూ సీటు దొరక్క తిట్టుకుంటూ నా వైపుగా వచ్చి పక్కన స్టేజ్ మీదకి ఎక్కాడు. నేను అనుకున్న అసలు వీళ్ళే హామీలకు ఆకర్షితమయ్యి వీళ్ళే ఓట్లు వేసి గెలిపించి, ఇప్పుడు ఇలా అమల్లోకి వచ్చాక ఎందుకు తిట్టుకోవడం అని. ఇంత పథకం పెట్టారు సరే మరీ ఉచితంగా ఎందుకు, కొందరు దీన్ని వృధాగా వాడుకునే అవకాశాలు కాదు కాదు వాడుకుంటున్నారు కూడా. దీని వల్ల పెద్ద రచ్చనే అవుతుంది అంటూ చాలా మంది మాట్లాడుకుంటున్నారు. నేను దీన్నేం వ్యతిరేకించట్లేదు లేదా ప్రభుత్వానికి నిందించడం లేదు, ఇది బాగానే ఉంది కాకపోతే ఎంత వరకు ఈ కర్చుని ప్రభుత్వం భరిస్తుంది, పైగా అవసరం ఉన్నవాళ్ళకి మాత్రమే పథకం వరిస్తే చాలు. అందరూ పేదవాళ్ళు కాదు కదా. ఎక్స్ప్రెస్ ఎక్కుతారు అంటే రెండు కారణాలు ఉండొచ్చు ఒకటి, త్వరగా పోవచ్చు అనుకునే వాళ్ళు, లేదా డబ్బులు పెట్టుకొగలం అనుకునే మధ్యతరగతి వాళ్ళు. కావునా దీన్ని బట్టి మనం అనుకోవచ్చు చాలా మందికి బస్సు చార్జీలు పెట్టుకునే తహత్తు ఉంది అని, ఇది లేని వారికి ఇలాంటి పథకాల ఉపయోగం అందించాలి అనుకుంటున్న. మహిళల్లో కూడా బస్సు ప్రయాణం అనేది వారికి ఆవసరం, వారు ఉద్యోగం, వ్యాపారం, ఎదో ఒక సంపాదన పని చేసుకునే వారు తరచూ బస్సులో ప్రయాణం చేసే అవసరం కలిగిన వారికి ఇవ్వాలి అని నా ఉద్దేశం. అయినా ప్రభుత్వం త్వరలోనే ఎదో ఒక విధంగా తగిన ఆలోచన చేసి అర్హత గలిగిన వారికి ఈ సౌకర్యం అమలు చేస్తుంది అనుకుంటున్న.
నాకు ప్రాయంలో ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఇక నేను ఈ ఆలోచనలో ఉంటే బస్సు వెనక్కి కదిలి బస్టాండ్ exit ద్వారం ద్వారా రోడ్డెక్కింది. అక్కడ స్వాతి హోటల్ ఉంటుంది నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇక రోడ్డెక్కి ఎడమకి గీతా భవన్ వైపు వెళుతుంది. రెండు నిమిషాల్లో multiplex signal దాటింది. Multiplex మూడు స్క్రీన్స్ ఉంటాయి, అది మొదట్లో ఇక్కడ స్థాపించినప్పుడు imax రేంజ్ లో ఫీల్ అయ్యాము కానీ ఇక్కడ ఎక్కువ సక్సెస్ అవ్వలేదనే చెప్పుకోవాలి. అయినా దాన్లో సినిమాలకు వెళ్ళే రేంజ్ నాది కాదు, ఎదో ఒక్కసారి అప్పట్లో స్నేహితుడితో బాహుబలి సినిమా చూసాను అంతే.
కండక్టర్ ముందున్న ఆడవాళ్ళని కొంచెం అటూ ఇటూ నిలబండండి అంటూ చెపుతున్నాడు. నిజమే అతను మగాడు నిలబడిన వాళ్ళలో సగం మంది ఆడవారు ఉన్నారు, అసలు తను ఎలా నడుచుకుంటూ ఆఖరి సీటు దాకా ఎలా వస్తాడో ఏమో. నిజం అండి, మగాడికి ఆడదాని ముట్టుకోడం ఎంతో బాగనిపించినా ఇలా వాళ్ళని దాటుకొని రావడం కూడా ఇబ్బందే. ఇంకో నిమిషంలో గీతా భవన్ చౌరస్తా వచ్చింది. ఇక్కడ బస్టాప్ ఉంటుంది. ఇంత నిండిపోయిన బస్సు ఇంకెవ్వరు ఎక్కుతార్రా బాబు, ఆపిండు బస్టాప్ ముందు. ఇద్దరు కుర్రాళ్ళు ఎక్కారు. డోర్ దగ్గర ఊగులాడుతూ. ఒకడు వెనక పచ్చరంగు బ్యాగ్ వేసుకున్నాడు, ఇంకొకడు ఉత్తచేతులతోనే ఉన్నాడు. బస్సు కోర్టు చౌరస్తా వైపు వెళుతుంది. తోవలో Woodland show room, vivo service centre, chicken and mutton kabab and tandoori అడ్డా, నేను ఎప్పుడూ దానిలో తినలేదు, తినాలి అనిపిస్తే ఇంట్లోనే ఒక కోడి తెచ్చుకొని కోసుకొని దాన్ని మంచిగా మరినెట్ చేసి మాకు ఇంటి బయట కట్టల పోయి ఉంది, స్టాండ్ మీద పెట్టి మంచిగా కాలుస్త, దాన్ని ప్లేట్ లో పెట్టి ఒక్కో కాలు, రెక్క కోసుకొని నేను మా వాళ్ళు తింటాము. అలా జీవితంలో ఇప్పటికీ మూడు సర్లే తిన్నాము లెండి.
ఆ!... ఎక్కడున్నా, కోర్టు చౌరస్తా దగ్గరికి దాకా వచ్చేశాం, అక్కడ ఒక మొక్కల నర్సరీ ఉంటుంది చాలా పెద్దది. బాగుంటుంది ఒకసారి వెళ్ళాను కొన్ని రోజుల క్రితం. మేము కొత్తగా కట్టుకున్న ఇంట్లో పెట్టుకోడానికి కొన్ని మొక్కలు తీసుకెళ్ళాను. అది దాటి కోర్టు చౌరాస్తకి వచ్చాక బస్సు నిండి ఉంది, ఇక్కడెందుకు ఆపాడో తెలీదు. బస్సుని చూసే ఎవ్వరూ ఇటుగా రాలేదు. అప్పుడు బస్టాప్ వైపు చూసాను, అక్కడ Sunshine hospital. నేను ఐదు ఏళ్ళు, ఇంటర్ మరియు డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇక్కడే దగ్గర్లో మా కాలేజ్ ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కేవాడిని. ఇంటర్ లో చదువు ఇంటికి వెళ్ళాక గేమ్స్ ఆడటం ఉండేవి ఆ తరువాత డిగ్రీ వచ్చాక, అసలు తిరగని చోటు లేదు, చూడని సినిమా లేదు, ఫుల్లుగా గాలికి తిరగడమే. నేను కాలేజ్ కి పోయింది చాలా తక్కువ, మా క్లాసులో నన్ను ఆకట్టుకునేలా ఒక్కమ్మాయి కూడా లేనందుకు ఏమో మరి. అందులో విచిత్రం ఏమిటంటే కాలేజ్ కి సంవత్సరంలో పోయింది ఇరవై ముప్పై రోజులైతే నాకు మాత్రం చాలా మార్కులు వచ్చేవి అవి ఎందుకు వచ్చేవో నాకు తెలీదండీ నిజం. నేను పక్కాగా ఫెయిల్ అవ్వాల్సిన పేపర్లు, ఇంట్లో కూడా ఫెయిల్ అని చెప్పినా అయినా పాస్ అయ్యాను, అదో వింత.
ఇక కండక్టర్ వస్తున్నాడు, ఒక్కొక్కరిని మందలిస్తూ సరి చేస్తూ వస్తున్నాడు. ఆఖరి సీటు వరకీ వెళ్ళాడు. టిక్కెట్లు తీసుకోవడం మొదలు అయ్యింది. ఆఖరి సీటులో కుడి వైపు ఇద్దరు ఆడవ్వాల్లు, అక్కడి నుంచి ఈ చివరి వరకు మగవాళ్ళే. ఆడవాళ్లలో ఒక ఆమె §§§§§§ కి టికెట్ తీసుకుంటే, ఒక ఆమె వాల్ల భర్తతో పాటు, మా ఊరికి తీసుకుంది. ఇటుగా ఉన్నవాళ్ళలో ఇద్దరు ∆∆∆∆∆∆ కి తీసుకున్నారు. ఇటున్న మిగతావారు §§§§§§§ తీసుకున్నారు. నా వెనక అటు సీటు ఇందాక గొడవ అయింది గా వాళ్ళు ∆∆∆∆∆ తీసుకుంటే, నా వెనక ఒకరు §§§§ తీసుకుంటే, ఒకరు $$$$$ తీసుకున్నారు.
అప్పటికీ కొన్ని నిమిషాలు దాటి బస్సు నాక చౌరస్తా కి వచ్చింది. దీన్ని కార్ఖానా గడ్డా అని కూడా అంటారు, చిన్నప్పుడు మేము ఇక్కడే దగ్గర్లో ఉండేవాళ్ళం. అప్పట్లో అంటే నాకు ఎనమిది - తొమ్మిది వయసు ఉన్నప్పుడు, ఇక్కడ హిందూ '' గొడవలూ, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ గొడవలూ, లోకల్ దాదా గిరి, అబ్బో ఘోరంగా ఉండేది అని ఒక టాకు. నేను నా కళ్ళతో ఎప్పుడూ చూడలేదు, చూసింది ఒక్కటే, రెండు వేల పదకొండు ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్పు అప్పుడు టవర్ సర్కిల్ అనగా పెద్ద గడియారం చౌరస్తాలో ఉండే గడియారం టవర్ మీద ఎవరో పాకిస్తాన్ జెండా పెట్టారు అందుకు గొడవ రచ్చ రచ్చ జరిగి, ఒక కారు తగలపెట్టేసారు. రెండు బండులు కూడా. తరువాత ఇండియా గెలిచాక మా ఇంటి దగ్గరే మైదానంలో పెద్ద గుంపు గొడవ. నేను చదవడం కంటే తిరగడమే ఎక్కువ. అప్పట్లో అంత తిరిగే వాడిని ఇప్పుడు ఎందుకు ఇంట్లో కూర్చున్నాను అని అర్థం కాదు. జాతకం అనిపిస్తుంది కానీ నేను అలాంటివి నమ్మను.
బస్సు ప్రయాణం కొనసాగుతుంది, నేను కూడా మా ఊరికి తీసుకున్న, నా పక్కన అతను §§§§§§§ తీసుకున్నాడు. అటు సీటు వాళ్ళు ముగ్గురూ ఒకే కుటుంబం, ∆∆∆∆∆ తీసుకున్నారు. కండక్టర్ అంతా సెట్ చేస్తూ వచ్చాడు కాబట్టి ఇక డిస్టర్బెన్స్ లేదు. ఫోన్ తీసి xossipy ఓపెన్ చేసి, గీత భరత్ బర్త్డే కిస్ అప్డేట్ కి ఏం కామెంట్లు లైకులు వచ్చాయా అని చూస్తున్న. నా పక్కన వ్యక్తి సైట్ లో కింద ఆడ్స్ చూసి నన్ను అదోలా చూసాడు. తనవెరో మనకెందుకు, ఏమైనా అనుకొని తొక్క, తెలుగు ఫోరమ్ చూస్తూ ఉంటే ఒకడు లైనుగా ఒక్కో కథకి కామెంట్లు ఉన్నాయి, గీత ఓపెన్ చేసా కథలో ఉన్నాడు. నాలుగు నిమిషాల క్రితమే ఒక కథలో కామెంట్ ఉంటే, నేను ఇచ్చిన అంత పెద్ద అప్డేట్ అంత త్వరగా చదివాడా ఏంటి కామెంట్ అప్పుడే లోడ్ అయ్యింది. షాక్ అయ్యాను. ఉష్.... పోన్లే ఇచ్చిన అప్డేట్ ఒక కామెంట్ ఎక్కువ పడింది అనుకున్న. ఇక earphones తీసాను, పాటలు విందాం అని.
అప్పుడు ఆ చిన్న బాబు నా వైపు చూస్తూ ఉంటే పలకరిస్తూ వాడి బుగ్గలు లాగాను. వాళ్ళ అమ్మ అనుష, అప్పటి నుంచీ ఎత్తుకొని ఉంది కదా చేతు బరువు అనిపించసాగింది కాబోలు నన్ను చూపిస్తూ, “ అన్నయ మీద కూర్చో ” అంటూ అడిగింది. బాబు తల అడ్డంగా ఊపుతూ, “ ఊహు ” అన్నాడు. నేను చేయి చాచి రమ్మన్నాను నా తొడ మీద కూర్చోపెట్టుకుందాం అని, అయినా రాలేదు. వాళ్ళ పెద్దమ్మ వాడి చెంపలు నొక్కుతూ, “ కుర్చోరాధురా అన్న మీద ఎంత సేపు ఉంటావ్ ఇట్లా ” అంటూ నన్ను చూపిస్తున్నా వాడేమో అస్సలు దిగట్లేదు. నా మొహం వాడికి నచ్చలేదో ఏమో మరి. కాసేపు వాడి చేతులు చెక్కిలి చేస్తూ ఆడాను. అప్పుడు వెనక్కి తిరిగి వాల్ల అమ్మతో, “ అమ్మి టాయ్ ” అన్నాడు. వాళ్ళమ్మ కంగారు పడింది, పెద్దమ్మతో, “ అక్క టాయి అంటుండు ”. వాళ్ళ పెద్దమ్మ, “ హో.... ఇప్పుడు మూత్రం ఎక్కడ పోస్తవ్, ఆగురా కన్నా ” అంటూ మందలించింది.
పక్కన కండక్టర్ టికెట్లు కొడుతూ ఉన్నాడు. అదే ప్రింటింగ్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పెద్దమ్మ అతడితో, “ చిన్న బాబుకి మూత్రం వస్తుంది అట ఆపుతరా బస్సు. ” అనడిగింది. అతను ఇప్పటికే ఇంత మందిలో కదలలేక, “ బస్సు ఆపితే మీరు ఎప్పుడు దిగాలి ఎప్పుడు ఎక్కాలి, కష్టం అమ్మ మీ స్టేజ్ దాకా ఆపుకొండి. ” అంటూ చెప్పుకొచ్చాడు. వాడేమో, “ అమ్మి టాయి, అమ్మీ టాయి ” అంటూ చంకలో ఎగురుతూ ఉన్నాడు. “ ఉండరా ఇప్పుడే రావాలా నీకూ ఎటు కాకుండా ” అంటూ విసుక్కుంది. ఆవిడేం చేస్తుంది, అసలు వాడు ఆపుకుంటాడా లేకుంటే పంపు విప్పుతాడా వాహ్.... చాలా ఆసక్తికరంగా ఉంది నాకు. వాళ్ళ పెద్దమ్మ మా ఊరికే టికెట్ తీసుకుంది, మా ఊరు రావడానికి ఇంకో ఇరవై నిమిషాలు అయినా పడుతుంది. చూడాలి మరి ఇరవై నిమిషాలు, నాలుగేళ్ళ పిల్లాడు, ఆపుకుంటాడా లేదా...
వీడి హైరానకి వాళ్ళ పెద్దమ్మ మరో సారి కండక్టర్ అడిగింది, “ ఒక్కసారి ఆపరాదు, పిలగాడు ఆగేటట్టు లేడు ” అంది. ఆ కండక్టర్ అటు ముందు వాళ్ళకి టికెట్ చేతికిస్తూ, “ కష్టం అమ్మా ” అన్నాడు. “ అయ్యో ఒక నిమిషం ఆపుతే ఎంది అన్నా ” అంటూ నిట్టూర్చింది వాళ్ళమ్మ. కండక్టర్ విసుక్కుంటూ, “ ఒక బాటిల్ తెచ్చుకుంటే బాగుండు కదా అమ్మా నువు ” అన్నాడు. నాకు నవ్వొచ్చింది. అక్కడ మేము ఐదుగురం నవ్వాము. వాళ్ళ పెద్దమ్మ, “ అగో గట్లంటవు ఏంది అన్న, అదేమైనా చెప్పి వస్తదా ” అంది.
పిల్లోడు మౌనంగా ఉన్నాడు. వాళ్ళు సర్లే ఊకున్నాడు అనుకున్నారు. నేను వాడినే చూస్తున్న, సునామీ వచ్చే ముందు సముద్రం ప్రశాంతంగా ఉంటుంది అంట, అది కానీ జరుగుదా అనుకున్నాను. నవ్వుకున్నాను. వాడు నన్నే అదోలా చూస్తున్నాడు. నాకు వాడి మొహం చూస్తుంటే అదే అయ్యేలా ఉంది అనిపిస్తుంది. ఇక్కడ నాకు ఇంకో ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది, వాడు కుళాయి విప్పితే ప్యాంటు మాత్రమే తాడుస్తుందా లేక వాళ్ళమ్మ మీద పడుతుందా, లేక వాడి కాళ్ళ ముందే ఉన్న నా ముందు సీటు అంకుల్ మొహం మీద పోస్తాడా అని. చూద్దాం ఏమవుద్దో.
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
13-01-2024, 08:14 PM
(This post was last modified: 21-04-2024, 09:20 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
నేను చెవిలో earphones పెట్టుకొని పాటలు పెట్టుకున్న. “ ఎవరెవరో నాకేదురైన నువు కలిసాకే మొదలైందే……….. మెళకువలో ఓ ఓ.... కలగా దోచె మరుజన్మేదో మొదలైందే...., ఏమో ఎం చేస్తున్నానో, ఇంకా ఇంకేమేం చేస్తానో ఇలా....... ఆ...”
వింటూ ఉంటే సినిమాలో పెళ్ళాం ఉన్నా కానీ ఇంకో దానితో అలా ఏమన్నా ఉందా, నిజంగా నాకు అలా కావాలి, పెళ్ళాం ఉన్నా ఇంకొకరు కావాలి. అసలే నాకు వేడి ఎక్కువ. అయినా రెండు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోకూడదు నాకు అర్థం కాదు, అంటే అన్నాను అంటారు గానీ ఒకప్పుడు రాజులు రెండు మూడు ఇంకా ఎక్కువే చేసుకున్నారు వాళ్ళు సంతోషంగా లేరా, అక్కడ లేని తప్పు ఇప్పుడెందుకు. నా ఉద్దేశం చెప్పాలా, ఇప్పుడూ ఒక మగాడికి ఒక అమ్మాయి నచ్చి ఇద్దరూ ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు. కానీ ఒక మగాడికి ఒక్క అమ్మాయే నచ్చలని నిబంధన లేదు, అలా ఇంకో అమ్మాయి నచ్చుద్ది, ఇప్పుడూ ఆ అమ్మాయికి కూడా ఈ మొగాడు నచ్చుతాడు, కానీ చేసుకోలేదు, ఇప్పుడు ఆ అమ్మాయి వేరొకరిని చేసుకుంటుంది, నేను అతనితో ఉండలేకపోయాను అనుకొని నిరాశ చెందుతుంది, అవునా కాదా. సరే నాకు తెలుసు నాకు తెలుసు మీరు అడగబోయే ప్రశ్న నాకు తెలుసు, ఇలా ఒక అమ్మాయికి ఇద్దరి మోగాల్లు కావాలి అనుకుంటే ఎలా అంటారు, నేను మాత్రం నచ్చినప్పుడు చేసుకోవడంలో తప్పేం ఉంది అంటాను. సర్దుకోవాలి అంతే. అరె అరేంజ్డ్ మ్యారేజ్ చేసి సర్దుకోవాలి అన్నప్పుడు ఇది కూడా సర్దుకోవాలి అర్థం చేసుకోవాలి అనాలి. సరే సరే ఈ టాపిక్ కి ఒక క్లారిటీ లేదు లెండి వదిలేద్దాం. మీలో ఎంత మందికి మన దేశంలో అక్రమ సంబంధం చట్టవిరుద్ధం కాదు అని తెలుసు. ఇప్పుడు మరోసారి పార్లమెంటులో చట్టవిరుద్ధం చెయ్యాలి, అది కూడా ముందు తప్పు మోగాడిదే అవుతుంది అని అంటున్నారు. అది ఎప్పుడూ అమల్లోకి వచ్చేది తెలీదు.
పిలగాన్ని చూస్తూ మళ్ళీ earphones చేవుల్లోంచి తీసా, మనోడు మళ్ళీ గుక్కపెట్టడం మొదలు పెట్టాడు, “ ఇ.... ఆమ్.... ఇ.... టాయ్....” అంటూ వాళ్ళమ్మ వడిలో కదులుతున్నాడు. వాళ్ళమ్మ, “ సప్దేక ఉండు, ఇంకొచెం సేపు ” అంటూ ఉండగా వాడేమో అటూ ఇటూగా కదులుతూ కాళ్ళు ఆడిస్తూ ఉంటే, భుజం మీద కొట్టింది. గోల మొదలు పెట్టాడు, “ ఈఈ..... టాయ్.... టాయ్.... ”
నా ముందున్న వ్యక్తి చిరాకు పడుతూ “ ఏడవకు, ఊకుంచమ్మా ” అన్నాడు. ఆమె, “ మూత్రం ఆగుతలేదు అంటుండు ఎట్లనో ఏమో ” అంది మొరాయిస్తూ.
ముందున్న కండక్టర్ ఇటు చూసి, “ అక్కడే విప్పు అమ్మా ఇగ పోసుకుంటడు ” అంటూ పరిహాసం చేసాడు.
నాలుగో వరుస వెనక పోల్ ముందు ఒకతను ఇన్షర్ట్ వేసుకొని ఉన్నాడు, టీచర్ ఏమో బహుశా షర్ట్ జేబులో పెన్నులున్నాయి. ఎదో ఒకటి, వెనక వాళ్ళు కాస్త వెనక్కి జరిగితే అతను కూడా వెనక్కి ఎడమకి తిరుగుతూ పొల్ మీద ఒరిగే ప్రయత్నం చేస్తుంటే, అతడి ముందున్న పసుపు రంగు చీర కట్టుకున్న ఆంటీ జెడ కురులు అతని షర్ట్ బొత్తాల్లో ఇరుక్కున్నాయి. వెనక్కి అడుగు వెయ్యగానే, అప్పుడే యాదృచ్ఛికం, బస్సు సడెన్ బ్రేకు వేసి అతను ఇంకాస్త వెనక్కి ఒరగడంతో ఆవిడ రెండు వెంట్రుకలు ఊడొచ్చాయి. “ ఆ... శ్.... ” అంటూ అరిచి వెనక్కి చూసి అతన్ని కోపంగా, “ చుస్కొరా, ఎట్లా పడుతే అట్లా నిల్చుంటరా, నా మీద మీదకి ఎందుకు ఉన్నారు. ” అని మొహం విరుచుకుంది.
అసలు అతని తప్పేం లేదు, నాకో అనుమానం ఈ మధ్య ఉప్పు ఎక్కువ తింటున్నారా అందరూ, చిన్న చిన్న వాటికే కోపం వచ్చేస్తుంది.
“ ఎందమ్మా ఇక్కడ ప్లేస్ లేక నేను వెనక్కి పోతే అట్లా అరుస్తవు నా మీదకి, ఎట్లా కనిపిస్తున్నా ఆ...”, “ అయినా ఫ్రీ బస్సు అనగానే ఓ ఎక్కేసిర్రు, మీకు ఫ్రీ పెట్టుడే ఎక్కువ ఇంకా మాకు జాగ లేక, తిట్లు కూడా ” అనేసాడు మండిపడుతూ. ఏం దరిద్రమో ఏమో బస్సులో ఒక్క కనీసం యావరేజ్ అమ్మాయి కూడా లేదు, అనుకుంటూ ఉంటే ఈ ఆంటీ ఇటు తిరిగింది. ఆంటీ ఉందీ, మాస్త్ ఉంది. వాడు కావాలనే ఆమె మీద ఒరిగాడేమో అనిపిస్తుంది నాకు. ఆవిడకి అలా అనగానే కోపం వచ్చి, “ ఫ్రీ బస్సు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, నువ్వెందుకు మాట్లాడాలి, బస్సు ఎక్కినవు ఎక్కడుండాలో అక్కడ ఉంటే మంచిది చెప్తున్న ” అంటూ బెదిరించింది. “ అంటే నువ్వే జెడ విప్పుకుంటవ్, నీ జుట్టే నాకు తాకుద్ది, నువ్వే తిడతవా ఇగ, అందుకే ఆడాల్లకి అన్నీ ఇయ్యద్దు, నన్ను ఎందుకమ్మా ఇగ మేము బస్సు ఎక్కాలా వద్దా ఎంది ” అని గునుక్కున్నాడు. ఆవిడ కళ్ళు పెద్దచేసి చిరాకుగా చూస్తూ, “ ఇగో ఎక్కువ మాట్లాడినవో, ఆడాల్లని ఏమైనా అన్నవో బస్సు మొత్తం ఆడాల్లే ఉన్నారు, ఇక్కడే కుమ్ముతరు నిన్ను ”. అతను ఆవిడ మీదకి లేస్తూ, “ ఎంది కుమ్ముతవా దా కుమ్ము సూద్ధాం. ఏం మాట్లాడుతున్నావు నువు అసలు ”. ఆవిడ ఒకడుగు వెనక్కి వేసి, “ అగో మీదకి వస్తవూ సూసిర్రానుల్లా గీ మనిషి ” అంది.
కండక్టర్ వీళ్ళని చూసి, “ వో ఎంది లొల్లి, అన్నా నువు జర వెనకకు పోరాదే ” అన్నాడు.
“ ఇంకెక్కడికి పోతాం అన్నా, ఇంత దానికి గింత చేస్తుంది ఈమె ”.
“ అగో నువు మల్ల ఈమె గీమే అంటే మంచిగుండది చెప్తున్నా. ” అని ఇద్దరూ మండిపోతున్నారు.
అగో నా ఫోన్లో ఒక మ్యూజిక్కు బయట ఈ మ్యూజిక్కు నడుస్తుంది. ఇక earphones పెట్టుకున్నా. కళ్ళు మూసుకున్నా, సీటుకి ఒరిగా.
అలా నాలుగు పాటలు గడిచాయి, కండక్టర్ “ $$$$$$$$ చౌరస్తా వచ్చింది దిగాలి ” అంటూ కేకేసాడు. మా ఊరు వచ్చేసింది. నేను తదుపరి స్టాప్ బస్టాండ్ లో దిగాను. ఆ అనుషా ఆంటీ వాళ్ళు కూడా దిగారు. బస్టాండ్ లో దిగ్గానే పిల్లాడిని పక్కకి చెట్ల దగ్గరకి తీసుకెళ్ళి జిప్పు తీసింది. వాడు పోసుకున్నాడు. బాగానే ఆపుకున్నాడు పిల్లోడు.
దిగి ఇంటి తోవ పట్టాను. అనిపించింది, మళ్ళీ బస్సు ఎక్కాలి, ఆ బస్సులో ఎక్కువ ఆడవాళ్ళు ఉండాలి అది కూడా సెక్సీ అంటీస్ అండ్ బ్యూటిఫుల్ అమ్మాయిలు, నా చుట్టూ ఉండాలి. ఆహా…….
జనవరి పదకొండు, రెండువేలా ఇరవై నాలుగు, సాయంత్రం ఆరు గంటలు, ఏదైనా చిన్న కథ రాద్దాం ఏం రాద్దాం. కొత్త ఆలోచనలు రావట్లేదు అనుకుంటూ ఉండగా ఇలా జరిగిందిగా అని గుర్తొచ్చి ఇదే రాసాను.
కథ శీర్షిక ఏం పెట్టాలా అనుకుంటూ ఉన్నాను, బిత్తిరి బిత్తిరిగా ఏదైనా పెట్టాలి అనుకున్న. అప్పుడే నోటి వెంట, ఇత్రాకి ఉత్రాకి బత్తరి బిత్తర కత్రాకి అని వచ్చింది.
॥——————— End ———————॥
~~~~~~~
|_|_|_|_|_|
|_|_|_|_|_|
0ె 0ె
ఇట్లు మీ ఇఠాచి
The following 11 users Like Haran000's post:11 users Like Haran000's post
• gora, k3vv3, Mohana69, ramd420, Sivak, sri7869, sriramakrishna, TheCaptain1983, utkrusta, Veeeruoriginals, will
Posts: 9,597
Threads: 0
Likes Received: 5,437 in 4,452 posts
Likes Given: 4,530
Joined: Nov 2018
Reputation:
46
•
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
(13-01-2024, 08:36 PM)utkrusta Wrote: FUNNY UPDATE
It's not update. Small story
Thankyou.
Posts: 6,980
Threads: 1
Likes Received: 4,569 in 3,561 posts
Likes Given: 44,708
Joined: Nov 2018
Reputation:
78
Title bhaleundi
Story chadavaali inka
•
Posts: 1,117
Threads: 0
Likes Received: 788 in 495 posts
Likes Given: 74
Joined: Nov 2018
Reputation:
17
Nice
Mee లైఫ్లో ఒక రోజు... Sorry ఓక బస్ ప్రయాణం
•
Posts: 1,117
Threads: 0
Likes Received: 788 in 495 posts
Likes Given: 74
Joined: Nov 2018
Reputation:
17
Nice
Mee లైఫ్లో ఒక రోజు... Sorry ఓక బస్ ప్రయాణం
Posts: 15
Threads: 1
Likes Received: 11 in 8 posts
Likes Given: 18
Joined: Aug 2019
Reputation:
1
13-01-2024, 11:32 PM
(This post was last modified: 14-01-2024, 06:33 AM by lurkereighty. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-01-2024, 09:30 PM)ITACHI639 Wrote: It's not update. Small story
Thankyou.
Very nice.. చాలామంది ప్రముఖ రచయితల short stories శైలి గుర్తొచ్చింది
Posts: 361
Threads: 2
Likes Received: 1,953 in 219 posts
Likes Given: 145
Joined: Jun 2019
Reputation:
169
హలో itachi గారు మీ అలవాట్లు నా అలవాట్లు చాలా వరకు ఒకేలా ఉన్నాయి.నేను కూడా మందు సిగరెట్ తాగను సెక్స్ అంటే పిచ్చి అలాగే బుక్స్ , స్టోరీస్( సెక్స్ స్టోరీస్ మాత్రమే కాదు నార్మల్ స్టోరీస్ కూడా ) పురాణాలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ యూటుబ్స్ వీడియోస్ చూస్తాను.
కాకపోతే నీ మీ కన్నా వయస్సులో పెద్దవాడిని.ఇప్పటివరకు నా భార్య ని తప్పా ఇంకెవరిని దెంగలేదు.మీలా అన్ని లాంగ్వేజ్ మూవీస్ అయితే చూడను.
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
14-01-2024, 09:42 AM
(This post was last modified: 14-01-2024, 09:44 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(13-01-2024, 09:49 PM)Uma_80 Wrote: Nice
Mee లైఫ్లో ఒక రోజు... Sorry ఓక బస్ ప్రయాణం
(13-01-2024, 11:32 PM)lurkereighty Wrote: Very nice.. చాలామంది ప్రముఖ రచయితల short stories శైలి గుర్తొచ్చింది
అందుకే అలా రాసాను, నా శైలిలో రాస్తే ఎవ్వరూ చడావరేమో అని భయం.
(14-01-2024, 08:35 AM)rag7rs Wrote: హలో itachi గారు మీ అలవాట్లు నా అలవాట్లు చాలా వరకు ఒకేలా ఉన్నాయి.నేను కూడా మందు సిగరెట్ తాగను సెక్స్ అంటే పిచ్చి అలాగే బుక్స్ , స్టోరీస్( సెక్స్ స్టోరీస్ మాత్రమే కాదు నార్మల్ స్టోరీస్ కూడా ) పురాణాలు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ యూటుబ్స్ వీడియోస్ చూస్తాను.
కాకపోతే నీ మీ కన్నా వయస్సులో పెద్దవాడిని.ఇప్పటివరకు నా భార్య ని తప్పా ఇంకెవరిని దెంగలేదు.మీలా అన్ని లాంగ్వేజ్ మూవీస్ అయితే చూడను.
మంచిది.
Thanx all
Posts: 3,495
Threads: 0
Likes Received: 1,222 in 1,012 posts
Likes Given: 478
Joined: Jul 2021
Reputation:
20
•
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
సంక్రాంతి శుభాకాంక్షలు మిత్రులారా
Posts: 1,615
Threads: 2
Likes Received: 2,283 in 1,153 posts
Likes Given: 3,015
Joined: Nov 2018
Reputation:
45
ఈ ఆదివారం టైం పాస్ అవ్వక ఓపన్ చేస్తే మీ కథ పేరు తమాషాగా అనిపించి చదివా..మీలో ఈ కోణం కూడా ఉందన్నమాట. మీ బస్సు ప్రయాణం గురించి బాగా రాసారు, you are a good observer
: :ఉదయ్
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
(14-01-2024, 11:15 PM)Uday Wrote: ఈ ఆదివారం టైం పాస్ అవ్వక ఓపన్ చేస్తే మీ కథ పేరు తమాషాగా అనిపించి చదివా..మీలో ఈ కోణం కూడా ఉందన్నమాట. మీ బస్సు ప్రయాణం గురించి బాగా రాసారు, you are a good observer
ఏ ఉదయ్ గారు, నేను శృంగారం మాత్రమే రాస్తాను అనుకున్నారా. ఇక నుండి రకరకాల Angles try చేద్దాం ఏమంటారు. (Doggy, cowgirl, reverse cowgirl, missionary, lotus, bugbee, spooning, froggy, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నీ try చేద్దాం లెండి)
Posts: 1,615
Threads: 2
Likes Received: 2,283 in 1,153 posts
Likes Given: 3,015
Joined: Nov 2018
Reputation:
45
(15-01-2024, 12:10 PM)ITACHI639 Wrote: ఏ ఉదయ్ గారు, నేను శృంగారం మాత్రమే రాస్తాను అనుకున్నారా. ఇక నుండి రకరకాల Angles try చేద్దాం ఏమంటారు. (Doggy, cowgirl, reverse cowgirl, missionary, lotus, bugbee, spooning, froggy, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నీ try చేద్దాం లెండి)
తప్పుతుందా, తప్పేదుందా...నువ్వెలా అంటే అలాగే బాస్
: :ఉదయ్
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
(15-01-2024, 03:54 PM)Uday Wrote: తప్పుతుందా, తప్పేదుందా...నువ్వెలా అంటే అలాగే బాస్
Posts: 78
Threads: 1
Likes Received: 63 in 36 posts
Likes Given: 16
Joined: Nov 2018
Reputation:
4
Aa bus venake naa bus kaani court daggara nee bus naaka chourastavypu thirigithe naa bus sakkaga jagityal rootlo poindi enchuminchu same experience same day same evening nv cenima chusipothe nenu patnam nunchi maa vuru @@@@@@@@ ki poinaa
Posts: 3,354
Threads: 22
Likes Received: 15,797 in 3,581 posts
Likes Given: 2,287
Joined: Dec 2021
Reputation:
977
(15-01-2024, 11:41 PM)Aavii Wrote: Aa bus venake naa bus kaani court daggara nee bus naaka chourastavypu thirigithe naa bus sakkaga jagityal rootlo poindi enchuminchu same experience same day same evening nv cenima chusipothe nenu patnam nunchi maa vuru @@@@@@@@ ki poinaa
My guess is yours కురిక్యాల or పోడూరు or కొత్తపల్లి
Posts: 78
Threads: 1
Likes Received: 63 in 36 posts
Likes Given: 16
Joined: Nov 2018
Reputation:
4
(15-01-2024, 11:59 PM)ITACHI639 Wrote: My guess is yours కురిక్యాల or పోడూరు or కొత్తపల్లి
No
•
|