Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నిజంగా జరిగిన *మహా శివుని లీలలు*
#1
Xxx.V.2-6.1909.2-6.2703C3-4.
131123-4.
???????????
నిజంగా జరిగిన ….

            *మహా శివుని లీలలు*
                 ➖➖➖✍️


*ఇది …*
*నిజంగా రోమాలు నిక్క పొడుచుకొనేలా చేసే నిజజీవితంలో జరిగిన సంఘటన...*

*చరిత్రలో నిలిచిన కథ.*

 *నిజంగా శివుని లీలలు ఎవరికీ అర్థం కావు,*

*ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది.*

*ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు.*

*ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తికి పరమ శివుడు కనిపించాడు.*

*నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది.*

*ఈయనది ఈయన భార్యది నిజంగా అదృష్టమే.*

 *1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు, “ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.*

*ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది.*

*కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు.*

*ఆమె పేరు మేరీ.*

*కొన్ని రోజులు గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది.*

*అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనికి గురి అయింది.*

*ఎప్పుడూ భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది.*

*ఆమె రాత్రీ పగలు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది.*

*అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ ఉండగా ఆమెకు వేద మంత్రాలు వినిపించాయి, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది.*

*అక్కడ పూజారులు మహా శివుణ్ణి పూజించడం ఆమె గమనించింది.*

*ఆ పూజారులు…“ఈమె మనసులో ఏదో బాధలో ఉందని” గ్రహించి పలకరించారు.*

*ఆ పూజారులు “ఏమైంది తల్లి నీకు అని అడగగానే, వెంటనే ఆమె భర్త ‘కల్నల్ గురించి చెప్పి, భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని, వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది.*

*ఆ పూజారులు ఆమెని ఓదారుస్తూ…“మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు.*

*ఆమె గుడిలో మహా శివునికి మొక్కి ఇంటికి వెళ్లింది. తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ “లఘు రుద్ర మంత్ర జపం” 11 రోజులు చేసింది. *

*భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.*

*11 రోజుల జపం చేసిన తర్వాత, ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది.*

*ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు.*

*పఠాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని,  ఆ సమయంలో మేము తప్పించు కోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని.*

*అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహా యోగి వెలుగుతూ కనిపించాడని.*

*ఆయన పులి చర్మం ధరించి, మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. *

*ఆయన శక్తికి, తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కొన్నాడు. *

*ఆయోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు.*

*ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ, ‘నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చా’నని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.*

*కొన్ని వారాల తర్వాత,కల్నల్ ఇంటికి చేరుకున్నారు.*

*తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు.*

*కల్నల్ గుడిలో ఉన్న మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు.*

*అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ “మహా శివునికి” అపార భక్తులు అయ్యారు.*

*ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు.*

*జన్మ ధన్యం చేసుకున్నారు.*

*ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి.*

**బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఒకే ఒక్క గుడి ఇదే.*

*ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

   ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)