Thread Rating:
  • 89 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#1
సహాయం - శృంగారం


ఫెస్టివల్ తరువాత JTKP అప్డేట్ తోపాటు డబల్ ధమాకా .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Waiting bro and all the best new storie
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#3
(11-11-2023, 04:38 PM)Mahesh.thehero Wrote: సహాయం - శృంగారం


ఫెస్టివల్ తరువాత JTKP అప్డేట్ తోపాటు డబల్ ధమాకా .
[+] 1 user Likes Rrr1290's post
Like Reply
#4
ఎదురు చూస్తూ
[+] 1 user Likes ramd420's post
Like Reply
#5
(11-11-2023, 08:29 PM)maheshvijay Wrote: Waiting bro and all the best new storie

banana banana banana clps clps clps
Like Reply
#6
Waiting for your new story...
Like Reply
#7
Super bro we will wait for it eagerly
Like Reply
#8
Bro we eagerly waiting for JKP & PPC and New one S&S update
Like Reply
#9
సాయంత్రం 7 లోపు డబల్ ధమాకా తో .......
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply
#10
Nice title Mahesh garu
phani kumar c
24*7 in sex trans
Like Reply
#11
Bro Eagerly waiting bro   Namaskar Heart
[+] 2 users Like jackroy63's post
Like Reply
#12
JTKP done ......


కొద్దిసేపట్లో ......
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply
#13
(15-11-2023, 01:52 PM)phanic Wrote: Nice title Mahesh garu

Love you ......
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply
#14
టెన్త్ క్లాస్ చివరి exam సోషల్ స్టడీస్ మంచిగా రాయడంతో అన్నీ పరీక్షలూ బాగా రాశానని సంతృప్తితో సెంటర్ నుండి బయటకువచ్చాను .
ఇక నుండీ సెలవులు అన్నట్లు exams రాసి బయటకువచ్చింది తోటి స్టూడెంట్స్ అందరూ సంతోషాలతో కేకలువేస్తూ జట్టు జట్టుగా కలిసి ఈ సెలవులలో ఏమేమి చెయ్యాలో చర్చించుకుంటూ ముందుగా మూవీకి వెళ్ళాలి అనుకుంటూ వారి వారి ఇళ్లకు హుషారుగా బయలుదేరారు , కొంతమంది అయితే ముందు మూవీ చూసే ఇంటికి వెళ్లొచ్చు అన్నారు - ఒకటీ రెండు జట్లు అయితే రేయ్ రేయ్ నాకు నాకు వాటిని చూడాలని ఉందిరా ..... అంటూ సిగ్గుపడుతూ మోహమాటపడుతున్నారు .
వేటిని రా .....
వాటినే రా .....
రేయ్ వీడు హాఫ్ ఇయర్లీ exams అప్పుడే చూడాలని అన్నాడురా ..... , వీడికి గిలిగింత కొట్టినట్లుంది ప్యాంటులో అంటూ నవ్వులు .
మీకు లేదారా చూడాలని .....
ఉంది అనుకో .......
Ok ok అర్థమైంది అర్థమైంది అందరికీ చూడాలని ఉంది , CD షాప్ కు వెళ్లి తీసుకొద్దాము .
రేయ్ CD షాప్ కు దేనికిరా , మొబైల్లోనే లెక్కలేనన్ని చూడొచ్చు , మా మామయ్య చూస్తుంటే చూసాను , రేయ్ రేయ్ మీ ఇంట్లో ఎవరూ లేరుకదా పైగా వీడితో పెద్ద మొబైల్ ఉంది మీ ఇంటికి వెళ్లి చూద్దాము .
రేయ్ రేయ్ వద్దురా ..... , నైబర్స్ కు తెలిస్తే అంతే .....
సౌండ్ లేకుండా చూద్దాములేరా , టీవీ కి కనెక్ట్ చేసి చూస్తే పెద్దగా భలేగా ఉంటుంది పదండి పదండి అంటూ వాడు ఒప్పుకోకముందే లాక్కుంటూ వెళ్లారు .
నవ్వుకున్నాను , తోటి స్టూడెంట్స్ అందరి సంతోషాలనూ కోరికలనూ విని , ఇలాంటి సంతోషాలేవీ నా జీవితంలో లేవు ఈ పదిరోజులు మాత్రమే స్వేచ్ఛగా తిరగగలిగాను మళ్లీ నిర్బంధమీ అనుకుని నిరాశతో నడుచుకుంటూ బయలుదేరాను .

మొదటి exam రాసి వెళ్ళేటప్పుడు మొదలుకుని ప్రతీరోజూలానే ఈ చివరి రోజున కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ నిర్మాణం అయినట్టు మరియు అవుతున్న ఒక పోష్ ఏరియా లో బయట ఆడుకుంటున్న పిల్లల సంతోషాలను చూస్తూ కొద్దిసేపు ఆగి ఆనందిస్తున్నాను .
అటూ ఇటూ వెళుతున్న పేరెంట్స్ .... బుజ్జాయిలకు జాగ్రత్త జాగ్రత్త అని చెబుతున్నారు ఎందుకంటే దగ్గరలోనే భారీ యంత్రాలతో బిల్డింగ్ స్టార్టింగ్ పనులు జరుగుతున్నట్లు - భోజనం గ్యాప్ అన్నట్లు వర్కర్స్ అందరూ ఒక ప్రక్కన చేరి తింటున్నారు .

అంతలో ఒక సెక్యూరిటీ అధికారి జీప్ ఏరియా లోపలికి వెళ్లబోతూ నాప్రక్కనే ఆగింది , రేయ్ ఎవర్రా నువ్వు ఇక్కడేమి చేస్తున్నావు - పిల్లలను అలా చూస్తున్నావేంటి - పిల్లలను ఎత్తుకుని వెళ్ళేవాడివా ? - వెళతావా లేక లాఠీ రుచి చూయించమంటావా అంటూ డ్రైవర్ సెక్యూరిటీ అధికారి హెచ్చరించాడు .
నో నో నో సర్ వెళతాను .
ఆ అబ్బాయి అలా కనిపిస్తున్నాడా ? పోనివ్వు అంటూ లోపలున్న పెద్ద సెక్యూరిటీ అధికారి మాటలు వినిపించడంతో ..... , yes సర్ అంటూ లోపలికి పోనిచ్చాడు .
మంచి సెక్యూరిటీ అధికారి అనుకుని , అమ్మో టైం అవుతోంది - పిల్లల సంతోషాలను చూస్తుంటే వెళ్లబుద్దికావడం లేదు , మళ్లీ చూడలేను అంటూ చివరిసారిగా చూసి నవ్వుకుంటున్నాను .

ఆడుకుంటున్న పిల్లలలో తమ బుజ్జాయి కూడా ఉందేమో అనుకుని కిందకు దిగిన పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్ కీర్తీ కీర్తీ కీర్తి తల్లీ అంటూ పిలుస్తున్నారు , ఎంతకూ కనిపించకపోవడంతో ఇంటిలోపల ఉందేమో అన్నట్లు లోపలికివెళ్లి మేడమ్ తోపాటు బయటకువచ్చారు .
మేడమ్ : ప్రయాణానికి టైం అయ్యింది అన్నాకూడా మళ్లీ రాము కదా మమ్మీ డాడీ వచ్చేన్తవరకూ ఫ్రెండ్స్ తో ఆడుకుంటాను , బయటే ఉంటాను అంది , తల్లీ కీర్తి కీర్తి అంటూ పిలిచినా పలుకకపోవడంతో కంగారుపడుతూ ఆడుకుంటున్న పిల్లలను అడిగారు .
మాతోపాటే ఆడుకుంటోంది ఇప్పటివరకూ అంటీ - అంకుల్ ..... , బాల్ బాల్ అంటూ కార్తీ బొమ్మను చేతిలో పట్టుకుని వెళ్ళింది , ఇంట్లోకి వెళ్లిందిలే అనుకున్నాము .
అంతే ఒక్కసారిగా కంగారు పెరిగిపోయింది , ఏమిటి ఏమిటి అంటూ పిల్లల పేరెంట్స్ కూడా బయటకువచ్చి విషయం తెలుసుకుని పాపను పిలుస్తూ మొత్తం వెతికినా జాడలేదు .

వాడే సర్ వాడే .... వాడే ఏమైనా చేసి ఉంటాడు , వాడు ఖచ్చితంగా పిల్లలను ఎత్తుకుని వెళ్ళేవాడే , అదిగో ఇంకా అక్కడే ఉన్నాడు పట్టుకోండి పట్టుకోండి వాడిని అంటూ పరుగునవచ్చి లాఠీతో కొడుతూ లాక్కెళ్లాడు .
సర్ సర్ సర్ నాకేమీ తెలియదు - నేను అలాంటి వాడిని కాదు - ఇప్పుడే టెన్త్ క్లాస్ exams రాసి పిల్లలు సంతోషంగా ఆడుకుంటుంటే చూస్తున్నాను అంతే కావాలంటే నా హాల్ టికెట్ చూడండి అయ్యో ఎక్కడో పడిపోయింది అంటూ జేబుల్లో వెతుకుతున్నాను .
డ్రైవర్ సెక్యూరిటీ అధికారి : చూసారా సర్ వీడి యాక్టింగ్ అంటూ కొట్టాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : చేతిలో exam ప్యాడ్ ఉంది వదిలెయ్యండి ..... , అయినా పిల్లలను ఎత్తుకుని పోయేవాడే అయితే ఇంకా ఇక్కడే ఎందుకు ఉంటాడు , ఆ అబ్బాయి కళ్ళల్లోనే తెలుస్తోంది , వదిలెయ్యమని చెప్పానా ? అంటూ కోప్పడ్డారు .
అవును సర్ రోజూ exam రాసి ఇక్కడ కాసేపు పిల్లలను చూసి చాలా ఆనందం కలుగుతుంది అని చెప్పి వెళతాడు సర్ , ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు మంచి పిల్లాడు అంటూ సెక్యూరిటీ ......
డ్రైవర్ సెక్యూరిటీ అధికారి : విన్నారా సర్ , పిల్లలకోసం రెక్కీ చేసాడు అంటూ మళ్లీ కాళ్లపై కొట్టాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : వదిలెయ్యమన్నాను .....
డ్రైవర్ సెక్యూరిటీ అధికారి : Yes సర్ sorry సర్ .......
కాలర్ వదిలెయ్యడంతో లాఠీ దెబ్బలకు నొప్పితో కుంటుకుంటూ బయటకు నడిచాను .

కానిస్టేబుల్ ..... మొత్తం సెక్యూరిటీ ఆఫీసర్లను అలర్ట్ చెయ్యండి , సీసీ ఫుటేజీ చెక్ చెయ్యండి , పుష్ప ..... మన కీర్తికి ఏమీకాదు , నిమిషాలలో మనదగ్గర ఉంటుంది అంటూ పెద్ద సెక్యూరిటీ అధికారి సర్ ధైర్యం చెబుతున్నారు , చాలా మంచివారు అనిపించింది .
తల్లీ తల్లీ కీర్తి కీర్తి అంటూ ఆ తల్లి కన్నీళ్లకు చలించిపోయాను - నొప్పివేస్తున్నా కూడా కుంటుకుంటూనే అందరితోపాటు వెతుకుతూ బిల్డింగ్ పనుల కోసం తీసిన గుంతల దగ్గరికి వెళ్ళాను .
అందరి కేకల మధ్యన పాప ఏడుపులు వినిపించడంతో , పాప పాప అంటూ ఆ ప్రాంతమంతా వెతికినా కనిపించలేదు , అందరి కేకల మధ్యన పాప ఏడుపులు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయో ..... , సైలెంట్ ఇక్కడివాళ్ళు అక్కడే ఆగిపోండి మాట్లాడకండి అంటూ గట్టిగా కేకలు వేయ్యడంతో పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది . పాప ఏడుపు వినిపించడంతో వెతుకుతూ గుంతలు గుంతల నుండి అంటూ ఒక్కొక్క గుంతలో వింటున్నాను - చాలా లోతుగా యంత్రాలతో తీసినట్లు లోపల మొత్తం చీకటి - మధ్య గుంతలో చెవి ఉంచగానే పాప ఏడుపు ..... చూస్తే ఏమీ కనిపించడం లేదు , లోపల పాప పరిస్థితి తెలిసి ఒక్కసారిగా వొళ్ళంతా చెమట పట్టేసింది - పాప పాప ...... , పాపకు వినిపించినట్లు ఏడుపు తీవ్రత పెరిగింది .
మమ్మీ మమ్మీ .....

పాప ...... అయ్యో ఇప్పుడెలా ? , సర్ సెక్యూరిటీ అధికారి సర్ పాప పాప .... ఇక్కడ ఉంది .
సెక్యూరిటీ అధికారి సర్ - మేడమ్ గారితోపాటు అందరూ పరుగున చేరుకున్నారు , ఎక్కడ ఎక్కడ ...... , వర్కర్స్ కూడా చేరుకున్నారు .
వెనక్కు వెనక్కు ...... అంటూ అందరినీ కాస్త దూరంలోనే ఆపేస్తున్నాను .
ఎక్కడ నా తల్లి ఎక్కడ అని సంతోషంగా అడిగిన తల్లి కళ్ళల్లో కన్నీళ్లు చేరడానికి క్షణిక కాలం కూడా పట్టలేదు .
పిల్లర్ కోసం తీసిన గుంత వైపు చిపోయించాను .
అంతే ఆ తల్లి కన్నీళ్లతో స్పృహ కోల్పోయింది .
అంబులెన్స్ అంబులెన్స్ అంటూ డ్రైవర్ సెక్యూరిటీ అధికారి కాల్ చేస్తున్నాడు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : పుష్ప పుష్ప అంటూ పట్టుకునే గుంత దగ్గరకువెళ్లి కీర్తి కీర్తి .....
డాడీ అంటూ ఏడుపు వినిపించడంతో ఆ తండ్రి విలవిలలాడిపోతున్నాడు .

సర్ సర్ ..... మీ ఏడుపు వినపడితే పాప మరింత భయపడుతుంది , కష్టమే అయినా కంట్రోల్ చేసుకుని ధైర్యం చెప్పండి , ప్లీజ్ ప్లీజ్ ఆక్సిజన్ లోపలకు వెళ్ళాలి మీరు వదిలిన CO2 కాదు , లోపల చాలా తక్కువగా ఉంటుందని సైన్స్ సర్ చెప్పారు వెనక్కు వెనక్కు ఇంకా ఇంకా ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : ఒకచేతితో మేడమ్ ను పట్టుకుని మరొక చేతితో కన్నీళ్లను తుడుచుకున్నారు , డ్రైవర్ సెక్యూరిటీ ఆఫీసర్ను పిలిచి డాక్టర్స్ - రెస్క్యూ టీం - అంబులెన్స్ - క్రేన్ - జేసీబీతోపాటు అవసరం అన్నవాళ్ళందరినీ పిలిపించు త్వరగా త్వరగా , తల్లీ కీర్తి ..... మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నాము , నీకేమి కాలేదు అంటూ మొబైల్ టార్చ్ వేస్తున్నారు .
కరెంట్ పోయింది ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : పవర్ కట్ అయ్యింది అంతే ......
దాగుడుమూతలు - దొంగ సెక్యూరిటీ అధికారి ఆట ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : మనం రోజూ ఆడుకుంటాము కదా దొంగ సెక్యూరిటీ అధికారి ఆట , ఇప్పుడూ అదే ఆడుకుంటున్నాము , మా బంగారు తల్లి దొంగ - మమ్మీ డాడీ సెక్యూరిటీ అధికారి ..... , చీకట్లో దాక్కుంటావు కదా అలా .....
మమ్మీ డాడీ మమ్మీ డాడీ అంటూ ఏడుపు .....

అన్నలూ ..... గుంత ఎంత లోతులో ఉంది ? .
వర్కర్స్ : మెయిన్ పిల్లర్ కోసం ప్రత్యేకంగా ఈ పెద్ద మెషీన్ తెప్పించి సుమారు 100 - 110 అడుగులవరకూ తీయించాము బాబు .....
100 అడుగులా ? , పాప ఎలా పడిందో ఏమో ..... , కదిలేంతలా ఉంటుందా ? .
వర్కర్స్ : చెప్పలేం బాబూ ..... , పాప ఎలా పడిందో ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : తన్నుకొస్తున్న ఏడుపును తిప్పుకుని , కీర్తి తల్లీ ..... నీ బుజ్జితమ్ముడు కార్తీ కూడా ఉన్నాడుగా , మాకు దొరకకుండా దాక్కోవాలి .
మమ్మీ డాడీ ......
ఇద్దరా ? సర్ ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : బొమ్మను తమ్ముడిగా చూసుకుంటుంది , ఆ బొమ్మ లేకుండా ఉండలేదు అంత ఇష్టం ......

డ్రైవర్ సెక్యూరిటీ అధికారి : సర్ అందరికీ కాల్ చేసాను , 30 నిమిషాలలో వచ్చేస్తారు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : త్వరగా త్వరగా .....
మేడమ్ కు స్పృహ వచ్చినట్లు కన్నీటితో పాప పాప పాప - ఆ తల్లి బాధకు అందరూ చలించిపోతున్నారు .
మమ్మీ మమ్మీ ......

అర గంట పడుతుందా ? , అంతవరకూ ఆక్సిజన్ అందడం కష్టమే అంతవరకూ ఆగకూడదు - ఎలా ఎలా ఎలా అంటూ చుట్టూ చూసాను , పెద్ద తాడు కనిపించడంతో తీసుకొచ్చి పాదాలకు బాగా కట్టుకున్నాను , అన్నలూ ..... పట్టుకుని కిందకు వదలండి .
చాలా అపాయం బాబూ - నీకేమైనా అవ్వవచ్చు - పైగా కాళ్ళ నుండి రక్తం కారుతోంది .
ఇవన్నీ నాకు మామూలే అన్నలూ ...... , ఆ తల్లి కన్నీళ్లు - పాప ప్రాణం కంటే నా ప్రాణం విలువైనదేమీ కాదు , ఈ జీవితం పాపను సేవ్ చెయ్యడం కోసం అయితే సంతోషంగా వెళ్లిపోతాను , పాపను రక్షిస్తే చాలు పట్టుకోండి , ఎవరైనా టార్చ్ వేసి మొబైల్ ఇస్తారా ? , ఇవి కాదు కీ ప్యాడ్ మొబైల్ ....... 
నాదగ్గర ఉంది అంటూ వర్కర్ ఇచ్చారు .
గుంతలోపల బాగా కనిపించేలా తలకు కట్టండి , వదులుతుంటే నా బరువు తెలుస్తుంది కదా కాస్త పెరిగినా జాగ్రత్తగా పైకి లాగండి , నా చేతులలో పాప ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి అనిచెప్పి ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా గుంత దగ్గరికి వెళ్ళాను .
నిమిషాల్లోనే అన్నలు ..... దిగడానికి లాగడానికి వీలుగా ఉండేలా ( పాతకాలంలో బావిలోనుండి నీళ్లకోసం తాడుతో బిందెలు లాగేలా ) ఏర్పాటు చేయడం - నా తాళ్ల ముడిని చెక్ చేసి భారంగానే ok అన్నారు .
తలను గుంతలోపలికి ఉంచి లోపలికివెళ్ళాను - టార్చ్ వెలుగులో లోపలికి నిటారుగా నెమ్మది నెమ్మదిగా వెళుతూ పాప పాప ఇదిగో మమ్మీ డాడీ దగ్గరకు తీసుకెళ్లడానికి వచ్చాను , ఎంచక్కా మమ్మీ ఒడిలో తినొచ్చు ఆడుకోవచ్చు నిద్రపోవచ్చు అంటూ మాట్లాడిస్తూ నిటారుగా కిందకువెళుతున్నాను , చేతులకు - వీపుపై - ఛాతీపై రాళ్లు గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా గాలిని బాగా పీల్చాలి - నోస్ తోనే కాదు నోటితోకూడా వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను - నాకే ఊపిరి పీల్చడం కష్టం అవుతోంది అంటూ దగ్గుతున్నాను , వీలైతే చేతులు పైకెత్తాలి , గేమ్ రూల్ .......
అలాగే ...... , మమ్మీ డాడీ అంటూ ఏడుపు .

పాప చేతులు స్పృశించగానే , హమ్మయ్యా ..... నిలువుగా జారింది లోపలకు అంటూ ఊపిరి పీల్చుకున్నాను - టార్చ్ వెలుగులో పాపపై మట్టి పడి ఉండటం చూసి ఏమీకాలేదు ఏమీకాలేదు , పాప పాప ..... మమ్మీ డాడీ దగ్గరకు వెళదాము .
తమ్ముడుని పట్టుకోలేదు - ఎవరు నువ్వు ? మమ్మీ డాడీ ఎక్కడ అంటూ ముద్దుగా అడిగింది .
అన్నయ్యను అనుకో ..... , తమ్ముడంటే ఇష్టం కదూ ఎక్కడ ఎక్కడ నీ ప్రక్కనే ఉన్నాడు అంటూ కష్టమైనా షర్ట్ లోపలికి వేసుకున్నాను , పాప ..... కొద్దిసేపు నొప్పివేస్తుంది అమ్మ ముద్దులు పెట్టగానే మాయమైపోతుంది అంటూ మోచేతులవరకూ బాగా పట్టుకుని ఒక జర్కు ఇచ్చాను .
పైకి మెసేజ్ చేరినట్లు అతినెమ్మదిగా పైకి లాగుతున్నారు .
10 అడుగులకే అన్నయ్యా అన్నయ్యా నొప్పివేస్తోంది అంటూ ఏడుపు .....
కన్నీటి ధార నేరుగా వెళ్లి పాప బుగ్గపై చేరింది .
అన్నయ్యా ఏడుస్తున్నారు ఎందుకు , నొప్పి అన్నయ్యా నొప్పి ..... మమ్మీ మమ్మీ అంటూ ఏడుపు ......
కొద్దిసేపు ఇంకాసేపు అంతే అంటూ నాకు రాళ్లు గుచ్చుకున్నప్పుడు పాపను మరింత జాగ్రత్తగా పట్టుకున్నాను , ఇంతకాలం అనుభవించిన జీవితం కళ్ళ ముందు మెదిలింది - ఈ పెయిన్ తో పోలిస్తే అది చిన్నగా మారిపోయింది .
పాపతో మాట్లాడుతూ - పాట పాడుతూ - తల్లిదండ్రులను గుర్తుచేస్తూ - పిల్లలతో ఆటలను గుర్తుచేస్తున్నా ఏడుస్తూనే ఉంది , పాప .... కీర్తీ ..... కార్తి అనగానే ఒక్కసారిగా ఏడుపు మాయం అయిపోయింది .
Ok ..... తమ్ముడు కార్తి అంటే అంత ఇష్టం అన్నమాట .
అవును అన్నయ్యా అంటూ నవ్వు .....
తమ్ముడు నాలోపల హ్యాపీగా నవ్వుతున్నాడులే .....
అవునా అయితే నేనూ నవ్వుతాను అన్నయ్యా ......

పైన టార్చ్ వెలుగులు కనిపించడం - నేను కనిపించినట్లు జాగ్రత్త జాగ్రత్త అంటూ కాస్త వేగంగా పైకి లాగి జాగ్రత్త జాగ్రత్త అంటూనే నన్ను ఆవెంటనే పాపను అందుకుని తల్లి ఒడిలోకి చేర్చారు .
కీర్తి కీర్తి తల్లీ తల్లీ ...... అంటూ ముద్దులు కురిపిస్తున్నారు .
మమ్మీ ...... అంటూ ఏడవగానే , అందరూ ఊపిరిపీల్చుకున్నారు , సంతోషాలతో కౌగిలించుకొన్నారు చప్పట్లు కొడుతున్నారు .
ఆ తల్లి కన్నీళ్లు ఆనందబాస్పాలతో నిండిపోయాయి .

అంబులెన్స్ వచ్చినట్లు డాక్టర్ వచ్చి తల్లి ఓడిలోనే పాపకు ఆక్సిజన్ ఉంచారు - హార్ట్ బీట్ చెక్ చేసి మినిట్స్ ఆలస్యం అయినా కష్టమైపోయేది సర్ , సమయంలో రక్షించారు .
ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి కూడా అంటూ మేడమ్ చెప్పడంతో , పెద్ద సెక్యూరిటీ అధికారి సర్ ..... బాబు బాబు అంటూ వచ్చారు .
పర్లేదు పర్లేదు సర్ , I am fine సర్ ..... , పాప సేఫ్ ఆ సంతోషం చాలు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : థాంక్యూ థాంక్యూ , నీ రుణం తీర్చుకోలేనిది , పెళ్ళైన ఎన్నో ఏళ్లకు పుట్టిన మా ప్రాణం , తనకు ఏమైనా అయి ఉంటే మేము ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అంటూ కౌగిలించుకొన్నారు , స్వయంగా నా పాదాలకు తాళ్లను విప్పారు .
సర్ సర్ సర్ ...... అంటూ కూర్చున్నాను .
పెద్ద సెక్యూరిటీ అధికారి : నా సంతోషం కోసం అంటూ విప్పారు .

అప్పుడు సైరెన్స్ చేసుకుంటూ రెస్క్యూ టీం - సెక్యూరిటీ ఆఫీసర్లు - జేసీబీ లు వచ్చాయి .
థాంక్యూ థాంక్యూ సో మచ్ బాబు ...... , ఇప్పటివరకూ ఆగి ఉంటే ఊహించుకుంటేనే ఊపిరి ఆగిపోయేలా ఉంది .
సర్ ..... పాప సేఫ్ , పాపదగ్గరకు వెళ్ళండి , మీరంటే ప్రాణం ......
అంతే అన్నలు పైకెత్తి కేకలువేస్తూ సంతోషాలను పంచుకున్నారు .

పెద్ద సెక్యూరిటీ అధికారి : తల్లీ కీర్తి కీర్తి .....
డాడీ డాడీ .....
పెద్ద సెక్యూరిటీ అధికారి : ఇక్కడే ఉన్నాను తల్లీ .....
తమ్ముడు ఎక్కడ ? .
పెద్ద పోలిస్ : నాకు తెలుసు , ఈ డాడీ కంటే తమ్ముడు అంటేనే ఇష్టం , అదిగో ఇప్పుడే నీ తమ్ముడిని బయటకు తీస్తారు .
సర్ అంటూ షర్ట్ లోపల నుండి తీసి ఇచ్చాను .
తమ్ముడూ అంటూ తల్లి ఓడిలోనుండి లేచివచ్చి , థాంక్యూ అన్నయ్యా అంటూ అందుకుని ఒంగు అంటూ నాబుగ్గపై ముద్దుపెట్టి మళ్లీ మేడమ్ ఒడిలోకి చేరిపోయింది .
తమ్ముడంటే ప్రాణం అన్నారుకదా సర్ .....

Sorry sorry బాబు , నీ గురించి తెలుసుకోకుండా రక్తం వచ్చేలా కొట్టాను , బాబూ ..... వొళ్ళంతా కూడా రక్తం అంటూ ఫీల్ అవుతున్నాడు డ్రైవర్ సెక్యూరిటీ అధికారి .
గుంతల్లో రాళ్లు గుచ్చుకున్నాయి సర్ ......
పెద్ద సెక్యూరిటీ అధికారి : డాక్టర్ డాక్టర్ ......
డాక్టర్ వచ్చి షర్ట్ విప్పి గుచ్చుకున్న గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు .
Like Reply
#15
పాప ఆక్సిజన్ మాస్క్ తీసేసి మమ్మీ ఇది అవసరం లేదులే , పైకి వెళ్ళాక మమ్మీ - డాడీ so many కిస్సెస్ పెడతారు అని అన్నయ్య చెప్పారు , అంతా అపద్ధమే అన్నమాట ......

మేడమ్ : లేదు లేదు తల్లీ ..... మా బంగారుతల్లి చాలు అనేంతవరకూ ముద్దులు కురిపిస్తాము అంటూ సంతోషంగా నవ్వుతున్నారు .
పాప : అన్నయ్య చెప్పినది నిజమే అన్నమాట , మమ్మీ ..... అన్నయ్య బాడీ అంతా రక్తం అంటూ మేడమ్ బుగ్గపై ముద్దుపెట్టి నాదగ్గరకు వచ్చింది , బుజ్జి కన్నీళ్లతో నొప్పివేస్తోందా అన్నయ్యా అని అడిగింది .
నొప్పినా లేనే లేదు పాపా ..... , కార్తీ షర్ట్ లోపల ఉన్నాడా దెబ్బలు తగలకుండా చూసుకున్నాడు .
పాప : థాంక్యూ కార్తీ .......
పాపతోపాటు నన్నూ అంబులెన్స్ దగ్గరకు తీసుకెళ్లి ట్రీట్ చేస్తున్నారు , మేడంతోపాటు మేడమ్ ఒడిలో కూర్చున్న పాప థాంక్స్ చెప్పారు - మేడమ్ అయితే చేతులు జోడించారు వారించాను .

పెద్ద సెక్యూరిటీ అధికారి : తన ఫ్రెండ్స్ అందరికీ అన్నయ్యో తమ్ముడో ఉన్నాడు , ఒకరోజు కీర్తి వచ్చి డాడీ ..... అందరికీ బ్రదర్ ఉన్నాడు నాకెందుకు లేడు అని అడిగింది , మాకు కీర్తి తల్లినే దైవ ప్రసాదం ఎన్నో నోములు పూజలు దేవాలయాల సందర్శనం తరువాత కలిగింది , కీర్తికి ఎలాచెప్పాలో తెలియలేదు - ఆరోజంతా ఏమీ తినకుండా బాధపడుతూ ఉంది - మేడమ్ షాపింగ్ కు తీసుకెళ్లి బొమ్మను కొనియ్యడంతో అందులోనే చూసుకుని ఆనందిస్తోంది , మమ్మల్ని విడిచి అయినా ఉండగలదు కానీ ఆ బొమ్మను వదిలి ఉండలేదు .
సో క్యూట్ పాపా ......
పాప : డాడీ ..... ఈరోజుతో తమ్ముడితోపాటు అన్నయ్య కూడా అంటూ వచ్చి హత్తుకుంది , అన్నయ్యా మీపేరేంటి ? .
మహేష్ ......
మహేష్ మహేష్ ...... రియల్ హీరో అన్నారు సర్ - మేడమ్ .
పాప : Hi మహేష్ అన్నయ్యా , I am కీర్తి - He is .....
కార్తీ ...... I know ......
అందరమూ నవ్వుకున్నాము .

అంబులెన్స్ కింద పేరు కోసమే ఎదురుచూస్తున్నట్లు డ్రైవర్ సెక్యూరిటీ అధికారి ..... మహేష్ అని చెప్పడంతో ......
అందరూ మహేష్ మహేష్ మహేష్ అంటూ కేకలువేస్తున్నారు సంతోషంతో ......
కీర్తి కూడా మహేష్ అన్నయ్య మహేష్ అన్నయ్య అంటూ కేకలువేస్తోంది .

సెక్యూరిటీ అధికారి డ్రెస్సులో ఒకరు వచ్చి , సర్ ..... మీడియా వచ్చింది న్యూస్ కవరేజ్ కోసం , మీ పర్మిషన్ అడుగుతున్నారు .
పెద్ద సెక్యూరిటీ అధికారి : తప్పకుండా తప్పకుండా .......
అధికాదు సర్ కమిషనర్ డాటర్ కే ఇలా జరిగింది అంటే మీ గురించి .......
కమిషనర్ సర్ ..... అంటూ లేచి నిలబడ్డాను .
కమిషనర్ : మహేష్ కూర్చో , నా గురించి ఏమైనా చెప్పనివ్వండి , ఇలాంటి సాహసబాలుడి గురించి దేశం మొత్తం తెలియాలి పిలిపించండి పిలిపించండి .
వద్దు వద్దు సర్ , మీడియా వద్దు , ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది నేను వెళ్ళాలి , మీరు ok అంటే వెళతాను అంటూ మళ్లీ లేచాను కంగారుపడుతూ ......
కమిషనర్ : నా కంగారుని చూసి మీడియా వద్దులే కూర్చో , మీ మేడమ్ ఫుడ్ సూపర్ గా వండుతారు లంచ్ టైం అయ్యింది కదా తిన్నాక నేనే స్వయంగా ఇంటి దగ్గర వధులుతాను , మీ పేరెంట్స్ కు మేమే స్వయంగా థాంక్స్ చెప్పుకోవాలి , డాక్టర్ ఆల్రైట్ అన్నారు త్వరలోనే నయమైపోతాయి అన్నారు కాబట్టి ఇంట్లోకి వెళదాము .
కీర్తి : లవ్ యు డాడీ - మమ్మీ , అన్నయ్యా రా అంటూ చేతిని అందుకుంది .
వద్దు వద్దు కీర్తీ , ఇప్పటికే ఆలస్యం అయ్యింది నేను వెళ్ళాలి .
కమిషనర్ : మేడమ్ గారూ వడ్డిస్తే తిని వెళదాము .
నో నో నో సర్ , నేను తినకూడదు , అసలు ఇంతసేపు బయట ఉండకూడదు , నన్ను నమ్మి exams రాయడానికి ఒంటరిగా పంపించారు .
కమిషనర్ : అర్థం కానట్లు ఎవరు పంపించారు ? , ఎందుకు తినకూడదు ? , ఇంతకూ ఏ కాలేజ్ ? , నువ్వుండేది ఎక్కడ ? .
కమిషనర్ సర్ ..... మీ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం , నేను ఉంటున్నది జైల్లో - జువెనైల్ కాలేజ్లో చదుకుంటున్నాను అంటూ తలదించుకున్నాను .
జైల్లో జైల్లో ...... అంటూ విన్నవాళ్ళంతా షాక్ లో పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉండిపోయారు .
అవును సర్ , నేను ఉంటున్నది జైల్లో - హత్య నేరం కింద నాలుగేళ్లుగా జైల్లో ఉంటున్నాను - ప్రామిస్ ప్రామిస్ కీర్తి ..... మీ అన్నయ్య , వద్దు వద్దు అన్నయ్యను కాను ముద్దాయిని , అంతటి అదృష్టం నాకు లేదు , నేనైతే ఆ హత్య చెయ్యలేదు సర్ , నామీద నమ్మకంతో మీలానే మంచి మనసున్న జైలర్ గారు exam సెంటర్ కు ఒంటరిగా పంపించారు , నావలన వారు ఇబ్బందిపడకూడదు , మిమ్మల్ని బాధపెట్టి ఉంటే sorry సర్ వెళ్ళాలి అంటూ కీర్తికి బై చెప్పి అంబులెన్స్ దిగి బయటకు నడిచాను .
రెండువైపులా అందరూ గుసగుసలాడుకుంటున్నారు .

గేట్ దగ్గరికి చేరుకోగానే ..... , గెట్ ఇన్ అంటూ కమిషనర్ సర్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నట్లు ముందు డోర్ తెరిచారు .
అన్నయ్యా అన్నయ్యా ..... కార్ ఎక్కు ఎక్కు అంటూ సంతోషంతో పిలుస్తోంది కీర్త .
కీర్తి ...... ఆ పిలుపుకు అనర్హుడిని , అలా పిలిచి మమ్మీ - డాడీ ని బాధపెట్టకు అంటూ ముందుకు నడిచాను .
మళ్లీ నాప్రక్కన ఆగింది ముందుకువచ్చి , అన్నయ్యా అని పిలవమని చెప్పినదే మేము , ఎక్కుతావా లేక జైల్ వరకూ మేము ముగ్గురమూ నీతోపాటు నడుచుకుంటూ రమ్మంటావా ? , తల్లీ ..... మీ అన్నయ్య దగ్గరకు ......
నో నో నో మేడమ్ అంటూ బుద్ధిగా ఎక్కి కూర్చున్నాను .
కారు కదిలింది .
థాంక్యూ అన్నయ్యా ......
మేడమ్ : మీ అన్నయ్యకు థాంక్స్ మాత్రమేనా ? , ముద్దులు లేవా ? .
కీర్తి : లవ్ యు మమ్మీ అంటూ ముందుకువచ్చింది .
వద్దు వద్దు కీర్తీ ...... , మట్టి అంటుకుంది .
కీర్తి : నా అన్నయ్య కంటే ముందుగా ఆ గుంతలోకి పడింది నేను , అంటే మీకంటే ఎక్కువగా మట్టి అంటుకున్నది నాకు , నేను ముద్దుపెడితే కోప్పడాల్సింది మీరు .....
నో నో నో మా కీర్తిపై ఎప్పటికీ కోపం రాదు .
కీర్తి : ఆపితే నాకు కోపం వస్తుంది అంటూ వెనుక నుండి చుట్టేసి బుగ్గపై ముద్దుపెట్టింది .
ఒక్కసారిగా కళ్ళల్లో చెమ్మ ......
సూపర్ కీర్తీ అంటూ సర్ - మేడమ్ - కీర్తి ముగ్గురూ హైఫై కొట్టుకుని , మహేష్ ఏమైంది ? .
ఏ ఆప్యాయత - అనురాగం లేకుండా అనాథ శరణాలయంలో పెరిగాను - ఈ నాలుగేళ్ళూ జైల్లో ..... , కీర్తి ముద్దుపెట్టగానే చెల్లి ముద్దు అని తెలిసి ఆనందం తనంతట తానే కళ్ళల్లోకి చేరింది .
మేడమ్ : తల్లీ .......
గాట్ ఇట్ గాట్ ఇట్ మమ్మీ అంటూ ఏకంగా నామీదకు చేరి , థాంక్యూ అన్నయ్యా ఇకనుండీ రోజూ ఈ చెల్లి ముద్దులు ......
కమిషనర్ : కీర్తీ ...... sorry .
కీర్తి : పో డాడీ ..... అంటూ బుంగమూతి పెట్టుకుంది .
సర్ ఏమైంది ? .
కమిషనర్ : ఈ బ్యూటిఫుల్ వైజాగ్ సిటీ కమిషనర్ గా ఈరోజే చివరి రోజు మహేష్ , ఈపాటికి లంచ్ చేసి బయలుదేరాలి అదిగో ఫ్లైట్ ఆ ఫ్లైట్లోనే వెళ్లాల్సి ఉంది అంటూ పైకి చూయించారు , కొద్దిసేపటి ముందే కమిషనర్ గా నా ఫ్రెండ్ కు బాధ్యతలు అప్పగించి ఫేర్వెల్ తీసుకుని వచ్చాను .
మేడమ్ : నిజాయితీగా ఉండకండి అని మీ సర్ కు పెళ్ళైన దగ్గర నుండీ చెబుతున్నాను వినలేదు , ఈయన గారి సిన్సియారిటీకి మెచ్చి ప్రెసిడెంట్ భవన్ లో చీఫ్ ఆఫీసర్ గా ......
ప్రెసిడెంట్ భవన్ - చీఫ్ ఆఫీసర్ ..... సో ప్రౌడ్ సో ప్రౌడ్ సర్ అంటూ సెల్యూట్ చేసాను .
సర్ : చూసి నేర్చుకోండి , వారం అయ్యింది మీకు గుడ్ న్యూస్ చెప్పి ......
Sorry డియర్ హస్బెండ్ - sorry డాడీ అంటూ నవ్వుకుని సెల్యూట్ చేసారు .
సర్ : లవ్ యు మై బ్యూటిఫుల్ రోజస్ ..... , దీనికి కూడా మహేష్ కే థాంక్స్ చెప్పుకోవాలి , మహేష్ ...... ఏమి జరిగింది ? - నువ్వు చెయ్యని నేరానికి ఎలా శిక్షను అనుభవిస్తున్నావు .

నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా సర్ ? .
సర్ : 100% .....
నేనుకూడా నేనుకూడా అంటూ మేడమ్ - కీర్తి ......
థాంక్యూ థాంక్యూ థాంక్యూ అంటూ ఇన్నాళ్లూ దాచుకున్న కన్నీళ్లు వదిలేసాను , ఇలా నన్ను ఎవ్వరూ అడగలేదు సర్ ......
కీర్తి : అన్నయ్యా బాధపడకు అంటూ కన్నీళ్లను తుడిచింది .

నాలుగేళ్ళ క్రితం , ******* అనాథ శరణాలయం వార్డెన్ మంచివాడే కాదు సర్ - మాకోసం వచ్చిన డబ్బునంతా దాచేసుకుని మాకు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టకుండా - కాలేజ్ కు కూడా పోనివ్వకుండా పనులకు పంపించేవాడు - బిక్షము ఎత్తుకుని డబ్బులు తీసుకుని రమ్మనేవాడు , చిన్న పిల్లల నుండే రక్తదానం చేయించి డబ్బులు తీసుకునేవాడు , ఇవన్నీ చూసి భరించలేని నాతోటి అనాథ ఒకరోజు పడుకున్న వార్డెన్ పై బండరాయి వేసి చంపేసి భయంతో అక్కడ నుండి పారిపోయాడు , కేస్ క్లోజ్ చెయ్యాలని అప్పటి SI సెక్యూరిటీ అధికారి అనాథలందరిలోకి పెద్దవాడైన నన్ను తీసుకెళ్లి జైల్లో వేశారు , కోర్టులో - జైల్లో ఎవ్వరికి చెప్పినా నమ్మలేదు అంటూ బాధపడ్డాను .
సర్ : sorry మహేష్ , మొబైల్ తీసి కాల్ చేశారు స్పీకర్ లో ఉంచారు - రేయ్ .....
" రేయ్ ముందు కీర్తి ఎలా ఉందో చెప్పు ? , ఇంతకూ ఎక్కడ ఉన్నావు ? , కలెక్టర్ మీటింగ్ నుండి రాగానే విషయం తెలియగానే కలెక్టర్ సర్ తోపాటు ఇంటిదగ్గరకు వచ్చాము .
కీర్తి : హలో అంకుల్ I am safe ..... , డాడీ ......
సర్ : తెలుసు తల్లీ ...... , కీర్తి సేఫ్ గానే ఉందికానీ , ముందైతే నాలుగేళ్ళ క్రితం ****** శరణాలయం ఏ స్టేషన్ పరిధిలో ఉండేదో ఆ స్టేషన్ అప్పటి SI ఎక్కడ ఉన్నా ఉన్నఫలంగా జైలు దగ్గరకు రావాలి .
" ఇప్పుడే ఆర్డర్ వేసి నేనూ వస్తున్నాను " 
కట్ చెయ్యగానే కలెక్టర్ నుండి కాల్ ఆవెంటనే IG & DIG & మినిస్టర్ ...... ఇలా కాల్స్ వస్తూనే ఉన్నాయి , కీర్తి గురించి తెలుసుకోవడానికి ......
డాడీ ...... ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యండి , మొదట అన్నయ్య ......
సర్ : డన్ తల్లీ ..... ఇదిగో స్విచ్ ఆఫ్ చేసేసాను .
సర్ ...... జైల్ కు ఎందుకు ? .
సర్ : ఏమీ మాట్లాడకు మహేష్ , నీ చెల్లి ఆర్డర్ ......
జైల్ కు చేరుకున్నాము .
Like Reply
#16
సర్ ఇక్కడే ఇక్కడే ఆపండి నేను వెళతాను .

సర్ : నిన్ను జైలు గేట్ వరకూ వదలడానికి రాలేదు , జైలు నుండి బయటకు తీసుకొచ్చి ఈ బ్యూటిఫుల్ వైజాగ్ లో స్వేచ్ఛగా తిరిగేలా చెయ్యడానికి వచ్చాము .
సర్ ...... అంటూ కళ్ళల్లో చెమ్మ .
కీర్తి : అవును అన్నయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టింది .

సర్ హార్న్ కొట్టడంతో మెయిన్ గేట్ సెక్యూరిటీ సెల్యూట్ చేసి గేట్ తెరిచారు .
సర్ సర్ ...... జైలు లోపలికి మేడమ్ గారు - కీర్తి వద్దు .
సర్ : గుడ్ బాయ్ అంటూ సైడ్ కు కారుని ఆపారు .
డాడీ ..... అన్నయ్యతోపాటు నేనూ వస్తాను అంటూ కీర్తి .
సర్ : మీ అన్నయ్య ఒప్పుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు .
కీర్తి : అన్నయ్యా ......
ప్లీజ్ ప్లీజ్ కీర్తీ , లోపల అందరూ నేరస్థులే , వాళ్ళను చూస్తేనే భయపడతాము , పిల్లలను ఎత్తుకుని వెళ్ళేవాళ్ళూ ఉన్నారు , వారిని చూడటం కూడా పాపమే ..... , అలాంటివాళ్లను మా కీర్తి చూడనేకూడదు , మమ్మీ దగ్గరకు వెళ్లు ప్లీజ్ ......
మేడమ్ : మా కీర్తి అన్నాడు కీర్తి తల్లీ ......
కీర్తి : థాంక్యూ అన్నయ్యా అంటూ ముద్దుపెట్టింది , అన్నయ్య మాట వినాలి కాబట్టి వెళుతున్నాను , డాడీ ..... తొందరగా అన్నయ్యను తీసుకొచ్చేయ్యాలి , ఫ్లైట్ ఎక్కేంతవరకూ ఇక అన్నయ్యతోనే ......
సర్ : నీ ఇష్టం తల్లీ .......
సంతోషంతో కీర్తిని వెనుక కూర్చున్న మేడమ్ కు అందించి కారు దిగాను , కారు వైపే చూస్తూ లోపలికివెళ్లాము .

వచ్చేశాడు ...... మారనే మారవు కదా అంటూ లాఠీతో కొట్టబోయి బాధతో లాఠీనీ ప్రక్కకు విసిరేశారు జైలర్ , ఇంకేంట్రా చూస్తున్నారు ఆనందం కొద్దిసేపే వెళ్ళండి వెళ్ళండి వెళ్లి బాధపడండి అంటూ ఏదో ఆశతో ఎదురుచూస్తున్న కొద్దిమంది ఖైదీలను పంపించేశారు , వాళ్ళు నిరాశతో అక్కడే వర్క్ చూస్తుండిపోయారు .
నాకు నవ్వు వచ్చేసింది .
జైలర్ : అయినా నవ్వు ఎలా వస్తుంది మహేష్ ......
Sorry జైలర్ గారూ ...... నావల్లనే ఆలస్యం అయ్యింది , వెళ్ళాలి వెళ్ళాలి ఇప్పటికే ఆలస్యం అయ్యింది వెళ్ళాలి అంటూనే ఉన్నాడు .
జైలర్ : కమిషనర్ సర్ ...... నో నో నో ఇప్పుడు ప్రెసిడెంట్ భవన్ స్పెషల్ ఆఫీసర్ కదూ అంటూ సెల్యూట్ చేశారు , ఏదో గుర్తుకువచ్చినట్లు విక్రమ్ విక్రమ్ ..... కీర్తి ఎలా ఉంది ముందు ఆ విషయం చెప్పు .
సర్ : మహేష్ వలన మళ్లీ జన్మించింది .
జైలర్ : అంటే అంటే ...... న్యూస్ లో చెబుతున్న ఆ అజ్ఞాత బాలుడు - రియల్ బాల సాహసవీరుడు మహేష్ అన్నమాట , మహేష్ ...... అంటూ వచ్చి కౌగిలించుకున్నాడు , తాతయ్యా తాతయ్యా ..... అంటూ ముద్దుగా పిలిచే బంగారాన్ని కాపాడావు , థాంక్యూ థాంక్యూ థాంక్యూ ....... , అయినా ఏంటి విక్రమ్ ...... కీర్తిని కాపాడిన హీరోని మళ్లీ జైలుకు తీసుకొచ్చావు అంటూ కోప్పడ్డారు .
సర్ ..... నావైపు చూసారు .
జైలర్ : అర్థమైంది అర్థమైంది మహేషే లాక్కుని వచ్చి ఉంటాడు , ఆ మంచితనమే ఇంతకాలం జైలులో ఉండేలా చేసింది , జైలులోకి వచ్చిన సంవత్సరం లోపే మహేష్ మంచితనం తెలిసి నేనే స్వయంగా ఏమి జరిగిందో తెలుసుకుని బాధపడ్డాను , కేస్ క్లోజ్ చేసిన సెక్యూరిటీ అధికారి ప్రమోషన్ తో వేరే స్టేషన్ కు వెళ్లిపోవడం వలన ఏమీచెయ్యలేకపోయాను , మహేష్ క్విక్ లెర్నర్ కాబట్టి చదువులో గేమ్స్ లో ఎప్పుడూ టాప్ లోనే ఉండేవాడు , కాలేజ్ కాంపిటీషన్స్ మరియు స్పోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు అటునుండి ఆటే వెళ్ళిపొమ్మని నీకోసం ఎవ్వరూ వెతకరని ప్రతీసారీ చెప్పడం - నిజాయితీగా వచ్చెయ్యడం , ఈ చివరి పరీక్షకు వెళ్లేముందు స్ట్రాంగ్ గా చెప్పాను ఇదే నీ ఫైల్ నువ్వు exam రాసి అటునుండి ఆటే వెళ్లిపోవాలి - ఈ ఫైల్ కాల్చేశాను అంటే నీ గురించి ఎవ్వరికీ తెలియదు తిరిగొచ్చావో దెబ్బలు పడతాయి అన్నాను అయినా వచ్చేశాడు , ఏమైనా అంటే మాత్రం నేను ఖైదీని జైలర్ మళ్లీ ఎప్పుడైనా తప్పుచేసి సెక్యూరిటీ ఆఫీసర్లకు చిక్కవచ్చు అప్పుడు నావలన మంచివారైన మీరు సంజాయిషీ చెప్పుకోకూడదు - మీరు జైలర్ గా ఉండటం వలన నాలాంటి పిల్లలు చాలామంది హ్యాపీగా చదువుకుంటున్నారు , మీకేమీ కాకూడదు అంటాడు - ఇక్కడి నుండి వెళ్ళేది నిజాయితీగానే అంటాడు , అంత మంచివాడు ......
సర్ : సెల్యూట్ చెయ్యాల్సినది నీకు మహేష్ ......
సర్ అంటూ ఆపాను .
సర్ : జైలర్ గారూ ..... మహేష్ ను నిజాయితీగానే బయటకు తీసుకెళదాము .
జైలర్ : అలా జరగాలంటే కేస్ క్లోజ్ చేసిన సెక్యూరిటీ అధికారి తో కోర్టుకు వెళ్ళాలి .

వచ్చేశాడు స్వయంగా నేనే తీసుకొచ్చాను , ఈ హీరోనేనా ..... కీర్తిని కాపాడింది థాంక్యూ థాంక్యూ మహేష్ అంటూ చేతిని కలిపారు , అక్కడ బయట నీ సిస్టర్ ఇంకా ఎంతసేపు అంకుల్ అంటూ ఎదురుచూస్తోంది , వెళదామా అంటే అన్నయ్య చెప్పాడు ఇక్కడే ఉండమని అన్నది .
సర్ : ఎంతసేపు వేచి చూడాలిరా ..... , సిటీ కమిషనర్ అయ్యావని బలుపా .....
కమిషనర్ : Sorry sorry స్పెషల్ ఆఫీసర్ ...... , ఈయనగారు సెటిల్మెంట్ కు వెళ్ళాడు , తిని తిని ఈ బొజ్జను ఎంతలా పెంచాడో చూడు .
సర్ కోపం కంట్రోల్ చేసుకోలేక చెంప చెళ్లుమనిపించాడు , ఒక పిల్లాడి నాలుగేళ్ళ జీవితాన్ని నాశనం చేసావు .
లోపలికివచ్చి నన్ను చూడగానే చెమటలు పట్టేసాయి ఆ సెక్యూరిటీ అధికారి కు ..... , sorry సర్ అంటూ తలదించుకున్నాడు .
సర్ : రేయ్ విశ్వ వెంటనే సస్పెండ్ చేసేయ్ రా , లంచాలు తిన్న డబ్బు ఉందికదా దాంతో బ్రతికేస్తాడులే , చేసిన తప్పు రేపు హెడ్లైన్స్ లో రావాలి .
సెక్యూరిటీ అధికారి : సర్ సర్ సర్ .......

వద్దు వద్దు విక్రమ్ సర్ ...... , ఈ సర్ చేసిన తప్పుకు వాళ్ళ ఫ్యామిలీ అవమానాలకు గురికాకూడదు , కాలేజీలో పిల్లలు - సమాజంలో మాటలకు మేడమ్ గారు బాధపడకూడదు .
సెక్యూరిటీ అధికారి : తన తప్పు తెలుసుకున్నట్లు sorry మహేష్ అంటూ మోకాళ్లపై చేరాడు , క్షమించరాని తప్పు చేశాను , అయినాకూడా నువ్వు .... నా ఫ్యామిలీ గురించి ఆలోచించావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు , ఇకనుండీ మంచిగా ఉంటాను .
చెప్పడం కాదు విక్రమ్ సర్ ..... , ఇప్పటివరకూ తిన్న లంచం డబ్బులతో అనాథ శరణాలయాన్ని బాగుచేయించాలి .
సర్ : చేస్తాడు , ఈరోజే మొదలుపెడతాడు , ఇదిగో ఫైల్ ఏమిచేస్తావో తెలియదు , మహేష్ వెంటనే నిజాయితీగా బయటకు రావాలి .
సెక్యూరిటీ అధికారి : govt లాయర్ కు ఇప్పుడే కాల్ చేస్తాను - స్వయంగా వెళ్లి జడ్జి గారికి విషయం మొత్తం చెబుతాను - ఏ శిక్షను విధించినా అనుభవిస్తాను .
సర్ .......
సర్ : నువ్వు శిక్షిoపబడటం కాదు కాదు నీవలన నీ కుటుంబం శిక్షింపబడటం మహేష్ కు ఇష్టం లేదు , మేమూ వచ్చి ఏదో ఒక విధంగా సరిచేస్తాము .
సెక్యూరిటీ అధికారి : థాంక్యూ థాంక్యూ సర్ అంటూ మోకరిల్లాడు .
సర్ : ఇవన్నీ వద్దు , మహేష్ చెప్పినట్లు శరణాలయం మారిపోవాలి .
సెక్యూరిటీ అధికారి : అలాగే అలాగే సర్ అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ లేచాడు .
Like Reply
#17
జైలర్ : నేనూ వస్తాను - మహేష్ ఫ్రీడమ్ లోని సంతోషం నేనూ చూడాలి అంటూ బయటకువచ్చారు .


మెయిన్ గేట్ దగ్గరకు రాగానే అన్నయ్యా అంటూ పరుగునవచ్చి హత్తుకుంది కీర్తి , డాడీ - అంకుల్ ...... అన్నయ్యతోపాటు ఇంటికే కదా .
అంకుల్ : ఇంకా లేదు కీర్తీ ...... 
కీర్తి : డాడీ ......
సర్ : కొద్దిసేపట్లో తల్లీ ..... , కోర్టుకు వెళ్లడం - జడ్జి గారితో మాట్లాడి రిలీజ్ పేపర్స్ మీద సంతకం చేయించుకోవడం - నీ అన్నయ్యను నిరపరాధిగా ప్రపంచానికి తెలియజెయ్యడం - అప్పుడు అప్పుడు హ్యాపీగా ఇంటికి వెళదాము .
కీర్తి : సూపర్ డాడీ ......
సర్ : నీ అన్నయ్యతోపాటు మీముగ్గురూ మన కారులో ఫాలో అవ్వండి అంటూ విశ్వ సర్ govt వెహికల్లో జైలర్ తోపాటు బయలుదేరారు .
కీర్తి : రా అన్నయ్యా , మమ్మీ బానే డ్రైవ్ చేస్తారులే , భయపడాల్సిన అవసరం లేదు అంటూ లాక్కెళ్లి ముందుసీట్లో కూర్చోబెట్టి నాపై కూర్చుంది .
మేడమ్ : బానే డ్రైవ్ చేస్తానా అంటూ కీర్తికి ప్రాణంలా మొట్టికాయవేసి సర్ వెహికల్ వెనుకే పోనిచ్చారు .
ఫాస్ట్ ఫాస్ట్ మమ్మీ ......
మేడమ్ : మీ డాడీ ఫాస్ట్ గా వెళ్లాలికదా .......

దగ్గరే కావడంతో 15 నిమిషాలలో చేరుకున్నాము - సర్ వాళ్ళు కారులోనే ఉండమని సైగచేసి లాయర్ ను కలిసి లోపలికివెళ్లారు .
కీర్తి : మమ్మీ ఆపకు ఆపకు లోపలికి పోనివ్వు , లవ్ యు మమ్మీ ..... , ఎవ్వరు ఏమిచెప్పినా సరే అన్నయ్యతోనే ఉంటాను - కోర్ట్ లోపలికి కూడా రాకూడదా అన్నయ్యా అంటూ బుజ్జికోపంతో అడిగింది .
నవ్వు వచ్చేసింది , కోర్టు అంటే న్యాయానికి దేవాలయం కాబట్టి రావచ్చు .
కీర్తి : యాహూ ...... 
ష్ ష్ ష్ కీర్తీ , కోర్టు లో ఇలా కేకలువెయ్యరాదు .
కీర్తి : నా అన్నయ్య జైలు నుండి బయటకు వస్తున్నాడు , సంతోషంగా ఉండాలా వద్దా ......
థాంక్యూ కీర్తీ ......
మేడమ్ : ఫస్ట్ టైం నీ నవ్వును చూస్తున్నాను మహేష్ ......
నవ్వి నాలుగేళ్లు అయిపోయింది మేడమ్ , ఈ సంతోషమంతా మీవల్లనే - కీర్తి వల్లనే, థాంక్యూ థాంక్యూ .......
కీర్తి : Only థాంక్యూ నేనా అన్నయ్యా ......
మేడమ్ : థాంక్యూ తోపాటు ముద్దులుకూడా పెట్టాలి మహేష్ తెలియదా ......
అలాంటివేమీ తెలియదు మేడమ్ ......
మేడమ్ : ఇప్పుడు తెలిసింది కదా , ముద్దుపెట్టు లేకపోతే గోల గోల చేస్తుంది గట్టిగా కేకలువేస్తుంది .
కళ్ళల్లో ఆనందబాస్పాలతో కీర్తి బుగ్గపై ముద్దుపెట్టబోయి ఆగిపోయాను , నేను చూస్తున్నదే కీర్తి కూడా చూస్తోంది . ఒక బామ్మను ..... లేడీ సెక్యూరిటీ ఆఫీసర్లు నిర్దాక్షిణ్యంగా బయటకు లాక్కెళ్లిపోతున్నారు - బామ్మ కళ్ళల్లో కన్నీళ్లను చూస్తుంటేనే మాఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు చేరిపోయాయి .
అన్నయ్యా .......
కీర్తిని ఎత్తుకుని కిందకుదిగాను - మేడమ్ కు అందించి పరుగునవెళ్లి , సెక్యూరిటీ అధికారి మేడమ్స్ మేడమ్స్ ..... ముసలావిడ ముసలావిడ జాగ్రత్త జాగ్రత్త అంటూ ముందుకువెళ్లి ఆపుతున్నాను .
లేడీ సెక్యూరిటీ అధికారి : కోర్ట్ ఏమైనా నీ ఇల్లు అనుకున్నావా ముసలిదానా ఏకంగా కోర్టు ఆవరణలోనే నిరాహారదీక్ష చేస్తున్నావు అంటూ గేట్ బయటకు తోసేశారు .
బామ్మా అంటూ పడిపోకుండా పట్టుకున్నాను - ప్రక్కనే ఉన్న చెట్టు కింద కూర్చోబెట్టి నీళ్లు నీళ్లు అంటూ చుట్టూ చూసి బడ్డీ కొట్టు ఉండటంతో పరుగునవెళ్లి వాటర్ ప్యాకెట్స్ అడిగాను .
నాలుగు రూపాయలు ......
అన్నా ..... పాపం బామ్మ మీరూ చూశారుకదా ......
లేదా అయితే వెళ్లు ......
అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ ......
అన్నయ్యా అంటూ 10 రూపాయల నోటు ఇచ్చింది కీర్తి ......
థాంక్యూ కీర్తి అంటూ చెమ్మను తుడుచుకుని అన్నా ఇవ్వు అంటూ తీసుకుని , కీర్తితోపాటు పరుగున బామ్మ దగ్గరకు చేరి తాగమన్నాను .
బామ్మ : ఆయాసపడుతూనే వద్దు వద్దు అన్నారు .
బామ్మా ..... త్రాగండి , నేను ముందే చెప్పాను కోర్టులో బాధ - కన్నీళ్లు పనికి రావు అని , కోర్టుకు కావాల్సొనది సాక్ష్యాలు ఆధారాలు , అన్నీ వాళ్లకు అనుకూలంగా ఉన్నాయి , అయినాకూడా సంవత్సరం పాటు పోరాడాము , ఈరోజుతో తుది తీర్పు ఇచ్చేసారు , నేను చెయ్యాల్సినదంతా చేసాను క్షమించండి అన్నారు లాయర్ మేడమ్ .......
కీర్తి ..... వాటర్ ప్యాకేట్ కట్ చేసి , గ్రానీ త్రాగండి అంటూ నోటికి అందించడంతో త్రాగారు ......
థాంక్యూ కీర్తీ ...... , లాయర్ గారూ ఏమైంది ? - ఈ వయసులో న్యాయం కోసం పోరాడుతున్న బామ్మ ఎవరు ? - కేస్ ఏంటి ? .

లాయర్ మేడమ్ : బామ్మకు ఇద్దరు మనవరాళ్లు , వారు చిన్నవయసులో ఉన్నప్పుడే కూతురు - అల్లుడు ఆక్సిడెంట్ లో చనిపోయి పిల్లలిద్దరినీ బామ్మ చేతిలో వదిలేశారు , అప్పట్లో ఉన్నవాళ్లే కాబట్టి ఇద్దరు మనవరాళ్లను ప్రయోజకులను చేసింది , ఒకరిని ఇంజనీరింగ్ మరొకరిని MBBS చదివించింది , ఇంతలో పెద్ద మనవరాలికి పెద్ద సంబంధం పైగా సాఫ్ట్ వేర్ సంబంధం రావడం - కట్నం పెద్దమొత్తంలో అడిగినా సంతోషంగా ఒప్పుకున్నారు , చిన్న మనవరాలి చివరి సంవత్సరం MBBS కు కావాల్సిన డబ్బును ఉంచుకుని ఇంటిని సైతం అమ్ముకుని పాతిక లక్షల కట్నం ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్లికూడా జరిపించారు - పెళ్ళైన రోజు నుండీ చేసుకున్నవాడితోపాటు అత్తామామలు చిత్రహింసలు పెట్టారు , డబ్బు డబ్బు అంటూ కొట్టి ఇంటికి పంపించేవారు , అక్కయ్య సంతోషం కంటే చదువు ముఖ్యం కాదు అనుకుని తీసిపెట్టుకున్న డబ్బును సైతం ఇచ్చేసారు , అయినా చిత్ర హింసలు ఆగలేదు , ఇంకా ఇంకా డబ్బు తీసుకురా అని చేతులూకాళ్లకు వాతలు పెట్టి గదిలో బంధించారు .
బామ్మ కన్నీళ్లను తుడుస్తోంది కీర్తి ......
బాధ ఆగడం లేదు .....
లాయర్ : చెల్లెలు వెళ్లి సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇచ్చినా ప్రయోజనం లేదు , అక్కడకూడా డబ్బే కదా గెలిచేది , మాపైనే కంప్లైంట్ ఇస్తారా అని ...... చెప్పడానికి కూడా మాటలు రావడం లేదు - సెక్యూరిటీ ఆఫీసర్లకు డబ్బు ఇచ్చి వీరిపైనే అపద్ధపు కేస్ పెట్టించింది , తన వలన చెల్లి - బామ్మ స్టేషన్ చుట్టూ తిరగడం చూసి తట్టుకోలేక తను ప్రాణాలతో ఉంటేనే కదా ఈ కష్టాలు అంటూ ఒకరోజు రాత్రి సూసైడ్  .......
అంతే తట్టుకోలేక మోకాళ్లపైకి పడిపోయాను , బామ్మ కన్నీళ్లను చూసి కీర్తి కన్నీళ్ళు ఆగడం లేదు .
లాయర్ : పెళ్ళైన 2 నెలల్లోనే ప్రాణంలా పెంచుకున్న ఒక మనవరాలు ప్రాణాలు విడవడం - రెండో మనవరాలి చదువు ఆగిపోవడం తట్టుకోలేకపోయింది , నెలలపాటు తిండిహారాలు లేక కన్నీళ్లతోనే సహవాసం చేశారు , ఇల్లుకొన్నవాళ్ళు మరింత బాధపెట్టడం ఇష్టం లేక కొద్దికాలం సమయాన్ని ఇచ్చారు , ప్రాణాలైతే తీసుకురాలేము కానీ చిన్న మనవరాలిని ఎలాగైనా చదివించాలి అనుకుని కట్నం డబ్బుల కోసం కోర్టులో కేస్ వేసింది నా సహాయంతో ...... , కేస్ అయితే హియరింగ్ కు వచ్చింది కానీ కట్నం ఇచ్చినట్లు మళ్లీ మళ్లీ డబ్బులు ఇచ్చినట్లు ఏ పత్రాలు లేకపోవడంతో నెలకోసారి వాయిదాపడుతూ ఈరోజుతో కేస్ పూర్తిగా వారివైపుకు తీర్పు ఇచ్చేసారు , డబ్బంతా వద్దు బిడ్డ చదువుకు అవసరమైంది ఇప్పించండి అని ఇద్దరూ బ్రతిమిలాడుకున్నా , కావాల్సింది ఆధారాలు అంటూ ఉదయమే కేస్ కొట్టివేశారు , వాళ్ళ కన్నీళ్లు చూసి కోర్టు మొత్తం కన్నీళ్లు కార్చింది కానీ న్యాయ దేవతకు మాత్రం కనికరం కలగలేదు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు , ఏడుస్తున్న మనవరాలిని ఇంటికి పంపించి పట్టు వదలకుండా ఇక్కడే కూర్చున్నారు , తరువాత ఏమిజరిగిందో అందరూ చూసారు , బామ్మా ..... ఇప్పుడంతా డబ్బుదే విజయం ఇంటికి వెళదాము .
బామ్మ : ఇంటికివెలితే రేపటితో ఇల్లూ ఉండదు - మనవరాలి చదువూ ఉండదు - నేను బ్రతికి లాభం ఏమిటి .
బామ్మా ..... అక్కయ్య కోసం , ఇంటి దగ్గర అక్కయ్య ఎదురుచూస్తూ ఉంటుంది , ధైర్యంగా ఉండండి ఏదో దారి ఉంటుంది .
కీర్తి : అవును గ్రానీ ...... , మా అన్నయ్య కూడా చెయ్యని నేరానికి నాలుగేళ్లు జైలులో ఉన్నారు , గాడ్ sad ఫీల్ అయినట్లు ఈరోజు రిలీజ్ అవుతున్నారు .
ఎండ కూడా ఎక్కువగా ఉంది , లాయర్ గారూ ప్లీజ్ ఇంటివరకూ వదలండి అంటూ ఆటోను పిలిచాను , బామ్మను ఆటోలో ఎక్కించి లాయర్ గారూ డబ్బు లేదు .
లాయర్ : పర్లేదు నేను ఇస్తాను , అదిగో అదే గయ్యాలి అత్తమామలు - ఎలా రాక్షస నవ్వులు నవ్వుకుంటూ వెళుతున్నారో చూడు , ఆ లగ్జరీ కారు కూడా కట్నం డబ్బులతో కొన్నదే ......
బామ్మ చూడకూడదు వెళ్ళండి .
మేడమ్ కన్నీళ్లతో డబ్బు ఇచ్చారు .
డ్రైవర్ అన్నా జాగ్రత్తగా తీసుకెళ్లండి , బామ్మా ధైర్యం కోల్పోవద్దు - అక్క ఉందని గుర్తుపెట్టుకోండి , ఆటో కదిలింది .
Like Reply
#18
కీర్తి అయితే నాతోపాటు మూడో కన్ను తెరిచినట్లు బుజ్జి పరాశక్తిలా కోపంతో వారివైపు చూస్తోంది వారు వెళ్లిపోయేంతవరకూ ....... , మమ్మీ ...... తప్పుచేసిన వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లారు - పాపం గ్రానీ ఏడుస్తూ వెళ్లారు .

మేడమ్ : పాపం పడినప్పుడు కాలమే సమాధానం చెబుతుంది తల్లీ ..... , సంతోషమైన - బాధైనా ఏదీ శాశ్వతం కాదు , ఒకరికి మంచి చేసినా చెడు చేసినా అది రెండుగా మనల్ని చేరుతుంది , బామ్మ గారి జీవితంలోకి మళ్లీ సంతోషాలు చేరుతాయి ఎలా అయితే నీ అన్నయ్య ఆ సమయానికి దేవుడిలా వచ్చి నిన్ను కాపాడాడో అలా ......
కీర్తి : థాంక్యూ దేవుడా అంటూ హత్తుకుంది , గాడ్ ..... నాలానే గ్రానీని కూడా హ్యాపీగా ఉంచడానికి అన్నయ్యలాంటి దేవుడిని తొందరగా పంపించండి .
నాకోరిక కూడా అదే దేవుడా ...... 
నాకోరిక కూడా అంటూ మేడమ్ ప్రార్థించారు .

అంతలో సర్ పిలిచారు , ఏమైంది ముగ్గురి కళ్ళల్లో కన్నీళ్లు , నీ అన్నయ్య ఆల్మోస్ట్ రిలీజ్ అయినట్లే .......
కీర్తి : యాహూ ..... లవ్ యు లవ్ యు డాడీ , అన్నయ్య రిలీజ్ అన్నయ్య రిలీజ్ అంటూ డాన్స్ చేస్తోంది .
చుట్టూ అందరూ చూసి ఆనందిస్తున్నారు .
కీర్తీ కీర్తీ ...... నవ్వుతున్నారు .
మేడమ్ : నవ్వుకోనివ్వు మహేష్ , కీర్తి ఇంత సంతోషంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు .
మా బంగారుతల్లి అంటూ ఎత్తుకున్నారు సర్ ..... 

జడ్జి గారి ముందుకు చేరాము .
జడ్జి : మహేష్ ..... నీ గురించి అంతా తెలిసింది , చట్టం - న్యాయం రెండూ నీకు అన్యాయమే చేశాయి , నిన్ను వెంటనే రిలీజ్ చేసేలా సమాజంలో స్వేచ్ఛగా తిరిగేలా తీర్పు ఇస్తున్నాను , నిన్ను ఎవరైనా నేరస్థుడు అని అంటే వారిపై చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ ఆఫీసర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను , చట్టం ద్వారా అన్యాయం జరిగినందుకు సెక్యూరిటీ ఆఫీసర్ శాఖ నుండి తగిన సహాయం - సహాయం కాదు జరిమానా మరియు న్యాయం ద్వారా అన్యాయం జరిగినది కాబట్టి న్యాయ శాఖ నుండి తగిన జరిమానా డబ్బును మహేష్ కు ఇవ్వవలసిన దిగా తీర్పును ఇస్తున్నాను , మహేష్ ...... YOU ARE FREE TO GO .
సంతోషంలో థాంక్యూ జడ్జి సర్ అంటూ కీర్తి తల్లి చప్పట్లు కొడుతోంది .
జడ్జి : Who is that cute girl ? .
సర్ : మై డాటర్ - మహేష్ సిస్టర్ సర్ ......
జడ్జి : Ok ok భూతల్లి గర్భంలో కలిసిన అన్నాచెల్లెళ్ళు అన్నమాట , come come .......
కీర్తి వచ్చి నాచేతిని పట్టుకుని ఎత్తుకో అంది .
సంతోషంగా అంటూ ఎత్తుకుని ముద్దుపెట్టాను .
కీర్తి : ఇప్పటికి ముద్దుపెట్టావు అన్నయ్యా , సంతోషం ......
అందరూ సంతోషంతో నవ్వుకుంటున్నారు .
రిలీజ్ అయిన సంతోషాన్ని నాచెల్లితోనే పంచుకోవాలని దాచుకున్నాను , చాలా చాలా ఆనందంగా ఉంది కీర్తీ , థాంక్యూ మేడమ్ - సర్స్ - జైలర్ సర్ - జడ్జి గారూ .......
జడ్జి : సమాజానికి నువ్వు అవసరమని జైలులో ఉన్నప్పుడే నిరూపించావు , నిన్ను రిలీజ్ చెయ్యడం కోర్టుకే గర్వకారణం .
కీర్తి : సూపర్ అన్నయ్యా ......
జడ్జి : కీర్తీ ..... చీకటిలో భయం వేసిందా ? .
కీర్తీ : అన్నయ్య వచ్చేన్తవరకూ చిన్న భయం - అన్నయ్య చెయ్యి తాకగానే ధైర్యం వచ్చేసింది అంటూ ముద్దుపెట్టింది .
స్నానం చేసేంతవరకూ ఆగు కీర్తీ ..... , మట్టి కదా .....
కీర్తీ : అయినా ఇష్టమే అంటూ ముద్దులు కురిపిస్తూనే ఉంది .
సర్ ఎత్తుకోండి ......
సర్ : నో ......
విశ్వ సర్ ......
నో .......
మేడమ్ దగ్గరకువెళ్ళాను .
మేడమ్ : నో నో నో , ఇప్పుడు గనుక నీనుండి ఎత్తుకుంటే గిల్లేస్తుంది - కొరికేస్తుంది .
అందుకే మేమూ ఎత్తుకోలేదు అంటూ సర్స్ ఇద్దరూ నవ్వుకుంటున్నారు .
కీర్తీ : నేనంటే అంత భయం అంటూ గట్టిగా ముద్దుపెట్టింది .
జడ్జి : నవ్వుకుని , చివరగా ఒకటి .... ఈ సెక్యూరిటీ అధికారి కు ఏదైతే పనిష్మెంట్ ఇచ్చావో సూపర్ మహేష్ , ఇక హ్యాపీగా వెళ్ళండి .
థాంక్యూ థాంక్యూ థాంక్యూ ..... అందరమూ చెప్పి సంతోషంగా బయటకు వచ్చాము .

కీర్తిని హత్తుకుని , సర్ ..... మీ ప్రయాణం ఎప్పుడు ? అంటూ దీనంగా అడిగాను .
సర్ : Sorry మహేష్ , రేపు ప్రతీ స్టేట్ నుండి సెలెక్ట్ అయిన చీఫ్ ఆఫీసర్స్ అందరూ ఛార్జ్ తీసుకోవాలి , వెళ్లక తప్పదు .
కీర్తి : డాడీ .......
సర్ : నీ అన్నయ్యకు ఇష్టమైతే మనతోపాటు రావచ్చు .
కీర్తి : అన్నయ్యా ......
అంతకంటే అదృష్టమా ...... , కానీ జైలులో ఉన్నప్పుడు కానీ అంతకుముందు అనాథ శరణాలయంలో బందీగా ఉన్నప్పుడు కానీ వైజాగ్ అందాల గురించి విని చాలా ఆనందించేవాడిని , ముఖ్యంగా బీచ్ ..... బీచ్ లోనే ఉండిపోవాలని ఉంది , కొద్దిసేపటి ముందు మీరూ అన్నారు వైజాగ్ బ్యూటిఫుల్ అని , బీచ్ ఎదురుగా చిన్న గుడిసె కట్టుకుని మధ్యాహ్నం వరకూ కాలేజ్ కు వెళ్లి - మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకూ ఏదైనా పనిచేసివచ్చి సాయంత్రం నుండి నిద్రపోయేదాకా బీచ్ లోనే స్వేచ్ఛగా ఏ రూల్స్ లేకుండా నాకు ఇష్టమైనట్లుగా ఉండాలని ఆశగా ఉంది సర్ .
బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... అంటూ ముగ్గురూ .
చెల్లీ ..... మీతో రావాలనే ఉంది కానీ ఢిల్లీలో బీచ్ లేదుగా , ఇప్పుడెలా కలిశామో మళ్లీ అలానే కలుస్తాము అని నాకు నమ్మకం ఉంది , హ్యాపీగా వెళ్లు .
కీర్తి : నా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం ....... , డాడీ మళ్లీ ప్రమోషన్ వస్తే మాత్రం .....
ఖచ్చితంగా ఖచ్చితంగా వైజాగ్ వచ్చేద్దాము తల్లీ , నీ అన్నయ్యతోపాటు బీచ్ లోనే ఎంతసేపైనా ఆడుకోవచ్చు .
కీర్తి : లవ్ యు డాడీ ..... , గాడ్ ..... త్వరగా ప్రమోషన్ వచ్చేలా చూడు .
నవ్వుకున్నాము .

విశ్వ సర్ వచ్చి , కీర్తీ తల్లీ ...... మీ అన్నయ్య నిజాయితీగా సంపాదించిన అమౌంట్ అంటూ చూయించారు , మానుండి 5 lakhs - కోర్ట్ నుండి 5 lakhs ......
సంతోషంతో ముద్దులుపెడుతోంది .
విశ్వ సర్ : ఇదేకాదు , జైలులో మీ అన్నయ్య చేసిన పనులకు గానూ రోజూ కూలీ 300 చొప్పున నాలుగేళ్లు 4 lakhs 38 thousand రూపీస్ ..... , బ్యాంక్ పాస్ బుక్ - కార్డు తీసుకొస్తానని జైలర్ గారు వెళ్లారు .

సర్ : కీర్తి తల్లీ ..... అయితే నీ అన్నయ్యా మన ఇంట్లోనే ఉండొచ్చు , అన్నీవసతులతో హ్యాపీగా ఉండొచ్చు .
సర్ .......
మేడమ్ : శ్రీవారూ ...... బీచ్ వ్యూ ఉండాలి .
అవును డాడీ అంటూ కీర్తి .
సర్ ...... ఆ సంగతి నేను చూసుకుంటాను - బీచ్ వెంబడి ఎక్కడో ఒకచోట చిన్న గుడిసె దొరకకపోదు , మీరు మీ ప్రయాణానికి రెడీ అవ్వండి .
సర్ : నిన్ను సెటిల్ చెయ్యకుండా వెళితే , నీ చెల్లి - ఈ మేడమ్ గారు నన్ను వధులుతారా ? .
లవ్ యు శ్రీవారూ - లవ్ యు డాడీ అంటూ నవ్వుకున్నారు .
సర్ : రేయ్ విశ్వ విన్నావుకదా , బీచ్ వ్యూ ఉండేలా ......
విశ్వ సర్ : ఆసంగతి నేను చూసుకుంటాను , మనకు తెలిసిన బిల్డర్స్ బోలెడు .....
కీర్తి : అంకుల్ మన ఇంటి కంటే సూపర్ లగ్జరీగా ఉండాలి .
విశ్వ సర్ : మా కీర్తికి తన అన్నయ్యపై ఉన్నంత అనురాగం అంత బ్యూటిఫుల్ గా ఉండేలా చూస్తాను .
సర్ : రేయ్ టైం లేదు .
విశ్వ సర్ : ఇప్పుడే వెళతాను ఇదిగో డబ్బు అంటూ బ్యాగ్ అందించి మొబైల్ నొక్కుతూ వెళ్లారు .

మేడమ్ : మహేష్ ఎప్పుడు తిన్నావో ఏమిటో ఆకలి వేస్తోందా ? .
ఊ - ఊహూ అంటూ తల ఊపుతున్నాను .
మేడమ్ : మాదగ్గర మొహమాటం దేనికి , శ్రీవారూ ..... ఇంట్లో వండినది ఈపాటికి చల్లారిపోయి ఉంటుంది , మాంచి హోటల్ కు తీసుకెళ్లండి .
కీర్తి : లవ్ యు మమ్మీ ......
తప్పైతే క్షమించండి మేడమ్ , చల్లారిపోయినా ఇంటి ఫుడ్ తినాలని ఉంది అంటూ కీర్తి వైపు ఆశతో చూస్తున్నాను .
మేడమ్ : Ok ok కీర్తి చెప్పింది కదూ మమ్మీ సూపర్ గా ఫుడ్ చేస్తుంది అని , తప్పకుండా తప్పకుండా అంటూ మురిసిపోతున్నారు , శ్రీవారూ ఏమి తీసుకురావాలో .......
అన్నీ తీసుకొస్తాను , మీరు ఇంటికి చేరుకునేలోపు ఉంటాయి , మన డ్రైవర్ తెచ్చేస్తాడు , తల్లీ ..... నాతో వస్తావా లేక ......
కీర్తి : డాడీ ....... , ఉన్నదే కాస్త సమయం ......
సర్ : సరే సరే నీ అన్నయ్యతోనే ఉండు , జాగ్రత్తగా వెళ్ళండి .
కీర్తి : అన్నయ్య ఉన్నాడుగా మాకేం భయం .
సర్ : నవ్వుతూనే మమ్మల్ని కారులో పంపించి సెక్యూరిటీ అధికారి జీప్ లో బయలుదేరారు .
అడగకూడదు సర్ ఎక్కడికి మేడమ్ ? .
మేడమ్ : సర్ప్రైజ్ ......
కీర్తి : అన్నయ్య కోసమేనా మమ్మీ ......
మేడమ్ : yes ......
కీర్తి : యాహూ ...... అంటూ ఇంటికి చేరుకునేంతవరకూ ముద్దులు కురిపిస్తోంది
Like Reply
#19
కారు దిగగానే మేడమ్ అంటూ రెండు కవర్స్ ఇచ్చాడు డ్రైవర్ సెక్యూరిటీ అధికారి ......

కీర్తి : మమ్మీ నాన్ వెజ్ ? .
మేడమ్ : yes తల్లీ ......
కీర్తి : లవ్ యు లవ్ యు మమ్మీ ......
మేడమ్ వంట చేసాను అన్నారుకదా , అది చాలు .....
కీర్తి : ష్ ష్ ష్ అన్నయ్యా ...... , బిరియానీ సూపర్ గా చేస్తుంది మమ్మీ ......
మేడమ్ : బిరియానీ డన్ ...... , నీ అన్నయ్యతోపాటు నువ్వూ ఫ్రెష్ అవ్వు - టవల్ ఇవ్వు ......
కీర్తి : మమ్మీ ఆ సంగతి నేను చూసుకుంటాను , ఫ్రెష్ అయ్యేలోపు బిరియానీ - కబాబ్ రెడీ అయిపోవాలి .
మేడమ్ : Ok ...... 
కీర్తి : అన్నయ్యా ..... నువ్వు నా రూంలో బాత్ చెయ్యి - నేను ..... మమ్మీ రూంలో బాత్ చేస్తాను అంటూ తన గదికి తీసుకెళ్లి టవల్ - షాంపూ - కొత్త సోప్ ఇచ్చింది .
బాత్రూమ్లోకి వెళ్ళిచూస్తే చాలా ట్యాప్స్ ఉండటంతో కీర్తిని అడిగాను .
కీర్తి : జైల్లో ఎలా బాత్ చేసేవాడివి అన్నయ్యా.......
జైలు మధ్యలో ఒక బావి ఉంటుంది - ఖైదీలందరూ తెల్లవారుఘాముననే అంటే ఇంకా చీకటిగా ఉండగానే వెళ్లి బకెట్లతో తోడుకొని అక్కడే వేసుకోవడమే ......
కీర్తి : చలి - చల్లని నీరు ......
అవన్నీ వొంటికి తెలియవు , దొరికితే సబ్బు లేకపోతే కట్టెల బూడిదతో నీళ్లు పోసుకోవడమే ......
కీర్తి కళ్ళల్లో చెమ్మ , అన్నయ్యా .... ఇందులోనుండి చల్లని నీరు - ఇందులోనుండి వేడి నీరు .
వేడి నీరు అంటూ ఆనందం ......
కీర్తి : వేడికి తగ్గట్లు ఈరెండూ తిప్పితే పైనుండి షవర్ వస్తుంది అంటూ తిప్పేసింది .
ఒక్కసారిగా నీళ్లు మాపై వర్షంలా కురుస్తున్నాయి , మొదట చల్లగా ఆవెంటనే కాస్త కాస్త వెచ్చగా వేడి నీళ్లుగా మారడంతో , మొదట అఅహ్హ్ అన్నా వెచ్చగా హాయిగా అనిపించి నవ్వుకున్నాను - అన్నయ్యా ..... ఇలా స్మైల్ తోనే ఉండాలి , హాట్ వాటర్ తో ఇష్టమైనంతసేపు హెడ్ బాత్ చేసి రండి అనిచెప్పి డోర్ వేసుకుని మమ్మీ మమ్మీ అంటూ పరుగునవెళ్లిపోయింది .

( మమ్మీ మమ్మీ అంటూ బాధపడుతూనే హత్తుకుంది .
మేడమ్ : విన్నాను బుజ్జితల్లీ ..... , నీలానే నాకళ్ళల్లో కూడా కన్నీళ్లు వచ్చేసాయి , నీ అన్నయ్య ఉండబోవు ఇల్లు ఇంతకంటే సూపర్ గా ఉంటుందిలే , ఇక నుండీ హ్యాపీగా ఉండొచ్చు .....
కీర్తి : లవ్ యు మమ్మీ ......
మేడమ్ : నీ అన్నయ్య వచ్చేలోపు నువ్వు రెడీ అవుతావో లేదో , మీ డాడీ ఎక్కడకు వెళ్లారో తెలుసా ? - మీ అన్నయ్య కోసం బోలెడన్ని డ్రెస్సెస్ - షూస్ .......
కీర్తి : Wow లవ్ యు లవ్ యు డాడీ , అమ్మో ఫాస్ట్ గా బాత్ చేసేయ్యాలి అంటూ పరుగులుతీసింది ) .

కీర్తి ...... బట్టలు తడిచిపోయాయి - వేసుకోవడానికి ..... , సరే అనుకుని బట్టలన్నీ విప్పి ముందుగా ఉతికి అక్కడే ఆరేసాను . ఇంత చిన్న గాయాలకు ఇన్ని కట్లు వేసాడు డాక్టర్ అంటూ పీకేసి డస్ట్ బిన్ లో వేసాను , జీవితంలో ఫస్ట్ టైం హాట్ వాటర్ తో స్నానం - షాంపూ తో స్నానం - షవర్ స్నానం ...... సంతోషంతో వేడి నీళ్ల కింద తనివితీరేంతవరకూ ఏకంగా మూడుసార్లు తలకు షాంపూ - వొళ్ళంతా సోప్ పట్టించి వేడి షవర్ కింద అంతకంటే ఎక్కువసేపు నిలబడి , జైల్లో కష్టాలన్నింటినీ వేడి నీళ్లతోపాటు కన్నీళ్ల రూపంలో వదిలేసి ఎనఫ్ అంటూ ఆఫ్ చేసాను , టవల్ తో తుడుచుకుని ఆరేసిన తడి బట్టలనే వేసుకుని బాత్రూం నుండి బయటకువచ్చాను .

బెడ్ పై నాకోసమే ఎదురుచూస్తున్న కీర్తి , మమ్మీ మమ్మీ ..... నువ్వు చెప్పినట్లుగానే అవే బట్టలు వేసుకున్నాడు అన్నయ్య అంటూ కోపంతో చూస్తోంది .
మేడమ్ : ఏమిచెయ్యాలో మా బంగారు తల్లికి తెలుసులే ......
కీర్తి : దగ్గరకు వచ్చి గుర్రున చూస్తోంది .
కీర్తీ ......
కీర్తి : విప్పు విప్పు అన్నయ్యా ..... , వెళ్లి మళ్లీ స్నానం చేసి ఇదిగో ఈ కొత్త డ్రెస్ వేసుకోండి .
కొత్త డ్రెస్ ? .
కీర్తి : డాడీ ఎక్కడకు వెళ్లారు అని ఆడిగావు కదా , నా అన్నయ్య షాపింగ్ కోసం వెళ్లారు , ఫ్రెష్ అయ్యి ఈ డ్రెస్ వేసుకునివచ్చి చూడండి ఏవేవి ఎన్నెన్ని తీసుకొచ్చారో అంటూ డ్రెస్ ను బెడ్ పై ఉంచి మళ్లీ బాత్రూమ్లోకి తోసేసి పాత బట్టలను డస్ట్ బిన్ లో వేసేయ్యండి అనిచెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది .
కీర్తి ఆర్డర్ ప్రకారం బట్టలన్నీ విప్పి మళ్లీ హాట్ షవర్ కింద ఫ్రెష్ అయ్యి టవల్ తో తుడుచుకుని బయటకువచ్చి , థాంక్యూ సర్ అంటూ కళ్ళల్లో చెమ్మతో డ్రెస్ వేసుకుని బయటకువచ్చాను .
కీర్తి : అన్నయ్యా ...... 
కన్నీళ్లు కాదు కీర్తి , ఫస్ట్ టైం కొత్త బట్టలు వేసుకున్నాను కదా సంతోషంలో అంటూ మోకాళ్లపై కూర్చుని బుగ్గపై ముద్దుపెట్టాను .
కీర్తి : లవ్ యు అన్నయ్యా ..... సూపర్ గా ఉన్నావు , సూపర్ గా ఉంది ముద్దు , అన్నయ్యా ..... ఇవన్నీ మీకోసమే అంటూ చూయిస్తోంది .
తల్లీ తిన్న తరువాత అంటూ లోపల నుండి సర్ .......
కీర్తి : అన్నయ్యా ..... ఆకలేస్తోంది కదూ - బిరియానీ స్మెల్ ఎలా ఉంది .
నవ్వుకున్నాను .
కీర్తి : మమ్మీ ......
రెడీ రెడీ తల్లీ ...... , మీదే ఆలస్యం అంటూ డైనింగ్ టేబుల్ పై రెడీ చేశారు , మహేష్ సూపర్ ......
సర్ కూడా రూంలోనుండి వచ్చి సూపర్ అన్నారు .
థాంక్యూ మేడమ్ - సర్ ......

కీర్తి : రా అన్నయ్యా , అయ్యో అన్నయ్యా కింద కాదు డైనింగ్ టేబుల్ పై అంటూ కూర్చోబెట్టి నాప్రక్కనే కూర్చుంది .
కీర్తీ ...... నావల్లనే ఆలస్యంగా తింటున్నావు sorry .
కీర్తి : అయ్యో అన్నయ్యా నాకైతే ఇప్పటికీ ఆకలి వెయ్యడం లేదు , నా అన్నయ్య హ్యాపీ ముద్దులుతోనే కడుపు నిండిపోయినట్లు ఉంది .
అయితే ముద్దులు క్యాన్సిల్ ......
అన్న ....... య్యా ......
బుగ్గపై ముద్దుపెట్టాను .
బుజ్జినవ్వులు .......
సర్ తోపాటు మేడమ్ సంతోషంగా నవ్వుకుని , తల్లీ ..... అన్నయ్యను తిననివ్వు తరువాత నీ ఇష్టం .....
కీర్తి : అలాగే మమ్మీ , మమ్మీ ..... అన్నయ్యకు లెగ్ పీస్ వడ్డించు .
మేడమ్ : నీ అన్నయ్యపై నీకు మాత్రమే లవ్ అనుకోకు అంటూ ప్లేట్ నిండా రెండు రకాల బిరియానీలు - కబాబ్ వడ్డించారు .
చూడగానే చెమ్మ చేరింది .
మేడమ్ : మహేష్ ...... ఈరోజునుండే నీ జీవితం మొదలైంది అనుకో , హ్యాపీగా తిను , తల్లీ ..... తినిపించు - అన్నయ్య అంటే ప్రాణం అంటే సరిపోదు .
కీర్తి : లవ్ టు లవ్ టు మమ్మీ అంటూ బుజ్జిచేతితో తినిపించింది .
చెమ్మ కాస్తా కన్నీటి ధారలుగా మారిపోయాయి , ఆనందంతో తిని తుడుచుకున్నాను .
ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది ? .
మాటలు రానంత రుచిగా ఉంది , కాస్త పెద్ద ముద్ద తినాలని ఉంది .
నవ్వుకుని , ఏకంగా లెగ్ పీస్ ను నోటికి అందించింది కీర్తి .
నవ్వుతూనే లెగ్ పీస్ అందుకుని రైస్ తోపాటు గబగబా తినేస్తున్నాను , క్షణాలలో ఫుల్ ప్లేట్ ఖాళీ అయిపోయింది .
మళ్లీ వడ్డించడం - మళ్లీ ఖాళీ చేసేయ్యడం , మళ్లీ వడ్డించడం - మళ్లీ ఖాళీ చేసేయ్యడం ...... అలా ఏకంగా నాలుగుసార్లు తిన్నాను , మళ్లీ వడ్డించబోతే చాలు మేడమ్ కానీ కానీ మీ చేతి వెజ్ కూడా తినాలని ఉంది .
మేడమ్ : సంతోషంగా సంతోషంగా అంటూ వేడి చేసి తీసుకొచ్చారు .
వెజ్ కూడా ఒక పట్టు పట్టాను .
కీర్తి - సర్ ...... షాక్ లో చూస్తున్నారు .
సర్ ఎక్కువ తిన్నాను కదూ .....
దిష్టి పెట్టకండి అంటూ ఇద్దరికీ మొట్టికాయలు వేసి నవ్వుకున్నారు మేడమ్ .
సర్ : జైల్ ఫుడ్ నాకు తెలుసు మహేష్ , అందరి తరుపున sorry ......
మీవల్లనే ఇప్పుడుఈ క్షణం ఇంత హ్యాపీగా ఉన్నాను - కడుపునిండా రుచికరమైన భోజనం తిన్నాను , ఈరోజును నా జీవితంలో మరిచిపోను అంటూ చేతులు జోడించాను .
సర్ : మహేష్ అంటూ ఆపారు , మేడమ్ గారూ వడ్డించండి .
నో నో నో ఫుల్ ఫుల్ అయిపోయింది అంటూ వాష్ చేసుకున్నాను .
కీర్తి : అన్నయ్యా ..... సోఫాలో కూర్చుని కూల్ డ్రింక్ - ఐస్ క్రీమ్ తిందాము .
ఐస్ క్రీమ్ అనగానే నోరూరిపోయింది .
కీర్తి : మమ్మీ - డాడీ ..... అన్నయ్యకు మళ్లీ ఆకలేస్తున్నట్లు ఉంది అంటూ నవ్వుకుని లాక్కునివెళ్లి సోఫాలో కూర్చోబెట్టి , ఫ్రిడ్జ్ లోనుండి అన్నింటినీ తీసుకొచ్చి అందిస్తోంది , ఇవ్వడం ఆలస్యం ఖాళీ చేసేస్తున్నాను .
కీర్తి : ఐస్ క్రీమ్ కూడా ఫస్ట్ టైమా అన్నయ్యా ..... ? .
కూల్ డ్రింక్ కూడా - ఫ్రూట్స్ కూడా అంటూ లాగించేస్తున్నాను .
కీర్తి :అన్నయ్యా ఒక్కటీ మిగలకూడదు అంటూ కోన్ తింటూనే అందిస్తోంది .
మొత్తం ఖాళీ చేశాక గానీ చాలు అనలేదు .
నవ్వులు వెల్లువిరిసాయి .

డోర్ దగ్గర ప్యాక్ చేసిన లగేజీని చూసి Sorry సర్ ..... నావలన మీ ప్రయాణం పోస్ట్ ఫోన్ అయ్యింది .
సర్ : నువ్వు లేకపోయుంటే మా ఊపిరే ఉండేది కాదు , దేవుడిలా వచ్చి మూడు ప్రాణాలు నిలబెట్టావు , నువ్వు ఔనన్నా కాదన్నా నిన్ను సేఫ్ గా నువ్వు కోరుకున్న చోటకు చేర్చే ఫ్లైట్ ఎక్కుతాము , అందుకే ఫ్లైట్ టికెట్ కూడా ఇంకా బుక్ చేసుకోలేదు .
లవ్ యు శ్రీవారూ - లవ్ యు డాడీ ...... మేడమ్ - కీర్తి .
థాంక్యూ సర్ అంటూ కీర్తి చేతిపై ముద్దుపెట్టాను .

4 గంటల సమయంలో సర్ మొబైల్ రింగ్ అవ్వడంతో చూసి , తల్లీ ..... మీ అంకుల్ , హౌస్ దొరికినట్లే ..... , హలో ...... , దొరికిందా ...... లొకేషన్ కు ఇప్పుడే వచ్చేస్తాము , కీర్తికి - మహేష్ కు నచ్చలేదో అయిపోయినట్లే నువ్వు ...... ok ok రెడీ చెయ్యి , కీర్తీ తల్లీ ..... మీ అన్నయ్య షాపింగ్ మొత్తం కారులోకి చేర్చాలి - శ్రీమతిగారూ పాలు పొంగించడానికి పాత్రలు తీసుకోండి .
మేడమ్ : ఎప్పుడో రెడీ ......
గుడ్ అంటూ బయలుదేరాము .

సర్ : దగ్గరకు వచ్చేసాము , కీర్తీ ..... మీ అన్నయ్యకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే కళ్ళు మూయాలి .
కీర్తి : Yes yes ..... , అన్నయ్యా Close your eyes .
Ok అంటూ కళ్ళు మూసుకున్నాను .
కీర్తి : అదిగో చూస్తున్నావు అంటూ బుజ్జిచేతులతో కళ్ళు మూసింది , కారు ఆగడంతో Wow సూపర్ సర్ప్రైజ్ డాడీ ...... , అన్నయ్యా చూడకూడదు నేను eyes క్లోజ్ చేసాను కాబట్టి ఎత్తుకునే దిగాలి .
అలాగే కీర్తీ అంటూ దిగి , కీర్తి డైరెక్షన్ లో కొన్ని అడుగులు ముందుకువేశాను , ఇసుకలో అడుగులుపడుతున్నట్లు అనిపిస్తోంది .
కీర్తి : స్టాప్ స్టాప్ అండ్ Open your eyes అన్నయ్యా అంటూ బుజ్జిచేతులను తీసి 3 2 1 అంటూ మూడు ముద్దులుపెట్టింది బుగ్గపై .......
కళ్ళు తెరవగానే ఎదురుగా బీచ్ - పెదాలపై పట్టరాని ఆనందంతో థాంక్యూ కీర్తి లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా సర్ప్రైజ్ చేసావు అంటూ కీర్తిని ఎత్తుకునే ముద్దులుపెడుతూ నీళ్ళల్లోకి పరుగులుతీసాను .
కీర్తి : లవ్ యు డాడీ - అన్నయ్య సో సో sooooo హ్యాపీ ....... అంటూ సంతోషంతో కేకలు వేస్తోంది .
మేడమ్ ...... సర్ చేతిని చుట్టేసి ఆనందిస్తున్నారు .

కీర్తి చిరునవ్వులు చిందిస్తూ కిందకుదిగి నీళ్లు నాపై జల్లుతోంది , మమ్మీ - డాడీ రండి .......
శ్రీమతి గారూ అంటూ మేడమ్ చేతిపై ముద్దులు కురిపిస్తూ నీళ్ళల్లోకి తీసుకొచ్చారు , మహేష్ ..... వైజాగ్ లో రెండేళ్లు ఉన్నాము - బీచ్ లో ఇంత సంతోషం ఎప్పుడూ కలుగలేదు , థాంక్యూ ఫర్ that ..... అంటూ మేడమ్ పై నీళ్లు పోశారు .
మేడమ్ సిగ్గుపడినా సర్ పై - కీర్తిపై నీళ్లు జల్లి ఆనందిస్తున్నారు .
బీచ్ లో చాలాసేపే ఆడుకున్నాము .
Like Reply
#20
సర్ : కీర్తీ తల్లీ ..... మరొక సర్ప్రైజ్ , నీ అన్నయ్య ఉండబోతున్నది బీచ్ కు ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్స్ లోనే , అదిగో టాప్ ఫ్లోర్ అంటూ వేలితో చూయించారు .

కీర్తి : Wow ..... డాడీ డాడీ తీసుకెళ్ళు తీసుకెళ్లు
సర్ : మహేష్ వెళదామా లేక ......
కీర్తి చూడాలని ఆశపడుతోంది వెళదాము సర్ ...... 
బీచ్ రోడ్ దాటగానే పెద్ద మెయిన్ గేట్ ...... , సెక్యూరిటీ సెల్యూట్ చెయ్యడంతోపాటు నుదుటిపై చెమటతో భయపడుతూనే ఏదో చెప్పడానికి ట్రై చేసి ఆగిపోయాడు - Welcome to సూపర్ లగ్జరీ ఫ్లాట్స్ అని స్వాగతం పలుకుతున్న ఆకాశాన్ని అంటుతున్న అపార్ట్మెంట్స్ లోపలికివెళ్లాము , పార్క్ - గేమ్స్ - స్విమ్మింగ్ పూల్ మొదలుకుని సకల సదుపాయాలూ ఉండటం చూసి డాడీ సూపర్ అంది కీర్తి .
సర్ : సిటీలోనే మోస్ట్ లగ్జరీ అపార్ట్మెంట్స్ మరి .....
అన్నయ్యా స్టెప్స్ కాదు లిఫ్ట్ లో అంటూ లోపలికి తీసుకెళ్లి టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేసింది కీర్తి , కిందకూపైకి ఎప్పుడూ వెళ్లాలన్నా ఏ ఫ్లోర్ బటన్ నొక్కితే ఆ ఫ్లోర్ లో ఆగుతుంది , ఫస్ట్ టైం తెలుసు అంటూ ఎత్తుకోమని చేతులుచాపి బుగ్గపై ముద్దుపెట్టింది .
మేడమ్ : కోపంతో నేర్పిస్తే ఎలా తల్లీ .....
కీర్తి : అన్నయ్యపై కోపమా , రానే రాదు అంటూ ముద్దులుపెడుతోంది , సౌండ్ చేస్తూ డోర్ తెరుచుకోవడంతో పైకి వచ్చేసాము అన్నయ్యా ......
ఎప్పుడు ? - ఇంత త్వరగానా ? .
కీర్తి : అవును అన్నయ్యా ...... , ప్చ్ ..... కొన్నిరోజులు కష్టమే అయితే .
మేడమ్ : ఏమీ పర్లేదు మహేష్ ధైర్యవంతుడు ...... , నువ్వేమి భయపెట్టాల్సిన అవసరం లేదు .
కీర్తి : అన్నాచెల్లెళ్ల మధ్యన ఫైర్ రగిలిస్తున్నావు కదా మమ్మీ ......
మేడమ్ : సర్ తోపాటు నవ్వుకుని బయటకువచ్చారు .

కీర్తీ ..... నువ్వు ఆర్డర్ వేసినట్లు సూపర్ లగ్జరీ హౌస్ రెడీ అంటూ విశ్వ సర్ వచ్చారు , ఇంత విశాలమైన అపార్ట్మెంట్ అయినా ఫ్లోర్ కు కేవలం రెండే రెండు హౌసెస్ ఎదురెదురుగా అంటూ చూయించారు , బీచ్ వెంబడి అపార్ట్మెంట్స్ అన్నీ చూసి ఈ బ్యూటిఫుల్ హౌస్ సెలెక్ట్ చేసాను కీర్తి అన్నయ్య కోసం - కీర్తి కోసం ...... అంటూ ఓపెన్ చేశారు , కీర్తీ ...... సర్ప్రైజ్ చేయాలనుకుంటే మీ అన్నయ్య కళ్ళు క్లోజ్ చెయ్యాలి .
మేడమ్ - సర్ నవ్వుకున్నారు .
కీర్తి : Yes yes అంకుల్ అంటూ నామీదనే ఉండటంతో కళ్ళు మూసింది బుజ్జిచేతులతో ...... 
విశ్వ సర్ : Welcome to ఫుల్లీ ఫర్నీచర్డ్ లగ్జరీయోస్ ఫ్లాట్ ......
కీర్తితోపాటు మేడమ్ - సర్ కూడా Wow wow wow సూపర్ అన్నారు .
విశ్వ సర్ : డబల్ బెడ్రూం ఫ్లాట్ - బెడ్ రూమ్స్ కూడా హాల్ లా ఉంటాయి , ఇది బిగ్గెస్ట్ హాల్ - ఇటువైపు కిచెన్ - ఎదురుగా రెండు బెడ్ రూమ్స్ మధ్యలో ఒక స్టోర్ రూమ్ - అటువైపు స్మాల్ జిమ్ .......
కీర్తి : అంకుల్ ..... అన్నయ్య కూడా చూడాలికదా .
విశ్వ సర్ : ఫస్ట్ నీ సర్ప్రైజ్ అంటూ బెడ్రూం డోర్ తెరిచి లోపలికి ఆహ్వానించారు .
Wow wow .....
కీర్తి : ష్ ష్ మమ్మీ డాడీ ...... wow బ్యూటిఫుల్ .
మేడమ్ : నువ్వు మాత్రం ......
కీర్తి : Yes నేను మాత్రమే అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టి , రెడీ 3 2 1 .....
ఎదురుగా SEA VIEW ..... , wow బ్యూటిఫుల్ అంటూ కళ్ళప్పగించి చూస్తుండిపోయాను .
కీర్తి : థాంక్యూ అంకుల్ ...... , అన్నయ్యా బెడ్ ఎదురుగా sea - లేవగానే మీరు కోరుకున్నట్లుగానే ఎంజాయ్ చెయ్యవచ్చు .
పట్టరాని ఆనందంతో కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి , థాంక్యూ సర్స్ అన్నాను , చాలా costly గా ఉంటుంది నాకెందుకు .......
విశ్వ సర్ : కీర్తి అన్నయ్య కోసం ..... బిల్డర్ మనకు కావాల్సినవాడే నీకు ఇష్టమైనంతవరకూ హ్యాపీగా ఉండవచ్చు , నేను - మీ సర్ చిన్నప్పటి నుండీ బెస్ట్ ఫ్రెండ్స్ , కీర్తికి ఏమైనా ఈ ఉంటే ఇద్దరూ తట్టుకునేవారు కాదు , వారిని చూసి నేను కూడా , ఇది చాలా తక్కువ , నేను సిటీ కమిషనర్ గా ఉండేంతవరకూ సిటీ నీదే నీ ఇష్టం , ఎవడైనా నీకు అడ్డుగా వస్తే నేను చూసుకుంటాను .
కీర్తి : థాంక్యూ అంకుల్ .......
విశ్వ సర్ : మనసులో ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు , ఏమి అవసరమైనా ఒక్క కాల్ చెయ్యి అంతే , రేయ్ మొబైల్ ఎక్కడ ? .
సర్ : మొబైల్ తోపాటు షాపింగ్ అంతా బీచ్ లో నిలబెట్టిన కారులోనే ఉండిపోయాయి అంటూ చూయించారు .
విశ్వ సర్ : కింద మనవాళ్ళు ఉన్నారులే తీసుకొస్తారు అంటూ కాల్ చేశారు .
కీర్తి : డాడీ ..... అన్నయ్యకు మొబైల్ , లవ్ యు .....
మేడమ్ : ఢిల్లీ వెళ్ళాక అన్నయ్యతో మాట్లాడాలి అని అలిగితే ఎలా అందుకు , శ్రీవారూ ...... పంతులు గారిని సంప్రదించి సమయం చెబితే పాలు పొంగించవచ్చు .
విశ్వ సర్ : చెల్లెమ్మా ..... , 5 గంటలకు దివ్యంగా ఉందన్నారు పంతులు గారు , ఫ్లాట్ దొరకగానే కాల్ చేసాను - మహేష్ పేరుకు కలిసొస్తుంది అన్నారు .
మేడమ్ : Its time అంటూ పూజ చేసి అందరి సమక్షంలో పాలు పొంగించి కాఫీ చేశారు .
ఎయిర్పోర్ట్ లో కలుద్దాము పని ఉంది అని విశ్వ సర్ వెళ్లిపోయారు .

షాపింగ్ మొత్తం పైకి చేరడంతో వద్దు అన్నా బెడ్రూంలో చక్కగా సర్దేశారు మేడమ్ .
సర్ : ఈ డబ్బును కూడా శ్రీమతి గారూ ...... 
రెండు బ్యాగ్స్ ఉన్నాయేమిటి సర్ ? .
సర్ : ఒక బ్యాగులోనేమో సెక్యూరిటీ అధికారి - కోర్టు నుండి అందిన డబ్బు - మరొక బ్యాగులోనేమో మీ మేడమ్ ఇప్పటివరకూ కూడబెట్టుకున్న డబ్బు .
సర్ - మేడమ్ ....... వద్దు వద్దు వద్దు , ఇది తప్పు .
మేడమ్ : తల్లి బిడ్డకు ఇవ్వడం తప్పు అని ఏ రాజ్యాంగం చెప్పింది - ఇందులో మీ సర్ కూడా అమౌంట్ చేర్చారు .
అంతే ఆ మాటకు కళ్ళల్లో ఆనందబాస్పాలు చేరాయి ....... , మేడమ్ అంటూ పొంగిపోతున్నాను .
కీర్తి : మమ్మీ ..... అన్నయ్య ఒప్పేసుకున్నట్లే , వెళ్లు వెళ్లు లోపల ఉంచేయ్ .
జైలులో ఒక తాత చెప్పారు , " ఒకరికి మంచి చేస్తే రెండుగా మనల్ని చేరుతుంది " అంటూ రెండు చేతులతో నమస్కరించాను , నేను ఒకటి చేస్తే మీరు ఏకంగా స్వేచ్ఛను ప్రసాదించారు - జీవితాన్నీ ఇచ్చారు - ఒక అందమైన కుటుంబం ...... మూడుగా నన్ను చేరాయి .
సర్ : మూడుగా కాదు మరొకటి కూడా అంటూ వెనుక నుండి హుండీని తీసి టీపాయ్ పై ఉంచారు .
కీర్తి తెగ సిగ్గుపడుతోంది .
చెల్లీ ..... నీదే కదా ? .
కీర్తి : తీసుకోకపోతే ఊరుకునేది లేదు , డాడీ - మమ్మీ ఇస్తే సంతోషంగా తీసుకున్నావు కదా , హుండీలో చిల్లర మాత్రమే అనుకునేవు అన్నయ్యా - పెద్ద పెద్ద నోట్లు ఉన్నాయి అంటూ చెవిలో గుసగుసలాడింది .
హుండీ అందుకుని బరువు చూసాను - కదిలించాను , తీసుకుంటాను చెల్లీ తీసుకుంటాను , నా చెల్లిని మళ్లీ కలిసేలోపు హుండీని ఫుల్ చేసేస్తాను .
కీర్తి : ఊహూ ఖాళీ చెయ్యాలి .
లవ్ యు ......
కీర్తి : మమ్మీ ...... అన్నయ్య లవ్ యు అన్నాడు - డాడీ ..... అన్నయ్య లవ్ యూ అన్నాడు అంటూ సంతోషం .
సర్ మేడమ్ సంతోషిస్తున్నారు , మహేష్ మరొకటి అంటూ మొబైల్ కీర్తి చేతులతో అందించారు .
కీర్తినే ఓపెన్ చెయ్యమన్నాను .
కీర్తి : ముద్దుపెట్టి ఓపెన్ చేసింది , wow డాడీ ఐఫోన్ ...... 
సర్ : సిమ్ వెయ్యి తల్లీ అంటూ అందించారు .
నిమిషాలలో యాక్టీవ్ అవ్వడంతో , వెంటనే మేడమ్ మొబైల్ అందుకుని గదిలోకివెళ్లి కాల్ చేసి అన్నయ్యా అంటూ ఆప్యాయంగా పిలిచింది .
చెల్లీ అంటూ కళ్ళల్లో ఆనందబాస్పాలతో పిలిచాను - సంతోషంగా చాలాసేపు అలానే మాట్లాడుకున్నాము , ఫ్లాట్ మొత్తం తిరుగుతూ ఆడుకున్నాము .

6 గంటల సమయంలో కీర్తీ ..... అన్నారు స్యాడ్ గా సర్ , ఇంకా ఇంటికివెళ్లి లగేజీ తీసుకుని వెళ్ళాలి , 7 కు ఫ్లైట్ ...... తరువాత సీట్స్ లేవు .
కీర్తితోపాటు మేడమ్ కళ్ళల్లో కూడా చెమ్మ ...... , ఆడుకుంటున్న కీర్తి వెనక్కు తిరిగి నా పాదాన్ని చుట్టేసింది .
కన్నీళ్లను దాచుకుని ఎత్తుకున్నాను , వెళ్లాలికదా కీర్తీ అంటూ ముద్దులుపెడుతూనే బయటకువచ్చాము .
అప్పటివరకూ ఫ్లాట్ వైపే చూస్తున్నట్లు చీకటిలో ఎదురింటివారు కంగారుపడుతూ లోపలికివెళ్లి డోర్ వేసేసుకున్నారు .
సర్ వాళ్ళను చూసి భయపడ్డారేమో అనుకుని నవ్వుకున్నాము .
సర్ ఫ్లాట్ కు కీస్ వేసి నా జేబులో ఉంచారు .
కీర్తి : డాడీ - మమ్మీ ...... ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అయ్యేంతవరకూ అన్నయ్య నుండి ఎత్తుకున్నారో ఖబడ్దార్ ......
ఎత్తుకున్నా వస్తావు పాపం అంటూ నవ్వుకుని , లిఫ్ట్ లో కిందకువెళ్లి కారులో ఇంటికి - లగేజీతో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము , విశ్వ సర్ ఫ్యామిలీతో వచ్చారు .
భావోద్వేగ వాతావరణం నెలకొంది , అన్నయ్యా రోజూ కాల్ చేస్తాను వీడియో కాల్ చూయించాను లేదా - ఫుల్ ఫ్రీ గా ఎంజాయ్ చెయ్యండి అంటూ ముద్దులుపెడుతోంది , అనౌన్స్మెంట్ రావడంతో వదల్లేక వదల్లేక వదిలి కన్నీళ్లతో లోపలికి వెళ్లిపోయారు .

ఫ్లైట్ టేకాఫ్ అయిన అనౌన్స్మెంట్ రావడంతో కళ్ళ ముందే జీవితం మొత్తం దూరంగా వెళ్లిపోతోందా అన్నంత బాధతో కన్నీళ్లతో అక్కడే కదలకుండా చాలాసేపు అక్కడే ఉండిపోయాను .
విశ్వ సర్ అర్థం చేసుకున్నట్లు నన్ను మాట్లాడించకుండా ఓపికతో వేచి చూస్తున్నారు .
చాలాసేపు అవ్వడంతో మహేష్ అంటూ వచ్చారు , మహేష్ ...... నీ బాధను అర్థం చేసుకోగలం , వారు సేఫ్ గా హ్యాపీగా చేరుకోవాలంటే నువ్వూ హ్యాపీగా ఉండాలి - నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే నీ చెల్లి అంత హ్యాపీగా ఉంటుంది .
అలాగే విశ్వ సర్ అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను - హృదయంపై చేతినివేసుకుని హ్యాపీ జర్నీ చెల్లీ - సర్ - మేడమ్ అంటూ సంతోషంగా తలుచుకున్నాను , సర్ మీరు వెళ్ళండి నేను వెళతాను .
సర్ : ఇంకేమైనా ఉందా ...... , నిన్ను సేఫ్ గా నీ ఫ్లాట్ లో వదిలి వారికి మెసేజ్ చేస్తేనే ..... లేకపోతే .
మేడమ్ నవ్వుకున్నారు .
సర్ : ఢిల్లీలో ఫ్లాట్ ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ కాల్ నీకే చేస్తారులే వెళదామా ? .
సర్ ఎప్పుడు ల్యాండ్ అవుతుంది ? .
సర్ : 2:30 hours జర్నీ మహేష్ ..... , అంటే 9:30 - 10 మధ్యలో ఢిల్లీలో ల్యాండ్ అవుతారు .
విశ్వ సర్ అలారం సెట్ చేసుకోవడం ఎలా ? అంటూ మొబైల్ తీసాను .
సర్ : 10th క్లాస్ కంప్లీటేడ్ కదా నువ్వే ట్రై చెయ్యి .
మేడమ్ : శ్రీవారూ చూయించొచ్చు కదా .....
సర్ : మహేష్ కూడా నేర్చుకోవాలి కదా , ట్రై చెయ్యి మహేష్ ......
అలాగే సర్ అంటూ బయటకు నడుస్తూ చెల్లి వివరించినట్లుగా చెక్ చేస్తున్నాను , సరిగ్గా పార్కింగ్ లో కారు దగ్గరికి చేరుకునేసరికి , దొరికింది సర్ థాంక్యూ అలారం సెట్ ......
సర్ : అంతే ఈజీ కూర్చో ......
మేడమ్ : శ్రీవారూ అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
సర్ తోపాటు నేనూ సిగ్గుపడుతూనే వెనుక కూర్చుని మొబైల్ ను అవగాహన చేసుకుంటున్నాను .
20 నిమిషాలలో అపార్ట్మెంట్ ముందు కారు ఆగింది , నాతోపాటు సర్ - మేడమ్ కూడా దిగబోతుంటే సర్ సర్ నేను వెళతాను .
సర్ : Are you sure ..... ok గుడ్ నైట్ , వెయిట్ వెయిట్ అంటూ కిందకు దిగి కారువెనుక ఓపెన్ చేసి పెద్ద బ్యాగ్ ఇచ్చారు , జైలర్ ఇచ్చారు ..... బ్యాంక్ పాస్ బుక్ - కార్డ్ తోపాటు నువ్వు వేసిన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి , నువ్వు ఇష్టంగా దాచుకున్నవన్నీ ఉన్నాయట ......
థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ ......
సర్ : నాకు కాదు నీ జైలర్ సర్ కు చెప్పు , మహేష్ ..... డిన్నర్ పంపిస్తాను .
నో నో నో సర్ ..... , లంచ్ కూడా ఆలస్యంగా చేసాము పైగా ఫుల్ గా తిన్నాను .
విశ్వ సర్ : మీ సర్ చెప్పారులే అంటూ నవ్వుకున్నారు .
దిష్టి పెట్టకండి శ్రీవారూ ..... , నా ఫ్రెండ్ సూపర్ గా చేస్తుంది బాగా తిన్నాడు .
సర్ : ok ok ......
ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి కదా సర్ , వాటితోనే డిన్నర్ .
Ok  గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోయారు .
గుడ్ నైట్ సర్ - మేడమ్ ..... , థాంక్యూ జైలర్ సర్ అంటూ సంతోషంగా లోపలికి నడిచాను .
Like Reply




Users browsing this thread: 4 Guest(s)