Thread Rating:
  • 8 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic హా.. హా.. హాసిని...!
#1
హాయ్ అంధరికి నేను ఈ ఫోరం లో ఎన్నో కథలు చదవడం జరిగింది .....!
ఇప్పుడు నేను కూడా ఒక కథ మొదలు పెడదాం అనుకుంటున్నా.....
నా పేరు నాని .. మాది కరీంనగర్ దగ్గర చిన్న ఊరు... నా వయసు 24... నేను ఫ్లిప్‌కార్ట్‌లో జాబ్ చేస్తాను...  
ఇంకా అసలు విషయానికి వస్తే అది దసరా రోజు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగ మందు తాగి ఇంటికి వచ్చి నా బుజ్జి మంచం మీద పడుకున్నా .... ఆలా పడుకోగానే పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటే కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి... గుండె బరువు ఎక్కింది.. టైం చుస్తే 2:30 అవుతుంది ఫోన్ లాక్ ఓపెన్ చేశా అందులో ఉన్న ఫోటో కనిపించగానే చిన్న నవ్వు వచ్చింది.... తానే నా హాసిని...

  (ఫ్లాష్ బ్యాక్)..... అవి నేను ** చదివే రోజులు (వీడు ఏంట్రా సడన్ గా అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనుకోకండి)
కథ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది .. నేను మా క్లాస్ లో లాస్ట్ బెంచ్... అవును చెప్పడం మర్చిపోయా నాకు ఒక చెల్లి కూడా ఉంది.. ఇందులో విచిత్రం ఏంటి అంటే అది కూడా నా క్లాస్ ఏ....

మా తెలుగు టీచర్ శ్రీదేవి మేడం క్లాస్ చెప్తుంటే బోరింగ్ గా వింటూ ఉన్నాం అందరం... అప్పుడే may I come in teacher అన్న గొంతు వినపడింది... ఒక్కసారి గా అందరం అటు వైపు చూసాం... అప్పుడే చూసా నా హాసిని ని.... మేడం చూసి come in అంది.. తాను వెళ్లి రెండో సీట్ లో కూర్చుంది... మోకాళ్ళ కింది వరకు స్కర్ట్ వేసుకుంది జడలో పూలు కళ్ళకి కాటుక ఒక చిన్న బొట్టు బిళ్ళ చెవిలకి చిన్న కమ్మలు అబ్బో చిన్నపాటి సౌందర్య లాగ అనిపించింది...
 తనని చూడగానే లోపల ఏదో చిన్న కలవరం.. అది ఇష్టము కాదు ప్రేమ అంత కన్నా కాదు కానీ మా క్లాస్ గర్ల్స్ లో తాను కొంచము స్పెషల్ గా కనిపించింది... ఆరోజు అంతా తాను ఒక్కసారి కూడా నన్ను చూడలేదు..

. ( నువ్వు పెద్ద హీరోవి మరి నిన్నే చూస్తూ ఉంటారు మూసుకొని కథ చెప్పారా)

 ఓకే ఓకే...

 ఆరోజు పెద్దగా క్లాస్ లో ఎం జరగలేదు. అన్ని అవే బోరింగ్ పాఠాలు.. అప్పడుప్పుడు మధ్యలో తనని చూసే వాడిని ఎం చేస్తుందా తన పాటికి తాను ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఫ్రెండ్స్ తో అప్పుడప్పుడు మా చెల్లి కూడా తనతో మాట్లాడుతుంది.. ఆలా సాయంత్రం 4 అవుతుంటే కాలేజ్ బెల్ కొట్టారు.... అందరం హుషారుగా బైటికి వెళ్తున్నాం మా చెల్లి కూడా బ్యాగ్ వేసుకొని నాతో బయిటికి వచ్చింది ఇద్దరం కలిసి వెళ్తుంటే అప్పుడే ఒక డిస్కౌవర్ బండి వచ్చింది ఆగింది... అప్పుడే మా వెనుక నుంచి తాను నవ్వుతు వెళ్లి ఆహ్ బండి ఎక్కి మా చెల్లి వైపు చూసి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది...


కథ ఎలా ఉందొ చెప్పండి ఇది నా రియల్ లైఫ్ స్టోరీ మసాలా కారం ఉప్పు లాంటి ఎం ఉండవు ఇందులో ?
కథ రాయడం ఇదే ఫస్ట్ టైం కొంచము ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి...

      ఇట్లు మీ
       నాని...... 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Reality ounte chalu broooooo, continue cheyandi bro.
Like Reply
#3
All the best bro...
Continue...
Naa suggestion nunchi story open chesi chadivithey aa story end lo oka reply pettandi & naa thread lo aa post ki rate cheyyandi  Heart
Reader... & appreciater...
Catch me up in Google Chat  @ kinguu1432 @ g mail. com 
Like Reply
#4
Good start
Like Reply
#5
నేను కూడా ఇంటికి వచ్చి బ్యాగ్ ఇంట్లో పడేసి అట లో మునిగిపోయా... మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చేసరికి నాన్న ఉన్నాడు ఇంట్లో... మెల్లిగా పిల్లిలా వెళ్లి అమ్మ పక్కన చేరిపోయా.. అప్పుడే నాన్న రేయ్ నానీ ఇటు రారా అంటూ కేకేసాడు. అబ్బా దొరికిపోయాను రా బాబు అనుకుంటూ డాడీ దగ్గరకు వెళ్ళాను. డాడీ టీవీ లో మొఖం పెట్టి నా వైపు చూడకుండా ఎటు వెళ్ళావ్ ఇప్పటిదాకా అన్నారు... నేను భయం భయం గానే డాడీ నోట్స్ రాసుకుదాం అని ఫ్రెండ్ దగ్గరకు వెళ్లిన...
అబద్ధం చెప్తున్నాడు డాడీ వీడు ఇప్పటిదాకా దున్నపోతు లా ఆటలు ఆడుకొని వచ్చాడు అని చెప్తూ నవ్వుతుంది... నా రాక్షసి చెల్లి..
అబ్బా దొరికిపోయాను రా దేవుడా అని మొఖం కిందుకి వేసా...
ఏరా కొంచెమ్ అయినా సిగ్గు ఉందారా... నా చిట్టీ తల్లి చూడు వచ్చిన దగ్గర నుంచి పుస్తకం లో తల పెట్టి చదువుతుంది.... ( నేను తల పెట్టి చదువుతుందో నిద్ర పోతుందో ఎవడికి తెల్సు )
రేయ్ ఎటు చూస్తున్నవ్ రా దున్నపోతా... సరిగ్గా చదువు రా లేకపోతే సంక నాకిపోతావ్... అని తిడుతూనే ఉన్నాడు మా డాడీ... అబ్బా ఊరుకోండి వాడిని తిట్టానిదే మీకు పొద్దు పొదు. రేయ్ నువ్ రా రా వెళ్లి కళ్ళు చేతులు కడుకుపో అన్నం పెడ్తా... ఏమే చదివింది చాలు లేచి ఈ గిన్నెలు అన్ని అక్కడ పెట్ట్టు..
నేను ఫ్రెష్  అయ్యి వచ్చి కూర్చున్న.. అమ్మ అందరికి అన్నం పెట్టింది.. ఎం కూర చేసావ్ అమ్మ.. పప్పు చారు రా ఇంకా అప్పడాలు కూడా ఉన్నాయి... ఓహో అని తింటూ టీవీ చూస్తున్న అప్పుడే సౌందర్య పాట వస్తుంది... అప్పుడే నా సౌందర్య గుర్తుకు వచ్చింది.. తన ని తలుచుకుంటూ అన్నం తినేసి బెడ్ ఎక్కేసా... మళ్ళీ ఊహల్లో తానే వచ్చేది.... ఆలా ఆలా ఆలోచిస్తూనే ఎప్పుడు నిద్ర పోయానో నాకే తెలియదు...
ఉదయం అమ్మ లేపుతుంది నిద్ర లేరా నానీ 6:30 అవుతుంది లేచి రెడీ అవ్వు... అమ్మ కాసేపు అగు అమ్మ లేస్తాను.... ప్లీజ్.. అప్పుడే నాన్న రేయ్ నాన్న లేవరా అని అరిచాడు... టక్కున లేచి కూర్చున్న టైం చుస్తే 6:05.... (6:30 అని చెప్పింది కదా మరి మళ్ళీ 6:05 అవుతుంది అంటున్నాడు ఏంటి అని చూస్తున్నారా అమ్మ అంతే లెండి ఏ టైం అయినా ఒక అరగంట గడిచినట్టు చెపుతుంది...)
నేను లేచి బాత్రూం కి వెళ్లి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి డ్రెస్ వేసుకున్న.. మా చెల్లి ఆల్రెడీ రెడీ అయ్యి జడలు వేయించుకుంటుంది అమ్మ తో.... నేను వెళ్లి టిఫిన్ ఎం పెట్టిందా అని చూసే సరికి అదే ఉప్మా...కోపం గా అమ్మ ని చూస్తూ దాన్ని ప్లేట్ పెట్టుకొని కొంచము చట్నీ వేసుకొని టీవీ చూస్తూ తినేసా..... తరువాత నేను కూడా రెడీ అయ్యి బూట్లు వేసుకొని బ్యాగ్ వేసుకున్న అప్పుడే డాడీ మా దగ్గరికి వచ్చి నాకు చెల్లి కి ఒక్కో 5 రూపాయలు ఇచ్చాడు.... (ఇప్పుడు అంటే 5 రూపాయలు ఎం రావు అనుకోండి...) మా డాడీ కి ఆనందం తో ముద్దు పెట్టి ఇద్దరం నడుచుకుంటూ కాలేజ్ కి వెళ్లిపోయాం...
ఓహ్ సారీ ఇంత వరకు మా ఫ్యామిలీ ని పరిచయం చేయలేదు గా...  మాది ఒక చిన్న ఫ్యామిలీ...
నాన్న. తిరుపతి.
అమ్మ. స్వప్న.
చెల్లి. ప్రియా
నేను. నానీ( manitheja)
నాన్న కరెంటు పని చేస్తుంటాడు.. అమ్మ ఇంట్లోనే ఉంటుంది.. అమ్మ నాన్న వాళ్ళది ప్రేమ వివాహం.. ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. అందుకే మాకు చుట్టాలు అంటే ఎవరో కూడా తెలీదు... ఎప్పుడైనా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం చెల్లి నేను... తాత వాళ్లకు ఆస్థి బాగానే ఉంది. అప్పుడప్పుడు అవసరరాలకి డబ్బులు తాత ఇచ్చేవాడు నాన్న కి . పప్పు లు కారం బియ్యం అన్ని అక్కడి నుంచే వచ్చేవి కాబట్టి దేనికి అంత బాధ లేదు... ఉన్న దాంట్లో మేము హ్యాపీ గా ఉండేవాళ్ళం...తాత నానమ్మ డాడీ తో నాతో చెల్లి తో బానే ఉంటారు కానీ అమ్మ తో మాట్లాడరు....
ఇక ప్రస్తుతం..
నేను చెల్లీ వచ్చేసరికి క్లాస్ లో ఒక్కడు లేడు.. ఇక నేను మా చెల్లి కలిసి బోర్డు మంచిగా కాకర ఆకు తో తుడిచి ఒక వైపు తారీకు రోజు అవి అన్ని రాసి దాని కింద ఒక సూక్తి రాసి.. బెంచ్ లు అన్ని కరెక్ట్ గా సెట్ చేసే సరికి ఒక్కకరు వస్తున్నారు...
అన్నట్టు మీకు చెప్పడం మరిచా. మా క్లాస్ 4th ఫ్లోర్ లో ఉంటుంది రూఫ్ టాప్ మీద ఓన్లీ 3 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉంటాయి.. మిగతా ప్లేస్ కాళీ గా ఉంటది వరండాలాగా... స్టడీ హోవర్స్ కోసం అని.. ఇక చుట్టు చూస్తూ మా ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెడ్తున్నావ్ ఉన్న అంతలోనే నా హాసిని వచ్చేసింది.. ఒక జబ్బ కి బ్యాగ్ వేసుకొని చేతిలో బెల్ట్ తో అదే నవ్వు తో వచ్చి అదే బెంచ్ లో కూర్చుంది... ఇక మా మేడం వచ్చి అటెండెన్స్ తీసుకుంటుంది అందరికి.. దాని తరువాత నిన్న హోమ్ వర్క్ ఎంత మంది కంప్లీట్ చేసారు.. బుక్స్ తీసుకొని నా టేబుల్ మీద పెట్టండి... అని అరిచింది... అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు హోమ్ వర్క్ ఉంది అని... ఎలా ఎలా అని చూస్తూ ఉంటే మా ఫ్రండ్స్ కూడా నాలాగే దిక్కులు చూస్తున్నారు.. నేను సైగలతో ఏమైంది రా అని అడిగా.. వాడు హోమ్ వర్క్ చేయలేదు రా అని చెప్పాడు... హమ్మయ్య నాకు ఒక తోడు దొరికింది అని సంబర పడ్డ.. అప్పడూ మేడం హోమ్ వర్క్ చేయని వాళ్లు ఉంటే  స్టాండ్ అప్.. అని అరిచింది... నేను మెల్లిగా లేచాను నాతో  పాటు ఒక్కకోడు లేస్తున్నాడు ఆలా 6 మంది అయ్యాం... ఇక మేడం shame less fellows  సిగ్గు లేదారా  ఎన్ని సార్లు చెప్పాలి మీకు బైటికి వెళ్లి నిల్చొండి. అపుడు అయినా సిగ్గు వస్తది... అంటే మేము మెల్లిగా బైటికి వెళ్లి ముచ్చట్లు పెడ్తున్నాం... అమ్మాయిలు ఏమో నవ్వుతున్నారు... నేను మొఖం దాచుకొని ఇలా అయ్యింది ఏంటి రా దేవుడా అనుకుంటూ ఉంటే మా ఫ్రెండ్ గాడు ఏమో నవ్వుతున్నాడు..ఆలా క్లాస్ అయిపోయేదాకా బయటే ఉన్నాం.. ఆలా క్లాస్ అయిపోయింది మేడం వెళ్తు వెళ్తు మా దగ్గరికి వచ్చి రేపు కూడా హోమ్ వర్క్ చేయకపోతే కాలేజ్ లో రౌండ్స్ వేపిస్తా... వెళ్ళండి ఇడియట్స్...
హమ్మయ్య అనుకుంటూ క్లాస్ లోపలకి వచ్చి కూర్చున్నాం... ఆలా పిరియడ్స్ అన్ని అయ్యాయి లంచ్ టైం అయ్యింది. ఇక అందరం చేతులు కడుకొని లంచ్ బాక్స్ లు ఓపెన్ చేసి తింటూ ఉన్నాం గర్ల్స్ అందరూ ఒక వైపు..  బాయ్స్ అందరూ ఒక వైపు.. ఇందులో ఒకరి గురించి చెప్పాలి మీకు.. వాడి పేరు వెంకటేష్..  పొట్టి గా ఉంటాడు కానీ క్లాస్ లో టాప్ వాడే.. ఊరికే అన్నారా పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అని.. వాడు ఎం చేస్తాడు అంటే
ఎవరి దగ్గర అయితే మంచి కర్రీస్ వాడికి ఇష్టం అయినవి ఉంటాయో అవి కొంచము కొంచము తెచ్చుకొని వాడు తిని మాకు తినిపిస్తాడు ఒక్కో ముద్ద... ఆలా అందరం తింటూ జోక్స్ వేసుకుంటూ సరదాగా గడిచిపోయింది... దాని తరువాత మళ్ళీ క్లాస్సేస్ స్టార్ట్ అయ్యాయి.. అది సోషల్ పీరియడ్ మా మేడం క్లాస్ చెప్తూ మధ్యలో ఎవరైనా వరల్డ్ మ్యాప్ డ్రా చేసుకొని తీసుకురండి క్లాస్ లో పెట్టుదాం అని అంది... అపుడు మా ఫ్రెండ్ గాడు రేయ్ డ్రాయింగ్ అంట రా నువ్ చేయి రా బాగుంటది.. అని చెప్తే నేను కూడా అలోచించి ఎలాగో నా సౌందర్య ఉంది కదా... తన ముందు కూడా కొంచము వేల్యూ ఉంటది అని లేచి మేడం చేసుకుని వస్తా అని చెప్పా... గుడ్ తేజ.. అనేసరికి అందరు నా వైపు చూసారు ఎవడ్రా వీడు అని అప్పుడు చూసింది నా వైపు నా హ.. హ. హాసిని... ❤️
Like Reply
#6
అప్డేట్ ఇచ్చాను ఒకసారి చదివి చెప్పండి ఎలా ఉందొ.. అలానే సెక్స్ కంటెంట్ లేదు అని అనుకోకండి ఉంటుంది కథ ఇప్పుడే కదా మొదలు అయ్యింది... అందుకే కొంచము టైం పట్టుది నాకు కూడా అంతగా రాయడం రాదూ.. కానీ ట్రై చేస్తా అలానే మీ అభిప్రాయలను కామెంట్స్ లో రాయండి...
ఇట్లు...
మీ నానీ...!
[+] 2 users Like Rishithejabsj's post
Like Reply
#7
Excellent update
Like Reply
#8
Nice Start
Like Reply
#9
కథ బాగా మొదలుపెట్టారు
కొనసాగించండి
Like Reply
#10
Time theesko bro parledhu Characters ni baaga establish chesaake proceed avvu romantic elements ki...
Okate suggestion - week ki 2 updates icchina parledhu madhyalo maatram aapaku
Naa suggestion nunchi story open chesi chadivithey aa story end lo oka reply pettandi & naa thread lo aa post ki rate cheyyandi  Heart
Reader... & appreciater...
Catch me up in Google Chat  @ kinguu1432 @ g mail. com 
Like Reply
#11
Nice start
Like Reply
#12
(27-10-2023, 01:44 PM)Ranjith62 Wrote: Excellent update

థాంక్ యు రంజిత్ గారు...
Like Reply
#13
(27-10-2023, 02:13 PM)Iron man 0206 Wrote: Nice Start

థాంక్ యు ఐరన్ మాన్ గారు...
Like Reply
#14
(27-10-2023, 08:54 PM)ramd420 Wrote: కథ బాగా మొదలుపెట్టారు
కొనసాగించండి

థాంక్ యు ramd420 గారు...
Like Reply
#15
(28-10-2023, 12:26 AM)Kinguuu Wrote: Time theesko bro parledhu Characters ni baaga establish chesaake proceed avvu romantic elements ki...
Okate suggestion - week ki 2 updates icchina parledhu madhyalo maatram aapaku

తప్పకుండా బ్రో ఏదో ట్రై చేశా చూడాలి సెక్స్ ఎంత వరకు వర్క్ అవుద్ది అనేది... ఇక కుదిరితే అయితే ఈరోజు నైట్ వరకు ఇచ్చేస్తా అప్డేట్... థాంక్ యూ...
Like Reply
#16
(28-10-2023, 02:43 PM)Saikarthik Wrote: Nice start

థాంక్ యు సాయి కార్తీక్ గారు...
Like Reply
#17
NICE UPDATE
Like Reply
#18
తాను ఆలా చూసేసరికి ప్రాణం ఉక్కిరి బిక్కిరి అయిపోయింది... మొఖం మీద చిన్న నవ్వు వచ్చింది... ఇక మేడం పాఠం మొదలు పెట్టింది.. అందరూ ఇంట్రెస్ట్ గా వింటున్నారు... నాకు ఏమో ఎలా చేయాలి... ఎం చేస్తే బాగుండు... అని అవే ఆలోచనలు.. ఆలా ఆలా సాయంత్రం అయ్యింది... ఇక అందరం జబ్బాలకి బ్యాగ్ లు వేసుకొని కిందికి వెళ్తున్నాం నా ఫ్రండ్స్ తో పాటు మా చెల్లి ఏమో హాసిని తో మాట్లాడుతుంది.. ఆలా కిందికి వచ్చి చూసే సరికి వాళ్ళ నాన్న రెడీ గా ఉన్నారు తనని తీసుకు వెళ్ళడానికి చెల్లికి బాయ్ చెప్పి బండి ఎక్కి వెళ్ళిపోయింది....
ఇక నేను మా చెల్లి దగ్గరికి వెళ్లి నీకు ఎప్పుడు తను  పరిచయం అయ్యింది పొట్టి అని అడిగా... (మా చెల్లి నిక్ నేమ్ పొట్టి  గమనించగలరు)..
పొట్టి : తను వచ్చిన రోజే పరిచయం అయ్యింది రా..
నాని : ఓహో ఎం అంటుంది ఏంటి నీతోనే మాట్లాడుతుంది మోర్నింగ్ నుంచి
పొట్టి : తనకి ఇంకా ఫ్రెండ్స్ ఎవరు అవలేదు రా నాతోనే ఎక్కువ మాట్లాడుతుంది....
నాని : ఓహో అవునా తన ఇల్లు ఎక్కడ పొట్టి..
పొట్టి : నన్ను అదోలా చూస్తూ తన ఇల్లు నీకు ఎందుకు రా డాడీ కి చెప్పాలా...
నాని : అరే ఇప్పుడు నేను ఎం అన్నానే బాబూ ఊరికే తెలుసుకుందాం అని అడిగా అంతే... దానికే డాడీ దాక ఎందుకు పొట్టి... అయినా చెల్లి నన్ను ఇంకా అనుమానం గానే చూస్తుంది..
నేను మేటర్ డైవర్ట్ చేయడానికి చాక్లేట్ తింటావా పొట్టి.. అని జేబులో నుంచి తీసి తనకి ఇచ్చా..
నన్ను కోపంగా చూస్తూ చాక్లేట్ తీసుకొని వెళ్ళిపోయింది..
ఆలా ఇంటికి వచ్చేసాం.. నేను ఫ్రెష్ బయటికి వెళదాం అనుకున్న కానీ హోమ్ వర్క్ ఉంది... మళ్ళీ నాన్న కి తెలిస్తే తాట తీస్తాడు అని బుద్దిగా ఫ్రెష్ అయ్యి కాలేజ్ డ్రెస్ విప్పేసి ఒక షార్ట్ ఒక బనియన్ వేసుకొని కూర్చొని రాయటం మొదలు పెట్టాను... ఆలా ఒక గంట కి కంప్లీట్ చేసేసా.. అమ్మ చాయ్ ఇచ్చింది తాగురా అని.. అది తాగుతూ టీవీ చూస్తున్న సడన్ గా మేడం చెప్పిన మ్యాప్ గుర్తు వచ్చింది... అప్పటికి టైం 6:30 అవుతుంది.. డాడీ రోజు 7:00  వరకు వచ్చేస్తాడు...  నేను టక టక టీవీ దగ్గరికి వెళ్లి మొబైల్ తీసుకొని డాడీ కాల్ చేశా.. (మొబైల్ అంటే ఏదో అనుకోకండి చిన్న నోకియా డబ్బా ఫోన్ అప్పట్లో అదే కదా)
నాని : హలో డాడీ.
డాడీ : చెప్పు రా నాని.
నేను : వచ్చేటప్పుడు బుక్ స్టాల్ లో పేపర్ షీట్ తీసుకురా డాడీ ప్రాజెక్ట్ వర్క్ ఉంది...
డాడీ : ఇంకేం కావాలి రా.
నాని : ఇంకా ఒక స్కేల్ ఇంకా స్కెచ్ లు ఉంటే తీసుకొని రా డాడీ అవి కూడా కావాలి...
డాడీ : హ్మ్మ్ సరే రా.
అప్పుడే మా చెల్లి ఎక్కడి నుంచి వచ్చింది ఏమో డాడీ  నాకు చిప్స్ ప్యాకెట్ ఇంకా పకోడీ తీసుకొనిరా డాడీ..
ఇంకా అమ్మ పెరుగు కూడా తీసుకోని రమ్మంది...
డాడీ : సరే పొట్టి తీసుకు వస్తా లే బాయ్..
పొట్టి : బాయ్ డాడీ..
ఎప్పుడు తిండి గోలే కదా అని..
ఇక నేను టీవీ పెట్టుకొని jetex ఛానల్ చూస్తున్న... ఆలా ఒక గంటకి నాన్న వచ్చాడు ఇంట్లోకి అన్ని తీసుకోని చెల్లి ఏమో వురికి వెళ్లి అన్ని తీసుకొని టేబుల్ మీద పెట్టింది.. నేను ఆహ్ మ్యాప్ తీసుకొని స్కెచ్ లు తీసుకొని చూస్తున్న . ఎరా ఇవేనా నువ్ చెప్పినాయి అని డాడీ అడుగుతుంటే హా ఇవే డాడీ అని తీసుకొని వెళ్ళిపోయా..
అమ్మ కూడా అప్లుడే ఇంట్లోకి వచ్చింది ముచ్చట్లు పెట్టి..
ఇక డాడీ కూడా ఫ్రెష్ అయ్యి మందు తాగుతున్నాడు టీవీ చూస్తూ.. అమ్మ చెల్లి కూడా చూస్తున్నారు.. నేను నా పని మొదలు పెట్టేసా.. కొంచము కొంచము గీస్తు గీస్తు టైం చూసుకోలే.. చుస్తే టైం 9:30 అవుతుంది... ఎలాగో ఆలా ఫినిష్ చేయాలి అని వేస్తున్న...
మొత్తానికి బానే వచ్చింది మ్యాప్... ఒకసారి డాడీ కి అమ్మ కి చూపించ.. అమ్మ ఏమో నువ్ బంగారం రా ఎంత బాగా గీసావో అని మేచ్చుకుంటూ ఉంటే డాడీ పరవాలేదు రా నువ్ చదవకపోయినా రోడ్ ల మీద బొమ్మలు గీసి అయినా బతుకుతావ్ లేరా అని అంటే... అప్పడు అమ్మ అబ్బా ఊరుకోండి ఎప్పుడు వాడిని తిడుతూనే ఉంటారు.. రేయ్ నువ్ పాడుకోపో.. పొద్దునే లేవాలి అని మళ్ళీ నన్ను పంపించింది....
చెల్లి కూడా నా మ్యాప్  చూసి డాడీ చెప్పింది నిజమేరా అంటూ నవ్వుతుంది.... నేను కోపం తో దాని జుట్టు లాగి వెళ్లి అమ్మ దగ్గరకి వెళ్ళిపోయా... చెల్లి ఏమో డాడీ దగ్గరికి వెళ్ళింది చూడు డాడీ అంటూ... ఆలా రాత్రి గడిచిపోయింది..
పొద్దున్న మళ్ళీ అమ్మ లేపుతుంది.. లేవరా టైం అయ్యింది అని...
నాకు ఈ డ్రాయింగ్ గురించి గుర్తు లేదు...
సడన్ గా లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి ఇడ్లీ ఉంటే తినేసి చెల్లి నేను కాలేజ్ కి వెళ్లిపోయాం....
తరువాత ఒక్కో క్లాస్ జరుగుతుంది... మధ్యాహ్నం అయ్యింది.. సోషల్ మాధవి టీచర్ వచ్చింది...
నాకు ఏమో ఎప్పుడు చూపిద్దాం మేడం కి అని ఉంది.. కానీ మేడం  ఏమో అడగట్లేదు... మర్చిపోయింది కావచ్చు అని నేను కూడా సైలెంట్ గా ఉన్న... అప్పుడే మా ఫ్రెండ్ గాడు మేడం నిన్న తేజ కి చెప్పారు కదా మ్యాప్ గురించి వాడు  చేసి తీసుకు వచ్చాడు మేడం....
ఓహ్ అవును కదా మర్చిపోయా ఇంత తొందరగానే చేసావా తేజ.. ఇది ఇటు ఇవ్వు చూద్దాం..
నేను వెళ్లి ఇచ్చి వచ్చా.. అపుడు మేడం ఓపెన్ చేసి చూసి హ్మ్ బాగుంది తేజ...  అలానే క్లాస్ లో ఉన్న అందరికి చూపించింది... మేడం కూడా ఒకసారి తేజ కి క్లాప్స్ కొట్టండి బాగా చేసాడు కదా అంటే అందరూ చప్పట్లు కొడుతుంటే భలే అనిపించింది నాకు ... సరే క్లాస్ అయిపోయాక ఆహ్ గోడ కి అతికించండి.. ఓకే నా అంటూ మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసింది... క్లాస్ అయిపోయిన తరువాత నేను ఫ్రెండ్స్ అందరం కలిసి గోడ కి ఆంటీచ్చేశాం... ఇక తరువాత అన్ని క్లాస్లు మామూలే... అప్పుడప్పుడు తన వైపు చూసేవాడినికానీ నా వైపు చూసేది కాదు తను.... ఆలా ఆలా ఆరోజు కాలేజ్ అయిపోయింది... ఇక నేను వెళ్తు ఉంటే మా చెల్లి వచ్చి అగు రా ఒక్కడివే వెళ్తున్నావ్ నేను వస్తా అని తెల్సు కదా అని అంటే... సరే రావే వెళ్దాం.. అప్పుడే మా చెల్లి హాసిని రావే వెళదాం అని పిలిచింది... నాకు ఏమో గుండె జల్లుమంది.. తన ని ఎందుకు పిలుస్తుంది అని... తాను వచ్చి మా చెల్లి పక్కన చేరింది... ముగ్గురం మెట్లు దిగుతూ కిందికి వెళ్తున్నాం... అప్పడూ చెల్లి నీకు చెప్పలేదు కదా వీడు నా అన్నయ్య.. తేజ.. ఆలా చెప్పగానే నా వైపు చూసింది నేను మొహమాటం గా హాయ్ కళ్ళతోనే చెప్పా..
తాను నా పేరు హాసిని అని షేక్ హ్యాండ్ ఇచ్చింది.... ఆలా చేతిలో చేయి పెట్టగానే చిన్న పాటి షాక్ నాకు...
తన చేయి అయితే ఎంత సాఫ్ట్ గా ఉందొ లేత కొబ్బరి ముక్క లాగా (ఆహ్ స్పర్శ ఇప్పటికి నాకు గుర్తు ఉంది)
ఆహ్ చేతిని విడిచిపెట్టాలి అనిపించలేదు.. కానీ ఎక్కువ సేపు పట్టుకుంటే బాగోదు అని వదిలేసా..
ఇక మాటల్లో తాను వాళ్ళ డాడ్ పేరు సంపత్ అని లారీ ట్రాన్స్పోర్ట్ లో సూపెర్వైసోర్ అని కొత్తగా ఈ ఊరికి వచ్చారు అని తెల్సింది ఇంకా తనకి ఇద్దరు సిస్టర్స్ అని కూడా తెల్సింది .. ఆలా ఆలా మాట్లాడుకుంటూ కిందికి వచ్చేసాం..కిందికి వచ్చేసరికి రెడీ గా ఉన్నాడు వాళ్ళ నాన్న....
తను వెళ్తున్న వెళ్తున్న ఈసారి చెల్లి కి ఇంకా నాకు కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయింది...
నేను అలానే చూస్తూ ఉన్న తాను వెళ్లిన వైపు ఇంతలో మా చెల్లి అన్నయ్య గారు వెళదామా ఇక లేకపోతే ఇంకొంచము సేపు చూస్తావా అని వెటకారం గా అంది...  అలా అని అనేసరికి పదపద వెళదాం అని ఇంటికి వెళ్ళాము...
[+] 6 users Like Rishithejabsj's post
Like Reply
#19
అప్డేట్ చదివి ఎలా ఉందొ కామెంట్స్ లో రాయండి....!
ఇట్లు...
మీ నానీ...!
[+] 1 user Likes Rishithejabsj's post
Like Reply
#20
bagundi
Like Reply




Users browsing this thread: 1 Guest(s)