Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*అందం…!*
#1
2912b2h1140.3012Bb 2-6.
261023-7.
???????????


                  *అందం…!*
                 ➖➖➖✍️

*‘అందం’ అంటే ఏంటి నాన్నా? అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే…*

*నాన్న చెప్పిన సమాధానం.....*

*“రోజూ లేవగానే నువ్వు నానమ్మకు                             ‘గుడ్ మార్నింగ్ నానమ్మా’ అని చెప్తావు చూడు..   ఆ పలకరింపే ‘అందం’ అంటే..!”*

*”కాలేజ్ కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్ లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే..!”*

*”ఒకరోజు నీ ఫ్రెండ్   నీకు తెలీకుండా                            నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే  ‘మళ్లీ ఎప్పుడూ అలా చెయ్యకు, కావాలంటే నన్నడుగు’ అంటూ ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అని అన్నావు చూడు అదే అందమంటే..!”*

*”షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే .. ‘కాస్ట్లీ అయితే వద్దు నాన్నా’ అంటావు చూడు అదే అందమంటే..!”*

*”అమ్మకూ నాకూ గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి ‘స్మైల్ నాన్నా!’ అంటావు చూడు అదే అందమంటే..!”*

*నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా తీసుకో నాన్నా అన్నావు చూడు అదే అందమంటే..!”*

*”అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే..!”*

*”నా బాధ నీకు తెలీకుండా నీతో మాట్లాడినప్పుడు ‘అలా ఉన్నావేంటి నాన్నా.. అంతా ఓకే అవుతుందిలే’ అంటావు చూడు అదీ అందమంటే..”*

*అని అనగానే..*

*”ఓహో అందం అంటే …*
*గుండె లో ఉంటుందా ,,, *
*మంచి మనస్సు లో ఉంటుందా ,,*
*మంచి ఆలోచనలో ఉంటుందా,,*
*అన్న కూతురు సమాధానం విని ఆశ్చర్యంగా.. ఆనందంగా తన వైపే చూస్తూ ఉండిపోయాడు.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

   ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.?
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)