23-10-2023, 08:42 AM
మిమ్మల్ని నిరంతరం ఉత్తేజాన్ని కలిగించే అంశం/విషయం ఏమిటి?
[/url]
SHAFI SHAIK
[url=https://te.quora.com/profile/SHAFI-SHAIK-27]
·
హైదరాబాద్ వచ్చినపుడు నలుగురు డాక్టర్లు ఇచ్చిన ఒక పార్టీలో ఒకరు ఇదే ప్రశ్న లేవనెత్తారు.
"..ఒక కంపెనీలో ఉన్నత స్థాయి ఉద్యోగిగా, బ్లాగర్ గా, వెబ్ డిజైనర్ గా, ఫ్యాకల్టీగా, రైటర్ గా ఇలా ఇన్నింటిలో నిరంతర పరిశ్రమ చేయడానికి మీకు మోటివేషన్ ఎక్కడ నుండి లభిస్తోంది.." అని.
సమాధానం నాకు వెంటనే తట్టలేదు. వాళ్ళు చెప్పినన్ని బాధ్యతలు నేను మోస్తున్నానా, అన్ని అర్హతలు ఉన్నాయా అని నా మీద నాకే అనుమానం వచ్చింది. బిర్యానీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నప్పుడు బిర్యానీ తప్ప మరొకటి గుర్తు రాదు. నేనెవరో నాకే గుర్తుండదు.
టీ తాగుతున్నప్పుడు అయితే మరీ దారుణం. టీ + నేను అంతే.
క్లాసులు చెబుతున్నప్పుడు, నేను మరో ఉద్యోగం చేస్తున్నానా అనే అనుమానం కూడా వస్తూ ఉంటుంది.
ఇదిగో ఇలా ఆలోచిస్తుంటే వాళ్లడిగిన ప్రశ్నకు సమాధానం తట్టింది.
ఏ పని అయితే చేస్తున్నామో, ఆ పనే సర్వం అన్నట్టుగా పని చేయడం.
అప్పుడు ఒకటికి నాలుగు బాధ్యతలు మోస్తున్నట్టు అనిపించదు. ఇష్టమైన పనులకు మోటివేషన్ ఎందుకు?
కష్టమైన పనిని కష్టంగా చేస్తూ, చేయలేక ఆగిపోతూ, మరొకరి సాయం కోసం ఆర్థిస్తూ ఉన్నప్పుడే కదా మోటివేషన్ అవసరం అయ్యేది?
వ్రాయడం ఇష్టం. కాబట్టి దానికి ఒకరి ప్రోత్సాహం అవసరం లేదు.
నాకు తెలిసిన విజ్ఞానం పదిమందికి పంచాలి అనే తపన క్లాసులు వైపు, బ్లాగుల వైపు లాక్కెళ్ళింది. ఆ బ్లాగుల వల్ల జపాన్ లో అత్యధిక సంఖ్యలో నాకు అభిమానులు ఉన్నారు. రెండవ స్థానం యూఎస్. వారి కామెంట్స్, వారి ప్రోద్బలం మరింతగా ఆ పని పట్ల ఇష్టం పెంచుతోంది. అలస్కా యూనివర్సిటీ వారు వారి ప్రాక్టికల్ లాబ్స్ లో నా కంటెంట్ వాడుకుంటున్నామని తెలియజేశారు. అలాంటి అచీవ్మెంట్స్ ఇష్టాన్ని పెంచుతూనే ఉంటాయి కదా.
ఇక క్లాసులో.. స్టూడెంట్స్ నా పట్ల ఎంతో అభిమానంగా ఉంటారు. వారి అభిమానం - వారి కోసం మరింత శ్రమించేలా చేస్తోంది. ఇష్టమైన పని అది.
ఇక ఉద్యోగం. అది నా జీవనాధారం. కుటుంబ సభ్యులు ఏం అడిగినా కొనివ్వగలిగే స్థాయిని ఆ ఉద్యోగమే ఇచ్చింది. ఇస్తోంది.
ఫోటోషాప్ డిజైనర్ ని, అందులో డిజైన్స్ చేయడం ఇష్టం. వెక్టార్స్ ని, టెంప్లేట్స్ ని తయారు చేయడం నచ్చుతుంది. సృజనాత్మకత నిరర్ధకం అవడం నచ్చదు.
అదే వెబ్ డిజైన్ వైపు లాక్కెళ్ళింది. ఒక టెక్నికల్ కంపెనీ తన వెబ్సైట్ కోసం నన్ను అడిగినప్పుడు కాదనలేదు. నాకు వారు ఇచ్చిన విలువ అసామాన్యం అందుకే డబ్బులేమీ తీసుకోలేదు. పైగా రేపటి రోజు అవసరంలో ఉన్నాం, జాబ్ కావాలి అని ఎవరైనా అడిగితే ఇదిగో ఈ కంపెనీలు నా మాటను గౌరవించి వారిని ఉద్యోగంలో తీసుకుంటాయి. ఒక వ్యక్తికి ఉద్యోగం అంటే ఒక కుటుంబానికి ఆసరా దొరికినట్టే కదా.
ఇలా ఏ పని అయినా ఇష్టంతో చేయండి. ఒకరి ప్రోత్సాహం, ఒకరి గుర్తింపు, ఒకరి ప్రోద్భలం అవసరం ఏమీ ఉండవు.
ఎవరూ మిమ్మల్ని నిరంతరం గుర్తిస్తూ కూర్చోరు. పనిలో సంతోషం వెతుక్కోండి.
అనుభవంతో చెబుతున్న మాట.!!!
◆◆◆◆
Source:Quora /shafi