Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"ధైర్యం"
#1
ఇంకో కొత్త కథావస్తువు, నాలుగైదు భాగాలు ఉండచ్చు. చూద్దాం ఎలా వస్తుందో, మీకు ఎలా అనిపిస్తుందో.
[+] 3 users Like earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
జ్ జ్ జ్, వైబ్రేట్ అయింది మొబైల్.

చూసింది శైలజ.

వన్ న్యూ మెసేజ్.

ఓపెన్ చేసింది.

'ఎక్కడున్నావు'

'ఆటోలో, వస్తున్నా' రిప్లై ఇచ్చింది.

వెంటనే ఇంకో మెసేజ్.

'ఇంతసేపేంటి, గంట నించి వెయిటింగ్ నేను'

'ఇంట్లో లేట్ అయింది, ఆటో కూడా దొరకలేదు, వచ్చి చెప్తా' రిప్లై ఇచ్చింది.

ఆటో దిగింది శైలజ.

సిటీ పార్క్ అది. పెద్ద పార్క్, ఎన్నో చెట్లు, పొదలు, పచ్చని బయళ్ళు ఉన్న పార్క్.

దూరంగా ఒక చెట్టు కింద కూర్చుని మొబైల్లో ఏదో చూస్తున్నాడు ఒక కుర్రాడు.

తన ఎదురుగా వస్తున్న మనిషి ఎవరో తెలిసి... "వచ్చావా, ఎంతసేపు చూడాలి నీ కోసం"... తల ఎత్తకుండానే అడిగాడు.

"చెప్పా కదా ఇంట్లో లేట్ అయింది. మా నాన్న ఫ్రెండ్ ఒకాయన వచ్చారు, ఇద్దరూ బయటికి వెళ్తారు, వెంటనే వద్దామనుకున్నా, ఆయన ఇంట్లోనే మాట్లాడుతూ ఉండిపోయారు, వాళ్ళు వెళ్ళాక బయటకి వచ్చాను. ఆటోలు కూడా లేవు. ఇప్పుడు కూడా ఆటోకి యాభై ఎక్కువిచ్చి వచ్చాను"

"ఇంత జరిగింది అంటావు"

"నీ లాగా రూంలో ఉంటూ, ఎక్కడికెళ్ళాలంటే అక్కడికి బండి మీద రయ్ అని రాలేను కదా"

"గంట నించి చూస్తున్నా. అన్నం కూడా తినలేదు"

"అన్నం తినలేదు సరే, నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు అనుకుని ఏదన్నా తినచ్చు కదా, పార్క్లో రెస్టారెంట్ ఉంది కదా"

"తినచ్చు, కానీ..."

"ఆ, కానీ"

"జేబులు ఖాళీ"

"ఇరవై కూడా లేవా"

"లేవు, నిన్న పెట్రోల్ కొట్టించా. ఆ పెట్రోల్ కూడా అయిపోయింది, బండి కొంచెం దూరం తోసుకుంటూ వచ్చా"

"అయితే వెళ్ళేటప్పుడు రూం దాకా తోసుకుంటునే వెళ్తావా"

"ఎందుకు తోసుకెళ్తాను. నాకెందుకు ఆ కష్టం"

"మరి పెట్రోల్ అయిపోయింది కదా"

"మా శైలు వచ్చింది కదా, పెట్రోల్ కోసం డబ్బులు ఇస్తుంది కదా"

"సిగ్గు లేదూ, అమ్మాయిని నా దగ్గర డబ్బులు అడుగుతావా. నేనొచ్చేటప్పటికి ఐస్ క్రీం పట్టుకుని రెడీగా ఉండాలి కానీ"

"మా శైలు దగ్గర నాకు సిగ్గు ఎందుకు. నా దగ్గర మా శైలుకి సిగ్గెందుకు"

"ఈ మాటలకేం తక్కువ లేదు. అరే అంత దూరం నించి శైలజ నా కోసం వస్తుందే, తనకేదన్నా ఇద్దామే అన్న ఆలోచన ఉందా నీకు"

"నా మనసే ఇచ్చాను మా శైలుకి, అంతకన్నా విలువైనది నా దగ్గర ఇంకేం లేదని మా శైలుకి తెలుసు"

"ఇదిగో ఇలాంటి మాటలు చెప్పే నన్ను పడేసావు. ఏది అన్నా వెంటనే ఇలాంటి డైలాగ్స్ చెప్తావు"

"మా శైలుని చూస్తే మాటలు అలా వచ్చేస్తాయి"

"శైలుకి ఐస్ క్రీం తినాలనుంది, వెళ్ళి తీసుకురా"

"తెస్తా, నా చేత్తోనే తినిపిస్తా. డబ్బులు..."

"అబ్బాయివి, నన్ను డబ్బులు అడుగుతున్నావు"

"నా దగ్గర డబ్బులు ఉండవని మా శైలుకి తెలుసు కదా. డిగ్రీ ఫస్ట్ ఇయర్లోనే చెప్పా కదా ఈ విషయం"

"సరే, ఇవిగో డబ్బులు, నాకు వెనిల్లా కావాలి" వంద కాగితం చేతికిచ్చింది.

"ఇద్దరికీ వెనిల్లానే తెస్తా. నీతో వెనిల్లా తినే ఈ గడ్డే నాకు పెద్ద విల్లా"

"ఈ మాటలకేం తక్కువ లేదు, వెళ్ళు, మళ్ళీ రెస్టారెంట్ ముసేస్తారు"

"ఏదన్న తాగడానికి కూడా తెస్తా. ఒక గంట ఉంటావు కదా"

"లేదు, గంట ఉండను, చూద్దాం, ముందు ఐస్ క్రీం తేపో"

"ఇలా వెళ్ళి, అలా వస్తా శైలూ"... అంటూ శైలు చేతిని నొక్కి వెంటనే వెళ్ళాడు గోపి.

గోపి వెళ్ళిన వైపే చూడసాగింది శైలజ.

వీళ్ళ కథేంటో తరువాతి భాగంలో చూద్దాం.
[+] 10 users Like earthman's post
Like Reply
#3
బాగుంది
Like Reply
#4
NICE UPDATE
Like Reply
#5
bagundi
Like Reply
#6
Baagundi...
Like Reply
#7
అప్డేట్ చాలా చాలా బాగుంది
Like Reply
#8
Nice update
Like Reply
#9
Nice update please continue
Like Reply




Users browsing this thread: 1 Guest(s)