19-10-2023, 06:37 PM
1111. 1-10. 2101b3-8.
191023-8.
???????????97.
*మన ఆరోగ్యం…!
తలగోక్కుంటున్నారా?
➖➖➖✍️
బుడగలొచ్చేవన్నీ షాంపూలు కావు!నురగలొచ్చేవన్నీ కూడా షాంపూలు కావు!! షాంపూలన్నీ అందరికీ మంచివి కావు!!!
ఒకరికి బాగా పనిచేసిన షాంపూ ఇంకొకరి మాడును ఎండబెట్టొచ్చు. ఒకరి జుట్టును సిల్కీ అండ్ స్మూత్ చేసిన షాంపూ మరొకరి వెంట్రుకలను
కొబ్బరిపీచులా చేయవచ్చు. ఏది మంచిదో, ఏది కాదోనని తలగోక్కుంటున్నారా?
ఎంచుకోండి... జుట్టు బాగా పెంచుకోండి... షాంపూర్ణ కథ….
షాంపూను ఎలా నిర్వచించవచ్చు...
ఇప్పుడు షాంపూను కేవలం తలవెంట్రుకలు, మాడును శుభ్రపరిచే ద్రవరూపంలో ఉన్న సబ్బుగా మాత్రమే పరిగణించలేం. ఎందుకంటే రానురాను ఇందులో ఎన్నో కొత్త కొత్త సౌకర్యాలు వచ్చి చేరుతున్నాయి. అంటే కురుల అందాన్ని ఇనుమడింపజేసేలా వాటి తేమను పరిరక్షించేవి, వెంట్రుకలు పలచబార కుండా చేసేవి, నిగనిగలాడుతూ మెరిసేలా కనిపింపజేసేవి అంటూ రకరకాల షాంపూలు అందుబాటులోకి వస్తున్నాయి. అలాగే చుండ్రులాంటి ఏదైనా సమస్య వస్తే వాటిని తొలగించేవి కూడా తయారవుతున్నాయి. కాబట్టి... అందం, శుభ్రం, ఆరోగ్యం అనే బహుళ ప్రయోజనాలను ఇచ్చే సాధనంగా ‘షాంపూ’ను నిర్వచించవచ్చు.
షాంపూ నుంచి మనం ఆశించేదేమిటి?
వాడకం విస్తృతం అయిన నేపథ్యంలో ఇప్పుడు ఏది మంచి షాంపూ అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. ఏయే పనులు చేస్తే దాన్ని మంచి షాంపూగా పరిగణిస్తామో, దాని నుంచి ఏయే ప్రయోజనాలు ఆశిస్తామో చూద్దాం.
*ముందుగా వెంట్రులకు హాని కలగకుండానే వాటిని పూర్తిగా శుభ్రం చేయాలి. మాడునూ శుభ్రపరచాలి! మనకు, మన వెంట్రుకలకు అది సరిపడాలి. అంటే దాన్ని ఉపయోగించాక అలర్జీల్లాంటి కొత్త సమస్యలు రాకూడదు!! పరిశుభ్రత తర్వాత మంచి సువాసన వస్తే మేలు!!!
*ఫ్రెష్‌నెస్, ఫ్రాగ్రెన్స్... ఎంత ఎక్కువ సేపు ఉంటే అంత మేలు! వీలైనంత త్వరగా... చేతులకు చాలా తక్కువ శ్రమ ఇస్తూ త్వరగా నురగ వచ్చేయాలి! మంచినీటిలో మాత్రమే కాదు... ఉప్పునీళ్లలోనూ అలాగే నురగవస్తే ఇంకా మంచి షాంపూ అనుకోవచ్చు!
*తలస్నానం తర్వాత వెంట్రుకలు బిరుసుబారకుండా, వీలైనంత మృదువుగా ఉండాలి! వెంట్రుకలను మెరిసేలా చేయాలి. అవి స్టైలింగ్ కోసం అనువుగానూ ఉండాలి. ఆ కురుల నిగారింపు చాలాసేపు కొనసాగాలి. వెంట్రుకలు ఒకదానితో ఒకటి అతుక్కోకూడదు. అలాగని తేమ కూడా తొలగిపోకూడదు! వెంట్రుకలు విరిగిపోవడంగానీ, అవి బలహీనపడటం గానీ, అనారోగ్యంగా కనిపించడంగానీ జరగకూడదు. అంటే షాంపూను ఉపయోగించడం వల్ల వెంట్రుక ఆరోగ్యం దెబ్బతినకూడదు. ఈ అన్ని ప్రయోజనాలు ఉన్న ‘షాంపూ’ను మాత్రమే మంచి ‘షాంపూ’గా పరిగణించవచ్చు.
గతంలో దాదాపు అందరూ తలస్నానం కోసం శీకాయ, కుంకుడుకాయలను ఉపయోగించేవారు. కుంకుడుకాయలను కొట్టుకోవడం, నీళ్లలో వేసి నానబెట్టడం, రసం పిండడం, నురుగు వచ్చే వరకు తలను కుంకుడురసంతో రుద్దడం... ఇదీ ప్రక్రియ. దీంతో తలస్నానం ఆలస్యమయ్యేది. దాంతో కొందరు డిటర్జెంట్ సబ్బు లేదా ముల్తానీ మట్టిని తలస్నానం కోసం ఉపయోగించేవారు. అయితే ఈ రెండూ వెంట్రుకలపై నుంచి తేమను పూర్తిగా తీసివేయడంతో అవి నిర్జీవంగా కనిపించేవి.
డిటర్జెంట్ తీవ్రతను తగ్గించి, మైల్డ్‌గా మార్చారు. దాన్ని మంచినీళ్లలోనూ, ఉప్పునీళ్లలోనూ త్వరగా నురగ వచ్చేలా శుభ్రం చేయగలవిగా చేశారు. ఇలా ద్రవంరూపంలోకి మార్చిన సబ్బుకు ‘షాంపూ’ అని పేరు పెట్టి మార్కెట్‌లోకి పంపించారు.
*అంతే..! తలను శుభ్రపరిచేందుకు ఇక అంతకు మునుపు ఉన్న సంప్రదాయ పద్ధతులన్నీ దాదాపు మటుమాయం అయిపోయాయి. సౌకర్యవంతమైన ఉత్పాదనే మనుగడ సాగిస్తుందన్నది మరోమారు నిరూపితమైంది. వెరసి తలస్నానం కోసం షాంపూ మారుమూల పల్లెల్లోనూ నిత్యావసర వస్తువైంది.
*షాంపూలో ఏయే రసాయనాలుంటాయి...?
షాంపూలలో నురగను ఇచ్చేలా చేసే సర్ఫెక్టెంట్స్, కో– సర్ఫెక్టెంట్స్, సోడియమ్ క్లోరైడ్, సుగంధ ద్రవ్యాలు, చాలాకాలం షాంపూ నిల్వ ఉంచే ప్రిజర్వేటివ్స్ వాడతారు.
*సర్ఫ్‌యాక్టెంట్‌లలో సోడియమ్ లారిల్ సల్ఫేట్, సోడియమ్ లారేట్ సల్ఫేట్, అమోనియమ్ లారిల్ సల్ఫేట్, అమోనియమ్ లారేట్ సల్ఫేట్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇవి జుట్టు మీద ఉన్న మురికిని పోగొట్టి, నురగ వచ్చేలా చేసి, తలను కూడా శుభ్రం చేస్తాయి.
కో–సర్ఫ్‌యాక్టెంట్‌లు... షాంపూ చిక్కగా చేయడానికి ఉపయోగపడతాయి. సోడియం క్లోరైడ్ వంటి సాల్ట్స్... షాంపూలోని చిక్కదనం అంతటా సమంగా ఉండేలా చేస్తాయి. గ్లైకోల్ స్టిరేట్ వంటి వ్యాక్స్‌లు... షాంపూలను ముత్యంలా మిలమిలలాడేలా (పర్ల్ లుక్ వచ్చేలా) చేస్తాయి.
*వీటిలో ఇంకా ఇతర విటమిన్లు, ప్రోటీన్లను కలుపుతారు.
షాంపూలను విటమిన్–ఈ లేదా టోకోఫెరోల్ వంటివాటిని కూడా కలిపి తయారు చేస్తారు.
*ఎవరెవరికి ఏయే షాంపూలు..?
*అందరి తలవెంట్రుకలు ఒక్కలా ఉండవు. కొందరి వెంట్రుకలు అంత జిడ్డుగా కాకుండా, అంత పొడిగానూ కాకుండా సాధారణంగా ఉంటాయి. వీటిని నార్మల్ హెయిర్ అనవచ్చు. కొందరి వెంట్రుకలు నూనె రాసినట్లుగా మెరుస్తూ ఉంటాయి. వాటిని జిడ్డు కురులు (ఆయిలీ హెయిర్)గా చెప్పవచ్చు. మరికొందరి వెంట్రుకలు చాలా పొడిగా ఉంటాయి. వాటిని ‘డ్రై హెయిర్’గా పేర్కొంటారు. కొందరికి తలలో చుండ్రు, పొడి పొలుసులు పొట్టుగా రాలిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మరికొందరికి తల గీరుకున్నప్పుడు జిడ్డు గోళ్లలోకి వస్తుంది. ఇలా అందరి వెంట్రుకలు ఒక్కలా ఉండవు కాబట్టే... అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉండవు. దాంతో మన అవసరాలను బట్టి రకరకాల షాంపూలు అందుబాటులోకి వచ్చాయి.
*మన అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో చూద్దాం….
*అందరూ వాడదగ్గవి :
ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. సాధారణంగా లారిల్ సల్ఫేట్ అనే నురగవచ్చే పదార్థంతో తయారయ్యే షాంపూ ఇది. దాంతోపాటు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి మంచి సువాసన వచ్చేలా చేస్తారు. ధర అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం ద్వారా వాటిని అందరూ వాడేలా రూపొందిస్తారు.
*పొడి వెంట్రుకలు ఉండేవారికి :
వీటిలో క్లెన్సింగ్ ఏజెంట్స్ మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్ క్లెనింగ్ ఏజెంట్స్‌ను వాడుతారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్ కోసం అందులో సిలికోన్ వంటి ఏజెంట్స్, కెటాయినిక్ పాలిమర్స్‌ను కలుపుతారు. దాంతో ఆ సిలికోన్ పొడి వెంట్రుకల మీద సమంగా ఒక కోటింగ్‌లా విస్తరిస్తుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి సిలికోన్, కెటాయినిక్ పాలిమర్స్ వంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు.
*జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి :
ఈ షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా డిజైన్ చేస్తారు. ఇందులో క్లెన్సింగ్ ఏజెంట్‌గా లారిల్ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి సల్ఫోసక్సినేట్ వంటి రసాయనాలు ఉంటాయి. జిడ్డు కురులు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ నిర్జీవంగా, పీచులా మారిపోతాయి.
*బేబీ షాంపూలు :
చిన్నారులు, శిశువుల వెంట్రుకలపై నూనె వంటి స్రావం చాలా తక్కువ. పైగా వాళ్ల చర్మం చాలా మృదువు. అందుకే బేబీ షాంపూలలో క్లెన్సింగ్ ఏజెంట్స్ తీవ్రత తక్కువగా ఉండాలి. అలాగే నూనె తొలగించే సామర్థ్యమూ తక్కువగానే ఉండాలి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ షాంపూలు తయారు చేస్తారు. కాబట్టి ‘బీటెయిన్స్’ అనే క్లెన్సింగ్ ఏజెంట్స్ ఉండి, కళ్లకు హాని చేయని విధంగా అందులోని రసాయనాలుంటే చిన్నారులకు మేలు. కాబట్టి ఇన్‌గ్రేడిమెంట్స్‌లో ఈ ప్రధాన (బేసిక్) అంశాలు చూసి ఎంపిక చేసుకోవడం మంచిది.
*మెడికేటెడ్(ఔషధాలున్న)షాంపూలు : ఇవి కేవలం వారి వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వాడాల్సిన షాంపూలు. ఉదాహరణకు కొందరికి తలలో రింగ్‌వార్మ్ అనే మాడుపై వచ్చే ఒక రకం ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీన్ని ‘టీనియా కాపిటిస్’ అని అంటారు. ఈ సమస్య వచ్చినవారికి చికిత్సతో పాటు యాంటీఫంగల్ ఏజెంట్స్ ఉండే షాంపూలు వాడాల్సి ఉంటుంది. అలాగే స్టెఫలోకోకస్ లేదా సూడోమోనాస్ వంటి బ్యాక్టీరియా కారణంగా ఫాలిక్యులైట్ అనే సమస్య వస్తే యాంటీబ్యాక్టీరియల్ షాంపూలు వాడాలి. ఇక అందరిలోనూ కనిపించే పొట్టురాలిపోయే సమస్య ఉన్నవారు షాంపూలో సెలీనియమ్ సల్ఫైడ్, జింక్ పైరోథియాన్, తార్, శాల్సిలిక్ ఆసిడ్ లేదా ఆయిల్ ఆఫ్ లేడ్, కార్టికోస్టెరాయిడ్ లోషన్లు ఉన్న షాంపూలను వాడాలి. అంటే వేర్వేరు రకాల సమస్యలకు వేర్వేరు రకాల షాంపూలన్నమాట. అందుకే తలలో దురద, మంట... వంటివి ఉన్నవారు తమ స్నేహితులు చెప్పేమాటలతో ప్రభావితం కాకుండా డాక్టర్‌ను సంప్రదించాకే షాంపూను వాడాలి.
*ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడవచ్చంటే...
*షాంపూను ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడవచ్చన్నది వారి వ్యక్తిగత సౌకర్యంతో పాటు ఇంకా అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తల ఎంత జిడ్డుగా ఉంటోంది, వృత్తి ఏమిటి (అంటే నిత్యం సిమెంటు, మట్టిలో ఉండే నిర్మాణ రంగంలోని సైట్ ఇంజనీర్లు ఎక్కువసార్లు తలస్నానం చేయాలి), తలకి ఎంతగా చెమట పడుతోంది, నివాస ప్రాంతపు వాతావరణంలోని తేమ శాతం (అంటే సముద్రతీర ప్రాంతాల్లో తేమ ఎక్కుగా ఉండగా ఎల్తైన ప్రదేశాల్లో ఉండే వాతావరణం పొడిగా ఉండటం)... వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. తాము ఎన్నిసార్లు తలస్నానం చేయాలో వ్యక్తిగతంగా ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. కొందరు ప్రతిరోజూ తలస్నానం చేస్తుంటారు. అది వారి జుట్టుకు (హెయిర్ స్ట్రాండ్)కు హాని చేయనంతవరకు పరవాలేదు. అయితే దీనివల్ల కొందరిలో జుట్టు సహజత్వాన్ని కోల్పోయి, త్వరగా చిట్లిపోతుంది. అదేవిధంగా అవసరమైనన్ని సార్లు తలస్నానం చేయకపోతే జుట్టంతా జిడ్డుగా మారి సహజత్వాన్ని కోల్పోయి, చిక్కులు పడిపోతుంది. అందుకే తమకు ఎన్నిసార్లు తలస్నానం చేస్తే అనువుగా ఉంటుందన్న విషయాన్ని అనుభవం మీద తెలుసుకొని ఆ మార్గాన్ని అనుసరించాలి. అలాగే వ్యక్తిగత జుట్టు స్వభావాన్ని బట్టి, సమస్యను బట్టి ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి తమ షాంపూను ఎంచుకోవడం మేలు.
*వెంట్రుకలను దెబ్బతీసే అంశాలివే...
*తమ కురులకు ఎలాంటి హానీ జరగకూడదని ప్రతివారూ కోరుకుంటారు. వెంట్రుకలను దెబ్బతీసే అంశాలేమిటో తెలుసుకుంటే దాన్ని బట్టి ఎవరెవరు ఎలాంటి షాంపూలు ఎంచుకోవచ్చో తెలుస్తుంది.
*వెంట్రుకలను దెబ్బతీసే అంశాలివి...
*కురులు ఎండకు ఎక్స్‌పోజ్ కావడం, కాలుష్యం, వెంట్రుకలను మాటిమాటికీ తడుపుతూ ఉండటం, తరచూ బ్లీచింగ్ చేయించడం, సౌందర్యసాధనాలు (హెయిర్ ప్రాడక్ట్స్) ఉపయోగించడం లేదా తరచూ స్ట్రెయిటెనింగ్ చేయిస్తూ ఉండటం, హెయిర్ బ్లోయింగ్ మెషిన్ వేడిగాలికి వెంట్రుకలను ఎక్స్‌పోజ్ చేయడం, మాటిమాటికీ దువ్వడం.
ప్రతి వెంట్రుకపైనా దానికి నునుపైన ఫినిషింగ్ ఇచ్చే క్యూటికిల్ అనే పొర ఉంటుంది. అంతేకాదు... ప్రతి రోమాంకురం దగ్గర నూనె లాంటి ద్రవాన్ని స్రవించే గ్రంథి కూడా ఉంటుంది. ఈ నూనె అంతా క్యూటికిల్‌పైన ఒకేలా (ఈవెన్‌గా) విస్తరించి వెంట్రుకకు నునుపునూ, నిగారింపునూ ఇస్తుంది. ఈ నూనెలాంటి స్రావాన్ని ‘సీబమ్’ అంటారు. ఏదైనా కారణాల వల్ల క్యూటికిల్ దెబ్బతింటే వెంట్రుక విరిగిపోతూ ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల వెంట్రుకపై నూనెలాంటి సీబమ్ సమంగా అంటుకోకపోయినా నిగారింపు దెబ్బతింటుంది. అప్పుడవి నిర్జీవంగా, అనారోగ్యంగా కనిపిస్తాయి. కాబట్టి మనకు అవసరమైన ప్రయోజనాన్ని బట్టి మనకు కావాల్సిన షాంపూను ఎంచుకోవాల్సి ఉంటుంది.
డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?