Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*వేదం ...జీవన నాదం!*
#1
2207b. 2g1050.2307B 2-8.
191022-5.
???????????

          *వేదం ...జీవన నాదం!* 
                 ➖➖➖✍️

 *ఎందుకు రాశానంటే.......*
            .*...దాశరథి రంగాచార్య* 


*నన్నయకూ పోతనకూ తిక్కనకూ దొరకని అదృష్టం నాకు దక్కింది.                 వేదాల్ని తెలుగులోకి అనువదించే మహద్భాగ్యం నాకే దక్కింది. అంతటి బృహత్యార్యంలో నాకు సాయపడిందెవరూ లేరు. నేనే కాయితం కొనుక్కొని, పెన్సిల్‌ కొనుక్కొని రాశాను.*

*ఒకటా రెండా! ఐదువేల పేజీలు. ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాల్నీ కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే. అంతేకాదు, వేదాలకు వ్యాఖ్య చేసిన సాయణాచార్యులు మన ఆంధ్రుడే. ఇది తెలుగువారి అదృష్టం.*

*” ’ఎవరు పడితే వారు వేదం చదవకూడదు' ...ఒక అపోహ... ఇదెందుకొచ్చిందీ అంటే, ఒక వర్గానికి ఇది ఉపాధి. అందులో వాళ్ల ఆధిపత్యం పోతుందని భయము"*

*కానీ అదంతా తప్పు. వేదం అంటే జ్ఞానం కదా, అది ఒకరి అధీనంలో ఉండడమేమిటి? జ్ఞానానికి అడ్డుగోడలేమిటి? దాన్నెవరు పిడికిట్లో పట్టుకోగలరు? ఇది అందరికీ అందవలసింది... అనుకొని వేదాల్ని అనువదించడం వెుదలుపెట్టాను.* 

*సరే... వేదాలకు అనువాదం చేస్తున్నాననగానే బోలెడంత ప్రచారం జరిగింది. దాంతో చాలామంది 'నువ్వు వేదం అనువాదం చెయ్యెుద్దు, నాశనమైపోతావు' అని భయపెట్టేవారు.* 

*రాత్రిపూట ఫోన్లొస్తే తీయడానికి కూడా      మా కమల భయపడిపోయేది. నా ఇంటి ముందు ఎవడో ఆత్మహత్య చేసుకుంటానంటూ వీరంగం వేశాడు. ఏదైనా మంచిపని చెయ్యాలన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు కదా! అయినా నేను చేయాలనుకున్నది చేశాను. ఊహూ! ఆ భగవంతుడే నాతో చేయించాడు.*

*వెుుత్తం పదివేల మంత్రాలు. వాటన్నిటినీ చదివి మనసులో ఉంచుకొని దర్శించి తెలుగులోకి అనువదించడమంటే మాటలా! అప్పటి నా అవస్థ ఇదీ...*

*ముందర కూచుంటాను.* 
*మహారణ్యంలోకి పోయినట్టుంటుంది. పెద్దపులులూ సింహాలూ ఎలుగుబంట్లూ... మనమేం చెయ్యగలం అనిపిస్తుంది.*
*నిమిషం కళ్లుమూసి తెరిస్తే అదే అడవి ఉద్యానంలా కనిపిస్తుంది. అందులో నెమళ్లుంటాయి. కుందేళ్లుంటాయి. కోయిలలుంటాయి. అదే నాకు అర్థమైందని అర్థం.*
*నేను రాస్తుంటే నా కలం వెంబడి ఏదో వెలుగుపాయ వస్తున్నట్టు కనిపిస్తుంది. మన ప్రయత్నం చెల్లదు దానికి.*
*అంతా రాశాక నా అనువాదం చదివితే నాకే ఆశ్చర్యమనిపించింది...* 
*స్వరం కూడా ఉన్నదందులో! రాసింది వచనమే అయినా స్వరం ఎలా వచ్చిందో తెలియదు. నేను కావాలని చేసిందయితే కాదు. నా శ్రమ ఫలించింది.*

 *'ఎవరు కొంటారు సార్‌ వేదం... రెండు మూడు వేల కాపీలు పోతే ఎక్కువ' అన్నారు.*

*కానీ వేదానువాదం ప్రచురితమవుతున్నదని తెలియడం ఆలస్యం... ప్రచురణ మొదలవక ముందే 2వేల పుస్తకాలకు ఆర్డరొచ్చింది.*

*అంటే... రూ.30లక్షలు అడ్వాన్సు!. పుస్తకం మార్కెట్లో విడుదలైన రోజున బారులు తీరి నుంచొని మరీ కొన్నారా పుస్తకాన్ని.*

*'తెలుగువాళ్లూ పుస్తకం కొంటారు' అని ఓ పేరున్న పత్రికలో ఆ అరుదైన సంఘటనపై ఓ వ్యాసం కూడా వచ్చింది.*

*ఆ స్పందన చూసి పుస్తక విక్రేతలే ఆశ్చర్యపోయారు. ప్రజల్లో వేదం పట్ల అంత ఆసక్తి ఉంది. లేకపోతే ఎవరు కొంటారు? ఒక సంవత్సరంలో రూ.50 లక్షల టర్నోవర్‌ ఎందుకు అవుతుంది?* 

*ఇప్పుడు కనీసం 20వేల మంది ఇళ్లల్లో వేదం ఉన్నది. అదీ నేను అనువాదం చేసింది.*
*అది నాకెంతో సంతోషం.*✍️
         … దాశరధ రంగాచార్య.
         *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
  *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)