Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
???????????104. *మన ఆరోగ్యo *మెనోపాజ్ డైట్*
#1
1811. 1-200 1c3-8. 100 5c3-8.
161023-8.
???????????104.
*మన ఆరోగ్యం….

             *మెనోపాజ్ డైట్*
               ➖➖➖✍️

*45 ఏళ్ళు దాటిన మహిళలు ఆందోళనకు గురవుతూ ఉండే అంశం... మెనోపాజ్! ఈ దశ తప్పించుకోలేనిదే అయినా, హార్మోన్ల హెచ్చుతగ్గులతో శరీరంలో తలెత్తే అసౌకర్యాలను ఆహార మార్పులతో సరిదిద్దుకో గలిగే వీలుంది.*

**ఆకుకూరలు: *
*ఆకుకూరలతో కూడిన ఆహారం, ఊబకాయం, అధిక రక్తపోటు, పెద్ద వయసులో మొదలయ్యే మతిమరుపులను నియంత్రిస్తుంది. ఇందుకు తోడ్పడే విటమిన్లు, ఖనిజ లవణాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి.*

*చేపలు:* 
*వీటిలో ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి మెనోపాజ్ దశలో కండరాలు క్షీణించకుండా ఉండాలంటే తరచూ చేపలు తినాలి.*

*సిట్రస్ పళ్లు*: 
*నారింజ, దబ్బ, నిమ్మ జాతి పళ్లు మెనోపాజ్ లక్షణాలైన వేడి ఆవిర్లు, చెమటల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మధ్య వయసు ఒబేసిటీకి గురి కాకుండా రక్షణ కల్పిస్తాయి.*

*నట్స్:* 
*వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఆకలిని తగ్గించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను ఉంచుతాయి. ఐరన్, మెగ్నీషియం, సెలీనియం లాంటి కీలక పోషకాలుండే నట్స్ నడి వయసు మహిళల బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా క్రమం తప్పకుండా బాదం పప్పు తినడం వల్ల నడుము చుట్టుకొలత పెరగకుండా ఉంటుంది.*

*అవకాడొ*: 
*ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు, పోషకాలు, ప్రొటీన్, పొటాషియం, విటమిన్ కలిగి ఉండే అవకాడో  ఉత్తమమైన ఆహారం. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించే గుణం అవకాడోలకు ఉంటుంది.*
                        …సేకరణ.

                     ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)