Thread Rating:
  • 3 Vote(s) - 2.67 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*విటమిన్ A.*
#1
2412.    2-8.  0705b.  3-8.
171023-8
???????????
*మన ఆరోగ్యం…!


                 *విటమిన్ A.*
                ➖➖➖✍️

*_"ఈ అనారోగ్య సమస్యలు ఉన్నాయా.? విటమిన్‌ ఏ లోపం కావొచ్చు.. ఓ సారి చెక్‌ చేసుకోండి._*

*శరీరానికి అన్ని విటమిన్లు సరిగ్గా అందితేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్‌ లోపించినా సమస్యలు మొదలవుతాయి. ఇలా శరీరంలో ఎంతో కీలక పాత్ర పోషించే విటమిన్స్‌లో A ఒకటి.     విటమన్ A కొవ్వులో కరుగుతుంది..*

*_శరీరానికి అన్ని విటమిన్లు సరిగ్గా అందుతేనే ఆరోగ్యంగా ఉంటాం. ఏ విటమిన్‌ లోపించినా సమస్యలు మొదలవుతాయి. ఇలా శరీరంలో ఎంతో కీలక పాత్ర పోషించే విటమిన్స్‌లో ఏ ఒకటి. విటమని ఏ కొవ్వులో కరుగుతుంది. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి కంటి చూపు వరకు అన్నింటిలో విటమిన్‌ ఏది ముఖ్యపాత్ర ఉంటుంది. అయితే మనలో విటమిన్‌ లోపం ఉందన్న విషయం చాలా కాలం పాటు తెలియదు. అనారోగ్య సమస్యలు తీవ్రమైతే తప్ప విటమిన్‌ లోపం ఉందా అన్న కోణంలో ఆలోచించం. అయితే శరీరంలో జరిగే కొన్ని మార్పుల ఆధారంగా విటమిన్‌ ఏ లోపం ఉందన్న విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే.._??*


●●●

*1️⃣. _షుగర్‌ వ్యాధితో బాధపడేవారిలో గాయాలు త్వరగా మానవనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో కూడా ఈ సమస్య ఉంటుందని మీకు తెలుసా.?_*

*_ఒకవేళ గాయాలు త్వరగా మానకపోతుంటే వైద్యులను సంప్రదించాలి. వారి సూచన మేరకు విటమిన్‌ ఏ ట్యాబ్లెట్లు లేదా ఫుడ్‌ తీసుకోవాలి._*

*2️⃣. _విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో కనిపించే మరో సమస్య మొటిమలు. ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా మొటిమలు తగ్గడం లేదంటే విటమిన్‌ ఏ లోపం ఉందని గుర్తించాలి._*

*3️⃣. _ఇక కొందరిలో నిత్యం గొంతు, ఛాతి ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంటుంది. దీనికి కూడా విటమిన్‌ ఏ లోపం కారణమై ఉండొచ్చు._*

*4️⃣. _చిన్నారుల్లో విటమిన్‌ లోపం ఉంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి చిన్నారుల ఎదుగుదలలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోతే చిన్నపిల్లల వైద్య నిపుణులు సంప్రదించడం ఉత్తమమం._*

*5️⃣. _విటమిన్‌ ఏ లోపం ఉన్న వారిలో సంతాన లోపం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా విటమిన్‌ ఏ ఉండాలి. కాబట్టి దీర్ఘకాలంగా సంతాన లోపంతో బాధపడేవారిలో ఈ విటమిన్‌ లోపం ఉండే అవకాశాలు లేకపోలేవు._*

*6️⃣. _విటమిన్‌ ఏ లోపం కారణంగా కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మనందరికీ తెలుసిందే. మరీ ముఖ్యంగా విటమిన్‌ ఏ లోపం ఎక్కువైతే రే చీకటి వస్తుంది. రాత్రుళ్లు కంటి చూపు సరిగ్గా లేకుంటే విటమిన్ ఏ లోపం ఉందని గుర్తించాలి._*

*7️⃣. _కొందరిలో తరుచూ కళ్లు పొడిబారుతుంటాయి. విటమిన్‌ ఏ లోపం ఉండే వారిలో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఇదీ ఒకటి. కాబట్టి ఇలాంటి సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి._*

*8️⃣. _విటమిన్‌ ఏ లోపం కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా చర్మం పొడి బారుతుంటుంది. దీర్ఘ కాలంగా పొడి చర్మం సమస్య వేధిస్తుంటే విటమిన్‌ ఏ లోపమని గుర్తించాలి._*

*_# గమనిక / NOTE":_*
 *_పైన తెలిపిన లక్షణాలన్నీ విటమిన్‌ ఏ లోపం వల్లే వచ్చేవే అయినప్పటికీ.. కొన్ని ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా లక్షణాలు కనిపిస్తుంటాయి. కాబట్టి వీటినే ప్రామాణికంగా తీసుకొని విటమిన్‌ ఏ లోపమనే నిర్ణయానికి రాకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమమం.._*✍️
                                  -సేకరణ.

???????????
[+] 1 user Likes Yuvak's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: