Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*కష్టం!*
#1
Xiv iX 1-1.      3107b2-6.
111023-6.
???????????

                        *కష్టం!*
                    ➖➖➖✍️

*ఒక పాము చాలా హుషారుగా పాకుతూ, దొర్లుతూ అటువైపుగా  వెళ్తోంది. దాని హుషారుతనాన్ని చూసిన ఒక కోతి దాన్ని పట్టుకుంది.* 

*ఆ పాము కోతిని కాటు వేయబోయింది. భయంతో కోతి ఆ పాము పడగను గట్టిగా పట్టుకుంది. గట్టిగా అరవసాగింది కోతి.*

*చుట్టూవున్న మిగతా కోతులన్నీ ఇలా అనుకున్నాయి…*
*ఇక ఈ కోతి బ్రతకడం కష్టం..కోతి పామును వొదిలితే కచ్చితంగా కాటు వేస్తుంది...మనం దగ్గరికెళితే మనం కూడా పాము కాటుకు బలి కావాల్సిందే.. మనం దూరంగానే ఉండటం మంచిది అని వెళ్లిపోయాయి.*

*తనవాళ్ళంతా తనని రక్షిస్తారేమో అని ఎదురుచూసిన కోతికి నిరాశే ఎదురయ్యింది. అలాగే భయంతో కూర్చుంది.*

*అటువైపుగా ఒక ముని వెళుతూ కోతి స్థితిని అర్థం చేసుకుని కోతితో ఇలా అన్నాడు...*
*”నీ చేతిలోని పాము నువ్వు భయంతో గట్టిగా పట్టుకున్నప్పుడే ఊపిరి ఆడక చచ్చింది. వదిలేస్తే నిన్ను కాటు వేస్తుందని భయపడి ఇబ్బంది పడుతున్నావు. దాన్ని వదిలేయి" అన్నారు ముని.* 

*కోతి ఆ పామును వదిలి ఒక్క గెంతుతో చెట్టు ఎక్కేసింది...*

*ఇందులోని నీతి ఏంటంటే... మనకు కష్టం వచ్చినప్పుడు దాని గురించే ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ఆ కష్టం మనల్ని వదిలి పోదు. కష్టాన్ని దూరంగా విసిరి కొట్టే పరిష్కారం వెతకాలి!*
*అలాగే మనం ఇబ్బందిలో ఉంటే మన బంధువులు, ఎవ్వరూ మనల్ని రక్షించడానికి మన కష్టం తీర్చడానికి ముందుకు రారు.*
*ఆ కష్టం తమను అంటుకుంటాయని దూరంగా వెళ్ళిపోయే రోజులివి. కష్టం వచ్చినప్పుడు ఎవరి సహాయం కోసం చూడకూడదు. కష్టాన్ని భూతద్దంలో చూడకూడదు. కష్టాన్ని మంచి పరిష్కారంతో తరిమికొట్టాలి! అప్పుడే మనం ప్రశాంతంగా ఉండగలం.*

*"ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా!" అన్నారు ఒక మహాకవి.*

*కాబట్టి సమస్య మనది, పరిష్కరించాల్సింది కూడా మనమే.. మన సమస్యను మనం కాక వేరెవరో పరిష్కరిస్తారు అనుకుంటే పొరపాటే!*✍️
                                     సేకరణ#
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)