Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నరం లేని నాలుక కు 40రుచులు ఎందుకు
#1
నరం లేని నాలుక కు 40రుచులు ఎందుకు❓❓❓❓❓❓

అతి వేడిగా, అతి చల్లగా త్రాగ వద్దని దంతాలు బ్రతిమాలినా 
నాకు ఇలానే ఇష్టం అంటూ మరుగు మరుగు కాఫీలు, గడ్డ కట్టిన ఐస్ క్రీములు తింటుంది ఈ నాలుక ☕??
తీపి ఎక్కువ తినవద్దు ఒళ్ళు గుల్ల అవుతుంది అని శరీరం ఎంత మొత్తుకున్నా  "you are soo sweet" అంటూనే ఒకటికి పది లాగిస్తుంది ఈ నాలుకే,,,,, ???

నీళ్లు ఎక్కువ త్రాగు రక్తం శుద్ధి జరిగి మలినాలు పోతాయని చెబుతుంటే ఒత్తి నీళ్లు ఎట్టా తాగేది  అంటూ కూల్ డ్రింక్స్ గట్రా కావాలంటుంది ఈ మొండి నాలుక????

కారం ఎక్కువ తినవద్దు అల్సర్ వస్తుందని ప్రేగులు ఎంత వేడుకుంటున్నా నాకు మిరపకాయ బజ్జీ ఇష్టం, ఆవకాయ అన్నం ఇష్టం, మసాలా కూరలు ఇష్టం అని అడ్డూ అదుపు లేకుండా తింటుంది ఈ నాలుక ??
చక్కని పళ్లు కూరగాయలు తిను ఆరోగ్యానికి మంచిదని మంచి చెబుతుంటే,,, 
చచ్చ కక్కా, ముక్కా లేకుంటే ఎట్టా బతికే అంటుంది ఈ తిక్క నాలుక???

పోని తింటే  తిన్నావు  శుబ్రం గా ఇంట్లో తినమంటే, బయటి రుచులు ఇంటి వంటకు వస్తాయా ? అంటూ వీకెండ్ ఐతే చాలు, జేబులు గుల్ల చేస్తుంది ఈ నాలుకే , ,,,  

ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఉన్న ఫ్రూట్స్ & నట్స తినమఁటే జంక్ ఫుడ్ కు ఎట్రాక్టై పిజ్జా, బర్గర్ లు కావాలని మారాం చేస్తుంది ఈ నాలుకే,, ????

చిరుధాన్యాలు తింటే ఒంటికి మంచిది అని బుజ్జగిస్తుంటే, 
రుచి, పచి లేని చప్పిడి కూడు తినడానికి నేనేేమైనా  పేషెంట్ నా? 
అని నిలదీస్తుంది ఈ నాలుకే, ,   

గంటల పాటు స్రమపడి శ్రద్ధగా వండి వడ్డిస్తే ,  నూనె లేదు, ఉప్పు లేదు, తీపి లేదు, కారం లేదు, పులుపు లేదు, వేగ లేదు, ఉడక లేదు అంటూ విమర్శిస్తుంది ఈ నాలుకే ------

విచ్చలవిడిగా నచ్చినవన్నీ తిని ఒంటి మీదికి షుగర్, బిపి, లివర్ డేమేజ్, కిడ్నీ, గాల్బ్లేడర్ రాళ్ళు, కన్ను, కాళ్లు, కీళ్ళు, దంతాలు, నొప్పులు, ఇంకా వందల రకాల వ్యాధులకు కారణం ఈ నగరం లేని నాలుకే కదా_______

మొత్తం అంతా తనే చేసి చివరకు ఒళ్లు గల్లై  ఆసుపత్రిలో మందులు మింగమంటే, చేదు వద్దంటూ  మాత్రలను అమాంతం గొంతులోకి తోసేస్తుంది ఈ నాలుకే,,   
ఇంత పొగరుబోతు నాలుక ని అదుపు చేయకపోతే పాతికేళ్లకే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్న వాళ్ళమవుతాం మనం,,,,!
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)