Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*నాభగవంతుడు చూస్తాడు*
#1
25052d2d1856.2605e2-5.
300923-6.
???????????


       *నాభగవంతుడు చూస్తాడు*
                 ➖➖➖✍️
```
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓవ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. రోగి చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అక్కడి వైద్యుడే, ఆ ఆసుపత్రి యాజమాని కూడా.

రోగిని చూసిన వెంటనే ఐసియులోకి తీసుకెళ్ళాడు. రెండు-మూడు గంటల ఆపరేషన్ తర్వాత, డాక్టర్ బయటకు వచ్చి, "ఈ వ్యక్తికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి", అని తన సిబ్బందికి చెప్పాడు.

ఆ వ్యక్తి నుండి చికిత్స కోసం, మందుల కోసం డబ్బు తీసుకోవద్దని కూడా వారికి సూచించాడు.

ఆ రోగి దాదాపు 15 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు. అతను బాగా కోలుకుని, ఆసుపత్రి నుండి బయటకి  వెళ్లాలనుకున్నప్పుడు, డాక్టర్ (ఆసుపత్రి యజమాని) అతని తుది నివేదికలను సమీక్ష కోసం తీసుకుంటూ, ఆ రోగికి సంబంధించిన సుమారు 2.5 లక్షల రూపాయల బిల్లు కూడా తీసుకున్నాడు.

డాక్టర్ తన అకౌంట్  మేనేజర్‌ ని పిలిచి, "ఈ వ్యక్తి నుండి ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. ఒక పని చేయండి, ఆ పేషెంట్‌ ని నా వద్దకు పంపించండి", అన్నాడు.
 
ఆ వ్యక్తిని వీల్ చైర్‌లో డాక్టర్ క్యాబిన్‌ కు తీసుకువచ్చారు.

డాక్టర్ ఆ వ్యక్తిని చూసి ఇలా అడిగాడు, "సోదరా! మీరు నన్ను గుర్తించారా?" 

ఆ పేషెంట్ , "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది కానీ, సరిగా గుర్తు రావడం లేదు!", అన్నాడు.

అప్పుడు డాక్టర్ ఇలా చెప్పసాగారు ...."మీకు గుర్తుందా, దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం, ఒక సాయంత్రపు సమయంలో నగర శివార్లలో ఒక  అడవిలో ఒక కారును మరమత్తు చేసారు. ఆ రోజు నేను మా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, కారులో నుండి అకస్మాత్తుగా పొగ రావడం మొదలై, ఉన్నట్టుండి ఆగిపోయింది. మేము కారును ఓ పక్కన ఆపి, దాన్ని మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాం, కానీ కారు స్టార్ట్ అవలేదు, అప్పటికే కొద్దిగా చీకటి పడుతోంది, చుట్టూ అంతా నిర్జీవమైన అడవి. మా కుటుంబసభ్యుల  ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆందోళన, భయం తాలూకు ఛాయలు కనపడుతూ ఉన్నాయి.

అందరం భగవంతుడిని ప్రార్థిస్తూ, సహాయం దొరుకుంతుందేమో అన్న ఆశలో ఉన్నాం.

కొద్దిసేపటికే ఓ అద్భుతం జరిగింది. మీరు బైక్‌ పై రావడం చూశాం. ఆశ నిండిన కళ్లతో మిమ్మల్ని ఆపడానికి మేము చేతులు ఊపాం. మీరు బైక్ ఆపి, విషయం తెలుసుకున్న తర్వాత కారు బానెట్‌ తెరిచి, పరిశీలించి  మరమత్తు చేసిన కొద్ది క్షణాల్లోనే కారు స్టార్ట్  అయ్యింది.

మేమంతా చాలా సంతోషించి, చాలా తేలిక పడ్డాం! మిమ్మల్ని ఆ భగవంతుడే పంపినట్లు మాకు అనిపించింది ఎందుకంటే, ఆ నిర్జీవమైన అడవిలో రాత్రంతా గడపాలన్న ఆలోచనకే మా ఒళ్ళు జలదరించింది. 

మీరు ఒక గ్యారేజీని నడుపుతారని ఆ రోజు నాకు చెప్పారు. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎంత డబ్బు ఉన్నా కూడా అలాంటి కష్ట సమయాల్లో ఎలాంటి సహాయం చేయదని చెప్పాను. అటువంటి క్లిష్ట పరిస్థితిలో మీరు చేసిన సహాయానికి విలువ కట్టలేను, అది అమూల్యమైనది. అయినా కూడా ఎంత ఇవ్వాలి అని నేను మిమ్మల్ని అడిగాను.

ఆ క్షణంలో ముకుళిత హస్తాలతో మీరు చెప్పిన మాటలు నా జీవితానికి స్ఫూర్తిగా నిలిచాయి...```

"నా నియమం, నా సూత్రం ఏమిటంటే, కష్టంలో ఉన్న వ్యక్తికి చేసే సహాయానికి ప్రతిఫలంగా నేను ఏమీ తీసుకోను!  ‘నాభగవంతుడే నేను చేసిన పనికి సంబంధించిన లెక్కను చూస్తాడు”, అని మీరు అన్నారు.

```నామమాత్రపు ఆదాయం ఉన్న వ్యక్తి ఇంత ఉన్నతమైన ఆలోచనలు, విలువలు కలిగి ఉండి, ఎంతో దృఢ సంకల్పంతో వాటిని అనుసరించ గలిగినప్పుడు, నేను ఎందుకు చేయలేను అని ఆ రోజు అనుకున్నాను. అప్పటి నుండి, నా జీవితంలో కూడా అలాగే ఉండాలని సంకల్పించుకున్నాను. నాలుగు సంవత్సరాలు గడిచాయి, నాకు ఎప్పుడూ దేనికి కొరత లేదు. నిజానికి, నేను గతంలో కంటే చాలా ఎక్కువ పొందుతున్నాను. ఈ ఆసుపత్రి నాది. మీరు ఇక్కడ నా అతిథి, మీ స్వంత నియమం, మీ సూత్రం ప్రకారంగా కూడా నేను మీ నుండి డబ్బు తీసుకోలేను.”

“ఆభగవంతుడి దయ వల్ల మీలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తికి సేవ చేసే అవకాశం నాకు కలిగింది. ఆ సర్వశక్తిమంతుడు మీ మంచి పనుల జాబితా లెక్కను ఉంచుకున్నాడు, ఈ రోజు మీ భగవంతుడు ఆ లెక్కను చెల్లించాడు. నేను చేసిన పనుల ఖాతా కూడా ఆయన వద్ద ఉంచుకుంటాడు, నాకు అవసరమైనప్పుడు, దాని నుండి ఖచ్చితంగా ఆయనే సరిచేస్తారు.

మీరు హాయిగా ఇంటికి వెళ్ళండి, ఏ సమస్య వచ్చినా మీరు సంకోచం లేకుండా నా దగ్గరకు రావచ్చు", అని డాక్టర్ ఆ వ్యక్తితో చెప్పాడు. 

ఆ వ్యక్తి  క్యాబిన్ నుండి బయటికి వెళుతూండగా, గదిలో ఉంచిన భగవంతుని బొమ్మను చూడగానే, చేతులు వాటంతటవే పైకి లేచి నమస్కరించగా, అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతని హృదయం అపారమైన ప్రేమతో నిండిపోయింది!!

మనం చేసిన పనులు వడ్డీతో సహా తిరిగి మన వద్దకే వస్తాయి. ఇది ఈ విశ్వం యొక్క నియమం!
                      
ఈ ప్రపంచపు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడమే ఉత్తమమైన త్యాగం, అదే ఉత్తమ ఆరాధన. ఇలా ప్రవర్తించేవాడు కర్మ బంధనం నుండి విముక్తి  పొందుతాడు.✍️```
           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)