Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*నాకే ఎందుకు ఈ కష్టాలు?*
#1
220522c1255.     230522-7.
???????????


        *నాకే ఎందుకు ఈ కష్టాలు?*
                 ➖➖➖✍️

```నాకెందుకు ఈ రోగం వచ్చింది? నాకెందుకు యిన్ని కష్టాలు వస్తూనే వున్నాయి? నేను ఎంత జాగ్రత్తగా వున్నా నాకే యిలా ఎందుకు జరుగుతూ వుంది?

మనం ఎప్పుడూ అనుకోని విపత్తులు, చెడు, చేదు సంఘటనలు, అనుభవాలు మన జీవితంలో జరుగుతూ వుంటే మనకు యిలా అనిపిస్తూనే  వుంటుంది.

కానీ, మంచి, మేలు జరిగినప్పుడు యిలా అనిపించదు. నాకే ఎందుకు యీ మంచి జరిగింది - అని అనుకునే వాడెవడూ ఉండడు.

మన మనస్సు ఆడే ఆట యిది.

విత్తనాలను విత్తుతాం. వాన వస్తుంది అని ఎదురు చూస్తాం. వాన రావచ్చు. రాకపోవచ్చు. మరీ ఎక్కువగానూ వర్షం రావచ్చు.

విత్తనాలు నాటడం, నీరు పెట్టడం లాంటివి మన చేతిలో వున్న, మనం చేయవలసిన పనులు. కానీ, మనం చేసే పనుల యొక్క ఫలితాలు మాత్రం మన చేతిలో లేవు. దాన్నే మనం ‘విధి నిర్ణయం’ అని అంటూ వుంటాము. కానీ అది ‘కర్మ ఫలితం’ అని అనుకోము.

వాన వస్తే, భూమి బాగుంటే, మొలకెత్తి పెరిగే శక్తి విత్తనంలో ఉంటే అది పెరిగేటప్పుడు, పురుగు పట్టకుండా చూసుకునే బాధ్యత మన పైన వుంది. అంత మాత్రమే మనం చెయ్యగలం. చెయ్యాలి కూడా!

పెరిగేది మొలకే. అందులో మనం చేసేదేమీ లేదు. పెరగ గలిగే శక్తి, సామర్థ్యము ఆ గింజలోను, ఆ మొలకలోను పెట్టే దాన్ని పుట్టించాడు సృష్టి కర్త.

మొలక పెరుగుతూ ఉంటే, మనం చూసి సంతోషించవచ్చు. అది పెరిగేటప్పుడు మళ్ళీ, నీళ్లు పెట్టడం లాంటి చిన్న, చిన్న పనులు చెయ్యడం మన వంతు.

మనలోనూ, విత్తనం లాగా, మొలక లాగా పెరిగే గుణం, ఆరోగ్యంగా ఉండగలిగే గుణం, సంతోషంగా ఉండగలిగే గుణం అన్నీ వున్నాయి. కానీ, మన జీవితాలు సక్రమంగా ఉండాలంటే, బాగుండాలంటే యివి చాలవు.

మన వంతు బాధ్యతలు, మనం చెయ్యవలసిన పనులు చాలావున్నాయి. అస్తమానం ఇతరులను నిందించడానికీ, పరులను ఏడ్పించడానికీ మనకు దేవుడిచ్చిన అమూల్యమైన కాలాన్ని వెచ్చించి మన దుఃఖాలకు మనమే మరింతగా ప్రోది చేసుకుంటూ వాటికి కారణం దేవుడనీ, భర్త అనీ, భార్య అనీ, కొడుకో కోడలో అనీ, కూతురో అల్లుడో అనీ, ఇరుగూపొరుగు వారోననీ నిందిస్తూ ఉండడం సహజాతి సహజమైపోయింది.

ఈ ఆత్మహత్యా సదృశమైన పైశాచికత్వమనస్తత్వాన్ని విడవకపోతే మనమింకా మరింత దుఃఖభాజనమైన జీవితపు అగాధాల్లోకి వెళ్లడం ఖాయమని గ్రహించకపోవడమూ పూర్వజన్మ పాపఫలమే తప్ప మరోటి కానేకాదు.

అలాంటి మనస్తత్వాన్ని మనంతట మనమే దూరంచేసుకోకపోతే దేవుణ్ణే మనం దూరం చేసుకున్నట్లవుతుంది. మనల్ని అప్పుడిక ఏ దేవుడూ కాపాడలేడు. పూజలూ, స్తోత్రాలూ, వేడుకోళ్లూ అన్నీ ఏటిలో పిసికిన చింతపండే.

వర్తమానము, భవిష్యత్తు కేవలం మన నిర్ణయాలు, మనం చేసే పనుల పైన కూడా ఆధారపడి ఉంటుంది. 

మన కంట్లో మనమే పొడుచుకుంటూ కూర్చోవడంవల్ల కలుగుతున్న పర్యవసానానికి మరొకరు బాధ్యులనడం హాస్యాస్పదమే కాదు బాధాకరం కూడా.


శ్రీకృష్ణుడు భగవద్గీతలో అన్నదానికి అర్థం యిదే .

“నువ్వు చేసే పనులు - పూర్తిగా నీ నిర్ణయాలే, నీ బాధ్యతే. కానీ వాటి ఫలితాలు మాత్రము నీ హక్కు కాదు; నీ బాధ్యత కాదు. నీ అధికారమూ కాదు. నీకు ఏది ఫలితంగా రావాలో అది కర్మఫలదాత అయిన నా చేత నిర్ణయింప బడుతుంది. నీకు నా చేత నిర్ణయింపబడిన ఆ ఫలితమే లభిస్తుంది. అది కూడా, ఎప్పుడు, ఎలా వస్తుంది - అన్న విషయం నీకు తెలీదు. అది నువ్వనుకున్నట్టు, నువ్వనుకున్న సమయానికి రాకపోవచ్చు. అలాగని నీ బాధ్యతలను నీవు తప్పించుకోవద్దు. నీ కర్మలను అనుసరించి నిర్ణయింపబడిన ఫలితం మాత్రమే నీకు వస్తుంది. ఎప్పుడు,ఎలా అన్నది నీకు తెలీక పోవచ్చు. అంతే.”

మత పరంగా చెప్పిన సూక్తి కాదిది. యిది కేవలం వేదం. శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ వేదం!

యిది అర్థమైన తర్వాత, యింకాస్త లోతుగా ఆలోచిద్దాం...

సంతోషంగా ఉండడం ప్రతి మనిషి బాధ్యత. ప్రశాంతంగా ఉండడం ప్రతి మనిషి బాధ్యత. తన  కర్తవ్యమేమిటో నిర్ణయించుకోవడం కూడా ప్రతీమనిషి బాధ్యతే.

✅మనం సంతోషంగా లేమంటే…ఎక్కడో, ఏదో, మనం తప్పు చేస్తున్నామన్న మాటే. సంతోషంగా వుండగలగడం అనేది మన సహజ గుణం. ఏ సందర్భంలో మనం సంతోషాన్ని విడిచి పెట్టినా - అది మన అజ్ఞానమే అంటారు విజ్ఞులు.

ప్రతీ actionకీ reaction వుంటుందని Science చెబుతుండగా, ప్రతీ చర్యకూ ‘ప్రతిచర్య’ ఉంటుందని వేదాంతం చెబుతున్నది.

తేడా ఏమున్నది?

యుధిష్ఠిరుడు జూదం ఆడకుండా ఉంటే పాండవులు అరణ్యాలకు పోవలసిన ప్రమేయం లేదు. మహాభారత యుద్ధం చెయ్యనక్కర లేదు. అంత మంది ఆ ఘోరమైన యుద్ధంలో చావనవసరం లేదు.

ఒకరు చేసే ఇలాంటి చిన్న, పెద్ద తప్పులు చాలా మంది యొక్క భవిష్యత్తును రకరకాలుగా శాసిస్తాయనడానికి యిది ఒక పెద్ద ఉదాహరణ. 

అవునా, కాదా? మీరు చేసిన, చేస్తున్న తప్పులు మీ జీవితాన్ని, మీతో బాటు   యెంతో మంది జీవితాలను యిలా కష్టపెడుతూ వుండొచ్చు. యోచించండి.

మీరు  తీసుకునే కొన్ని చొరవలు,  కొన్ని ప్రయత్నాలు మీ జీవితాల్లో, ఎన్నో విజయాలను కూడా సాధించిపెడతాయి. మీలో ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరే స్వయంగా తరచి చూస్తే, వెదికి చూస్తే, మీ విజయాలకు వెనుక మీరు తీసుకున్న చొరవలు, చేసిన ప్రయత్నాలే కదా కనిపించేవీ.

అలాగే, మీ జీవితంలో సంభవించిన దుష్ఫలితాలకు వెనుక మీరు చేసిన తప్పుడుపనులు, మీ సోమరితనాలు, మీరు వేసిన తప్పటడుగులు కనిపిస్తాయి.✍️```
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)