24-09-2023, 07:15 AM
220923b1952. 240923-2.
???????????212.
*అనారోగ్యం - వైద్యుడు*
➖➖➖✍️
```రావు గారి కుటుంబం పరమాచార్య స్వామి వారికి పరమ భక్తులు.
పెద్దవారైన హరిహర రావు మైలాపూర్ లో చాలా పేరు కలిగిన వారు. చిన్నవారు చంద్రు రావు బీసెంట్ నగర్ లో ఉన్న రత్నగిరీశ్వరర్ దేవస్థానంలో ప్రధాన అర్చకులు. మధ్యవారైన మణి రావు, శ్రీమఠం కార్యవ్యవహారాలు చూస్తుంటారు. ఒకసారి ఆయన తీవ్రంగా జబ్బుపడ్డారు. వారిని పరీక్షించిన వైద్యుడు వారిని వి.హెచ్.ఎస్ ఆస్పత్రికి వెళ్ళవలసిందిగా ఒక లేఖ ఇచ్చి సిఫారసుచేసారు.
వెంటనే వారు ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజుల తరువాత వైద్యులు నమ్మకం లేదు “ఇంటికి తీసుకువెళ్ళండి” అన్నారు.
వారిని చూడటానికి వచ్చిన హరిహర రావు గారు, కోమాలో ఉన్న తమ్ముణ్ణి చూసి నిశ్చేష్టులయ్యారు. వారికి మెదిలిన తరుణోపాయం తమ్ముణ్ణి కంచి మఠానికి తీసుకువెళ్ళడం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అది అసాధ్యం. కనుక తన తమ్ముడి బదులు తను వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. వారితోపాటు కొంతమంది దేవాలయ కార్యవర్గ సభ్యులు కూడా వచ్చారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో వారు కారు లో బయలుదేరారు.
కంచిలో కాపలావాడు మఠం ప్రధాన ద్వారం వేస్తుండగా మహాస్వామి వారు “తలుపులు మూయవద్దు. హరిహర రావు వస్తున్నాడు” అన్నారు.
కాపలావానికి ఆశ్చర్యం వేసినా, మహాస్వామి వారి గురించి తెలుసు కాబట్టి వేయలేదు.
మధ్యరాత్రిలో మఠానికి వచ్చిన వారితో శిష్యులు చెప్పారు... “మహాస్వామి వారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు” అని.
వారు మహాస్వామిని కలిసి సాష్టాంగం చేసి, నమస్కరించారు.
శ్రీవారు వారిని ”మీరు భోజనం చేసారా? మఠం వంట వాళ్ళకు మీకోసం ఉప్మా చెయ్యమని చెప్పనా?” అని అడిగారు.
వారు భోజనం చేశామని చెప్పి మహాస్వామి వారికి కృతజ్ఞతలు చెప్పారు.
తరువాత హరిహర రావు గారు తన తమ్ముని గురించి చెప్పారు.
మహాస్వామి వారు ఒక పెద్ద పళ్ళెంలో కొన్ని ఫలములు, విభూతి, కుంకుమ ప్రసాదంగా ఇచ్చారు.
హరిహర రావు మరియు మిగతావాళ్ళు స్వామికి వందనాలు చేసి సెలవు తీసుకుంటామని అడిగారు.
అందుకు మహాస్వామి వారు “ఉదయాన్నే వెళ్ళండి. మణి గురించి దిగులు పడవద్దు” అన్నారు.
వారు ఉదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూసి తెల్లవారగనే బయలుదేరిపోయారు.
వారు మణి ఉన్న గదికి వెళ్ళగానే అతను పడక పైన కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయారు.
హరిహర రావు గారు తమ్ముణ్ణి “ఎలా కూర్చోగలుగుతున్నవు ఇలా” అని అడిగారు.
“నిన్న రాత్రి దాకా నేను ఇలా కూర్చోగలను అని నాకు కూడా నమ్మకం లేదు. మహాస్వామి వారు ఇక్కడకు వచ్చి... ‘మణీ నీకు ఆరోగ్యం బాగుంది. లేచి కూర్చో అన్నారు’ నేను కళ్ళుతెరిచి ఇది నా భ్రమ అనుకున్నాను. మళ్ళా నిద్రకు ఉపక్రమిస్తూ ఉండగా ఈసారి మహాస్వామి వారి మాటలు స్పష్టంగా వినపడ్డాయి. ‘మణీ నీకు ఏమి ఆపదలేదు. నీకు ఏమి కాలేదు. నీ ఆరోగ్యం చక్కగా ఉంది. లే లేచి కూర్చో’ అని అన్నారు. ఆ సమయంలో నాకున్న బాధని అనారోగ్యాన్ని ఎవరో తీసేసినట్టు అయింది. ఇలా ఆరోగ్యంగా ఉన్నాను” అని అన్నాడు.
హరిహర రావుకి, అక్కడున్నవారికి నోట మాటరాలేదు. హరిహర రావు కుంకుమను, విభూతిని మణి నుదిటి పై పెట్టారు. తినడానికి కొన్ని ఫలాలు ఇచ్చారు. అక్కడి వైద్యులు ఎప్పటి లాగే “వైద్యచరిత్ర లోనే ఇది ఒక అద్భుతం” అని తేల్చేసారు.
అది వైద్యశాస్త్ర అద్భుతం కాదు. అవ్యాజ కరుణా మూర్తి, నడయాడిన దైవం, ఆది వైద్యుడు, ప్రేమ మూర్తి అయిన పరమాచార్య శ్రీ చరణుల అద్భుతం.✍️```
పరమాచార్య తిరువడిగళే శరణం.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥
https://.,./Gwym3p8N68O6BhkxFPCzxj
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
???
?లోకా సమస్తా సుఖినోభవన్తు!?
???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?