Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*చెట్టు రహస్యం*
#1
0105A2 (HF45.)0205z2-6.
220923-4.
???????????HF45.

              *చెట్టు రహస్యం*
                ➖➖➖✍️

```ఒక వ్యక్తి బహుళజాతి సంస్థలో సేల్స్ మేనేజర్‌గా పనిచేసేవాడు. పొదుపు చేసిన డబ్బుతో ఊరి వెలుపల విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నాడు. ఊరికి దూరంగా ఉండడంతో ఆ ప్రాంతం కాస్త నిర్జనంగా ఉండేది. ఆ వ్యక్తి తన భార్య, పిల్లలతో కొత్త ఇంటికి మారాడు. అతను ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లి, చాలా పొద్దుపోయిన తర్వాత తిరిగి వచ్చేవాడు.

ఏకాంత ప్రదేశంలో ఇంతటి విలాసవంతమైన ఇంటిని చూసిన దొంగలముఠా ఒకటి అక్కడ దొంగతనం చేయాలని అనుకుంది. దొంగతనానికి ముందు, ఆ దొంగలు అతని ఇంటిలోని కార్యకలాపాలను గమనించడానికి ఇంటి చుట్టూ తిరగడం ప్రారంభించారు.

మొదటి రోజే మేనేజర్ వింత ప్రవర్తనను వారు గమనించారు. ఇంటికి వచ్చినతర్వాత అతను ముందుగా తన తోటలోని మామిడి చెట్టు దగ్గరకు వెళ్లి, ఆఫీస్ బ్యాగులోంచి ఒక్కొక్కటిగా ఏవో తీసి చెట్టు దగ్గరపెట్టడం మొదలుపెట్టాడు.

మేనేజరును వెనకనుండి చూడడంతో, అతను తన బ్యాగ్‌లోంచి ఏమి తీస్తున్నాడో, చెట్టు దగ్గర ఎక్కడ దాస్తున్నాడో చూడలేక, అది విలువైనది ఏదో అయ్యిఉంటుందని దొంగలు ఊహించారు.

దొంగలు మేనేజర్ ఇంట్లో మెరుపుదాడి చేయాలని నిర్ణయించుకుని, చీకటి పడే వరకు వేచి ఉన్నారు.

రాత్రి లైట్లు ఆరిపోయేసరికి ఇంట్లో అందరూ నిద్రపోయారని తేల్చుకున్నారు. గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించి, నేరుగా మామిడి చెట్టు వద్దకు వెళ్లి, సమయం వృధా చేయకుండా అక్కడ మేనేజర్ దాచిన వస్తువులను వెతకడం ప్రారంభించారు.

అయితే ఎంతసేపు వెతికినా ఏమీ దొరకలేదు. చివరికి, అలసిపోయి, ఖాళీ చేతులతో వెనక్కెళ్ళిపోయారు.

మరుసటి రోజు, వారు మళ్ళీ ఆ ఇంటి దగ్గర దాక్కున్నారు. మేనేజర్ కార్యాలయం నుంచి తిరిగి రాగానే దొంగలు కళ్లు అతని మీదే నిలిపిఉంచారు.

ముందు రోజులాగే అతను ముందుగా మామిడిచెట్టు దగ్గరకు వెళ్లి సంచిలోంచి ఏదో తీసి చెట్టు దగ్గర పెట్టడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంటి లోపలికి వెళ్లాడు.

ఆరోజు రాత్రి కూడా ఇంటి లైట్లు ఆర్పివేసిన తర్వాత, దొంగలు మళ్లీ గోడ దూకి మామిడి చెట్టు వద్దకు వెళ్లి, మేనేజర్ దాచిన వస్తువుల కోసం వెతకడం ప్రారంభించారు. కానీ ఆ రోజు కూడా వారికి ఏమీ దొరకలేదు.

కొన్ని రోజులుగా రోజూ రాత్రి మామిడిచెట్టు దగ్గర వెతుకుతూనే ఉన్నారు. కానీ వారు ఏమీ కనుగొనలేకపోయారు. తమలాంటి తెలివైన దొంగలకు కూడా దొరకని వస్తువులను మేనేజర్ చెట్టు చుట్టూ ఎలా దాచాడా అని వారు కలత చెందారు.

ఇప్పుడు దొంగలకు దొంగతనం చేయాలనే కోరిక కంటే ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువైంది.

చివరగా, వారి ఉత్సుకతను తీర్చుకోడానికి, వారంతా ఆదివారం అతన్ని కలవడానికి మేనేజర్ ఇంటికి చేరుకున్నారు.

పెద్దమనుషుల్లాగా మేనేజరుని పలకరించారు.

అప్పుడు దొంగలపెద్ద, "అయ్యా, దయచేసి మీరు ఏమి అనుకోపోకపోతే.. మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకున్నాను.. మేం దొంగలం.. గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో దొంగతనం చేయాలని అనుకుంటున్నాం.. రోజూ మీరు రావడం చూస్తాం. సాయంత్రం ఇంటికి వెళ్లి, మామిడిచెట్టు దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. కానీ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ వస్తువులు మాకు దొరకట్లేదు. మీరు అక్కడ ఎవరికీ దొరకని వస్తువులు ఎలా దాచిపెట్టారో తెలుసుకోవాలని మేమంతా ఆత్రంగా ఉన్నాం!” అని అడిగాడు.

మేనేజరు దొంగల మాటలు విని నవ్వుతూ, "అన్నా, నేను అక్కడ ఏమీ దాచను, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు", అన్నాడు.

"లేదు సార్, మేం చూసాం. రోజూ సాయంత్రం మీ సంచిలోంచి ఏదో తీసి చెట్టులో పెడతారు. అక్కడ ఏదో దాస్తారు", అని దొంగలందరూ కలిసి చెప్పారు.

ఇప్పుడు మేనేజర్ గంభీరంగా, “నేనొక బహుళ జాతి సంస్థలో సేల్స్ మేనేజర్ని. పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది, దాని కారణంగా ఒత్తిడి కూడా ఎక్కువఉంటుంది. ఏది ఏమైనా లక్ష్యాన్ని మాత్రం చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ ఎవరితో ఒకరితో గొడవలు పడుతూంటాను. వినియోగదారుని హేళనలను వినాలి, యజమాని తిట్లు భరించాలి. ఇంటికి వచ్చినా, ఆ మానసిక ఒత్తిడి తగ్గదు. ఇంతకుముందు, నా ఒత్తిడిని తరచుగా నా కుటుంబ సభ్యులు అనవసరంగా భరించేవారు.
మేనేజరు నిట్టూర్చి కాసేపు ఆగాడు. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు..                                                                 "ఈ కొత్త ఇల్లు కట్టినప్పుడు, నేను ఈ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచాలి అని అనుకున్నాను, నేను ఆఫీసు నుండి ఇంటికి ఒత్తిడిని ఎప్పుడూ తీసుకురాను. ఇంటికి వచ్చిన తర్వాత, నేను మొదట మామిడిచెట్టు దగ్గరికి వెళ్తాను, నా ఒత్తిడిని ఒక్కొక్కటిగా అక్కడ ఉంచుతాను”, అని చెప్పాడు.
                           
మేనేజర్ మాటలు విన్న దొంగలకు చెట్టు రహస్యం అర్థమైంది. వారు దొంగతనం చేయడంలో విజయం సాధించలేకపోయారు, కానీ వారు జీవితంలో గొప్ప పాఠాన్ని తెలుసుకున్నారు.

నేటి కాలంలో, జీవితంలో వసతులు పెరుగుతున్నాయి, జీవితం మరింత సౌకర్యవంతంగా మారుతోంది. అయితే వీటినంటితోనూ ఏదోవిధంగా ఒత్తిడి కూడా పెరుగుతోంది. ఈ ఒత్తిడి తక్షణమే తొలగించబడదు, జీవితం నుండి కూడా పూర్తిగా తొలగించబడదు; కానీ మనం దానిని కనీసం ఇంటి వాతావరణం నుండి దూరంగా ఉంచవచ్చు, ఇంట్లో మన కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడపవచ్చు. అందుకే ఇంటిలోకి వచ్చినప్పుడల్లా, ఒత్తిడిని బయట వదిలేసి వద్దాం.

♾️♾♾♾♾♾♾♾♾

ధ్యానం ద్వారా, ఏకకాలంలో భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలలో ప్రశాంతత  కలుగుతుంది.✍️```
                  …బాబూజీ మహరాజ్.
ప్రతీ క్లిష్ట పరిస్థితి నుండి బయటపడటానికి ప్రకృతి నాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను.?
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...
944065 2774.
లింక్ పంపుతాము.?
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)