Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*అవతారం అంటే ఏమిటి?*
#1
???????????


       *అవతారం అంటే ఏమిటి?* 
                 ➖➖➖✍️


*విష్ణువు రాముని గా భూమిపై అవతరించాడని అంటారు కదా!,*

*మరి రామునిగా భూమిపై ఉన్న                   ఆ కాలంలో  వైకుంఠములో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా?*

*అవతారం అనగా దిగుట, పైనుండి క్రిందికి వచ్చుట. దేవుడు మనుష్యాది రూపాలను ఎత్తటం అవతారమంటారు.*

*దేవుడు అవతారమెత్తడం అనగా పైనుండు దేవుడు లోక క్షేమము కొరకు భూలోకం వచ్చెనని అర్ధం.*

*ప్రపంచమందు అధర్మం ఎక్కువైనపుడు చెడ్డవాళ్లను శిక్షించటానికి, మంచి వాళ్లని రక్షించటానికి భగవంతుడు పశు పక్షి మనుష్యాది రూపాలలో భూమిపైన అవతరించునని  నమ్మకం.*

 *విష్ణువు మత్స్యకూర్మాది అవతారాలు ఎత్తెనని పరమ విజ్ఞానము.*

*ఈ కల్పనలన్నింటికీ దేవుడు మానవులకు ఉపకారము చేయాలంటే భౌతిక రూపం ధరించడం అవసరం అన్న కల్పన ఆధారం.*

*ప్రజలు అనేక విధాల ఆపదలు వచ్చినప్పుడు భగవంతుడు వారి ఆపదలను తొలగించుటకు భౌతికరూపం ధరించుననే నమ్మకం అవతారకల్పనకు మూలాధారం.*

 *ప్రజలకు దుష్టులచే ఆపద కలిగినప్పుడు ఇంద్రాది దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకోవటం.*

*ఆయన వాళ్లకు అభయమిచ్చి పంపటం, సరైన సమయం చూసుకొని భౌతిక రూపంలో భూమిపై అవతరించి దుష్టశిక్షణ చేయటం చాలామటుకు అవతారకథల ప్రధాన ఇతివృత్తం.*

*అవతారాలు కేవలం త్రిమూర్తులకు, ఆదిదేవతలకే పరిమితం కాలేదు. దేవతలు, రాక్షసులు, యక్షులు, అప్సరసలు, చివరకు మానవులు కూడా అవతారమెత్తవచ్చు.*

*ప్రస్తుతం మనం రామునిగా విష్ణువు అవతరించాడు కదా! మరి అవతార పరిసమాప్తి అయ్యేంత వరకు వైకుంఠము లో విష్ణువు ఉన్నట్లా? లేనట్లా? అని కదా తెలుసుకోవాలనుకుంటున్నాము..... *

*ఈ విషయం తెలుసుకొనే ముందు ఒక ఉదాహరణ పరిశీలిద్దాము...*

*ఉదాహరణకు పది సమానమైన ప్రమిదలు లో సమానమైన వత్తులు నింపి, సమానమైన నూనె పోసి ఒక ప్రమిదను వెలిగించి, ఆ ప్రమిద తో మిగిలిన ప్రమిదలు వెలిగించి ఆ ప్రమిదల వరుసలలో పెట్టి;  వేరొకరిని …; ఈ ప్రమిదల వరుసలోని ఏ ప్రమిద తో నేను దీపం వెలిగించానో చెప్పగలవా అంటే ఆ వ్యక్తి చెప్పగలడా!.... *

*ఆ వ్యక్తే కాదు ఏ వ్యక్తి కూడా చెప్పలేడు; కారణం… మిగిలిన ప్రమిదలను వెలిగించిన తొలి ప్రమిద వెలుగు తగ్గిపోదు;*

*మిగిలిన ప్రమిదల వలె ప్రకాశిస్తుంది... కాని ఆ మిగిలిన ప్రమిదలకు తెలుసు; తనను వెలిగించిన  ఆ దీపం ఏదో.... ఆధునిక శాస్త్ర పరిశోధనలలో ని ‘క్లోనింగ్’ ప్రక్రియ గురించి మనకు అందరికీ తెలుసు కదా!.... *

*అలాగే నారాయణుడు అవసరమైనప్పుడు తనకు                             ప్రతి రూపమైన అవతారాన్ని భూమిపైన అవతరింప జేస్తూ ఉంటాడు.*

*విష్ణువు ఎన్ని అవతారాలు ఒకేసారి ఎత్తినా; విడి విడి గా ఎత్తినా తన అస్తిత్వం కోల్పోడు; *

*తన అసలు రూపంతో వైకుంఠమ్ లో దర్శన మిస్తూనే ఉంటాడు... విష్ణువు నుండి ఉద్బవించిన ఈ అవతారములు తమ అవతార పరిసమాప్తి చెందిన తరువాత తమ మూల అవతారమైన శ్రీమన్నారాయణుడి లో (విష్ణువు ) లో ఐక్య మందుతాయి... *

*ఒకసారి ఐక్య మందినా కూడా భక్తుల కోరిక మేరకు మరల, మరల అవే రూపాలతో అవసరమైనప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయి.*

*ఈ విధంగా అయ్య గారే (విష్ణు మూర్తే) కాకుండా; అమ్మగారు కూడా ( లక్ష్మిదేవి), భూలోకం పై అవతరించారు; అవతరిస్తారు. *

*అలాగే శివ పార్వతులు, మిగిలిన దేవతలు సందర్భాన్ని బట్టి భూలోకం పై అవతరిస్తూ ఉంటారు...*✍️
                         ….సేకరణ.
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       ???

 ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

???????????
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
Source: Ramadas, WhatsApp.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)