Posts: 3,914
Threads: 35
Likes Received: 4,507 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
విక్టర్ నీ రెండు గా చీల్చి చెండాడు ఆదిత్య దాంతో రోహిణి భయం తో అక్కడి నుంచి నేరుగా తన penthouse కీ పారిపోయి తన లగేజ్ నీ సర్దుతు ఉంది రోహిణి అప్పుడు లైలా ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు రోహిణి, అప్పుడే లోపలికి వచ్చాడు ఆదిత్య "నిన్ను నేను ఆపాలని రాలేదు నువ్వు వెళ్లాలి అనుకుంటే వెళ్లు నేను నిన్ను ఆపను కానీ ఎక్కడికి వెళ్లాలి ఆనుకుంటున్నావో చెప్పి వెళ్లు చాలు" అని అన్నాడు, దాంతో రోహిణి వెంటనే ఆదిత్య నీ కౌగిలించుకోవాలి అని చూసింది కానీ రక్తం తో తడిచిన అతని షర్ట్, చెయ్యి, నోరు చూసి భయం తో తల దించుకొన్ని "ఎన్నో కళలు కన్నీ ఈ దేశం కాని దేశం కీ వచ్చాను కానీ ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకాల్సిన పరిస్థితి మొదలు అయ్యింది అందుకే నేను తిరిగి నా ఇంటికి వెళ్లిపోతాను ఇళ్లు కీ మించిన అద్భుతమైన, సురక్షితమైన చోటు ఎక్కడ ఉండదు" అని చెప్పి తన సూట్ కేస్ నీ తీసుకోని బయటకు నడిచింది రోహిణి, అప్పుడు ఆదిత్య "ఒక్క నిమిషం" అని చెప్పి చిటికె వేశాడు ఆదిత్య అప్పుడు అతని అసిస్టెంట్ ఒకరు వచ్చి రోహిణి కీ కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు, దాంతో ఆదిత్య "నువ్వు ఇక్కడికి రావడం కోసం మీ నాన్న చాలా ఖర్చు చేశారు అని విన్నాను అవి ఇండియా లో ఉన్న నా ఫార్మసీ కంపెనీ యొక్క షేర్లు అవి ఇప్పటి నుంచి నువ్వు కూడా ఆ కంపెనీ లో ఒక బోర్డు మెంబర్ వీ ఎయిర్ పోర్ట్ లో నా సొంత చార్టర్డ్ ఫ్లయిట్ ఉంది నీ ఇష్టం డైరెక్ట్ గా ఇండియా కీ వెళుతావా లేదా కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం వేరే ఎక్కడికైన వెళ్లి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకొని వెళుతావా అనేది నీకే వదిలేస్తున్న" అని చెప్పి సైగ చేశాడు అప్పుడు ఒక ప్లాటినం డెబిట్ కార్డ్ తెచ్చి ఇచ్చాడు ఇంకో అసిస్టెంట్ "నువ్వు షాపింగ్ చేయాలి అనుకుంటే లేదా ఎమైన ఖర్చులు చేసుకోవాలి అనుకుంటే వాడుకో దయచేసి కాదు వద్దు అని చెప్పకు నా సంజన కీ నేను జీవితం లో ఎలాంటి సుఖాలు సంతోషాలు ఇవ్వలేదు కనీసం నీకు ఏమైనా చేస్తే అయిన సరే నా అంతరాత్మ సంతోషిస్తుంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య, అప్పుడు పక్కన ఉన్న అసిస్టెంట్ రోహిణి సూట్ కేస్ తీసుకోని వచ్చి కార్ లో రోహిణి నీ ఎయిర్ పోర్ట్ కీ తీసుకోని వెళ్లుతున్నాడూ, అప్పుడు రోహిణి కీ "నీ సమాధానం కోసం నువ్వు వెళ్లాల్సింది ఇండియా కీ కాదు జపాన్ కీ అక్కడికి వెళ్లు నీ సమాధానాలు అన్ని నీకు దొరుకుతాయి" మళ్లీ రాత్రి వచ్చిన గొంతు వినిపించింది.
దాంతో రోహిణి ఒక్కసారిగా ఉలికిపాటు తో లేచి తన పక్కన ఉన్న అసిస్టెంట్ తో "మనం జపాన్ కీ వెళ్లడానికి వీసా దొరుకుతుందా" అని అడిగింది, దాంతో ఆ అసిస్టెంట్ తన ఫోన్ లో ఎవరికో మెసేజ్ చేశాడు దాంతో రోహిణి మళ్లీ పెద్దగా పట్టించుకోలేదు అప్పుడు వాళ్లు ఎయిర్ పోర్ట్ కీ రాగానే అక్కడ రజిత తన చేతిలో ఒక గిఫ్ట్ నీ పట్టుకొని రోహిణి కోసం ఎదురు చూస్తూ ఉంది, అప్పుడు రోహిణి కార్ దిగి వెళ్లి రజిత నీ కలిసి "ఏంటి నువ్వు ఇక్కడ" అని అడిగింది, దానికి రజిత "నువ్వు వెళ్లిపోతున్నావు అని తెలిసింది నువ్వు వెళ్లడమే మంచిది రోహిణి ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఏమీ జరుగుతుందా అని భయంగా ఉంది ఒకవేళ నీకు ఎమైన జరిగితే ఆది నీ ఆపడం కష్టం నువ్వు నీ గతం గురించి ఆలోచించడం లేదు కానీ నువ్వు మాత్రం ఎవరూ అన్నది నాకూ తెలుసు నువ్వు సంజనా నే ఇది నీ పునర్జన్మ అది నాకూ తెలుస్తుంది నీకు కూడా త్వరలోనే తెలుస్తుంది" అని చెప్పి తన చేతిలో ఉన్న గిఫ్ట్ నీ రోహిణి కీ ఇస్తూ "ఇది ఆది నీకు ఇవ్వాలని ఆశ పడిన గిఫ్ట్ కానీ వాడికి ధైర్యం చాల లేదు వాడు నీకు ఇవ్వడు అని నేనే నీ కోసం send off గిఫ్ట్ గా తీసుకోని వచ్చాను good luck for your future కానీ భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తే ఒక్కసారి ఆదిత్య గురించి ఆలోచించు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది రజిత, దాంతో రోహిణి ఆలోచిస్తూ ఎయిర్ పోర్ట్ లోకి వెళుతూ ఉంటే ఒక flight attendent వచ్చి రోహిణి ఆమె టికెట్, వీసా ఇచ్చి వెళ్లిపోయింది, అప్పుడు ఆ అసిస్టెంట్ వచ్చి "మేడమ్ వెదర్ ప్రాబ్లమ్ వల్ల ఫ్లయిట్ ఒక అరగంట delay అవుతుంది మీరు వెళ్లి VIP lounge లో ఉండండి ఫ్లయిట్ రెడీ అయ్యాక వచ్చి నేనే పిలుస్తాను" అని చెప్పాడు, దాంతో రోహిణి కూడా సరే అన్నట్టు తల ఆడించి లోపలికి వెళ్లి కూర్చుంది, అప్పుడు ఆ అసిస్టెంట్ "bird in cage" అని మెసేజ్ పెట్టాడు అలా కొద్ది సేపటికి ఒక అమ్మాయి రోహిణి కీ ఒక brownie cake ఇచ్చి నవ్వుతూ బయటకు వెళుతూ ఉన్నట్లు ఉండి మొహం కోపం గా మార్చి బయటకు వచ్చి "ఆ అమ్మాయి నీ తీసుకోని రండి" అని చెప్పి తన కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ఆదిత్య తన ఆఫీసు లో ఉండగా తనకు ప్రెసిడెంట్ ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది, దాంతో బలవంతంగా నవ్వు తెచ్చుకోని "yeah ప్రెసిడెంట్ సార్ చెప్పండి" అని అన్నాడు, దానికి ప్రెసిడెంట్ "ఏంటి మిష్టర్ కుమార్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చారు అని పార్టీ ఇస్తున్నాను ఇండియా బిలియనేర్స్ నీ రమ్మని invitation పంపాను మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు" అని అడిగారు, దానికి ఆదిత్య "నేను వచ్చి surprise చేద్దాం అనుకున్నాను సాయంత్రం కలుదాం" అని చెప్పి ఫోన్ కట్ చేసి జెస్సి నీ పిలిచి తన సూట్ నీ తీసుకోని రమ్మని చెప్పి penthouse లోకి వెళ్లి స్నానం చేసి రెడీ అయ్యి లైలా నీ కూడా పార్టీ కీ తీసుకోని వెళ్లాడు ఆదిత్య, ఆ తర్వాత పార్టీ లో ఉండగా ఒక అమ్మాయి చాలా టివి గా నడుస్తూ వచ్చింది ఆమె అడుగులో రాజసం ఉట్టి పడుతుంది, అప్పుడు ఆమెను చూసి ఆదిత్య కీ తన గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి ఆమె ఎవరో కాదు ఇందాక ఎయిర్ పోర్ట్ లో రోహిణి నీ కిడ్నాప్ చేయడానికి చూసిన flight attendant అంతకంటే ముందు తనే ఆదిత్య నీ vampire గా మార్చిన మహిళా.
Posts: 3,914
Threads: 35
Likes Received: 4,507 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
ఆదిత్య తను vampire అవ్వడానికి కారణం అయిన ఆ మహిళను చూసి కొంచెం ఆశ్చర్యానికి గురి అయ్యాడు అప్పుడే ఆమె వెనుక Chris Evans (కెప్టెన్ అమెరికా హీరో) కూడా వచ్చి ఆదిత్య నీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు "హలో ఆదిత్య తమిళ్ సినిమా హీరో ధనుష్ తో మాట్లడి అతని మా సినిమా లో గెస్ట్ రోల్ చేయడానికి ఒప్పించినందుకు చాలా థాంక్స్ నిజంగా ధనుష్ వల్ల మా సినిమా కీ ఇండియా లో మంచి ప్రమోషన్ వచ్చింది" అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు, దానికి ఆదిత్య "నీ సినిమా వల్ల నాకూ 5 మిలియన్ల్ డాలర్ బొక్క ధనుష్ ఫ్యాన్స్ హైప్ బొక్క" అని మనసులో అనుకున్నాడు కానీ పైకి నవ్వుతూ "it's my pleasure కెప్టెన్ అమెరికా" అని చెప్పి నవ్వాడు, అప్పుడు Chris Evans తన పక్కన ఉన్న మహిళను చూపిస్తూ "చెప్పడం మరిచి పోయాను ఈవిడ శకుంతల వలస వచ్చిన వారి కోసం ఒక NGO నడుపుతూ ఉంది అలాగే consultancy frauds వల్ల మోసపోయిన వారికి కూడా ఆమె జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంది మీ కంపెనీ లో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే కొంచెం సహాయం చేయండి" అని అడిగాడు, దానికి ఆదిత్య నవ్వుతూ "తప్పకుండా చేస్తాను నా ఫ్రెండ్స్ కూడా ఒక మాట చెబుతాను మీరు ఏమి దిగులు చెందోదు" అని భరోసా ఇస్తూ చెప్పి పక్కకు వెళ్లి, అక్కడ ఉన్న డ్రింక్స్ దగ్గరికి వెళ్లి ఒక డ్రింక్ తాగుతూ ఉంటే అతని పక్కకు వచ్చి నిలబడి ఇంకో డ్రింక్ చెప్పింది శకుంతల అప్పుడు ఆదిత్య "ఎందుకు షాజియా నా వెంట పడుతున్నావ్ ఏమీ కావాలి నీకు" అని అన్నాడు ఆదిత్య, దాంతో షాజియా (శకుంతల) "నీకు చావు నుంచి తిరిగి ప్రాణం పోసి అమరత్వం ఇచ్చిన నీ ప్రాణ దాత తో ఇలాగేనా మాట్లాడేది" అని తన చేతిలో ఉన్న డ్రింక్ తాగుతూ గంభీరమైన గొంతు తో అడిగింది షాజియా, "ఇచ్చావు లే అమరత్వం ఎవరికి ఉపయోగం కళ్ల ముందే అయిన వాళ్లు పోతే తోడుగా ఉండడానికి కుటుంబం లేకపోతే ఎందుకు బ్రతికి ఉండి ఎన్ని సార్లు చావాలి అని చూసిన చావు రాలేదు, తోడుగా కుటుంబం లేక వాళ్ల జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రతి రాత్రి ఆ జ్ఞాపకాల సెగలో రగిలిపోతుంటే ఉండడం కంటే చావు మేలు అని అనుకోని రోజు లేదు దాంతో ఈ అమరత్వం వరమా, శాపమా అని అర్థం కాక ఇన్ని రోజులు బ్రతికేసా" అని చెప్పాడు ఆదిత్య, దాంతో షాజియా నవ్వుతూ "ఒక ఇరవై రూపాయల సంపాదన కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ లో సిపాయి గా చేరి అదే కంపెనీ మీద తిరుగుబాటు చేసిన గొప్ప సిపాయి, ఏ దేశం కోసం అయితే స్వతంత్ర సమరం మొదలు పెట్టాడో ఇప్పుడు ఆ దేశాన్ని వదిలి ఏడు సముద్రాలు దాటి వచ్చి కోట్లకు పడగలు లేపి ఆరు దేశాల్లో సొంత కంపెనీలు పెట్టుకొని విలాస వంతమైన జీవితం గడుపుతున్న నువ్వు నన్ను ప్రశ్నించే హక్కు కోల్పోయావు ఆది నారాయణ అలియాస్ ఆదిత్య కుమార్" అని చెప్పి, "ఈ ఐశ్వర్యం మొత్తం నీకు నేను ఇచ్చిన అమరత్వం వల్లే అంతే కాకుండా ఇరవై రూపాయల జీతం కోసం తల నీ శత్రువు కాలు కింద పెట్టిన నీకు నేను ఇచ్చిన అమరత్వం వల్లే వాడిని రెండు గా చీల్చి చంపావు నువ్వు నీ జీవితం మొత్తం నా కాలు కింద బానిస లాగా ఉండాలి కానీ నేను నిద్రలోకి వెళ్లాల్సి వచ్చి మీ vampire లు అందరూ తమ రాణి నీ మరిచిపోయారు అది గుర్తు చేయడానికి తిరిగి వచ్చాను" అని చెప్పింది షాజియా.
దాంతో ఆదిత్య "గుర్తు చేయడానికి అంటే ఏంటి నీ ఉద్ధేశం" అని అనుమానం గా అడిగాడు, దానికి షాజియా తన చూపుడు వేలు తో ఆదిత్య దవడ మీద నుంచి నుదుటి మీదకు తెచ్చి అతని నుదుటి మీద తట్టింది అంతే ఒక్కసారిగా ఆదిత్య కళ్ల ముందు మొత్తం మనుషులు ప్రాణ భయంతో పరుగులు తీశారు వాళ్ల వెనుక రక్త దాహం తో vampire లు వెంబడిస్తూ ఉన్నారు, ఆ vampire ల పైన ఒక vampire గాలిలో ఎగురుతు ఉన్నాడు ఒక పల్లకి లో షాజియా నీ మిగిలిన వాళ్ళు మోస్తూ వస్తున్నారు, దాంతో పాటు ఈ vampire సైన్యాన్ని కీ సేనాధిపతి గా ఉన్నది ఆదిత్య చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం ఒక్కసారిగా అగ్గి లో ఆహుతి అవుతుంది ఈ మొత్తం దృశ్యాలు చూసిన ఆదిత్య కీ నుదుటి నుంచి చెమట కారుతుంది అప్పుడే లైలా వచ్చి కదిలిస్తే కానీ తిరిగి ఈ లోకంలో కీ రాలేదు, దాంతో గట్టిగా ఊపిరి పీల్చుకున్ని తిరిగి వచ్చాడు ఆదిత్య అప్పుడు చుట్టూ చూస్తే అక్కడ షాజియా ఎక్కడ కనిపించలేదు తన కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే ఒక వెయిటర్ వచ్చి ఒక లెటర్ నీ ఆదిత్య కీ ఇచ్చాడు, "చెప్పడం మరిచి పోయా నీ గర్ల్ ఫ్రెండ్ సేఫ్ గా వెళ్లింది లేనిది చూసుకోవా" అని రాసి ఉంది, దాంతో ఆదిత్య వెంటనే రోహిణి కీ ఫోన్ చేశాడు, కానీ ఫోన్ switch off లో ఉంది మళ్లీ మళ్లీ చేశాడు కానీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, దాంతో ఎయిర్ పోర్ట్ కీ వెళుతున్న ఆదిత్య నీ సిటీ మేయర్ వచ్చి పక్కకు తీసుకోని వెళ్లాడు "ఆది నువ్వు urgent గా విక్టర్ ఏరియా కీ వెళ్లాలి" అని చెప్పాడు, దాంతో ఆదిత్య వెళుతూ ఉంటే తన ఫోన్ లోని వీడియో తీసి చూపించాడు అందులో చూస్తే విక్టర్ చనిపోవడంతో మొత్తం Fayes అన్ని కారాగారం నుంచి తప్పించుకోని బయటకు వచ్చాయి, "రజిత ఇంకా మన వాళ్లు కొంతమంది వెళ్లారు కానీ వాటిని ఆపే శక్తి వాళ్లలో తక్కువే కానీ నువ్వు ఉంటే వాటిని నువ్వు చాలా తేలికగా అదుపు చేస్తావు, తొందరగా వెళ్లు ఈ న్యూస్ కనుక న్యూస్ లో వస్తే మన vampires రహాస్యం మొత్తం బయటికి వస్తుంది కాబట్టి ప్లీజ్ త్వరగా వెళ్లు" అని బ్రతిమాలాడు చేసేది లేక లైలా తో కలిసి తన కార్ లో downtown కీ వెళుతూ లైలా తో "are you ready for your 1st vampire action Episode" అని అడిగాడు, దాంతో లైలా vampire గా మారి "waiting for the action" అని చెప్పింది.
అలా ఇద్దరు కలిసి downtown కీ వెళ్లారు అక్కడే అప్పటికే రజిత తనతో పాటు ఇంకా కొంత మంది vampires కలిసి Fayes నీ దొరికిన వాటిని దొరికినట్టు కాలు, తలలు, చేతులు పీకి చంపుతున్నారు ఇంకా ఆదిత్య అక్కడికి రాగానే గట్టిగా గర్జించాడూ దాంతో అక్కడ చుట్టూ పక్కల ఉన్న వాటర్ పైప్ లు పగిలి నీళ్లు పైకి చిమ్ముతు Fayes కీ కొంచెం శక్తి నీ తగ్గిస్తూ ఉంది అప్పుడు vampires అందరూ Fayes నీ ముక్కలు ముక్కలుగా చేసి అంతం చేశారు వాటి రక్తం అక్కడ ఉన్న నీటిలో కలిసి అక్కడ ఒక రక్తం ప్రవహిస్తున్న నది లాగా మారింది, అది చూసిన తర్వాత ఆదిత్య చుట్టూ చూసి ఓంకార్ ఎక్కడ అని అడిగాడు దానికి రజిత కూడా తెలియదు అని చెప్పింది, కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటి అంటే ఓంకార్ నీ అప్పటికే కొన్ని Fayes కిడ్నాప్ చేసి తీసుకోని వెళ్లారు, ఆ తర్వాత ఆదిత్య కీ రోహిణి నుంచి ఫోన్ వచ్చింది దాంతో తను జపాన్ కీ వచ్చే ముందు ఫ్లయిట్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేక్ ఇచ్చారు దాంతో దాని తినాలి అని చూస్తే "తినోద్దు" ఒక గొంతు వినిపించింది అని చెప్పింది, ఇలా ఎందుకు తనకు ఆ గొంతు వినిపిస్తోంది అని అడిగింది కానీ ఆదిత్య కూడా సమాధానం చెప్పలేక పోయాడు, ఆ తర్వాత రోహిణి నీ ఒంటరిగా ఉంచకుడదు అని నిర్ణయం కీ వచ్చి జపాన్ కీ ప్రయాణం అయ్యాడు.
మాస్టర్ నీ ఉంచిన చోటికి ఓంకార్ నీ తీసుకోని వెళ్లిన తర్వాత షాజియా వచ్చి ఎదురుగా నిలబడి ఉంది దాంతో ఓంకార్ ఆవేశము తో ముందుకు అడుగు వేసి ఒక మోకాలి పైన నిలబడి తన షర్ట్ లోపల ఉన్న ఆదిత్య గిఫ్ట్ గా ఇచ్చిన ఇరాన్ రాజు ఖడ్గం తీసి తన రెండు చేతులతో పట్టుకుని ముందుకు చాపి "ఈ సేవకుడి బహుమతి స్వీకరించండి రాణి" అని చెప్పాడు ఓంకార్.
The following 12 users Like Vickyking02's post:12 users Like Vickyking02's post
• hrr8790029381, Iron man 0206, Kacha, Mahesh12345, Mohana69, Naga raj, Nivas348, ramd420, Rathnakar, rj1993, sri7869, Sudharsangandodi
Posts: 3,914
Threads: 35
Likes Received: 4,507 in 1,113 posts
Likes Given: 2,640
Joined: Nov 2018
Reputation:
338
షాజియా తన ముందు మోకాలి పైన నిలబడి కత్తి నీ బహుమతి గా అర్పించిన ఓంకార్ దగ్గరికి వచ్చి అతని చేతిలో ఉన్న ఖడ్గం తీసుకోని "నా ప్రియమైన బానిస నేను తయారు చేసిన సేవకులలో నువ్వే చాలా విశ్వాసపాత్రుడివి ఈ మొత్తం భూ ప్రపంచాన్ని పరిపాలించేందుకు నా బిడ్డ తిరిగి లేస్తాడు వాడిని వచ్చే పున్నమి రాత్రికి లేపుతాను ఈ ప్రపంచాన్ని వాడి పాదాల కింద ఉంచుతాను" అని గట్టిగా నవ్వి చిటికె వేసింది షాజియా అప్పుడు ఒక Faye వచ్చి తన చేతిలోని ఒక చిన్న సుత్తి నీ షాజియా కీ అందించి వెళ్లిపోయాడు, అప్పుడు షాజియా ఆ సుత్తి తో ఆ ఖడ్గం మీద ఉన్న ఎర్రని వజ్రాలను పీకుతు ఉంది ఆ తర్వాత ఆ ఖడ్గం నీ కొలిమి లో పడేసి ఆ ఎర్రని వజ్రాలను తన కుడి అర చేతిలో పెట్టి ఓంకార్ కీ సైగ చేసింది, దాంతో ఓంకార్ తన కుడి అర చేతిని కోసుకొని షాజియా ఎడమ చేతిని కూడా కోశాడు అలా వాళ్ల ఇద్దరి రక్తం తగిలిన వెంటనే ఆ వజ్రాలు అన్ని ఒకటిగా కలుస్తూ వచ్చాయి, అప్పుడు ఉన్నట్లు ఉండి ఒక గుండె చప్పుడు వినిపించింది అది షాజియా చేతిలో ఉన్న వజ్రం నుండి వచ్చింది అలా ఆ గుండె కొట్టుకోవడం మొదలు పెట్టిన వెంటనే ఆదిత్య కీ ఒక్కసారిగా ఛాతి లోపల విపరీతంగా నొప్పి మొదలు అయ్యింది, దాంతో రజిత వెంటనే ఆదిత్య నీ చూసి "ఆది ఏమీ అయ్యింది" అని అడిగింది, దాంతో ఆదిత్య గుండె నుంచి రక్తం చుక్కలు రావడం చూసి అక్కడ చెయ్యి పెట్టి చూసింది రజిత అప్పుడు అక్కడ తనకు గుండె స్పందన తెలుస్తోంది, దానికి రజిత షాక్ అయ్యి "ఆది నీ గుండె ఇక్కడ దగ్గరిలో ఎక్కడో ఉంది దాని చప్పుడు తెలుస్తోంది" అని చెప్పింది, అప్పుడు ఆదిత్య తన పంజా గోరు తో తన చూపుడు వేలు మీద కోసుకొని వచ్చిన రక్తం చుక్కని గాలిలోకి ఊదాడు అది చిన్న ఆకు లాగా మారింది "వెళ్లి వెతుకు నాకూ నా గుండె కావాలి" అని చెప్పాడు ఆదిత్య, దాంతో ఆ ఆకు గాలిలో మాయం అయ్యింది అది అంత చూసిన రజిత "ఆది నువ్వు ఇవ్వని ఎప్పుడు నేర్చుకున్నావు" అని ఆశ్చర్యంగా అడిగింది, దానికి ఆదిత్య "అవసరం అన్ని నేర్పిస్తుంది నేస్తమా మనం జపాన్ వెళ్లాలి సిద్ధంగా ఉండు" అని చెప్పి లైలా వైపు చూసి "నిన్ను vampire గా మార్చి మంచి పని చేశాను నీ తరువాత యాక్షన్ కోసం రెడీగా ఉన్నావా" అని అడిగాడు, దానికి లైలా రెడీ అన్నట్టు తల ఆడించింది.
ఆ తర్వాత ముగ్గురు కలిసి ఆదిత్య ప్రైవేట్ జెట్ లో జపాన్ కీ వెళ్లడానికి సిద్ధం అవుతూ ఉండగా రజిత, ఓంకార్ కీ ఫోన్ చేస్తూ అతను ఫోన్ తీయక పోవడంతో "ఆది వీడు మళ్లీ బాగా తాగి నిద్రలోకి వెళ్లిపోయినట్టు ఉన్నాడు" అని చెప్పింది, దాంతో ఆదిత్య పర్లేదు అని చెప్పి pilot నీ జెట్ నీ స్టార్ట్ చేయమని చెప్పాడు, ఆ తర్వాత ఆదిత్య ఒక కుర్చీలో కూర్చుని ఒక బొమ్మ నీ గీస్తూ ఉన్నాడు, అప్పుడు రజిత వచ్చి ఏంటి అని అడిగితే "నిన్న నాకూ వచ్చిన దృశ్యాలో చాలా vampire's నాకూ తెలిసినవి ఉన్నాయి కానీ వీడు మాత్రం ఏవ్వడో నేను ఎప్పుడు చూడలేదు బహుశా నీకు ఏమైనా తెలుసా అని వాడి బొమ్మ నీ గీస్తున్న" అని చెప్పి ఆ బొమ్మ నీ రజిత కీ చూపిస్తే, అది చూసిన రజిత షాక్ అయ్యి "ఆది నువ్వు సరిగా చూశావా అది వీడేనా" అని అడిగింది, దానికి ఆదిత్య అవును అన్నట్టు తల ఆడించాడూ "ఆది వీడు చనిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది" అని చెప్పింది రజిత, దానికి ఆదిత్య షాక్ అవుతూ "ఇంతకీ ఎవడు వీడు" అని అడిగాడు, అప్పుడు రజిత గట్టిగా ఊపిరి పీల్చుకున్ని "మాస్టర్" అని చెప్పింది, దాంతో ఆదిత్య షాక్ అయ్యి తన శాటిలైట్ ఫోన్ తీసుకోని ధర్మశాల లో ఉన్న శేషు కీ ఫోన్ చేశాడు ఆదిత్య నుంచి ఫోన్ రావడంతో శేషు ఫోన్ ఎత్తి "హలో ఆది ఈ సారి మందు పని చేసేలా ఉంది ఇంకో నెల లోగా పంపిస్తాను" అని చెప్పాడు శేషు, దానికి ఆదిత్య "శేషు నేను దాని కోసం ఫోన్ చేయలేదు మాస్టర్ ధర్మశాల మీద దాడి చేస్తే అతని మీరు అందరూ కలిసి ఎలా అంతం చేశారు" అని అడిగాడు, దానికి శేషు నవ్వుతూ "వాడిని అంతం చేసింది మేము కాదు ఆది" అని చెప్పాడు, దానికి ఆదిత్య ఆలోచిస్తూ "మరి ఎవరూ" అని అడిగాడు, దాంతో శేషు "శ్రీను, శ్రీనివాస్ ది సామ్రాట్" అని చెప్పాడు "నేను తనని కలవాలి" అని అడిగాడు ఆదిత్య, కానీ శేషు మాత్రం "సారీ ఆది అతను రెండు సంవత్సరాలుగా ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ నీకు తనతో ఏంటి పని" అని అడిగాడు శేషు, దాంతో ఆదిత్య, మాస్టర్ గురించి చెబితే "ఏంటి ఆది నువ్వు చెప్పేది" అని ఆశ్చర్యంగా అడుగుతు "సరే నేను శ్రీను నీ కాంటాక్ట్ చేయడానికి చూస్తాను అతని భార్య నా ఫ్రెండ్ తనకి ఏమైనా తెలుసు ఏమో కనుకుంటా" అని ఫోన్ పెట్టేసాడు శేషు.
ఆ తర్వాత శేషు, పద్దు కీ ఫోన్ చేశాడు "హలో శేషు ఎలా ఉన్నావు" అని ఉత్సాహంగా అడిగింది పద్దు, దానికి శేషు "పద్దు, శ్రీను ఎక్కడ తనతో చాలా పెద్ద అవసరం పడింది" అని చెప్పాడు శేషు, దాంతో పద్దు నవ్వుతూ తన ఆరు నెలల కడుపు మీద మెల్లగా రుద్దుతు "సార్ గారు ఎక్కడ ఉన్నారో ఏమో ఇక్కడ వాడి కోసం రెండు ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి అనే విషయం కూడా గుర్తుకు లేదు వాడికి" అని చెప్పింది పద్దు, దాంతో శేషు "మాస్టర్ తిరిగి వచ్చాడు" అని చెప్పాడు, అది విని పద్దు చాలా షాక్ అయ్యింది "సరే నేను శ్రీను కీ ఎలాగైనా ఇన్ఫర్మేషన్ వెళ్లేలా చేస్తా" అని చెప్పి, లీలా నీ పిలిచింది పద్దు "ఏంటి వదిన" అని కిచెన్ నుంచి బయటకు వచ్చింది లీలా "లీలా మీ అన్నయ్య ఎమర్జెన్సీ లో కాంటాక్ట్ అవ్వడానికి ఒక మెయిల్ ఇచ్చాడు కదా దానికి మాస్టర్ తిరిగి వచ్చాడు అని మెసేజ్ పంపు మిగిలిన విషయాలు శ్రీను కీ ఆటోమేటిక్ గా అర్థం అవుతాయి" అని చెప్పింది పద్దు, దాంతో అప్పుడే పద్దు కడుపులో బిడ్డ కొట్టింది దాంతో పద్దు కొద్దిగా మురిసిపోయింది.
ఆదిత్య కీ శాటిలైట్ ఫోన్ ద్వారా ఇంకో ఫోన్ వచ్చింది ఏంటి అని చూస్తే విక్టర్ బార్ లో పని చేసే ఒక గార్డ్ దాంతో ఫోన్ ఎత్తి ఏంటి విషయం అని అడిగాడు, దాంతో ఆ గార్డ్ "సార్ మా బాస్ అదుపులో ఉండే ఆ మరుగుజ్జు రాక్షసులను బయటికి వదిలింది ఎవరో తెలిసింది సార్ అక్కడ ఒక చిన్న కెమెరా ఉంది అందులో ఒక వీడియో దొరికింది మేము బార్ నీ మూసి వేసి వెళ్లిపోదాం అనుకోని అన్ని క్లియర్ చేస్తుంటే ఈ వీడియో దొరికింది అది మీ మెయిల్ కీ పంపించాము" అని చెప్పాడు, దాంతో ఆదిత్య ఫ్లయిట్ లో ఉన్న wifi తో తన మెయిల్ తెరిచి అందులో ఉన్న రెండు వీడియో లు చూశాడు ఒకటి ఏమో నెల క్రితం అంటే రోహిణి ఇంటర్వ్యూ కీ వచ్చే ముందు రోజు ఆ బార్ లో ఉండడం ఉంది, ఇంకో వీడియో లో రోహిణి కింద cellar లోకి వెళ్లి ఒక సెల్ లోని Fayes నీ బయటికి వదలడం ఉంది.
(ఫ్రెండ్స్ రెండు రోజుల పాటు తిరుపతి దర్శనం కీ వెళుతున్నాం కాబట్టి తరువాత update సోమవారం ఇస్తాను)
The following 15 users Like Vickyking02's post:15 users Like Vickyking02's post
• Bullet bullet, hrr8790029381, Iron man 0206, Mahesh12345, maheshvijay, Mohana69, Naga raj, Nivas348, ramd420, Rathnakar, rj1993, sri7869, Sudharsangandodi, Uday, utkrusta