Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"శ్రీమతి మోహిత"
#1
ఇంకో కొత్త కధ.

పేరు అనుకున్నాను, కధ మొదటి భాగం అయితే అలా వచ్చేసింది. ఎన్ని భాగాలు రాస్తానో, ఆ కధేంటో తెలీదు. కానీ ఈ భాగం అయితే బాగా వచ్చింది, నాకు బాగుంది, మీకెలా అనిపిస్తుందో చెప్పండి.
[+] 3 users Like earthman's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఎక్కడ మొదలుపెట్టాలో తెలియట్లేదు, కానీ ఎలా ముగిస్తానో తెలుసు. ఎలా మొదలుపెట్టినా నీకు చెప్పాల్సింది చెప్తానని, నీకు అర్ధం అవుతుంది అని మొదలుపెడుతున్నా.

నాకు చాలా ఇచ్చావు, కాదనను. దేనికీ లోటు లేదు, ఒప్పుకుంటాను. అడగక ముందే అన్నీ ఏర్పాటు చేసావు, నిజమే అంటాను.

కానీ నా మనసుకి ఏం కావాలో ఎప్పుడూ అడగలేదు. నాకు ఏవి ఇష్టమో కనుక్కోలేదు. అన్నీ నీకు నచ్చినవే, నీకు అనిపించినవే చేసావు.

వస్తువులు, సుఖాలే కాదు, మనసు కూడా ముఖ్యం, సంతోషం కూడా ముఖ్యం.

లక్ష రూపాయల మంచం మీద పడుకున్నా నిద్రపట్టదని, ఇష్టపడే మనిషి పక్కన చినిగిన చాప మీద పడుకున్నా నిద్రపోవచ్చని తెలుసుకున్నాను.

తినడానికి గిన్నెల నిండా ఎన్ని ఉన్నాయని కాదు, పంచుకునే మనిషి ఉంటే తినే ఒక్క ముద్ద కూడా శక్తినిస్తుందని తెలుసుకున్నాను.

కుదుపు తెలియని ఇంపోర్టెడ్ కారులో వెళ్ళడం కాదు, చెయ్యి పట్టుకుని నడిచేవాడు కావాలని తెలుసుకున్నాను.

ఏడువారాల నగలు కాదు, ప్రేమతో తెచ్చే చిన్న తిలకం ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకున్నాను.

పొద్దున్నే బెడ్ కాఫీ తెచ్చే నౌకరు కాదు, ఇంకో రోజు నీతో గడిపే అవకాశం వచ్చిందంటూ ప్రేమతో ముద్దు ఇచ్చే మనిషి ఉండాలని తెలుసుకున్నాను.

పైకి నవ్వుతూ, వెనక గోతులు తీసే వందమంది ఫ్రెండ్స్ కంటే కలకాలం తోడుండే ఒక్కడుంటే చాలని తెలుసుకున్నాను.

అందరూ చూస్తున్నారని, ఫొటోస్ తీస్తున్నారని వాటేసుకుని హాయ్ అని, అవసరమున్నప్పుడు ఫోన్ చేస్తే నంబర్ చూసి ఫోన్ సైలెంట్ చేసే పార్టీ ఫ్రెండ్స్ వందమంది కన్నా, అర్ధరాత్రి రమ్మన్నా రెండు సిటీ బస్లు మారి వచ్చే మనిషి ఉండాలని తెలుసుకున్నాను.

పడవంత కారులో వెళ్ళి, లంకంత షాపులో కొనే ప్లాటినం కన్నా, డిస్కౌంట్ ఇస్తున్నారని కబుర్లు చెప్పుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచెళ్ళి కొనుకున్న ప్లాస్టిక్ టేబుల్ కొనుక్కోవడంలో ఉన్న ఆనందం తెలుసుకున్నాను.

పెద్దింటి కోడలు పెద్దింటి కోడలు అంటూ లేనిపోని బాధ్యతలు నాకు అంటగట్టి, వాళ్ల తప్పులకి నన్ను బలి చేస్తూ, నా అస్తిత్వాన్ని సమాధి చేసే చేస్తున్న అయినవాళ్ళ కన్నా, నా కాలిలో ముల్లు గుచ్చుకుంటే తను విలవిలలాడే మనిషి ఉన్నాడని తెలిసుకున్నాను.

తాపం తీర్చుకోవడానికి కాదు శరీరమున్నది, ముందు మనసులు మమేకమవ్వాలన్న సత్యం బోధించిన మనిషున్నాడని తెలుసుకున్నాను.

పనివాళ్ళు చూపించే అభిమానం కన్నా భర్త నించి లభించే అభిమానం తక్కువయినప్పుడు, మొగుడి ఫోన్ కోసం వసంతం కోసం ఎదురుచూసే కోయిల లాగా ఎంత ఎదురుచూసినా ఆ కాల్ రానప్పుడు, ఏడ్చి ఏడ్చి ఇక ఏడవటానికి కన్నీరు లేక, తడారిపోయిన అ కళ్ళతో ఏ అర్ధరాత్రో పడుకుని నిద్రలో ఉలిక్కిపడి లేచి, పక్కన ఎవరూ లేక, ఓదార్పునిచ్చే కన్నీరు రాక, నరకం చూసిన రోజులని మర్చిపోయేలా, ఎడారిలోకి వచ్చిన ఓ పక్షి విసిరిన విత్తనం, ఊహించని వాన పడి, చిగుర్లు తొడిగి, ఇంతింతై అన్నట్టు పచ్చని చెట్టులా మారినట్టు, అడవిగాచిన వెన్నెల్లా మారి, నిశీధిలోకి నెట్టబడిన నా జీవితాన్ని, మళ్ళీ నందనవనంలా చేసిన ఆ మనిషి కోసం వెళ్తున్నాను.

నీ అంత:పురాన్ని వదిలి, పేరుకి కాదు, నిజంగా ప్రేమతో, తన గుండె గదిలో కొలువుంచుకునేలా, తన రెండు గదుల ఇంటికి, తన యాభై గజాల సామ్ర్యాజ్యానికి నన్ను మహరాణిని చేసే ఆ మనిషి కోసం, ఆ చల్లని నీడ కోసం నిన్ను వదిలి వెళ్తున్నాను.

నీ అంత:పుర దాస్యం కన్నా అతని ఇంట్లో దొరికే స్వచ్ఛమైన ఆనందం కోసం, నువ్వు ఏర్పరిచిన కృత్రిమ స్వర్గం కన్నా, అతను పెట్టే రెండు మెతుకుల అన్నాన్ని కళ్ళకద్దుకోవడం కోసం, నువ్వు ఇచ్చిన నకిలీ జీవితం కన్నా, అతని నామమాత్రపు జీతమే గొప్ప అని తెలిసి వెళ్తున్నాను.

చీకటిలో కుంగిపోతున్న నా జీవితానికి ఆలంబనగా నిలిచి స్నేహహస్తాన్నిచ్చిన ఆ చల్లని మనిషి నీడలోకి వెళ్తున్నాను.

వాన నీటిలో మట్టిలా కరిగిపోతున్న నా జీవితాన్ని, తన చేతుల్లోకి తీసుకుని, ఆ మట్టికి మళ్ళీ ప్రాణం పోసిన ఆ శిల్పి కోసం వెళ్తున్నాను.

మీ ఇంద్రభవనంలో మీ అందరి కోసం కొవ్వొత్తిలా కాలిపోతూ, ఏ క్షణమైనా ఆరిపోయేలా ఉన్న నా జీవితానికి మళ్ళీ ఊపిరులూదిన ఆ మనిషి దగ్గరికి వెళ్తున్నాను.

నేను నేనని, నా లాంటి ఆడది నేనొక్కదాన్నేనని, నా బాగోగులు చూసే మనిషి లేనప్పుడు, నా కోసం తపించే మనసు లేనప్పుడు ఎన్ని ఉన్నా, ఏమీ లేనట్టేనని, సంతోషాన్ని, బాధని పంచుకోవటంలో ఉన్న జీవన మాధుర్యాన్ని చవిచూపించిన ఆ మనిషి కోసం వెళ్తున్నాను.

ఇట్లు మోహిత.
Like Reply
#3
అప్డేట్ ఎమోషనల్ గా చాల అద్భుతంగా ఇచ్చారు 
Nice beginning my friend,

మీ పార్టనర్ కధకు అప్డేట్ ఇవ్వండి మిత్రమా, 

Thanks earthman garu,
Like Reply
#4
Earthman bro 

Adhbuthanga undandi. Mahitha manovaadhana.
Like Reply
#5
Super super update bro
Like Reply
#6
Super update
Like Reply
#7
Nice super
Like Reply
#8
బాగుంది
Like Reply
#9
బ్రదర్ ఎమోషన్స్ బాగా వచ్చాయి, అలాగే పోలికలు కూడా...కొనసాగించండి ఎడారిలో కనిపించిన ఒయాసిస్సు కోసం సాగిపోతున్న మోహిత కథను....
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#10
No words for your words.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#11
Chala Baga rasaru
Like Reply
#12
adhirindi
Like Reply
#13
ఒక ఉద్వేగంలో మొదటి భాగం అలా రాసేసాను. తరువాత ఒక కథ లాగా రాయచ్చు అనిపించింది. ఇప్పుడు కాస్త తలా, తోక జోడిస్తున్నాను, ఒక రూపం ఇస్తున్నాను.

ఎలా వస్తుందో క్లారిటి లేదు, చూద్దాం.
[+] 2 users Like earthman's post
Like Reply
#14
"ఇప్పుడు వద్దు, నేను చెప్తాను. తను స్నానం చేస్తోంది. తనొస్తే షాపింగ్ పనుంది. షాపింగ్ అయ్యాక నేను చెప్తాను కదా"... ఫోన్ పెట్టేస్తూ అన్నాడు.

"ఎవరు"

"ఆఫీస్. ఒక పని దగ్గర కాలిక్యులేషన్ తప్పు వేసారు. అదేంటో చూడాలి"

"అయితే మన షాపింగ్"

"షాపింగ్ అయ్యాకే"

"పది నిముషాలు, అయిపోయింది"

పది నిముషాలు గడిచాయి.

"నేను రెడీ"

"రైట్. నువ్వు కార్లో ఉండు, నేనొస్తాను"

బయట ఎవరూ లేరని చెక్ చేసి ఫోన్ చేసాడు.

"ఆ నేనే. నాకు లేట్ అవుతుంది. తను షాపింగ్ అంది, నేనేం చెయ్యను. మొన్నెప్పుడో షాపింగ్ అన్నానుట, నాకు గుర్తు కూడా లేదు. పొద్దున గుర్తు చేసింది, ఎవడికి గుర్తు, అప్పుడేదో అన్నాను. ఇప్పుడు షాపింగ్ అంది, వెళ్ళాలి. ఫ్రీ అయ్యాక మెసేజ్ ఇస్తాను. ఏ టైం అవుతుంది అంటే ఏమో, 1 లేదా 2, అవ్వచ్చు, తొందరగా అయ్యేలా చూస్తా. సరే తను కింద వెయిటింగ్. ఎక్కడికో నువ్వే ప్లాన్ చెయ్యి, ఆఫీస్ పని అని చెప్పానులే. రాత్రికి వచ్చినా ఏమీ కాదు. ఈసారికి లోకల్, సిటీలోనే ఏదన్నా చేద్దాం. నువ్వే ప్లాన్ చెయ్యి. సరే ఫ్రీ అయ్యాక మెసేజ్ ఇస్తాను, బై"

ఫోన్ అయ్యాక కిందకెళ్ళాడు.

"ఎంతసేపు వెయిటింగ్"

"ఆఫీస్ వర్క్. మెట్లు దిగుతుంటే మళ్ళీ ఫోన్, మాట్లాడి నన్ను కాసేపు డిస్టర్బ్ చెయ్యద్దని చెప్పి వస్తున్నా. సో ఎక్కడికి ఇప్పుడు"

"మీరే కదా అంది, మీ మేనేజర్ వాళ్ళమ్మాయి హారిక పెళ్ళని, ఆ పెళ్ళి కోసం షాపింగ్"

"ఔను కదా, మర్చిపోయాను అసలు. ఏం కొనుక్కుంటావు"

"ఇయర్ రింగ్స్"

"ష్యూర్. ఎప్పుడూ వెళ్ళే షోరూంకే కదా"

"లేదు. ఇంకేదయినా కొత్త షాప్. నాకు తెలీదు"

"ఏదో ఒకటి చెప్పు. డ్రైవర్ తీసుకెళ్ళాలి కదా"

"వెళ్తూ ఉందాం. బాగుంది అనే దగ్గర ఆగుదాం"

"ఓకే"

కార్ బయలుదేరింది. నెమ్మదిగా పెద్ద పెద్ద జ్యువెల్లరి షాప్స్ ముందుగా వెళ్తోంది.

"అదిగో ఆ షాప్ చూడు, త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి"

"ఔను బాగుంది. శివయ్యా ఆ షోరూం దగ్గర ఆపేయ్"

డ్రైవర్ శివయ్య కార్ ఆపాడు. ఇద్దరూ దిగి లోపలికెళ్లారు.

"ఏం కావాలి మేడం"

"ఇయర్ రింగ్స్"

"ష్యూర్ మేడం. ఇయర్ రింగ్స్ ఈ సెక్షన్ మేడం. ప్యూర్ గోల్డ్ నించి, స్టోన్స్, డైమండ్స్ అన్నీ ఉన్నాయి. ఏవి కావాలి మీకు"

"పింక్ లేదా గ్రీన్ స్టోన్స్ ఉన్నవి ఉన్నాయా"

"ఉన్నాయి మేడం. కూర్చోండి"

ఉన్నవి అన్ని టేబుల్ మీద పెట్టారు.

"సరే నువ్వు చూస్తూ ఉండు, నేను ఫోన్ చేసొస్తాను"

"ఎంటి ఈరోజు ఇన్ని ఫోన్స్"

"ఫైనలైజ్ చెయ్యాల్సిన ఎకౌంట్ ఉంది, అందుకే బిజీ. నువ్వు చూస్తూ ఉండు"

- - - - - - - - - - - - -

"ఇంకెంతసేపు"

"ఇప్పుడే షోరూంకొచ్చాం"

"ఇక ఈరోజు అయినట్టే మనం కలవడం. మీ మేడంగారిని హైద్రాబాద్ మొత్తం తిప్పి, అన్ని కొనిచ్చి, లంచ్, డిన్నర్ బయటచేసి, అర్థరాత్రి ఇంటికెళ్తారు, అంతేగా"

"ఒక్క ఇయర్ రింగ్స్ అంతే. అవ్వగానే తనని ఇంటికి పంపించేసి నేను నీ దగ్గరకొస్తా కదా"

"ఏం వస్తారో ఏమో. ఎన్ని చేద్దాం అనుకున్నానో తెలుసా"

"సారీ సమీరా, నాకు గుర్తులేదు మా మేనేజర్ కూతురి పెళ్ళి అని, తనకి గుర్తుంది"

"అంతే నా బర్త్ డే కన్నా, మీ మేడంగారి షాపింగ్ ఎక్కువ మీకు"

"సారీ సమీరా. ఈరోజు వద్దంటే, తను కూడా ఆఫీసుకి వస్తాను అంటే, మొత్తంగా దెబ్బ మనకి. అందుకే షాపింగ్. అవ్వగానే తనకి సెండాఫ్, అరగంట్లో మీ ఫ్లాట్ ముందు ప్రత్యక్షం. తరువాత నువ్వు ఎటు అంటే అటు. ఏం చేద్దాం అంటే అది. లేదు, ఫ్లాట్లోనే రోజంతా మంచం మీద గడిపేద్దాం అన్నా నాకు ఓకే"

"ఈ మాటలకేం తక్కువలేదు. నా గిఫ్ట్ సంగతేంటి"

"కొన్నాను సమీ, నిన్నే తెప్పించా"

"నాకు నచ్చుతుందా"

"నచ్చుతుంది, నీలానే అందంగా, రంగురంగుల్లో ఉంటుంది"

"మాటల్తో ఐస్ చెయ్యడం మీకు బాగా వచ్చు"

"నిజం సమీ. సరే నేను ఆఫీస్ ఫోన్ అని బయటకొచ్చా. లోపలికెళ్ళి తని సెలక్ట్ చేసుకున్నది యస్ అని, తనని వెంటనే పంపించేసి వచ్చేస్తా. బై"

- - - - - - - - - - - - -

"అయిందా సెలక్షన్"

"నేను అడగాలి. అయిందా మీ ఆఫీస్ పని"

"ఫోన్లో అయింది. ఇక వెళ్ళి చూడాలి"

"ఎలా ఉన్నాయి ఈ ఇయర్ రింగ్స్"

"పింక్ కలర్. బ్యూటిఫుల్, ఐ లైక్ థెమ్"

"అయితే తీసుకుంటాను"

"ష్యూర్"

"ఎంత ఇవి"

"18,000 సార్"

"రైట్"

"సార్ మీకు కాఫీ, కూల్ డ్రింక్"

"ఏం వద్దు. మేం వెళ్లాలి"

"ఒక్క పావుగంట ఉందాం. రెండు కూల్ డ్రింక్స్"

"వెళ్లాలి"

"టెన్ మినిట్స్"

కూల్ డ్రింక్స్ వచ్చాయి. తాగుతూ మాట్లాడుకుంటున్నారు.

"సరే ఇంకేమన్నా కావాలా"

"ఏమీ వద్దు. ఈ ఇయర్ రింగ్స్ కూడా నాకు కాదు. ఆ అమ్మాయి హారికకి ఇవ్వడానికి"

"ఔనా. నీక్కాదా"

"ఇంత కాస్ట్ పెట్టి నేను కొంటానా, మీకు తెలీదా"

"నిజమే, మరి ఇప్పుడు ఎందుకు కొన్నట్టు"

"ఆ అమ్మాయి అమెరికాలో చదువుకుంది. వాళ్ళ నాన్న కన్నా పెద్ద స్థాయి, అమెరికా సంబంధం, పెళ్లవ్వగానే వెళ్ళిపోతుంది. మీ తరఫున ఇస్తున్న గిఫ్ట్. ఆ అమ్మయికి ఎలా స్థాయి ఉందో, మీకు కూడా ఉంది కాబట్టి ఇంత కాస్ట్"

"నీకనుకున్నాను"

"కాదు"

"సార్ బిల్. క్యాష్ ఆర్ కార్డ్"

"కార్డ్"

పర్స్ నించి కార్డ్ తీసి ఇస్తూ ఉండగా మొబైల్ వైబ్రేట్ అయింది.

స్క్రీన్ మీద కనిపించిన 'ఆఫీస్ యస్' అనే పేరు చూసింది మోహిత.
[+] 9 users Like earthman's post
Like Reply
#15
Update baagundi
Like Reply
#16
starting bagundi
Like Reply
#17
Nice update
Like Reply
#18
(30-03-2023, 08:22 PM)earthman Wrote: ఎక్కడ మొదలుపెట్టాలో తెలియట్లేదు, కానీ ఎలా ముగిస్తానో తెలుసు. ఎలా మొదలుపెట్టినా నీకు చెప్పాల్సింది చెప్తానని, నీకు అర్ధం అవుతుంది అని మొదలుపెడుతున్నా.

నాకు చాలా ఇచ్చావు, కాదనను. దేనికీ లోటు లేదు, ఒప్పుకుంటాను. అడగక ముందే అన్నీ ఏర్పాటు చేసావు, నిజమే అంటాను.

కానీ నా మనసుకి ఏం కావాలో ఎప్పుడూ అడగలేదు. నాకు ఏవి ఇష్టమో కనుక్కోలేదు. అన్నీ నీకు నచ్చినవే, నీకు అనిపించినవే చేసావు.

వస్తువులు, సుఖాలే కాదు, మనసు కూడా ముఖ్యం, సంతోషం కూడా ముఖ్యం.

లక్ష రూపాయల మంచం మీద పడుకున్నా నిద్రపట్టదని, ఇష్టపడే మనిషి పక్కన చినిగిన చాప మీద పడుకున్నా నిద్రపోవచ్చని తెలుసుకున్నాను.

తినడానికి గిన్నెల నిండా ఎన్ని ఉన్నాయని కాదు, పంచుకునే మనిషి ఉంటే తినే ఒక్క ముద్ద కూడా శక్తినిస్తుందని తెలుసుకున్నాను.

కుదుపు తెలియని ఇంపోర్టెడ్ కారులో వెళ్ళడం కాదు, చెయ్యి పట్టుకుని నడిచేవాడు కావాలని తెలుసుకున్నాను.

ఏడువారాల నగలు కాదు, ప్రేమతో తెచ్చే చిన్న తిలకం ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకున్నాను.

పొద్దున్నే బెడ్ కాఫీ తెచ్చే నౌకరు కాదు, ఇంకో రోజు నీతో గడిపే అవకాశం వచ్చిందంటూ ప్రేమతో ముద్దు ఇచ్చే మనిషి ఉండాలని తెలుసుకున్నాను.

పైకి నవ్వుతూ, వెనక గోతులు తీసే వందమంది ఫ్రెండ్స్ కంటే కలకాలం తోడుండే ఒక్కడుంటే చాలని తెలుసుకున్నాను.

అందరూ చూస్తున్నారని, ఫొటోస్ తీస్తున్నారని వాటేసుకుని హాయ్ అని, అవసరమున్నప్పుడు ఫోన్ చేస్తే నంబర్ చూసి ఫోన్ సైలెంట్ చేసే పార్టీ ఫ్రెండ్స్ వందమంది కన్నా, అర్ధరాత్రి రమ్మన్నా రెండు సిటీ బస్లు మారి వచ్చే మనిషి ఉండాలని తెలుసుకున్నాను.

పడవంత కారులో వెళ్ళి, లంకంత షాపులో కొనే ప్లాటినం కన్నా, డిస్కౌంట్ ఇస్తున్నారని కబుర్లు చెప్పుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచెళ్ళి కొనుకున్న ప్లాస్టిక్ టేబుల్ కొనుక్కోవడంలో ఉన్న ఆనందం తెలుసుకున్నాను.

పెద్దింటి కోడలు పెద్దింటి కోడలు అంటూ లేనిపోని బాధ్యతలు నాకు అంటగట్టి, వాళ్ల తప్పులకి నన్ను బలి చేస్తూ, నా అస్తిత్వాన్ని సమాధి చేసే చేస్తున్న అయినవాళ్ళ కన్నా, నా కాలిలో ముల్లు గుచ్చుకుంటే తను విలవిలలాడే మనిషి ఉన్నాడని తెలిసుకున్నాను.

తాపం తీర్చుకోవడానికి కాదు శరీరమున్నది, ముందు మనసులు మమేకమవ్వాలన్న సత్యం బోధించిన మనిషున్నాడని తెలుసుకున్నాను.

పనివాళ్ళు చూపించే అభిమానం కన్నా భర్త నించి లభించే అభిమానం తక్కువయినప్పుడు, మొగుడి ఫోన్ కోసం వసంతం కోసం ఎదురుచూసే కోయిల లాగా ఎంత ఎదురుచూసినా ఆ కాల్ రానప్పుడు, ఏడ్చి ఏడ్చి ఇక ఏడవటానికి కన్నీరు లేక, తడారిపోయిన అ కళ్ళతో ఏ అర్ధరాత్రో పడుకుని నిద్రలో ఉలిక్కిపడి లేచి, పక్కన ఎవరూ లేక, ఓదార్పునిచ్చే కన్నీరు రాక, నరకం చూసిన రోజులని మర్చిపోయేలా, ఎడారిలోకి వచ్చిన ఓ పక్షి విసిరిన విత్తనం, ఊహించని వాన పడి, చిగుర్లు తొడిగి, ఇంతింతై అన్నట్టు పచ్చని చెట్టులా మారినట్టు, అడవిగాచిన వెన్నెల్లా మారి, నిశీధిలోకి నెట్టబడిన నా జీవితాన్ని, మళ్ళీ నందనవనంలా చేసిన ఆ మనిషి కోసం వెళ్తున్నాను.

నీ అంత:పురాన్ని వదిలి, పేరుకి కాదు, నిజంగా ప్రేమతో, తన గుండె గదిలో కొలువుంచుకునేలా, తన రెండు గదుల ఇంటికి, తన యాభై గజాల సామ్ర్యాజ్యానికి నన్ను మహరాణిని చేసే ఆ మనిషి కోసం, ఆ చల్లని నీడ కోసం నిన్ను వదిలి వెళ్తున్నాను.

నీ అంత:పుర దాస్యం కన్నా అతని ఇంట్లో దొరికే స్వచ్ఛమైన ఆనందం కోసం, నువ్వు ఏర్పరిచిన కృత్రిమ స్వర్గం కన్నా, అతను పెట్టే రెండు మెతుకుల అన్నాన్ని కళ్ళకద్దుకోవడం కోసం, నువ్వు ఇచ్చిన నకిలీ జీవితం కన్నా, అతని నామమాత్రపు జీతమే గొప్ప అని తెలిసి వెళ్తున్నాను.

చీకటిలో కుంగిపోతున్న నా జీవితానికి ఆలంబనగా నిలిచి స్నేహహస్తాన్నిచ్చిన ఆ చల్లని మనిషి నీడలోకి వెళ్తున్నాను.

వాన నీటిలో మట్టిలా కరిగిపోతున్న నా జీవితాన్ని, తన చేతుల్లోకి తీసుకుని, ఆ మట్టికి మళ్ళీ ప్రాణం పోసిన ఆ శిల్పి కోసం వెళ్తున్నాను.

మీ ఇంద్రభవనంలో మీ అందరి కోసం కొవ్వొత్తిలా కాలిపోతూ, ఏ క్షణమైనా ఆరిపోయేలా ఉన్న నా జీవితానికి మళ్ళీ ఊపిరులూదిన ఆ మనిషి దగ్గరికి వెళ్తున్నాను.

నేను నేనని, నా లాంటి ఆడది నేనొక్కదాన్నేనని, నా బాగోగులు చూసే మనిషి లేనప్పుడు, నా కోసం తపించే మనసు లేనప్పుడు ఎన్ని ఉన్నా, ఏమీ లేనట్టేనని, సంతోషాన్ని, బాధని పంచుకోవటంలో ఉన్న జీవన మాధుర్యాన్ని చవిచూపించిన ఆ మనిషి కోసం వెళ్తున్నాను.

ఇట్లు మోహిత.
చాలా బాగుంది మీరు వ్రాసినది ,, carryon
Like Reply
#19
Super excellent update
Like Reply
#20
కథ ఒకలా వస్తోంది. ఏదో రూపం వస్తున్నట్టుగా ఉంది. చూద్దాం.

తరువాతి భాగం ఇస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి.
Like Reply

Users browsing this thread: 1 Guest(s)