Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
భార్యా భర్తల మధ్య చిన్న చిన్న గోడవలు, అలకలు, కిల్లి కజ్జాల అధ్వర్యంలో సంఘటణలే ఈ కథ
మన కామకథల సమాహారంలో ఆటవిడుపు కలిగించే సంఘటణలు మీ కోసం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
(This post was last modified: 30-04-2023, 10:08 AM by
k3vv3. Edited 1 time in total.)
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
భార్య భర్తల కిల్లికజ్జాలు
(భార్య భర్తల బంధం)
- Devanshika janu
సాయంత్రం ఆఫీస్ నుంచి అలసటగా ఇంటికి వచ్చాడు గౌతమ్.....అప్పుడే ప్రేమగా కిచెన్ లో నుంచి గౌతమ్ కోసం వాటర్ ఒక కప్ కాఫీ పట్టుకొని తీసుకొనివచ్చి సోఫా లో కూర్చుని ఉన్న గౌతమ్ దగ్గరికి వెళ్లి "కాఫీ తీసుకోండి శ్రీవారు..." అని ప్రేమగా ఇస్తుంది గౌతమ్ భార్య నందు అలియాస్ నందిక.....
నందుని అలా చూడగానే గౌతమ్ ఆశ్చర్యపోయి వాటర్ గ్లాస్ తీసుకుని వెంటనే తాగి కాఫీ కప్ తీసుకుంటూ "ఈరోజు ఏంటి ఇలా వరం ఇస్తున్నావు??? డైలీ నేను వచ్చే సరికి ప్రపంచమంతా ఏదో మునిగిపోయినట్టు టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటావు కదా!!!! మరి ఈ రోజు ఏంటి టీవీ కి రెస్ట్ ఇచ్చావు??? పైగా ఇంత ప్రేమగా కాఫీ తీసుకు వచ్చి ఇస్తున్నావు??? ఏమైంది బాగానే ఉన్నావా???" అని అనుమానంగా అడుగుతాడు
నందు వెంటనే అలక గా మొహం పెట్టి "మీకన్నీ వేళకోళాలేనా గౌతమ్??? ఏదో అలసిపోయి ఆఫీస్ నుంచి వచ్చారని కాఫీ ఇస్తే ఇలా మాట్లాడుతారా??? నేను మీతో మాట్లాడను పోండి..... నేను అలిగి బుంగమూతి కూడా పెట్టుకున్నాను...." అని గౌతమ్ పక్కన కూర్చొని మొహం వేరే వైపు తిప్పుకొని అంటుంది
గౌతమ్ నవ్వుతూ నందుని పట్టించుకోకుండా కాఫీ తాగుతూ రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తాడు.....
నందు అది చూసి "నేను అలిగానని చెప్పిన మీరు పట్టించుకోరా??? ఇంతేనా మీకు నా మీద ఉన్న ప్రేమ!!!" అని చిరుకోపంగా అడుగుతుంది
"హలో నందు గారు నేను డైలీ ఇలాగే ఆఫీస్ కి వెళ్లి వస్తాను.... నువ్వు డైలీ ఇలాగే చేస్తున్నావా???? నేను వచ్చేసరికి నువ్వు పాప్‌కార్న్ తింటూ సోఫాలో కూర్చుని టివి సీరియల్ చూస్తూ అందులోనే మునిగిపోయే దానివి....(జస్ట్ నార్మల్‌గా అన్నాను ఎవరినీ ఉద్దేశించి కాదు ఫీలవకండి.....) ఈ రోజు ఇలా చేశావంటే నాకు ఏదో టెండర్ పెట్టావు అని అర్థమవుతుంది..... అనవసరంగా నీతో మాట్లాడి నేను ఎందుకు నా పర్స్ కి పంచర్ వేయించుకోవాలి??? అందుకే నేను సైలెంట్ గా క్రికెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను.... డిస్టర్బ్ చేయకు...." అని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి రిలాక్స్‌గా కూర్చొని క్రికెట్ ని చూస్తూ ధోని సిక్స్ కొట్టు ఫోర్ కొట్టు అని చేతులు ఊపుతూ యాక్టింగ్ చేస్తూ అంటాడు
నందు గౌతమ్ మాటకి షాక్ అయ్యి "నా మనసులో ఉన్నది గౌతమ్ కి ఎలా తెలిసింది??? ఇప్పుడు ఏం చేయాలి????" అని గారంగా గౌతమ్ మెడ చుట్టూ చెయ్యి వేసి గౌతమ్ అని ప్రేమగా పిలుస్తుంది.
గౌతమ్ వెంటనే తలతిప్పి తన గుండెల మీద చెయ్యి వేసుకుని నందు వైపు చూస్తూ "నువ్వు ఇంత ప్రేమగా మాట్లాడుకు నాకు గుండెల్లో నొప్పి వస్తుంది.... ప్లీజ్" అని దీనంగా మొహం పెట్టి అంటాడు
నందు గౌతమ్ మాటలు పట్టించుకోకుండా గౌతమ్ బుగ్గ మీద ముద్దులు పెడుతూ "ఈ రోజు ఫస్ట్ తారీకు కదా!!!! మీకు సాలరీ వచ్చి ఉంటుంది తెచ్చారా???" అని ప్రేమగా అడుగుతుంది
గౌతమ్ నందు మాయలో పడిపోయిన వాడే శాలరీ అనగానే స్టిఫ్ గా కూర్చుని "ఎందుకు ఇంత చేస్తున్నావు అనుకున్నాను ఇందుకా??? అయినా నా సాలరీ తో ఏం పని??? నువ్వు ఇప్పుడు నా సాలరీ తో ఏం చేయాలని అనుకుంటున్నావు????" అని అనుమానంగా అడుగుతాడు
నందు నవ్వుతూ "పక్కింటి ఆంటీతో ఇంటికి వెళ్లాను కదా అక్కడ మాఘ మాసమని చందనాబ్రదర్స్ లో ఆఫర్ పెట్టారు!!! 25 వేల పట్టు సారీ జస్ట్ 10000 ఇస్తున్నారు!!! ప్లీజ్ గౌతమ్ నాకు ఒక టెన్ థౌసండ్ ఇవ్వవా నేను ఆ పట్టు సారీ కొనుక్కుంటాను.... నాకు ఆ సారి బాగా నచ్చింది" అని ముద్దుగా మొహంపెట్టి అంటుంది
గౌతమ్ వెంటనే పైకి లేచి పరిగెత్తుకుంటూ కిచెన్ లోకి వెళ్లి తను తాగిన కప్ కాఫీ వాంతి చేసుకుంటూ ఉంటాడు....
నందు కూడా కంగారుగా వెనకే వచ్చి గౌతమ్ అలా వాంతి చేసుకోవడం చూసి తన చెవులు మూసి పట్టుకుంటుంది....
నందు వాంతి చేసుకున్నాక మౌత్ వాష్ చేసుకుని నందు కంగారుగా "ఏమైంది గౌతమ్???" అని అడుగుతూ ఉంటే
"నీ కాఫీ నీకు ఇచ్చేశాను ఇక నువ్వు నన్ను డబ్బులు అడగకు.... అయినా 10 వేలు పెట్టి ఎవరైనా సారీ కొనుక్కుంటారా??? నువ్వు నీ పిచ్చి కాకపోతే!!!! ఈ మధ్య నీకు పైత్యం మరీ ఎక్కువ అవుతుంది...." అని సీరియస్ గా చెప్పి రూమ్ కి వెళ్ళిపోతాడు....
నందు గౌతమ్ చెప్పిన మాటకి షాక్ అయ్యి "ఇదేంటి ఇలా అనేసాడు??? గౌతమ్ ఏదైనా కనీ నేను మాత్రం ఆసారీ కొనుక్కోవాల్సిందే!!!" అని తనకి తాను శపధం చేసుకుని గౌతమ్ వెనకే వెళ్తుంది
స్వగతం
(ఎవరిని ఉద్దేశించి రాయట్లేదు.... మీరు దీనిని మీ మనసుకి తీసుకొని హార్ట్ అవ్వకండి....
ఫస్ట్ టైం హాస్యం ట్రై చేస్తున్నాను.... ఎలా ఉందో చెప్పండి???? వీలున్నప్పుడు త్వరలోనే కంప్లీట్ చేస్తాను....)
అప్పటికే గౌతమ్ ఫ్రెష్ అవడానికి టవల్ తీసుకొని బాత్ రూం లోకి వెళ్ళి పోతాడు....
నందు అది చూసి కోపంగా రుసరుసలాడుతూ "నేను చిన్న చీర కొనిపించమంటే ఇంత రాద్ధాంతం చేస్తారా??? ఎలా మీ చేతనే ఆ చీర కొనిపించుకోవాలో నాకు బాగా తెలుసు...." అని కన్నింగ్ గా నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తుంది
గౌతమ్ నందు ఇంకా ఏమీ చేయలేదు ఏంటా అని ఆలోచిస్తూనే బయటికి వచ్చి సోఫాలో కూర్చుని కిచెన్ లో నుంచి సౌండ్స్ రావటం చూసి "ఇదేంటి ఈ రోజు ఏదో టెండర్ పెట్టే లాగా ఉంది!!!! ఏదైనా కానీ ఈరోజు మాత్రం దీనికి దొరకకూడదు...."అనుకుంటూ టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ ఉంటాడు
ఇంతలో తన ఫోన్ కి తన బాస్ నుంచి మెయిల్ వస్తుంది ఆ మెయిల్ ఓపెన్ చేసి "వీడు ఒకడు నా ప్రాణానికి రాత్రి పూట కూడా వర్క్ చేయమని ఇస్తాడు సచ్చినోడు...."అని అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి ల్యాప్‌టాప్ తీసుకొని వచ్చి సోఫాలో కూర్చుని తన బాస్ చెప్పిన వర్క్ చేసుకుంటూ ఉంటాడు
ఇదంతా ఒక కంట నందు గమనిస్తూనే వంట పూర్తి చేసి ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్లి ఫ్రెష్ అయి గౌతమ్ కి నచ్చే లాగా ఎల్లో కలర్ ప్లేన్ పల్చటి శారీలో నుంచి తన అందాలన్నీ కనిపించేలా కట్టుకొని లైట్ మేకప్ వేసుకుని కనుబొమ్మల మధ్యలో రెడ్ కలర్ బింది పెట్టుకొని వయ్యారంగా నడుచుకుంటూ గౌతమ్ వైపు హస్కీగా ఒక లుక్ ఇచ్చి నవ్వుకుంటూ మనసులో "మీరు ఇప్పుడు ఎలా లైన్ లోకి రారో నేను చూస్తాను???" అని తన నడుము తిప్పుకుంటూ నడిచి కిచెన్ లోకి వెళ్లి పోతుంది
వర్క్ చేసుకుంటూనే గౌతమ్ నందు పెర్ఫ్యూమ్ స్మెల్ కి తలపైకెత్తి నందు వైపు చూసేసరికి అలా తనకి నచ్చేలా రెడీ అయ్యి అందాల విందు చేస్తుంటే సొల్లు కార్చుకుంటూ చూస్తూ "ఇదేంటి ఇలా రెడీ అయ్యింది కచ్చితంగా దీనికి టెమ్ట్ అయ్యేలా ఉన్నాను..... ఈరోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మాయలో పడకూడదు గౌతమ్.... నువ్వంటే ఏంటో దానికి తెలియాలి...."అని అనుకుంటూ తనకి తెలియకుండానే తన కళ్ళు నందు వైపు వెళ్తూ ఉంటాయి(అందరు మెగుళ్లు పెళ్ళాల దగ్గర అంతే అనుకుంటారు కానీ భార్య అందాన్ని చూసిన ఏ మెగుడైనా ఆగగలడా???)
ఇదంతా గమనిస్తూ ఉన్న నందు నవ్వుతూ గౌతమ్ వైపు చూసేసరికి గౌతమ్ తేరుకొని"ఛ ఏంటి ఇంత వీక్ అయిపోతున్నాను??? ఇలా నువ్వు ఉండకూడదు గౌతమ్..."అని తనని తాను మోటివేట్ చేసుకుంటూ కాన్సెంట్రేషన్ గా వర్క్ చేయడానికి ట్రై చేస్తాడు
అప్పుడే నందు డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వయ్యారంగా నడుచుకుంటూ గౌతమ్ దగ్గరికి వెళ్లి "శ్రీవారు వంట రెడీ మీరు వస్తే తిందాం...." అని నడుము కనిపించేలా బొడ్డు కిందకి చీర కట్టుకొని అడుగుతుంది
గౌతమ్ నందు వైపు ఒకసారి చూసి తన చూపు నందు నడుము మీద పడి అక్కడి నుంచి రాను అని మారం చేస్తుంటే అటు వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు.....
నందు కి గౌతమ్ చూపు ఎక్కడుందో అర్థమై ముసిముసిగా నవ్వుకుంటూ "శ్రీవారు మిమ్మల్నే పిలిచేది....ఇక వర్క్ ఆపేసి భోజనం చేద్దాం వస్తారా??? నాకు చాలా ఆకలిగా ఉంది...."
అని ముద్దుగా మొహంపెట్టి అడుగుతుంది
గౌతమ్ అప్పుడు తేరుకొని మనసులో "ఛీ వెధవ కొంచెం సేపు కూడా దీనిని చూడకుండా ఉండలేవా???? అయినా ఇది మాత్రం ఎందుకు ఇంత అందం గా రెడీ అయ్యింది??? దీని నడుము చూడు రా రా అని నన్ను ఊరిస్తుంది.... ఈరోజు ఇది నన్ను కచ్చితంగా దీని అందంతోనే చంపేలా ఉంది అనుకుంటూ "ఆ పద పద" అని కంగారుగా లాప్టాప్ షట్ డౌన్ చేసి నందు తోపాటు డిన్నర్ చేయటానికి వెళ్తాడు
నందు నవ్వుతూ గౌతమ్ పక్కనే వయ్యారంగా నిలబడి నడుము కనిపించేలా చీర కొంగు బొడ్లో దోపి తను వండిన వంటలన్నీ ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది....
గౌతమ్ చూపు నందు నడుము నుంచి రాను అంటూ మొరాయిస్తూ చేతులు కుదురుగా ఉండకుండా నందు నడుము దగ్గరికి వెళ్ళాలి అని తాపత్రయ పడుతూ తనకి తెలియకుండానే చెయ్యి నందు నడుము దగ్గరికి వెళ్లి తన నడుముని చుట్టు కోవటానికి ఇంచ్ దూరంలో ఉంది అనగా అదంతా ఓరకంట గమనిస్తూనే ఉన్న నందు నవ్వుతూ "భోజనం చేయండి శ్రీవారు ఎంత సేపు అలా చూస్తారు???" అని అంటుంది
నందు వెంటనే స్పృహ లోకి వచ్చి "నేనేం చూశాను నేనేమి చూడలేదు...." అని కంగారుగా చెప్పి మనసు లో "చి చి వెధవ ఏంటిది ఇది పక్కన ఉంటే నేను పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నాను.... ఎలా ఉండాలి అనుకుంటూ ఎలా ఉన్నాను???"అని అనుకుంటూ నందు ఇంకా పక్కనే ఉండటం చూసి "నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుని నాతో పాటు డిన్నర్ చెయ్ నందు... మళ్లీ లేటవుతుంది..."అని సీరియస్ గా మొహం పెట్టి ఎదురుగా ఉన్న చైర్ వైపు చూపిస్తూ చెప్తాడు
"శ్రీవారు నేను కూడా మీతో పాటే తింటాను మీరు నాకు గోరుముద్దలు తినిపించండి.... మనం ఇలా ప్రేమగా తిని ఎన్ని రోజులు అవుతుంది...." అని అమాయకంగా మొహం పెట్టి అంటుంది
నందు అలా అడగగానే గౌతమ్ కరిగిపోయి "సరే దా!!!" అని పక్కనే చైర్ లో నందుని కూర్చో పెట్టి అన్నం కలిపి తన నోటి దగ్గరికి తీసుకువెళ్లి నందు నోట్లో భోజనం పెట్టగానే నందు మత్తుగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ గౌతమ్ వెళ్ళని తన పెదాల మధ్యలో ఉంచి వాటిని లింక్ చేస్తూ భోజనం చేస్తుంది
నందు చేసిన పనికి గౌతమ్ వంట్లో నరాలన్నీ ఒక్కసారి జివ్వుమని వెంటనే చెయ్యి వెనక్కి తీసుకొని తడబడుతూ " న న నందు ఏం చేస్తున్నావు???" అని కంగారుగా అడుగుతాడు
నందు అమాయకంగా మొహం పెట్టి "నేనేం చేశాను శ్రీవారు మీరు తినిపిస్తుంటే తింటున్నాను అంతే కదా!!!!! ముందు పెట్టండి చాలా ఆకలిగా ఉంది...." అని అడుగుతుంది
గౌతమ్ నందు మొహం చూసి కరిగిపోయి నందు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా తనకి భోజనం తినిపిస్తూ నే తను కూడా తిని హ్యాండ్ వాష్ చేసుకుంటాడు....
"శ్రీవారు ఇక వెళ్లి పడుకుందామా నాకు నిద్ర వస్తుంది...." అని వయ్యారంగా ఒళ్ళంతా విరుస్తూ అంటుంది
తనాల వొళ్ళు విరుస్తున్నప్పుడు కనీ కనిపించని అందాలు గౌతమ్ నీ ఊరిస్తూ ఉంటే గౌతమ్ గుటకలు మింగుతూ నందు వైపు చూస్తూ ఇప్పుడు లోపలికి వెళ్తే తన పరిస్థితి ఏంటో చెప్పకనే చెబుతున్న నందు అందాల వైపు చూసి "నాకు అర్జెంట్ వర్క్ ఉంది నందు నువ్వు వెళ్లి నిద్రపో.... నేను కొంచెం సేపు ఆగి వస్తాను...." అని తడబడుతూ అంటాడు
నందు మనసులోనే నవ్వుకుంటూ "పర్వాలేదు శ్రీవారు నేను మీ కోసం వెయిట్ చేస్తాను మీరు మీ వర్క్ చేసుకోండి...." అని అంటుంది
గౌతమ్ గుటకలు మింగుతూ "వద్దులే నందు ఈ రోజుకి నువ్వు రెస్ట్ తీసుకో!!!!" అని చెప్పి సోఫాలో కూర్చొని లాప్టాప్ పట్టుకుంటాడు
నందు నవ్వుతూ గౌతమ్ పక్కన కూర్చుని "మీకు తెలుసు కదా శ్రీవారు మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు అని!!! మీరు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను...." అని కాళ్ళు టీపాయ్ మీద పెట్టి ఒక సైడ్ వయ్యారంగా కూర్చుని టీవీ ఆన్ చేసి రొమాంటిక్ సాంగ్స్ పెట్టి వాటిని హమ్ చేస్తూ ఉంటుంది
తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మనీ ప్రేమలో తనాల హం చేస్తూ ఉంటే గౌతమ్ వర్క్ చేయడం కూడా ఆపేసి నందు తేనెలూరే పెదాలని తన ఒంపుసొంపులను చూస్తూ ఉంటాడు....
నందు అదంతా గమనిస్తూనే పైకి లేచి గౌతమ్ చేయి పట్టుకొని తనని కూడా పైకి లేపి గౌతమ్ చేయిని తన నడుము మీద గౌతమ్ చెయ్యి వేసుకుని గౌతమ్ భుజం మీద చేయి వేసి తన కళ్ళలోకి మత్తుగా చూస్తూ డాన్స్ చేస్తుంది..... గౌతమ్ కూడా నందు కి పడిపోయి తనతోపాటు డాన్స్ చేస్తూనే తన చేతితో నందు శరీరాన్ని తడిమేస్తూ ఉంటాడు....
గౌతమ్ ఇక ఆగలేక టీవి కూడా ఆఫ్ చేయకుండా నందు ని తన చేతులలోకి ఎత్తుకొని రూమ్ లోకి తీసుకు వెళ్లి రూమ్ డోర్ క్లోజ్ చేసి నందుని బెడ్ మీద పడుకోబెట్టి తను మీదకి చేరిపోతాడు.....
నందు వెంటనే గౌతమ్ నుంచి విడిపించుకొని "శ్రీవారు ఆగండి నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి అవి తీరిస్తే మీకు ఈ అందాల విందు చేస్తాను.... లేదంటే మీరు ఆ పక్క నేను ఈ పక్క పడుకుందాము..." అని తన గోర్లు చూసుకుంటూ యాటిట్యూడ్ గా అంటుంది
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
The following 14 users Like k3vv3's post:14 users Like k3vv3's post
• Arjunkrishna, Bvrn, chakragolla, godofgoud, K.R.kishore, K.rahul, mahi, naree721, poorna143k, ramd420, sri7869, Swethabuddy525, taru, viswa
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
గౌతమ్ వెంటనే నందు కాళ్లు పట్టి లాగేసి మంచం మీద పడేసి తన మీదకి చేరిపోయి "ఏమైనా రేపు చూసుకుందాం ... ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదు...." అంటూ కసిగా తన పెదవులు అందుకోవడానికి ముందుకు వస్తాడు
నందు వెంటనే గౌతమ్ నోటికి తన చేతిని అడ్డుపెట్టి "అలాంటిది ఏదైనా కానీ నా డిమాండ్స్ మీరు ఒప్పుకున్నా కే!!!! లేకపోతే నా సంగతి తెలుసు కదా!!!" అని వార్నింగ్ టోన్ లో అంటుంది
గౌతమ్ అసహనం గా "చెప్పు నీ డిమాండ్స్ ఏంటో???" అంటూ తన చేతులతో నందు శరీరాన్ని తడిమేస్తూ నడుము దగ్గర చీర పక్క జరిపి అక్కడ ముద్దులు పెడుతూనే అడుగుతాడు
నందు గౌతమ్ చేసే మాయలో పడి పోకూడదని గట్టిగా అనుకుంటూ "ముందు మీరు నా పైన లేవండి.... ఇలా ఉంటే నేను ఎలా చెప్పగలను???" అని బలవంతంగా గౌతమ్ ని పక్కకు జరిపి నందు పైకి లేచి బెడ్ మీద బాసిమఠం వేసుకొని కూర్చొని గౌతమ్ వైపు చూస్తుంది.
గౌతమ్ కూడా చిరాకుగా "చెప్పవే ఇప్పుడు కానీ నువ్వు త్వరగా నీ డిమాండ్స్ చెప్పకపోతే నీకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వను...." అని మధ్యలో ఆపేసింది అని సీరియస్‌గా అంటాడు
"నాకు మీరు నేను అడిగిన సారీ కొనివ్వాలి.... అది రేపే!!!" అని క్యూట్ గా మొహం పెట్టి అడుగుతుంది
అప్పటివరకు నందు అందాలను చూస్తూ వాటిని ఎప్పుడు ఆస్వాదిద్దామా అని వేరే లోకంలో ఉన్న గౌతమ్ వెంటనే ఈ లోకంలోకి వచ్చి "ఏంటి పది వేల రూపాయల సారీ కొనివ్వాలా!!! అవసరమా నందు మనకి??? నువ్వు ఎప్పుడో ఒకసారి కట్టే దానికి పది వేలు పెట్టడం ఎందుకు చెప్పు??? వాటి బదులు వేరే ఏదైనా ఇంట్లోకి తీసుకుందాం.... ఇప్పుడు మాత్రం నన్ను ఆపకు...."అని అంటూ నందు మీదకు రాబోతాడు
"మీరు ఏదైనా చెప్పండి నాకు మాత్రం ఆ సారీ ఖచ్చితంగా కావాలి..... కొనిస్తానంటేనే ఈ నైట్ మొత్తం మీకు ఇస్తాను లేకపోతే మీరు సైలెంట్‌గా అన్ని మూసుకొని దుప్పటి ముసుగు తన్ని పడుకోండి.... నేను వేరే సైడ్ తిరిగి పడుకుంటాను..." అని సీరియస్ గా ఉంటుంది
"అంతేనా ఇంకేమీ లేదా???" అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు
"హ ఇంకొక ఆప్షన్ ఉంది కావాలంటే మీ డెబిట్ కార్డు నాకు ఇచ్చి పిన్ నెంబర్ చెప్పండి.... నేనే వెళ్లి ఆ సారీ కొనుక్కొని ఎగస్ట్రా ఇంకా ఏమైనా నచ్చితే అవి కూడా కొనుక్కొని వస్తాను.... అలా మీకు ఓకే అయితే నాకు ఇప్పుడు ఓకే...." అని నవ్వుతూ అంటుంది
గౌతమ్ కోపంగా "అవసరం లేదు నేను అన్నీ మూసుకుని ముసుగు తన్ని పడుకుంటాను.... నువ్వు కూడా సైలెంట్ గా పడుకో...."అని చెప్పి ముసుగేసుకొని "ఛ ఇది నన్ను దీని అందాలన్నీ ఆరబోస్తూ బ్లాక్ మెయిల్ చేస్తుంది.... ఇప్పుడు దీనికి లొంగితే నా డెబిట్ కార్డ్ కి చిల్లు పడుతుంది అవసరమా చెప్పు???? ఈ ఒక్క పూట నీ ఆత్రాన్ని ఆపుకుంటే రేపట్నుంచి దానికి నువ్వు అంటే ఏంటో చూపించచ్చు" అని తనను తాను మోటివేట్ చేసుకుంటూ ఉంటాడు
నందు ఒక్క క్షణం గౌతమ్ మీద కోపం వచ్చి వెంటనే కన్నింగ్ నవ్వుకుంటూ "మీరు ఎలా దారిలోకి నేను చూస్తాను???" అనుకుంటూ గౌతమ్ కి దగ్గరగా పడుకుని "ఏంటి ఈరోజు అసలు గాలే ఆడటంలేదు.... ఈ చీర వల్ల చెమటలు కూడా పోస్తున్నాయి.... చాలా చిరాకుగా ఉంది...." అని తన పైట తీసి కావాలనే గౌతమ్ మొహం మీద వేస్తుంది
గౌతమ్ మొహం మీద పడిన చీరని స్మెల్ చేస్తూ అది మత్తెక్కించే అరోమా ఫ్లేవర్ వస్తుంటే "ఇదేంటి ఇది నన్ను పూర్తిగా పడేయటానికి ఫుల్ గా రెడీ అయింది గా!!!! ఇప్పుడు ఇది ఏ పొజిషన్ లో ఉంది....." అనుకుంటూ తన పొజిషన్ ఊహించుకొని గుటకలు మింగుతూ మనసు నందుని దగ్గరికి తీసుకోమని ఆత్రం పడుతూ ఉంటే అయినా కూడా తన ఫీలింగ్స్ ని ఆపుకొని అంతే పడుకుని ఉంటాడు
నందు ఇక ఇలా కాదని వెంటనే గౌతమ్ చుట్టూ చేయి వేసి "ఇదేంటి శ్రీవారు ఈరోజు ఇలా పడుకున్నారు???? నాకు మీ గుండెల మీద పడుకో పోతే నిద్ర రాదు అని తెలుసు కదా!!!!"అని అంటూ గౌతమ్ ని బలవంతంగా వెల్లకిలా పడుకోబెట్టి తన గుండెల మీద పడుకొని గౌతమ్ చేతిని తన నడుము మీద వేసుకొని గౌతమ్ గుండెల మీద సున్నాలు చుడుతూ ఉంటుంది
గౌతమ్ గుటకలు మింగుతూ నందు పిడికెడంత నడుముని చేతుల్లో ఇమిడిపోతుంటే దానిని పిసికేస్తూ నందు వైపు తిరిగి గట్టిగా హగ్ చేసుకొని "సరే రేపు వెళ్లి ఆ చీర కొనుక్కుందాం.... కానీ ఈ నైట్ మాత్రం నువ్వు నన్ను ఆపకూడదు..." అంటూ నందుని తనలో కలిపేసుకుంటే ఉంటాడు
నందు కూడా ఆనందంగా గౌతమ్ కి సహకరిస్తూ నైట్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు....
@@@@@@@@
తర్వాత రోజు సండే అవటంవలన ఉదయాన్నే ఆరు గంటలకే నందు లేచి ఇంటి పనంతా అయిపోగొట్టి ఏడున్నరకల్లా రూమ్ లోకి వెళ్ళేసరికి గౌతమ్ నైట్ ఏ పొజిషన్లో ఉన్నాడో ఇప్పుడు అదే పొజిషన్ లో పడుకొని నిద్ర పోతూ ఉంటాడు.....
నందు గౌతమ్ ని చూసి నవ్వుతూ "గౌతమ్ గౌతమ్ లేవండి షాపింగ్ మాల్ కి వెళ్లాలి కదా!!!! లేట్ అవుతుంది రెడీ అవ్వండి..." అని గౌతమ్ ని తడుతూ ఉంటుంది
"ఎందుకు నందు షాపింగ్‌కి వెళ్ళడం??? నైట్ అంతా నీతో కష్టపడి అలసిపోయాను... ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు.... చాలా నిద్ర వస్తుంది.... నాకు టిఫిన్ కూడా వద్దు ఆఫ్టర్నూన్ లంచ్ చేసేస్తాను బాగా ఎనర్జీ వచ్చేవి వండు.... ఈరోజు కూడా నైట్ ఔట్ చేయాలి కదా!!!" అని కళ్ళు తెరవకుండానే అంటాడు
ఆ మాటకి నందు కోపంగా గౌతమ్ వీపు మీద గట్టిగా ఒక దెబ్బ వేసి "రాత్రి ఏం చెప్పారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు???? ఇప్పుడు మీరు లేచి రడీ అయ్యి నన్ను షాపింగ్ మాల్ కి తీసుకువెళ్లండి లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా!!!! మర్యాదగా లేచి రెడీ అవ్వండి..." అని వార్నింగ్ టోన్ లో అంటుంది
నందు మాటలకి గౌతమ్ రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుని "కొంచెంసేపు ఫీలింగ్స్ ఆపుకొని ఉంటే ప్రశాంతంగా నీకు నచ్చిప స్మార్ట్ వాచ్ కొనుక్కునే వాడివి.... ఇప్పుడు చూడు నీ ఆత్రానికి ఏం జరిగిందో???"అని మనసులోనే అనుకుని బయటికి అనే ధైర్యం లేక సైలెంట్ గా ఫ్రెష్ అయి టిఫిన్ చేసి షాపింగ్ మాల్ కి వెళ్తారు
నందు నవ్వుతూ తనకి నచ్చిన సారీ తీసుకొని ఇంకా చూస్తూ ఉంటే గౌతమ్ బలవంతంగా నందుని కౌంటర్ దగ్గరికి తీసుకు వస్తూ "ఇంకా కొనుక్కొని ఏం చేసుకుంటావు నందు??? ఇప్పటికే పది వేలు వేస్ట్ అయ్యాయి కదా!!! ఇంటికి వెళ్దాం లంచ్ టైం అవుతుంది...." అని సీరియస్ గా చెప్పి బలవంతంగా నందుని ఇంటికి తీసుకువస్తాడు
నందు సంతోషంగా సారీ తీసి తన భుజం మీద వేసుకొని అద్దం ముందు నిలబడి చూసుకుంటూ వెంటనే గౌతమ్ దగ్గరకు వచ్చి "ఎలా ఉంది గౌతమ్???బాగుంది కదా!!! ఎంతైనా నా సెలెక్షన్ సూపర్ ఉంటుందిలే!!!"అని నవ్వుతూ అంటుంది
గౌతమ్ వెంటనే కోపంగా "ముందు ఆ సారీ నా ముందు నుంచి తియ్యి..... రాత్రి జస్ట్ ఒక ఐదు నిమిషాలు నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని ఉంటే నాకు ఇష్టమైన స్మార్ట్ వాచ్ కొనుకునే వాడిని ఇప్పుడు నీకు సారీ కొనివ్వాల్సి వచ్చింది..... మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు నేను దానికోసం ఆగాలి...." అని అంటాడు
నందు బుంగమూతి పెట్టుకుని "అదేంటి గౌతమ్ అలా అంటావు నాకు ఒక సారీ కొనడానికి నీకు అంత కష్టంగా ఉందా??? పో నేను అలిగాను నీతో మాట్లాడను..." అని చెప్పి రూమ్ లోకి వెళ్లి సారీ భద్రంగా దాచి మంచం మీద పడుకొంటుంది
గౌతమ్ వెంటనే పైకి లేచి "నేనెందుకిలా బిహేవ్ చేశాను??? పాపం నందు ఎంత ఫీల్ అయింది.... ఒక్క సారీ కొనుక్కుంటే ఏం పోతుంది???"అని అనుకుంటూ వెంటనే తన దగ్గరికి వెళ్లి తన పక్కనే పడుకొని తనని వెనుకనుంచి చేసుకుని హగ్ "ఏదో స్మార్ట్ వాచ్ కనుక్కోలేకపోయాను అని కొంచెం డిసప్పాయింట్ అయ్యాను.... అందుకే అలా మాట్లాడాను దానికే అంతా కోపమా నా మీద???"అని అంటూ తన వీపు మీద ముద్దులు పెడుతూ ఉంటాడు
"నాకు తెలుసు గౌతమ్ నీకు నాకు సారీ కొనివ్వడం నీకు కొంచెం కూడా ఇష్టం లేదు.... అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నవు???? రాత్రి నీకు కావలసింది ఇచ్చాను కదా!!!! అందుకే నీ ముందు చులకన అయ్యాను...."అని చిరు కోపం గా అంటుంది
నందు అన్న మాటలకి గౌతమ్ నోరు తెరిచి "నువ్వెక్కడ ఈజీగా ఇచ్చావే??? నీకు నచ్చిన సారీ కొనిస్తా అంటే ఒప్పుకున్నావు కానీ!!! అయినా ఇప్పుడేమైంది నువ్వు అలగటానికి??? ఆ సారీ నీకు చాలా బాగుంది.... నేను నెక్స్ట్ మంత్ స్మార్ట్ వాచ్ కొనుక్కుంటానులే డోంట్ వర్రీ.... ఇప్పుడు నీ అలక తీరాలంటే నేనేం చేయాలి చెప్పు...." అని తన చేతులతో నందు నడుముని వత్తేస్తూ అడుగుతాడు
"అయితే ఈ పూట వంట మీరే చెయ్యండి.... నా దగ్గర షాపింగ్ చేసే సరికి ఓపిక లేదు..." అని అంటుంది
గౌతమ్ ఇక చేసేదేమీ లేక "సరేలే ఏం చేస్తాం తప్పదు.... భార్య అలక తీర్చాలి కదా!!!!"అని డ్రెస్ చేంజ్ చేసుకుని నైట్ ట్రాక్ వేసుకుని కిచెన్ లోకి వెళ్లి వంట చేసుకుంటూ "ఏంటో నా బతుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా ఈ బ్యాచిలర్ బ్రతుకు మాత్రం మారలేదు.... పెళ్ళాం వచ్చాక అయినా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇదేమో ఇలా తయారయ్యింది..... అయినా ఇదంతా నువ్వు చేసుకున్నదే లేరా గౌతమ్!!! ఇప్పుడు ఎన్ని అనుకొని ఏమి లాభం???"అని నిట్టూరిస్తూ వంట చేస్తూ ఉంటాడు
నందు గౌతమ్ వంట చేస్తుంటే కిచెన్ దగ్గర ఉండే తను అన్న మాటలకి నవ్వుకుంటూ వెంటనే సీరియస్ గా మొహం పెట్టి "మరి ఎందుకు పెళ్లి చూపుల్లో చూడగానే ఇష్టపడి మరీ పెళ్లి చేసుకున్నారు??? నా గురించి అంత అర్థమయ్యేలా చెప్పాను కదా!!! అయినా పెళ్లి చేసుకున్నాక నన్ను ఇన్ని మాటలు అంటూ రాచి రంపాన పెడుతున్నారు???" అని ముక్కు చీదుతూ అడుగుతుంది
నందు వాయిస్ కి టెన్షన్ గా వెనక్కి తిరిగిన గౌతమ్ నందు తన మాటలు వినిందని అర్థమై నందు రియాక్షన్ కి కళ్ళు తేలేసి "నేను అన్న మాటల్లో అంత అర్థం ఉందా నందు??? నాకు తెలియదు నేను ఏదో జస్ట్ నన్ను నేను అనుకున్నాను.... నిన్నెందుకు అంటాను నువ్వు నా జీవితాన్ని మార్చడానికి వచ్చిన దేవతవి, నా బంగారానివి....." అని నందుని మాటలతోనే కోటలు కట్టేసి అందులో మహారాణిని చేస్తాడు....
నందు ఒక కనుబొమ్మ పైకెత్తి యాటిట్యూడ్ గా గౌతమ్ వైపు చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకుని "ఇప్పుడు నిజం చెప్పండి...." అని సీరియస్‌గా అడుగుతుంది
గౌతం అమాయకంగా మొహం పెట్టి "ప్రామిస్ బంగారం నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా??? రాత్రంతా చూపించాను కదా నా ప్రేమ నీ మీద ఎంత ఉందో???" అని కొంటెగా నందు కళ్ళల్లోకి చూస్తూ అంటాడు
గౌతమ్ చూపులకి నందు సిగ్గుపడుతూ " ఛీ పోండి గౌతమ్ ఏంటా మాటలు?? నేను ఏదో మీకు వంట లో హెల్ప్ చేద్దామని వస్తే మీరు మీ మాటల తోనే నన్ను మునగచెట్టు ఎక్కించడానికి చూస్తున్నారు...." అని నవ్వుతూ అంటుంది
నందు సిగ్గు పడటం చూసి గౌతమ్ మనసులో "హమ్మయ్య తప్పించుకున్నాను..." అనుకుని "అవునా అయితే ఇంకా అక్కడే ఉన్నావు ఏంటి??? ఇక్కడికి రా...." అని చెప్పి నందు చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని తనను వెనకనుంచి హగ్ చేసుకొని నందు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని నందు చేతులతోనే కూరగాయలు కట్ చేస్తూ తన చేతులతోనే వంట చేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఒక గంటకి ఇద్దరూ కలిసి వంట పూర్తి చేస్తారు.....
ఇద్దరూ ఒకరికొకరూ తినిపించుకొని "ఇక పడుకుందామా నందు??? మళ్ళీ నైట్ నిద్రపోవటానికి లేట్ అవుతుంది...." అని కొంటెగాచెప్పి ఇద్దరు వెళ్లి హాయిగా నిద్ర పోతారు
@@@@@@@@
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
గౌతమ్ వాళ్లది గుంటూరు....గౌతమ్ బీటెక్ చేసి క్యాంపస్ సెలక్షన్స్ లోనే ఇన్ఫోసిస్ లో జాబ్ కొట్టి ఇప్పటికీ అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా వర్క్ చేస్తున్నాడు.... ఇన్ఫోసిస్ లో జాయిన్ అయినా రెండు సంవత్సరాలు తర్వాత తన అమ్మానాన్నలు గౌతమ్ కి పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తూ ఉండగా గౌతమ్ నాన్నగారి ఫ్రెండ్ దాదాపు పది సంవత్సరాల తర్వాత ఒక బంధువుల పెళ్ళిలో కలిసి ఇద్దరూ మాట్లాడుకుని తన కూతురు నందు కి కూడా సంబంధాలు చూస్తున్నాము ఆమె కూడా డిగ్రీ చదివిందని పై చదువులు చదివించ లేక పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నామని అంటారు....
గౌతమ్ నాన్నగారు కూడా గౌతమ్ కి సంబంధాలు చూస్తున్నామని నందు నాన్నగారికి ఇష్టమైతే గౌతమ్ కి నందుని ఇచ్చి పెళ్లి చేద్దామని అడుగుతారు....
గౌతమ్ నాన్నగారు కూడా ప్రైవేట్ ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నంతలో హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు.....
నందు నాన్నగారు కూడా అలాగే ప్రైవేట్ ఆఫీసులో గుమస్తాగా వర్క్ చేస్తూ ఉంటారు..... ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు మొదటి అమ్మాయి మన హీరోయిన్ నందిక రెండవ అమ్మాయి మౌనిక.... నందు నాన్నగారు ఉన్నంతలోనే బ్రతుకుతూ మౌనిక ఇంటర్ చదువుతుంటే నందుని డిగ్రీ వరకు చదివించి పై చదువులు చదివించే స్తోమత లేక అక్కడితో ఆపేసి నందుకి పెళ్లి చేయాలని అనుకుంటారు..... గౌతమ్ నాన్నగారి గురించి నందు నాన్నగారికి తెలిసి ఉండటం వలన ఆయన ఇబ్బందిగా "మేము కట్నం మీరు అడిగినంత ఇచ్చుకోలేము...." అని అంటారు
గౌతమ్ నాన్నగారు "అసలు మాకు కట్నమే వద్దు గౌతమ్ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు రెండు సంవత్సరాలుగా.... మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి మన స్నేహాన్ని బంధుత్వం గా మార్చుకుందాం.... నా మాట మా అబ్బాయి తప్పకుండా వింటాడు...." అని నవ్వుతూ అడుగుతారు
నందు నాన్నగారికి కూడా ఇక ఏ ఇబ్బంది లేక అలాగే అని ఒప్పుకొని అడ్రెస్ ఫోన్ నెంబర్ చెప్పి పెళ్ళిచూపులకి రమ్మంటారు.....
గౌతమ్ నాన్నగారు నందు నాన్నగారు ఉండేది ఓకే ఊరిలోనే కాబట్టి గౌతమ్ నాన్నగారు ఇక ఆలస్యం చేయకుండా పంతులు గారికి ఫోన్ చేసి నందు నాన్నగారి ఎదురుగానే పెళ్ళిచూపులకి ఈ వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తెలుసుకొని ఆ రోజే వస్తామని చెప్తారు....
నందు నాన్నగారు కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళాక గౌతమ్ నాన్నగారు కూడా ఇంటికి వెళ్లి తన భార్యామణితో అంతా చెప్పి ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోగానే గౌతమ్ కి ఫోన్ చేసి "నా ఫ్రెండ్ కూతురితో నీకు ఒక వారంలో పెళ్లి చూపులు ఫిక్స్ చేశాను.... నువ్వు కచ్చితంగా రావాలి ఈ సంబంధం ఎలాగైనా ఫిక్స్ అవ్వాలి.... నేను వాళ్లకు ఈ పెళ్లి జరుగుతుందని మాట ఇచ్చేశాను...." అని చెప్తారు
గౌతమ్"నాకు అమ్మాయి ఎలా ఉంటుందో?? కనీసం తెలియకుండా ఎలా నాన్న పెళ్లి చేసుకోవటం???కనీసం అమ్మాయి ఫోటో అయినా పంపండి..." అని అసహనంగా అడుగుతాడు
" నేను నా ఫ్రెండ్ ఫోన్ లో అమ్మాయి ఫోటో చూశాను.... తను కచ్చితంగా నీకు నచ్చుతుంది నువ్వు డైరెక్టుగా ఇక్కడికి వచ్చి చూద్దువు.... అన్ని మూసుకొని వారం రోజుల్లో ఇక్కడ ఉండాలి...." అని సీరియస్ గా చెప్తారు
గౌతమ్ ఇక ఏమనలేక అమ్మాయి నచ్చకపోతే అక్కడే డైరెక్ట్ గా అందరి ముందే నచ్చలేదు అని చెప్దాము అనుకుని సరే అని ఆ వారం రోజుల్లో తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తాడు....
ఇంటికి వెళ్లగానే గౌతమ్ అమ్మగారు "ఏంటి నాన్న ఇలా చిక్కి పోయావు???? అందుకే ఇలా దూరంగా ఉండే ఉద్యోగాలు చెయ్యద్దు అని చెప్పాను.... ఇప్పటికీ ముంచి పోయింది ఏమీ లేదు అక్కడ మానేసి ఇక్కడే మన ఊరిలోనే ఏదైనా జాబ్ చూసుకుంటే పోతుంది కదా!!!!"అని అంటూ కొడుకు మీద ప్రేమ కురిపించేస్తారు
గౌతమ్ నవ్వుతూ "అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చిన ఇదే కదా అనేది!!! నేను నీకు అదే సమాధానం చెప్తున్నాను నేను బాగా ఉన్నాను.... నేనే వండుకొని తింటున్నాను.... ఆ ఉద్యోగం వదిలేసి రాలేను.... నువ్వు నా గురించి బెంగ పెట్టుకునే అవసరం లేదు....అని" అని నవ్వుతూ చెప్తాడు
ఇదంతా గౌతమ్ నాన్నగారు చూసి నవ్వుకుంటారు....
గౌతమ్ నాన్నగారు వెంటనే సీరియస్‌గా ఫేస్ పెట్టి "రేపే పెళ్లిచూపులు కి వెళ్ళాలి సిద్ధంగా ఉండు...."అని చెప్పగానే గౌతమ్ సరే అని అంటాడు...
నెక్స్ట్ రోజు ఉదయాన్నే పది గంటలు అప్పుడు గౌతమ్ రెడీ అయ్యి తన అమ్మానాన్నలతో పాటు నందుని పెళ్లిచూపులు చూసుకోవడానికి వెళతారు.....
@@@@@@@@@
నందు కూడా తన నాన్నగారు నందు కి అంతా చెప్పటం వలన కనీసం గౌతమ్ ఫోటో కూడా చూడకుండానే ఒప్పుకొని ఎలాగైనా ఫస్ట్ పెళ్లిచూపుల లోనే వచ్చే పెళ్లి కొడుకు కి తను నచ్చాలని అందంగా రెడీ అవ్వాలని ఆ వారం రోజుల్లో బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతుంది.....(అందరూ అమ్మాయిలు ఇంతే ఉంటారేమో కదా!!!! ఎలాగైనా ఫస్ట్ పెళ్లిచూపులు లోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని అనుకుంటారు కదా!!!!)
పెళ్లిచూపులు ముందురోజు షాపింగ్ మాల్ కి వెళ్లి తనకు నచ్చిన పట్టు సారీ కొనుక్కోని వచ్చి తన అమ్మానాన్నలకి చెల్లెలకి చూపించి వాళ్లు బాగుంది అనగానే సంతోషంగా పెళ్లిచూపులు కి అదే కట్టుకోవాలని ఫిక్స్ అవుతుంది.....
అలా గౌతమ్ వాళ్ళు వచ్చేసరికి నందు నాన్నగారు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి సోఫా లో కూర్చోబెడతారు(నందు నాన్నగారిది సామాన్య మధ్యతరగతి డాబా ఇల్లు.... ఆ ఇంటిలో రెండు బెడ్రూంలు ఒక కిచెన్ ఒక హాల్ ఒక పెరడు ఉంటాయి....) గౌతమ్ ఇంటిని అంతా చూస్తూ "బాగుంది చాలా నీట్ గా ఎరేంజ్ చేసుకున్నారు" అని మనసులోనే అనుకుంటాడు....
గదిలో తన చెల్లెలి సహాయంతో రెడీ అవుతున్న నందు కార్ సౌండ్ కి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు అనుకొని నందు మనసులో "ఇతను అందంగా ఉంటాడా?? లేకపోతే యావరేజ్ గా ఉంటాడా??? బాగా సంపాదిస్తున్నాడా??? డైలీ నేనడిగింది లేదు కాదు అనకుండా కొనిస్తాడా??? నన్ను బాగా చూసుకుంటాడా???" అని ఆలోచించుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది(పెళ్లిచూపులు కి రెడీ అయిన ప్రతి అమ్మాయి మనసులో ఉండేది ఇదే కదా!!!!)
నందు అమ్మ గారు గౌతమ్ వాళ్ళకి కాఫీ టిఫిన్ పెట్టి అబ్బాయి గురించి అన్నీ వివరాలు తెలుసుకున్నాకా గౌతమ్ అమ్మగారు వాళ్ళు అమ్మాయి ని రమ్మని చెప్పగానే నందు అమ్మగారు, తన చెల్లెలు ఇద్దరు వెళ్లి నందు చెల్లెలు నందుని రెడీ చేస్తూ ఆటపట్టిస్తూ ఉంటే వాళ్ళిద్దర్నీ నవ్వుతూ చూసి నందుని పై నుంచి కింద వరకు చూసి మెటికలు విరుస్తూ"చాలా అందంగా ఉన్నావు నందు... కచ్చితంగా వాళ్ళ అబ్బాయికి నువ్వు నచ్చుతావు.... అబ్బాయి కూడా చాలా బాగున్నాడు.... ఈ సంబంధం గాని ఫిక్స్ అయితే మీ ఇద్దరి ఈడు జోడు చాలా బాగుంటుంది.... వాళ్లు నిన్ను చూసుకోవటానికి పిలుస్తున్నారు పదా..." అని అంటుంది
నందు కొంచెం బిడియంగా సిగ్గుగా ఫస్ట్ పెళ్లి చూపులు అవటం వలన ఎలాగైనా "అమ్మ చెప్పిందంటే అబ్బాయి చాలా అందంగా ఉండి ఉంటాడు....ఎలాగైనా ఈ అబ్బాయి తోనే పెళ్లి ఫిక్స్ అవ్వాలని...." మనసులో దేవుని కోరుకుంటూ ఉంటుంది
గౌతమ్ కూడా "అమ్మాయి అందంగా ఉండాలని ఈ అమ్మాయి పెళ్లి ఫిక్స్ అవ్వాలని" దేవుని కోరుకుంటూ ఉంటాడు....(అందరూ అబ్బాయిల మనసుల్లోనూ ఇదే ఉంటుందా??? కొంచెం మీ ఒపీనియన్ షేర్ చేయండి....)
నందు తలదించుకునే బయటికి వచ్చి తన నాన్నగారి పక్కన కూర్చుంటుంది....
నందు బయటికి రాగానే గౌతమ్ కి నందు వాడే పర్ఫ్యూమ్ ఆరోమా స్మెల్ వచ్చే సరికి ఏమరుపాటుగా తలెత్తిన గౌతమ్ నందు ని అలా పట్టు సారీ లో పైనుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటే తనని అలా చూసి ఫిదా అయిపోయి మనసులో "ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది.... ఈ అమ్మాయికి ఎన్ని పద్ధతులు వచ్చి ఉంటే ఈ అమ్మాయి కానీ నా వైఫ్ అయితే చాలా బాగుంటుంది!!!"అని అనుకుంటూ నందు తీక్షణంగా చూస్తూ ఉంటాడు
నందు స్కై బ్లూ అండ్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో ఉన్న లైట్ వెయిట్ పట్టు సారీ కట్టుకుని మెడలో ఒక నెక్లెస్, చెవులకి పెద్ద బుట్టలు, రెండు కనుబొమల మధ్య రెడ్ కలర్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని, తలలో మల్లెపూలు పెట్టుకుని సింపుల్ గా రెడీ అయ్యి ముట్టుకుంటే మాసిపోయే రంగులో పైనుంచి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుంది....
గౌతమ్ ఆరడుగుల కి ఒక్క ఇంచ్ తక్కువ ఎత్తులో వైట్ అండ్ బ్లూ కలర్ చెక్స్ షర్ట్ డార్క్ బ్లూ జీన్స్ వేసుకొని ఇన్ షట్ చేసుకుని ట్రిమ్ చేసిన గడ్డంతో చురు కత్తి లాంటి చూపులతో నందు కి ఏ మాత్రం తీసిపోని రంగులో హ్యాండ్సమ్ గా ఉంటాడు....
నందు కి గౌతమ్ చూపులు తాకుతున్న సైలెంట్‌గా మనసులోని టెన్షన్ పడుతూ తలదించుకుని ఉంటుంది.....
గౌతమ్ అమ్మగారు నాన్నగారు గౌతమ్ నందు వచ్చిన దగ్గరనుంచి చూస్తూ ఉండేసరికి వాళ్ళకి గౌతమ్ కి నందు నచ్చిందని అర్థమై నందుతో "తలదించుకునే ఉంటావా మా కొడుకుని కూడా చూసేదేమైనా ఉందా కోడలు పిల్ల???" అని గౌతమ్ అమ్మగారు నవ్వుతూ అంటారు
అయినా నందు తలదించుకునే ఉండేసరికి నందు అమ్మగారు నందు చెవిలో "ఒకసారి అబ్బాయిని చూడు నందు...." అని చెప్పగానే నందు చిన్నగా తలెత్తి గౌతమ్ వైపు చూసి తన చూపుల బాణాల్ని గౌతమ్ గుండెల్లో గుచ్చి సైలెంట్ గా వెంటనే తల దించుకొని ఉంటుంది
ఆ చూపుకి గౌతమ్ గుండె పేలిపోయి మనసులో"గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనే పట్టు మీద రాయి వేసి కొట్టినట్టుందే...."అనే సాంగ్ కూడా వేసుకొని "ఇక ఫిక్స్ ఇదే నా పెళ్ళాం"అనుకోని వెంటనే తన అమ్మానాన్నలతో "అమ్మాయి నాకు బాగా నచ్చింది మమ్మీ .... అమ్మాయికి కూడా నచ్చితే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం...." అని నందు వైపే చూస్తూ ఆత్రంగా మాట్లాడుతాడు
ఆ మాటకి గౌతమ్ నాన్నగారి సీరియస్ గా గౌతమ్ వైపు చూస్తూ "నీకు అమ్మాయి నచ్చిందని మాత్రమే చెప్పు ఎప్పుడు మీకు పెళ్లి చేయాలి అనేది మేము చూసుకుంటాం...." అని గౌతమ్ కి మాత్రమే వినిపించేలా అంటారు
గౌతమ్ మాటలకి నందు ఫ్యామిలీ అంతా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే గౌతమ్ నాన్నగారు వెంటనే నందు నాన్నగారితో "ఏమనుకోకు రా వీడికి కొంచం ఆత్రం ఎక్కువ.... ఏది దాచుకో లేడు వెంటనే బయటికి కక్కేస్తాడు...." అని నవ్వుతూ అంటారు
నందు నాన్నగారు పర్వాలేదు అనగానే నందు మనసులో "ఓహో అబ్బాయి గారికి చాలా తొందరగా ఉన్నట్టుందే నన్ను పెళ్లి చేసుకోవడానికి!!!!" అని నవ్వుకుంటుంది
గౌతమ్ మనసులో "ఈ నాన్నలు ఉన్నారే ఎప్పుడు ఇంతే కొడుకుని ఎప్పుడు ఏదో ఒక మాట అందామా అని చూస్తూ ఉంటారు...." అని అనుకొని బయటికి ఏమీ తెలియని అమాయక చక్రవర్తి సైలెంట్ గా సరే అని చెప్పాడు
గౌతమ్ ఎక్స్‌ప్రెషన్‌ని ఓరగా చూస్తున్న నందు నవ్వుకుంటుంది.....
నందు నాన్నగారు "నందు నీకు అబ్బాయి నచ్చాడా???" అని అడిగితే "నేను కొంచెం అబ్బాయి తో మాట్లాడాలి నాన్న..." అని అడుగుతుంది
గౌతమ్ వెంటనే పైకి లేచి "నేను రెడీ వెళ్దామా మాట్లాడుకోవడానికి!!!!" అని పళ్ళన్ని బయటికి పెట్టి నవ్వుతూ అంటాడు
గౌతమ్ నాన్నగారి సీరియస్ గా గౌతమ్ వైపు చూసేసరికి అప్పుడు గౌతమ్ ఏం చేశాడో గుర్తుకు వచ్చి "ఛ ఇలా చేశాడేంటి??? ఈ అమ్మాయి నా గురించి ఏమనుకోని ఉంటుంది???" అనుకుంటూ ఇబ్బందిగా అందరి వైపు చూస్తూ ఉంటాడు
నందు నాన్నగారు గౌతమ్ వైపు చూసి నవ్వుతూ "నీ గదిలోకి తీసుకు వెళ్ళు నందు ఇద్దరు మాట్లాడుకోండి...." అని అంటారు
నందు సరే అని నెమ్మదిగా పైకి లేచి అడుగుల్లో అడుగులు వేస్తూ ఒక అయిదు నిమిషాలకి తన రూమ్ చేరుకుంటుంది.....
గౌతమ్ నందు వెనకే అడుగులు వేస్తూ "ఏంటి ఈ అమ్మాయి ఇంత స్లోగా నడుస్తుంది????"అని నందుని బ్యాక్ సైడ్ నుంచి చూసి "బ్యాక్ సైడ్ నుంచి సూపర్ ఉంది...." అని నందు చీర జాకెట్ కలవని చోట గౌతమ్ చూపు నడుము దగ్గర ఆగిపోయి "దీని నడుము ఎంత ఒంపులు తిరిగి ఉంది??? పైగా దానిలో నెలవంక ఎంత అందంగా ఉంది??? ఇప్పుడే దాన్ని ముద్దు పెట్టుకోవాలని పిస్తుంది..... ఇన్ని సంవత్సరాలు నా బ్రహ్మచర్యానికి వెంటనే స్వస్తి పలకాలి అనిపిస్తుంది..... ఎలాగైనా సరే ఈ అమ్మాయికి నేను నచ్చి మా పెళ్లి వెంటనే జరిగేలా చూడు స్వామి...." దేవుడు మెక్కేసుకుంటూ ఉంటాడు
నందు లోపలికి వెళ్లి గౌతమ్ లోపలికి రాగానే వెంటనే డోర్ లాక్ చేసి తల పైకెత్తి సూటిగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ తన చీర చెంగు నడుము దగ్గర దోపుకుని "ఏంటి నేను బయటికి వచ్చిన దగ్గర నుంచి ఆ తినేసేలా చూడటం???? అయినా ఎప్పుడు అమ్మాయిలని చూడనట్టు అలా చూస్తున్నావ్ ఏంటి????" అని తన నడుము మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
ఈ కథను చదువుతున్న, అదరిస్తున్న ప్రతి ఒక్కరికీ
పేరు పేరునా అభివందనములు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
సడన్ గా మారిన నందు వేరియేషన్ కి గౌతమ్ షాక్ అయ్యి ఫెయింట్ అయ్యేలా ఉంటే వెంటనే నందు గౌతమ్ చెంప మీద చిన్నగా కొట్టి "ఓయ్ నన్ను ఇలా చూసి షాక్ అయ్యావా???? కానీ ఇదే నా ఒరిజినల్ క్యారెక్టర్..... కూర్చో నీతో చాలా మాట్లాడాలి...." అని చెప్పి గౌతమ్ ని బెడ్ మీద కూర్చోబెట్టి తను గౌతమ్ ఎదురుగా బాసిమఠం వేసుకొని కూర్చుంటుంది....
గౌతమ్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేక గుడ్లప్పగించి మరి నందు వైపే చూస్తూ ఉంటే "ఓయ్ ఏంటి అలా చూస్తున్నావ్ తినేస్తావా ఏంటి???? నేను బయటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే చూసావు???" అని సీరియస్ గా అడుగుతుంది
నందు అప్పుడు చేరుకొని "లేదండి మిమ్మల్ని బయట చూసినప్పుడు చాలా సాఫ్ట్ గా కనిపించారు.... ఇక్కడేమో ఇలా మాట్లాడుతున్నారు??? అందుకే కొంచెం షాక్ అయ్యాను...." అని నార్మల్ అవుతూ అంటాడు
నందు గౌతమ్ వైపు సూటిగా చూస్తూ "అమ్మాయిలు అన్నాక ఇలాగే ఉండాలి.... మెత్తగా ఉంటే ప్రతి ఒక్క వెధవ ఆడుకుంటాడు.....అందుకే నేను అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం లేదు.... ఇంతకీ నేను నీకు నచ్చానా????" అని సూటిగా అడుగుతుంది
గౌతమ్ అమ్మాయిల సిగ్గుపడుతూ బెడ్ షీట్ ని నలిపేస్తూ "చాలా నచ్చారండి మిమ్మల్ని చూడగానే పడిపోయాను...." అని అంటాడు
నందు గౌతమ్ వైపు వింతగా చూస్తూ "ఏంటండీ ఆ సిగ్గుపడటం నేను సిగ్గు పడాల్సింది పోయి మీరు సిగ్గు పడుతున్నారు.... ఇంతకీ నా గురించి మీకు తెలుసా???" అని అడుగుతుంది
"లేదండి నేను కనీసం మీ ఫోటో కూడా చూడలేదు..... డైరెక్టుగా పెళ్లిచూపులు కి వచ్చేసాను నచ్చితే ఓకే చెప్తాము లేకపోతే లేదు అనుకున్నాను...." అని గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ ల సిన్సియర్ గా చెప్తాడు
గౌతమ్ మాటల్లోని సిన్సియారిటీ నచ్చి "ఓకే నేను డిగ్రీ చేశాను ఇంతవరకు ఎవరినీ ప్రేమించలేదు.... కాలేజ్ లో అబ్బాయిలకి నన్ను చూస్తే హడల్ అందుకే త్వరగా నాకు ఎవరూ ప్రపోజ్ చేయరు.... నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్.... ఏదున్నా మొహం మీద చెప్పేస్తాను మనసులో ఏదీ దాచుకోను.... మా నాన్నగారు నన్ను పై చదువులు చదివించలేక డిగ్రీ తర్వాత చదువు మాన్పించేశారు.... నాకు కూడా చదువు మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేక నేను మానేశాను..... పైగా నా డిగ్రీ అయిపోయి జస్ట్ టూ మంత్స్ అవుతుంది... ఇక పెళ్లి చేయాలనుకున్నారు.... మొదటి సంబంధం మీదే మీరు నాకు బాగా నచ్చారు.... మీకు ఓకే అయితే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం..... ఇంతకీ మీకు ఏమైనా లవ్ ఎఫైర్స్ ఉన్నాయా??? ఉంటే నిరభ్యంతరంగా చెప్పండి నేను చాలా బ్రాడ్ మైండెడ్ ఇలాంటివన్నీ పట్టించుకోను...." అని డైరెక్టుగా అడుగుతుంది
నందు అంత డైరెక్ట్ గా అడుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయని గౌతమ్ ఫస్ట్ షాక్ అయిన వెంటనే చిరునవ్వు నవ్వుతూ "అయ్యో నాకు అలాంటివి ఏమీ లేవండి.... నేను కూడా పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకోవాలి అనుకున్నాను పైగా అమ్మాయిలు మీ లాగ ఉంటేనే నాకు చాలా ఇష్టం నందు.... అవును నీ పేరు నందికనే కదా!!!నేను మిమ్మల్ని నందు అని పిలవచ్చా???" అని అడుగుతాడు
"మీరు నన్ను పెళ్లి చేసుకునే పని అయితే మీరు ఎలా పిలిచినా నేనే పలుకుతాను.... నాకేమీ అభ్యంతరం లేదు...." అని నవ్వుతూ అంటుంది
"అయితే నేను నిన్ను నందు అనే పిలుస్తాను నాకు నువ్వు బాగా నచ్చావు.... నీ మాటలు నీ క్యారెక్టర్ ఇంకా నచ్చింది...." అని మీరు నుంచి నువ్వు లోకి వచ్చి అంటాడు
నందు వెంటనే గౌతమ్ బుగ్గలు పట్టుకుని లాగుతూ "మీరు ఎంత క్యూట్ గా ఉన్నారో తెలుసా ఈ డ్రెస్ లో???? వచ్చినప్పట్నుంచి ఇలా మీ బుగ్గలు లాగుదామని మనసు పీకుతోంది ఇప్పటికి కుదిరింది.... ఒకవేళ మీకు నేను నచ్చలేదని చెప్పి అంటే ఇంత అడ్వాంటేజ్ తీసుకుని దాన్ని కాదు.... మీరు నా గురించి తప్పుగా అనుకోవద్దు...." అని సిగ్గుపడుతూ ఉంటుంది
గౌతమ్ నవ్వుతూ "నాకు కూడా నిన్ను చూసినప్పటినుంచి ఒకటి చేయాలని ఉంది.... నీకు నేను ఇష్టమో లేదో తెలియక సైలెంట్ గా ఉన్నాను.... కానీ ఇప్పుడు నీకు ఇష్టం అని తెలిశాక ఆ అవసరం లేదు...." అంటూ వెంటనే తన బుగ్గ మీద ముద్దు పెడతాడు
గౌతమ్ నుంచి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చెయ్యని నందు షాక్ అయిపోయి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి గౌతమ్ వైపే చూస్తూ ఉంటుంది.....
"ఐ లవ్ యు నందు నువ్వు నాకు చాలా నచ్చావు.... మీ వాళ్లకి కూడా నేనే చెప్తాను.... నువ్వు ఈ షాక్ నుంచి తేరుకొని నిదానంగా బయటికి రా...." అని మళ్ళీ మరొక బుగ్గ మీద ముద్దు పెట్టి మరి బయటికి వెళ్ళిపోతాడు....
గౌతమ్ చేసిన పనికి ఒక్క నిమిషం కోపం వచ్చిన వెంటనే అతని మనసులో తను తన భార్య గా ఫిక్స్ అయ్యాడని అర్థమై నవ్వుకుంటూ బయటికి వచ్చేసరికి గౌతమ్ అందరితో "నందుకి నాకు ఈ పెళ్లి ఇష్టమే..." అని చెప్తాడు
ఆ మాటకి అందరూ సంతోషంగా నవ్వుతూ చూస్తూ "సంతోషం బావగారు పంతులు గారిని పిలిపించి త్వరగా ముహూర్తాలు పెట్టించేద్దాం...." అని నవ్వుతూ గౌతమ్ నాన్నగారు అంటారు
బయటికి వచ్చిన నందుని ఓరగా గౌతమ్ చూస్తే నందు గౌతమ్ వైపు చిరు కోపం గా చూస్తూ తన పక్కకు వచ్చి నిలబడి గౌతమ్ కాలిని గట్టిగా తన కాలితో తొక్కేస్తుంది....(గౌతమి కండలు తిరిగిన శరీరం ఏమీ కాదండీ కొంచెం సన్నగా చాక్లెట్ బాయ్ లా ఉంటాడు.... నందు కూడా సన్నగా పర్ఫెక్ట్ ఫిగర్ తో గౌతమ్ కి సరిపోయేలా ఉంటుంది)
గౌతమ్ వెంటనే "చచ్చాను రా బాబోయ్...." అని గట్టిగా కేకలు వేస్తూ కాలు పట్టుకొని దాని వైపు చూసే సరికి అప్పటికే నందు నవ్వుకుంటూ తన నాన్నగారి పక్కకి వెళ్ళి కూర్చుంటుంది....
గౌతమ్ అమ్మగారు కంగారుగా గౌతమ్ దగ్గరికి వచ్చి "ఏమైంది రా ఎందుకు అలా అరిసావు???" అని అడుగుతారు
గౌతమ్ నందు వైపు కోపంగా చూస్తూ "ఏమీ లేదు మమ్మీ ఏదో కాళ్ళ మీద పడి నట్టు ఉంది కొంచెం నొప్పిగా అనిపించి అరిచాను.... అంతే టెన్షన్ పడకు...." అని నవ్వుతూ అంటాడు
నందు ముసిముసిగా నవ్వుకుంటూ గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది.... అదంతా అందరు గమనించి ఇద్దరి మధ్య చిలిపిగా ఏదో జరిగిందని అర్థమై వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటారు... ఇంతలో నందు నాన్న గారు పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి వారం రోజుల్లో పెళ్లి కి నెల రోజుల్లో ముహూర్తం ఫిక్స్ చేస్తారు....
అలా అందరూ మాట్లాడుకున్నాక నిశ్చితార్థం నందు నాన్నగారు చేస్తానని చెప్పి గౌతమ్ వాళ్లందర్నీ పంపించేసాక నందుతో "చాలా సంతోషంగా ఉంది నందు.... వాళ్ళు కనీసం రూపాయి కట్నం కూడా వద్దన్నారు.... పైగా అబ్బాయి చాలా మంచివాడు నేను ఎంక్వయిరీ కూడా చేశాను ఏ చెడు అలవాట్లు లేవు పైగా చాలా అమాయకుడిలా కూడా ఉన్నాడు నీ నోట్లో పడ్డాడు.... ఇక అతని పరిస్థితి ఏంటో???" అని గౌతమ్ మీద జాలి చూపిస్తూ అంటారు
నందు కోపంగా వాళ్ళ నాన్న వైపు చూస్తూ "అంటే ఏంటి నాన్న నేను నీకు రాక్షసి లా కనిపిస్తున్నానా???" అని అడుగుతుంది
"అది నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నువ్వు ఆల్రెడీ రాక్షసివే...." అని నవ్వుతూ చెప్పి "జస్ట్ జోకింగ్ నందు కానీ అబ్బాయి చాలా మంచివాడు.... అతనిని నొప్పించకుండా చూసుకో...." అని అంటారు
సరే అని చెప్పి నందు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ లోకి వెళ్ళేసరికి గౌతమ్ నుంచి మెసేజ్ వస్తుంది "ఎందుకు నా కాలు అలా తొక్కే సావు నందు????" అని కార్ లో డ్రైవర్ పక్కన కూర్చుని నందు కి మెసేజ్ చేస్తూ ఉంటాడు
నందు షాకింగ్ "నా నెంబర్ గౌతమ్ కి ఎలా తెలిసింది???"అని అనుకుంటూ ఉండగానే గౌతమ్ నుంచి మరో మెసేజ్ "నీతో మాట్లాడి బయటికి రాగానే నీ చెల్లి దగ్గర నుంచి నీ ఫోన్ నెంబర్ తీసుకున్నాను.... నీ చిన్ని బుర్రని చించేస్తూ అంతలా కష్టపడకు బంగారం...." అని నవ్వుతున్న ఏమోజీ పెడతాడు
నందు నవ్వుకుంటూ "మరి నువ్వు నా పర్మిషన్ లేకుండా నాకు ముద్దు పెడితే ఏం చేయాలి??? నాకు కోపం వచ్చింది అది తీర్చుకున్నాను.... నాకు కోపం వస్తే అది తీర్చుకునే దాకా నేను ప్రశాంతంగా ఉండలేను...." అని అంటుంది
గౌతమ్ వెంటనే గుండెల మీద చెయ్యి వేసుకుని "అమ్మో అయితే నీతో కష్టమే నే బాబు!!! ఏదైనా కానీ ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తాను నువ్వు నా లైఫ్ లోకి వస్తే చాలు బంగారం...." అని మెసేజ్ పెడతాడు
అలా నందు డ్రెస్ చేంజ్ చేసుకుంటేనే గౌతమ్ కి మెసేజ్ చేస్తూ ఉంటుంది....
అలా కాలం ఎవరికోసం ఆగకుండా నిశ్చితార్ధం అయిన వాళ్ళ మధ్యలో జరిగితే పెళ్లి గ్రాండ్ గా చేస్తారు....
నిశ్చితార్థానికి పెళ్లి కి మధ్యలో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ కలవాలి అనుకుంటే ఇద్దరి తల్లిదండ్రులు కలవకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్పేసరికి ఇద్దరు ఫోన్లోనే మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అయిపోతారు....(ఇది మాత్రం పెళ్లి కుదిరిన అమ్మాయి అబ్బాయి మధ్య కామన్ గా నే జరుగుతుంది....)
పెళ్లి అయినా తర్వాత రోజు గౌతమ్ ఇంట్లో వ్రతం చేసి ఆ రోజే ఫస్ట్ నైట్ కూడా చేసుకుంటారు....
అక్కడే ఒక వారం రోజులు ఉండి నందు అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో ఒక వారం రోజులు ఉండి వెంటనే నందు ని తీసుకొని హైదరాబాద్ వెళ్లిపోతాడు.... అప్పటికే గౌతమ్ మంచి అపార్ట్మెంట్ లో ఒక డబల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటాడు....
నందు తో పాటు నందు అమ్మగారు వస్తే గౌతమ్ నాన్నగారు గౌతమ్ అమ్మగారు వచ్చి నందు గౌతమ్ ల చేత గృహప్రవేశం చేయించి వాళ్లతో పాటు ఒక నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతారు....
అలా గౌతమ్ నందు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు.... గౌతమ్ ఆఫీస్ కి వెళ్ళాక నందు ఒక్కతే ఇంట్లో ఉంటూ రోజు మొత్తం బోర్ కొడుతుంది అని టీవీ కొని టీవీ పెట్టిస్తాడు....(అపార్ట్మెంట్లో అంతే ఉంటుంది..... ఒకరితో మరొకరికి సంబంధం లేకుండా ఇంట్లోనే కూర్చుంటారు)
నందు హ్యాపీగా గౌతమ్ ని కౌగిలించుకొని "గౌతమ్ నువ్వు ది బెస్ట్ హస్బెండ్..." అని అంటుంది
"మరి నీకు చదువుకోవాలని ఉంటే చెప్పు నేను ఎంబీఏ సీట్ తీసుకుంటాను..." అని అడుగుతాడు
"లేదు గౌతమ్ నాకు చదువంటే ఇష్టం లేదు..... డిగ్రీ నే ఏదో అరకొర మార్కులతో పాసయ్యాను.... నావల్ల కాదు బాబు ఈ చదువులు.... ప్రస్తుతానికి నీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చెయ్యాలని ఉంది.... తర్వాత మనకి పిల్లలు పుడితే ఆ పిల్లలతోనే నాకు రోజంతా సరిపోతుంది..... అప్పటివరకు ఇద్దరం కలిసి ఈ సిటీ అంతా చక్కర్లు కొడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేయాలి కదా!!!! అందుకే ఈ చదువు గిదువు నా వల్ల కాదు..... నువ్వు సంపాదించు నేను ఇంట్లో కూర్చుని తింటాను..." అని నవ్వుతూ అంటుంది
నందు మాటలకి గౌతమ్ నవ్వుకుంటూ "సరే మరి పిల్లల్ని కనే వరకూ ఎంజాయ్ చేయాలి కదా మరి ఎంజాయ్ చేద్దాం పదా!!!!" అని చెప్పి నందుని ఎత్తుకుని బెడ్ రూం లోకి తీసుకు వెళ్తాడు
"ఇప్పుడేంటి గౌతమ్ అది మధ్యాహ్నం పూట!!!" అని కంగారుగా అడుగుతుంది
నాకు దొరికేదే రెండు రోజుల హాలిడేస్.... అందులో ఒక రోజు ఆఫ్టర్నూన్ వరకు వర్క్ ఉంటుంది.... ఆఫ్టర్ నూన్ నుంచి రెస్ట్ తీసుకుంటాను.... ఇక ఈ రోజే కదా నాకు మిగిలింది కనీసం ఈ రోజైనా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదా!!! అందుకే ఇలా!!!" అని చెప్పి నందుని ఆక్రమించుకుంటాడు
గౌతమ్ టీవీ కొన్నాక పెళ్లయిన కొత్తలో గౌతమ్ ఆఫీస్ నుంచి రాగానే అలసటగా సోఫాలో నందు పక్కనే కూర్చుని "నందు కొంచెం కాఫీ ఇవ్వవా...." అని అడుగుతాడు
టీవీ లో మునిగి పోయిన నందు గౌతమ్ చెప్పింది వినిపించుకోదు.... గౌతమ్ "నందు"అని అంటూ నందు భుజాలు కదిపి "ప్లీజ్ కొంచెం కాఫీ ఇవ్వవా చాలా చిరాకుగా ఉంది...." అని అంటాడు
"అలాగే గౌతమ్ ఇప్పుడే తెస్తాను...." అని చెప్పి హడావిడిగా పాలు కాచి ఉండటం వలన వెంటనే కాఫీ కలుపుకొని తీసుకువచ్చి గౌతమ్‌కి ఇచ్చి వెంటనే తన పక్కన కూర్చుని టీవీ సీరియల్ లో మునిగి పోతుంది.....
గౌతమ్ కాఫీ ఒక్క సిప్ చేసి వెంటనే షింక్ దగ్గరికి వెళ్లి నోట్లో ఉన్న కాఫీ ఊసేస్తాడు....
"ఏంటి నందు ఇది కాఫీ ఇవ్వమంటే కషాయం ఇచ్చావు??? అయినా ఇదేంటి ఇంత ఉప్పగా ఉంది???" అని కోపంగా అడుగుతాడు
"ఏంటి గౌతమ్ ఇది నేను టీవీ సీరియల్ చూస్తూ ఉంటే డిస్టర్బ్ చేస్తున్నావు??? ప్లీజ్ నన్ను కొంచెం సేపు డిస్టర్బ్ చేయకు..... సీరియల్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు మీకు కావాల్సినట్టుగా కలిపిస్తాను...." అని విసుగ్గా అంటుంది
గౌతమ్ షాక్ గా "అంటే టీవీ సీరియల్ చూస్తూ కాఫీ ఇలా కలిపి ఇచ్చావా తల్లి???? ఇంకెప్పుడు నువ్వు ఇలా సీరియల్ చూస్తూ నాకు కాఫీ ఇవ్వకు..... ఇంకొకసారి ఉప్పు బదులు ఏదైనా గమీషన్ వేసావు అంటే ఏకంగా పైకే పోతాను...." అని భయంగా అంటాడు
నందు టీవీ సీరియల్ లో మునిగిపోయి "ఆ సరే సరేలే నీకు కావాల్సినట్టుగానే చేసి పెడతాను ప్రస్తుతానికి ఫ్రెష్ అయి రా పో అంతలోపు వంట రెడీ చేస్తాను..." అని అంటుంది
గౌతమ్ నందు ని ఒకసారి చూసి సైలెంట్ గా తన రూమ్ లోకి వెళుతూ మనసులో "అనవసరంగా టీవీ కొన్నాను ఇది టీవీ చూస్తూ పని కూడా చేయడం లేదు.... ఏంటో ఈ జీవితం???" అనుకుంటూ వెళ్ళిపోతాడు
అలా ఇద్దరు చిన్న చిన్న చిలిపి గొడవలతో హ్యాపీగా నడిపిస్తూ రెండు నెలలు టైం తెలియకుండానే గడిచి పోతుంది.....
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
ఈ కధను చదువుతున్న, ప్రొత్సహిస్తున్న, అభిమానిస్తున్న పాఠక మితృలకు కృతజ్ఞతలు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
ఒకరోజు గౌతం సాయంత్రం 7:00 ఎప్పుడు ఇంటికి వచ్చేసరికి నందు సోఫాలో కూర్చుని ఏడుస్తూ టీవీ చూస్తూ ఉంటుంది.....
గౌతమ్ వెంటనే కంగారుగా వెళ్లి నందు పక్కన కూర్చుని తనని దగ్గరికి తీసుకొని ఏమైంది నందు ఎందుకు ఏడుస్తున్నావ్??? మా అమ్మ నాన్న మీ అమ్మ నాన్న బాగానే ఉన్నారా??? ఏం జరిగింది???" అని కంగారుగా అడుగుతాడు
నందు చేయి తిప్పి ఎటువైపో చూపిస్తుంది.....
గౌతమ్ అటు వైపు చూసి షాక్ అయిపోతాడు.....
గౌతమి ఎందుకు షాక్ అయ్యారు అంటే టివి సీరియల్ లో మన కార్తీక దీపం లోని వంటలక్క ఏడుస్తూ ఉంటుంది.....
అది చూసి గౌతమ్ అయోమయంగా "అందుకు ఏడుస్తున్నావా???" అని అడుగుతాడు
"అవును గౌతమ్ మన వంటఅక్క ఎలా ఏడుస్తుందో!!!! డాక్టర్ బాబు ఇప్పటివరకు వంటలక్క ని ఏడిపించాడు..... ఇప్పుడు ఆ డాక్టర్ పిల్ల ఏడిపిస్తుంది..... దాన్ని ఏం చేసినా పాపం లేదు....." అని ఏడుస్తూ ముక్కు చేతి గౌతం షర్ట్ కి రాస్తూ అంటుంది
గౌతమ్ వెంటనే కోపంగా పైకిలేచింది " ఛీ ఛీ ఏంటి ఇది???"అని తన షర్ట్ కర్చీఫ్ తో తుడుచుకొని నందు వైపు కోపంగా చూస్తూ "నీకు బోర్ కొడుతుందేమోనని టీవీ కొన్ని పెద్ద తప్పు చేశాను..... నువ్వు ఇలా సీరియల్స్ కి ఎడిక్ట్ అయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇలా ఏడుస్తావు అనుకోలేదు.... ఇప్పుడే ఈ టీవీ పగలగొట్టేస్తాను.... అప్పటికి కాని నాకు ఈ తలనొప్పి తగ్గుతుంది...." అని కోపంగా చెప్పి టీవీ దగ్గరికి వెళుతూ ఉంటే
నందు వెంటనే కోపంగా పైకి లేచి "ఆ పని చేసావ్ అంటే నీకు ఫుడ్ బెడ్ రెండు కట్ చేస్తాను.... నేను సీరియల్స్ కూడా చూడకూడదా ఏంటి???? ఇలా నాకు రిష్ట్రిక్షన్స్ పెట్టకూడదు అని పెళ్లికి ముందే చెప్పాను కదా!!!! నాకు ఇలాంటివన్నీ నచ్చవు గౌతమ్...."అని అంటుంది
"మరి నేను వచ్చేసరికి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేనేం అనుకోవాలి???? నువ్వు అలా ఏడుస్తూ ఉంటే ఇంకా ఏం జరిగిందో అని నేను ఎంత టెన్షన్ పడ్డాను??? ఒకపక్క ఆఫీసులో టెన్షన్స్ మరోపక్క ఇదంతా ఏంటి?????నాకు ఇంటికి రావాలంటే నా తల నొప్పి పుడుతుంది...." అని అసహనంగా అంటాడు
నందు వెంటనే ఏడుస్తూ "అంతేలే నేనంటే నీకు అప్పుడే ప్రేమ తగ్గిపోయింది.... పెళ్లయి కనీసం 2 నెలలు కూడా కావట్లేదు అప్పుడే ఇలా మాట్లాడుతున్నావు??? ఇప్పుడే ఇలా ఉంటే రేపు నువ్వు నన్ను కొట్టావు అని గ్యారెంటీ ఏంటి??? నాకు నీ మీద నమ్మకం లేదు ... నేను నా పుట్టింటికి వెళ్ళి పోతాను...." అని అంటుంది
గౌతమ్ షాక్ అయ్యి "ఇంత చిన్న మాటకి అంత పెద్ద డెసిషన్ ఎందుకు నందు??? సరేలే నీ ఇష్టం వచ్చింది చేసుకో!!!" అని కోపంగా అంటాడు
"అయితే నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా వంట చేస్తాను...." అని అంటుంది
గౌతమ్ ఇక ఏమీ చేయలేక సైలెంట్ గా లోపలికి వెళ్ళి పోయి మనసులో "ఏంటి ఇది జస్ట్ సీరియల్ కోసం ఏడుస్తుంది??? రియల్ లైఫ్ లో ఇలాంటివి జరిగితే తట్టుకుంటుందా???? ప్రపంచంలో రోజు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి.... ఈ టీవీ లో సీరియల్స్ చూస్తూ డైలీ ప్రపంచంలో జరిగే వాటిని పట్టించుకోవట్లేదు.... ఒక్కసారి అవి చూస్తే కనీసం లోకజ్ఞానం అయినా వస్తుంది కదా!!!! ఇలాంటివి చూసి మమ్మల్ని ఏడిపించడం కాకపోతే!!!!" అనుకుంటూ ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి నందు నవ్వుతూ వంట చేసి గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది
గౌతమ్ ముభావంగా వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోగానే నందు గౌతమ్ అలా ముభావంగా ఉండటం నచ్చక బాధగా గౌతమ్ తో "ఇంకొకసారి నీతో ఇలా మాట్లాడడానికి గౌతమ్.... నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఇలా సీరియల్స్ చూస్తూ నీతో అలా బిహేవ్ చేయను ప్రామిస్..... నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు..... ప్లీజ్ గౌతమ్ మనం మునుపటిలా ఉందాము...." అని బాధగా అంటుంది
గౌతమ్ అనుమానంగా నందు వైపు చూస్తూ "నిజంగానే అంటున్నావా నందు??? ఇకనుంచి నేను వచ్చేసరికి సీరియల్స్ చూడకుండా ఉంటావా???" అని అడుగుతాడు
"ఆది మాత్రం చెప్పలేను గౌతమ్.... సీరియల్స్ చూస్తాను కానీ ఇలా నిన్ను మాత్రం ఇబ్బంది పెట్టను ప్రామిస్....." అని అంటుంది
"సరేలే ఏం చేస్తాం చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు నువ్వు చెప్పిందే నేను వినాలి కానీ నేను చెప్పింది నువ్వేమైనా వింటావా ఏంటి???? మమ్మల్ని మీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నారు...." అని నిష్టూరంగా అంటాడు
నందు వెంటనే గౌతమ్ బుగ్గ మీద ముద్దు పెట్టి "నువ్విలా డల్ గా ఉంటే నాకు నచ్చడం లేదు గౌతమ్.... ఇప్పుడు నువ్వు హ్యాపీ గా అవ్వాలంటే నేను ఏం చేయాలి????" అని అడుగుతుంది
"నేను వచ్చేసరికి నువ్వు అందంగా రడీ అయ్యి నవ్వుతూ నన్ను పలకరించాలి.... అప్పుడే కదా మేము ఆఫీసులోని టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇంటికి వచ్చాక సంతోషంగా మీతో టైం స్పెండ్ చేసేది...." అని అడుగుతాడు
నందు కొంచెం సేపు ఆలోచించి "సరే గౌతమ్ నువ్వు చెప్పినట్టే చేస్తాను.... ఇక సంతోషమా ముందు భోజనం చెయ్యి అన్నం చల్లారి పోతుంది....." అని నవ్వుతూ అంటుంది
గౌతమ్ సరే అని నందుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని తన నోటి దగ్గర అన్నం కలిపి పెట్టగానే నందు కంగారుగా "నువ్వు తిను గౌతమ్ ఇప్పటికే చాలా అలసిపోయి వచ్చావు కదా!!!!" అని ప్రేమగా అంటుంది
"నువ్వు కూడా ఆ సీరియల్స్ లో పడి సరిగా తినటం లేదు నందు... ముందు అవి తగ్గించు చూడు ఎంత సన్నగా అయిపోతున్నావో!!! ఇలా అయితే నిన్ను నేను సరిగా చూసుకోవడం లేదని మీ అమ్మ నాన్న అనుకుంటారు... అది నీకు ఇష్టమా???" అని ప్రేమగా తనకి తినిపిస్తూనే అడుగుతాడు
నందు ఒకసారి తనని తాను చూసుకుని అది నిజమే అనిపించి "సరే గౌతమ్ చెప్పాను కదా సీరియల్ పూర్తిగా మానేయను కానీ అవి చూడటం తగ్గించి టైం టూ టైం భోజనం చేస్తాను.... నావల్ల నీకు ఎప్పుడు చెడ్డపేరు రానివ్వను ప్రామిస్.... ఇప్పుడైనా నీ అలకమాని భోజనం చెయ్యి...." అని ఇప్పటికీ మూతి ముడిచి ఉన్న గౌతమ్ ని చూస్తూ అంటుంది
"ముందు నువ్వు' అంటూ నందుకు తినిపిస్తూ తను తిని హ్యాపీగా నైట్ ఈ చేసుకొని ఉదయానికి ఎప్పుడో పడుకుంటారు....
అలా నందు తనకి కావాలి అనుకున్నది గౌతమ్ చేత కొనిపించుకోవటానికి ఒకసారి గౌతమ్ తో గొడవ పడుతూ ఒకసారి గౌతమ్ కోరికలు తీరుస్తూ తన కోరిక కూడా తీర్చుకుంటూ చిన్న చిన్న చిలిపి తగాదాలు గిల్లికజ్జా లతో తమ లైఫ్ ని హ్యాపీగా ఉంచుకుంటారు....
అలా చూస్తూ ఉండగానే మరో నాలుగునెలలు గడిచిపోతాయి.... కానీ డైలీ నందు మాత్రం తన అమ్మానాన్నలతో చెల్లెళ్లతో గౌతమ్ అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉంటుంది....
గౌతమ్ మాత్రం ఆఫీస్ పనుల్లో ఉండి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు....
అలాంటి టైమ్‌లోనే అపార్ట్మెంట్లోని పక్క ఫ్లాట్ ఆంటీ షాపింగ్ కి వెళుతూ నందుని కూడా తీసుకు వెళ్తుంది..... నందు కూడా సరే అని వెళ్లి అక్కడ పది వేల రూపాయల సారీ నచ్చి పట్టుబట్టి గౌతమ్ చేత కొనుక్కుంటుంది.....
ఇది జరిగింది....
ఇప్పుడు మనం ప్రెసెంట్ లోకి వచ్చేద్దాం....
ఉదయాన్నే లేచిన గౌతమ్ తన కౌగిలిలో నే పడుకొని ఉన్న నందుని చూసి "పడుకున్నప్పుడు ఎంత అమాయకంగా కనిపిస్తావు నందు!!!! కానీ నిద్ర లేచినప్పుడు అంత గయ్యాళి గా మారిపోతావు.... కానీ నాకు ఈ నందు కూడా నచ్చింది....." అని నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నందు అని తన భుజం తడుతూ లేపటానికి చూస్తాడు
"ఇంకొంచెం సేపు నిద్ర పోనివ్వడి గౌతమ్.... రాత్రంతా మీరు నన్ను వదిలారా???? అసలు నిద్ర పోనివ్వకుండా మళ్ళీ వెంటనే లేపుతున్నారు....నాకు చాలా అలసటగా ఉంది..... ప్లీజ్ గౌతమ్ కొంచెం సేపు పడుకో నివ్వండి...." అని పక్కకి వొత్తి గిల్లి మళ్ళీ పడుకుంటుంది
గౌతమి నవ్వుతూ "సరే అయితే నువ్వు నిద్రపో నేను ఫ్రెష్ అయి బయటకు ఏదో ఒకటి తినేసి ఆఫీస్ కి వెళ్ళి పోతాను...." అని చెప్పి నందు బుగ్గ మీద ముద్దు పెట్టి తనని పక్కన పడుకోపెడుతూ పైకి లేస్తూ ఉంటే నందు వెంటనే కళ్ళు తెరిచి గౌతమ్ వైపు చూస్తూ "టైం ఎంత అవుతుంది గౌతమ్???" అని ఆశ్చర్యంగా అడుగుతుంది
"ఆల్రెడీ 7 అయ్యింది ఇంకో వన్ అండ్ ఆఫ్ అవర్ లో నేను బయలుదేరాలి.... ఈ ట్రాఫిక్ లో ఆఫీస్‌కి వెళ్ళే సరికి 9:30 అవుతుంది అని నీకు తెలుసు కదా!!!"అని నవ్వుతూ అంటాడు
నందు వెంటనే పైకి లేచి జారిపోతున్న చీర సరి చేసుకుని జుట్టు ముడి వేసుకుంటూ "ఇంతసేపు పడుకున్నానా??? అయ్యో మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి గౌతమ్ మీకు కాఫీ ఇచ్చి టిఫిన్ చేసి క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను...." అని హడావిడిగా పైకి లేచి గౌతమ్ కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కిచెన్ లోకి వెళ్లి పోతుంది
గౌతమ్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవడానికి వెళ్లి బయటికి వచ్చేసరికి నందు కాఫీ కప్పుతో నవ్వుతూ గౌతమ్ ఎదురుగా నిలబడి ఉంటుంది....
గౌతమ్ నవ్వుతూ కాఫీ తీసుకుని "నువ్వు కూడా ఫ్రెష్ అయ్యి రా.... లేకపోతే లేచిన తర్వాత ఉదయాన్నే చాలా అనీజీ గా ఉంటుంది....." అని అంటాడు
నందు భర్త ఏది చెప్తే అది వినే భార్యలా తల ఊపి ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్ళిపోతుంది....
"నిన్న దీనికి ఇష్టమైన చీర కొనే సరికి ఈ రోజంతా కూడా నేను ఏది చెప్తే అదే చేస్తుంది.... ఇది ఎప్పుడూ జరిగేదే కదా!!!"అని అనుకుంటా నవ్వుకుంటూ కాఫీ తాగి టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు
నందు ఫ్రెష్ అయి బయటకు వచ్చి "హాఫ్ n అవర్ గౌతమ్ టిఫిన్ చేస్తాను..."అని హడావిడిగా కిచెన్ లోకి వెళ్తుంది
గౌతమ్ కూడా నందు వెనకాలే వెళ్లి "నేను నీకు హెల్ప్ చేస్తాను.... వంట కూడా చేయాలి కదా!!!! అసలే నువ్వు తెల్లగా ఉంటావు ఇంత పని చేస్తే నీ చేతులు ఎర్రగా కందిపోయి నొప్పి పుడతాయి..." అని చెప్పి గౌతమ్ నందు తో మాట్లాడుతూనే కూరగాయలు కట్ చేసి ఇస్తాడు.....
నందు అవి తీసుకొని టిఫిన్ ప్రిపేర్ చేస్తూనే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ గౌతమ్ ని చూసి మురిసిపోతూ "నీలాంటి హస్బెండ్ ఎవరికీ దొరకరు గౌతమ్.... ఎంత హెవీ వర్క్ ఉన్న నా మీద చిన్న చిరాకు కూడా చూపించవు.... పెళ్లి అయినప్పటినుంచి ఇంతవరకు నాకు ఇలా హెల్ప్ చేస్తూనే ఉన్నావు..... నువ్వు నా భర్తగా దొరకడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం....." అని గౌతమ్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది
గౌతమ్ నందు మాటలకి భయపడుతూనే "ఇప్పుడు నీకు ఏం కావాలి నందు??? నన్ను ఇలా ఐస్ చేస్తున్నావు???" అని అడుగుతాడు
నందు వెంటనే అలక గా మొహం పెట్టి "నేను మిమ్మల్ని అంతలా సతాయిస్తున్నానా??? జస్ట్ చిన్న చిన్నవి కొనిపించమని అడుగుతున్నాను..... అందుకే కదా మీ దృష్టిలో నేను లోకువ అయ్యాను..... మీకు నేనంటే లెక్కేలేదు ప్రతిసారి ఇలాగే మాట్లాడుతారు...." అని అంటుంది
గౌతమ్ నవ్వుతూ నందుని వెనక నుంచి హగ్ చేసుకొని "నువ్వు ఇలా అలిగితే చాలా అందంగా ఉంటావు నందు.... నువ్వు అలిగినప్పుడు నీ ముక్కు కోపంతో ఎర్రగా ఉంటుంది చూడు అప్పుడు అది అచ్చం చిలకముక్కు లానే ఉంటుంది...."అని నందు మొహం తనవైపు తిప్పుకొని తన పెదవులు అందుకుని ఐదు నిమిషాలు ముద్దు పెట్టి తన ముక్కు మీద కూడా ముద్దు పెట్టి వదిలేసి నవ్వుతూ నందు వైపు చుస్తాడు
నందు చిరుకోపంగా గౌతమ్ వైపు చూస్తూ "ఇప్పుడేంటి ఈ అల్లరి గౌతమ్..... ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక మీరు వెళ్లి స్నానం చేయండి నేను రైస్ వండి క్యారేజ్ రెడీ చేసి పెడతాను...." అని అంటుంది
గౌతమ్ గారంగా "నువ్వు కూడా నాతో పాటు స్నానానికి రావచ్చు కదా నందు ఇద్దరం కలిసి స్నానం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా???' అని తన మెడమీద ముద్దులు పెడుతూ అడుగుతాడు
"ప్చ్ మీ అల్లరి ఉదయాన్నే మొదలు పెట్టకండి గౌతమ్ ప్లీజ్ నాకు చాలా పని ఉంది...." అని అంటూనే బియ్యం కడిగి రైస్ కుక్కర్ లో పెట్టేస్తుంది
"ఏమి కాదు నందు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కదా నాతో మాట్లాడుతూనే చేసేసావు కదా!!!! ఇంకేం పని ఉంది కర్రీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది.... నువ్వు వస్తేనే నేను స్నానానికి వెళతాను లేకపోతే ఇలాగే ఉంటాను.... నువ్వు ఇలా చేస్తూనే ఉంటే నాకు లేటవుతుంది చూసుకో మరి...." అని అంటాడు
"మీరు స్నానానికి వెళ్ళకుండా లేట్ చేస్తూ పైగా నన్ను అంటున్నారా నా వల్ల లేట్ అవుతుందని???" అని చిరు కోపంగా గౌతమ్ వైపు చూస్తూ నడుము మీద చేతులు పెట్టుకుని అడుగుతుంది
"అది నిజమే కదా నీ వల్లే నాకు లేట్ అవుతుంది.... నువ్వు నేను అడిగినప్పుడు నాతోపాటు వస్తే నాకు లేట్ అవుతుందా చెప్పు??? అందుకే రా ఇద్దరం కలిసి స్నానానికి వెళ్దాం...." అని గారంగా తన కొంగు పట్టుకొని లాగుతూ కొంటె కృష్ణుడిలా అడుగుతాడు
నందు నవ్వుతూ తన వైపు చూస్తూ "ఏంటి కృష్ణయ్య వేషాలు వేస్తున్నారు???? మనకి ఇప్పుడు వీటికే తక్కువ అయింది..... మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి గౌతమ్" అని గౌతమ్ వెనక నుంచి తోస్తూ ఉంటుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
ఇప్పటి వరకు చదివిన, చదువుతున్న మితృలకు అభివందనములు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
గౌతమ్ వెంటనే నందు చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కొని తన రెండు చేతుల మధ్య లో లాక్ చేసి "నువ్వు ఇలా చెప్తే ఎందుకు వింటావు నందు??? నా స్టైల్ లోనే చెప్పాలి..." అని అంటూ నందునీ ఎత్తుకొని గ్యాస్ ఆఫ్ చేసి నందుని డైరెక్టుగా వాష్ రూం లోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిల్చోబెట్టి తనని కదలకుండా కౌగిలించుకుని నవ్వుతూ నందు వైపు చూస్తూ ఉంటాడు
నందు చిరుకోపం గౌతమ్ వైపు చూస్తూ "మిమ్మల్ని" అని తన భుజం మీద కొట్టి వెంటనే గౌతమ్ గుండెల మీద వాలిపోయి "ఏంటి గౌతమ్ మీరు రానురాను చిన్నపిల్లాడిలా తయారవుతున్నారు.... చూడండి నేను ఎలా తడిసిపోయానో!!! నేను బయటికి వెళ్తాను మీరు త్వరగా స్నానం చేసి రండి...." అని అంటుంది
"చెప్పాను కదా నువ్వు ఉంటేనే నేను స్నానం చేస్తాను అని..." అంటూ తనని గట్టిగా కౌగిలించుకొని మెడ మీద ముద్దులు పెడుతూ చీరని నందు నుంచి వేరు చేస్తూ ఉంటాడు
నందు గౌతమ్ చేసే పనులకి మనసు వశం తప్పుతుంటే "ప్లీజ్ గౌతమ్ నన్ను వదిలేయండి ఇప్పటికే మీకు చాలా లేట్ అయింది..." అని అడుగుతూ ఉంటుంది
"ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు.... ఈ గౌతమ్ గాడి మనసు ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది....." అని చెప్పి నందు నుంచి తన బట్టలు వేరుచేసి గౌతమ్ కూడా వివస్త్రగా మారిపోయి నందుని తన చేతులతో పెదవులతో తడిమేస్తూ పూర్తిగా తడిసిపోయిన నందు అందాలని చూస్తూ చివరికి తనని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి పూర్తిగా ఆక్రమించుకొని తనలో కలిపేసుకుంటాడు
నందు కూడా సంతోషంగా గౌతమ్ కలిసిపోతుంది....
అలా ఒక అరగంటకి ఇద్దరూ విడువడి ముందు గౌతమ్ వెళ్లి ఫ్రెష్ అయి వస్తే తర్వాత నందు వెళ్లి ఫ్రెష్ అయి వచ్చి "చూడండి మీ వల్ల ఎంత లేట్ అయిందో మళ్ళీ మీకు లేట్ అవుతుంది అని నన్ను అంటారు...."అని అంటుంది
గౌతమ్ తన వాచ్ లో టైం చూసి 8:30 చూపిస్తుంటే "నిజంగానే చాలా లేట్ అయింది నందు త్వరగా టిఫిన్ పెట్టు నేను వెంటనే బయలుదేరాలి...." అని అంటాడు
"ఇదంతా చేసేటప్పుడు గుర్తుకు రాలేదా మీ ఆఫీస్ కి లేట్ అవుతుందని పదండి పెడతాను..." అని చిరు కోపంగా చెప్పి గౌతమ్ కి టిఫిన్ పెట్టి నవ్వుతూ గౌతమ్ వెళ్లేంత వరకు గుమ్మం దగ్గరే ఉండి గౌతమ్ వెళ్ళగానే లోపలికి వచ్చి గౌతమ్ చేసిన అల్లరి ని గుర్తు చేసుకుని నవ్వుకుంటూ టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉంటుంది.....
గౌతమ్ ఉదయాన్నే నందు ఇచ్చిన ఎనర్జీతో హుషారుగా ఆఫీస్ లోకి వెళ్లి తన వర్క్ చేసుకుంటూ ఉండగానే మేనేజర్ గౌతమ్ ని పిలిచి "ఏంటిది గౌతమ్ నీకు ఇచ్చిన వర్క్ ని ఇలా డిలే చేస్తావా??? నీ వల్ల మన కంపేనీకి ఎంత రిమార్క్ వస్తుందో తెలుసా???? నీకు వర్క్ చేయటం రాకపోతే ఇంట్లో కూర్చుని ఉండాలి అంతే కానీ వేలకి వేలు జీతాలు తీసుకుంటూ ఇలా వర్క్ చేయకుండా ఉంటే క్లైంట్స్ కి ఏం సమాధానం చెప్పాలి??? ఇప్పుడు నీకు ఇచ్చిన ప్రాజెక్టు డేడ్ లైన్ కూడా ఈ పాటికి అయిపోవాలి కానీ నువ్వు మాత్రం ప్రాజెక్ట్స్ సడ్మిట్ చేయలేదు..... ఇప్పుడు నీకేమీ కాదు కానీ నేను కదా పై ఆధారిటీ కి సమాధానం చెప్పాలి..... ఇప్పుడు నువ్వు చెప్పు అసలు ఇలా వర్క్ చేయకుండా ఎందుకు ఉన్నావు???? ఇప్పటివరకు నేను నుంచి ఈ నెగ్లిజెన్సీ నేను ఎప్పుడూ చూడలేదు.... ఈ రోజు ఈ ప్రాజెక్టు ఇచ్చేయాలి కదా మరి అది ఇంకా పూర్తి కాలేదు నువ్వు ఏం చేస్తున్నావు???? నీ టీమ్ మెంబర్స్ ఏం చేస్తున్నారు????" అని గౌతమ్ ఎడాపెడా వాయించేస్తాడు
గౌతమ్ బాధగా మనసులో "అసలు అలా ఎలా మర్చిపోయాను??? జాబ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఒకరి రిమార్క్ లేదు కానీ మొదటి సారి ఇలా జరిగింది...." అని అనుకుంటూ మొన్న వర్క్ చేద్దామని లాప్టాప్ తీసినప్పుడు నందు చేసిన అల్లరి గుర్తుకువచ్చి "నందు చేసిన పని వల్ల అనవసరంగా వర్క్ ఆగిపోయింది.... అదే ఆ రోజు తను నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండి ఉంటే ఈరోజు ఇలా మేనేజర్ చేత తిట్లు తినే వాడిని కాదు...." అనుకుంటూ గిల్టీగా తలదించుకుని "సారీ సార్ ఒక వన్ అవర్ టైం ఇస్తే వర్క్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ డైరెక్ట్ గా క్లైంట్స్ కి సబ్మిట్ చేస్తాను...." అని చెప్పి బయటికి వచ్చి కోపంగా ఎవరితో మాట్లాడకుండా తన పని చేసుకుంటూ ఉంటాడు
అలా గౌతమ్ చెప్పినట్టుగానే వన్ అవర్ లో వర్క్ కంప్లీట్ చేసేసి క్లైంట్స్ కి సబ్మిట్ చేస్తాడు..... కానీ మేనేజర్ అన్న మాటల్ని ఈజీగా తీసుకోలేక కోపంగా ఎవరితో మాట్లాడకుండా లంచ్ కూడా చేయకుండా అంతే సిస్టం ముందు కూర్చుని మిగిలిన వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాడు.....
నందు ఉదయం నుంచి కంటిన్యూస్‌గా గౌతమ్ కి ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకుండా అంతే ఉంటాడు.....
సాయంత్రం నందు అందం గా రెడీ అయ్యి గౌతమ్ కి ఏదో చెప్పాలని ఆతృతగా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.....
గౌతమ్ కోపంగా ఇంటికి వచ్చి కనీసం నందు వైపు చూడకుండానే ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకువెళ్లి బెడ్ మీద విసిరేసి టవల్ తీసుకొని బాత్ రూం లోకి వెళ్ళి పోతాడు....
నందు అయోమయంగా గౌతమ్ వైపు చూస్తూ "ఎప్పుడు నేను నవ్వుతూ ఎదురు రావాలని కోరుకునే గౌతమ్ ఈరోజు ఏంటి తనకోసం నేను గుమ్మంలోనే వెయిట్ చేస్తున్నా కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు???? పైగా అంత కోపంగా ఉన్నాడు ఏమైంది???" అని అనుకుంటుంది
గౌతమ్ ఫ్రెష్ అయి నందు తో మాట్లాడాలి అనిపించక సైలెంట్ గా బెడ్ మీద వెల్లకిలా పడుకొని కళ్ళ మీద చేతులు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు.....
నందు నవ్వుతూ గౌతమ్ పక్కనే పడుకుని తన మీద చేయి వేసి "గౌతమ్" అని ప్రేమగా పిలుస్తుంది
గౌతమ్ వెంటనే నందు చెయ్యి పక్కకి తోసి పైకి లేచి "ఇప్పుడు ఏం కావాలి నందు ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావ్???? నువ్వు ప్రేమగా మాట్లాడిన ప్రతిసారీ ఏదో ఒక దాని కోసమే కదా ఇలా చేస్తూ ఉంటావు???? పెళ్లయినప్పటి నుంచి ఎన్ని సార్లు చూడలేదు!!!! ఎందుకు ఇలా ఉన్నావు నందు??? నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది..... నేను నిన్ను ఏమి అడిగాను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నాకు నవ్వుతూ కనపడు అన్నాను కాని నువ్వు ఆ టీవీ సీరియల్స్ చూస్తూ నన్ను అసలు పట్టించుకున్నావా??? కొంచమైనా నాతో మాట్లాడుతావా???? ఎప్పుడు ఏదైనా అవసరమైతే తప్ప ఇలా ప్రేమగా దగ్గరికి రావు..... ఎందుకు నన్ను ఇలా తింటున్నావు నందు??? నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది..... నిన్ను నా జీవితంలోకి తీసుకు రావటమే నేను చేసిన పెద్ద తప్పు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది.... ప్లీజ్ కొంచెం సేపు నన్ను ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళు....." అని ఫ్రస్టేషన్ లో కోపంగా అరుస్తాడు
నందు గౌతమ్ మాటలన్నీ విని "గౌతమ్ నీకసలు అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావో???? ఈరోజు ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు????" అని కోపంగా అడుగుతుంది
గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ "నందు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళక పోతే నాకు వచ్చే కోపానికి నిన్ను కొడతాను ఏమో అనిపిస్తుంది..... ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలెయ్..... అది కూడా నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేనే బయటికి వెళ్లిపోతాను నువ్వు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండు...." అని చెప్పి పైకి లేచి బైక్ కీస్ తీసుకొని రోడ్డుమీద పడిపోతాడు
నందు గౌతమ్ వెళ్ళాక తను అన్న మాటలని మళ్లీ నెమరు వేసుకొని ఏడుస్తూ "నేనంటే అంత ప్రేమ లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు గౌతమ్??? ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది???? ఎందుకు ఇలా చేశావు గౌతమ్??? నీతో ఒక విషయం సంతోషంగా షేర్ చేసుకోవాలి అని ఎదురు చూస్తుంటే నా సంతోషాన్ని అంతా ఆవిరి చేసావు.... ఐ హేట్ యు ఐ హేట్ యు గౌతమ్ ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చడం లేదు...." అని ఏడుస్తూ అంతే నిద్రపోతుంది
గౌతమ్ అలా సిటీ అంతా తిరుగుతూ నైట్ తొమ్మిదింటి వరకు బయటే ఉండి 9 ఇంటికి వచ్చి నందు ఎక్కడా కనిపించక పోయేసరికి రూమ్ లోకి వెళతాడు..... రూమ్ లో నందు ఒక సైడ్ కి తిరిగి పడుకొని గౌతమ్ అయోమయంగా " నందు ఈ టైం లో పడుకుంది ఏంటి???" అనుకుంటూ తన దగ్గరికి వెళ్లి తన మొహం చూసేసరికి బాగా ఏడవటం వలన తన కళ్ళు, మొహం మొత్తం ఉబ్బి పోయి కనిపిస్తుంది.....
గౌతమ్ నందు ని అలా చూసి బాధగా అనిపించి వెంటనే నందు దగ్గరికి వెళ్లి "ఐ యాం సారీ నందు ఏదో ఆఫీస్ లో మేనేజర్ నన్ను అలా అనటం వలన ఆ ఫ్రస్టేషన్లో నీమీద తెలియకుండానే అరిచేశాను...." అనుకుంటూ తన కడుపు లోపలికి పోయి ఉండటం చూసి "నందు ఇంకా భోజనం చేయలేదా????" అనుకుంటూ నందు అని తన భుజం మీద తడుతూ లేపుతాడు
నందు పైకి లేచి గౌతమ్ వైపు చూడకుండానే సైలెంట్‌గా బయటికి వెళ్ళి పోతూ ఉంటుంది.....
గౌతమ్ నందు కి కోపం వచ్చింది అని అర్థమై వెంటనే తన చెయ్యి పట్టుకుని "ఐయామ్ సారీ నందు ఏదో ఫ్రస్టేషన్లో నీ మీద అరిచేశాను..... రియల్లీ సారీ నువ్వు ఇంత బాధ పడతావు అనుకోలేదు....." అని బాధగా అంటాడు
నందు గౌతమ్ తన చేయి పట్టుకున్న కనీసం తన వైపు కూడా తిరగకుండానే తన చేయి విడిపించుకుని వెంటనే బయటికి వెళ్లి పోయి డైనింగ్ టేబుల్ దగ్గర వెళ్లి కిచెన్ లో ఉన్న డిషెష్ అన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది.....
గౌతమ్ అసహనంగా నందు వెనకే వెళ్లి "ఏమైంది నందు ఎందుకు నాతో మాట్లాడటం లేదు????" అని అడుగుతాడు
నందు అయినా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటే గౌతమ్ కోపంగా నందుని తన దగ్గరికి లాక్కుని తన కౌగిలిలో బిగించి "ఎందుకు నందు నాతో మాట్లాడటం లేదు?? అసలు నా వైపు కూడా చూడటం లేదు ఏమైంది???" అని అడుగుతుంటే
నందు గౌతమ్ తో మాట్లాడకుండా తన కౌగిలి నుంచి విడిపించుకోవడానికి గింజుకుంటూ కనీసం గౌతమ్ వైపు కూడా చూడదు.....
నందు అలా చేస్తుంటే గౌతమ్ కి కోపం వచ్చి తన బుగ్గలు గట్టిగా పట్టుకుని పైకి లేపి "నా వైపు చూడు నందు.... ఎందుకు నాతో మాట్లాడటం లేదు ముందు అది చెప్పు????" అని కోపంగా అడుగుతాడు
నందు అయినా కళ్ళు కిందకి దించి గౌతమ్ వైపు చూడకుండా "నేనంటే నీకు ఇష్టం లేదు కదా గౌతమ్!!! నీతో మాట్లాడితే నీకు నచ్చుతుందో?? లేదో??? అని నేనే మాట్లాడటం లేదు.... ముందు భోజనం చెయ్యి.… " అని చెప్పి బలవంతంగా గౌతమ్ కౌగిలి నుంచి విడిపించుకుని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం పెట్టుకుంటూ ఉంటే గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ ఉంటాడు
నందు అది గమనించి "నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడకుండా భోజనం చేయకపోతే నేను భోజనం చేయకుండా ఇక్కడనుంచి వెళ్ళిపోతాను గౌతమ్.... అది నీకు ఇష్టమైతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను...." అని కోపంగా అంటుంది
గౌతమ్ వెంటనే కోపంగా వచ్చి చైర్ లో కూర్చోగానే నందు తనకి కూడా వడ్డించి ఏడుపు వస్తుంటే కష్టంగా ఆపుకుంటూ ఒక్కో ముద్ద మింగుతూ ఉంటుంది.....
గౌతమ్ తింటూ నందు వైపు చూస్తూనే నందు అలా కష్టంగా తినటం చూసి తన మాటల వల్ల ఎంత హర్ట్ అయ్యిందో అర్ధమవుతూ ఉంటే బాధగా తినాలని అనిపించక వెంటనే తింటున్న ప్లేట్ లోనే చేయి కడిగేసుకుని నందు దగ్గరికి వెళ్ళటానికి పైకి లేస్తాడు.....
నందు అది గమనించి వెంటనే తను కూడా చేయి కడుక్కొని గౌతమ్ కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా గబగబా మరొక బెడ్ రూం లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుని బెడ్ మీద పడిపోయి తన కడుపు మీద చేయ్యి పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది....
గౌతమ్ నందు అలా వెళ్ళిపోవడం చూసి అది వాళ్ల రూమ్ లోకి కాకుండా వేరే బెడ్ రూమ్ లోకి వెళ్లడం చూసి తన వెనకే వెళ్ళి డోర్ కొడుతూ "నందు ఓపెన్ ద డోర్ ప్లీజ్ మనం కూర్చుని మాట్లాడుకుందాం..... నేను నీతో అలా మాట్లాడి ఉండకూడదు.... ఐ యాం రియల్లీ సారీ రా ప్లీజ్ నందు డోర్ ఓపెన్ చెయ్యి...." అని కంటిన్యూస్‌గా డోర్ కొడుతూ ఉంటాడు
నందు కష్టంగా ఏడుపు ఆపుకుంటూ "ప్లీజ్ గౌతమ్ నన్ను ఈ నైట్ కి ఒంటరిగా వదిలెయ్..... నేను ఒంటరి గా ఉండాలి అనుకుంటున్నాను ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో....." అని కష్టంగా ఏడుపు ఆపుకుంటూ బొంగురుపోయిన గొంతుతో అంటుంది
గౌతమ్ అది విని "నందు ప్లీజ్ రా నేను చెప్పేది విను..... నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఏమీ తోచదు.... ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్....." అని అంటూ ఉండగానే
"ప్లీజ్ గౌతమ్ ఇప్పుడు నువ్వు నీ రూమ్ లోకి వెళ్లి పడుకో నన్ను డిస్టర్బ్ చేయకు...." అని చాలా బాధగా అడుగుతుంది
గౌతమ్ కూడా ఇక నందుని కదిలించలేక "ఐ యాం రియల్లీ సారీ నందు నేను అలా మాట్లాడి ఉండకూడదు..... ప్రశాంతంగా నిద్రపో...ఏది ఆలోచించకు.... నేను ఏమీ కావాలని అనలేదు జస్ట్ కోపం లో అనేసాను..... అవన్నీ పట్టించుకోని నువ్వు ఇలాగే ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను.... నేను బయట సోఫాలో పడుకున్నాను.....మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం.... గుడ్ నైట్..." అని చెప్పి బయట హాల్లో ఉన్న సోఫాలో పడుకుని నందు ఉన్న రూమ్ వైపు చూస్తూ నందు ఎప్పుడు డోర్ తీస్తుందా??? అని ఎదురు చూస్తూ ఉంటాడు
నందు ఏడుస్తూ "నువ్వు అన్నప్పుడు గుర్తుకు రాలేదా గౌతమ్ ఈ మాటలన్నీ??? ఎలా అన్న నువ్వు అన్న మాటలు నా మనసుకి గుచ్చుకున్నాయి.....ఇప్పుడు ఆ మాటలన్ని నీ మనసులో నుంచి రాలేదు అంటే నేను ఒప్పుకోలేను..... నేను నిన్ను అంత ఈజీగా క్షమించలేను గౌతమ్..... నీ నుంచి అలాంటి మాటలు నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు....." అనుకుంటూ నిద్రపోతుంది
ఉదయాన్నే లేచిన నందు డోర్ తీసి బయటకు వచ్చేసరికి నందు రూమ్ వైపే చూస్తూ ఎప్పుడో ఉదయాన్నే నిద్ర పోయినా గౌతమ్ సోఫా సరిపోక కాళ్ళు ముడుచుకొని పడుకొని నిద్ర పోతూ ఉంటాడు.....
నందు గౌతమ్ వైపు ఒక్క క్షణం చూసి వెంటనే తన పనిలో పడి పోతుంది.....
ఇల్లంతా క్లీన్ చేశాక ఫ్రెష్ అవడానికి వెళ్లి వచ్చి దేవుడి గదిలో దీపం పెడుతూ హారతి ఇచ్చేటప్పుడు గంట కొడుతూ ఉంటే ఆ సౌండ్ కి గౌతమ్ కి మెలకువ వచ్చి టైమ్ ఎంతయింది అని గోడ గడియారం చూసుకొని 7:30 చూపిస్తుంటే వెంటనే పైకి లేచి "ఇంత టైం నిద్రపోయానా??? నందు!!! నందు" అనుకుంటూ నందు నైట్ నిద్ర పోయిన రూమ్ వైపు చూసే సరికి ఆ రూమ్ ఓపెన్ లోనే వుండడం చూసి "నందు లేచిందా???" అని రూమ్ దగ్గరికి వెళ్తూ ఉండగానే నందు పూజ కంప్లీట్ చేసుకొని పూజ గది నుంచి బయటకు వస్తుంది.....
గౌతమ్ వెంటనే నందు వైపు చూసి తన మొహం చూసి రాత్రంతా ఏడ్చింది అని అర్థమై బాధగా నందు దగ్గరికి వెళ్తూ "రియల్లీ సారీ నందు ఎక్స్ట్రీమ్లీ సారీ ప్లీజ్ నువ్వు ఇంతలా హర్ట్ అవుతారు అనుకోలేదు..... నువ్వు ఇలా నాతో అంటి ముట్టనట్టు గా ఉంటే నాకు నచ్చడం లేదు.... ప్లీజ్ నందు నాతో మాట్లాడు...." అని నందు కి ఒక అడుగు దూరంలో ఉండగా
నందు చెయ్యి అడ్డం పెట్టి గౌతమ్ ని ఆపేసి "ప్లీజ్ గౌతమ్ ఇప్పుడు నాకు నీతో మాట్లాడే టైం లేదు..... నాకు చాలా పని ఉంది.... నువ్వు ఫ్రెష్ అయి టిఫిన్ తినేసి ఆఫీస్ కి వెళ్లిపో...." అని చెప్పి వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోతుంది
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
ఈ భాగం చదివిన, వ్యాఖ్యానించిన మితృలకు వందనములు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
గౌతమ్ కూడా నందు వెనక్కి వెళ్తూ "ఎందుకు నందు ఇంత పట్టుదలగా ఉన్నావు??? మొగుడు ఒక మాటంటే పడలేవా??? అంత కాని వాడిని అయ్యానా???" అని బాధగా అడుగుతాడు
"కానీ వాడివి నువ్వు కాదు గౌతమ్ నీకే నేను కాని దానిని అందుకే నిన్న అలా అన్నావు..... నీ మనసులో లేకుండానే నీ నోట్లో నుంచి అలాంటి మాటలు నా గురించి వస్తాయా???? నువ్వు అలా అని అనుకుంటున్నావు కాబట్టే నీ నోట్లో నుంచి కూడా అవే మాటలు వచ్చాయి.... నేను ఎప్పుడూ అలాంటి మాటలు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ ....." అని చెప్పి సైలెంట్‌గా వంట చేసుకుంటూనే ఉంటుంది
గౌతమి ఏదో మాట్లాడబోతే ఉంటే తన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది.....
" ముందు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చెయ్ గౌతమ్ ఎంత ఇంపార్టెంటో ఏమో!!!" అని గౌతమ్ వైపు చూడకుండానే అంటుంది
గౌతమ్ అసహనంగా వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ లో చెప్పిన మాటలు విని షాక్ అయ్యి వెంటనే హడావిడిగా బైక్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు......
గౌతమ్ అలా వెళ్ళిపోవటం చూసి ఎందుకు వెళ్లాడో కూడా అర్థమై మిగిలిన పనులు చేసుకుంటూ నందు బిజీ అయిపోతుంది.....
గౌతమ్ నేరుగా రైల్వేస్టేషన్ కి వెళ్ళి తనకి కావాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్లి "ఏంటి అమ్మ నాన్న ఇంత సడన్ గా వచ్చారు??? కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు???? మీరైనా చెప్పలేదు ఏంటి అత్తయ్య మావయ్య????" అని మౌనిక వైపు చూస్తూ "ఎలా ఉన్నావు మౌనిక???" అని అడుగుతాడు
"బాగున్నాను బావ...." అని నవ్వుతూ చెప్పగానే గౌతమ్ తన అమ్మానాన్నల వైపు చూస్తాడు.... గౌతమ్ చూపుని అర్థం చేసుకొని "అదేంటి రా అంటావ్ మేము వస్తున్నాము అని నిన్నే నందుకి చెప్పాము కదా!!!! పైగా కోడలు పిల్ల ప్రెగ్నెంట్ అయితే ఈ టైంలో తనని ఒంటరిగా ఎలా వదిలేస్తాము అనుకున్నావు???? అందుకే తనని చూసి ఒకసారీ డాక్టర్ కి చూపించి మాతోపాటు తీసుకు వెళ్దామని వచ్చాము....." అని అయోమయంగా అంటారు
గౌతమ్ తన అమ్మ చెప్పిన మాటకి నందు ప్రెగ్నెంట్ అన్న దాని దగ్గరే తన మైండ్ ఆగిపోయి వెంటనే ఆనందంతో అంటే "నేను తండ్రి కాబోతున్నానా??? మరి నందు నాకెందుకు చెప్పలేదు????" అనుకుంటూ నిన్న నందు తన కోసమే ఎదురు చూస్తూ ఏదో చెప్పాలని ట్రై చేయడం గుర్తుకు వచ్చి గౌతమ్ బాధగా "ఎంతో సంతోషంగా నాతో ఈ న్యూస్ షేర్ చేసుకోవాలని అనుకుంది.... కానీ నేను నందు కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా నానా మాటలు అని తనని బాధపెట్టాను.... ఇలాంటి టైం లో మైండ్ ఎంత ప్లెజెంట్ గా ఉండాలి??? అలాంటిది నేనే తనని బాధపెట్టాను..... నన్ను నేను ఎన్ని అనుకున్న తక్కువే...." అనుకుంటూ ఆలోచించు కుంటూ ఉంటాడు
గౌతమ్ అమ్మ గౌతమ్ వీపు మీద కొట్టగానే గౌతమ్ స్రృహ లోకి వచ్చి "ఏంటమ్మా అంత గట్టిగా కొట్టావు???" అని తన వీపు రుద్దుకుంటూ చిరాకుగా అడుగుతాడు
"ఎంత పిలిచినా పలకక పోతే కొట్టక పోతే ముద్దు పెట్టుకోవాలా???? ఎన్నిసార్లు పిలవాలి రా??? అయినా నీకు తెలియదా నందు ప్రెగ్నెంట్ అని!!! నందు నీకు చెప్పలేదా మేము వస్తున్నామని???" అని అనుమానంగా అడుగుతారు
గౌతమ్ తడబడుతూ "అది అమ్మ అని నందు చెప్పింది కానీ నేనే మర్చిపోయాను..... ఉదయం మీరు ఫోన్ చేసేదాక నాకు గుర్తుకులేదు సారీ అందుకే టైం కి రాలేక పోయాను...." అని కవర్ చేస్తాడు
గౌతమ్ అమ్మగారు నాన్నగారు ఇంకా అనుమానంగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటే గౌతమ్ అది గమనించి "సరే సరే పదండి నందు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది..... అది ఇంకా టిఫిన్ కూడా చేయలేదు...." అని హడావిడి చేసి అందర్నీ తీసుకుని ఇంటికి వెళ్తాడు
గౌతమ్ ఇంటికి వచ్చి నందు వైపే చూస్తూ మనసులో "ఐ యాం రియల్లీ సారీ నందు.... నేను నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఇక నుంచి నీ కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటాను.... ఇట్స్ మై ప్రామిస్...." అనుకుంటాడు
నందు అందరినీ ఆప్యాయంగా పలకరించి గౌతమ్ అమ్మగారు నందు అమ్మగారు నందు ఆరోగ్యం గురించి తెలుసుకొని "డాక్టర్ దగ్గరికి వెళ్ళావా నందు???" అని అడిగితే
" ఈరోజు వెళ్లాలి అపాయింట్మెంట్ తీసుకున్నాను.... ఆఫ్టర్నూన్ వెళ్దాం ..... గౌతమ్ కి ఆఫీస్ ఉంది అందుకే మీరు నేను వెళ్దాం లే!!!" అని నవ్వుతూ అంటుంది
గౌతమ్ వెంటనే "లేదు నందు ఆల్రెడీ నేను వన్ వీక్ లీవ్ చెప్పేశాను.... ప్రాజెక్ట్ కూడా నిన్నే అయిపోయింది కాబట్టి వర్క్ కూడా అంతగా లేదు.... నువ్వు నేను కలిసి హాస్పిటల్ కి వెళ్దాంలే...." అని నవ్వుతూ అంటాడు
నందు అందరూ ఉన్నారని ఇక ఏం మాట్లాడలేక సైలెంట్‌గా సరే అని తల ఊపుతుంది.....
"సరే పద నందు ఇప్పటికే చాలా లేట్ అయింది..... నువ్వు కరెక్ట్ టైం భోజనం చేయాలి అసలే చాలా నీరసంగా ఉన్నావు కదా!!!" అని చెప్పి అందరినీ టిఫిన్ కి రమ్మని చెప్పి అందరూ టిఫిన్ చేస్తుంటే గౌతమ్ స్వయంగా తనే నందు కి తినిపించటానికి నందు నోటి దాకా టిఫిన్ తీసుకు వస్తాడు..... నందు అందరూ వైపు చూస్తూ నవ్వు నటిస్తూ "నువ్వు తిను గౌతమ్ నేను తింటా లే...." అని అంటున్న గౌతమ్ బలవంతంగా "అవసరం లేదు ఈరోజు నుంచి నేనే నీకు తినిపిస్తాను...." అని నవ్వుతూ చెప్పి బలవంతంగా నందు నోట్లో టిఫిన్ పెడతాడు..... నందు కూడా అందరూ ఉన్నారని సైలెంట్ అయిపోతుంది.....
అలా అందరూ టిఫిన్ చేసి సోఫా లో కూర్చోగానే "సరే నందు నువ్వు రెస్ట్ తీసుకో..... ఇలాంటి టైం లో ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి.... దేని గురించి స్ట్రెస్ తీసుకోకూడదు..... లేదంటే లోపల బేబికి ప్రమాదం..... ఈ టైం లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి....." అని గౌతమ్ అమ్మగారు అంటారు
"అవసరం లేదు అత్తయ్య నేను ఫుల్ హెల్తీగా ఉన్నాను.... నేను కూడా మీకు వంటలో హెల్ప్ చేస్తాను....." అని అంటుంది
గౌతమ్ కోపంగా పైకి లేచి "అవసరం లేదు నువ్వు రెస్ట్ తీసుకో అమ్మ , అత్తయ్య వంట చేస్తారు....." అని చెప్పి నందుని రెండు చేతులతో ఎత్తుకుని బెడ్ రూం లోకి తీసుకు వెళ్తూ ఉంటాడు
గౌతమ్ అలా చేస్తాడు అని ఊహించని షాక్ అయి "గౌతమ్ అందరి ముందు ఇలా చేయొద్దు..... ముందు నన్ను కిందికి దించు...." అని కోపంగా అంటుంది
గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ "నోరు మూసుకుని ఉండు.... నిన్నటి నుంచి చాలా ఎక్కువ చేస్తున్నావ్.... నీ పని రూమ్ లోకి వెళ్ళాక చెప్తాను...." అని చెప్పి తమ బెడ్ రూమ్ లోకి తీసుకు వెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి తను హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ కోపంగా నందు వైపే చూస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు.....
గౌతమ్ అంత కోపం గా తన వైపు చూస్తూంటే నందు అయోమయంగా గౌతమ్ చూస్తూ "ఏమైంది గౌతమ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు???? నిన్నే అన్నావు కదా నేను నీకు అవసరం లేదని!!!! మళ్ళీ ఇదంతా ఏంటి???" అని కోపంగా అడుగుతుంది
"నిన్న నేను ఏదో ఫ్రస్టేషన్లో ఒక్క మాట అంటే నువ్వు అది అంత సీరియస్ గా తీసుకున్నావా నందు??? మరి నువ్వు ప్రతిసారి నీకు అవసరమైన దాని కోసం నా దగ్గర ప్రేమగా ఉంటావు కదా అప్పుడు నేను ఎంత ఫీల్ అవుతానని నువ్వు ఆలోచించావా??? ఎప్పుడూ అలా ఆలోచించలేదు కదా!!! నాకు తెలుసు నేను చిన్న మాట అంటేనే నువ్వు తట్టుకోలేక పోయావు.....మరి నీ బిహేవియర్ పెళ్లయినప్పటి నుంచి ఇంతే ఉంది నేను ఎంత బాధ పడి ఉంటాను అని నువ్వు ఎందుకు ఆలోచించవు????" అని బాధగా అడుగుతాడు
పెళ్లయినప్పటి నుంచి తన బిహేవియర్ గుర్తు చేసుకుని గౌతమ్ చెప్పినవన్నీ అన్నీ నిజాలే అని తన మనసు చెప్తున్నా అయినా కూడా బింకంగా "నేను నీకు ఏది తక్కువ చేయలేదు గౌతమ్ కానీ నువ్వు నన్ను అలా అనటం చాలా తప్పు.... నేను ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యాను..... నువ్వు ఏమైనా చెప్పు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పోతున్నాను.....ఇంకా ఎప్పటికీ ఇక్కడికి రాను.... కనీసం నువ్వైనా ప్రశాంతంగా ఉండొచ్చు..... మీ వాళ్ళకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో!!!!" అని కోపంగా అంటుంది
గౌతమ్ కోపంగా నందు కళ్ళలోకి సూటిగా చూస్తూ "ఇదేనా నీ లాస్ట్ మాట???" అని అడుగుతాడు
నంద గౌతమ్ కళ్ళలోకి చూడలేక తల పక్కకి తిప్పి అంతే అని అంటుంది.....
గౌతమ్ వెంటనే నందుని గట్టిగా హాగ్ చేసుకుని ఎటు కదలనివ్వకుండా తన బాధంతా అర్థమయ్యేలా "ప్లీజ్ నందు నన్ను క్షమించవే!!! నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను.... నువ్వంటే నాకు అంత పిచ్చి అర్థం చేసుకో నందు.... నిన్ను నన్ను ఆ మేనేజర్ గాడు పిచ్చి పిచ్చిగా తిట్టాడు.....ఆ ఫ్రస్టేషన్ లో ఏం చేస్తున్నానో!!! ఏం మాట్లాడుతున్నానో!! అర్థం కాక ఆలా చేశేశాను...... అంతే తప్ప ఏమీ లేదు నందు..... ఇలా నిన్ను బాధ పెట్టినందుకు ఈ ఒక్కసారికి నన్ను క్షమించవే!!!!" అని దీనంగా మొహం పెట్టి అడుగుతాడు
గౌతమ్ అలా చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయని నందు వెంటనే షాక్ అయ్యి గౌతమ్ నుంచి విడిపించు కోవాలని ట్రై చేసినా తన మాటల్లో తన బాధంతా అర్ధమవుతూ ఉంటే బాధ గా తన వైపు చూస్తూ గౌతమ్ చెప్పేది వింటూ ఉంటుంది.....
నందు కి గౌతమ్ మాటలు వింటూ తన మొహం చూస్తుంటే నవ్వు వస్తున్న అది తన బుగ్గల్లోని దాచి "నువ్వు ఎన్నన్నా చెప్పు గౌతమ్ మీ ఆఫీసులో ఫ్రస్టేషన్ అంత తీసుకువచ్చి ఇంట్లో చూపిస్తే ఎలాగా???? మేము పెళ్లి అవ్వగానే అంతకు ముందు ఉన్న మా ప్రపంచాన్ని వదిలేసి , మా అమ్మానాన్నలని వదిలేసి మరి వంటరిగా మీ కోసం మీ ఇంటికి వస్తే మమ్మల్ని ఇన్ని మాటలు అంటారా???? మీరు ఇలా మాట్లాడితే మేము ఎంత బాధ పడతామో అని ఒకసారి ఆలోచించాలి కదా!!!! పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతో ప్రేమగా చూసుకునే నువ్వు సడన్ గా నేను అంటే ఇష్టం లేనట్టు నేను రాగానే నీ అదృష్టం అంతా పోయినట్టు మాట్లాడగానే నేను తట్టుకోలేకపోయాను.....
పైగా నీకు నేను ప్రెగ్నెంట్ అన్న గుడ్ న్యూస్ చెప్పాలని ఉదయం నుంచి ఫోన్ చేశాను..... నీకు తెలుసా నువ్వు వెళ్లగానే టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉంటే నాకు ఒకటే వాంతులవుతుంటే పైగా నా నెలసరి వచ్చి పది రోజులు పైనే అవుతుండే సరికి డౌట్ గా అనిపించి చెక్ చేసుకున్నాను.... అప్పుడే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది.... నీకు పిల్లలు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కదా!!!! మొట్టమొదట నీకే ఈ గుడ్ న్యూస్ చెప్పాలని ఉదయం నుంచి ఫోన్ చేశాను ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు..... సరేలే అని అత్తయ్య మావయ్య కి అమ్మానాన్నలకి చెప్పి వాళ్ళ ఆనందంగా కంగ్రాట్స్ చెప్పి వస్తున్నామని చెప్పగానే
వెంటనే తిరిగి నీకు కాల్ చేశాను అయినా నువ్వు లిఫ్ట్ చేయలేదు.... సరేలే అనుకొని నువ్వు ఇంటికి వచ్చాక నీకు డైరెక్ట్ గా ఈ న్యూస్ చెప్పి నీ కళ్ళల్లో ఆనందాన్ని డైరెక్ట్ గా చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు నన్ను అలాంటి మాటలు అని చాలా హర్ట్ చేసావ్ గౌతమ్..... నువ్వు అన్న మాటలకి నా మనసు ఎంత బాధ పడిందో తెలుసా??? నైట్ అన్నం కూడా తినాలనిపించలేదు.... అందుకే సరిగా తినకుండా నిన్న నైట్ అంత నువ్వు అన్న మాటలు తలుచుకుంటూ ఎంత ఏడ్చానో!!! నువ్వు నన్ను ఏడిపించావు గౌతమ్ ఐ హేట్ యూ....." అని ఏడుస్తూ అంటుంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
ఇప్పటివరకు ఈ కథను చదివిన మితృలందరికీ, వ్యాఖ్యాతలకు అభివందనములు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 4,415
Threads: 173
Likes Received: 13,916 in 2,755 posts
Likes Given: 8,971
Joined: Nov 2018
Reputation:
960
గౌతమ్ వెంటనే నందుని హగ్ చేసుకుని "రియల్లీ సారీ నందు నేను అసలు ఊహించలేదు నేను ఎప్పుడూ నిన్ను అలా అంటానని!!!! ఈసారి నా నోటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను..... నిన్ను జాగ్రత్తగా చూసుకోవలసిన టైం లో నా వల్లే నువ్వు ఏడ్చావు అన్న ఫీలింగ్ నే నేను తట్టుకోలేకపోతున్నాను..... ప్లీజ్ నందు నన్ను వదిలెయ్యకే!!!! ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చేసేయ్..... ఇంకొకసారి ఇలాంటివి చేస్తే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చిన నోరు మెదపకుండా తీసుకుంటాను...." అని అడుగుతాడు
నందు ఇక నిన్నటి నుంచి గౌతమ్ మాటలకి మనసులో ఉన్న బాధ తట్టుకోలేక అది తారస్థాయికి చేరుకొని గౌతమ్ ని గట్టిగా హగ్ చేసుకొని గుక్క పెట్టి ఏడుస్తూ "నువ్వు నిన్ను అలా అనగానే నాకు ఎంత బాధ వేసిందో తెలుసా గౌతమ్???? లైఫ్ లో ఫస్ట్ టైం తప్పు చేసానా అనిపించింది??? నేను నిన్ను చూడగానే ఇష్టపడ్డాను నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక నిన్నే ప్రాణంగా అనుకున్నాను.... అటువంటిది నీ నోట్లో నుంచి నన్ను నీ జీవితం లోకి తీసుకు రావడం నువ్వు చేసిన పెద్ద తప్పు అని అనగానే లైఫ్ లో ఫస్ట్ టైం ఎందుకు బ్రతుకుతున్ననా అనిపించింది????" అని ఏడుస్తూ అంటుంది
నందు "ష్ ష్ ఏడవకు నందు..... నిన్న నా నోటి నుంచి అలాంటి మాటలు రాకుండా ఉండాల్సింది పొరపాటున వచ్చేశాయి కానీ ఇంటేన్షనల్ గా కాదు అని చెప్పాను కదా!!!! ఇక జీవితంలో నిన్ను కష్టపెట్టే మాట ఒకవేళ అంటే మాత్రం నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చిన నేను సంతోషంగా తీసుకుంటాను..... కానీ ఇలా నీలో నువ్వే బాధపడుతూ నన్ను బాధ పెట్టకు..... నిజంగా నందు నిన్ను పెళ్లి చూపులలో చూడగానే నాకు నచ్చేసావు..... అందుకే ఫస్ట్ టైం ఒక ఆడపిల్లకి చూడగానే తన పర్మిషన్ కూడా అడగకుండా ముద్దు పెట్టాను.... కానీ పెళ్లయినప్పటి నుంచి నువ్వు నాకోసం ఆఫీసు నుంచి రాగానే నువ్వు ఎదురు వస్తే ఎంత బాగుండు అనుకున్నాను!!!!
నువ్వు మాత్రం ఆ టీవీ సీరియల్స్ చూస్తూ నా మీద చిరాకు పడే దానివి!!!? ఆ టైంలో చాలా బాధగా అనిపించేది!!!!! ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని!!!! నీకు ఏదైనా కావాలి అనుకుంటే ప్రేమగా మాట్లాడుతావు లేకపోతే చిరాకు పడతావు.... నిజంగానే నీ బిహేవియర్ నాలో కొంచెం ఫ్రస్టేషన్ లేపింది.... పైగా మొన్న నువ్వు చీర కోసం చేసిన దాని వల్ల లాస్ట్ లో ఉన్న ప్రాజెక్ట్ వర్క్ చేయకుండా ఉండేసరికి ఆఫీస్ లో మేనేజర్ నన్ను ఎడాపెడా వాయించేశాడు...... ఆ కోపం ఫ్రస్టేషన్ అంతా ఎవరి మీద చూపించాలో తెలియక పైగా నువ్వు మళ్ళీ ప్రేమగా మాట్లాడుతుంటే మళ్లీ అలాగే చేస్తున్నావ్ ఏమో అనుకొని బాధపడి అలా అనేశాను..... అంతే తప్ప ఒక్క మాట కూడా నా మనసులో నుంచి వచ్చిన మాట కాదు నందు.... నన్ను కూడా అర్థం చేసుకో నందు...." అని బాధగా అడుగుతాడు
నందు తన కన్నీళ్లు తుడుచుకొని తన చేసిన పనులన్నీ గుర్తుకు వచ్చి గౌతమ్ చేతులు పట్టుకుని "ఐ యాం రియల్లీ సారీ గౌతమ్ నిజంగా ఇందులో నా తప్పు కూడా ఉంది.... నిన్ను ఇలా నిర్లక్ష్యం చేయకుండా ఉండాల్సింది.... అలా చేయబట్టే నీలో ఇలా ప్రస్టేషన్ పెరిగిపోయింది..... ఇక నుంచి నీ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయను ప్రామిస్.... నువ్వు కోరుకున్నట్టుగానే నువ్వు వచ్చేసరికి నీ ఎదురుగా నవ్వుతూ ఉంటాను.... కానీ నువ్వు కూడా ఇకనుంచి మీ ఆఫీసులో టెన్షన్స్ అన్నీ తీసుకువచ్చి నామీద అరవ కూడదు..... మీరు ఒక్క మాట మమ్మల్ని మీ జీవితంలో తక్కువ చేసేలా అంటే అది మేము ఈజీగా తీసుకోలేము అర్థం చేసుకో!!!" అని బాధగా అడుగుతుంది
"నిన్ను బాధపెట్టాలని చెప్పలేదు నందు మేము ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూ అలసటగా ఇంటికి రాగానే భార్యల దగ్గర నుంచి కొంచెం ప్రేమ ఆదరణ లభించాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా!!!! అదే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేశాను.... అంతే తప్ప నిన్ను దేనిలోను ఫోర్స్ చేయాలని కాదు..... ఇకనుంచి నువ్వు నీకు నచ్చినట్టు ఉండు పర్వాలేదు....." అని నందు నూతన గుండెలకి హత్తుకుంటూ అంటాడు
"లేదులే గౌతమ్ ఇందులో నా తప్పు కూడా ఉంది...." అని ఒకరినొకరు నాది తప్పు అంటే నాదే తప్పు అని వాదించుకుంటూ ఉంటారు.....
ఇంతలో ఎవరో తమ రూమ్ డోర్ కొడుతూఉంటే ఇద్దరు వాదులాడుకోవడం ఆపేసి ఒకరి మొహం ఒకరు చూసుకొని గట్టిగా నవ్వుకుంటారు.....
ఇంతలో మళ్లీ డోర్ సౌండ్ వినిపించి నవ్వటం ఆపేసి "ఇద్దరిదీ తప్పు ఉంది కాబట్టి ప్రస్తుతానికి చెల్లుకు చెల్లు చేసుకుందాం.... ఇకనుంచి ఇద్దరం ఒకరి గురించి ఒకరం పట్టించుకుంటూ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేద్దాం ఏమంటావు నందు????" అని గౌతమ్ అడుగుతాడు
"నాకు ఒకే గౌతమ్ ఇకనుంచి నేను కూడా నీకు నచ్చినట్టు గానే ఉంటాను...." అని నవ్వుతూ అంటుంది
"సరే ఎవరో వచ్చినట్టు ఉన్నారు... వెళ్ళి చూస్తాను నువ్వు రెస్ట్ తీసుకో!!" అని చెప్పి నందు ని బెడ్ మీద పడుకోబెట్టి గౌతమ్ వెళ్లి డోర్ తీయగానే గౌతమ్ అమ్మగారు నవ్వుతూ గౌతమ్ వైపు చూస్తూ "అయిపోయాయా మీ అలకలు????" అని నవ్వుతూ అడుగుతుంది
అది విని బెడ్ మీద పడుకొని ఉన్న నందు షాక్ గా లేచి కూర్చొని గౌతమ్ వైపు చూస్తుంటే గౌతమ్ కూడా నందు వైపు అలానే చూసి వెంటనే ఇద్దరు సర్దుకొని గౌతమ్ అమ్మగారి వైపు చూస్తూ ఇద్దరూ ఒకేసారి "అలాంటిదేమీ లేదు అత్తయ్య.... అలాంటిదేమీ లేదు అమ్మ.... జస్ట్ మాట్లాడుకుంటున్నాము అంతే!!!" అని కంగారుగా అంటారు
"నాకు తెలుసు మేము వచ్చిన దగ్గరనుంచి మీరు ఇద్దరు చాలా డల్ గా ఉన్నారు... పైగా ఒకరితో ఒకరు సరిగా మాట్లాడుకోవడం లేదు.... అప్పుడే అర్థమైంది మీ ఇద్దరు ఏదో విషయం లో గొడవ పడ్డారని కానీ భార్య భర్తల విషయంలో మేము కలుగజేసుకోవటం మంచిది కాదని సైలెంట్ గా ఉన్నాము.... ఇప్పుడు మీ అంతట మీరే సాల్వ్ చేసుకున్నారు కాబట్టి మాకు టెన్షన్ లేదు.... అందుకే మేమందరం బయట ఉన్న పట్టించుకోకుండా మీరు ఇద్దరు రూమ్ లోకి వెళ్ళిన సైలెంట్ గా ఉన్నాము....సరే కానీ ఇక మీ సర్ది చెప్పుకోవడాలు అయిపోతే రెడీ అవ్వండి డాక్టర్ దగ్గరికి వెళ్ళే టైం అయింది..... అందుకే డోర్ కొట్టి మరి మిమ్మల్ని డిస్టబ్ చేశాను...." అని నవ్వుతూ ఉంటుంది
నందు కూడా గడియారం వైపు చూసి ఆశ్చర్యంగా "అంటే అరగంట నుంచి మేమిద్దరం రూమ్ లోనే ఉన్నామా???" అనుకొని "సరే అత్తయ్య నేను రెడీ అయ్యి వస్తాను...." అని చెప్పిన రెడీ అవడానికి వాష్ రూమ్ కి వెళ్ళిపోతుంది
గౌతమ్ అమ్మగారు లోపలికి వచ్చి గౌతమ్ చేయి పట్టుకొని బెడ్ మీద కూర్చోబెట్టి గౌతమ్ పక్కనే కూర్చుని గౌతమ్ వైపు చూస్తూ "చూడు గౌతమ్ ఇలా చెప్తున్నాను నువ్వు బాధపడకు.... ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని మన ఇంటికి తీసుకు వచ్చినప్పుడు తనకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటామని తన అమ్మానాన్నలకి ప్రామిస్ చేసి తీసుకు వస్తాము.... అటువంటిది మన వల్ల తను ఒక్క కన్నీటిబొట్టు కార్చిన అది చూసి మనం ప్రశాంతంగా బ్రతకలేము.... కాబట్టి ఎప్పుడూ నందుని బాధపెట్టకుండా చూసుకో...." అని అంటుంది
"అమ్మ నాకు నందు అంటే చాలా ఇష్టం ఇక నుంచి నందు కంట్లో నుంచి కన్నీటి చుక్క రాకుండా జాగ్రత్తగా చేసుకుంటాను.... ప్రామిస్" అని నవ్వుతూ అంటాడు
నందు వాష్ రూమ్ లోపలి నుంచే ఈ మాటలన్నీ విని "నాకు ఎంత మంచి కుటుంబం దొరికింది నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని.... గౌతమ్ నీ విషయంలో నేను ఇలా చేసి ఉండకూడదు.... మీకు కూడా ఆఫీసులో సవాలక్ష టెన్షన్స్ ఉంటాయి అవన్నీ పోవడానికి మా దగ్గర కొంచెం సేపు ప్రశాంతంగా సేద తీరాలి అనుకుంటారు.... కానీ నేను నీకు అలా చేయకుండా ఇంకా ఎక్కువ టెన్షన్ ఇచ్చాను.... ఇక నుంచి ఇలాంటి సిల్లీ బిహేవియర్ నీ దగ్గర చూపించను...." అని తనలో తానే అనుకుంటుంది
తర్వాత నందు బయటికి రాగానే గౌతమ్ ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు....
గౌతమ్ అమ్మగారు నందుని రెడీ చేస్తూ "ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు నందు గౌతమ్ ది చిన్న పిల్లల మనస్తత్వం చిన్న చిన్న వాటికి సంతోషిస్తాడు కానీ మనం కూడా వాళ్లకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి..... వాళ్ళు బయట సవాలక్ష పనులు చేసుకుని ఇంటికి వస్తారు..... అటువంటి వాళ్ళ దగ్గర మనం మన టెన్షన్స్ కూడా చెప్పి ఇంకా ఎక్కువ బాధ పెట్టకూడదు..... సాధ్యమైనంతవరకు వాళ్ళకి చేదోడువాదోడుగా ఉండాలి కానీ మనం ఇంకా వాళ్ళకి బరువై పోకూడదు....." అని అంటుంది
నందు వెంటనే గౌతమ్ అమ్మగారిని హగ్ చేసుకొని "అలాగే అత్తయ్య గౌతమ్ ని ఇకనుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను...." అని అంటుంది
గౌతమ్ కూడా ఫ్రెష్ అయి రాగానే అందరూ కలిసి హాస్పిటల్ కి వెళ్లి డాక్టర్ని కలుస్తారు డాక్టర్ నందుని చెక్ చేసి తల్లి బిడ్డ హెల్దీ గా ఉన్నారు అని చెప్పగానే అందరూ సంతోషిస్తారు..... డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాటిలో టాబ్లెట్స్ మెడికల్ స్టోర్ లో తీసుకొని నందు ని జాగ్రత్తగా ఇంటికి తీసుకు వెళ్తారు..... మధ్యాహ్నం లంచ్ తర్వాత నందు అమ్మగారు నందుని తీసుకెళ్తాను అని చెప్పినా గౌతమ్ ససేమిరా ఒప్పుకోకుండా "నేను నా నందు ని జాగ్రత్తగా చూసుకుంటాను.... కావాలంటే కేర్ టేకర్ ని కూడా పెట్టుకుంటాను..... కానీ నా నందు లేకుండా ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను...." అని నందు చెయ్యి గట్టిగా పట్టుకుని అంటాడు
గౌతమ్ ప్రేమకి ఏం చెప్పాలో అర్థం కాక ఎంత చెప్పినా కోపం వినకపోయేసరికి ఇక అందరు చివరికి గౌతమ్ దగ్గరే నందుని ఉంచేలా ఒప్పుకోక తప్పలేదు..... అందరూ కూడా గౌతమ్ ప్రేమ చూసి సంతోషించి అప్పుడప్పుడు వస్తామని చెప్పి గౌతమ్ అమ్మగారు మాత్రం వెళ్లకుండా నందు దగ్గరే తనని చూసుకుంటూ ఉంటానని చెప్పి ఉండిపోయి మిగిలిన అందరు తర్వాతి రోజు అందరూ వెళ్లిపోతారు.....
గౌతమ్, గౌతమ్ అమ్మగారు నందు ని జాగ్రత్తగా చూసుకుంటూ తనని సంతోషంగా ఉండేలా చేస్తారు.... నందు కూడా గౌతమ్ కోరినట్టు గౌతమ్ విషయంలో తనకి నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ గౌతమ్ ని సంతోషంగా చూసుకుంటుంది....
అలా ఇద్దరు ఒకరికొకరు తోడుగా మారిపోయి సంతోషంగా లైఫ్ గడిపేస్తూ ఉంటారు..... నందు కి తొమ్మిది నెలల తర్వాత నందు లాంటి బాబు పుడతాడు.... గౌతమ్ తన బాబు ని చేతుల్లోకి తీసుకుని సంతోషంగా నందు నుదిటిన ముద్దు పెట్టి "థాంక్యూ నందు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు!!!!" అని సంతోషంగా అంటాడు
నందు కూడా నవ్వుతూ "థాంక్యూ గౌతమ్ నీలాంటి మంచి భర్త నాకు దొరికినందుకు!!!" అని నవ్వుతూ అంటుంది
అలా ఇద్దరూ సంతోషంగా వాళ్ళ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆనందంగా ఉంటారు......
ఈ కథ ద్వారా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే!!!!
మగవాళ్ళకి బయట సవాలక్ష పనులు ఉంటాయి.... ఇంట్లో ఉండే ఆడవాళ్ళ వాళ్లకి చేదోడువాదోడుగా ఉండాలి కానీ ఇంకా తలనొప్పి తెచ్చే పనులు చేసి వాళ్ళకి మన మీద మనసు విరిగేలా చేయకూడదు.... మన భర్తలు ఎవరి దగ్గర వాళ్ళ ఆనందాన్ని, బాధని అంత త్వరగా షేర్ చేసుకోరు.... కానీ భార్య దగ్గర మాత్రం అన్ని చెప్తారు..... వాళ్ళని మన మాటలతో చేతలతో బాధపెట్టకుండా చూసుకోవటం మన బాధ్యత కాబట్టి ఎప్పుడు మగవాళ్ళని ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ వాళ్ళకి ఇరిటేషన్ తెప్పించ కూడదు..... భర్తలకి అనుగుణంగా ఉంటే భర్త భార్య ఇష్టాఇష్టాలు అన్ని తెలుసుకొని వాళ్లే మనకి కావల్సినవి ప్రేమతో తెచ్చి మరీ పెడతారు.... మనకి కూడా భర్త ప్రేమతో దగ్గరకు తీసుకుంటే అంతకంటే మించిన సంతోషం మరొకటి ఉండదు కదా!!!! కాబట్టి మనం మన భర్తలని ప్రేమతో చూసుకోవాలి....
అబ్బాయిలు మీరు కూడా పెళ్ళయ్యాక పెళ్ళాం బానిస అనుకుంటూ తనని కాళ్ళ కింద చెప్పులా ఉంచకూడదు..... వాళ్లు కూడా పెళ్లయిన దగ్గరినుంచి అంతకు ముందు ఉన్న తమ ప్రపంచాన్ని కూడా వదిలేసి మీరే లోకంగా బ్రతుకుతారు.... అటువంటిది మీ నుంచి చిన్న నెగిటివ్ కామెంట్ వచ్చిన భార్యలు తట్టుకోలేరు.... కాబట్టి వాళ్ళని బాధపెట్టకుండా మీకు కావాల్సినట్టుగా మీరే మార్చుకోవాలి.....
భార్యాభర్తలు ఇద్దరు ఓపికతో ఉండాలి అలా ఉంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది.... లేదంటే మూడు ముక్కలు విడివిడిగా ఎవరి జీవితం వారు అన్నట్టే బ్రతకాల్సి వస్తుంది......
మొత్తానికి భార్యాభర్తలు గిల్లికజ్జాలు సరదాగా ఉండాలి కానీ ఒకరినొకరు నొప్పించేలా ఉండకూడదు..... భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు గుర్తుకు వచ్చినప్పుడు వాళ్ళ పెదవుల మీద నవ్వు రావాలి కానీ అసహనం కనిపించకూడదు.... నేను ఈ కథ రాసింది కూడా భార్యాభర్తలు ఒకరి విషయంలో ఒకరు ఎలా ఉండాలి అనేది చెప్పటానికి!!! మీకు నచ్చితే ప్లీజ్ నన్ను కామెంట్స్ తో ఎంకరేజ్ చేయండి నచ్చకపోతే ఇగ్నోర్ చేసేయండి.....
సమాప్తం....
ఇంకా ఉంది అని చెప్పాలని ఉంది కానీ ఇక రాసే ఓపిక లేదు.... ఇక దీనితో ఈ కథ ముగింపు పలికించేశాను...అనుకున్నాను కానీ!
ఇంతవరకు నా కధని ఆదరించిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్.....
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ