23-02-2019, 12:48 PM
తమన్న కోరికకు శృతిహాసన్ గ్రీన్ సిగ్నల్
వీళ్లిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఖాళీ టైమ్ దొరికితే ఇద్దరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకాస్త టైమ్ దొరికితే విదేశాలకు చెక్కేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం తమన్న సింగిల్ గా ఉన్నప్పటికీ.. శృతిహాసన్ మాత్రం సింగిల్ కాదు. బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సల్ తోనే ఎక్కువ టైమ్ గడుపుతోంది. దీంతో శృతిని తను బాగా మిస్ అయ్యానంటోంది తమన్న. పనిలో పనిగా తన మనసులో కోరికను కూడా బయటపెట్టింది.
ఓ తమిళ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్న.. ఏదైనా చిలిపి పని చేయాలనుకుంటే కాజల్ కంటే శృతిహాసన్ పక్కనుంటేనే ఎక్కువగా ఇష్టపడతానంటోంది తమన్న. ఒకవేళ ఏదైనా అల్లరి పని చేయాలనుకుంటే వెంటనే శృతిహాసన్ కు ఫోన్ చేసి మరీ పిలుస్తానంటోంది. అంతేకాదు, ఒకవేళ మరో హీరోయిన్ తో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే, కచ్చితంగా శృతిహాసన్ తో కలిసి నటిస్తానంటోంది.
"శృతి నేను కలిసి తప్పకుండా ఓ సినిమా చేయాలి. శృతితో ఓ సినిమా చేయాలని చాలా ఆశగా ఉంది. చాలామంది దర్శకులు చెబుతున్న కథలు వింటున్నాను. నాతో పాటు మరో హీరోయిన్ కు కూడా స్థానం ఉండే కథలు వస్తే కచ్చితంగా శృతిహాసన్ తో సినిమా చేస్తా. ఆమెతో సినిమా చేయాలని ఉంది."
ఇలా తన మనసులో మాట బయటపెట్టింది తమన్న. ఈ విషయం శృతిహాసన్ వరకు కూడా వెళ్లింది. తమన్నకు థ్యాంక్స్ చెబుతూనే త్వరలోనే కచ్చితంగా ఓ సినిమా చేద్దామంటూ మాటిచ్చింది శృతిహాసన్. ఇప్పటికే కాజల్ తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతోంది తమన్న. ఆ ప్రాజెక్టులో శృతిహాసన్ కూడా జాయిన్ అవుతుందేమో.
Images/gifs are from internet & any objection, will remove them.