23-02-2019, 12:46 PM
ఎన్టీఆర్ కథానాయకుడు విడుదల టైమ్ లో కాస్తూకూస్తో హైప్ ఉంది. పైగా పండగ సీజన్. కాబట్టి ఆ సినిమాకు ఓ మాదిరిగా ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మహానాయకుడు విషయంలో మాత్రం సీన్ మారిపోయింది. పార్ట్-1 డిజాస్టర్ అవ్వడంతో పాటు బాక్సాఫీస్ కు ఇది అన్-సీజన్ కావడంతో మహానాయకుడు ఓపెనింగ్స్ మహా ఘోరంగా వచ్చాయి.
అవును.. మహానాయకుడు ఓపెనింగ్ వసూళ్లు ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో ఇప్పటివరకు ఎపిక్ డిజాస్టర్ అంటే అది ఆఫీసర్ మాత్రమే. ఇప్పుడా సినిమాను మహానాయకుడు క్రాస్ చేస్తున్నాడు. మహానాయకుడు వసూళ్లను బయటకు చెప్పొద్దంటూ ఇప్పటికే ఎగ్జిబిటర్లు అందరికీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకవేళ చెప్పాల్సి వస్తే గ్రాస్ చెప్పమని అంటున్నారు. అలా చూసుకున్నా ఈ సినిమా డిజాస్టర్స్ కే డిజాస్టర్ అవుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో మహానాయకుడు సినిమాకు మొదటి రోజు కేవలం 65 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోవడం అవమానం. అంటే దీనర్థం, మహానాయకుడు సినిమాను నందమూరి అభిమానులు కూడా లైట్ తీసుకున్నారన్నమాట.
ఇక ఏరియా వైజ్ చూసుకుంటే.. నైజాం నుంచి ఈ సినిమాకు 42 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అంటే షేర్ వాల్యూ నామమాత్రం అన్నమాట. ఇక ఈస్ట్, నెల్లూరు లాంటి ప్రాంతాలైతే సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయంటే కథానాయకుడు ప్రభావం మహానాయకుడిపై ఎంతలా పడిందో అర్థం చేసుకోవచ్చు.
కథానాయకుడు డిజాస్టర్ తో దెబ్బతిన్న బయ్యర్లకు మహానాయకుడుతో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ సినిమాకు వచ్చిన వసూళ్లలో 40శాతాన్ని నష్టపరిహారం కింద తిరిగి చెల్లిస్తామన్నారు. కట్ చేస్తే, మహానాయకుడు డబుల్ డిజాస్టర్ అయింది. ఈ వసూళ్లలోంచి 40శాతం అంటే బయ్యర్లకు పెట్రోలు ఖర్చులు కూడా రావన్నమాటే. మరోవైపు శని, ఆదివారాలు కూడా ఈ సినిమా కోలుకోవడం అసంభవం అని తేల్చేసింది ట్రేడ్.
Src: https://telugu.greatandhra.com/movies/mo...97401.html

Images/gifs are from internet & any objection, will remove them.