Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
వంద కోట్లు తినేసిన 'రోబో2'
#1
మొత్తంమీద లెక్క తేలింది. రోబో 2 కారణంగా లైకా ప్రొడక్షన్స్ మూట కట్టుకున్న నష్టాలు వందకోట్లు అని, ఆ సంస్థ లెక్కలు తేల్చుకున్నట్లు సమాచారం. ఈ  విషయంలో ఆ సంస్థ దర్శకుడు శంకర్ మీద చాలా గుర్రుగా వుందట. లైకా సంస్థ యాజమాన్యం లండన్ లో వుంటుంది. అక్కడ నుంచి డబ్బు పంపుతూ వచ్చారు. దర్శకుడు శంకర్ ఈ ఖర్చు, ఆ ఖర్చు అంటూ ఇండెంట్ పెట్టడం, వాళ్లు పంపడం జరిగిపోయింది. మధ్యలో ఇక్కడ కంపెనీ జనాలను పక్కనపెట్టారు. దీంతో సినిమా విడుదలకు ముందు, ఫినిషింగ్ టైమ్ లో ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టించేసినట్లు తెలుస్తోంది.


ఏమైతేనేం మొత్తానికి రోబో 2 సినిమా వందకోట్ల నష్టం మిగిల్చింది. ఆ వ్యవహారం ఇప్పుడు లైకా-శంకర్ ల తదుపరి సినిమా ఇండియన్ 2 మీద పడింది. ఈ సినిమాకు 200 నుంచి 220 కోట్లు బడ్జెట్ అవుతుందని శంకర్ అంచనా ఇచ్చారు. అయితే లైకా ఈసారి జాగ్రత్త పడదల్చుకుంది. 220 కాదు, 250 కోట్ల లోపు బడ్జెట్ లో సినిమా తీసి, ఫస్ట్ కాపీ ఇస్తానని, అగ్రిమెంట్ చేయమని దర్శకుడు శంకర్ ను కోరింది. దానికి ఆయన ససేమిరా అంటున్నారని టాక్.

తాను బడ్జెట్, స్క్రిప్ట్ చెప్పానని, ఇంతే అవుతుందని ఎలా అగ్రిమెంట్ చేస్తానని శంకర్ మొండికేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే లైకా సంస్థ, ఇరవై ముఫై కోట్ల వరకు ఖర్చు చేసేసింది. అయినా కూడా ప్రాజెక్టును పక్కన పెట్టాలనే అనుకుంటున్నట్లు బొగట్టా.

తెలుగు నిర్మాతలకు ఫోన్లు
దీంతో దర్శకుడు శంకర్ సరైన నిర్మాత ఎవరు దొరుకుతారా? అని ఎంక్వయిరీలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్టు కోసం ముందుకు వచ్చారు. కానీ ఆయన మళ్లీ వెనక్కు వచ్చేసారు. అందుకే శంకర్ తరపును తెలుగులో ఒకరిద్దరు తెలుగు భారీ నిర్మాతలకు ఫోన్ లు చేసినట్లు తెలుస్తోంది. అయితే 250 కోట్ల బడ్జెట్, శంకర్ రోబో 2 ఫలితం తెలిసిన ఎవ్వరూ అస్సలు ఆసక్తి కనబర్చలేదని తెలుస్తోంది.

పైగా కమల్ హాసన్ హీరోగా సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదని, ఇప్పుడు ఆయన రాజకీయాల్లో కూడా బిజీ అయిపోయారని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు ఎంత దూరంగా వుంటే అంత మంచిదని ఓ తెలుగునిర్మాత అన్నారు.

అగ్రిమెంట్ చేయకతప్పదా?
దీంతో మరోదారి లేక శంకర్ నిర్మాణ సంస్థ లైకా అడిగినట్లు 250 కోట్ల లోపులో సినిమా ఫస్ట్ కాపీ తీసి ఇస్తానని అగ్రిమెంట్ చేసుకోకతప్పని పరిస్థితి ఏర్పడుతోంది. లేదూ అంటే ఇక సినిమా వుండదు. శంకర్ ఇన్నింగ్స్ దాదాపు ఇక్కడితో ముగిసిపోతాయి. ఇప్పటికే ఆయన ఖాతాలో రెండు భారీ డిజాస్టర్లు వున్నాయి. భారీగా తీసినా, మార్కెట్ చేయడం కష్టం అవుతుంది. మరి శంకర్ ఏం చేస్తారో? ఇండియన్ 2 వుంటుందో, ఊడుతుందో? కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

Source: https://telugu.greatandhra.com/movies/mo...97300.html
Images/gifs are from internet & any objection, will remove them.
[+] 1 user Likes pastispresent's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)