Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఇయర్ ఫోన్స్ వాడుతున్నారా.. జాగ్రత్త..?
#1
ఈ కాలంలో ఎక్కడ చూసినా ఈ ఇయర్ ‌ఫోన్సే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇయర్ ఫోన్స్ లేకపోతే జీవితం ఊహించలేనిదని చెప్తున్నారు. బస్సుల్లో, రైళ్ళల్లో.. ఎవ్వరిని చూసినా ఈ ఇయర్ ఫోన్స్ పెట్టుకునే ఉంటారు. పక్క మనిషి ఏం అడుగుతుందనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వీటిని పెట్టుకుని ఇతరులకు విసుగు కలిగిస్తుంటారు కొందరు.

ఇంకా చెప్పాలంటే.. రోడ్డు వీధుల్లో సహా వీటిని చెవిలో పెట్టుకుని నడుస్తున్నారు. పక్కన ఏ వాహనాలు వస్తున్నాయనే విషయాన్ని గ్రహించకుండా ఉండేవారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఈ ఇయర్ ఫోన్స్ కారణంగా చాలామంది చనిపోయారు. అయినను వీటిని వదలడం లేదు.


ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా మ్యూజిక్ సౌండ్ బయటికి వినిపిస్తోందంటే.. మనం అవసరానికి మించిన వాల్యూమ్ పెట్టుకున్నామని అర్థం. ఎక్కువ శబ్దంతో పాటలు విడడం చెవిలోని నరాలను బాధిస్తుంది. దాంతో చెవి వినపడకుండా పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. అదేపనిగా ఇయర్ ఫోన్స్ వాడేవారు ప్రతి గంటకు ఒక్కసారైనా వాటిని తొలగిస్తూ ఉండాలి.

అంతేకాదు.. ఒకరు వాడే ఇయర్ ఫోన్స్ మరొకరు వాడితే కూడా చెవి ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇతరుల ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉండేవారి చెవులను పరిక్షించునప్పుడు వాళ్లలో దాదాపు 98 మంది చెవుల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు పరిశోధనలో తేలింది. వీటి వాడక వలన చెవుల్లో వేడి, తేమ బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఓ గంటపాటు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే ఆ సమయంలో బ్యాక్టీరియాలు 700 రేట్లు పెరుగుతున్నట్లు అధ్యయనంలో స్పష్టం చేశారు.

ఈ ఇయర్ ఫోన్స్ ఎలా వాడాలంటే.. 4 వారాలోసారి ఇయర్ బడ్స్‌ను మారుస్తూ ఉండాలి. ఇయర్ ఫోన్స్, బడ్స్‌లను అప్పుడప్పుడూ శానిటైజ్
చేస్తూ ఉండాలి. ఇతరులతో వీటిని పంచుకోవడం మంచిది కాదు. అలానే తక్కువ మోదాతులో మ్యూజిక్ వింటూ గంటకు ఒకసారి చెవులకు విశ్రాంతినిస్తూ ఉంటే.. ఎలాంటి సమస్యలు దరిచేరవు.


Source: http://telugu.webdunia.com/article/healt...019_1.html
Images/gifs are from internet & any objection, will remove them.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: