09-02-2019, 05:07 PM
నేను స్త్రీ అవుతే అనే ఆలోచన నుండి వచ్చిన మాటలు ఇవి..
ఇల్లు మారింది, ఇంటి పేరు మారింది, చూశాను, విశాలమైన వంటగది , కానీ అందులో ఎన్నో ఇరుకైన వాస్తవాలు.. అప్పుడే, నా ఇల్లు గుర్తొచ్చింది.. అమ్మకు తెలుసు, నాకోసం ఎం వండాలో.. అందుకేనేమో వంటిల్లు మొహం కూడా చూడనివ్వలేదు..నాన్నకు తెలుసేమో, నాకేం ఇష్టమో బజారుకు కూడా వెళ్లాల్సిన అవసరం రాలేదు.. ఇప్పుడు, నాకు అవేమి లేవు ఎందుకంటే నాదో కొత్త ఇల్లు అందులో నన్ను ప్రేమిస్తున్నాడు అనుకొనే ఒక వ్యక్తి.. చెప్పాలంటే కొత్త అలవాటు, కొత్త కుటుంబం..అంతా కొత్త కొత్తగా ఉంది.. పర్లేదు, మొదటిసారి వంట చేశా.. కష్టపడి, అప్పుడే తెలిసింది అమ్మ సగం జీవితం వంటింటికే ఎందుకు పరిమితి అయ్యిందో.. కాస్త జీవితం అంతా అలా మారిపోతే..గుండెలో ఎంత గుబులో ఎవరికీ చెప్పుకోగలను.. వాస్తవాన్ని నిందించలేను కానీ, నన్ను నేను ఏంటి అని ప్రశ్నించుకోగలను కదా.. ఎందుకంటే బయటకు చెప్పుకోలేని ఎన్నో ప్రశ్నలు ఆడదాని మనసులోనే సమాధిలా మిగిలిపోతుంటాయి..ఊహతెలిసే లోగా, పెద్దమనిషి అయ్యాను అని ఎవరో అనడం , అదే అనుకుంటా , ఆరోజే అనుకుంటా నన్ను నా నుండి దూరంగా విసిరేసిన రోజు..మొహానికి ఒక చాప పడేసి పక్కకు కూర్చోపెట్టారు.. ఏంటో, అర్థం కాలేదు.. కడుపులో నొప్పి, తిప్పేసినట్టయ్యింది.. కానీ అప్పుడు తెలీదు.. ఇది ప్రతీ నెల, ప్రతీ సంవత్సరం నన్ను పలకరించే శత్రువని.. రక్తం ఆవిరవుతున్న క్షణాలు మొదలైపోయాయి.. కడుపులో పేగులు ఎవరో పట్టి పిసికేస్తున్నారని అనిపిస్తుంది ..తట్టుకోలేని బాధ , ఇష్టంగా తినేవి కూడా తిననివ్వట్లేదు.. బయటకెళ్ళే ప్రతీసారి, అమ్మ బ్యాగులో, సానిటరీ పాడ్స్ పెట్టేది.. పరిగెత్తే రోజుల నుండి, నడిచే రొజుల్లొచ్చేశాయి అనిపించింది.. నిజానికి, ఎందుకు పుట్టానా అనిపించేది.. నాకు నేనే అద్దంలో ఓ యాంటిక్ పీస్ లా కనిపించేదాన్ని.. రోజులు మారే కొద్దీ, ఇంట్లో జాగ్రత్తలు చెప్పడం పెరిగిపోయింది..వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, వాళ్లెవరు , వీళ్ళెవరూ అనే ప్రశ్నలు ఇంట్లోవారు అడగకపోతే వీధిలో వారు అడిగేవారు, నన్ను కాకపోయినా , మా ఇంట్లోవాళ్ళని ...కూతురిని కన్నారో, లేక కులాన్ని కన్నారో అన్నట్టుగా ప్రవర్తించేవారు..దీనికి తోడు, మగవారి చూపులు చాలా ఇబ్బందిగా అనిపించేవి..కానీ ఇవన్నీ దాటుకొని నేను గెలిచిన నా జీవితాన్ని, నా పేరుని, నన్ను ఒక్కసారిగా మార్చేసింది పెళ్లి..మొగాడి ప్రేమ ఎలా ఉన్నా, అన్ని చెప్పుకోలేము కదా..!
కొన్ని ధైర్యం చేసి చెప్పినా, అతను ఒప్పుకున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు,అలా అందరిని అడగాలేమో..అమ్మకూడా ఇక్కడ లేదు ఏమైనా చెప్పుకోవడానికి..నా జీవితాన్ని ఇంకొకరి జీతానికి ముడివేసి వదిలేశారు..ఈరోజు నుండి నేను సర్దుకుపోవటం అలవాటు చేసుకోవాలి.. లిటరల్లీ ఇట్ హార్ట్స్ ,..!కానీ తప్పదు, నేను అమ్మని కదా.. !!ప్రతీ అమ్మాయి జీవితం ఇంతే ఏమో అనిపించింది.. !
మనవి: నా రచనలు చదివి చెడిపోయామనే అప్రదిష్ట మాత్రం నాకు అంటగట్టకండి...
అంకితం: నాలో తృష్ణను లేపి నన్ను తృప్తి పరిచిన నారిమణులకు మరియు నన్ను తలుచుకునే రసికులకు...
అంకితం: నాలో తృష్ణను లేపి నన్ను తృప్తి పరిచిన నారిమణులకు మరియు నన్ను తలుచుకునే రసికులకు...
*పర్సనల్ గా Meet అవ్వాలి అనుకున్న లేడీస్ కాంటాక్ట్ ఇమెయిల్ పంపండి*