Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు!
#1
ప్రశాంతమైన వృద్ధాప్యానికి పది బంగారు సూత్రాలు!

? రిటైర్డు ఫ్యామిలీ (సుప్రీమ్) కోర్టు జడ్జి గారు.?

?Ravindra Srinivas గారి పోస్ట్ మీ కోసం వారికీ కృతజ్ఞలతో?

?1.ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమనండి .
మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో,
మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి .

?2.మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్ గా చూడండి అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు . మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక మాట కూడా అనవద్దు .
అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది .ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది .

?3.మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అసలు సంబంధం లేదు , అనవసరం కూడా.

?4.ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి .వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు .ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి .మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి .

?5.మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు.

?6.మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి.

వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం .

?7.మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం 
ఎంతమాత్రమూ లేదు అలా ఆశించకండి ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి .

?8.మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి .

?9. రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం .ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ డబ్బులు మీకు పనికిరాకుండా పోయేలా చూసుకోరాదు.

?10.మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది

మీ సంతానానికి దేవుడిచ్చిన వరం .

సాధ్యమైనంత వరకూ ఈ మెసేజ్ ఎక్కువ మంది షేర్ చేసుకునేలా చూడండి 
ఇది తన జీవిత కాలం సుప్రీం కోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన ఒక జడ్జిగారి అనుభవ సారం .

???????????????????????????

Source:Internet/what's up.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)