Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
19-07-2021, 11:29 AM
హలో ఫ్రెండ్స్ నేను ఒక కొత్త కథ తో మళ్లీ మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నను కలిపిన ఒక క్రైమ్ థ్రిల్లింగ్ కథ తో వచ్చేసా.
ఎప్పుడు అధర్మం వైపు ఉండే ఒక లాయర్ మొదటి సారి ధర్మం వైపు నిలబడి న్యాయం చేయాలని చూస్తే తనకు ఎదురైన సవాలు ఏంటి అనేది ఈ కథ అంతే కాకుండా ఇది నిజంగా జరిగిన రెండు సంఘటనల ఆధారంగా రాసిన కథ.
నను మళ్లీ ఆదరిస్తారు అని ఆశిస్తున్నా.
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
19-07-2021, 11:31 AM
(హైదరాబాద్ సాయంత్రం 5:30)
ఒక కాలనీ మొత్తం మీడియా, సెక్యూరిటీ ఆఫీసర్ల హడావిడి తో ఉంది సెక్యూరిటీ ఆఫీసర్లు ఒక అమ్మాయి శవం అంబులెన్స్ లో ఎక్కిస్తూ ఇంకో అబ్బాయి నీ సెక్యూరిటీ అధికారి జీప్ ఎక్కిస్తున్నారు అప్పుడు సెక్యూరిటీ ఆఫీసర్ల కథనం ప్రకారం మీడియా వాళ్ళు అంతా ఒకే మాదిరిగా న్యూస్ చెప్పడం మొదలు పెట్టారు "చెర్రీ అలియాస్ చరణ్ అనే యువకుడు మధుమతి అనే యువతి నీ ఒంటరిగా ఇంట్లో ఉండగా బలవంతంగా లోపలికి వెళ్లి దారుణంగా రేప్ చేసి హత్య చేశాడు" అని న్యూస్ చానెల్స్ ప్రచారం జరుగుతోంది చెర్రీ నీ సెక్యూరిటీ అధికారి కస్టడీ లో చాలా torture చేశారు అప్పుడు ఇనస్పెక్టర్ కీ ఒక ఫోన్ వచ్చింది అది వచ్చిన తర్వాత ఆ ఇనస్పెక్టర్ ఒక తెల్ల కాగితం పైన చెర్రీ సంతకం బలవంతంగా తీసుకోని ఆ పేపర్ లో చెర్రీ తను చేసిన తప్పు ఒప్పుకున్నాడు అన్నట్లు చేశారు ఆ తర్వాత వాడిని మరుసటి రోజు కోర్టు లో అప్పగించారు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని మహిళా సంఘాలు చెర్రీ కీ ఉరి శిక్ష అమలు చేయాలని కోరారు దాని కోసం కొవ్వొత్తి ర్యాలీలు నిర్వహించారు.
(6 గంటల ముందు ఢిల్లీ)
ఢిల్లీ హైకోర్టు లో తన క్యాబిన్ లో కూర్చుని ఉంది లాయర్ రమ్య తన ఎదురుగా ఉన్న తన క్లయింట్ చెప్తున్న మాట తన చెవికి వెళ్లడం లేదు తన తల లో "హెల్ప్ హెల్ప్ అక్క అక్క" అని తన గతం తాలూకు జ్ఞాపకాలు తన మెదడు నీ తొలిచేస్తున్నాయి రమ్య వాళ్ల మాట వినడం లేదు అని అర్థం అయిన తన అసిస్టెంట్ మనోహర్ వెంటనే తన చేత్తో రమ్య టేబుల్ మీద కొట్టి ఆ క్లయింట్ ఫైల్ నీ వాళ్ల ఇద్దరి మధ్య అడ్డం పెట్టి క్లయింట్ నీ డైవర్ట్ చేశాడు మనోహర్ దాంతో రమ్య హడావిడి గా బాత్రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఊపిరి పీల్చుకున్ని తన కోట్ నుంచి టాబ్లేట్స్ తీసుకోని కొంచెం కుదుట పడింది ఆ తర్వాత తన మొహం మీద నీళు పోసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చింది తను బయటికి రాగానే చాలా వేగంగా గన్ లో నుంచి తూటా వదిలినట్టు తన అసిస్టెంట్ కీ ఆర్డర్స్ వేస్తోంది "మనో మెడికల్ బిల్స్ అన్ని సరిగా ఉన్నాయి లేనిది చూసుకో, మనం చెప్పిన గవర్నమెంట్ certified డాక్టర్ వచ్చారా, అవతలి క్లయింట్స్ కీ నోటీసులు పంపించారా, తరువాత హియరింగ్ మనదే కాబట్టి క్విక్ గేట్ రెడీ, మిష్టర్ మెహతా మీకు నిన్న చెప్పిన విషయాలు గుర్తు ఉన్నాయి కదా అవతలి లాయర్ ఎంత confuse చేసిన మీరు మీ జవాబు మాత్రమే ఇవ్వాలి " అని తన పాటికి తను ఆర్డర్ వేస్తూ కోర్టు హాల్ కీ బయలుదేరింది రమ్య.
ఢిల్లీ లోనే టాప్ లాయర్ తను ఎలాంటి కేసు అయిన సింగిల్ హియరింగ్ లో ముగించడం తన ప్రతిభ అంతే కాకుండా తను ఎప్పుడు తప్పు చేసిన వారి వైపు నుంచే వాదిస్తుంది కారణం డబ్బు తనకు ఎంత ఎక్కువ ఫీజు ఇస్తే అంత స్ట్రాంగ్ గా తప్పుడు సాక్షులను సృష్టించి అంతే తొందరగా కేసు ముగిస్తుంది ఇలా ఇప్పుడు తన దగ్గరకు వచ్చిన క్లయింట్ ఒక బిల్డర్ తను ఈ మధ్య కట్టిన స్లమ్ క్లియరెన్స్ కీ సంబంధించిన ఒక బిల్డింగ్ కూలిపోయింది తన దగ్గర పని చేసే ఇంజనీర్ ఆ బిల్డింగ్ లో సిమెంట్ quality, బాగలేక అంతే కాకుండా ఆ బిల్డింగ్ తాలూకు ఫండ్స్ లోకల్ ఎంఎల్ఏ తో కలిసి మెహతా నొక్కేసి quality లేని మెటీరియల్ తో బిల్డింగ్ కట్టారు లక్కీ గా ఆ బిల్డింగ్ లో ఇంకా ఎవరూ చేరలేదు కాబట్టి ప్రాణ నష్టం జరగలేదు ఈ బిల్డింగ్ కట్టడం లో జరిగిన అవకతవకలపై ఆ ఇంజనీర్ కంప్లయింట్ ఇస్తే అతని చంపేశాడు అందుకే రమ్య కీ 8 కోట్లు ఫీజు డిసైడ్ చేసి కేసు వాదించమని అడిగాడు దాంతో రమ్య కూడా ఒప్పుకుంది.
కోర్టు మొదలు అయ్యింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిల్డింగ్ కట్టడం లో జరిగిన అవకతవకలపై రిపోర్ట్ లు కోర్టు కీ ఇస్తున్నారు మెహతా కీ చెమట కారుతుంది ఏమీ జరుగుతోంది అని భయం మొదలైంది కానీ రమ్య ప్రశాంతంగా కూర్చుని ఉంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన ప్రశ్నలకు మెహతా తడబాటు లేకుండా మనోహర్ చెప్పిన ప్రతి మాట అక్షరం పొల్లు పోకుండా చెప్తున్నాడు, ఆ తర్వాత రమ్య వాదించడం మొదలు పెట్టింది "your honor పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తన దగ్గర ఉన్న ఆధారాలను బట్టి నా క్లయింట్ పెద్ద స్కామ్ చేశారు అని అంటున్నారు కానీ నిజానికి ఈ స్కామ్ చేసింది నా క్లయింట్ దెగ్గర పని చేసిన ఇంజనీర్ సురేష్ అతనే ఈ టెండర్ ప్రపోజల్ తెచ్చాడు పైగా అతను చనిపోవడానికి రెండు రోజుల ముందు దుబాయ్ నుంచి ఒక offshore అకౌంటు ద్వారా అతని అకౌంటు లో 10 కోట్ల రూపాయల డబ్బు జమ చేయబడింది అది అతని సంతకం మీదే 50 లక్షల రూపాయలు చెక్ ద్వారా విత్ డ్రా చేశారు, పైగా ఇంజనీర్ సురేష్ చనిపోయిన రోజు ఉదయం నుంచి నా క్లయింట్ appendix ఆపరేషన్ మీద aims లో చేరి చికిత్స పొందుతూ ఉన్నారు దానికి సంబంధించిన x ray, మెడికల్ రిపోర్ట్ లు, అని కోర్టు వారికి సమర్పించడం జరిగింది సర్జరీ చేసిన డాక్టర్ నీ కూడా సాక్ష్యం గా ప్రవేశ పెడుతున్నాం అప్పుడు డాక్టర్ కూడా రమ్య చెప్పినట్టు చేశాడు " అలా ఎటు చూసినా సాక్ష్యం, ఆధారాలు అని మెహతా కీ అనుకూలంగా ఉండటం వల్ల అతని కోర్టు విడుదల చేసింది.
మెహతా సంతోషంగా వచ్చి రమ్య కీ ఫీజు కింద 8 కోట్లు ఇచ్చి వెళ్లిపోయాడు ఆ తర్వాత రమ్య మనోహర్ నీ పిలిచి "ఆ బాగ్ లో 8 ఉంది నువ్వు 2 తీసుకోని నాకూ మూడు ఉంచి మిగిలిన డబ్బు లో ఒక కోటి ఆ చనిపోయిన సురేష్ ఫ్యామిలీ కీ ఇవ్వు బయట ఉన్న ci నీ లోపలికి పిలిచి ఒక 50 లక్షలు ఇవ్వు ఆ మెహతా డ్రైవర్ కీ సాయంత్రం హాస్పిటల్ కు వెళ్లి మిగిలిన 50 ఇవ్వు ఇంక ఆ మిగిలిన కోటి ఎక్కడ ఇవ్వాలి అన్నది నీకు తెలుసుగా" అని చెప్పి తన ఇంటికి బయలుదేరింది రమ్య ఒక గంట తరువాత న్యూస్ లో మెహతా కార్ కీ ఆక్సిడేంట్ అయ్యింది అని వచ్చింది మెహతా చనిపోయాడు అతని డ్రైవర్ బ్రతికాడు అని వచ్చింది అంతకు ముందే ci కీ డబ్బు ఇవ్వడం తో కార్ లోని టెక్నికల్ లోపం వల్ల ఆక్సిడేంట్ జరిగింది అని కేసు కొట్టేశాడు అలా అన్యాయం నీ గెలిపించి తిరిగి న్యాయం చేయడం రమ్య స్టయిల్.
ఇలా ఎందుకు చేస్తోంది అంటే తన చెల్లి (సవితి చెల్లి) కీ చిన్నప్పుడు జరిగిన ఒక ప్రమాదం లో వెన్నుముక దెబ్బ తిని తనకు కాలు, చేతులు, నోరు కూడా పనిచేయడం లేదు తన ప్రాణాలను నిలబెట్టాలి అంటే క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి దాంతో మధ్య తరగతి కుటుంబం కీ చెందిన వాళ్లు అంత ఖరీదైన వైద్యం ఇవ్వలేక పోయారు అందుకే తన మెడికల్ ట్రీట్మెంట్ కోసం వాళ్ల నాన్న బస్ లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఆక్సిడేంట్ కింద కేసు నమోదు అయితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని కానీ ఆ డబ్బు మొత్తం తన సవితి తల్లి లాగేసుకుంది అప్పుడే డిసైడ్ అయ్యింది రమ్య తన సొంత చెల్లి కాకపోయిన తన వల్ల ఇలా జరిగిందని తన చెల్లి బాధ్యత తానే తీసుకుని ఇప్పుడు సిటీ లోనే పెద్ద కాస్ట్లీ క్రిమినల్ లాయర్ అయ్యింది.
మరుసటి రోజు ఉదయం తను తన హాలు లో టివి చూస్తూ thread mill మీద పరిగెత్తుతూ ఉంది అప్పుడే
టివి లో చెర్రీ కేసు గురించి న్యూస్ రావడం మొదలు అయ్యింది అది చూస్తూ ఉంటే తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ లో ఎమర్జెన్సీ అని వస్తే హడావిడిగా తన చెల్లి మౌనిక బెడ్ రూమ్ లోకి వెళ్ళింది అక్కడ తన చెల్లి బెడ్ మీద నుంచి కింద పడితే తనని లేపి మంచం పైన పడుకోబెట్టింది అప్పుడు "మల్లికా" అని అరిచింది రమ్య దాంతో మౌనిక కోసం పెట్టిన కేర్ టేకర్ మల్లికా కంగారు గా వచ్చింది అప్పుడు రమ్య తనని లాగి కొట్టింది "చెల్లి కంటే ముఖ్యమైన పని ఏంటి నీకు" అని కోపంగా అరిచింది రమ్య దాంతో మల్లికా "సారీ అక్క అమ్మ కీ serious గా ఉంది అని ఫోన్ వచ్చింది అందుకే ఫోన్ మాట్లాడుతూ ఉన్న" అని చెప్పి ఏడ్వడం మొదలు పెట్టింది దాంతో అప్పుడే మనోహర్ నుంచి ఫోన్ వస్తే రమ్య మల్లికా కీ సారీ చెప్పి ఫోన్ మాట్లాడానికి వెళ్లింది "సీనియర్ మనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది ex ఐపిఎస్ ఆఫీసర్ ప్రభాకర్ సిన్హా ఆయన నిన్న జరిగిన రేప్ కేసులో ఆయన తరుపున వాదించాలి అని అడిగారు ఎమ్ చేద్దాం" అని అడిగాడు మనోహర్ దాంతో రమ్య హైదరాబాద్ వెళ్లాలి అని డిసైడ్ అయ్యింది మల్లికా నీ కూడా వాళ్ల అమ్మ కూడా హైదరాబాద్ లోనే ఉండటం తో తనకు షెడ్యూల్ మార్చి తనతో పాటు హైదరాబాద్ కీ తీసుకుని వెళ్లింది అప్పుడు మనోహర్ నీ ప్రభాకర్ దగ్గరికి పంపి తను చెర్రీ నీ కలవడం కోసం జైలు కీ వెళ్లింది.
సాయంత్రం మీడియా వాళ్లను పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టింది రమ్య ప్రభాకర్ ఇంట్లో టివి లో చూస్తూ ఉన్నాడు అప్పుడు మీడియా ముందు "నేను ఈ కేసు లో చెర్రీ తరుపున వాదిస్తున్నా" అని చెప్పింది రమ్య అది విని ప్రభాకర్ షాక్ అయ్యాడు.
The following 15 users Like Vickyking02's post:15 users Like Vickyking02's post
• 9652138080, aarya, Anamikudu, Babu ramesh, Checked, Chytu14575, K.rahul, Kacha, ramd420, Shaikhsabjan114, SS.REDDY, TheCaptain1983, Venkat 1982, vijay1234, సోంబేరిసుబ్బన్న
Posts: 420
Threads: 0
Likes Received: 481 in 320 posts
Likes Given: 2,040
Joined: May 2019
Reputation:
9
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-07-2021, 01:01 PM)Kacha Wrote: చాల బాగ మొదలు పెట్టారు
Thank you bro
Posts: 20
Threads: 3
Likes Received: 12 in 8 posts
Likes Given: 50
Joined: May 2021
Reputation:
0
Suggest me cuckold son sex stories in telugu
Posts: 9,888
Threads: 0
Likes Received: 5,647 in 4,633 posts
Likes Given: 4,836
Joined: Nov 2018
Reputation:
48
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-07-2021, 02:57 PM)utkrusta Wrote: EXECELLENT UPDATE
Thank you bro
•
Posts: 620
Threads: 0
Likes Received: 568 in 347 posts
Likes Given: 1,582
Joined: Dec 2020
Reputation:
17
Posts: 7,507
Threads: 1
Likes Received: 5,019 in 3,880 posts
Likes Given: 47,611
Joined: Nov 2018
Reputation:
82
మంచి గా మొదలుపెట్టారు స్టోరీ
Posts: 869
Threads: 0
Likes Received: 621 in 523 posts
Likes Given: 2,549
Joined: Dec 2019
Reputation:
6
Posts: 828
Threads: 0
Likes Received: 1,297 in 733 posts
Likes Given: 3,329
Joined: Jun 2020
Reputation:
50
Good Story Beginning Andi.
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-07-2021, 06:39 PM)vijay1234 Wrote: న్యాయం కావాలి
న్యాయం జరుగుతుంది కానీ చాలా ట్విస్ట్ లు తరువాత
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-07-2021, 09:54 PM)ramd420 Wrote: మంచి గా మొదలుపెట్టారు స్టోరీ
Thank you bro
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(19-07-2021, 10:34 PM)Shaikhsabjan114 Wrote: సూపర్ upd❤❤❤
Thank you bro
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(20-07-2021, 03:53 AM)TheCaptain1983 Wrote: Good Story Beginning Andi.
Thank you captain
•
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
20-07-2021, 09:58 AM
రమ్య ప్రెస్ మీట్ లో ఓపెన్ గా తను చెర్రీ తరుపున కేసు వాదిస్తున్నాను అని చెప్పగానే ప్రభాకర్ కీ ఏమీ చేయాలో అర్థం కాలేదు ఇప్పుడు చెర్రీ కీ రమ్య తోడు అయితే తన బతుకు కుక్కలు చించిన విస్తరి అని అర్థం అయ్యింది దాంతో రమ్య కీ ఫోన్ చేసి ఫీజు ఎంత ఎక్కువైన సరే convince చేయాలి అని చూశాడు కానీ రమ్య ఫోన్ తీయడం లేదు దాంతో కోపం వచ్చి ఫోన్ విసిరి కొట్టాడు అది గోడకి తగిలి విరిగి పోయింది ఇంక కోపం తగ్గలేదు అందుకే సోఫా లో కూర్చుని మందు తాగుతూ అలాగే పడుకుని ఉన్నాడు ఎంత లా తాగేశాడు అంటే మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు మధుమతి కేసు లో తను పెట్టిన ఇన్స్పెక్టర్ వచ్చి కాలింగ్ బెల్ కొట్టి డిస్టర్బ్ చేసే వరకు ఆ కాలింగ్ బెల్ శబ్దం కీ లేచి వెళ్ళి తలుపు తీశాడు అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ రాకేష్ కంగారుగా లోపలికి వచ్చి "ఫోన్ ఎక్కడ పెట్టారు సార్ పొద్దున నుంచి చేస్తున్న" అని చెప్పాడు దానికి ప్రభాకర్ ఇంక నిద్ర మబ్బు లోనే "అంతలా ఎవరి కొంపలు అంటుకున్నాయి అని అంత కంగారు పడుతున్నావు" అని అడిగాడు దానికి రాకేష్ "మీ కొంపే అంటుకుంది సార్ ఆ చెర్రీ గాడికీ మెడికల్ బైల్ వచ్చింది" అని చెప్పాడు దానికి ప్రభాకర్ షాక్ అయ్యి "ఏమీ చెప్తున్నావు అసలు ఎలా వచ్చింది వాడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పా కదా"అని గట్టిగా రాకేష్ మీద అరిచాడూ అలా ఇద్దరు ఏమీ జరిగిందో ఎలా జరిగిందో అర్థం కాక తల పట్టుకున్నారు.
(ముందు రోజు రాత్రి)
చెర్రీ నీ జైలు లో కలిసిన తరువాత తన పరిస్థితిని చూసి రమ్య కీ తన గతం గుర్తుకు వచ్చింది అప్పుడు తను చేసిన మళ్లీ ఇప్పుడు చేయకుడదు అన్ని డిసైడ్ అయ్యింది అందుకే చెర్రీ ఫ్యామిలీ నుంచి ఒక రూపాయి కూడా ఆశించకుండా ఆ కేసు నీ ఫైట్ చేయడానికి నిర్ణయం తీసుకుంది రమ్య, ప్రెస్ మీట్ తరువాత రమ్య హోటల్ కి వెళుతున్న సమయంలో తన కార్ అద్దం నుంచి బయటకు చూస్తున్న తనకు తన గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయి అప్పుడు తనుకు మళ్లీ ఊపిరి ఆడక కళ్లు ఎర్రగా అయ్యి తల నొప్పి రావడం మొదలైంది అప్పుడు మనోహర్ తన దగ్గర ఉన్న టాబ్లేట్స్ ఇచ్చి "సీనియర్ మీ పరిస్థితి బాగా లేదు మనం ఈ కేసు వదిలేయడం మంచిది ఈ కేసు కంటే ముందు నీ ఆరోగ్యం ముఖ్యం" అని చెప్పాడు దాంతో రమ్య వెంటనే కార్ చెర్రీ ఇంటికి వెళ్లమని చెప్పింది అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లు రమ్య కీ కృతజ్ఞతలు చెప్పారు చెర్రీ కోసం ఫైట్ చేయడానికి ఒప్పుకున్నందుకు అప్పుడు రమ్య వాళ్లతో ఇలా చెప్పడం మొదలు పెట్టింది ఆ టైమ్ లో ప్రభాకర్ ఫోన్ కట్ చేసింది "చూడండి మీ అబ్బాయి నీ కలిసిన తరువాత అతని పరిస్థితి చూసిన తర్వాత నాకూ అర్థం అయ్యింది ఏంటి అంటే అతను ఈ కేసు ముగిసే వరకు జైలు లో ఉంటే చనిపోతాడు ఈ కేసు లో చాలా మంది పెద్దవాళ్లు ఉన్నారు కాబట్టి అతనికి ఉన్న పరిస్థితుల్లో బైల్ కానీ parole కానీ ఏది రాదు మహిళా సంఘాల సభ్యులు కోర్టు నీ అలా కోరడం తో అలా జరిగింది కానీ భయం వద్దు నా దగ్గర ఒక ఆలోచన ఉంది మెడికల్ బైల్ మీ అబ్బాయి కీ critical హెల్త్ problem ఉంది అని కోర్టు నీ నమ్మిస్తే మీ అబ్బాయి ట్రీట్మెంట్ పేరుతో ఒక రెండు నెలల పాటు బయటకు తీసుకోని రావ్వోచ్చు" అని చెప్పింది.
ఆ మాట వినగానే చెర్రీ అమ్మ నాన్న కళ్ల లో ఏదో తెలియని ఆశ చిగురించింది దాంతో స్పెషల్ పర్మిట్ తీసుకోని మనోహర్ చెర్రీ నీ కలిశాడు తనకు ఒక స్వీట్ బాక్స్ ఇచ్చి "రేపు ఉదయం 7 గంటలకు ఒకటి తిను తరువాత స్వీట్ బాక్స్ లేకుండా చెయ్యి" అని చెప్పి వెళ్లిపోయాడు దాంతో చెర్రీ మనోహర్ చెప్పినట్లు చేశాడు దాంతో తనకు కడుపులో నొప్పి మొదలు అయ్యి రక్తం కక్కుతూ ఉన్నాడు దాంతో అతని వెంటనే హాస్పిటల్ కీ తీసుకోని వెళ్లారు రమ్య తన ప్లాన్ పని చేసింది అని అర్థం అయ్యి తనకు ఉన్న పవర్ తో తెలంగాణ హై కోర్టు చీఫ్ జస్టిస్ నీ కలిసి రాత్రికి రాత్రి చెర్రీ వాళ్ల అమ్మ పాత మెడికల్ రిపోర్ట్ లు వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ తో కలిసి తను సృష్టించిన సాక్షులను చూపించి "చెర్రీ కీ పేగుల మధ్య చిన్న రంధ్రం ఉంది అని దాని వల్ల అతనికి బయటి భోజనం వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాణం కీ ప్రమాదం అవుతుంది అని తన పూచీ కత్తు మీద రెండు నెలల పాటు ఫ్యామిలీ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స కోసం మెడికల్ బైల్ అప్లై చేసింది" రమ్య దాంతో చీఫ్ జస్టిస్ కూడా బైల్ మంజూరు చేశారు.
బైల్ వచ్చిన తర్వాత హాస్పిటల్ లో చెర్రీ నీ కలిసి తిరిగి హోటల్ కీ వచ్చింది రమ్య అప్పటికే ప్రభాకర్ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు "హలో సార్ ఏంటి ఇలా వచ్చారు" అని అడిగింది రమ్య దానికి ప్రభాకర్ "మేడమ్ మీరు ప్రీమియం లాయర్ మా లాంటి విఐపి క్లయింట్ తో రిలేషన్స్ బాగా ఉంటే మీకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు తేలిక గా వస్తాయి అలాంటి మిడిల్ క్లాస్ వాళ్లు మీ పెట్రోల్ చార్జ్ కూడా తీర్చలేరు" అని డబ్బు అశ చూపుతూ మాట్లాడాడు "కరెక్ట్ వాళ్లు నా సౌకర్యాలు తీర్చలేరు కానీ నేను అదే క్లాస్ నుంచి మా నాన్న తన 20 సంవత్సరాల కష్టం తో ఒక కొట్టి సంపాదిస్తే దానికి నేను డబల్ నా నాలుగు సంవత్సరాల ప్రాక్టీస్ లో సంపాదించ ఇన్ని రోజులు తప్పు చేసిన వాళ్ళని కాపాడి సంపాదించిన డబ్బుతో ఇప్పుడు ఒక అమాయకుడిని కాపాడుతా ఇంక మీరు వెళ్ళోచ్చు " అని చెప్పింది రమ్య దానికి ప్రభాకర్ నవ్వుతూ సోఫా నుంచి లేచి "అయిన వాడే కేసు నేనే చేశా అని ఒప్పుకున్న తరువాత ఇంక మీరు చేసేది ఏమీ ఉంది మేడమ్ " అని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ మరుసటి రోజు ఉదయం కోర్టు లో ప్రభాకర్ తరుపున లాయర్ చెర్రీ కేసు ఒప్పుకున్న తరువాత ఇందులో ఇంక ఏమీ లేదు కాబట్టి కేసు కొట్టి వేయాలని కోరారు, అప్పుడు రమ్య జడ్జ్ గారితో "your honor చెర్రీ ఈ రేప్ హత్య తనే చేశాడు అని ఒప్పుకున్నాడు అని చెప్పారు అని అంటున్నారు మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కానీ ఇక్కడ ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటి అంటే చనిపోయిన మధుమతి తను చనిపోయిన రోజుకు 6 వారాల గర్భిణీ తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో కాదు తనని రేప్ చేసి హత్య చేశారు అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నా క్లయింట్ చరణ్ " అని చెప్పింది ఆ విషయం తెలియని ప్రభాకర్ కీ ఒకసారి గా తన మీద పెద్ద బాంబ్ పడ్డట్టు అయ్యింది.
రమ్య వేసిన బాంబ్ కీ ప్రభాకర్ కీ మైండ్ పోయింది అప్పుడు రమ్య పోస్ట్ మార్టం రిపోర్ట్ కోర్టు కీ ఇచ్చి దాంతో పాటుగా చెర్రీ DNA రిపోర్ట్ కూడా సాక్ష్యం గా ఇచ్చింది "your honor చనిపోయిన మధుమతి నా క్లయింట్ చరణ్ ఇద్దరు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు దాంతో వాళ్లు చనువు గా ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ వల్ల మధు aka మధుమతి గర్భం దాల్చింది అది తెలిసిన నా క్లయింట్ తన తప్పు గ్రహించి తనని పెళ్ళి చేసుకోవాలని ఆశ పడి తన కుటుంబంతో పాటు మధు కుటుంబాన్ని కూడా ఒప్పించి నాలుగు రోజుల క్రితమే ఇద్దరికి నిశ్చితార్థం జరిగింది ఇప్పుడు వచ్చి నా క్లయింట్ తనని రేప్ చేసి హత్య చేశాడు అని అంటున్నారు ఒక వేళ్ల నిజంగా తను రేప్ చేసి ఉంటే ప్రేమించిన అమ్మాయి నీ ఎందుకు చంపుతాడు, మన సెక్యూరిటీ అధికారి వారి కధనం ప్రకారం తను ఆ అమ్మాయిని క్షణికావేశం లో చంపాడు అని అంటున్నారు చంపిన వాడు సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చే వరకు అక్కడే ఎందుకు ఉంటాడు మన దెగ్గర ఉన్న పోస్టు మార్టం రిపోర్ట్ ప్రకారం మధుమతి 4 గంటల సమయంలో చనిపోయినది అని ఉంది అందుకు ఈ కేసు విచారణ చేసిన ఇనస్పెక్టర్ రాకేష్ నీ question చేయడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాము" అని చెప్పింది రమ్య.
దాంతో రాకేష్ నీ పిలిచారు అప్పుడు రమ్య అతని ప్రశ్నించండం మొదలు పెట్టింది "ఇనస్పెక్టర్ గారు మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ నీ చూశారా" అని అడిగింది
రాకేష్ : చూశాను మేడమ్ నేనే దాని చార్జ్ షీట్ లో రాశాను
రమ్య : సరే చార్జ్ షీట్ లో అని మీరే రాశాను అన్నారు కదా
రాకేష్ : అవును మేడమ్
రమ్య : note this point my lord ఈ చార్జ్ షీట్ ప్రకారం 4 గంటల కీ మధుమతి హత్య జరిగింది కానీ అదే చార్జ్ షీట్ లో మీరు చెర్రీ నీ 5:30 కీ మీడియా ముందు అరెస్ట్ చేశారు అని ఉంది అంతే కాకుండా 4:45 కీ cctv లో తను ఆ కాలనీ గేట్ ద్వారా వచ్చిన footage చూసి 4:30 కీ పక్కింటి వాళ్లు ఇచ్చిన కంప్లయింట్ మీద తనని అరెస్ట్ చేశారు అని కూడా రాశారు అంటే 4:45 కీ చెర్రీ కాలనీ కీ వస్తే తను ఎలా 4 గంటల సమయంలో మధుమతి నీ హత్య చేశాడు అంటే తను హత్య చేసి బయట టీ తాగడానికి వెళ్లి తిరిగి వచ్చి సెక్యూరిటీ ఆఫీసర్లు అరెస్టు చేస్తారు అని మళ్ళీ హత్య జరిగిన చోటికి తిరిగి వచ్చి మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడా.
రమ్య అడిగిన ప్రశ్నకు రాకేష్ నోట్లో నుండి మాట కూడా రావడంలేదు, దాంతో జడ్జ్ గారు కూడా జరిగింది అంతా చూసి బాగా ఆలోచించి "జరిగిన వాదనలు విన్న తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్ వారు సరిగా విచారణ జరపలేదు అని అర్థం అవుతుంది ఈ కేసు నీ పూర్తిగా నిర్లక్ష్యం గా విచారణ చేసి ఒక నిర్దోషి మీద ఈ కేసు అన్యాయం గా రుదాలి అని చూశారు అందుకే ఇన్స్పెక్టర్ రాకేష్ నీ సస్పెండ్ చేసి ఒక సమర్ధవంతమైన సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ కీ తదుపరి విచారణను అందించాలని ఆదేశిస్తూ ఈ కోర్టు చెర్రీ అలియాస్ చరణ్ నీ విడుదల చేస్తోంది" అని తీర్పు ఇచ్చారు జడ్జ్ గారు.
చెర్రీ విడుదల అయిన తర్వాత వెంటనే బైక్ వేసుకొని తన కాలేజీ కీ వెళ్లాడు అక్కడ టెన్నిస్ కోర్టు లోకి వెళ్లి అక్కడ తను మొదటి సారి మధు నీ చూసిన సంఘటన గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు తన స్టేట్ లెవల్ టెన్నిస్ టోర్నమెంట్ కోసం కోర్టు లో నిలబడి అవతలి వైపు ఉన్న ప్లేయర్ కీ కనీసం ఒక పాయింట్ కూడా రాకుండా చెర్రీ దాదాపు గెలిచే దిశ గా ముందుకు వెళుతున్నాడు అప్పుడే ఒక అమ్మాయి కోర్టు లోపలికి వచ్చింది ఎవరినో వెతుకుతూ ఉన్న తన చూపు చెర్రీ ఏకాగ్రత నీ డిస్టర్బ్ చేసింది దాంతో తన వైపు వచ్చే బంతి వేగం కంటే తన కంటి చూపు వల్ల పెరిగిన తన గుండె వేగం వినిపిస్తోంది చెర్రీ కీ కానీ తన లక్ష్యం మరిచిపోలేదు చివరి షాట్ కొట్టి తను గేమ్ గెలిచాడు ఆ తర్వాత తనను అభినందించడానికి మొత్తం కాలేజీ స్టూడెంట్స్ అందరూ చెర్రీ నీ ఎత్తుకొని కోర్టు మొత్తం రౌండ్ వేస్తున్నారు కానీ చెర్రీ చూపు మాత్రం ఇవి ఏవి పట్టించుకోకుండా తన ఫ్రెండ్ తో కలిసి వెళుతున్న మధుమతి నే చూస్తూ ఉన్నాడు దాంతో వెంటనే కిందకు దిగి పరుగున వెళ్లి మధు కీ ఎదురుగా నిలబడి "i love you" అని చెప్పాడు కానీ తన మొహం లో ఎలాంటి మార్పు లేదు లేదు ఏమీ పట్టనట్టు వెళ్లిపోయింది.
అప్పుడే అక్కడికి వచ్చిన రమ్య తనని పిలిస్తే ఈ లోకంలోకి వచ్చాడు చెర్రీ "చాలా థాంక్స్ మేడమ్ మీరు చేసిన హెల్ప్ ఎప్పటికీ మరిచిపోను" అని అన్నాడు దానికి రమ్య "మనం గెలిచినది మొదటి రౌండ్ మాత్రమే ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్లు మళ్లీ మన పాయింట్స్ తిరిగి మన మీద వాడోచ్చు" అని చెప్పింది దాంతో చెర్రీ "ఎవ్వరూ నాకూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు మీరు ఎందుకు వచ్చారు" అని అడిగితే "8 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి కీ ఇలాగే అన్యాయం జరిగింది తనకు నేను అప్పుడు సహాయం చేయాలని చూశాను కానీ ఏమీ చేయలేని పరిస్థితి అందుకే ఇప్పుడు ఆ తప్పు మళ్లీ చేయకుండదని నిర్ణయం తీసుకున్నా" అని చెప్పింది రమ్య.
The following 11 users Like Vickyking02's post:11 users Like Vickyking02's post
• 9652138080, aarya, Anamikudu, dradha, Shaikhsabjan114, Sivak, SS.REDDY, TheCaptain1983, Venkat 1982, vijay1234, సోంబేరిసుబ్బన్న
Posts: 869
Threads: 0
Likes Received: 621 in 523 posts
Likes Given: 2,549
Joined: Dec 2019
Reputation:
6
సూపర్ సూపర్ అప్డేట్ ❤❤❤
Posts: 3,912
Threads: 34
Likes Received: 4,293 in 1,109 posts
Likes Given: 2,620
Joined: Nov 2018
Reputation:
333
(20-07-2021, 10:36 AM)Shaikhsabjan114 Wrote: సూపర్ సూపర్ అప్డేట్ ❤❤❤ [image]
Thank you bro
•
Posts: 9,888
Threads: 0
Likes Received: 5,647 in 4,633 posts
Likes Given: 4,836
Joined: Nov 2018
Reputation:
48
EXECELLENT AND GOOD UPDATE
Posts: 2,681
Threads: 0
Likes Received: 1,927 in 1,487 posts
Likes Given: 7,509
Joined: Jun 2019
Reputation:
22
Superb start bro epatilane chala baga rasthunnaru
|