Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఔననకా.. కాదనకా.. BY పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......
#1
ఔననకా.. కాదనకా..

పునర్కథనం &/ సంఖ్యానువాదం: అన్నెపూ.......





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ఔననకా.. కాదనకా..
ఇంటర్ కమ్ మోగుతుంటే బద్దకంగా కదిలి కళ్ళు విప్పింది అవంతిక. “హాయ్ …. తలుపు తియ్యమ్మా ! తియ్యి" అంటూ భర్త మధుభూషణ్ మాట్లాడాడు. "ఈయనేంటి ఇంత డార్క్ నైట్ వచ్చారు."ఒక్క ఉదుటున తన బెడ్ మీంచి కిందికి గెంతిందామె. ఆర్థరాత్రి వరకూ టీవీలో మిడ్నైట్ షోస్ చూసి నిద్రపట్టక బెడ్ పై తోడులేక తపించి తపించి ఇలా కళ్ళు మూసుకుందో లేదో ఇంటర్కమ్లో భర్త రూపం... ఆమెకేదో మోహనరాగం ఆవహించినంత ఆనందం వేసింది.
మెయిన్ డోర్ తీసీ తీయగానే… ."హాయ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ నువ్వు నిద్రపో…. నేను ఫ్రెష్ అయి వస్తాను"అని మధుభూషణ్ ఆమె బుగ్గపై చిటికె వేసి బెడ్ రూమ్ కి ఎటాచ్డ్ గా ఉన్న బాత్ రూమ్ లోకి వెళ్లి తలుపేసుకున్నాడు.
గాలి తీసిన బెలూన్ లా ఉసూరుమందామె. అతను రావడమే తనని గుండెలకు హత్తుకుని అన్నీ ‘ఐ మిస్ యూ’ అంటాదాని చాలాకాలంగా ఎదురు చూస్తుంటుంది.
క్యాంపుకెళ్ళిన ప్రతి సారీ అతనొచ్చే క్షణం వరకూ అభిసారికలా పరి తపిస్తుంటుంది. అతడు వస్తాడు, బుగ్గ మీదచిటికెవేస్తాడు. ఫ్రెష్ అయి వస్తానంటూ బాత్రూ రూమ్ లోకి వెళ్ళిపోతాడు.
నీట్నెస్ అంటే అతనికి ప్రాణం... తననీ ప్రాణమ లాగే ప్రేమిస్తాడు… కానీ అంతకుమించి ఏదోకావాలని తపిస్తుంటుంది తను. తనకేం కావాలో తనుచెప్పలేదు. అతనివ్వలేడు. అతను స్నానం చేసివచ్చేసరికి ఆమె కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తూ ఉంది.
ఆటను లైట్ ఆఫ్ చేసి... టచ్ మీ నాట్ అన్నట్టుగా అటు తిరిగి పడుకున్నాడు. ఆమె కళ్లలోంచి నీళ్లు జారీ దిండు కవరును కౌగిలించుకున్నాయి.
వాళ్ళిద్దరికీ పెళ్ళై పాతికేళ్ళు.కూతురికి తొందరగానే పెళ్లి జరిగింది.
కొడుకు యు.కె లో జాబ్ చేస్తున్నాడు. కూతురికో పాప. వాళ్ళు దగ్గరలోనే ఉంటున్నారు.
ఇంట్లో వాళ్లిద్దరూ... కావాల్సినంత లగ్జరీ... కాలు బైట పెడితే కారు డోర్ ట్రీసి రెడీగా ఉంటాడు డ్రైవర్.
ప్రమోషన్ మీద ప్రమోషన్ భర్తకి. లైఫ్ బిజీ అయిపోయిందామెకి అన్నీఅందుబాటులోనే ఉంటాయి. అందాల్సినవాటిని అందుకోలేని అనీజీనెస్… జీవితం చప్పగా ఉంది... అనుకుంటుంది ఆమె.
ఈ మధ్య మరీ ఇంటర్నెట్ కి అంకితం అయిపోయింది. తెలియకుండానే రకరాల సైట్స్ లోకి వెళ్ళిపోతూ చూడకూడనివి చూసేస్తూ చదవకూడనివి చదివేస్తూ కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది సుమా!
అనుకునేంత డైలమాలో బతికేస్తుంది అవంతిక. తెల్లారింది. రొటీన్ గా రోజు మొదలైంది. ఎప్పటిలాగే ఆరుగంటలకి తలారా స్నానం చేసింది.
భగవంతునికి ఆరాధనలో భాగంగా పూజ మొదలుపెట్టింది అవంతిక.
అమ్మగారు! అయ్యగారొచ్చి నటున్నారు..." రావడమే తుఫానులా వాగుతుంటుంది నాగమణి. అది పనిమనిషి అని మర్చిపోయి దాన్ని ఫ్రెండ్ లాగా ప్రేమిస్తుంటుంది అవంతిక. అది తనలోని ఎన్నో రుగ్మతలకి మందులా మాటలు చెప్తుంది.
చాలా ఇళ్ళలో అది పనిచేస్తుంటుంది కాబట్టి ఆలుమగల మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ విషయాలు గమ్మత్తుగా చెప్పడంతో డిస్కవరీ ఛానెల్లో చూస్తున్నటుగా అనిపిస్తుంది. పూజ చేసుకుంటూ తలూపింది, నాగమణి ప్రశ్నకి జవాబుగా అవంతిక.
Like Reply
#3
"వారం తరువాత అయ్యగారు ఇంటికొస్తే ఆ పూజ కాకుండా ఈ పూజ ఏంటమ్మా"ఏ పూజ అన్నట్టుగా కన్ఫ్యూజన్ గా సైగచేసింది.
ఈయేల మంగళారం కాదుకదా... అమ్మగారు మౌనవ్రతం సెయ్యటానికి..." అది తలగోక్కుని వాకిలి చిమ్మి మల్లెపందిరి ముగ్గేసి లోపలికి వచ్చి అంట్లు తీసుకుంటూ తన మాటల చాతుర్యం సాగించింది.
"అమ్మగారు! మనీది చివర చౌదరి గారి ఇంట్లోకి రాత్రి ఎవరో గోడదూకి వచ్చేసినారని పట్టుకున్నారంట... తీరా సూత్తే అల్లుడుగోరంట... "
అవంతిక పూజ మర్చిపోయింది. "అల్లుడు ఎందుకు గోడ దూకడం" అని అడిగింది. అమ్మగారికియ్యాల మౌనవ్రతం లేదన్నమాట... సంతోషం వేసింది నాగమణికి చెప్పేవాళ్ళకి అడిగేవాళ్ళుంటేనే కదా మజాగా ఉంటుంది.
"ఆ... అల్లుడు గోరేనమా! ఆషాఢం కదా. ఆగలేక గోడ దూకేడంట... ఆ పిల్లమొగం సూడాల సిగ్గేడ దాచుకోవాల్నో తెలీకమొగుడ్ని గదిలోకి లాక్కు పోయింది. పాపం చౌదరిగారి పెండ్లాం ఒకటే మొత్తుకుందట... గుమ్మాలు మార్చాలని... నెలాగలేకవోయింర్నని" గొల్లున నవ్వింది.
అవంతిక తన ఆషాఢమాసం తంతు గుర్తుచేసుకుంది.
సిన్మాకి రమ్మని తీసుకెళ్ళి మధు భూషణ్ తన ఫ్రెండ్ మిసెస్ ఊరెళ్ళిందని అక్కడికి తీసుకువెళ్ళిపోయాడు.
వారంరోజులు... ఇంట్లోవాళ్ళు ఏమంటారో ఏమనుకుంటూరోనని తనూభయంతో బిగుసుకుపోతే ఆటను ఆలోచించే సమయాన్ని ఇవ్వకుండా రాత్రీ పగలు ఊపిరాడని కౌగిలిలో…
"అమ్మగారూ...! వారం తరువాత ఊర్నుంచి అయ్యగారొచ్చారు.రాత్రి నిద్దరోనిచ్చేరా లేదా?" అంది.
అవంతిక తుళ్ళిపడి చూసింది.
రాత్రి గుర్తొచ్చి గుబులేసింది. అంగట్లో అన్నీఉన్నాయి కానీ "ఆగవే ఆయన లేచినట్టున్నారు" ప్రసాదం నోట్లోవేసుకుని గబగబా ఫిల్టర్ కాఫీ రెడీచేసి తీసుకుని వెళుతుంటే వెనుక నించి నాగమణి అల్లరిగా” అంది.
"చీర బాగుంది. నలిగిపోద్దేమో జేగర్తాండి"అని.
దానికా చనువు అవంతికే ఇచ్చింది. అవంతిక ఒక్క క్షణం తుళ్ళింతయ్యింది. అలా జరుగుతుందా!
జరిగితే... ఆమె గదిలోకి ప్రవేశించే సరికి అతను బద్దకంగా బెడ్ మీద కదులుతున్నాడు.
గుడ్ మార్నిగ్... .” అంటూ కాఫీ అతని ముందుకు చూపింది. అతను చాలాసంతోషంగా ఆమెని చూశాడు.
సువాసనాభరితమైన ఆ ఉదయం పూట ఆమె చేతిలోని ఫిల్టర్ కాఫీని తనివితీరా ఆస్వాదించాడు. అందుకున్నాడు. ఆమె ఎదురుచూసింది.
అబ్బా! ఇంత చక్కని చిక్కని కాఫీ ఎక్కడా దొరకదు అవంతీ!' అంటూ ప్రశంసించాడతను.
ఆమెకి కావల్సింది ఆ ప్రశంస కాదు."అవంతీ! ఈ రోజు ఎంత లవ్లీగా ఉన్నావు... " అంటూ చిన్న ప్రశంసతోపాటు బిగికౌగిలి... ఫ్యాన్ గాలికి చీర కొంగు రెపరెపలాడుతోంది.
అందాలు మాకు స్వేచ్చ కావాలి అంటూ మొత్తుకుంటున్నాయి. ఆమె ఉసూరుమంది. అతను ఖాళీ కప్ ఆమె చేతికి ఇచ్చి "నేను స్నానం చేసొస్తాను టిఫిన్ రెడీ చేసేయ్ అవంతీ!” అంటూ బాత్రూమ్లోకెళ్ళిపోయాడు.
[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
#4
ఒకప్పుడు... చాలాకాలం క్రితం టిసిన్ కావాలి టిసిన్ కావాలి. అంటూ తనని వదిలేవాడు కాదు.

పిల్లలు ఉన్నారు అని తప్పించుకుంటుంటే ‘ఎట్లీస్ట్ కాఫీ ప్లీజ్ అంటూ పెదవుల్ని లాక్ చేసేవాడు.
సంజాయిషీ ఇచ్చుకోలేదు. ఏమి జరగనట్టే కాలం చట్రంలా తిరిగింది. అతనలాంటి సర్ప్రైజ్ మరోసారి ఆమెకి ఇవ్వలేదు. ఆమె కావాలని అడగలేదు.
ఇప్పుడు ఇన్నాళ్ళకి కాలం వెనక్కి తిరిగొస్తే బాగుండునని అనుకుంటోంది.అతనేదో సర్పైజ్ చేస్తే థ్రిల్ అవ్వాలని మనస్సు తనువు ఉవ్విళ్ళూరుతున్నాయి.
నాగమణి మాటలు గుర్తోస్తున్నాయి. ‘మీలాగ మాకు వారాలు వొజ్జాలు ఉండవండి... సుబ్రం అశుభ్రం అంట దూరకుండలేమండి.
ఆడికి కావాలంటే నా ఒంటిమీద సెయ్యేత్తాడు... నాక్కావాలంటే నేనాడిమీద సెయ్యేతానండి... మొగుడు పెళ్ళాల మద్దెన 'ఈగోలెందుకండి… తాను కావాలంటే అతను… ?
అవంతికకి ఏం చెయ్యాలో తోచక శుభ్రంగా ఉన్న ఇంటిని మరోసారి సర్దింది కొన్నింటిని ప్లేసు మార్చింది. వంట చేస్కుంది.
"అమ్మా బైటికి వెళ్ళాలా?" అని డ్రైవరు శీను అడుగుతుంటే... "లేదు. నేనెటూ వెళ్ళడంలేదు. నువ్వింక ఇంటికి వెళ్ళు." అంటూ పంపేసింది.
తనకోసం ఫ్రెడ్ రైస్ చేసుకుంది. కాసేపు పడుకుంద.ఏం చేసినా పొద్దు గడవనంటోంది. కూతురు శ్రావ్యకి ఫోన్చేసింది. చాలాసేపు మాట్లాడింది. మనవరాలి ముద్దుమాటలు విన్నది. “రేపు మీ మ్యారేజ్ డే కదా! స్పెషల్ ఏముంది!" అని శ్రావ్య అడిగిందానికి ఉస్పూరుమని నిటూర్చింది.
"ఏముంది? ఎప్పట్లాగే కొత్తబట్టలు వేస్కోటం... తర్వాత కుదిరితే గుడికి వెళ్ళడం. మీ డాడీ ఆఫీ సుకి. నేను ఇంటికి అంకితం ఐపోవడం... అంతకు మించి స్పెషల్ ఏముందని…."
"రేపు నేనొస్తాను మమ్మీ" అని ఫోన్ కట్ చేసింది శ్రావ్య. వండుకుని వడ్డించుకుని తిన్నది. కాస్సేపు టీవి చూసింది. మనసుకు బోర్ గా ఉందనిపించింది. కంప్యూటర్ ముందుకూర్చుంది. లోలోతుకుపోతూ ఉంది. మౌస్ క్లిక్ చేస్తోంది. వేళ్లు అసంకల్పితంగా నొక్కుతుంటే కళ్లు దూసుకుపోతున్నాయి. మనస్సు మరింత వేగంగా పరుగెడుతోంది.
సడెన్ గా ఆగిపోయింది. ఎవరో ఇద్దరి ఛాటింగ్ కనిపించింది. అదో కోడ్ భాషలా ఉంది. డబుల్ మీనింగ్స్ అన్పించి మనస్సు చాలాసేపు వాటిగురించి ఆలోచిస్తుంటుంది. ఈమధ్య అదో బలహీనత ఐపోయిందామెకి.
అంత బహిర్గతంగా వాళ్ళెలా వివరించుకుంటున్నారో సిగ్గుగా ఉండదా అని అనుకుంటూ ఉంది.
అయినా వాటిని తరచూ చదివి ఆస్వాదిస్తూ ఆనందిస్తోంది. అవన్నీ తనకి, తన భర్త మధుభూషణ్ కి అన్వయించుకుంటూ ఉంటుంది. తనలా చెప్పగలిగితే బాగుండేది. కనీసం భర్త అలా చెప్పినా బాగుండేది. "నువ్వు రాత్రి నన్నలా హత్తుకుంటే
ఎంతో బాగుంది తెలుసా?”
'ఎలా?'
"అదే కొత్తగా... అవును ఈమధ్య నువ్వెందుకో నాకు పిచ్చిగా నచ్చేస్తున్నావు... ఖజురహో శిల్పంలా నిన్నెంతగా ఎన్నిసారు చూసినా తక్కువనిపిస్తోంది’
"అంతగా నచ్చానా... ఖజురహో శిల్పంలా ఉన్నానా?' 'అవును. నాదో రిక్వెస్ట్...
" ఏంటో? శిల్పాలు నైటీలు వేసుకోవు...'





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
#5
'చంపేస్తాను.’

చంపేయి….నీ పరిశ్వంగంగంలో నేనెన్నోసార్లు మర ణించి బతికేస్తుంటాను ప్రియా?..." 'అబ్బా! ఛా... ‘
"ఈ మధ్య నువ్వు… మరీ పిసినారివి అయిపోతున్నావు….'
ఏ విషయంలో స్వామీ?"
అసలు ఇవ్వకుండా వడ్డీ మాత్రం ఇస్తున్నావు'
అలాగా…. అందీ అందని అందమే ముద్దు... అన్నారో కవి..’. అయితే వడ్డీ పెంచేస్తాను'
'అంత ఏం చేసుకుంటావు. దేనికైనా... "
దేనికైనా అంటే శృంగారంలో కాదు బంగారూ. ..నాకైతే ప్రతీక్షణం తరించాలని పరమపదసోపానం"
"చాలు చాలు చాలు….'
అవంతిక ఇంకా ముందుకెళ్ళి చదవలేకపోయింది. కంప్యూటర్ ఆఫ్ చేసి బెడ్ మిద వాలింది. రేపు మేరేజ్ డే... అతనికి గుర్తుందో లేదో... తను గుర్తుచేయాలా, ఎందుకో ఏడుపొచ్చేసింది..
మొగుడూ పెళ్ళాల మద్దెన"ఈగో’లు ఉండకూడ దంది. తను ఫోన్ చేసి మధుకి గుర్తుచేసి రేపు ఏం ప్లాను చేసుకుందాం" అని అడిగితే.
ఊహూ…. ఎదురుగా ఫోటోప్రేమ్ లో తమ గ్రూప్ ఫోటో... చాలాసార్లు అది తీసేసి తను, మధు కలిసి ఉన్న ఫోటో పెట్టాలనిపిస్తుంది.
బెడ్ రూమ్ తమిద్దరి పర్సనల్ కదా... అనిపిస్తుం టుంది. అది కూడా అతను చేస్తే బాగుండును అనిపిస్తుంది. విశాలమైన బెడ్ తీసేసి పెళ్ళయిన కొత్తలో ఉండే డబుల్ కాట్ వెయ్యాలని... తామిద్దరూ ఒకరికొకరు తగులుతూవుంటే బాగుంటుందనిపిస్తుంది. ఏదీ జరగడంలేదు.
ఆ రాత్రి కూడా ఏం జరగలేదు... కాలం బోర్లా పడ్డట్టు స్తబ్దుగా ఉండిపోయింది. తెల్లవారుజామున నిద్రలో అతను ఆమె నడుంపై చేతిని వేశాడు.
ఆమె ఒంటిలో వేడి ఒక్కో నరంలోకి ఇంజెక్ట్ చేసినట్టయింది. కలవరించి కలవరించి చాలాసేపు ఆమె మరో లోకంలో విహరిస్తూ అతని కౌగిలింతల ఆగమనానికి ఎదురుచూసింది.అతను ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నాడు.తెల్లవారింది. అతను పెళ్ళిరోజును గుర్తుచేస్తాడనుకుంది. ఎప్పటిలాగ ఆఫీసుకు టైమ్ అయ్యిందని హడావిడి చేస్తుంటే సూసైడ్ చేస్కోవాలన్నంత దిగులేసింది. తను చెప్పొచ్చుగా. తను ఎందుకిలా మూగదైపోయింది.
మనస్సు విప్పిచెప్పేస్తే తమ మధ్యనున్న అడ్డుతెర తొలగిపోతుంది కదా...
మధుభూషణ్ ఆఫీసుకు వెళ్ళాక పని గబగబా పూర్తిచేసింది. శ్రావ్య వస్తుంది. అది యక్షప్రశ్నలు వేస్తుంది. కొత్త బట్టలు చూపించలేదంటే. డ్రైవర్ ని పిల్చి కారు రెడీ చెయ్యమంది ఎప్పుడూ వెళ్ళే షాపుకే వెళ్ళింది. సింపుల్ గా అతనికోసం కుర్తా పైజమా, తనకో కాటన్ చీర తీసుకుంది.
ఆమె ఎప్పుడూ ఇంత సింపుల్ షాపింగ్ చెయ్యలేదని షాపుఓనర్ ఆశ్చర్యపోయాడు.మేరేజ్ డే గిఫ్ట్ గా ఆమెకో లేడీస్ హ్యాండ్ బాగ్ కారులో పెట్టించాడతను,వాళ్ళకున్నపాటి జ్ఞాపకం తన భర్తకి లేనందుకు దిగులేసింది. అన్నీ పాతబడిపోయాయా! జీవితం యాంత్రికంగా మారిపోయింది.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
#6
ఇంటికి వెళ్ళేసరికి శ్రావ్య మనవరాలు కీర్తి వచ్చి ఉన్నారు. వాళ్ళతో కబుర్లలో పడి కాలం మర్చిపోయింది. సాయంత్రం మధుభూషణ్ ఎర్లీగా ఇంటికొచ్చేశాడు. అతని చేతిలో ఉన్న ప్యాకెట్ ని శ్రావ్యలాక్కుని చూసింది. బెనారస్ సిల్క్ లో సన్నని జరీ పూలున్న శారీ. "చాలా బాగుంది డాడీ! నాకోసమా?" అంది శ్రావ్య ఆశగా…

అతను భార్యవైపు చూశాడు.
ఆమె ఎటో చూస్తోంది."నీకే తీసుకో" అన్నాడు.
థాంక్యూ ‘ అంటూ పక్కనుంచుకుంది.
సర్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి?" డ్రైవర్ చేతిలో ఉన్న ప్యాకెట్లు చూపిస్తూ అడిగాడు. "పైన పెట్టేసి... నువ్వెళ్ళు..." అనేసి అతను మనవ రాలితో ఆడుకోసాగాడు.
అరగంటతర్వాత అల్లుడు వచ్చాడు. అందరూ కల్సి భోంచేద్దామంది శ్రావ్య.
కిచెన్ లో అవంతిక స్పెషల్ చెయ్యడంలో నిమగ్నమైంది. అలవోకగా కనిపిస్తున్న ఆమె నడుము, పైట పక్కకి జరిగినప్పుడు కనిపిస్తున్న ఎదసంపద చూసీ చూడనట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడతను.
ఆమె ఎందుకో ఈరోజు కొత్తగా కనిపిస్తున్నట్టందతనికి. మనస్సు మరీ చిలిపిదైపోయింది.
భోజనాలు అయ్యాక కూతురు, అల్లుడు మ్యారేజ్ డే విషెస్ చెప్పి వెళ్ళిపోయారు.
ఆమె ఇల్లుసర్థుతుంటే కొత్తగా అతను వెనువెనుకే తిరుగుతూ సహకరిస్తున్నాడు. ఇద్దరిలో ఏదో తెలీని బెరుకు. అర్థంకాని స్థితి. అతను స్నానం చేసొచ్చే సరికి తనుతెచ్చిన కుర్తా పైజమా అక్కడుంచింది. ఆమె స్నానం చేసొచ్చింది. పొడవాటి జట్టుని పైకి మడతలు వేసి క్లిప్ పెట్టింది. అతనిలో చిలిపితనం.వెనుగ్గా వెళ్ళిక్లిప్ లాగేశాడు.
ఆమె ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళిద్దరి మధ్యా అది చాలాకాలం క్రితంనాటి ఆట... చీర కుచ్చిళ్లు కూడా అతనలాగే లాగేవాడు.
ఆమె ముద్దుగా విసుక్కుంటే అతను మరింత ఎంజాయ్ చేసేవాడు.





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply
#7
"అవంతీ! నీకోసం ఓ సర్ఫైజ్ గిఫ్ట్ ఎదురు చూస్తోంది. రావా ప్లీజ్... "
ఒక్కసారిగా ఆమె దేహం మోహనరాగం ఆలపించింది. కాదనగలనా అన్నట్టు అతని వెనగ్గా నడిచింది. మేడమీది గది తలుపులు తెరుస్తూ "వెల్కమ్' అంటూ అమాంతం ఆమెకి చేతులతో సంకెళ్ళ వేసేశాడు.
ఆమె పిసినారితనం చూపించదల్చుకోలేదు. ఎన్నో రాత్రులు వస్తాయిగాని రాదమ్మా వెన్నెలమ్మా... అన్నట్టు అతన్ని అల్లుకుంది.
వాళ్ళకది తొలిరాతో, మలిరాతో ఏరాత్రో అర్థం కానంత అయోమయంలో గడిపేసారు.
కాలానికి ఏంచెయ్యాలో అర్థంకాక అయోమయంగా అటూ ఇటూ పరుగెత్తుతోంది.
అతను మొబైల్ అందుకున్నాడు. సాయంత్రం తనకొచ్చిన మెసేజ్ మరోసారి చదివాడు- "డాడీ! నువ్విచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ కోసం అమ్మఎదురుచూస్తోంది. మ్యారేజ్ డే సందర్భంగా ఇచ్చేయండి. థ్రిల్ అయిపోతుంది" నిజంగో అవంతిక ఇంతగా తనకోసం ఎదురుచూస్తుందని అనుకోలేదు.
"థాంక్యూ మైడియర్... " అలసిన కనురెప్పలపై తన పెదవుల ముద్రలు వేస్తూ అన్నాడతను, “འི་ཉི་ నేను చాలా మూర్ఖంగా, స్తబ్దుగా ఉండి పోయాను. ఎన్నిసార్లు మిమ్మల్ని డిజప్పాయింట్ చేశాను... అయాం సారీ... సుఖం లేకుండా చేశాను కదూ?" ఆమె కనురెప్పల తడిని అతను కలవరంగా చూశాడు.
"ప్లీజ్ అవంతీ! సుఖం వేరు, తృప్తి వేరు... అందుకే నిన్ను నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు" ఆమె ఆమె మత్తుగా అతన్ని చూస్తే అతనామె అణువణువూ ముద్రలు వేస్తుంటే ఆమె చాలు చాలు…. అంటుంటే ఆటను మరింత రెచ్చిపోయాడు.
చాన్నాళ్ళ తర్వాత ఇద్దరూ అలసిపోయి మత్తుగా ఇద్దరూ ఒకరికొకరై నిద్రపోయారు.
కాలింగ్ బెల్ అదేపనిగా మోగుతుంటే మేలుకుంది అవంతిక. తనని తను చూసుకుంటే సిగ్గనిపించి సవరించుకుని తలుపు తీసింది.
ఎదురుగా నాగమణి, ఎందుకో అది కళ్ళెగరేసిందని పించింది, సిగ్గేసింది. ఎంతగా పనిలో పడ్డా హృదయం కొత్తగా సిగ్గుపడుతోంది. "మా దొడ్లో బాయి ఎండి పోతా ఉందమ్మగారూ! పూడిక తియ్యాలOట... బేగెల్లాలి..." అదెందుకు అలా” అందో తెలీదుగాని తనకి తను అన్వయించుకుంటే అనిపించింది.
'తడిలేని బావికైనా స్పందించని హృదయానికయినా అప్పుడప్పుడూ పూడిక తియ్యాల్సిందే." అని.


*** THE END ***
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)