Thread Rating:
  • 0 Vote(s) - 0 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
*కన్యాకుమారిలో వైభవంగా శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం*
#1
*కన్యాకుమారిలో వైభవంగా శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం*

*ఆలయ నిర్మాణానికి సహకరించిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు :*

*టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌*

కన్యాకుమారిలోని వివేకానందపురంలో నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాకుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. కన్యాకుమారిలో ఆదివారం ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య కుంభ లగ్నంలో మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టితో కలిసి ఈవో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ రూ.22.50 కోట్ల వ్యయం ఆలయ నిర్మాణం చేపట్టామని, ఇందుకు సహకరించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయంలో జనవరి 22న అంకురార్పణతో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, 21 మంది రుత్వికులు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్నారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో రూ.34.60 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2018, జూలై 1వ తేదీ నుండి భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. తమిళనాడులోని పలు ప్రముఖ ఆలయాల్లో విశేష పర్వదినాల సందర్భంగా టిటిడి తరఫున వస్త్ర సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుమలలో ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామివారి ఆలయం నుండి పట్టువస్త్రాలు, తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాల నాలుగో రోజున శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీనాచ్చియార్‌(ఆండాళ్‌) దేవస్థానం నుండి పూలమాలలు, చిలుకలను సమర్పిస్తున్నారని తెలియజేశారు. 

ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ద్వారా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆళ్వార్లు, ఆచార్యపురుషుల ధార్మిక సందేశాలను సదస్సులు, పుస్తకాల ద్వారా ప్రచారం చేస్తున్నామని, నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలో తమిళనాడులో 163 మంది పండితులకు వయసులవారీగా నెలకు రూ.8 వేలు, రూ.5 వేలు, రూ.4 వేలు పెన్షన్‌ అందిస్తున్నామని ఈవో తెలిపారు. టిటిడిలో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన శ్రీవారి సేవ విభాగంలో తమిళనాడు రాష్ట్రం నుండి ఇప్పటివరకు 1.77 లక్షల మంది శ్రీవారి సేవకులు సేవలందించారని వెల్లడించారు. తమిళనాడు నుండి దాససాహిత్య ప్రాజెక్టు ద్వారా 5 వేల మంది భజన మండళ్ల సభ్యులు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారా 330 మంది భజనమండళ్ల సభ్యులు ఉన్నారని చెప్పారు. తమిళనాడు భక్తుల కోసం రాజపాళెం, నైవేలి, హోసూరు ప్రాంతాలో టిటిడి కల్యాణమండపాలున్నాయని, వాటిలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని తెలియజేశారు.

చెన్నైలోని టి.నగర్‌ జిఎన్‌.చెట్టి వీధిలో రూ.5.75 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు ఈవో వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్‌, కన్యాకుమారి, కురుక్షేత్రలో ఆలయాల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదే క్రమంలో చెన్నైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. వేలూరులోని శ్రీ వేంకటేశ్వర హయ్యర్‌ సెకండరీ స్కూల్లో 1,050 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.7.5 కోట్లు కేటాయించామన్నారు. కోల్‌కతాలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, యాత్రాస్థలాలు, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు.

Source:Internet/what's up
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)