Thread Rating:
  • 11 Vote(s) - 1.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

Romance పెళ్లి ముందు.. పెళ్లి తరువాత..

Showing only the posts of dom nic torrento: 33 of 313 posts. Show all posts
#1

new story

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2

Episode 1
టైం పొద్దున మూడు అవుతుంది. గది అంతా నిశబ్దంగా ఉంది. కిటికీ లో నుండి గాలి చల్లగా వీస్తూ ఉంది. నా భార్య రూప నా తొడల మీద తల పెట్టి హాయిగా నిద్రపోతోంది. తనలా నిద్రపోతూ ఉంటే నేను అలాగే మేలుకుని తననే చూస్తూ ఉన్నా. ఎందుకో తెలీదు తనని ఎంత సేపు చూసినా అలాగే తనని చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది. తన రూపం తన మాటలు తన నడవడిక నాకు ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తాయి.
తను నా తొడలపై పడుకుని ఇప్పటికి ఆరు గంటలు అయినా కూడా నేను తనని కదపకుండా అలాగే పడుకోబెట్టుకొని తననే చూస్తూ ఉన్నానంటే  అర్దం చేసుకోండి నాకు తన్ని చూస్తూ ఉండడం అంటే ఎంత ఇష్టమో. పెళ్ళై ఇన్నాల్లైనా, తనని రోజూ చూస్తూ ఉన్నా, నాకు ఇంకా ఎందుకో తనని ఇలాగే ఇలాగే చూస్తూ ఉండిపోవాలి అని అనిపిస్తుంది. తనంటే నాకు అంత ఇష్టం. ఒకవేళ ఇష్టపడక పోయినా తను ఇష్ట పడేలా ఆకర్షిస్తుంది. నన్నే కాదు తన చుట్టూ ఎవరు ఉన్నా కూడా వాళ్ళని ఇట్టే ఆకర్షిస్తుంది. అదే తనలో నాకు బాగా నచ్చిన విశయం. 
నిజానికి తను నా ఫ్రెండ్ చెల్లి. నా ఫ్రెండ్ కు ప్రేమ వివాహాలు అంటే అస్సలు నచ్చదు. కానీ నేను వాడి చెల్లి నే లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నిజానికి నేను చేసుకున్నా అని అనడం కంటే తనే నన్ను చేసుకుంది అనడం కరెక్ట్ ఏమో. ఏంటి నేను ఇలా అంటున్నా   అని అనుకుంటున్నారా ? పదండి నా గతం లోకి వెళ్దాం మీకే తెలుస్తుంది నేను ఎందుకు అలా అన్నానో అని..
నా పేరు వినయ్. మాది కొంచెం రిచ్ ఫ్యామిలీ అనే చెప్పాలి. నిజానికి చాలా రిచ్ ఫ్యామిలీనే కానీ మా నాన్నకు నమ్మకమైన బిజినెస్ పార్ట్ నర్స్  లేక చాలా ఆస్తినే కోల్పోయాడు. ఇప్పుడు కేవలం ఒక చిన్న పాటి కంపెనీని నడిపిస్తూ నన్ను కూడా అదే కంపెనీ లో వర్క్ చేయమని ప్రోస్తహిస్తు ఉన్నాడు. కానీ నాకేమో ఆ కంపెనీ లో వర్క్ చేయడం అంతగా ఇష్టం లేదు. అందుకే సొంతంగా నేనే పని నేర్చుకుని కొత్తగా ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నా. మా నాన్నకు ఒక ప్రాణ మిత్రుడు ఉన్నాడు. అతనే దేవేంద్ర. అతను కూడా మా నాన్న లాగే చాలా బిజినెస్ లు చేసాడు. ఎన్నో అపజయాలను ఎదుర్కున్నాడు కానీ ఎప్పుడూ వెనక్కి అడుగు వేయలేదు. ఇప్పుడు అతనికి రెండు కంపెనీలు ఉన్నాయ్. సిటీ లో చాలా పేరు ఉంది అతనికి. అతనంటే మా నాన్నకు మా నాన్న అంటే అతనికి చాలా అంటే చాలా ఇష్టం. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మా రెండు కుటుంబాలు కచ్చితంగా కలవాల్సిందే. అదలా అలవాటు అయిపొయింది మాకు. ఆరోజు కూడా వాళ్ళ కంపెనీ ఆనువల్ టర్న్ ఓవర్ పెరగడం తో ఒక చిన్న పార్టీ ఆరెంజ్ చేశారు. ఎప్పటి లాగే మా ఫ్యామిలీ నే వాళ్లకు మొదటి గెస్ట్. కాబట్టి ఆరోజు మధ్యాహ్నం లోపు మా అమ్మా నాన్నా, మా అక్క బావ, నేను అందరం వాళ్ళ ఇంటికి చేరుకున్నాం.  అన్నట్లు చెప్పడం మరిచి పోయాను. మా అక్క పేరు భాను తనకి పెళ్లి అయ్యింది. మా నాన్న పట్టు పట్టి మరీ ఇల్లరికం వచ్చే అల్లుడిని చూసి పెళ్లి చేశారు. మా బావ బాగా ఇంటెలిజెంట్, తను వేరే కంపెనీ లో వర్క్ చేస్తూనే మా కంపెనీ వర్క్స్ కూడా చూసుకుంటూ ఉంటాడు. మా నాన్నకు అతనంటే గౌరవం. బాగా సిన్సియర్ అని. అందుకేనేమో కూతురిని కూడా ఇచ్చి చేసాడు. ఇక విశయానికి వస్తే, మేము దేవేంద్ర అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇంటి లోపలికి వెళ్తూ వుండగానే దేవేంద్ర అంకుల్ బార్య ఎదురొచ్చి మాకు ఆహ్వానం పలికింది. 
దేవేంద్ర బార్య : ఎంటే పొద్దున రమ్మంటే ఇప్పుడా వచ్చేది ?
మా అమ్మ : అదేం లేదే వీడే కాస్త లేట్ చేసాడు ఆ పని ఈ పని అనుకుంటూ అంటూ నా వంక చూసింది. 
ఆంటీ నా వైపు చూసి ఏరా ఇక్కడకు రావడం కంటే నీకు ముఖ్యమైన పని ఉందా అని అంది. నేను అమ్మ నా మీదకి చెప్పేసరికి తనని చూస్తూ ఆంటీ నన్ను అంటారేంటి, మా ఇల్లు పక్కనే కదా నేను లేట్ చేస్తే ఏమీ ? వాళ్ళు ముందే రావొచ్చుగా అన్నా. ఆ లాజిక్ కరెక్టే అని అనిపించడం తో ఆంటీ అమ్మ వైపు చూస్తూ నిజమే కదనే, వాడంటే లేట్ చేశాడు పక్కింట్లో ఉండి నీకు రావడానికి ఎంటే అడ్డం ? అంది. దానికి నేను నవ్వుతూ అలా అడగండి ఆంటీ అంటూ అమ్మ అక్క వంక చూసి కొంచెం వెక్కిరింపుగా రెండు గంటలు చేశారు ఆంటీ సింగారించడానికి మళ్ళీ ఇప్పుడు ఎదో నా మీద సాకులు చెప్తున్నారు అన్నా. ఆంటీ అమ్మ వంక చూసి అమ్మో ఏం దొంగవే నువ్వు వాడి మీదకి చెప్పి నువ్వు లేట్ చేసింది కప్పి పుచ్చుకుంటున్నావా అంది. అలా అంటూ ఉండగా అప్పుడే దేవేంద్ర అంకుల్ వచ్చాడు. నేను అంకుల్ ను చూసి వెంటనే సైలెంట్ అయిపోయా. (అంకుల్ అంటే కొంచెం భయం నాకు) హెలో వినయ్ అంటూ నా దగ్గరకు వచ్చాడు. నేను కొంచెం భయంగానే హెల్లో చెప్పా. అంకుల్ నా వంక సూటిగా చూస్తూ ఏంటి ఆల్రెడీ ఉన్న కంపెనీ ని వొదిలేసి వేరే ఎదో స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నావ్ అంట నిజమేనా ? అన్నాడు కాస్త బేస్ వాయిస్ తో. మామూలుగానే నాకు అంకుల్ అంటే భయం, ఎందుకో తనని చూస్తేనే నాకు భయం వేస్తుంది. అలాంటిది అంకుల్ అలా నా దగ్గరికి వచ్చి అలా అడిగేసరికి నాకు చిన్నగా వొణుకు వచ్చింది. నా అవస్థ చూసి నవ్వి మా నాన్న వంక చూసి సమాధానం చెప్పడానికే భయపడుతున్నాడు వీడా కొత్త కంపెనీని పెట్టేది అని గట్టిగా నవ్వాడు. నవ్వి మా నాన్న దగ్గరికి వెళ్తూ పదరా వాడు ఎన్ని వేషాలు వేసినా చివరికి నువ్వనుకున్నట్లు గానే నీ కంపెనీనే చూసుకుంటాడు లే అని అంటూ మా నాన్నని పై రూం లోకి తీసుకు వెళ్ళాడు. అలా వాళ్ళు వెళ్తుంటే ఆంటీ వాళ్ళని చూసి నాతో నువ్వు ఆయన మాటలేం పట్టించుకోకు నీకు నచ్చింది చేయ్ ఆయన అలాగే అంటారు అని అంది. నేను స్మైల్ ఇస్తూ థాంక్స్ ఆంటీ అని అన్నా. తను కూడా స్మైల్ ఇస్తూ అవునూ చెప్పడం మరిచిపోయా, రమేష్ ఇందాక నీ కోసం చాలా సేపు వెయిట్ చేసాడు. వెయిట్ చేసి చేసి నీ ఫోన్ కూడా తగలక పోయే సరికి ఒక్కడే వెళ్ళిపోయాడు. నువ్వొస్తే వాడికి ఫోన్ చేయమని చెప్పాడు అని అంది.  నేను అవునా సరే నేను ఇప్పుడే చేస్తాలే అని అంటూ ఫోన్ తీసుకుని పక్కకి వస్తుంటే ఆంటీ అమ్మను అక్కని లోపలికి తీసుకు వెళ్ళింది. నేను ఫోన్ చేత్తో పట్టుకుని రమేష్ గాడికి ఫోన్ చేయబోయా. కానీ సిగ్నల్స్ వీక్ గా ఉండడం తో కాల్ వెళ్ళలేదు. ఛా చెత్త సిగ్నల్స్ అని అనుకుంటూ బావ ను అక్కడే కూర్చోమని చెప్పి పైన బాల్కనీ లో ఏమైనా సిగ్నల్స్ రావొచ్చేమో అని పైకి వెళ్ళా. అక్కడ టీవీ ఆడుతూ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి ఎవ్వరూ లేరు అయినా ఆడుతూనే ఉంది అని అనుకుంటూ టివీ బంద్ చేసి బాల్కనీ లోకి వెళ్ళాను. అలా అక్కడకు వెళ్ళే సరికి అక్కడ అటు వైపుకు తిరిగి నిల్చొని ఉన్న రూప కనిపించింది.
రూప గురించి చెప్పాలంటే తను నాకంటే మూడేళ్లు పెద్దది. చాలా అందంగా ఉంటుంది. అమాయకంగా కనిపించే ముఖం తో ఎప్పుడూ ఫ్రెష్ గా ఫ్రిడ్జ్ లో నుండి తీసిన ఆపిల్ పండులా నిగనిగ లాడుతూ ఉంటుంది. విశాలవంతమైన నుదురుతో, నెలవంకల్లాంటి కనులతో, గులాబీ రేకుల్లాంటి బుల్లి పెదాలతో, అందంగా చక్కగా ఉంటుంది. తనని చూసిన ఎవ్వరైనా సరే ఇంకోసారి తిరిగి చూడాలి అని అనుకుంటారు. అలా ఉంటుంది, ఆ అందానికి తోడు తన సంపదలు, ఏ మగాణ్ణి అయినా ఇట్టే ఆకర్షింప చేయగల మోతాదు లో చాలా పొందికగా ఉంటాయ్. ఎన్నో సార్లు నేనే తనని వేరే విధంగా చూసే వాడ్ని. ఇక అసలు విశయం చెప్పాలంటే నేను తను చాలా క్లోజ్. తనకి నేనంటే నాకు తనంటే చాలా ఇష్టం. ఏ విశయాన్ని అయినా తనకి నేను తను నాకు షేర్ చేసుకోనిది అస్సలు ఉండం. కానీ మొన్న రీసెంట్ గా జరిగిన గొడవ వళ్ళ ఇద్దరం మాట్లాడుకోవడం మానేసాం. దాదాపు అది పెద్ద గొడవే అని చెప్పాలి ఎందుకు అంటే అది మా ఇద్దరి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టగల అంశం. అందుకే ఇద్దరం మాట్లాడుకోవడం మానేశాం. నిజానికి ఇద్దరం అనే కంటే నేనే మాట్లాడడం మానేశా అనడం కరెక్ట్. అయినా ఇది మాకు మామూలే గొడవ పడడం మళ్ళీ కలవడం, కానీ ఈసారే కాస్త సీరియస్ గా ఉంది ఇష్యూ. 
ఇప్పుడే స్నానం చేసినట్లు ఉంది. టవల్ తో తల తుడుచుకుంటూ ఉంది. నేను వచ్చిన పని చూసుకోవడం మానేసి తనని అలాగే నిల్చొని చూస్తూ ఉన్నా. అంతలో తను క్యాసువల్ గా తల తుడుచుకుంటూ ఇటు వైపుకు తిరిగింది. అంతే నేను ఇక్కడ బొమ్మలా నిలబడి తననే చూస్తూ ఉండడం తనకి కనిపించింది. వెంటనే తల తుడుచుకోవడం ఆపేసి నా వంక సీరియస్ గా చూసింది. నేను వెంటనే నేనేం నీతో మాట్లాడడానికి రాలేదు సెల్ సిగ్నల్స్ రాక వచ్చా అన్నట్లుగా తనని చూసా నా సెల్ తనకి చూపిస్తూ. తను నా వంక ఒకసారి ఎగా దిగా చూసి విసుగ్గా తల తిప్పేసుకుని మళ్ళీ తుడుచుకోవడం మొదలు పెట్టింది. ఇక్కడ ఉండి అనోసరంగా తనతో ఎందుకు లే అని అనుకుంటూ అక్కడ నుండి కిందికి వచ్చేశా.
అలా వస్తుండగా రమేష్ బార్య ఎదురు వచ్చింది. నన్ను చూసి పలకరింపుగా నవ్వుతూ ఏంటి వినయ్ ఎలా ఉన్నావ్ అంది. నేను నవ్వి బాగున్నా అని అన్నా. తను అంతలో ఎదో గుర్తు వచ్చినదానిలా అవునూ ఇందాక రమేష్ నీకు కాల్ చేస్తున్నా తగలలేదు అంట కదా ఎక్కడ పెట్టుకున్నావ్ ఫోన్ ను అంది. నేను చేతిలో ఫోన్ ను చూపిస్తూ నెట్వర్క్ రావట్లేదు అన్నా. అంతలో చేతిలో ఉన్న ఫోన్ మోగింది. చూస్తే రమేష్ చేస్తున్నాడు. వెంటనే అది తనకి చూపిస్తూ  వాడే చేస్తున్నాడు అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేశా.  లిఫ్ట్ చేసి హెలో అంటూ హాల్ లోకి వచ్చా. అవతల నుండి రమేష్ గాడు..
రమేష్ : ఏరా ఏ లోకం లో ఉన్నావ్ నీ ఫోనే తగలడం లేదు..
నేను : ఏమోరా పొద్దున నుండి నెట్వర్క్ సరిగా రావట్లేదు, ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశా వెంటనే నీ ఫోన్ వచ్చింది
రమేష్ : అది సర్లే కానీ సాయంత్రం పార్టీ కి సూట్ కొంటా అన్నావ్ గా వస్తావా మరి ? 
నేను : ఇప్పుడా ? ఇప్పుడంత మూడ్ లేదు లేరా తరువాత చూద్దాం 
రమేష్ : సరే, నీ ఇష్టం 
నేను : ఇంతకీ ఎక్కడున్నావ్ ?
రమేష్ : గో డౌన్ రా
నేను : (అక్కడ ఉన్నాడంటే ఎవరినో కొడుతూ ఉంటాడు కచ్చితంగా) అక్కడేం చేస్తున్నావ్ రా 
రమేష్ : మన స్వప్న ఉంది కదరా (రమేష్ వాళ్ళ నాన్న ఫ్రెండ్ కూతురు) 
నేను : హా
రమేష్ : ఆమెను ఒకడు లవ్ చేస్తే వాళ్ళ నాన్న వాడికి థంకి ఇవ్వమన్నాడు, అదే చేస్తున్నా
నేను : రేయ్ వాళ్ళు సిన్సియర్ లవర్స్ కదరా నీకు తెలీదా ?
రమేష్ : హా, తెలుసు తెలుసు ఈ ప్రేమ లు అన్నీ నాటకాలే అని బాగా తెలుసు.
నేను : రేయ్ నిజం రా నేను చెప్తుంది వాళ్ళు నిజంగా సిన్సియర్  లవర్సే. 
రమేష్ : బాగా చెప్పావ్ రా, నిజంగా అంత ప్రేమ ఉన్నొడే అయితే ఈ అందం ఆస్తి ఉన్న స్వప్న నే లవ్ చేయాలా ? ఇంకెవరు దొరకరా ?  అదే వీడి కంటే తక్కువ ఉన్న అమ్మాయిని వీడు లవ్ చేయమను అప్పుడు నమ్ముతా..
నేను : అప్పటికైనా నువ్వు నమ్ముతావ్ అని నాకు నమ్మకం లేదు లేరా, నీ గురించి నాకు తెలీదా ?
రమేష్ : మరి తెలుసుగా ఎందుకు ఈ అనోసరమైన చర్చలు
నేను : అనోసరం అనకు, ఒకటి చెప్తా విను, నీ సర్కిల్ లో రోజూ నీతో తిరుగుతూ, నీతో ఉంటూ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ మీద నీకు లవ్ పుడుతుందా ? లేక ఎవరో తెలీని వాళ్ళ మీద నీకు లవ్ పుడుతుందా చెప్పు ? నువ్వు రోజూ కలిసి తిరుగుతూ, అన్ని షేర్ చేసుకుంటూ ఉన్న వాళ్ళ మీద కలుగుతుంది అది సహజం. దీనిని పట్టుకుని వాడు అందం ఆస్తి ఉన్న స్వప్న నే ఎందుకు లవ్ చేసాడు వేరే ఎవరినో చేయొచ్చు గా అంటే ఎలా ? వాడికి ఉన్న సర్కిల్ లో తనే వాడికి బెస్ట్ ఫ్రెండ్ అదలా ముందుకు పోయి ప్రేమగా మారింది. దాన్ని పట్టుకుని నువ్వు అనోసరంగ అదీ ఇదీ అంటూ..
అయినా  ఒకవేళ వాడి కంటే తక్కువ  అమ్మాయిని వాడు రోజు వారీగా కలుస్తూ ఉంటే అప్పుడు వాడికి నిజంగా ఆమె మీదే ప్రేమ రావొచ్చు ఏమో ఎవరికి తెలుసు ?
రమేష్ : ఇప్పుడేంటి ? నేను పోయి వాడికి స్వప్న కు పెళ్లి చేయాలా ఎంటి ? 
నేను : నేను అలా అనట్లేదు అయినా నువ్వు అలా చేస్తే చాలా సంతోషిస్తా.
రమేష్ : ఆపుతావా, అయినా నీకు నా గురించి బాగా తెలుసు ఈవెన్ నువ్వు  ప్రేమించినా కూడా నేను ఇలాగే మాట్లాడతా ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని కూడా విడగొడతా అంతే కానీ లవ్ అంటే మాత్రం ఒప్పుకునేదే లేదు ఎవ్వరైనా సరే..
నేను : అబ్బో, ఒకటి అడుగుతా నిజం చెప్పురా, నీ పెళ్లాన్ని అయినా లవ్ చేస్తున్నావా లేక ఇలాగే తన ముందు కూడా మాట్లాడుతూ ఉన్నావా ?
రమేష్ : రేయ్ మాకు పెళ్లి అయ్యింది రా, ఇది వేరు అది వేరు
నేను : డ్రామాలు చేయకు రా, నీకు నిజంగా లవ్ అంటే ఎంటో తెలీదు, కానీ దాని గురించి మాట్లాడుతున్నావ్ ఒకసారి నువ్వు కూడా లవ్ లో పడింటే అప్పుడు తెలిసేది నీకు..
రమేష్ : (వెక్కిరింపుగా) అవును తెలిసేది, అయినా అది పక్కన పెట్టూ, నువ్వేంటి లవ్ గురించి అంత చెప్తున్నావ్, నువ్వేమైనా లవ్ లో పడ్డావా ఎంటి ? (అనుమానంగా)
నేను : నీకన్నీ అనుమానాలేనారా ? అలాంటిదేం లేదులే బాధ పడకు
రమేష్ : జాగ్రత్త, దానికి ఎంత దూరం ఉంటే అంత మంచింది. అయినా నువ్వు ఆ వూబిలో పడిపోయినా నేను ఉన్నాలే నిన్ను పైకి తీసుకు రావడానికి, అస్సలు కనికరం లేకుండా నిన్ను ఆ ఊబి లో నుండి లాగేస్తా, అర్దం అయ్యిందా ? 
నేను : హ్మ్మ్ హ్మ్మ్ అర్దం అయ్యింది లే, అయినా అలాంటిది ఏమీ జరగదులే కానీ..
(రూప గుర్తొచ్చి) నాకో డౌట్ రా..
రమేష్ : ఎంటి ?
నేను : ఇప్పుడు నీ చెల్లి ఉందిగా,
రమేష్ : హా
నేను : ఒకవేల అది ఎవరినైనా లవ్ చేసిందే అనుకో..
(వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ)
అప్పుడు ఏం చేస్తావ్ ? చెప్పు..
పెళ్లి చేస్తావా ? లేక విడగొడతావా ?
రమేష్ : రేయ్, మైండ్ దొబ్బిందా ? అయినా నా చెల్లి మీద పడ్డావ్ ఏంట్రా ? దానికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయితేనూ..
(ఇక్కడ ఇంకో విశయం చెప్పాలి, దేవేంద్ర, మా నాన్న ఇంకా రమణ ముగ్గురు మంచి స్నేహితులు. వాళ్ళు ఒకసారి ఫ్యామిలీ తో పిక్నిక్ కు  పోయి తిరిగి వచ్చే టప్పుడు దేవేంద్ర వద్దన్నా మందు తాగేసి డ్రైవ్ చేయడం మొదలు పెట్టాడు. అతను కంట్రోల్ లో లేడు మీరు నడపండి అని రమణ వైఫ్ చెప్పింది. రమణ కూడా అవును దేవేంద్ర నువ్వు కంట్రోల్ లో లేవు అని అంటూ దేవేంద్ర కు కార్ ఆపమని చెప్పాడు. అది విని ఎంటి నా కంట్రోల్ మీద మీకు డౌటు ఉందా అంటూ కార్ ఆపకుండా చూడండి నా డ్రైవింగ్ ఎలా చేస్తానో అని అంటూ కార్ ను ఇంకా ఫాస్ట్ గా పోనించాడు. వద్దన్నా అలాగే నడుపుతూ ఉన్న దేవేంద్ర కు చిన్నగా మత్తు కమ్ముకోసాగింది. అంతే రమణ వైఫ్ భయపడి నట్లుగానే ఆ మత్తు లో దేవేంద్ర ఆక్సిడెంట్ చేసాడు. చూస్తే రమణ వైఫ్ చనిపోయింది. అప్పుడు దేవేంద్ర గిల్టీ తో చాలా బాధ పడ్డాడు. రమణని చూడలేక తను చేసిన తప్పుకు ఏం చెప్పాలో తెలీక దేవేంద్ర చాలా మదన పడ్డాడు. రమణ కూడా ఫ్రెండ్ కాబట్టి దేవేంద్ర ను ఏం అనలేక పోయాడు. వాళ్లిద్దరూ అలా ఉండడం చూసి ఇలా అయితే కష్టం అని మా నాన్నే ఇద్దరినీ పిలిచి సర్ది చెప్తూ జరిగింది మార్చలేం ఇప్పుడు ఏం చేసినా తనని తీసుకు రాలేం, కాబట్టి జరగాల్సింది చూద్దాం అంటూ రూపను రమణ ఇంటి కోడలిగా చేసుకోమన్నాడు. అది విని దేవేంద్ర రమణ ఇద్దరూ సంతోషించారు. కానీ రమణ కొడుకు నేను సొంతంగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకుంటాను అని టైం తీసుకున్నాడు. ఇంకో వన్ ఇయర్ లో వాడు తిరిగి రావొచ్చు ఫారిన్ నుండి. ఇలా రూప కు చాలా కాలం క్రితమే పెళ్లి నిర్చయం అయ్యింది) 
ఫోన్ లో రమేష్ మాట్లాడుతూ.. 
రమేష్ : కొంపదీసి అది ఎవరినైనా లవ్ చేస్తున్నట్లు గానీ  నీతో చెప్పిందా ఎంటి ?
నేను : ఛ ఛా, అలా ఏం లేదు లేరా, అందరి విశయాల్లో కోపంగా రియక్ట్ అవుతావ్ గా, అదే నీ చెల్లి విశయం లో ఎలా చేస్తావో అని డౌట్ వచ్చి అడిగా..
రమేష్ : నీ డౌటు తగలయ్య, ఒక్క క్షణం భయపెట్టేసావ్ కదరా, ముందే దానికి రమణ అంకుల్ కొడుకు కు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేశారు అంటూ నా ప్రశ్నకు సమాధానం చెప్తూ అయినా అది ఆణిముత్యం రా, దానికి నేను అన్నా, మా నాన్న అన్నా ప్రాణం, అలాంటిది నేను ఎంటో తెలిసి కూడా అది ఇలాంటి పనులు చేస్తుంది అనుకున్నావా ?
నేను : సరేసర్లే రా నీ ఆణిముత్యం గురించి తెలీక మాట్లాడా క్షమించు అంటూ మనసులో చిన్నగా నవ్వుకున్నా. పాపం వీడు ఏమో దాన్ని ఆణిముత్యం అంటున్నాడు అదేమో మొన్న వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పింది. అది తెలిస్తే వీడు ఏం అయిపోతాడో అని అనుకుంటూ సరే సరే లేరా కొంచెం పని ఉంది మళ్ళీ చెస్తాలే అన్నా. దానికి వాడు కూడా సరే సరేలే ఇక్కడ కూడా నాకు కొంచెం పని పడింది, ఇప్పుడే ఆ స్వప్న లవర్ గాడు లేచాడు ఇంకో రౌండ్ వేసి వస్తా బాయ్ అంటూ ఫోన్ పెట్టేసాడు. వాడలా పెట్టేయగానే రూప నాకు ఐ లవ్ యూ చెప్పింది అని తెలిస్తే వీడు నన్ను కూడా స్వప్న లవర్ ను తీసుకు పోయినట్లే గో డౌన్ కు తీసుకు పోతాడా ఏంటి ? అని అనుకున్నా. అలా అనుకుని అంతలోనే ఛ ఛా అలా జరగదు లే, అయినా నేను రూప ను ఆక్సెప్ట్ చేస్తే కదా అదంతా అని అనుకుంటూ సెల్ జోబిలో పెట్టుకున్నా.  
ఇంట్లో ఆ పని ఈ పని అంటూ కాసేపు టైం పాస్ చేశాక భోజనానికి రూప వాళ్ళ అమ్మ పిలిచింది. నేను వస్తున్నా అని చెప్పేసి హాండ్స్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాను. అలా వెళ్తుంటే అప్పుడే కనిపించింది మెట్ల పై నుండి రూప కిందికి దిగుతూ. తనని పై నుండి కిందకు చూసా. ఘాగ్రా చోలి వేసుకుని స్టైల్ గా దిగుతూ వచ్చింది. నేను తననే దొంగ చూపులు చూస్తూ మళ్ళీ తను గమనిస్తే బాగోదు అనుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. తినే టైం లో ఒక ఐదారు సార్లు కోపంగా నా వంక చూసి చూసింది తను. కానీ నేనే పట్టించు కోకుండా మామూలుగా తినేసి చెయ్ కడుక్కుని లేచా. మా ఇద్దరి ప్రవర్తన చూస్తున్న మా అమ్మ ఏంటి ? రెండు జీవాలు మూగబోయి కూర్చున్నాయి ? మళ్ళీ గొడవా ? అంది నవ్వుతూ. అది విన్న రూప నా వంక చూసింది. నేను అమ్మతో అదేం లేదమ్మ అని చెప్తూ ఉండగా రూప వాళ్ళ అమ్మ వస్తూ ఏం లేదంటావ్ ఎంటి ? అది చూడు ఎలా చూస్తుందో అంటూ రూపను చూస్తూ అంది. (అంతవరకు నన్నే సూటిగా చూస్తున్న రూప వెంటనే తల దించుకుని తినడం మొదలెట్టింది) దాన్ని చూస్తుంటే అర్దం అవ్వట్లేదా, వీళ్ళు మళ్ళీ గొడవ పడ్డారు అని అంటూ అమ్మ వంక చూసి ఒకవేళ మామూలుగా ఉంటే ఇలా ఉంటారా ? చెవులు చిల్లులు పడేలా మాట్లాడుకుంటూనే ఉంటారు అంతే కదా అంది. మా అమ్మ నవ్వుతూ సరిగ్గా చెప్పావే అంది. నేను రూప ను ఒకసారి చూసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. నిజానికి నేను రూప చాలా క్లోజ్, అది మా ఇంట్లో వాళ్ళింట్లో అందరికీ తెలుసు, ఒకవేళ తను నా ఏజ్ కంటే మూడేళ్లు పెద్దది కాక పోయి ఉంటే కచ్చితంగా మా ఇద్దరిని లవర్స్ అని అనేవాళ్ళు అలా ఉంటాం మేమిద్దరం క్లోజ్ గా. కానీ ఏజ్ గాప్ వళ్ళ మా ఇంట్లో కానీ తన ఇంట్లో కానీ ఎప్పుడూ మేము లవర్స్ లాగా ఉన్నాం అన్న టాపిక్ రాలేదు. పైగా వాళ్ళు మమ్మల్ని ఒక అక్కా తమ్ముడు లా చూస్తారు. కానీ వాళ్లకేం తెలుసు తననే నేను పెళ్లి చేసుకుంటాను ఫ్యూచర్ లో అని. 
సాయంత్రం కావడం తో చిన్నగా పార్టీ స్టార్ట్ అయ్యింది. ఇంటి పక్కనే ఉన్న గార్డెన్ లో పార్టీ పెట్టుకున్నాం. నేను అక్కడ ఏమేమి ఉండాలో దగ్గరుండి అన్నీ సెట్ చేయిస్తున్నా. నేను అలా పనిలో ఉండగా అంతలో ఎదో మెసేజ్ వచ్చింది. తీసి చూస్తే రూప నుండి వచ్చింది అది. నేను వెంటనే తలెత్తి బాల్కనీ వైపు చూసా. (తను ఎక్కువగా అక్కడే నిలబడి ఉంటుంది) తను అక్కడే నిలబడి ఉంది, చేతులు కట్టుకుని నన్నే సీరియస్ గా చూస్తూ ఉంది. తన చేతిలో సెల్ కూడా ఉంది. నేను వెంటనే తనని అలాగే చూస్తూ మెసేజ్ ఓపెన్ చేశా. తల దించి ఏం పంపించిందో చూసా. అక్కడ వదిలేసాననుకోకు అని ఉంది. అది చూసి వెంటనే తలెత్తి తన వంక చూసా. తను ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేను ఉఫ్ అని అనుకున్నా. తరువాత మళ్ళీ పనులలో పడిపోయి బిజీ అయిపోయా. రాత్రి కావొస్తుండగా పార్టీకి అందరూ వచ్చేశారు. అందరూ రావడం తో రూప కూడా మంచిగా చీర కట్టుకుని బయటకు వచ్చింది. తను రాగానే అందరూ క్లాప్స్ కొడుతూ ఆహ్వానించారు. తను ఆ చీరలో చాలా అందంగా ఉంది. 
 మీరు కానీ తనని ఇలా చూసి ఉంటే నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా గంట సేపు తిట్టేవారు. ఇంత ఏంజెల్ లాంటి ఫిగర్ ఐ లవ్ యూ చెప్తే నువ్వు వద్దంటావా అని.. 
 అలా ఉంటుంది తను. నిజమే తను చాలా బాగుంటుంది. కానీ ఎందుకో తనంటే నాకు ఆ ఫీలింగ్ లేదు. ఆ ఫీలింగ్ అంటే పెళ్లి చేసుకోవడం అని. తనతో ఉండడం తనతో అన్నీ షేర్ చేసుకోవడం తనతో గొడవ పడడం ఇవ్వన్నీ నాకు నచ్చుతాయి కానీ ఎందుకో పెళ్లి అంటేనే, అవసరమా అన్నట్లుగా అనిపిస్తుంది. అలా అనిపించడానికి కారణం లేక పోలేదు. మొదటి కారణం వాళ్ళ నాన్న ఇచ్చిన మాట అయితే రెండో కారణం వాళ్ళ అన్న. ఇక మూడో కారణం చెప్పాలంటే  అసలు నాకు తన మీద ఆ ఫీలింగ్ ఏ లేదు. ఎందుకో తనని చూస్తే అరే నాకు తను అమ్మ లాగ కదా తనతో బెడ్ షేర్ చేసుకోవడం ఏంటి అని ఒక ఫీలింగ్ వస్తుంది.  నేను తనకు చాలా క్లోజే కానీ నాకు తన మీద అలాంటి ఫీలింగ్సే లేవు. ఎందుకు అంటే తను నన్నెప్పుడూ ఒక అమ్మలా కేర్ చేసేది. ఏదైనా తప్పు చేస్తే చాలు కోపంగా తిడుతుంది. కొన్ని సార్లు అయితే కొడుతుంది కూడా. తను అలా ఉండడమే నాకు బాగా నచ్చేది. పైగా తను నాకంటే పెద్ద, అదో కారణం కూడా  ఉంది. బహుశా తను పెద్ద అవ్వడం వల్లనే నేమో మేము చిన్నప్పటి నుండి ఎంత క్లోజ్ గా ఉన్నా ఎవ్వరూ కూడా (ఇంట్లో వాళ్ళు) మమ్మల్ని లవర్స్ లా చూడలేదు. తను కూడా ఎప్పుడూ అలా ప్రవర్తించేది కాదు. చనువుగా ఏం చేసినా నాలుగు గోడల మధ్యే ఉండేది. తను అలా పెద్దరికం తో నన్ను పిల్లాడిలా కేర్ చేయడం వల్ల నేమో తన మీద నాకు సెక్సువల్ ఫీలింగ్స్ కానీ పెళ్లి చేసుకోవాలి అనే ఫీలింగ్ కానీ రాలేదు, తను ఐ లవ్ యూ చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాను తనకు. నాకు నిజంగా నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు నాకు ఒక అక్క లాగా అని చెప్పా. అంతే అలా అన్నందుకు నా చెంప మీద ఒకటిచ్చి ఇంకోసారి అక్కా గిక్కా అన్నవంటే పళ్ళు రాలగొడతాను అని కోపంగా వెళ్ళిపోయింది. అప్పటి నుండి నేను కనిపిస్తే చాలు కోపంగా చూడడం, నేను ఏం చేయాలన్నా దానికి కావాలనే అడ్డు పడిపోవడం లాంటివి చేస్తూ వచ్చింది. నేను కూడా దేవేంద్ర అంకుల్ రమణ అంకుల్ కు ఇచ్చిన మాటను, వాళ్ళ అన్నయ్యను, ఇంకా ముఖ్యంగా నా ఫీలింగ్స్ ను దృష్ఠిలో పెట్టుకుని తనతో ఈ విశయం లో కాంప్రమైజ్ కాకుండా ఉండడం మంచిదని తనతో మాట్లాడకుండా ఉండడం  మొదలు పెట్టాను. అందుకే తను ఇందాక వోదిలేసాననుకోకు అని మెసేజ్ పెట్టింది. నాకు తెలుసు తను పట్టు పట్టింది అంటే అస్సలు వొదిలే రకం కాదు అని. కానీ ఎలా ప్రొసీడ్ అవుతుంది అనేదే డౌటు అంతే..

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#3

స్టోరీ కి ఒక మంచి టైటిల్ సజెస్ట్ చేయండి
చూస్తే వెంటనే thread ఓపెన్ చేసి చదివేలా ఉండాలి టైటిల్

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply
#4

(30-08-2021, 05:13 PM)Ravanaa Wrote:  Poorthy ga couple story ayithe characters perlu pettandi.ledha ye prema prayanam,pranaya sagaram,anandha ni ki dhari ila pettachu title Edina kaniyamdi milanty writer oka couple story andhuna imadhya anni ranku story le ayinapudu rastunnaru chala manchi decision entha ayina hotel foods enni thinna house food house food matrame avi ani fictions ayithe idhi iddhru kalisi chadhivela rayandi nijamga ala rayagaligithe oh what a romantic moment it's go on be.all the best sir.

yes bro ee madya anni ranku storiele ekkuvayyayi
naaku chadivi chadivi bore kottesindi
ala ani regular ga mogudu pellam story chadavalem enduku ante adi already routine chesesaru 
anduke malli daanni venakku teesuku ravalani chinna prayatnam 
meeru expect chesina vindhangane untundi story 
romantic ga 

(30-08-2021, 06:07 PM)Sudharsangandodi Wrote:  superb start  bro 'BHARAT ANE NENU'kante ekuva emotions unatlu unay so please update regularly

kachhitanga ekkuve untaayi bro 
endukante idi nenu eppati nundo anukuntunna story
and naaku nachhe story

(30-08-2021, 06:24 PM)Y5Y5Y5Y5Y5 Wrote:  nice story
tq
(30-08-2021, 06:40 PM)Eswar P Wrote:  డోమ్ బ్రో సూపర్
tq
(30-08-2021, 06:44 PM)Ravanaa Wrote:  Bhaya ప్రేమ కు దారేది ఎలా ఉంటుంది.

baagane untundi but adi antha attention teesukodemo ani doubt 
inkoti edaina suggestion ivvandi
(30-08-2021, 08:02 PM)paamu_buss Wrote:  super story.. Inka title " tanu emo ala  nenemo ila idhe kadha prema "

bro baaga pettaru title 
short story ki sarigga untundi title but nenu long ga raddam anukuntunna manchi attention grab ayyela catchy ga unte baaguntundi ani na abhiprayam
but idi kachhitanga consider chestha
(30-08-2021, 08:37 PM)విక్కీ Wrote:  అదిరిపోయింది డోమ్ గారు, కథ మొదటి అప్డేట్ లోనే కథ నీ మొదలు పెట్టిన తీరు చాలా చాలా బాగుంది. మొదటి అప్డేట్ తోనే కథ రీడర్స్ కి కనెక్ట్ అయ్యేలా , తరువాత ఎం జరుగుతుంది అని ఆసక్తి గా ఎదురుచూసే లా చేయడం లో మీరు సూపర్ సక్సెస్ అయ్యారు. మీదైన శైలి లో సంభాషణలు సన్నివేశాలతో అదరగొట్టారు. కథ ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. కథ కి నా తరుపుగా టైటిల్ ' నన్ను మె(ప్పిం)చ్చిన నా రూప'

nannu mechhina repa
nannu meppinchina roopa 

baagundi bro mi double meaning title super undi
inka emaina ideas vasthayemo chusi emi rakapothe ide pedatha

(30-08-2021, 11:01 PM)Shaikhsabjan114 Wrote:  సూపర్ సూపర్ అప్డేట్ గురు ❤❤❤❤
tq
(31-08-2021, 06:41 AM)stories1968 Wrote:  రూప స్నానం చేసి  వచ్చినప్పుడు తన అందాలు 
[Image: 22688562-518859671799580-3544686029654592732-n.jpg]

(31-08-2021, 06:45 AM)stories1968 Wrote:  రూప నిదుర పోతున్న తన అందాన్ని చూస్తూ ఉన్న మన హీరో వినయ్  
[Image: rathi-nirvedam-highres-spicy-scenes2.jpg]

(31-08-2021, 06:48 AM)stories1968 Wrote:  వినయ్ అత్త మరి అమ్మ రూప  వివాహం గురుంచి 
[Image: Dp-Ew69-DUYAAAYEk.jpg]

mi images baagunnayi guru garu


(31-08-2021, 08:31 AM)kummun Wrote:  చాలా ఫ్రెష్ గా ఉంది.....

meeku nachhadam naaku santhosani isthundi bro
(31-08-2021, 09:58 AM)ramd420 Wrote:  కొత్త కథ బాగుంది
tqq

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#5

inko 10 min lo update post chestha

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
#6

Episode 2
రూప రాగానే అందరూ కంగ్రాటులేషన్స్ చెప్పారు. తరువాత పార్టీ నెమ్మదిగా మొదలైంది. అందరూ చేతిలో డ్రింక్ పట్టుకుని తాగుతూ ఉన్నారు. మధ్య మధ్యలో రూప నా వంక చూస్తూ ఉంది. నేను కూడా తనని గమనిస్తూ ఉన్నా. తను నేను గమనించడం చూసి నెమ్మదిగా మా నాన్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ మా నాన్న ఇంకా దేవేంద్ర కలిసి తాగుతూ ఉన్నారు. రూప అక్కడికి వెళ్లే సరికి దేవేంద్ర అంకుల్ ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రూప ఇంకా మా నాన్న ఇద్దరే ఉన్నారు వాళ్ళు ఏమీ మాట్లాడుకోవడం లేదు కానీ నాకు మాత్రం రూప మా నాన్నతో ఏం మాట్లాడబోతుందో అని ఆత్రుతగా ఉంది,  కాబట్టి వెంటనే వాళ్లిద్దరూ నిలబడి ఉన్న గోడ దగ్గరికి అటు వైపు నుండి వెళ్ళా. వాళ్ళకి ఇప్పుడు నేను కనిపించను కానీ వాళ్ళ మాటలు నాకు బాగా వినిపిస్తాయి. అలా నేను నిలబడి ఉండగా కాసేపు ఇద్దరూ సైలెంట్ గా ఉండడం కనిపించింది. అక్కడ మ్యూజిక్ ప్లే చేస్తుంటే ఇద్దరూ వింటున్నారు. కాసేపటికి ఒకరిని ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. 
 మా నాన్నతో రూప సంభాషణ...
ఎంటి అంకుల్ కులాసాయేనా ? అంది రూప. దానికి మా నాన్న హా కులాసాయే అమ్మా, ఒకవేళ కాకపోయినా నిన్ను చూశాను కదా కచ్చితంగా అయ్యి తీరాల్సిందే అని అంటూ నవ్వాడు. రూప కూడా నవ్వుతూ సినిమా డైలాగ్ లు బాగా చెప్తారు అంకుల్ మీరు అంది. నిజానికి మా నాన్నకు రూప కు చాలా మంచి అనుబంధం ఉంది. మా నాన్న కు రూప ఎంత చెప్తే అంత అన్నట్లు. తన నడవడిక, సిన్సియారిటి, క్యారెక్టర్ అంటే మా నాన్నకు చాలా ఇష్టం. అలాంటి పిల్ల నీకు పుట్టినందుకు చాలా అదృష్టమంతుడివి రా నువ్వు అని దేవేంద్ర అంకుల్ ను ఎప్పుడూ పొగుడుతూ ఉంటాడు. ఈవెన్ మా నాన్నకు అంత అనుభవం ఉన్నా కూడా రూప ను వెళ్ళి సలహాలు అడుగుతూ ఉంటాడు. రూప గ్లాస్ లో డ్రింక్ తీసుకుని తాగుతూ ఎంటి అంకుల్ మీ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంది తన ప్లాన్ ను అమలు పరుస్తూ.. 
మా నాన్న రూప అలా అడగగానే కొంచెం డల్ అయ్యి, ఎంటో అమ్మా మా వాడు అంతా చిత్రమైన పనులు చేస్తున్నాడు అన్నాడు. రూప ఏమైంది అంకుల్ అని అంది. దానికి మా నాన్న నీకు తెలీదా అమ్మా అంటూ నేను ఇలా ఒక కంపెనీ నా సొంతంగా నేనే మొదలు పెడదాం అని అనుకుంటున్నా అన్న విశయం తనకి చెప్పాడు. రూప మనసులో నవ్వుకుంటూ అయ్యో అవునా అంటూ తన మొదటి అస్త్రం ప్రయోగించింది. సొంత కంపెనా ? మన వినయా ?  అంది పెట్టగలడా అన్నట్లుగా చూస్తూ. తనలా చూసే సరికి మా నాన్నకు అంతవరకు నా మీద కాస్తో కూస్తో ఉన్న నమ్మకం కూడా ఆ చూపు చూడగానే పోయింది.  అలా నమ్మకం కోల్పోయి ఎంటమ్మా వీడు దానికి పనికి రాడు అంటావా అన్నాడు కాస్త మెల్లగా. రూప తెలివి గలది, తను ఏమైనా అనింది అంటే దాంట్లో ఎదో ఉండే ఉంటుంది అని మా నాన్న నమ్మకం అందుకే మా వాడు దానికి పనికి వస్తాడా రాడా అని రూపను అడిగాడు. రూప నవ్వుతూ నన్ను తక్కువ చేయకుండా అయ్యో అలా అంటారు ఏంటి అంకుల్ అతను మంచి పట్టుదల వున్నవాడు పనికి రాడా అని అడుగుతారు ఎంటి ? కచ్చితంగా కంపెనీ పెట్టి అనుకున్నది సాధిస్తాడు అని అంది అలా అనగానే మా నాన్న ముఖం సంతోషంగా వెలిగిపోయింది. అలా వెలిగిపోతూ ఉండగా రూప మనసులో నవ్వుకుంటూ తన ఇంకో అస్త్రాన్ని ప్రయోగించింది. కానీ ఒక్కటే సమస్య అంది. వెంటనే మా నాన్న ఏంటి అది అన్నట్లుగా చూసాడు. వెంటనే రూప కొంచెం సీరియస్ గా చెప్తున్నట్లుగా ఫేస్ పెడుతూ వినయ్ కు పట్టుదల అయితే ఉంది కానీ సరైన గైడెన్స్ఏ  లేదు అదే ప్రాబ్లెమ్ అంది. మా నాన్న అర్దం కానట్లు చూసాడు. రూప తనని చూస్తూ వినయ్ ని చిన్నప్పటి నుండి చూస్తున్నా కదా తనకు ఇలాంటి వాటి మీద పెద్దగా పట్టు లేదు, తను ఆల్రెడీ ఉన్న వాటిని మెయింటైన్ చేయగలడు ఏమో కానీ ఇప్పుడు తనకున్న టాలెంట్ కు కంపెనీ స్టార్ట్ చేసి డెవలప్ చేయడం అంటే కష్టం అంది. దానికి మా నాన్న కాస్త ఢీలా పడిపోయి అయితే ఏం చేస్తే బాగుంటుందమ్మ అన్నాడు. రూప చిన్నగా నవ్వి తనని ముందు మీ కంపెనీ లోకి తీసుకోండి అంకుల్,  అసలు కంపెనీని ఎలా నడిపించాలి ఎంత స్ట్రెస్ ఉంటుంది లాస్ ఎలా కవర్ చేయాలి ఇంకా తెలుసుగా కంపెనీ లో ఎలా ఉంటుందో అవ్వన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలో ప్రాక్టికల్ లా చుయించండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా వోదిలేసినా  ఇవ్వన్నీ సొంత అనుభవం మీద తెలుసుకుంటాడు కానీ ఏం లాభం అంటూ అటు ఇటు చూసి ఇప్పటికే ఒక కంపెనీ లాస్ లో ఉంది ఇంకో లాస్ అవసరమా ? అంది. మా నాన్న అవును నిజమే అన్నట్లుగా చూసాడు. అందుకే అంకుల్ చెప్తున్నా తెలుసుకోవడం అయితే తెలుసుకుంటాడు సొంత అనుభవం మీద కానీ లాస్ వచ్చాక అది ఎవరు కవర్ చేస్తారు. ఇప్పటికే ఉన్న కంపెనీ లాస్ లో ఉంది అది సరిపోదా మళ్ళీ కొత్తది ఎందుకు అంది. మా నాన్న అవునవును అని అంటూ  రూప వంక చూసి మళ్ళీ ఎదో గుర్తొచ్చిన వాడిలా కానీ వాడు నా మాట వినడే, ఎలా చెప్పేది అన్నాడు. రూప ఎందుకు వినడు అంకుల్ మీ కంపెనీ నే కదా అది. దాంట్లో ఉండడానికి ఏం సమస్య అతనికి అంది. దానికి మా నాన్న అయ్యో నీకు తెలీదు అమ్మా వాడికి నా కంపెనీ అంటేనే నచ్చదు నాది కాకుండా వేరే ఏదైనా సరే చేస్తా అంటాడు ఏమో కానీ నా కంపెనీ పేరెట్టితేనే వాడికి చెడ్డ చిరాకు అన్నాడు. తను ఎప్పుడెప్పుడు ఈ మాట అంటాడు అని ఎదురుచూస్తున్న   రూప టక్కున మా నాన్నతో అయితే ఒక పని చేయండి అంకుల్ అంది. మా నాన్న ఏంటి అన్నాడు. రూప మనసులో నవ్వుకుంటూ మా నాన్నను చూస్తూ నేను ఎలాగో ఇప్పుడు ఒక కంపెనీని చూసుకుంటున్నా కదా, తెలిసిన వాడే, మన వినాయే కాబట్టి నాకు పియే గా చేరమనండి, సొంతంగా నేర్చుకున్నట్లు ఉంటుంది, మీ కంపెనీ మీద ఆధార పడలేదు అన్నట్లూ ఉంటుంది ఏమంటారు ? పైగా నేను ఉన్నాగా వాడికి ఏం కావాలో ఏం నేర్పించాల్లో తెలిసిన దాన్ని అంది. అంతే మా నాన్న ముఖం లో 1000 వోల్టా వెలుగు వచ్చింది. వెంటనే రూప చేతులు పట్టుకుని ఎంటి నిజమా అమ్మా నీ కింద మా వాడ్ని చేర్పించు కుంటావా ? అన్నాడు. మా నాన్న ఉద్దేశం లో రూప చాలా తెలివి గలది అంత తెలివి ఉన్న ఆమె నా కొడుకుని పీయే గా పెట్టుకుంటుంది అంటే వాడికి ఎంతో కొంత నాలెడ్జ్ ఉందని, ఇంకా రూప తో పని చేస్తాడు కాబట్టి ఆమె వళ్ళ ఎంతో కొంతైనా నేర్చుకుంటాడు అని మా నాన్న ఉద్దేశం. అది రూప కు మా నాన్న కళ్ళలో కనిపిస్తుంది. మా నాన్న కు ఇచ్చిన బూస్ట్ సరిపోలేదు అన్నట్లుగా రూప ఇంకా చెప్తూ వినయ్ కొంచెం నేమ్మదిగా నేర్చుకుంటాడు అందుకే నేను అనుకోవడం ఏంటంటే, వాడ్ని ఒక వన్ ఇయర్ నాతోనే పెట్టుకుని కంపెనీ ని ఎలా నడిపించాలో ట్రైనింగ్ ఇస్తాను ప్రాక్టికల్ గా అప్పుడైతే వినయ్ బాగా పిక్ అప్ అవుతాడు ఏం అంటారు అంది. దానికి మా నాన్న ఏం చెప్పమంటావ్ అమ్మా, అసలు ఇంత హెల్ప్ చేస్తావ్ అని కలలో కూడా అనుకోలేదు, ఏమైనా నీకు చాలా థాంక్స్ అమ్మా అని అన్నాడు చాలా ఆనందం తో. రూప మా నాన్న సంతోషాన్ని చూస్తూ పర్లేదు అంకుల్ వినయ్ ఏం పరాయి వాడా (నాక్కబోయే వాడే గా అనుకుంటూ) నాతోనే తిరిగాడు నాతోనే అన్నీ షేర్ చేసుకుంటాడు నేను ఆ మాత్రం చేయక పోతే ఎలా అంకుల్ అంది. దానికి మా నాన్న పొంగిపోయి చాలా థాంక్స్ అమ్మా, అంటూ రూప ను చూస్తూ నిజంగా ఒకవేళ వాడికి అక్కే లేకుంటే ఆ లోటు మాత్రం నువ్వు కచ్చితంగా భర్తీ చేసే దానివమ్మా అన్నాడు. అంతే అంతవరకు నవ్వుతూ ఉన్న రూప ముఖం కొంచెం సీరియస్ గా మారిపోయింది. కాబోయే మొగుడని నేను అనుకుంటూ ఉంటే నువ్వేంటి నీ కొడుకు లాగే అక్కా బొక్కా అనుకుంటూ అని ఇంకేదో  మనసులో తిట్టుకోవడానికి చూస్తూ అంతలోనే పోనీలే కాబోయే మామగారే కదా క్షమించి వొడిలెద్దాం అని అనుకుని ఇంకాసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ ఎక్కడ అక్కా అంటాడేమో అని మా నాన్నను చూస్తూ సరే సరే అంకుల్ ఇక మీరు వెళ్ళండి అక్కడ పాపం మా నాన్న  ఒక్కడే కష్టపడుతున్నాడు అని అంది దేవేంద్ర ఒక్కడే తాగడం చూసి. వెంటనే మా నాన్న అవును పాపం వాడు కంపెనీ లేకుండా తాగడం తక్కువ పోయి కంపెనీ ఇస్తా అంటూ వెళ్తుంటే రూప ఎదో గుర్తొచ్చిన దానిలా హా ఇంకో విశయం అంకుల్ అంది. దానికి మా నాన్న హా ఎంటమ్మా అన్నాడు. రూప ఏం లేదు, నా దగ్గర చేరమని మీ అబ్బాయికి డైరెక్ట్ గా చెప్పకండి, మళ్ళీ ఇదేదో ప్లాన్ అన్నట్లుగా వొద్దు అంటాడు, ముందు మీ కంపెనీ లో చేరమని  చెప్పి ఆ తరువాత వొద్దు నేను చేరను అని అన్నాక, మరి ఏం చేద్దాం అనుకుంటున్నవ్ పోనీ, వర్క్ అయినా నేర్చుకో అని మెల్లగా నా దగ్గర చేరేలా లాక్కురాండి. అయినా వినకపోతే మీకు తెలుసుగా ఎలా చెప్పాలో అంటూ నవ్వుతూ పెళ్లి  చేసెస్తా అని బ్లాక్ మెయిల్ చేయండి సరిపోతుంది అంది. ఆ మాట వినగానే నేను షాక్ అయ్యా. తను నిజంగా దీన్ని కూడా వాడుకుంటుంది అని అనుకోలేదు. నేను అప్పట్లో రూప తో నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు అని చెప్పినట్లు గుర్తు. అందుకే ఇప్పుడు దాన్ని కూడా అడ్డం పెట్టమని మా నాన్నతో చెప్తుంది. తనలా అంటుంది అని అనుకోలేదు. అంతలో మా నాన్న సరే అమ్మా నేను చూసుకుంటాలే మిగితాది అన్నాడు. అలా అని దేవేంద్ర ను చూసి తన దగ్గరికి వెళ్ళిపోయాడు. 
అలా మా నాన్న వెళ్ళిపోగానే రూప చేతిలో ఉన్న డ్రింక్ మొత్తం తాగేసి, నేను ఉన్న గోడ దగ్గరకు రాబోయింది. తను రావడం చూసి నేను వెంటనే అక్కడ నుండి తనకు  దొరక కుండా వెళ్ళబోయా. కానీ అంతలోనే రూప గోడ దగ్గరికి వచ్చేసి విన్నూ.. అని పిలిచింది. అంతే అక్కడ నుండి వెళ్ళిపోతున్న నేను ఆగిపోయి వెనక్కి తిరిగాను. తను కళ్ళెగరేస్తూ చూసింది. నేను ఎంటి అన్నట్లుగా ఫేస్ పెట్టా. రూప నా దగ్గరికి స్టైల్ గా నడుస్తూ వచ్చి ఏంటి వినాల్సింది అంతా విని ఇప్పుడు వెళ్లిపోతున్నావా ? అంది. నేను కొంచెం చిరాకు గా ఫేస్ పెడుతూ నేనేం వినలేదు అన్నా. రూప నా ఫేస్ చూసి నవ్వుతూ, ఆపుతావా ఆ చెత్త ఎక్స్ప్రెషన్ అని అంది. నేను తనని ఏంటి నీ బాధ అన్నట్లుగా చూసా. రూప నాకు కొంచెం దగ్గరికి వస్తూ ఇందాక విన్నావ్ గా ఏం చెప్పానో అర్దం అయ్యిందా అంది. నేను ఏం విన్నా అన్నట్లుగా చూసా. రూప నవ్వుతూ నాకు తెలుసులే నువ్వు విన్నది ఎక్కువ చేయకు, అంటూ అటు ఇటు చూసి ఎవ్వరూ తనని గమనించడం లేదు అని ఖరారు చేసుకుంటూ నన్ను చూసి మూసుకుని ఎల్లుండి నుండి ఆఫీస్ కు రా, నీకే మంచింది, లేదంటే తెలుసుగా నా గురించి అంది. నేను తనని చూడకుండా అవతల వైపుకు చూస్తూ తన మాటలు మాత్రమే వింటున్నా. అది చూసి రూప నా చెయ్యి పట్టుకుంది. అంతే వెంటనే నేను కంగారు పడి అటు ఇటు చూస్తూ ఎవరైనా చూస్తారు అని అంటూ చెయ్ విడిపించుకున్నా. నేను అలా అనేసరికి ఒక్కసారిగా గట్టిగా నవ్వింది రూప. 
ఆడపిల్లవా నువ్వేం అయినా ? అంత భయపడుతున్నావ్..
అయినా ఇక్కడ అందరూ మనల్ని అక్కా తమ్ముడి లాగే చూస్తున్నారు లే, చెయ్యి పట్టుకున్ననంత మాత్రాన తప్పుగా అనుకోరు అంది. నేను తనని చూసి ఇక అయిపోయిందా అన్నట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టాను. తను అటు ఇటు చూసి పెదాలతో ఉమ్మ్ అంటూ ఫ్లయింగ్ కీస్ ఇచ్చింది. నేను తనని కోపంగా చూసా. నిజానికి తన లాంటి అందమైన అమ్మాయ్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది అంటే ఎవ్వడైనా ఎగిరి గంతేస్తారు. కానీ ఇక్కడ నా పరిస్థితి అలా లేదు. తను ఇంకా నన్ను చూస్తూ ఎందుకు అలా బిగుసుకు పోతున్నావ్ ఫ్రీ గా ఉండు అంది. నేను ఉఫ్ అని అనుకుంటూ నేను వెళ్ళాలి అన్నా. దానికి రూప అయ్యో నేనేం నిన్ను ఆపలేదే అంది. నేను వెంటనే తన వైపు ఒక లుక్ ఇచ్చి ముందుకు నడవబోయా. అలా ముందుకు వెళ్తుంటే అంతలోనే ఒక్క నిమిషం అంటూ రూప ఆపింది. నేను తల తిప్పి చూసా. రూప నాకు దగ్గరగా వస్తూ నా చేయి పట్టుకుంటూ నా కళ్ళలోకి చూసి నన్ను ఎక్కువ కష్టపెట్టకు, ఆఫిస్ కు వచ్చేయి కలిసి పని చేసుకుందాం సరేనా ? అంది. నేను తన చేయి విడిపించు కుంటూ ముందుకు వెళ్ళిపోయా కోపంగా..
రూప వెనుక నుండి మమ్మల్ని ఎవ్వరూ చూడలేదు అని కన్ఫర్మ్ చేసుకుంటూ, నా చేతిని తాకిన తన వేళ్ళని తన నోట్లో పెట్టుకుంది. అలా పెట్టుకుని కాసింత చీకి మళ్ళీ ఛ ఛా వీడు నన్ను చాలా చెడ గొడుతున్నాడు అని అనుకుంటూ వెనుక నుండి నన్ను చూసి అంతలోనే పక్కనే ఎవరో వస్తుంటే అటు వైపుకు వెళ్ళింది.   

ఐ లవ్ యూ చెప్పిన వేల..
తమరేమ్ గిఫ్ట్ ఇవ్వరా నాకు అని అడిగిన రూప ను చూస్తూ ఈరోజే పుట్టిన పాపాయికి ఏం గిఫ్ట్ కావాలి ఏంటి ? అని అడిగా. రూప నా భుజం చుట్టూ చెయ్యి వేసి నా ఎడమ భుజం పై తల పెట్టుకుని పడుకుంది. నేను తన చేతిని పట్టుకుని రాస్తూ చెప్పు ఏం గిఫ్ట్ కావాలి అని అడిగా. రూప నా చేతిని వొదిలేస్తూ గిఫ్ట్ ఎవరైనా అడుగుతారా ఇది ఇవ్వమని, నువ్వే తోచింది ఇవ్వాలి అంది.  నేను ఏం ఇవ్వాలి అబ్బా అని ఆలోచిస్తూ ఉండిపోయా. నేను అలా ఆలోచించడం చూసి ఏం ఆలోచిస్తున్నావ్ అంది. నేను అదే నీకు ఏం గిఫ్ట్ ఇవ్వాల్లో అని అన్నా. తను నా తల పై ఒకటి కొట్టి నువ్వు దాని గురించి ఆలోచించ కూడదు నన్ను చూడగానే అది ఇచ్చేయాలి అని అనిపించాలి అలాంటి గిఫ్ట్ ఏదైనా ఉందా అంది. నేను అయోమయంగా చూసాను. నేను అలా చూడడం చూసి చిన్నగా నవ్వింది. అంతలో మా అమ్మ బయట నుండి డోర్ కొట్టింది. నేను హా చెప్పు మా అన్నా. బయట నుండి అమ్మ, రూప లోపల ఉందా అంది. నేను హా అవును అన్నా. దాంతో బయట మా అమ్మ ఫోన్ లో మాట్లాడుతూ హా వుంది మా ఇంట్లోనే అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. రూప నవ్వుతూ మా అమ్మ అనుకుంటా అంది. నేను టైం వంక చూసా రాత్రి పది నర అవుతుంది, వెంటనే తన వంక చూసి ఇక్కడే పడుకో ఈ రాత్రికి అన్నా. (మాకు ఇది అలవాటే ఒకే బెడ్ మీద పడుకోవడం) రూప నవ్వి హ్మ్మ్ అంది. నాకు తన ఫేస్ చూస్తుంటే తను నాకేదో చెప్పాలని ఉన్నట్లు కానీ, చెప్పలేక పోతున్నట్లు కనిపించింది. అలా అనిపించగానే నేను వెంటనే తన కళ్ళలోకి చూస్తూ నాకేమైనా చెప్పాలా అని అన్నా. తను కొంచెం కంగారుగా చూస్తూ ఏం లేదే అంది. నేను మరేంటి అలా ఉన్నావ్ అన్నా. తను మామూలుగా ఫేస్ పెడుతూ ఎలా ఉన్నా ? బాగానే ఉన్నానే అంది పైకి లేచి ఎదురుగా ఉన్న అద్దం చూసుకుంటూ. నేను తనని చూస్తూ నువ్వు రోజులా లేవు అన్నా. రూప నన్ను చూసింది. నేను పైకి లేచి పర్లేదు చెప్పు నా దగ్గర దాపరికం ఎందుకు అన్నా. తను నా కళ్ళలోకి చూస్తూ నిజంగా ఏమీ లేదు ఉంటే నీకు చెప్పనా ? అంది. నేను మళ్ళీ బెడ్ మీద కూర్చుంటూ మనసులో ఇదేంటి ఇవ్వాళ తేడాగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ సరేలే త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకో పడుకుందాం అన్నా. (తను చాల సార్లు నా దగ్గరే పడుకుంటుంది కాబట్టి తన డ్రెస్ లు ఐదారు నా దగ్గరే పెట్టుకుని ఉంది) దానికి రూప పడుకుందాం లే తొందర ఎందుకు అంది వొళ్ళు విరుచుకుంటూ. అలా విరుచుకుంటూ తన బొడ్డు నాకు కనపడేలా చీర ను జరిపింది. అలా చీర జరుపుతూ ఉండడం నేను చూసా. తను నేను చూడలేదు అనుకుంది కానీ నేను అప్పటికే చూసేసి ఉండడం తో వెంటనే తన ముఖం లోకి చూస్తూ నన్ను ఏమైనా సెడ్యుస్ చేస్తున్నావా ? అన్నా. తను వెంటనే ఏంటి ? అంది. నేను తనని చూస్తూ ఏమైంది నీకు ఇవ్వాళ అన్నా. తను నన్ను చిరు కోపంగా చూస్తూ నేను ఇక వెళ్తా అంది. నేను అదేంటి ఉంటా అన్నావ్ గా అన్నా. తను ఏమో నాకు వెళ్ళాలి అని ఉంది అంది. నేను సరే నీ ఇష్టం అన్నా. తను బాగ్ తీసుకుని తలుపు తెరిచి బయటకు వెళ్తూ నా వంక ఒకసారి చూసింది. నేను కూడా తనని చూసా. తన కళ్ళలో ఎదో నాకు చెప్పాలి అని ఉన్నట్లు నాకు క్లియర్ గా తెలుస్తోంది. నేను ఏమయి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా తను డోర్ క్లోజ్ చేసేసింది. 
అలా డోర్ క్లోజ్ చేసి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మా ఇంటి ముందు నిలబడి తన తల మీద తనే కొట్టుకుంటూ ఛా, ఏమైందే నీకివ్వాల ? ఆ మాత్రం చెప్పలేవా వాడికి అనుకుంటూ అక్కడే తచ్చాడుతూ చెప్పేయవే రూపా చెప్పెయి ఏం కాదూ.. అని తనకు తనే దైర్యం చెప్పుకుంటూ అక్కడే మా ఇంటి ముందు అటు ఇటూ తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ తనని తనే ప్రిపేర్ చేసుకుంటూ ఏముందీ డైరెక్ట్ గా వెళ్ళి ఐ లవ్ యూ వినయ్ అని చెప్పి వచ్చేయి తరువాత ఏమైతే అది అయ్యింది అని బయటికే చిన్నగా మాట్లాడుకుంటూ చెప్పేయవే రూపా చేప్పేయి అని దైర్యం తెచ్చుకుంటూ కళ్ళు మూసుకుని నాలుగైదు సార్లు ఊపిరి తీసుకుని వదిలింది. అలా వోదులుతూ ఏమైతే అది అయ్యింది చెప్పెద్దాం అని దైర్యంగా అనుకుంటూ  ఒకసారి మా ఇంటి  పై ఫ్లోర్ లో ఉన్న నా రూం విండో వంక చూసింది. అంతే తనకు వెంటనే షాక్ కొట్టినట్లు అయ్యింది. అక్కడ నేను తననే చూస్తూ నిలబడి ఉన్నా. అది చూసి అయ్యో చుసేసాడే అని మనసులో అనుకుంటూ ఇలా అడ్డంగా దొరికి పోయానేంటి అని వెంటనే నా ముందు ఉండలేక తల దించుకుంటూ బుద్దిగా అక్కడ నుండి నడుచుకుంటూ తనింటి వైపుకు వెళ్ళింది. నేను అలా నడుస్తూ వెళ్తున్న తనని చూస్తూ ఏమైంది దీనికి అని అనుకుంటూ వెంటనే తనకి ఫోన్ చేశా. తను ఫోన్ రావడం చూసి తల తిప్పి నేను ఉన్న విండో వైపు చూసింది. నేను ఫోన్లో పైకి రా అని చెప్పేసి పెట్టేసా. అలా పెట్టేసి బెడ్ మీద వచ్చి కూర్చున్నా. కాసేపటికి తలుపు తట్టిన సౌండ్ వచ్చింది. నేను డోర్ తీసా. తను సైలెంట్ గా తల దించుకుని లోపలికి వచ్చింది. నేను తన ముఖం లో చూస్తూన్నా ఏం చెప్తుందా అని. తను నేను చూస్తుండడం చూసి తల అలాగే వంచుకుని ఉంది. నేను ఉఫ్ అనుకుంటూ ఇప్పుడైనా చెప్తావా లేక అంటూ అనబోతూ  ఉండగానే వెంటనే తను తలెత్తింది. తలెత్తి నా వంక చూస్తూ ఐ లవ్ యూ అంది. నేను ఒక్కనిమిషం అర్దం కానట్లుగా చూసా. తను నన్ను చూసి మళ్ళీ కన్ఫర్మ్ చేస్తూ ఐ లవ్ యూ అని అంటూ ఇదే అప్పటి నుండి చెప్పాలి అనుకుంటున్నది అంది. నేను తనని అర్దం కానట్లుగా చూస్తూ జోక్ చేస్తున్నావ్ కదా అన్నా. రూప నా వంక సూటిగా చూసింది. నేను తన చూపు చూసి ఏంటి నిజమా ? అన్నా. రూప నెమ్మదిగా తల వొంచుకుంది. నేను తనని చూసి ఏంటిది అంటూ అనబోతు ఉంటే రూప నన్ను ఆపుతూ నా వంక చూసి నా చేతిని పట్టుకుంటూ ఇప్పుడేం చెప్పకు, నెమ్మదిగా ఆలోచించు, ఇవ్వాళ నా బర్త్ డే, నన్ను డిస్ అపాయింట్ చేయకు,  అదే నువ్వు నాకిచ్చి గిఫ్ట్ అంది. అలా అంటూ నెమ్మదిగా డోర్ దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంటే ఆగు అన్నా. రూప నా వంక చూసింది. నేను తన దగ్గరికి వెళ్తూ నీకు ఆల్రెడీ రమణ అంకుల్ కొడుకు తో పెళ్ళి కుదిరింది అని గుర్తుందా అన్నా. రూప తల దించుకుని మౌనంగా ఉండిపోయింది. నేను ఇంట్లో వాళ్ళు సడెన్ ఎవరినైనా వస్తారేమో అని వెంటనే తలుపు వేసేస్తూ తన వంక చూసా. తను తల పైకెత్తి నన్ను చూస్తూ నాకు తెలుసు నువ్వు దాని గురించి అంటావ్ అని కానీ అంటూ ఇంకేదో చెప్పబోతూ ఉంటే నేను తనని ఆపుతూ అసలు ఎంటి ఇది ? ఇన్ని రోజులు బాగానే ఉన్నాం గా సడెన్ గా ఎందుకు ఇలా అంటున్నావ్ అన్నా. తను తలెత్తి నన్ను చూస్తూ వినయ్ ప్లీస్ నన్ను ఏమీ అడగకు, నాకు నువ్వంటే ఇష్టం అంతే ఇంకేం చెప్పలేను అంది. నేను తనని కోపంగా చూసా. తను తల దించుకుంది. కాసేపు ఇద్దరం అలాగే నిలబడ్డాం. నాకు తనని ఏం అనాలో అర్దం కాలేదు మౌనంగా కాసేపు ఉండిపోయా. నేను ఏం అంటానో అన్నట్లుగా తను నన్నే చూస్తూ ఉంది. నేను కాసేపటికి నోరు విప్పుతూ లేదులే రూప, సారి అన్నా. రూప నా వంక కోపంగా చూసింది. నేను తనని కూడా అలాగే చూస్తూ ఏంటి అలా చూస్తున్నావ్ ? చేసిందే వెధవ పని మళ్ళీ చూస్తున్నావ్ అంటూ కోపంగా తల తిప్పుకుని బెడ్ దగ్గరకు వెళ్ళా. నేను అలా వెళ్ళగానే వెనుక నుండి రూప పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను తన వైపుకు తిప్పుకుంది. నేను తనని ఏంటి అని చుసేలోగా తన పెదాలతో నా పెదాల మీద ముద్దు పెట్టింది. నేను కోపంగా తనని విడిపించుకుని లాగి చెంప మీద కొట్టా. తను నేను కొట్టిన దెబ్బకు షాక్ గా చూస్తూ నిల్చుని ఉండిపోయింది. నేను అనోసరంగా చెయ్ చేసుకున్నా కదా అని అనుకుంటూ బెడ్ మీద కూర్చుని తల పట్టుకున్నా. రూప అలాగే నా ముందు నిల్చుని ఉంది. తన ముఖం కోపంగా ఉంది. కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటే కనీసం తుడుచు కాకుండా అలాగే నా ముందు నిల్చుని నన్నే చూస్తూ ఉండిపోయింది. నేను తనలా చూస్తూ ఉండడం చూసి నా తప్పెంటో అర్దం చేసుకుని తన చేతిని పట్టుకుని నా దగ్గరికి లాక్కుంటూ సారి అన్నా. తను ఏం అనకుండా అలాగే నిల్చుంది. నేను తన కళ్ళలో నీళ్ళు తుడుస్తూ ప్లీస్ రా ఏం అనుకోకు అని అన్నా తనని కూల్ చేయడానికి. తను మాత్రం ఏం పలక కుండా నన్నే కోపంగా చూస్తూ ఉంది. నేను చిన్నగా పైకి లేచి తనని చూస్తూ నేను చెప్పేది విను అన్నా. తను పలకలేదు. తను కోపంగా ఉంది అని అర్దం చేసుకుని చెప్పేది అర్దం చేసుకో రూప నేను ఎప్పుడూ నిన్ను అలా చూడలేదు అంటూ తనని చూసా. రూప నా వంక చూసింది మామూలుగా, కానీ నాకు అది కోపంగా చూస్తున్నట్లు అనిపించింది. నేను తన చేతులు పట్టుకుని తన కళ్ళలోకి చూస్తూ నిజంగా నీపై నాకు అలాంటి అభిప్రాయాలు ఏమీ లేవు, నాకు నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అంతే ఇంకా చెప్పాలంటే నువ్వు నాకు ఒక అక్క లా అని అన్నా. అంతే అలా అన్నానో లేదో రూప ఒక్కసారిగా నా చెంప చెళ్లమనిపిస్తూ అక్కా గిక్కా అన్నవంటే పళ్ళు రాలగొడతా అంది. నేను షాక్ గా చూసా. తను ఆ మాటకు బాగా హర్ట్ అయ్యింది అనుకుంటా నన్ను కోపంగా చూస్తూ ఇంకోసారి అక్కా అన్నవో అంటూ కోపంగా నన్ను చూసి అక్కడ ఉన్న బాగ్ తీసుకుంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి ఎదో మెసేజ్ వస్తే చూసా. నీకిష్టం ఉన్నా లేకున్నా నాకనోసరం, నిన్నైతే విడిచిపెట్టను గుర్తు పెట్టుకో అని ఉంది అందులో. నేను ఉఫ్ అనుకుంటూ ఎలా చెప్తే అర్దం అవుతుంది దీనికి అనుకుంటూ అలాగే బెడ్ మీద పడ్డాను. ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలీదు లేచి చూస్తే పొద్దున అయ్యింది. తన నుండి చాలా మెసేజ్ లు వచ్చాయి. నేను వాటిని చూస్తూ దీనికి ఇలా చెప్తే అర్దం కాదు అని అనుకుని తనకి తిరిగి మెసేజ్ చేస్తూ ఇంకోసారి ప్రేమా అన్నావంటే విశయం మీ అన్న దగ్గరికి వెళ్తుంది  జాగ్రత్తా అని పెట్టా. 
అంతే అప్పటి నుండి ఈరోజు వరకు మెసేజ్ లు లేవు, మాటలు లేవు బహుశా తన అన్నకు భయపడింది అనుకుంటా. కానీ అది భయం కాదు అని నాకు ఇవ్వాళే తెలిసింది. ఇవ్వాళ జరిగింది చూసాక తనకి ఇంకా భయం కలగలేదు అని అర్దం అయ్యింది.
అలా అర్దం కాగానే నేను ఒకసారి పార్టీ లో అందరితో నవ్వుకుంటూ మాట్లాడుతున్న రూప ను చూసా. తనకు అస్సలు ఏ మాత్రం భయం లేదు అని తన ముఖం చూస్తేనే అర్ధం అవుతుంది. నేను తనకు ఇలా చెప్తే అర్దం కాదు అని తన అన్న దగ్గరికే వెళ్ళి ఒకసారి చెప్తే అప్పుడు కానీ బుద్ది రాదు అనుకున్నా. అలా అనుకున్నదే తడువుగా వెంటనే రూప అన్న ఎక్కడ ఉన్నాడో చూసా. అతను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అది చూసి వెంటనే పైకి లేచా. అలా లేవడం తో అప్పటి వరకు నేను ఎక్కడ ఉన్నానో అని దొంగ చూపులు చూస్తున్న రూప కు నేను కనపడ్డ. నేను కనపడడం తో నా వంక చూసి నవ్వింది. నేను కోపంగా తల తిప్పి అటు చూడు అన్నట్లుగా చూసా. అక్కడ వాళ్ళ అన్న కనిపించాడు. అది చూసి అయితే అన్నట్లుగా చూసింది.  నేను తనని చూసి చిన్న వెకిలి నవ్వు నవ్వి వెళ్ళి చెప్పనా అన్నట్లుగా చూసా. తన మొహం లో నవ్వు మాయమయి పోయింది. సీరియస్ గా నా వంక చూసింది. నేను కావాలనే తనని ఇంకా భయపెడదాం అని వాళ్ళ అన్నను చూస్తూ అతని దగ్గరికి వెళ్ళా. అది చూసిన రూప అలాగే నిలబడి నేను ఏం చేస్తానోనని చూస్తోంది. నేను కోపంగా తన వంక లుక్స్ ఇస్తూ వాళ్ళ అన్న దగ్గరికి చేరుకున్నా. అక్కడ వాళ్ళ అన్న అవతల వైపుకు తిరిగి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చివరి సారి రూప వంక చూసా చెప్పమంటావా అన్నట్లు. రూప నన్ను సీరియస్ గా చూసింది. నేను కూడా అలాగే తనని చూసా.  ఏమనుకుందో ఏమో కానీ వెంటనే నాకు ఫోన్ చేసింది. నేను కూడా వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తూ తనేం చెప్తుందో అని చూసా.. అవతల నుండి రూప కోపంగా మాట్లాడుతూ చెప్పాలని ఉంటే చెప్పేసేయి, నేనేం భయపడను, ఎప్పుడైనా చెప్పాల్సిందే, కొంచెం ముందు చెప్తున్నావ్ అంతే, నీకంత దైర్యం ఉంటే చెప్పు, చూస్తా ఇక్కడే కూర్చుని అంటూ కోపంగా ఫోన్ పెట్టేసి అక్కడే కూర్చుంది. తనలా చేయగానే నేను కోపంగా తన వంక చూసా. తను నా వంక చెప్పుకో చూస్తా అన్నట్లుగా చూసింది. నేను తన వంక ఇంకా వాళ్ళ అన్న వంక కొద్దిసేపు మార్చి మార్చి చూస్తూ ఎందుకులే గొడవ పెద్దది చేయడం అనుకుని గట్టిగా నా కాలుని నేల ను కొడుతూ అక్కడ నుండి పక్కకు వచ్చేశా. రూప ఎదో జయించిన దానిలా నవ్వడం కనిపించింది.  ఆ క్షణం లో నేను రమేష్ కు విశయం చెప్పొచ్చు, కానీ నాకు అది ఇష్టం లేదు ఎందుకు అంటే ఈ విశయం తెలిస్తే కచ్చితంగా రమేష్ ఊరుకోడు, విశయం రూప వాళ్ళ నాన్న దగ్గరికి కచ్చితంగా వెళ్తుంది. అతని దగ్గరకు వెళ్ళాక 
మా ఇద్దరి కుటుంబాలలో మనస్పర్థలు రాకుండా ఉండవు. దీనివల్ల నా కంటే రూపే ఎక్కువ బాధ పడుతుంది పైగా ఇదంతా మొదలైంది నా వల్లనే కాబట్టి నాకు ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అందుకే నేను ఈ విశయం బయటకు చెప్పలేను. ఆ విశయం రూప కు కూడా బాగా తెలుసు అందుకే తను అంత దైర్యంగా ఉంది. 
తల పట్టేసి నట్లు ఉంటే పార్టీ నుండి వచ్చేశా. ఇంటికి వచ్చి స్నానానికి వెళ్ళా. ఒక పదైదు నిమిషాలు నీటి కిందే అలాగే ఉండిపోయా. ఆ షవర్ లో నుండి వస్తున్న నీటికి నా మెదడు కూల్ అవుతున్నట్లు అనిపించింది. చాలా సేపు అలా స్నానం చేసి తుడుచుకొని బయటకు వచ్చా. అలా వచ్చి షర్ట్ వేసుకుంటూ ఉండగా అప్పుడే వెనుక నుండి ఎదో వాయిస్ వినిపించింది. 
మా అన్నకు చెప్తే భయపడతాననుకున్నావా ? అంటూ.. 
నేను వెంటనే తల తిప్పి చూసా. అక్కడ డోర్ దగ్గర స్టైల్ గా నిలబడి ఉంది రూప. నేను తనని కోపంగా చూసా. తను నన్ను చూస్తూ ఎంటి ? ఏమనుకుంటున్నావ్ నువ్వు ? మా అన్నకు చెప్తే నిన్ను వదిలేస్తాననుకున్నావా ? నిజంగానే ?? అంటూ నన్ను చూసి వెకిలిగా నవ్వూతూ అంది నేను మౌనంగా చూస్తూ ఊరుకున్నా. తను అలాగే వెకిలిగా నవ్వుతూ అంతలోనే కాస్త సీరియస్ గా ఫేస్ పెట్టి నా దగ్గరికి వచ్చింది. అలా వచ్చి నన్నే చూస్తూ ఎందుకు చెప్పలేదు అంది. నేను ఊపిరి గట్టిగా పీల్చుకుని వదులుతూ, తల పక్కకి తిప్పేసుకున్నా తనని కేర్ చేయనట్లుగా. 
నేను అలా తల తిప్పుకోగానే నా తల ను తన వైపుకు తిప్పుకుంటూ ఏంటి ? పోగరా అంది. నేను కోపంగా చూసా. తను కూడా అలాగే చూస్తూ ఏంటి చెప్తావా ? ఎవరిని భయపెట్టిస్తున్నావ్ ? అంది. అలా అంటూ పో చెప్పు పో, ఇప్పుడే పో, వెల్లు అంటూ నన్ను వెనక్కి దొబ్బింది అలా దొబ్బగానే నేను వెనుక గోడకు దగ్గరగా వెళ్ళా. తను ముందుకు వస్తూ నా ఛాతీ మీద ఇంకోసారి దొబ్బుతు చెప్పుపో రా, అంది. అప్పటికే నేను గోడకు దగ్గరగా వచ్చేయడం తో కాస్త వెనుకకి వెళ్ళి గోడకు అనుకున్నా. అలా ఆనుకోగానే తను నా దగ్గరికి వచ్చి నా తలకు రెండు వైపులా చేతులు పెడుతూ వాటిని గోడకు ఆనించి నన్ను చూసింది. అలా చూస్తూ నన్ను ఊరికే రెచ్చగొట్టకు, నువ్వు అనుకుంటున్నావ్ ఏమో నువ్వు మా అన్న దగ్గరికి పోతేనో మా నాన్న దగ్గరికి పోతేనో నిన్ను నేను వొడిలేస్థానని, అంత ఆశలు పెట్టుకోకు అంటూ నా కళ్ళలోకి సూటిగా చూసింది. నేను మౌనంగా నిల్చున్నా. తను నన్ను అలాగే చూస్తూ నిన్నైతే నేను అస్సలు వోదలను అర్దం అయ్యిందా అంది. అలా అంటూ కాసేపు నన్ను చూసింది. నేను కూడా సైలెంట్ గా తననే చూస్తూ ఉన్నా. కాసేపటికి నా కళ్ళలోకి చూస్తూ నీకోటి చెప్పనా అంది నేను ఎంటన్నట్లుగా చూసా. తను నా కళ్ళలోకి చూస్తూ నాలాంటి ఫిగర్ దొరికితే ఎవ్వడైనా కళ్ళకద్దుకుని ఎగరేసుకు పోతాడు తెలుసా అంది. అలా అంటూ ఇంకా చెప్తూ అలాంటిది నువ్వెంట్రా ఇలా ఉన్నావ్ అంది. నేను తన మాటలు కేర్ చేయనట్లుగా ఫేస్ పెట్టా. తను అది చూసి కొంచెం బాధగా ఫేస్ పెడుతూ నిజంగా రా ఐ లవ్ యూ అంది. నేను తనని పట్టించు కొనట్లుగా ఫేస్ పెట్టాను. తను నన్ను చూస్తూ రేయ్ ఇటు చూడు అంటూ నా ఫేస్ తన వైపుకు తిప్పుకుంటూ నన్ను చూసి నిజంగా చెప్తున్నా అంది. నేను ప్లీజ్ ఇక వోదిలేస్తావా అని అన్నా. తను నన్ను చూసి కొంచెం వెనక్కు వచ్చేసింది. అలా వెనక్కి రావడం తో తనని నేను చూస్తూ పక్కకు వచ్చేశా. అలా వస్తున్న నన్ను చూసి రూప తనని తాను ఒకసారి చూసుకుని నా వంక చూస్తూ నేను ఏమైనా అందంగా లేనా ? అంది. నేను వెంటనే తన వంక చూసా. తను నా చూపును అర్దం చేసుకుని నా దగ్గరికి వస్తూ మరి ఏంటి నీ ప్రాబ్లెమ్ అంది. నేను వెంటనే ప్లీస్ వదిలేస్తావా అన్నా. తను మౌనంగా తల దించుకుంది. నేను పక్కకు రాబోయా. కానీ తను ఆపుతూ అలాగే తల దించుకుని కొంచెం సీరియస్ గా నిజం చెప్పు నీకేమైనా అది ప్రాబ్లెమ్ ఉందా ? అంది. అర్దం కానట్లుగా చూసా. తను నన్ను చూసి నీకు ఏమైనా లెగదా ? అంది. వెంటనే నేను కోపంగా చూసా. నేను అలా చూడడం చూసి రూప వెంటనే అపార్థం చేసుకోకు నేను వెక్కిరింపుగా అడగట్లేదు నిజంగా అడుగుతున్నా, అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, పర్లేదు అయినా నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ నన్ను చూసి నాకు నిజంగా కావాల్సింది ఇది కాదు ఇది అంటూ ఒకేసారి నా అంగం దగ్గర ఇంకా పైన నా గుండె (మనసు) దగ్గర చెయ్ పెట్టింది. తనలా కిందా పైన చెయ్ పెట్టగానే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే కోపంగా తన చేతులని తోసేస్తూ నీకేమైనా మైండ్ పోయిందా ? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావ్ అన్నా. తను సీరియస్ గా చూసింది. నేను తన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఇప్పుడు చెప్తున్నా విను అన్నా. తను నా వంక చూసింది. నేను తనని చూసి నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు ఏం చేసుకుంటావో చేసుకో పో, ఇలా ఇంకోసారి చేసావంటే అస్సలు బాగోదు చెప్తున్నా అంటూ చెప్పేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. రూప నేను అన్న మాటలకు ఏం చేయాలో తెలీక అక్కడే నిలబడి పోయింది. నేను రూం బయటకు వచ్చి హాల్ లో కూర్చున్నా. చాలా సేపటి వరకు రూప బయటకి రాలేదు. నాకు చిన్నగా కోపం తగ్గసాగింది. పాపం అనోసరంగా అన్నానేమో అని అనిపించింది. అంతలో రూప బయటికి వచ్చిన శబ్దం వినిపించింది. నేను తనని చూడాలి అనే అనుకున్నా కానీ ఎందుకో అవసరమా అన్నట్లుగా తనని చూడలేదు. రూప హాల్ లో వచ్చి నన్ను చూసి వెంటనే కోపంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. నేను వెంటనే వెళ్తున్న తనని వెనుక నుండి చూసా..

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#7

రాత్రి నేను పడుకునే లోపు update ఇస్తా

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 3 users Like dom nic torrento's post
Like Reply
#8

Episode 3

రూప : (మెలుకువ వచ్చి కళ్ళు తెరిచి నన్ను చూస్తూ) ఇవ్వాళ కూడా మేలుకునే ఉన్నావా ? 

నేను : హ్మ్మ్ (నవ్వుతూ)
రూప : (తొడల పై నుండి లేస్తూ), నన్ను పక్కకు జరిపి పడుకోవచ్చుగా 
నేను : నిద్ర రాలేదు 
రూప : కళ్ళు తెరిచుకుని నన్నే చూస్తూ కూర్చుంటే ఎక్కడ వస్తుంది,  పడుకుంటే వస్తుంది..
నేను : నేనేం నిన్ను చూడలేదు
రూప : మరి, చుట్టూ ఉన్న గాలిని చూస్తున్నావా ?
నేను : (తన పొట్ట పై చేయి వేసి నిమురుతూ) పుట్టబోయే బుల్లి రూప ను చూస్తున్నా.
రూప : అవునా.. 
అప్పుడే తెలిసి పోయిందా తమకు ఇది బుల్లి రూపే అని ?
నేను : అవును కచ్చితంగా అది బుల్లి రూపే..
రూప : కానీ నాకు బుల్లి వినయ్ కావాలి మరి..
నేను : ఏం నేను లేనా ? మళ్ళీ వాడేందుకు ?
రూప : మరైతే నీకు మాత్రం నేను చాలనా ? మళ్ళీ అదెందుకు ?
నేను : ఎందుకంటే ఈ పెద్ద రూప నన్నెప్పుడూ డామినేట్ చేస్తూ వస్తుంది అదే చిన్న రూప అనుకో నేను చెప్పింది వింటుంది, ఈ పెద్ద రూప లా చెయ్యదు
రూప : అలా అంటే నాకూ అంతే, ఈ పెద్ద వినయ్ నా మాట వినడం మానేశాడు, ఈ మధ్య బాగా కొవ్వు పట్టింది. అదే నా బుల్లి వినయ్ అనుకో, నా మాట వింటాడు నేను చెప్పింది చేస్తాడు, ఎదురు చెప్పడు ఈ పెద్ద వినయ్ లాగా
నేను : అవునవును, ఎదురు చెప్పడు, ఎగిరి తంతాడు అంతే
రూప : ఎందుకు తంతాడు, వాడు నా కొడుకు అలా ఏం చేయడు
నేను : ఎందుకు చేయడు ? నేనంటే వేస్ట్ ఫెలో ని కాబట్టి నువ్వు చెప్పిన దాని కంతా ఆ, వూ, అని అంటూ నీ చుట్టూ తిరిగా. అందరూ అలాగే ఉంటారు అనుకుంటున్నావా ?
రూప : (చిరు కోపంగా చూస్తూ) నీకు బాగా కొవ్వు పట్టింది రా, ఇందుకే నేను బుల్లి వినయ్ కావాలి అంటున్నా అంటూ నా పెదాలని తన పెదాలతో అందుకుంది. అలా అందుకుని చిన్నగా నన్ను వెనక్కి తోసేస్తూ నా మీద పడింది..

ఇంట్లో..
పొద్దున్న లేవగానే మా నాన్న మా అమ్మ తో కలిసి రామాయణం స్టార్ట్ చేసాడు. ఇదంతా రూప వలనే అని తెలిసినా కూడా నేను సైలెంట్ గా ఉన్నా. మా నాన్న ఇంకా మా అమ్మ ఇద్దరూ కాసేపు నన్ను అదీ ఇదీ అంటూ చివరికి వాళ్ళు ఏమైతే అనుకున్నారో అది చెప్పారు. నేను గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ మీకు కావాల్సింది ఇప్పుడు నేను దాని దగ్గర చేరి పని నేర్చుకోవడమే కదా అంతేనా అన్నా. దానికి మా నాన్న ఇంకా అమ్మా అంతే అన్నారు. నేను కోపంగా సరే ఎలాగోలా చావండి అని అంటూ అక్కడ నుండి నా రూం లోకి వచ్చేశా. నిజానికి ఇది మా అమ్మా నాన్నల మీద కోపం కాదు రూప మీద కోపం. తను ఇలా పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడా నాతో ఇలాంటివి అనడం ఏమీ బాగాలేదు. కానీ తనేమో నేనెంత చెప్పినా వినేలా లేదు. పైగా నేను ఎంత తప్పించుకోవడానికి చూసినా తను మాత్రం వదిలేలా కనిపించడం లేదు. అందుకే ఇక ఎలాగో తను అనుకున్నది సాధిస్తుంది కదా మళ్ళీ గొడవలు ఎందుకులే అన్నట్లుగా మా నాన్న తో సరే అని చెప్పేశా. కానీ మనసులో మాత్రం తన మీద ఇంకా కోపంగా గానే ఉన్నా. 
మా నాన్న నేను ఒప్పుకోవడం తో వెంటనే సంతోషంగా రూప కు మెసేజ్ చేసాడు. ఇక్కడ రూప సంగతి వేరేలా ఉంది, నిన్న రాత్రి గొడవ అయినప్పటి నుండి తన మనసు ఏమీ బాగాలేదు. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతూ కోపంగా ఉంది. అలా కోపంగా చిరాక్కా ఉండడం తో వాళ్ళ నాన్నకు ఇవ్వాళ ఆఫిస్ కు రాను అని కూడా చెప్పేసింది. ఇవ్వాళ ఒక ముఖ్యమైన మీటింగ్ ఉండడం తో దేవేంద్ర రూప ను రమ్మని మళ్ళీ అడిగాడు. కానీ రూప కోపంగా రాను అని చెప్పేసింది. దేవేంద్ర దీని మూడ్ బాలేదు ఏమో లే అని అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాసేపటికి మా నాన్న నుండి తనకు మెసేజ్ వచ్చింది, వస్తా అన్నాడు అంటూ.. అది చూడగానే రూప ముఖం వెలిగి పోయింది. వెంటనే ఉత్సాహంగా పైకి లేస్తూ గబ గబా స్నానం చేసేసింది. స్నానం చేసి మంచిగా స్కై బ్లూ కలర్ చీర కట్టుకుని, నీట్ గా రెడీ అయ్యింది. అలా అయ్యి మా నాన్నకు మెసేజ్ చేస్తూ ఇంకో పదహైదు నిమిషాలలోపు వస్తాను రమ్మని చెప్పండి అని పెట్టింది. దాంతో మా నాన్న ఆ మెసేజ్ ను చూసి రేయ్ రూప రెడీ అయ్యిందట త్వరగా రెడీ అవ్వు కలిసి వెల్డురు అన్నాడు. నేను కోపంగా రూం లో నుండి అడుస్తు ఏం అక్కర్లేదు నేనే డైరెక్ట్ గా వెళ్తా లే ఆఫిస్ కు అన్నా. దాంతో మా నాన్న మా అమ్మకు సైగ చేసాడు. కాసేపటికి చిన్నగా మా అమ్మ నా రూం లోకి వచ్చింది. నేను మా అమ్మ ను చూసి ఏం చెప్పి పంపించాడో చెప్పు అన్నా. అంతే ఆ మాట విన్న మా అమ్మ కొంచెం తడబడి మళ్ళీ మామూలు అవుతూ రేయ్ నాన్నా ఆమే వస్తా నన్నప్పుడు వద్దంటే ఏం బాగుంటుంది చెప్పు అంది. నేను కోపంగా ఇదేనా చెప్పి పంపాడు నీతో అన్నా. మా అమ్మ నా దగ్గరికి వస్తూ అంటే ఆయన చెప్తేనే ఇలా వచ్చా అనుకుంటున్నావా ? నిన్ను కూడా ఆయన చెప్తేనే కన్నాను అనుకుంటున్నావా ? అంది. నేను తన వంక చూసా. తను ప్లీస్ రా కన్నా చెప్పింది విను ఇదంతా నీ కోసమే కదా చెప్తుంది అంది. నేను తన ముఖం చూసి అబ్బా సరేలే వెళ్తా ఇక నువ్వు వెళ్ళు అన్నా. వెంటనే మా అమ్మ హ్మ్మ్ సరే అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. 
అప్పుడు అనిపించింది రేపొద్దున నాకు కూడా ఇలాగే ఒక కొడుకు పుడితే వాడికి డైరెక్ట్ గా చెప్పలేక ఇలా నా పెళ్ళాన్ని పంపించి వాడికి చెప్పిస్తానా ? అని. ఇంకో పడైదు నిమిషాల్లో రెడీ అయిన నేను బయటకు వస్తూ ఆలోచించా, కరెక్ట్ గా టైం కే పోవాలా ? లేట్ అయితే పోతే ఏమవ్వుద్ది ? అయితే తీసేస్తుంది జాబ్ నుండి లేదంటే మూసుకుని ఉంటుంది అంతే కదా అని అనిపించింది. వెంటనే మళ్ళీ రూం లోకి వెళ్తూ బెడ్ మీద కూర్చున్నా. కాసేపటికి బయట హార్న్ వినిపించింది. నేను కిటికీ లో నుండి చూసా. తను ఇంటి ముందు కార్ లో వుంది. నేను తన వంక చూసా. బ్లూ కలర్ శారీ లో అప్సరస లా తయారు అయ్యి వచ్చింది. నేను అనుకున్నా దీనెమ్మ ఎవడు చేసుకుంటాడో కానీ అదృష్టవంతుడు అని. అలా అనుకుంటూ ఉండగా అంతలోనే అదేదో నేనే చేసుకుంటే పోలా ? అని అనిపించింది. అంతే వెంటనే చి ఛీ ఇది దగ్గర నుండే కాదు దూరం నుండి కూడా నన్ను అట్రాక్ట్ చేస్తుంది, దీంతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే రూప ఇంకో సారి హార్న్ కొడుతూ పైన నేను నిలబడి ఉన్న విండో వంక చూసింది. తను చూస్తుంది అని వెంటనే పక్కకు తప్పుకున్నా. నేను అలా తప్పుకోవడం తనకి కనిపించింది. నేను అలా చేయడం చూసి ఉఫ్ అని అనుకుంటూ కూలింగ్ గ్లాసెస్ తీసేసి కార్ దిగింది. దిగి లోపలికి వచ్చింది. అలా వస్తుండగా ఇక్కడ మా అమ్మ నా రూం దగ్గరికి వచ్చింది. వచ్చి ఏరా ? ఇంకా రెడీ కాలేదా అంది. నేను లేదు మా ఇంకో అర గంట అని అన్నా. దాంతో మా అమ్మ ఇంత సేపు ఏం చేస్తున్నావ్ ? రూప కూడా వచ్చింది అంటూ ఉండగా అక్కడ రూప ఇంట్లోకి వస్తూ మా నాన్నకు హెలో చెప్పింది. మా నాన్న నవ్వుతూ విష్ చేసి ఇంకా రెడీ అవుతున్నాడు అన్నట్లుగా సైగ చేసాడు. దాంతో రూప నా రూం వంక చూసి నేను చూసుకుంటాలే అంటూ అక్కడ నుండి పైకి వచ్చింది. మా అమ్మ ఇక్కడ నా రూం దగ్గర ఉండడం చూసి ఆంటీ బాగున్నారా అంది. మా అమ్మ హా బాగున్నా రూప అంటూ రూప ను చూస్తూ వాడింకా రెడీ అవుతున్నాడంట అంది. దానికి రూప నవ్వి పర్లేదు ఆంటీ, నేను వెయిట్ చేస్థాలే మీరు వెళ్ళండి అంది. మా అమ్మ సరే నీ ఇష్టం అంటూ రూప దగ్గరికి వస్తూ ఇంకా మీ మధ్య గొడవలు చల్లారలేదా ? అంది. దానికి రూప నవ్వుతూ  ఎక్కడ ఆంటీ వాడేమో పిల్లోడు అయిపోయాడు, మెచ్యూరిటీ లేదు, ఎక్కడ చెప్పండి ? ఏది చెప్పినా టైం తీసుకుంటాడు అర్దం చేసుకోవడానికి అంటూ అయినా ఇది మాకు మామూలే గా ఆంటీ అంది. అలా అనగానే మా అమ్మ నవ్వుతూ రూప తల మీద నిమిరి నువ్వేనే వాడిని సరిగ్గా అర్దం చేసుకునేది అంది. రూప నవ్వి సరిగ్గా చెప్పారు ఆంటీ కానీ ఏం చేస్తాం కొందరికి అది అర్దం కాదు అంటూ నా రూం వంక చూసింది. మా అమ్మ నవ్వుతూ సరే కింద వుంటా అంటూ వెళ్ళిపోతూ అవునూ, తిన్నావా ? అంది. రూప లేదాంటి కొంచెం అర్జెంట్ పని ఉంది ఇద్దరం తరువాత కలిసి తింటాం లే బయట అంది. దాంతో మా అమ్మ వాడు తినలేదు అని నీకు ఎలా తెలుసు అంది. రూప నవ్వుతూ ఆంటీ వాడు నా ఫ్రెండు, నాకు తెలీదా వాడు ఎప్పుడు తింటాడో ఎప్పుడు పడుకుంటాడో అని అంది. మా అమ్మ సరే లే అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోగానే అక్కడే రూం ఇవతల వైపు డోర్ దగ్గరే నిల్చుని వాళ్ళ మాటలు వింటున్న నేను ఇది ఇప్పుడు ఏం చేస్తుందో అని అనుకున్నా. అలా అనుకుంటూ వుండగానే రూప తలుపు దగ్గరికి వచ్చి చిన్నగా డోర్ మీద కొడుతూ మెల్లగా నాకు మాత్రమే వినపడేలా విన్నూ, నీ బంగారాన్ని, నీ పెళ్లాన్ని వచ్చారా తలుపు తీయి అంది. అంతే తనలా అనేసరికి నాకు ఒక్కసారిగా కోపం వచ్చి వెంటనే వెళ్ళి తలుపు తీసా తనని తిడదాం అని. తను నవ్వుతూ కనిపించింది. నేను కోపంగా తనని లోపలికి లాగుతూ వాళ్ళకి వినిపిస్తే పరిస్థితి ఎంటో ఆలోచించావా ? అన్నా. తను నా బెడ్ మీదకు వెళ్ళి కూర్చుంటూ కంగారు పడకు విన్నూ, అలా చెప్తే కానీ వెంటనే తలుపు తీయవ్ అని అలా చెప్పా అంతే అంది. నేను కోపంగా తనని చూసి నీతో కొంచెం మాట్లాడాలి అన్నా. తను అవునా అంటూ నా వంక చూసి వెంటనే టైం వంక చూసింది. అలా చూస్తూ మళ్ళీ తిరిగి నాతో లేదురా బంగారూ టైం అయ్యింది త్వరగా వెళ్ళాలి మనం, అంటూ నన్ను చూసి సాయంత్రం ఎంచక్కా మాట్లాడుకుందాం సరేనా అంది. నేను వెంటనే తను నా మాట వినదు లే అని అనుకుని ఫాస్ట్ గా రెడీ అయిపోయా. సారి రెడీ అయినట్లు నటించా..
కాసేపటికి ఇద్దరం కార్ లో ఉన్నాం. రూప ఫాస్ట్ గా కార్ పోనిస్తుంది. నేను తనని మధ్య మధ్యలో చూస్తూ ఉన్నా. తను నేను అలా చూడడం చూసి నా వంక చూస్తూ ఏంటి బంగారూ అలా చూస్తున్నావ్ ఆకలి అవుతుందా అంది. నేను సీరియస్ గా తన వంక చూసా. తను ఏమైందిరా అలా ఉన్నావ్ చెప్పు అంది. నేను వెంటనే తల తిప్పేసుకుని బయటకు చూసా. ఇరవై నిమిషాల్లో ఆఫిస్ కు చేరుకున్నాం. ఆ రోజు అంతా తను ఎదో పనిలో మునిగిపోయింది. నాతో పెద్దగా టైం కూడా స్పెండ్ చేయలేదు. మొత్తం ఏవో మీటింగ్స్ అంటూ అటూ ఇటూ తిరగడమే సరిపోయింది తనకు. సాయంత్రం అవుతుండగా రమేష్ వచ్చాడు ఆఫిస్ కు. నన్ను చూసి హేయ్ ఏంట్రా ఇక్కడ ఉన్నావ్ అని అడిగాడు. అంతలోనే అక్కడికి రూప వస్తూ హేయ్ ఏంటి ? నువ్వు నా పియే ను పట్టుకుని రెస్పెక్ట్ లేకుండా అరేయి గిరేయి అంటున్నావ్ అంది. వెంటనే రమేష్ ఓహ్ ఇదెప్పటి నుండి అంటూ నా వంక చూసాడు. నేను దానికి రమేష్ కు ఎదో చెప్పబోతూ ఉంటే రూప మధ్యలో వస్తూ ఇవాళ్టి నుండే అంది. దానికి రమేష్ నన్ను చూస్తూ కానీ ఎందుకు ? అన్నాడు. అంతలో అక్కడికి దేవేంద్ర వచ్చి మమ్మల్ని చూస్తూ ఏంటి ఎదో డిస్కేషన్ పెట్టారు అని అన్నాడు. దానికి రూప అదే మన వినయ్ గురించి అడుగుతుంటే చెప్తున్నా అంది. దేవేంద్ర అవునా అంటూ రూప వంక చూసి నువ్వు చెప్పింది విన్నాక క్లయింట్ బాగా కన్విన్స్ అయ్యడమ్మా. నెక్స్ట్ వీక్ లో ఇంకో మీటింగ్ పెడతా అన్నారు. బహుశా అప్పుడు వాళ్ళ డెసిషన్ చెప్పొచ్చు అన్నాడు. దానికి రూప మీటింగ్ ఎక్కడ నాన్నా బెంగళూర్ అహ్ ? అంది. దేవేంద్ర అవును అన్నాడు. అలా అంటూ ఉండగా బెంగళూర్ అహ్ ? కానీ నాకు ఢిల్లీ లో వేరే పని ఉంది కదా నెక్స్ట్ వీక్ ఎలా మరి అన్నాడు రమేష్ దేవేంద్ర ను చూస్తూ. దానికి దేవేంద్ర నువ్వేం కంగారు పడకు, మన వినయ్ ఉన్నాడు గా రూప తో వెళ్తాడులే అంటూ నన్ను చూసి ఏమంటావ్ అంతేగా అన్నాడు. నేను హా అంతే అంతే అంకుల్ అన్నా. రూప నన్ను చూసి చిన్నగా నవ్వుకుంది. తను ఎందుకు నవ్విందో నాకు అర్దం కాలేదు బహుశా తనతో పాటు బెంగళూర్ కు వొంటరిగా వెళ్తానన్నందుకు అలా నవ్వింది అనుకుంటా. తరువాత దేవేంద్ర, రమేష్ ఇద్దరూ రూప తో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను రూప వంక చూసా  తను కాస్త అలిసి పోయినట్లు కనిపించింది. నేను ఇక వెళ్దామా అని అడిగా తనని. తను అప్పుడేనా అంది. నేను ఏం చేయాలి ఇక్కడ ఉండి అన్నా. తను నవ్వి నా చెవి దగ్గరికి వస్తూ అయితే పార్క్ కు వెళ్దామా అంది. నేను వెళ్దాం అన్నా. తను నా వంక ఆశ్చర్యంగా చూసింది. ఎంటి ? నువ్వేనా అంది ఒక్కసారిగా. నేను తనని చూసి ఆవేశపడకు, నేను నీతో మాట్లాడాలి అందుకే అన్నా. తను నిరాశగా ఫేస్ పెడుతూ అందుకా నేనింకా అంటూ ఎదో చెప్పబోతు ఆగిపోయి సరే వెళ్దాం పద అంటూ వాష్ రూం కు వెళ్లి ముఖం కడుక్కుని వచ్చింది. నేను తనతో బయలుదేరా. 
కార్ లో వెళ్తుండగా తన వంక చూసా. తను కూడా నా వంక చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. నేను ఫేస్ సీరియస్ గా పెట్టుకుని కూర్చున్నా. తను అది చూసి కొంచెం నవ్వొచ్చు గా అంది. నేను సీరియస్ గా ఒక లుక్ ఇచ్చా తను ఉఫ్ అని అనుకుంటూ డ్రైవ్ చేయడం లో ధ్యాస పెట్టింది. కాసేపటికి ఒక పార్క్ కు వచ్చాం. ఈ టైం లో ఈ పార్క్ లో పెద్దగా ఎవ్వరూ ఉండరని తను ఇక్కడికి తీసుకువచ్చింది అని అర్దం అయ్యింది. వెంటనే నేను కార్ దిగుతూ పార్క్ లోకి ఎంటర్ అయ్యా. తను కూడా  కార్ పార్క్ చేసి లోపలికి వచ్చింది. ఇద్దరం కలిసి పార్క్ లో ఎవ్వరూ లేని చోటికి వెళ్ళి కూర్చున్నాం. అలా కూర్చుని ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. తను చిన్నగా నవ్వింది. కానీ నేను నవ్వలేదు, తననే సీరియస్ గా చూసి తల తిప్పుకున్నా. తనకు నేను కోపంగా ఉన్నాను అని అర్దం అయ్యింది. అందుకే వెంటనే నవ్వు ఆపెసి కామ్ గా కూర్చుంది. నేను కూడా కామ్ గా కూర్చుని ఉన్నా. వచ్చి దాదాపు ఇరవై నిమిషాలు అవుతుంది. అయినా మేము ఒక్క మాట కూడా మాట్లాడు కోలేదు. నేనేం చెప్తానో అని తను, తనకు ఎలా చెప్పాలో అని నేను అలాగే ఉండిపోయాం. చాలా సేపు గడవడం తో నేను తనతో చెప్పాలి అనుకుంటున్న విశయాన్ని చెప్పడం మొదలు పెడదాం అనుకున్నా.. 
కానీ అంతలోనే రూప నాకు దగ్గరిగా జరుగుతూ ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూ ఉన్న నన్ను చూస్తూ దగ్గరికి వచ్చి నా భుజం పై తల పెట్టింది. నేను ఏమీ అనలేదు. తను అలా తల పెట్టినా నేను ఏమీ అనకపోవడం తో తను ఇంకొంచెం ముందుకు వెళ్ళి నా చేతిని పట్టుకుంది. నేను మౌనంగా కూర్చున్నా. తను కూడా మౌనంగా కూర్చుని ఉంది. నేను తనకి పొద్దున నుండి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నది చెప్దామని నోరు తెరిచా. కానీ అంతలోనే తను నోరు విప్పుతూ
నేనేంటే నీకు ఇష్టం లేదు కదా అంది. నేను తన వంక చూసా. తను నన్ను చూస్తూ ఇదేగా చెప్పాలి అని పొద్దున నుండి అనుకుంటున్నావ్ అంది. 
నేను ఏం పలకలేదు.. 
చెప్పు పర్లేదు అంది., 
నేను ఇక మౌనంగా ఉండడం ఆపి తన వంక చూస్తూ  అసలు నీకు ఏమైనా గుర్తు ఉందా  నీకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయ్యిందని, మీ అన్నకు ప్రేమ పెళ్ళిళ్ళు అంటే ఇష్టం లేదు అని, నువ్వు నాకంటే వయసులో మూడేళ్లు పెద్దా అని కొంచెం అయినా గుర్తుందా అన్నా తన వంక కోపంగా చూస్తూ. తను నేను అలా అనగానే తలెత్తి చూసింది. నేను మామూలుగానే ఫేస్ పెట్టి మీ నాన్న ఇచ్చిన మాట గురించి కానీ, మీ అన్న గురించి కానీ, నువ్వనుకున్నట్లు జరిగితే వచ్చే ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏమైనా కొంచెమైనా ఆలోచిస్తున్నావా నువ్వు ? అన్నా. తను సైలెంట్ గా చూసింది. నేను తనని చూసి అలాగే కంటిన్యూ చేస్తూ అయినా ఇన్నాళ్ల పరిచయం లో ఎన్నడూ లేనిది ఎందుకు నీకిప్పుడే ఇలా నాపై కోరిక కలిగింది ఎందుకు చెప్పు ? అన్నా. తను నా వంక అయ్యిందా అన్నట్లుగా చూసింది. నేను అది చూసి కొంచెం సీరియస్ గా ఇలా ఉంటే ఎలా రూప ? అన్నా. తను నన్ను చూసి ఎమైంది ఇప్పుడు కేవలం మా నాన్న ఇచ్చిన మాట తప్పుతున్నా, మా అన్నకు ఇష్టం లేకున్నా ప్రేమిస్తున్నా, నువ్వు నాకంటే చిన్న అయినా నిన్ను లవ్ చేస్తున్నా. అంతే కదా అంది ఇంకేమైనా ఉందా అన్నట్లుగా చూస్తూ.. 
నేను తన మాటలు విని ఆశ్చర్య పోతూ అంటే నీకు ఇవ్వన్నీ చేస్తున్నందుకు అస్సలు కొంచెం కూడా గిల్టీ లేదా అన్నా. తను లేదు అన్నట్లుగా చూసింది. నేను తనని చూసి ఒక్కసారి ఆలోచించు రూపా నువ్వు ఏం చేస్తున్నావో అంటూ తనని చూసి ఒకవేళ నువ్వు అనుకున్నదే చేస్తే మీ నాన్న ఏం కావాలి ? మీ అన్న ఏం కావాలి ? నిన్ను అంతలా ప్రేమించే నీ ఫ్యామిలీ పరువు ఏం కావాలి ? అసలు ఒక్కసారి అయినా ఆలోచించావా ? నువ్వు గానీ నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న ఇంకా మీ నాన్న కనీసం రమణ అంకుల్ ముందు తలైనా ఎత్తుకోగలుతారా ? అని అన్నా. అది విన్న రూప కోపంగా ముఖం అటు వైపుకు తిప్పుకుంటూ ఒక్కసారి గాలి పీల్చి వోదులుతు నన్ను చూసి ఒక్కటి చెప్పు అంటూ నేను పుట్టాను అని వాళ్ళు మాట ఇచ్చారా ? లేక వాళ్ళు మాటిచ్చారు అని నేను పుట్టానా ? అంది. నేను అది విని ఉఫ్ అని అనుకుంటూ తల పక్కకు తిప్పుకున్నా. నేనెలా తల తిప్పుకోవడం చూసి రూప నన్ను చూస్తూ, నాకు కేవలం పెళ్ళి మాత్రమే ఫిక్స్ అయ్యింది వినయ్ పెళ్లైపోలేదు అంటూ నా వంక చూసింది. నేను తనని చూసి నీకు పెళ్లి కాలేదు అని నాకూ తెలుసు రూపా, కానీ నీకు అర్దం కావడం లేదు ఆ పెళ్లి వెనుక ఉన్న మాట గురించి అన్నా. అలా అనగానే రూప కోపంగా నన్ను చూస్తూ ఏంట్రా మాట మాట అంటూ ఒకటే అంటున్నావ్ ? నువ్వేమైనా ఇచ్చావా వాడికి మాట చెప్పు ? అంది కోపంగా. అంతే నేను వెంటనే సైలెంట్ అయిపోయా. తను కూడా వెంటనే నార్మల్ అవుతూ సైలెంట్ అయిపోయింది. కాసేపు ఇద్దరం మాట్లాడుకోలేదు. కాసేపటికి రూప నా బుజం మీద చెయ్ పెడుతూ నిజమే మా నాన్న మాట ఇచ్చాడు, మా అన్న కు ప్రేమ అంటే పడదు, నువ్వు నా కంటే చిన్న వాడివి, కానీ నాకు ఇవ్వన్నీ ప్రాబ్లమ్స్ లా కనిపించడం లేదు. నన్నేం చేయమంటావ్ చెప్పు అంది. నేను తన వంక సీరియస్ గా చూసా. తను తల తిప్పుకుంది. నేను గాలి పీల్చి వదులుతూ కాసేపు మౌనంగా ఉండి, వెంటనే తనతో ఏమో రూపా నాకు ఇదంతా తెలీదు. నాకైతే ఇలా చేయాలి అని లేదు అంటూ తనని చూసి, నువ్వు నన్ను ప్రేమించినా, నేనైతే నిన్ను ప్రేమించలేను అన్నా. తను నా వంక సీరియస్ గా చూసింది. నేను అది చూసి నాకు తెలుసు నువ్వైతే నువ్వు అనుకున్నది ఎలాగైనా పట్టుపట్టి సాదిస్తావ్ అని కానీ ఈ విశయం లో మాత్రం  అలా జరగదు అని కచ్చితంగా చెప్తున్నా అన్నా తన వంక చూసి.  తను సైలెంట్ గా ఉంది. అది చూసి నేను కూడా సైలెంట్ అయిపోయా. 
కాసేపటికి రూప మాట్లాడుతూ వినయ్ నీ ప్రాబ్లెమ్ ఎంటి చెప్పు అంటూ నన్ను చూసింది. నేను మౌనంగా తనని చూసా. దాంతో తను నన్ను చూస్తూ నీ ప్రాబ్లెమ్ ఎంటి ? మా నాన్న మాటను నేను ఎదిరిస్తున్నా, మా అన్న కు ఇష్టం లేకుండా ప్రేమిస్తున్నా అంతే కదా అంది. నేనేం పలకలేదు. తను నన్ను చూసి నేను వాళ్ళని హ్యాండిల్ చేసుకోగలుగతాను వినయ్ నువ్వు దీనికే ఇంత భయపడాల్సిన అవసరం లేదు అంది. తను అలా అనగానే తన వంక చూసా. తను నన్ను చూసి ఇంకా చెప్తూ నేను వాళ్ళని కన్విన్స్ చేసుకోగలుగుతా  వినయ్, నన్ను నమ్ము, నీకు నా సైడ్ నుండి ఎటువంటి ప్రాబ్లెమ్ రాకుండా నేను చూసుకుంటాను అంది. అది విని నేను ఏమీ చెప్పలేక ఊరుకుండి పోయా.. 
నేను అలా ఏమీ అనకపోయే సరికి తను నాకు కొంచెం దగ్గరగా వచ్చింది. నేను ఏమీ అనలేదు తను నా బుజం మీద చెయ్ వేస్తూ నన్ను చూసి, అనోసరంగా వాటి గురించి అలోచించి మనసు పాడు చేసుకోకు వినయ్ వాళ్ళ గురించి నేను చూసుకుంటాను. అనోసరంగా వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తావ్ ? చెప్పు అంటూ నీకు మాత్రం నన్ను ప్రేమించాలి అని లేదా ఎందుకు మనసులో దాచుకుంటావ్ ?  అంది నన్ను ప్రేమగా చూస్తూ.  
తను అలా అనగానే నేను తనని చూస్తూ నేను మనసులో దాచుకున్నా అని నీకు చెప్పనా రూపా అన్నా. దానికి తను కొద్దిగా సీరియస్ గా చూసింది. నేను తల పైకి ఎత్తుతూ తనని చూస్తూ  రూపా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని అనుకోకు, నిజంగా నాకు అలాంటి ఉద్దేశం లేదు అన్నా. అలా అంటూ నేను నిన్ను ప్రేమించాలి అని కూడా అనుకోవడం లేదు అన్నా. ఆ మాట అనగానే రూప మొహం కోపంగా మారిపోయింది. నేను అది చూసి ఇంకా చెప్తూ నువ్వు అనుకోవచ్చు నేను ఇదేదో కావాలని చెప్తున్నా అని. కానీ కాదు, నిజంగా చెప్తున్నా అంటూ తనని చూస్తూ నాకు నిజంగా నీపై ఎప్పుడూ కూడా అలాంటి ఫీలింగ్సే కలగలేదు, అలాంటప్పుడు నేనెలా నిన్ను ప్రేమిస్తా చెప్పు అన్నా. అలా అంటూ, బహుశా బాడీ పరంగా నిన్ను చూసి అప్పుడప్పుడు అట్రాక్ట్ అయ్యనేమో అంతే కానీ నిజంగా నీ మీద పెళ్లి చేసుకోవాలి, నీతో బెడ్ షేర్ చేసుకోవాలి అన్న ఫీలింగ్స్ అయితే అస్సలు లేవు అన్నా. తను కొంచెం కోపంగా తల పక్కకు తిప్పుకుంది. నేను తన భుజం మీద చెయ్యి వేస్తూ తనని నా వంక తిప్పుకున్నా. తను నన్ను చూసింది. నేను తన కళ్ళలోకి చూస్తూ ఒకవేళ చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తూ పెరగకపోవడం, ఇంకా నువ్వు నన్ను ఇలా ఒక తమ్ముడిలా  కేర్ చేస్తూ ఉండక పోవడం ఉండడం జరిగి ఉన్నింటే బహుశా నిన్ను చూసిన మొదటి చూపు లోనే నీతో లవ్ లో పడే వాన్నేమో, కానీ ఇప్పుడు నాకు అలా లేదు, నేను నిజంగా నిన్ను ఆ ఉద్దేశం తో చూడలేక పోతున్నా అన్నా. 


మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#9

Next update nundi romance start avuthundi

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 4 users Like dom nic torrento's post
Like Reply
#10

(05-09-2021, 02:01 PM)DasuLucky Wrote:  డోమ్ భయ్యా.. అప్డేట్ ఎప్పుడు ఇస్తావు.. ?

nijaniki daily oka update iddam ani na plan
but now mood change ayyindi
nenu ikkada update icchina ventane paid story sites copy chesukuntunnayi adi chusi
rase uthsaham poyindi 
but slow ga ayithe update istha

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 4 users Like dom nic torrento's post
Like Reply
#11

EPISODE 4
గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజులు..
ఏంటి ఆంటీ విన్ను గాడు ఎక్కడ అని అడిగా చీర సరిగ్గా కట్టుకుంటూ. వినయ్ వాళ్ళ అమ్మ ఏమోనే తెలీదు, ఇంట్లోనే ఉన్నాడేమో ఇంకా అంది. నేను అవునా మధ్యాహ్నం నా డాన్స్ ప్రోగ్రాం పెట్టుకుని ఏమైంది వాడికి ఇంకా రాలేదు అని అంటూ చీర కట్టేసుకున్నా. వినయ్ అమ్మ ఇంకా మా అమ్మ ఇద్దరూ నన్ను చూసి ఎంత చక్కగా ఉన్నావే అని కాసేపు పొగిడారు. నేను వాళ్ళ పొగడ్తలు పెద్దగా పట్టించుకునే స్థితి లో లేను. ఎందుకు అంటే వినయ్ గాడు నిన్న మధ్యాహ్నం నుండి సరిగ్గా మాట్లాడడం లేదు. ఆ విషయమే నన్ను తొలిచేస్తూ ఉంది. కాసేపు ఉండండి ఇప్పుడే వస్తా అని మా అమ్మ ఇంకా వినయ్ అమ్మ కు చెప్పేసి రూం బయటకు వచ్చి వినయ్ గాడికి కాల్ చేశా. రింగ్ అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను ఛా వెధవ ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ కాసేపు వెయిట్ చేసి మళ్ళీ కాల్ చేశా. ఈ సారి కూడా లిఫ్ట్ చేయలేదు. అంతలో నా క్లాస్ మేట్ వచ్చాడు నన్ను చూసి వావ్ రూపా, ఏంజెల్ లా ఉన్నావ్ తెలుసా అన్నాడు. నేను లేని నవ్వు ఒకటి తెచ్చుకుని చిన్నగా నవ్వా. వాడు తిరిగి నవ్వుతూ ఇంకో టూ హవర్సే ఉంది అంతా ఒకే కదా అన్నాడు డాన్స్ ప్రోగ్రాం ను గుర్తు చేస్తూ. నేను హా అంతా ఓకే అని చెప్పా. దాంతో వాడు సరే మళ్ళీ వస్తా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కాసేపట్లో వాడితోనే నేను కలిసి డాన్స్ వేయబోతున్నా. నిన్న ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వాడు డాన్స్ లో భాగంగా నా నడుము పట్టుకున్నాడు. అది చాలా కామన్ అని నాకు తెలుసు కానీ వినయ్ గాడికి అది నచ్చలేదు. నేను అలా వేరే మగాడితో ఉండడం వాడికి పెద్దగా నచ్చదు. ఆ విశయం నాకు తెలిసినా కూడా వాడిని నేనే ప్రాక్టీస్ చేసే చోటికి తీసుకు వచ్చా. నా ఉద్దేశం లో డాన్స్ పార్టనర్ నడుము టచ్ చేయడం పెద్ద విశయం కాదు కానీ వాడికి అది పెద్ద విశయం అవుతుంది అని నేను అప్పుడు ఊహించలేదు. ఎంతకీ ఫోన్ తీయక పోయే సరికి నేనే ఆటో లో వాడి ఇంటికి వెళ్ళాను. కాలింగ్ బెల్ కొడితే వచ్చి తలుపు తెరిచాడు. నేను ఏం చేస్తున్నావ్ ఇంట్లో అన్నా వాడు ఏం లేదు ఊరికే క్రికెట్ చూస్తున్నా అని అన్నాడు. నేను ఇంట్లోకి అడుగు పెడుతూ నా ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని అడిగా. వాడు నాకు ఫోన్ చేసావా ? ఎప్పుడు అని అన్నాడు. నేను వాడి వంక సీరియస్ లుక్ ఇచ్చా. వాడు సోఫా దగ్గరికి వెళ్ళి అక్కడ పడి ఉన్న ఫోన్ తీసుకుని చూసాడు నా మిస్డ్ కాల్స్ ఉన్నాయ్. అది చూసి సారీ రూప నిజంగా సైలెంట్ లో ఉంది కావాలంటే చూడు అని అన్నాడు. నేను అదేం పట్టించు కొకుండా నా డాన్స్ ప్రోగ్రాం ఉంది అని గుర్తుందా నీకు అని అన్నా. దానికి వాడు హా గుర్తు ఉంది అని అన్నాడు. నేను పద వెళ్దాం అన్నా. వాడు కానీ అంటూ నసిగాడు. నేను ఏమైంది అన్నా. వాడు ఏం లేదు కాస్త uneasy గా ఉంది అని అన్నాడు. నేను సీరియస్ గా చూసా. వాడు నిజంగా నిజం చెప్తున్నా అని అన్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళి నీకేమైనా నచ్చకపోతే నాకు డైరెక్ట్ గా చెప్పు అంతే కానీ ఇలా ఆడపిల్ల లా చేయకు అని అన్నా. వెంటనే వినయ్ గాడు నేనేం చేశా అన్నాడు. నాకు తెలుసు వాడికి తెలుసు నేను దేని గురించి మాట్లాడుతున్నా అని. అందుకే డైరెక్ట్ గా వాడిని చూస్తూ చూడు డాన్స్ లో నడుము మీద చెయ్యి వేయడం అనేది చాలా చిన్న విశయం, నువ్వు దాన్ని అనోసరంగ పెద్దది చేయకు అని అన్నా. వినయ్ గాడు వెంటనే నేనేం చేశా, నేను చెప్పానా నీకు ? వాడు నీ నడుము మీద చెయ్యి వేయడం నాకు ఇష్టం లేదు అని ? చెప్పనా ? అన్నాడు కాస్త రెట్టించి, అలా అంటూ అయినా అసలు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావ్ ఇప్పుడు అని అన్నాడు ఏమీ తెలీదు అన్నట్లు. నేను కోపంగా వాడి వంక చూసి సరే అయితే నాతో రా డాన్స్ ప్రోగ్రాం కు అన్నా. వాడు కానీ నాకు అన్ ఈసీ గా ఉంది అని అన్నాడు. నేను వాడ్ని చూసి నువ్వు ఇప్పుడు రాక పోతే నేను మాత్రం నువ్వు ఆ నడుము విషయమే అడ్డం పెట్టుకుని రాకున్నావ్ అని అనుకుంటాను తరువాత నీ ఇష్టం అని అన్నా. వాడు ఏమను కున్నాడో ఏమో సరే వస్తా పద అన్నాడు. నేను స్మైల్ ఇస్తూ బయటకు నడిచా. ఆటో లో వెళ్ళేటప్పుడు వాడి చెయ్యి లో నా చేయి పెడుతూ వాడి చేతికి ముద్దు పెట్టా. వాడు ఏం అనలేదు. 
డాన్స్ ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. వాడ్ని కావాలనే ఫ్రంట్ రోస్ లో కూర్చోబెట్టా. నా డాన్స్ స్టార్ట్ అయ్యింది. వినయ్ గాడు నిన్న దేనికి అలిగాడో మళ్ళీ ఆ సన్నివేశం వచ్చింది. నా క్లాస్ మెట్ నా నడుము పట్టుకుని డాన్స్ వేస్తున్నాడు. అప్పుడు తల వాడి వైపే చూడాలి కాబట్టి వినయ్ గాడి వంక చూడలేక పోయా. ఆ స్టెప్ అయ్యాక వినయ్ గాడి రియాక్షన్ ఎంటో అని చూసా. అక్కడ వాడు లేడు. నేను భయపడి నట్లుగానే వినయ్ గాడు అప్పటికే పైకి లేచి బయటకు వెళ్ళిపోయాడు. నేను అది చూసి మనసులో వాడ్ని తిట్టుకుంటూ డాన్స్ కంప్లీట్ చేశా. 
ఎందుకు బయటకు వచ్చేశావ్ అన్నా కోపంగా వాడ్ని చూసి. వాడు ఏం లేదు నాకు కొంచెం కడుపు నొప్పిగా ఉంటే వచ్చేశా అని అన్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళి కాలర్ పట్టుకుంటూ పిచ్చి దాన్ని అనుకుంటున్నావా ? ఇదా నువ్వు చెప్పే కారణం ? ఇదో కారణమా అసలు అంటూ వాడి వంక చూసా. వాడు తల వంచుకుని ఉన్నాడు. నేను వాడ్ని చూసి ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పడం నేర్చుకో ఇలా ఆడంగి లా ప్రవర్తించకు అని అన్నా. అంతే వాడు కోపంగా నన్ను చూసాడు. నేను కూడా అలాగే చూసా. వాడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నేను పక్కన ఉన్న డస్ట్ బిన్ ను గట్టిగా తన్నా. సాయంత్రం వాడి ఇంటికి వెళ్ళా. వాడు లోపల కార్టూన్ నెట్వర్క్ చూస్తూ కనిపించాడు. నేను రావడం చూసి అటు తిరిగి పడుకున్నాడు. నేను వాడి దగ్గరకు వెళ్ళా. వాడు సైలెంట్ గా ఉన్నాడు. నేను బెడ్ మీదకు వెళ్ళి అక్కడే వెనుక గోడ కు అనుకుంటూ వాడిని చూసా. వాడు అటు వైపుకు తిరిగి పడుకుని ఉన్నాడు. నేను వాడి తల మీద చెయ్యి వేసా. వాడు ఏం అనలేదు. నేను వాడి చెవి దగ్గరకు పోయి సారి అన్నా. వాడు వెంటనే నా చేతిని విసిరి గొట్టాడు. నేను ఏమైంది సారి అన్నాగా అన్నా. వాడు పైకి లేస్తూ ఆడంగి వెధవను కదా నాకెందుకు సారి చెప్తున్నావ్ అన్నాడు. దానికి నేను వాడిని నా వంక తిప్పుకుని సీరియస్ గా చూస్తూ ఎవర్రా నిన్ను ఆడంగి అన్నది ? నిన్ను ఆడంగి అన్నవాళ్లు ఆడంగి అన్నా. వాడు అవును కరెక్ట్ గా చెప్పావ్ అని అంటూ పైకి లేచి అక్కడ అద్దం దగ్గరకు వెళ్ళాడు. నేను వాడి వెనుకకు వెళ్తూ ఇప్పుడేంటి ? నిన్ను బుజ్జగించి లాల పాడాలా ? అన్నా వాడి నడుము చుట్టూ చేతులు పెడుతూ. వాడు కదలకుండా అద్దం లో వాడి వెనుక ఉన్న నన్ను చూస్తూ అవసరం లేదు అన్నాడు ముభావంగా. నేను వాడి బుజం మీద తల పెడుతూ మరి ఎందుకు అంత కోపం అంటూ వాడ్ని నా వైపుకు తిప్పుకున్నా. వాడు ఏంటి అన్నట్లుగా చూసాడు. నేను వాడ్ని వెనుక అద్దం కు తగిలిస్తూ నా నడుమును నువ్వొక్కడివేనా ? ఇంకెవడూ టచ్ చేయకూడదా అని అన్నా కావాలని వాడ్ని వుడికిద్దాం అన్నట్లుగా. వాడు సైలెంట్ గా పక్కకు వెళ్ళాలని చూసాడు. నేను వాడ్ని ఆపుతూ ఇంత పోసేసివ్ అయితే ఎలా రా నువ్వు అన్నా. వాడు నా వంక కోపంగా చూసి నువ్వు మాత్రం నేను మీ అమ్మను గిళ్ళాను అని అప్పుడు పోసేశివ్ గా ఫీల్ అవ్వలేదా ? ఇప్పుడు నేను చేసిందే పోసెసివ్ గా అనిపించిందా నీకు ? అన్నాడు. 
అంతే నేను వాడ్ని కోపంగా చూస్తూ మధ్యలో మా అమ్మను ఎందుకు లాగుతావ్ అంటూ వాడి వంక సీరియస్ గా చూసి అయినా నువ్వు ఆరోజు చేసిన దానికి నేను ఇవ్వాళ చేసిన దానికి చాలా తేడా ఉంది అన్నా. 
వినయ్ : ఏం తేడా ఉంది చెప్పు ? 
నేను : (సీరియస్ గా) ఆరోజు నువ్వు ఇంటెన్షణ్ గా వెళ్ళి మా అమ్మ నడుము గిల్లావ్. కానీ నేను ఇక్కడ వాడు నా నడుము మీద చెయ్యి వేసినా, నాకెలాంటి ఫీలింగ్స్ లేవు అదే పెద్ద తేడా, అర్దం అయ్యిందా.
వినయ్ : అవునవును ఏ ఫీలింగ్స్ లేవు, అయినా ఒక పన్నెండేళ్ళ కుర్రాడు యాభై ఏళ్ల ముసలి దాని నడుము గిల్లితే వాడికి ఆమె మీద ఫీలింగ్స్ ఉన్నాయ్ అని అనుకునే నీలాంటి దాని దగ్గర మాట్లాడాలి ఫీలింగ్స్ గురించి.. 
నేను : మా అమ్మ ఏం ముసల్ది కాదు
వినయ్ : టాపిక్ డైరెక్ట్ చేయకు
నేను : సరే ఇప్పుడేంటి అప్పుడు మా అమ్మను నువ్వు ఏ ఫీలింగ్స్ లేకుండా గిళ్ళావ్ ఇప్పుడు వాడు నా నడుము మీద చెయ్యి పెట్టినా నాకు ఏ ఫీలింగ్స్ లేవు ఇద్దరం బ్యాలన్స్ అయ్యం గా ఇంకేంటి ? 
వినయ్ : ఏం లేదు, ఇక నువ్వు వెళ్తే నేను పడుకుంటా. 
వాడు అలా అని బెడ్ మీదకు వెళ్ళి మళ్ళీ కార్టూన్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. నేను అది చూసి జీవితాంతం అవే చూసుకుంటూ గడుపు అంటూ కోపంగా బయటకు వచ్చా. అక్కడ వినయ్ అమ్మ నన్ను చూసి కాసేపు మాటలు కలిపింది. నేను కూడా తనతో మాట్లాడుతూ కాసేపు టైం పాస్ చేశా. డిన్నర్ టైం అవ్వడం తో ఇక్కడే తిను అని అంది వినయ్ అమ్మ. నేను సరే అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా. వినయ్ అమ్మ వినయ్ గాడిని పిలిచింది. వాడు ముఖం సీరియస్ గా పెట్టుకుని వచ్చాడు. నాకు ఎదురుగా కూర్చుని ప్లేట్ లో అన్నం పెట్టుకున్నాడు. నేను వాడ్ని మధ్య మధ్యలో గమనిస్తూ ఉన్నా. నేను అలా వాడ్ని చూస్తూ తింటూ ఉండగా అప్పుడే వినయ్ వాళ్ళ నాన్న ఇంకా మా నాన్న ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. మా నాన్న నేను ఇక్కడే ఉండడం చూసి ఇక్కడున్నవా అంటూ నా దగ్గరికి వచ్చి నీకో గుడ్ న్యూస్ అని అన్నాడు. నేను ఎంటి నాన్న అది అన్నా. మా నాన్న సంతోషంగా ఇవ్వాళ నువ్వు డాన్స్ చేసింది మన శ్రీకర్ అంకుల్ ఉన్నాడు గా అతని ఫ్రెండ్ కొరియో గ్రాఫర్ అంట అతను నీ డాన్స్ వీడియో ని చూసి నీ లుక్స్ డాన్స్ రెండూ బాగున్నాయ్ అని అన్నాడట. నీకిస్టం అయితే నీకు ట్రైనింగ్ కూడా ఇస్తా అన్నాడంట. ఇందాకే ఫోన్ లో చెప్పాడు అంటూ నన్ను చూసి చెప్పాడు. అది విన్న వినయ్ వాళ్ళ అమ్మ బంగారు తల్లి దీని డాన్స్ చూసి నేను అప్పుడే అనుకున్నా ఇలాంటి ఆఫర్ ఎదో ఒకటి వస్తుంది అని అంటూ నా తలను నిమిరింది. వినయ్ వాళ్ళ నాన్న నా దగ్గరికి వస్తూ అయితే నువ్వు డాన్స్ వేసేది మేము టివి లో కూడా చూడబోతున్నాం అన్నమాట అన్నాడు. నేను వినయ్ గాడి వంక చూసా. వాడు మౌనంగా తల దించుకుని తింటున్నాడు. మా నాన్న నన్ను చూస్తూ నీకు ఓకే అని చెప్పమంటావా అన్నాడు ఆత్రుతగా చూస్తూ. నేను ఒక్కసారి ఊపిరి గట్టిగా తీసుకుని వదులుతూ మా నాన్న వంక చూసా. మా నాన్న నేను ఏం చెప్తానో అని చూస్తున్నాడు. నేను లేదు లే నాన్న నాకు ఇంట్రెస్ట్ లేదు అని అన్నా. దానికి అందరూ డల్ అయిపోయారు. నా వంక వినయ్ నాన్న చూసి ఎందుకే వెళ్లొచ్చు గా అన్నాడు. నేను ఆయన వంక చూసి మనసులో నేను వెళ్తే నీ కొడుకు పొసేసివ్ నెస్ తో సచ్చిపోతాడు అంకుల్ నీకేం తెలుసు అని మనసులో నవ్వుకున్నా. అలా నవ్వుకుని లేదు అంకుల్ నాకు ఇష్టం లేదు అని చెప్పా. వాళ్ళు కాసేపు నన్ను కన్విన్స్ చేయడానికి చూసారు. కానీ నేను గట్టిగా వొద్దు అని చెప్పేసరికి సైలెంట్ అయిపోయారు. నేను వినయ్ గాడిని అబ్జర్వ్ చేశా. వాడు మౌనంగా తినేసి వెళ్ళిపోయాడు. రాత్రి కాగానే నేను ఇంటికి వెళ్ళిపోయా. నా రూం లో పడుకుని ఉండగా ఎదో సౌండ్ వచ్చింది. నేను తలెత్తి చూసా. అక్కడ వినయ్ గాడు నా వైపు వస్తూ కనిపించాడు. నేను లేచి కూర్చున్నా. వాడు నా బెడ్ మీద వచ్చి కూర్చుని నా వంక చూడకుండా తల దించుకుని నాకోసం నువ్వేం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు. నేను వాడిని సూటిగా చూసా. వాడు నా వంక తిరిగి చూస్తూ నిజంగా చెప్తున్నా అన్నాడు. నేను ఉఫ్ అని అనుకుంటూ వాడి పక్కనే బెడ్ మీద వెల్లకిలా పడుకున్న. వాడు నా పక్కకు తిరిగాడు తిరిగి నీకే చెప్తుంది అని అన్నాడు. కానీ నేను వాడ్ని పట్టించు కోకుండ నా టి షర్ట్ పైకి జరిపా. ఇప్పుడు నా నడుము బొడ్డు రెండూ వాడికి కనిపించసాగాయి. వాడు నేను అలా చేయడం చూసి ఎందుకు నువ్వు ఇప్పుడు షో చేస్తున్నావ్ ఇలా అని అన్నాడు. నేను నవ్వుతూ ఇది నా ఇల్లు, నా బెడ్, నాకిష్టం వచ్చినట్లు ఉంటా నీకెందుకు రా అని అన్నా. వాడు నా టి షర్ట్ కిందికి లాగాలని చూసాడు. నేను వాడి చెయ్ పట్టుకుని నా నడుము మీద వేసుకున్నా. అలా వేసుకున్న వెంటనే వాడు తీసేయబోయాడు కానీ నేను అలాగే గట్టిగా పట్టేసుకున్నా. వాడు నా వంక చూసి ఏంటిది అన్నాడు. నేను నవ్వుతూ తెలీదా నీకు అన్నా. వాడు వొదులు అన్నాడు. నేను నువ్వే వదిలించు కో అన్నా. వాడు వదిలించు కోవడానికి చూసాడు కానీ నేను గట్టిగా పట్టేసుకున్న. వాడు ఏం తింటున్నావే ఇంత బలంగా ఉన్నావ్ అంటూ ఇంకా గట్టిగా ప్రయత్నించాడు. వాడలా చేస్తూ ఉంటే నేను వాడిని మురిపెంగా చూస్తూ వాడ్ని పక్కన బెడ్ మీద పడేసి వాడి పైకి ఎక్కా. వాడు నా వంక లెయి అన్నట్లుగా చూసాడు. నేను వాడి వంక చూస్తూ నా నడుము పట్టుకున్నా నీకేం ఫీలింగ్స్ లేవా అన్నా. వాడు చిరాకు గా ఏం ఫీలింగ్స్ కావాలి అన్నాడు. నేను వాడి చేతిని పట్టుకుని నా నడుము మీద పెట్టుకుంటు, ఏం మగాడివి దొరికావ్ రా నాకు, వేరే వాడ్ని పట్టుకొనివ్వవు, నువ్వూ పట్టుకోవు అన్నా నవ్వుతూ. వాడు సీరియస్ గా చూసాడు. నేను నవ్వుతూ సారి అన్నా. వినయ్ గాడు నన్ను అలాగే చూస్తూ మీ నాన్నకు ట్రైనింగ్ తీసుకుంటా అని చెప్పు అన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి మీద నుండి పక్కకు జరిగి వాడి పక్కనే పడుకుంటూ నాకు ఇష్టం లేదు అన్నా. వాడు నా వైపుకు తిరిగి నాకోసం ఇలా చేయకు నేనేం అంత పోసేసివ్ కాదు అన్నాడు. నేను వాడు వంక తిరిగి నువ్వు పోసేసివ్ అని కాదు నాకే ఇష్టం లేదు అన్నా. అలా అంటూ అయినా నువ్వు పోసేసివ్ అని బాధ పడకు, నాకు నువ్వు అలా ఉండడమే ఇష్టం అని అన్నా వాడి వంక తిరిగి వాడి ముఖాన్ని నా ఛాతీ మీద పడుకో బెట్టుకుంటూ. వినయ్ గాడు నా రెండు సళ్ళ మీద మెత్తగా పడుకుంటూ నాకోసం అయితే అలా చేయకు అని అన్నాడు. నేను వాడు తల మీద వెంట్రుకలను నిమురుతూ మరీ ఎక్కువ ఆలోచించకు రా అన్నా. వాడు నా నడుము చుట్టూ చెయ్ వేసి నన్ను వాటేసుకుని గట్టిగా పట్టుకున్నాడు. నేను వాడిని ఇంకా మీదికి లాక్కుంటూ నేను కూడా గట్టిగా వాటేసుకున్నా. అలా ఇద్దరం గట్టిగా వాటేసుకుని పడుకుండి పోయాం. రాత్రి మధ్యలో నాకు మెలుకువ వచ్చింది వాడు ఇంకా నన్ను అలాగే చిన్న పిల్లాడిలా వాటేసుకుని ఉన్నాడు. నాకు ఇది కొత్త ఏం కాదు, చిన్నప్పటి నుండి వాడు ఇలాగే నాతో పడుకుంటూ ఉన్నాడు. నేను కళ్ళు తెరిచి వాడి ముఖం వంక చూసా. వాడు ప్రశాంతంగా నిద్ర పోతున్నాడు. నేను వాడి ముఖం చూసి కాస్త నా తలని పైకి ఎత్తుతూ వాడి నుదురుని ముద్దు పెట్టుకున్నా. అలా పెట్టుకుని వాడి నిద్ర డిస్ట్రబ్ చేయకుండా అలాగే వాడ్ని చూస్తూ ఉండిపోయా. ఎందుకో నాకు వాడ్ని అలా చూస్తూ ఉండడం అంటే నాకు చాలా ఇష్టం, వాడ్ని నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా కూడా ఎందుకో వాడ్ని మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. అదేంటో నాకు తెలీదు గానీ వాడు మాత్రం నాతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి అని నా కోరిక. 
చిన్నప్పుడు మొదటి సారి వాడి కోసం వాడి క్లాస్ మేట్ చెంప చెల్లు మనిపించింది నాకు ఇప్పటికీ గుర్తు ఉంది. వాడు ఆ రోజు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చి రూపా రూపా వాళ్ళు నన్ను ఎడిపిస్తున్నారే అని ఐదో తరగతి చదువుతున్న వాడు నాతో అనగానే వెంటనే వెళ్లి వాడిని ఏడిపించిన వాళ్ళ క్లాస్ మెట్స్ ను గూబ గుయి మనేలా నాలుగు తగిలించా. ఆ తరువాత నిజానికి తప్పు చేసింది వీడే, వాళ్ళే పాపం అమాయకులు అని తెలిసింది. అలా వాళ్ళు తప్పు చేయక పోయినా కూడా వీడు ఏడ్చుకుంటూ వచ్చాడు అని వెళ్ళి వాళ్ళని కొట్టా., ఆ తరువాత అలా వాళ్ళని కొట్టినందుకు మా అమ్మ నన్ను వాడ్ని ఇద్దరినీ తిట్టి ఒక రెండు రోజులు గోల గోల చేసింది. నాకు మా అమ్మ కోటింగ్ ఇస్తే అక్కడేమో వాళ్ళమ్మ వాడికి కోటింగ్ ఇచ్చింది. కానీ వాడు విచిత్రంగా వాడి అమ్మ వాడిని ఎంత కొట్టినా ఎమనని వాడు, ఇక్కడ మా అమ్మ నన్ను తిట్టినందుకే వచ్చి డైరెక్ట్ గా వాడి బుజ్జి బుజ్జి చేతులతో మా అమ్మనే కొట్టడానికి ప్రయత్నించాడు. అది చూసి నేను చాలా ప్రవుడ్ గా ఫీల్ అయ్యా, అప్పటి నుండి కుదిరింది మా ఇద్దరికీ.. 
నేను ఎక్కడికి వెళ్ళినా వాడు లేకుండా వెళ్ళే దాన్ని కాదు, నాకు ఏ ఎమోషన్ వచ్చినా వాడితోనే షేర్ చేసుకునే దాన్ని, ఎక్కడికి వెళ్ళినా నాకు వాడు ఒక తోక లా వస్తాడు అని అందరూ అనేవాళ్ళు. కానీ నేను గానీ వాడు గానీ అవేం పట్టించు కునే వాళ్ళం కాదు. ఎప్పుడైనా వాడు కోపం తెప్పిస్తే డైరెక్ట్ గా వాడ్ని కొట్టేసే దాన్ని, అయినా సరే పాపం వాడు నన్ను ఏం అనేవాడు కాదు, బాధ అనిపిస్తే వెళ్ళి వాడి రూమ్ లో ఏడ్చుకుంటూ కూర్చునే వాడు. అంతేగానీ నాకు ఎదురు చెప్పే వాడు కాదు, ఏడ్చిన వెంటనే మళ్ళీ నా దగ్గరికే తిరిగి వచ్చి రూపా రూపా అంటూ తిరిగే వాడు. నాకు అది బాగా సంతోషాన్ని ఇచ్చేది. నేను వాడ్ని కొట్టినా కూడా ఆ తరువాత అంతకంటే బాగా వాడిని కేర్ చేస్తా అని వాడికి తెలుసు అందుకే వాడు నన్ను ఎప్పుడూ పూర్తిగా ద్వేషించే వాడు కాదు. ఒకరోజు వాళ్ళింట్లో వాళ్ళ అమ్మ తిట్టింది అని అర్థ రాత్రి ఇంట్లో నుండి ఎవ్వరికీ చెప్పకుండా బయటకు వచ్చేసి మా ఇంటికి వచ్చాడు. అది కూడా దొంగతనంగా మిద్దె పై నుండి వచ్చాడు. అలా రావడానికి నేను కూడా సహాయం చేసాను అనుకోండి. పొద్దున చూస్తే ఇంట్లో వాడు కనిపిస్తలేడు అని వాళ్ళ అమ్మ ఏడ్వడం మొదలు పెట్టింది. వాడు నాతో నేను ఇక్కడ ఉన్నా అని చెప్పకు అన్నాడు. నేను సరే అని వాళ్లకు కూడా విశయం చెప్పలేదు. వాళ్ళు ఇంట్లో నుండి నేను పారిపోయాను అని అనుకున్నారు. అలా అనుకుని టెన్షన్ పడుతూ సెక్యూరిటీ అధికారి కంప్లైంట్ ఇవ్వడం వరకు వెళ్లారు. కానీ అంతలోనే నేను ఇక మరీ ఎక్కువ చేస్తే బాగోదు అని అనుకుని వాళ్లకు విశయం చెప్పేశా. అది విన్న మా పేరెంట్స్ మా ఇద్దరినీ చెడా మడా తిట్టారు. విన్ను గాడ్ని అయితే వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకు పోయి ఫుట్ బాల్ ఆడుకుంది. తరువాత రోజు వాడు మళ్ళీ అదే చేసాడు. ఈ సారి దొంగతనంగా కాకుండా డైరెక్ట్ గా మా ఇంట్లోకి వచ్చి మా అమ్మతో నేను రూపా తోనే పడుకుంటా అని అన్నాడు. మా అమ్మ వాడి అమ్మకు ఫోన్ చేసింది. వాడి అమ్మ వచ్చి వాడికి ఇంకో రెండు తగిలించి వాళ్ళ ఇంటికి తీసుకు పోయింది. కానీ వాడు అక్కడితో ఆగలేదు బెడ్ రూం లో కూర్చుని రూపా రూపా అని గట్టిగా అరవడం మొదలు పెట్టాడు. వాళ్ళ అమ్మ వచ్చి ఇంకోసారి రూపా అన్నాఓ కాళ్ళు చేతులు విరగ్గొడతా అని బెదిరించింది. కానీ వీడు తగ్గలేదు. ఇంకా గట్టిగా రూపా రూపా అని అరిచాడు. అదంతా చూస్తున్న వాళ్ళ నాన్న ఎందుకే వాడిని అరిపిస్తావ్ అని అంటూ పోరా పోయి దానితోనే పడుకో పో అని అన్నాడు. అప్పుడు నుండి మొదలైంది ఇద్దరం ఓకే చోట పడుకోవడం. వాడు రోజూ మా ఇంటికి వచ్చి పడుకునే వాడు. అప్పుడప్పుడు మా అమ్మ అనేది మా నాన్నతో అది పెద్దగయ్యింది ఇలా వాడితో పడుకోవడం ఏం బాగుంటుంది అని. కానీ మా నాన్న దాన్ని పెద్దగా పట్టించు కొక పోగా పోనీ లేవే దానికి తమ్ముడే కదా వాడు అని అన్నాడు. అప్పటి నుండి మా నాన్న చెప్పడం తో మా అమ్మ ఈ విశయం లో జోక్యం చేసుకోలేదు. అలా మేము ఓకే రూం లో ఒకే బెడ్ మీద రోజూ పడుకునే వాళ్ళం. ఒకరోజు మా ఇంటికి బంధువులు వస్తె మా అమ్మ నా రూం లోనే మా అన్నను కూడా పడుకోమని చెప్పింది. కానీ అప్పటికే నేను ఇంకా నా డార్లింగ్ విన్ను గాడు వాటేసుకుని పడుకుని ఉన్నాం. అది చిన్న బెడ్ కావడం తో మా అన్న కాస్త సర్దుకుంటూ పడుకోవాలని చూసాడు. రాత్రి మధ్యలో ఎదో కదలిక వస్తుంటే లేచి చూసా. మా అన్న వినయ్ గాడితో గొడవ పెట్టుకున్నాడు. నువ్వు కింద పడుకో అంటే నువ్వు కింద పడుకో అంటూ. నేను అది చూసి కోపంగా నిద్ర లో ఉన్నట్లుగా నటిస్తూ మా అన్నను కాలితో గట్టిగా కొట్టా. అంతే దెబ్బకు వాడు కింద పడిపోయాడు. విన్ను గాడు నా వంక చూసాడు. నేను కళ్ళు తెరిచి కన్ను కొట్టా. వాడు నవ్వి నన్ను వాటేసుకున్నాడు. కింద పడిన మా అన్న అమ్మా అమ్మా అని అరుస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. బయట మా అమ్మ రమేష్ ను చూసి ఏంటిరా ఏమైంది అని అంది. రమేష్ గాడు జరిగింది చెప్పాడు. దాంతో వాడ్ని పట్టుకుని నా రూం కు వచ్చింది. కానీ అంతలో నేను, విన్ను గాడు ఇద్దరం చేతులు కాళ్ళు బార్లా చాపుకుని బెడ్ మీద కొంచెం కూడా స్పేస్ లేకుండా పడుకున్నాం. మా అమ్మ అది చూసి నాటకాలు వేస్తున్నారు వీళ్ళు బాగా అని అంటూ అక్కడే వున్న ఒక పిల్లో ని తీసుకుని నా ముఖం మీదికి వేసింది. నేను సైలెంట్ గా కళ్ళు మూసుకుని ఉండిపోయా. మా అమ్మ మా ఇద్దరినీ చూసి పదరా నాతో పడుకుందువు వీళ్ళు మాట వినరు లే అని అంటూ మా అన్నను తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే నేను ఇంకా విన్ను గాడు కళ్ళు తెరిచి ఒకరిని ఒకరం చూసుకుని నవ్వుకున్నాము. తరువాత పెద్దగయ్యే కొద్దీ మా మధ్య రిలేషన్ ఇంకా గట్టిగా అవుతూ వచ్చింది. ఒకరోజు నేను వినయ్ గాడి ఇంట్లో నా ప్యాంటీ వదిలేసి వచ్చాను. ఆరోజే వాడి అమ్మ వాడి రూమ్ క్లీన్ చేయడానికి వచ్చింది అలా వచ్చినప్పుడు వినయ్ గాడి డ్రాయేర్ లతో పాటు నా ప్యాంటీ కనిపించింది తనకు. అది చూడగానే మా అమ్మకు ఫోన్ కొట్టి జరిగింది చెప్పింది. అంతే వెంటనే మా అమ్మ ఆగమేఘాల మీద నా రూం లోకి వస్తూ ఇంకో సారి వాడి రూం కు వెళ్లావ్ అంటే చంపుతా అని బెదిరించింది. మనం బెదిరి పోతామా ? గట్టిగా నా రూం కు లాక్ వేసుకుని ఒక రోజంతా తినకుండా కూర్చున్నా. దెబ్బకు మా నాన్న అమ్మా, ఇంకా వినయ్ గాడి అమ్మా నాన్న అందరూ దిగి వచ్చారు. నా రూం బయట నిలబడి డోర్ కొడుతూ తీయవే తలుపు అని అంటూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పా, వినయ్ గాడితో నన్ను పడుకొనిస్తా అంటేనే నేను తలుపు తీస్తా అని. దానికి వాళ్ళు సరెలేవే ముందు తలుపు తీయి అని అన్నారు. కానీ నేను వాళ్ళ మాటలు నమ్మలేదు, వెంటనే వాళ్ళతో నిజంగా నన్ను పడుకొనిస్తాను అని మా అమ్మ మీద వొట్టేసి చెప్పండి అని అన్నా. అంతే మా అమ్మ షాక్ అయ్యింది. తరువాత మా నాన్న మెల్లగా తలుపు తడుతూ రేయ్ నాన్నా నా మీద నీకు నమ్మకం ఉంది కదా నేను నీకు మాట ఇస్తున్నా నువ్వు ఎప్పుడైనా వాడితో పడుకో ఎవ్వరూ ఏమనరు సరేనా అన్నాడు. అప్పుడు తీసా తలుపు. ఇలా నాకూ వాడికి మధ్య చాలానే జరిగాయి. ఎన్నో గొడవలు, దెబ్బలాటలు కూడా జరిగాయి. కానీ మేము ఎప్పుడూ విడిపోలేదు. ఎప్పుడూ కలిసే వున్నాం. నాకు వాడంటే ప్రాణం వాడికి నేనంటే ప్రాణం. అది ఇద్దరికీ తెలుసు ఒకరికి ఒకరు నోటితో చెప్పుకోవాల్సిన పని లేదు. అందుకే దీన్ని నేను జీవితాంతం కంటిన్యూ చేయాలి అని వాడికి ఐ లవ్ యూ చెప్పా. కానీ వాడేమో మా నాన్న ఇచ్చిన తొక్కలో మాట కోసం నన్ను దూరం పెడుతూ నేనెంటే అస్సలే ఇష్టం లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. పైగా ఇందాక ఒక డైలాగ్ కూడా చెప్పాడు నువ్వు నన్ను ఇలా ఒక తమ్ముడిలా కేర్ చేస్తూ ఉండక పోవడం జరిగి ఉన్నింటే బహుశా నిన్ను చూసిన మొదటి చూపు లోనే నీతో లవ్ లో పడే వాన్నేమో, కానీ ఇప్పుడు నాకు అలా లేదు, నేను నిజంగా నిన్ను ఆ ఉద్దేశం తో చూడలేక పోతున్నా అంటూ.
చెత్త వెధవ, ఎవడికి చెప్తున్నాడు కహానీలు, నాకు తెలీదా వాడి గురించి ? వాడు చెప్పాలా నాకు వాడి ఉద్దేశాలు ఎంటో ?. 
చెత్త వెధవ.. చెత్త వెధవ..
 పార్క్ లో...
వాడు ఇందాక కూర్చున్న చోటే ఇంకా కూర్చుని ఉన్నాడు. నేను వాడిని దూరం నుండి అటూ ఇటు తిరుగుతూ చూస్తున్నా. వాడు నన్ను కాస్త భయంగా చూస్తూ ఉన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపటికి వాడు ఏమనుకున్నాడో ఏమో తెలీదు కానీ నా దగ్గరికి మెల్లగా వచ్చాడు. నేను వాడ్ని చూడనట్లుగా తిరుగుతూ ఉన్నా. వాడు నన్ను చూస్తూ రూపా అని పిలిచాడు. నేను పలకలేదు. వాడు నా దారికి అడ్డు వస్తూ నేను చెప్పేది విను అన్నాడు. నేను తలెత్తి వాడి వంక చూసా. వాడు నన్ను కన్విన్స్ చేయడానికి ఎదో చెప్పాలని చూసాడు. అంతే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే వాడి కాలర్ పట్టుకుంటూ నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానారా నీకు ? అన్నా. వాడు ఏమైంది అన్నట్లుగా చూసాడు. నేను కోపంగా వాడి కాలర్ అలాగే పట్టుకుని నీకిస్టం లేకున్నా నిన్ను ప్రేమించి నీ వెంట నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని పడడానికి నేనేమైనా పిచ్చిదాన్నా అన్నా. వాడు షాక్ గా అలా చూస్తూనే ఉన్నాడు. నేను వాడితో నువ్వు మా నాన్నకో మా అన్నకో లేక ఇంకెవరికో భయపడ్డాను అని చెప్పు అర్దం చేసుకుంటా అంతే కానీ ఉన్న ప్రేమను కూడా లేదు అని చెప్పావో జాగ్రత్తా అని కోపంగా వాడిని తోసేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. 

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#12

(29-09-2021, 08:54 PM)Eswar P Wrote:  డోమ్ బ్రో బిజీ అనుకుంటా ఎక్కడ జాడ లేదు.

kastha busy ayyanu

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#13

chaala busy ayipoyaanu friends
sorry for late

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#14

EPISODE 5

పార్క్ లో...
వాడు ఇందాక కూర్చున్న చోటే ఇంకా కూర్చుని ఉన్నాడు. నేను వాడిని దూరం నుండి అటూ ఇటు తిరుగుతూ చూస్తున్నా. వాడు నన్ను కాస్త భయంగా చూస్తూ ఉన్నాడు. నేను సీరియస్ గా ఫేస్ పెట్టి వాడి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపటికి వాడు ఏమనుకున్నాడో ఏమో తెలీదు కానీ నా దగ్గరికి మెల్లగా వచ్చాడు. నేను వాడ్ని చూడనట్లుగా తిరుగుతూ ఉన్నా. వాడు నన్ను చూస్తూ రూపా అని పిలిచాడు. నేను పలకలేదు. వాడు నా దారికి అడ్డు వస్తూ నేను చెప్పేది విను అన్నాడు. నేను తలెత్తి వాడి వంక చూసా. వాడు నన్ను కన్విన్స్ చేయడానికి ఎదో చెప్పాలని చూసాడు. అంతే నాకు ఒక్కసారిగా కోపం వచ్చింది. వెంటనే వాడి కాలర్ పట్టుకుంటూ నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానారా నీకు ? అన్నా. వాడు ఏమైంది అన్నట్లుగా చూసాడు. నేను కోపంగా వాడి కాలర్ అలాగే పట్టుకుని నీకిస్టం లేకున్నా నిన్ను ప్రేమించి నీ వెంట నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని పడడానికి నేనేమైనా పిచ్చిదాన్నా అన్నా. వాడు షాక్ గా అలా చూస్తూనే ఉన్నాడు. నేను వాడితో నువ్వు మా నాన్నకో మా అన్నకో లేక ఇంకెవరికో భయపడ్డాను అని చెప్పు అర్దం చేసుకుంటా అంతే కానీ ఉన్న ప్రేమను కూడా లేదు అని చెప్పావో జాగ్రత్తా అని కోపంగా వాడిని తోసేసి అక్కడ నుండి బయటకు వచ్చేశా. 


గ్రాడ్యుయేశన్ చేస్తున్న రోజుల్లో..
రూప : నీళ్ళు రావట్లేదూ..
నేను : నేను అప్పుడే చెప్పానా ? విన్నావా నువ్వు ?
రూప : సర్లే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు
నేను : నీ ఇంటికెల్లు
రూప : స్నానం మధ్యలో ఉన్నా రా 
నేను : అయితే ఎంటి ? టవల్ చుట్టుకొని వెల్లు.
రూప : ఛంపుతా, ముందు వచ్చి ఏమైందో చూడు..
నేను : (విసుగ్గా) నాకు తెలీదు, నేనైతే ముందే చెప్పానా, వాటర్ ప్రాబ్లెమ్ ఉందని, వద్దన్నా వెళ్ళావ్ గా, అనుభవించు
రూప : రేయ్ టైం అవుతుంది రా, నీ సోది వచ్చాక వింటాలే, ముందు ఇక్కడకు వచ్చి ఎదోకటి చెయ్
నేను : (చిరాగ్గా మొబైల్ పక్కన పడేస్తూ బాత్రూం దగ్గరకు వెళ్ళి) సరే తలుపు తెరువు ఏమైందో చూస్తా.  
టవల్ తీసి వొంటికి చుట్టుకుంటూ తలుపు తెరిచింది రూప.
తనని కింది నుండి పైకి సీరియస్ గా చూస్తూ లోపలికి అడుగు పెట్టా. తను తలుపు వేసేసింది. నేను వెళ్లి షవర్ దగ్గర ఉన్న రిపేర్ సంగతి చూస్తున్నా. తను వెనుక నుండి త్వరగా అంది. నేను కోపంగా తన వైపు ఒక చూపు చూసా. వెంటనే తను సారీ సారీ అంటూ మెళ్ళగానే చేయి లే అంది. నేను మళ్ళీ పనిలో పడ్డా. రిపేర్ చేయడానికి పది నిమిషాలు పట్టింది. అది అయిపోతూ వుండగా ఒక్కసారిగా బయట నుండి నా రూం లోకి ఎవరో వచ్చిన సౌండ్ వినిపించింది. అది ఎవరై ఉంటారు అని ఊహించే లోపే, రమేష్ గొంతు వినిపించింది. వినయ్ అంటూ..
నేను పని అయిపోవడం తో బాత్రూం లో నుండి బయటకు వెళ్తూ వాడి వంక చూసా. అప్పుడే వాడి వెనుక నుండి రూప వాళ్ళ అమ్మ వస్తూ ఏం వినయ్ రూప ఎక్కడ ? అంది. నేను బాత్రూం నుండి పూర్తిగా బయటకు వచ్చి డోర్ మూసేస్తూ లోపల స్నానం చేస్తుంది ఆంటీ అన్నా. తను అవునా సరే త్వరగా రమ్మను అని కాసువల్ గా అనేసి బయటకు వెళ్తూ అంతలోనే ఎదో డౌటు వచ్చి తిరిగి నా వంక చూసింది. నేను ఏంటి అన్నట్లుగా చూసా. తన అమ్మ డౌటు ఎంటో అర్దం చేసుకున్న రమేష్ వెంటనే నాతో, అది స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావ్ రా లోపల అన్నాడు. నేను మామూలుగానే ఫేస్ పెట్టి నీళ్ళు రావట్లేదు అంటే చూడడానికి వెళ్ళా అని చెప్పా. రూప వాళ్ళ అమ్మ వెంటనే సిగ్గు లేదు అలా ఆడపిల్ల స్నానం చేస్తుంటే వెళ్ళడానికి అంది. నేను నాకెందుకు సిగ్గు తనే పిలిచినప్పుడు అన్నా. తను కొంచెం కోపం నటిస్తూ ఇద్దరికీ మరీ ఎక్కువ చనువు అయిపోయింది రా వెంటనే ఎదో ఒకటి చేయాలి లేకపోతే హద్దు మీరేలా ఉన్నారు అంది. ఇదంతా లోపల నుండి వింటున్న రూప కోపంగా నీళ్ళు రావట్లేదు అంటే వచ్చాడు లే మా, దీనికే సీన్ క్రియేట్ చేయకు అంది. దానికి వెంటనే రూప అమ్మ, ముందు నీకు ఎక్కువైందే, ఆడపిల్లలా ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు నీకు, అయినా మనింట్లో స్నానం చేయకుండా ఇక్కడకెందుకు వచ్చావే అంది. దానికి రూప ఎదో చెప్పబోతు ఉండగా అప్పుడే మా అమ్మ బయట నుండి వస్తూ ఏమే ఇక్కడ ఏం చేస్తున్నావ్ త్వరగా రా పని ఉంది అని అంటూ లోపలికి వచ్చింది. రూప అమ్మ నా వంక ఒకసారి చూసి మళ్ళీ మామూలుగా మా అమ్మ తో పద వస్తున్నా అంటూ బయటకు వెళ్ళింది. రమేష్ గాడు నా వంక చూసాడు. నేను స్మైల్ ఇచ్చా, వాడు ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. 
ఇవ్వాళ వాడి బర్త్ డే. ఇంట్లో గ్రాండ్ గా పార్టీ ఆరెంజ్ చేశారు. సాయంత్రం అవుతూ ఉండగా రమేష్ బర్త్ డే పార్టీ కి వాడి ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చారు. పార్టీ గ్రాండ్ గా జరుగుతూ ఉంది. ఎప్పటి లాగే నేనూ రూప ఇద్దరం ఒకరిని ఒకరం విడిచి పెట్టకుండా తిరుగుతూ ఉన్నాం. అలా మేము తిరుగుతూ ఉన్నది దూరం నుండి రమేష్ ఫ్రెండ్ ఒకడు గమనిస్తూ ఉన్నాడు., వాడు మమ్మల్ని గమనించడం ఇది మొదటి సారి ఏం కాదు, ఎప్పటి నుండో మమ్మల్ని ఇలాగే గమనిస్తూ ఉన్నాడు. వాడి గురించి చెప్పాలంటే వాడికి రూప అంటే చాలా ఇష్టం, నేను రూప తో తిరగడం, రూప తో క్లోస్ గా ఉండడం వాడికి అస్సలు నచ్చదు. అందుకే వాడ్ని నేను ఎప్పుడు చూసినా నా వంక కోపంగా చూస్తూ కనిపిస్తాడు. నన్ను ఎప్పుడెప్పుడు పక్కకు తప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ రూప వైపు నుండి నాకు బలమైన సపోర్ట్ ఉండడం వల్ల వాడు నన్ను ఏం చేయలేక పోతున్నాడు. కానీ నేను ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని మాత్రం కళ్ళలో వొత్తులు వేసుకుని మరీ చూస్తూనే ఉంటాడు. వాడు అలా నా గురించి ఆలోచిస్తున్నాడు అని నాకు అప్పుడు తెలీదు. అందుకే ఆ పార్టీ లో ఎప్పటి లాగే రూప తో ఎలా ఉంటానో అలా ఉన్నా  
రమేష్ గాడికి వాడు ఒక రకంగా మంచి ఫ్రెండ్ అనే చెప్పాలి, వాడి మాట కచ్చితంగా రమేష్ గాడు వినే తీరతాడు అలాంటి ఫ్రెండ్షిప్ వాళ్ళది. అంత మంచి ఫ్రెండ్షిప్ ను వాడు తన లవ్ సక్సెస్ చేసుకోవడానికి యువుస్ చేసుకుంటాడు అని నాకు అప్పుడు తెలీదు. నేను ఇంకా రూప ఇద్దరం రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉండడం చూపిస్తూ వాడు అనుకున్నది చెప్పడం మొదలు పెట్టాడు రమేష్ కు. నేను రూప ను లవ్ చేస్తున్నా అని, అమాయకమైన రూప ను బుట్టలో వేసుకుంటున్నా అని, ఎవ్వరూ లేనప్పుడు తనని ఫిజికల్ గా కూడా టచ్ చేస్తున్నా అని, ఇంకా ఛాన్స్ ఇస్తే ఇది చాలా దూరం వెళ్తుంది అని, ఇలా ఏవేవో చెప్పేశాడు. అలా చెప్పి అంతవరకు నా మీద పెద్దగా అనుమానం లేని రమేష్ గాడికి నామీద డౌటు కలిగేలా చేసాడు. పైగా రూప తో నేను క్లోజ్ గా ఉండడం ఇంకా పొద్దున బాత్రూం లో ఇద్దరం ఒకేసారి ఉండడం వంటివి చూడడం తో వాడికి నా మీద డౌటు రావడానికి పెద్దగా టైం కూడా పట్టలేదు..
పార్టీ అయిపోయెంత వరకూ రమేష్ గాడు మమ్మల్నే గమనిస్తూ ఉన్నాడు. రూప తో దగ్గరగా కలిసి మెలిసి తిరుగుతూ ఉండడం, చనువుగా తనని ముట్టుకోవడం, తను కూడా నా మీద పడిపోతూ నవ్వడం లాంటివి చూస్తూనే ఉన్నాడు., అవ్వన్నీ చూస్తూ ఉండగా దాన్ని ఇంకా రెచ్చగొట్టాలనే ఉద్దేశం తో వాడి ఫ్రెండ్ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ను కలుపుకుని వాడి ముందు నన్ను బాడ్ చేయడం మొదలు పెట్టాడు. అదంతా తెలీని నేను మామూలుగానే రూప తో ఎప్పటిలా ఎలా ఉంటానో అలా ఉన్నా. పార్టీ అయిపోతూ ఉండగా నేనూ రూపా ఇద్దరం తినడానికి వెళ్ళాం. నేను చైర్ మీద కూర్చుని తింటూ ఉంటే తను నా ముందు నిలబడి నాకు మాటలు చెప్తూ తింటూ ఉంది. అలా తింటూ ఉండగా దూరంగా నిలబడి మా వైపే చూస్తున్న రూప అమ్మ నెమ్మదిగా మా దగ్గరికి వచ్చింది. వస్తూ తినేప్పుడు కూడా మాటలేనా మీకు అంది. రూప తన అమ్మ వంక చూస్తూ మాట్లాడితే ఏమైంది నీకు అంది. రూప అమ్మ నా పక్కన ఉన్న చైర్ లో కూర్చుంటూ నీకు చాలా ఎక్కువైందే, మీ నాన్న ఏం అనడం లేదు అనేగా ఇదంతా, ఉండు త్వరలోనే నీ కథ ఎంటో చూస్తా అంది. రూప అదేం పట్టించుకోకుండా ఏమైనా చేసుకోపో అన్నట్లుగా చూసి అంతలోనే ఎదో గుర్తొచ్చి నా వైపు తిరిగి తిన్నాక ఫోటోలు దిగుదామా, అలా అని అంటూ అక్కడ ఫోటోగ్రాఫర్ పెట్టిన పోస్టర్ ను చూపించి అంది. అందులో ఒక జంట డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో పెళ్లి ఫోటోలు తీయించుకుని ఉండడం కనిపించింది. అది చూసి నేను సమాధానం ఇచ్చే లోగా రూప అమ్మ రూప ను చూసి హా దిగు దిగు, తరువాత మీ నాన్న వచ్చి పల్లు రాలగొడతాడు అంది. వెంటనే రూప కోపంగా తన అమ్మ ను చూసింది. రూప అమ్మ నన్ను రూప ను ఇద్దరినీ చూస్తూ ముందు మీ ఇద్దరికీ దూరం పెంచాలి లేకపోతే మరీ ఎక్కువ చేస్తున్నారు అని అంది. అంతే వెంటనే రూప కోపంగా ప్లేట్ పక్కన పెట్టేసి., కూర్చున్న నా దగ్గరికి వచ్చి నా తొడ మీద కూర్చుంది. అలా కూర్చుని వాళ్ళ అమ్మ వంక చూసి ఈ మాత్రం దూరం చాలా అంది. రూప అమ్మ వెంటనే చుట్టూ చూసింది. అక్కడ పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. వెంటనే కోపంగా చిన్న పిల్లవా ? లేవ్వు ముందు అని అంది. రూప నేను లేవను అన్నట్లుగా చూసింది. రూప అమ్మ ఇంకా ఎదో అనేలోపు మా వైపు కు రూప అమ్మ ఫ్రెండ్ ఒకరు రావడం కనిపించింది. అంతే వెంటనే రూప అమ్మ రూపను చూసి నీ సంగతి ఉందిలే తరువాత అని అంటూ పైకి లేచి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ రూప ను చూసి కనీసం బయట వాళ్ళ ముందు అయినా మర్యాదగా ఉండు అని తన ఫ్రెండ్ రావడం చూపించి లేవమని ఇండైరక్ట్ గా చెప్తూ నవ్వు ముఖం పెట్టుకుని వస్తున్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళింది. అలా తన దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి చూసింది. ఇక్కడ రూప ఇంకా నా మీదే కూర్చుని ఉంది. అది చూసి రూప అమ్మ ఇది మారదు అని అనుకుంటూ తన ఫ్రెండ్ కు మేము కూర్చుంది కనిపించకూడదు అని తనని అటు వైపుకు తీసుకువెళ్ళింది.  
అదంతా చూస్తున్న నేను రూప తో., ఆంటీ తో ఎందుకు గొడవ చెప్పు ? లేవొచ్చు గా ఏమవుతుంది అన్నా మెల్లగా. అంతే ఆ మాట కు రూప సర్రున తల వెనక్కి తిప్పి నా వంక చూసింది. నేను కోపంగా తల తిప్పి చూస్తున్న రూప ను చూసి కొంచెం వాయిస్ తగ్గించి రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా ఫేస్ పెట్టి.. 
అంటే, ఆంటీ ఫీల్ అవుతుంది కదా అని అన్నా. 
తను అలాగే కోపంగా చూస్తూ మరి నన్ను నిన్ను దూరం చేస్తా అని అనడం కరెక్ట్ యేనా ? అంది కాస్త గట్టిగ. నేను వెంటనే ఏం చెప్పాలో తెలీక ఎదో నిన్ను ఊరికే అలా ఉడికించడానికి అని ఉంటారులే అన్నా. దానికి వెంటనే రూప ఎన్టీ ఊరికేనా ? మా అమ్మ నా ? నీకు తెలీదా తన గురించి ? చిన్నప్పటి నుండి అంతే ఎప్పుడు చూడు మనిద్దరిని దూరం పెట్టాలి అనే చూస్తుంది. అయినా తను ఊరికే అంటుందో లేక సీరియస్ గా అంటుందో నాకైతే తెలీదు. నాకు మాత్రం మనిద్దరి మధ్య గ్యాప్ వచ్చేలా ఎవరు మాట్లాడినా నాకు నచ్చదు. నువ్వు నా సొంతం, మా అమ్మే కాదు చివరికి నువ్వు కూడా మనిద్దరి మధ్య దూరం వచ్చేలా ఏదైనా చెప్పావో చంపేస్తా, అర్దం అయ్యిందా అంటూ నా కళ్ళలోకి సూటిగా చూసి అంది. నేను తన సీరియస్ నేస్ చూసి కొంచెం చల్లబడెలా తనతో ఇప్పుడు మనల్ని ఎవ్వరూ దూరం చేయరు లే, నువ్వు ఎంత వొద్దు అన్నా నేను నీ బెస్టి నే, నేను ఎంత వొద్దు అన్నా నువ్వు నా బెస్టివే. దాన్ని ఎవ్వరూ మార్చలేరు లే కానీ ముందు నా మీద నుండి లేయి అటు వైపు నుండి ఎవరో వస్తున్నారు చూస్తే బాగోదు అన్నా. అంతే వెంటనే తను నా వంక చూసి ఎంట్ర మా అమ్మే అనుకుంటే నువ్వు కూడా ఇలా తయారయ్యావ్ ? అంటూ నా వంక కాస్త సీరియస్ గా చూసి కూర్చుంటా రా ఇలాగే కూర్చుంటా, ఎవరు వస్తారో రాని, చూస్తే చూస్తారు అంతే కదా ? అయినా నేను కూర్చుంటే నీకెందుకు రా అంత నొప్పి అని అంటూ నా తొడ మీద నుండి లేచి సరిగ్గా నా అంగానికి తన పిర్రలు అనించి పెడుతూ నా మీదకు వచ్చి కూర్చుంది. వయసులో ఉన్న మేము ఇద్దరం అలా కూర్చుని ఉండడం చూసిన ఎవరైనా కచ్చితంగా అపార్థం చేసుకునే లాంటి పొస్తర్ లో కూర్చున్నాం మేము. 
ఇది ఇలా ఉండగా అప్పుడే అటు వైపుకు వచ్చిన రమేష్ ఇంకా వాడి ఫ్రెండ్ మేము ఇలా కూర్చుని ఉండడం చూసారు. వెంటనే రమేష్ ఫ్రెండ్ చూసావా రా ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారో అందుకే చెప్పా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకు రా అని అంటూ రమేష్ గాడికి మా మీద కోపం వచ్చేలా నాలుగు మాటలు చెప్పాడు. అవ్వన్నీ విన్న రమేష్ గాడు మా దగ్గరికి వచ్చాడు. మమ్మల్ని చూసి రూప అడ్డు లే అని అన్నాడు . తను ఎందుకు అంది. నేను ఏమీ అర్దం కనట్లుగా ఫేస్ పెట్టి చూస్తున్నా. రమేష్ గాడు వెనక్కి తిరిగి వాడి ఫ్రెండ్ వంక చూసి మళ్ళీ రూప తో రూప లేస్తావా లేదా ? అన్నాడు. రూప దేనికో చెప్పు అంది. రమేష్ గాడు కోపంగా వాడి మీద అలా కూర్చున్నావ్ సిగ్గు లేదు ముందు లేయి అన్నాడు. రూప వెంటనే కూర్చుంటే నీకెందుకు అని అంది. వెంటనే రమేష్ గాడు కోపంగా నీకు ఇలా కాదే ముందు వీడిని తన్నాలి అప్పుడే నీకు బుద్ది వస్తుంది అంటూ రూప ను లాగి పక్కకు ఈడ్చి, నా వైపు కోపంగా చూసి పొద్దున బాత్రూం లో అది స్నానం చేస్తుంటే కూడా వెళ్ళావ్ చూడు అప్పుడే నిన్ను కొట్టిండాల్సింది రా తప్పు చేశా అంటూ నన్ను మొహం మీద కొట్ట బోయాడు. కానీ అంతలోనే నా ఏంజెల్ గార్డె (రూప) వచ్చి రమేష్ గాడిని పక్కకు తోసేసింది. రమేష్ గాడు వాడి ఫ్రెండ్ వైపు చూసాడు. వాడు గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాడు. వాడు అలా చూస్తూ ఉండగా రూప తోసేయడం రమేష్ కు నచ్చలేదు. వెంటనే రూప ను కొట్టడానికి చెయ్ ఎత్తాడు. అంతే రమేష్ అంటూ కోపంగా రూప అమ్మ గొంతు వినిపించింది దూరం నుండి. రూప అమ్మ కోపంగా మా దగ్గరకు నడుచుకుంటూ వచ్చింది. రమేష్ వాడి అమ్మతో చూడమ్మా ఇది సిగ్గు లేకుండా వినయ్ గాడితో అంటూ ఆగాడు. రమేష్ అమ్మ రూప ను ఇంకా నన్ను చూసి రమేష్ గాడితో ఇంటికెళ్ళక మాట్లాడుకుందాం అని అంది. రమేష్ గాడు కానీ మా అని ఇంకేదో అనబోతు ఉండగా రూప అమ్మ కొంచెం గట్టిగా ఇంటికెళ్లక మాట్లాడదాం అని చెప్పి నా వంక చూసి వినయ్ నువ్వు మీ ఇంటికెళ్లు అని అంది. అలా అని రూప తో ఇంకో పది నిమిషాల్లో ఇంటికి వస్తా అంతలోపల నువ్వు బుద్దిగా నీ రూమ్ లో ఉండాలి లేదంటే కాళ్ళు విరగ్గొడతా అంటూ కోపంగా చూసింది. ఇంకో మూడు నిమిషాల్లో ముగ్గురం మా దారిన మేము వెళ్ళాం. 
రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. పొద్దున లేచాక రూప కనిపించలేదు. సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికి వచ్చాక రూప అమ్మ ఇంకా మా అమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండడం కనిపించింది. రూప అమ్మ నన్ను చూసి ఫ్రెష్ అయ్యి రాపో అని అంది. నేను సరే అంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా. తను నన్ను పక్కన కూర్చో పెట్టుకుంది. మా అమ్మ నా వంకే చూస్తూ ఉంది రూప అమ్మ నాతో, నిన్న జరిగిన దానికి ఫీల్ అయ్యావ అంది. నేను లేదు ఆంటీ అన్నా. తను నన్ను చూసి తను చెప్పాలి అనుకున్నది చెప్పడం మొదలు పెట్టింది. నేను వయసులో ఉండడం ఇంకా రూప కూడా వయసులో ఉండడం, ఇద్దరం ఒకే బెడ్ మీద పడుకోవడం ఇంకా నిన్న ఒకే బాత్రూం లో ఇద్దరం ఉండడం, పైగా రాత్రి తను నా మీద అలా కూర్చోవడం అన్నీ చెప్తూ వయసులో ఉన్నవాళ్లు ఇలా ఉండడం కరెక్ట్ యేనా ? చెప్పు అంది. నేను ఏం పలకలేదు తను ఇంకా కొన్ని సంఘటనలు చెప్తూ ఇలా మీ ఇద్దరూ ఈ వయసులో అలా ఉండడం ఏమైనా బాగుంటుందా చెప్పు అని అంది. నేను సైలెంట్ గా ఉండిపోయాను. మనసులో మాత్రం తనకు ఎదోకటి సమాధానం చెప్పాలి అని అనుకుంటున్నా. ఏం చెప్పాలి అని ఆలోచించు కుంటు ఉండగా అక్కడే నిలబడి నా వంక చూస్తున్న రమేష్ గాడు కనిపించాడు. నేను వాడ్ని చూసి తల వంచుకున్నా. 
రూప అమ్మ నా మీద చేయి వేసి ప్రేమగా చూస్తూ నువ్వు పెద్దోడివి అవుతున్నావ్, వయసులో ఉన్నావ్ ఇలాంటి సమయాల్లో రూప తో ఒకే బెడ్ మీద పడుకోవడం ఒకే బాత్రూం లో ఉండడం, ఒకరి మీద ఒకరు పడడం లాంటివి చేయడం మంచిదేనా ? అంది. అలా అంటూ
మాకంటే మీరిద్దరి మీదా ఎలాంటి చెడు అభిప్రాయం లేకపోవచ్చు కానీ చూసే వాళ్ళకు ? 
వాళ్లకు ఎలా ఉంటుంది చెప్పు ?
అందుకే చెప్తున్నా మీరిద్దరూ ఫ్రెండ్లీ గా ఉండండి తప్పు లేదు, కానీ హద్దే మీరకండి బాగుండదు..
పైగా మీరేదో తప్పుగా వ్యవహరిస్తారు అని కాదు కానీ కొంచెం అయినా పద్ధతిగా ఉండడం మనకూ చూసే వాళ్లకూ మంచిదే కదా, సమస్య వచ్చిన తరువాత కంటే అసలు సమస్యే రాకుండా చేసుకోవడం మంచింది కదా అని చెప్తున్నా అంది..
నేను మౌనంగా కూర్చుని ఉండిపోయా..
అది చూసి తను మెల్లగా, నేను చెప్పేది నీకు నచ్చక పోవచ్చు కానీ,వయసులో ఉన్నారు, చనువుగా ఉన్నారు, ఒకే బెడ్రూం లో పడుకుంటున్నారు, మేము ఈ మాత్రం అయినా చెప్పక పోతే ఎలా చెప్పు ? తనంటే మా మాట వినదు కనీసం నువ్వైనా వింటావ్ అని చెప్తున్నా..
మీరిద్దరికీ ఎలాంటి దురుద్దేశం లేదు అని నాకు తెలుసు కానీ వయసు ప్రభావం అనేది ఉంటుంది కదా, అది దాని ప్రభావం మీమీద చూపించినప్పుడు మీరు దాన్ని గుర్తించగలగాలి కదా అందుకే చెప్తున్నా ఈ జాగ్రత్త అంతే. నువ్వేం ఇంకా పిల్లోడివి కాదు, పెద్దొడివి అయ్యావ్ ఎవరితో ఎంతవరకు ఉండాలో కూడా నేర్చుకోవాలి, ఇప్పుడు నేను చెప్పేది నచ్చక పోయినా కూడా ఎందుకు చెప్తున్నానో అర్దం చేసుకో తరువాత నీ ఇష్టం, అంటూ సైలెంట్ అయిపోయింది.
అంతా వింటున్న నాకు ఏం చెప్పాలో తెలియలేదు. కానీ ఎదో ఒకటి చెప్పాలి లేక పోతే నాకూ రూప కు మధ్యలో ఒక గోడ కట్టేస్తారు అని మాత్రం అర్దం అయ్యింది. పైగా రమేష్ గాడు కూడా ఇక్కడే ఉన్నాడు. వాడికి ఇంకా ఎక్కువ అనుమానం. పైగా ఇలాంటివి అంటే అస్సలుకే నచ్చదు. అందుకే వెంటనే ఎదో ఒకటి చేసి వీళ్ళ నుండి మా ఇద్దరి బాండింగ్ ను కాపాడు కోవాలి అని అనిపించింది. ఒకవేల నేను ఇప్పుడు కానీ కాపాడు కొలేక పోతే నెక్స్ట్ ఇక ముందులా నేను రూప తో దగ్గరగా ఉండలేను. చనువుగా మాట్లాడలేను. ఎదో ఒకటి చెప్పి వీళ్ళ నుండి బయట పడాలి, ఎం చెప్పాలి ? ఎం చెప్పాలి ? అని అనుకుంటూ ఉన్నా.
 మనసు వేగంగా ఆలోచిస్తూ ఉంది. ఏదేదో ఆలోచనలు వస్తూ ఉన్నాయ్. కానీ ఏదీ అంత స్ట్రాంగ్ గా లేదు. త్వర త్వరగా ఆలోచిస్తూ ఎం చెప్పాలా అని అనుకుంటూ ఉండగా ఒక ఐడియా తట్టింది. అంతే వెంటనే తలెత్తి రూప అమ్మ వంక చూసా. తను ఏమైనా చెప్పాలా అన్నట్లుగా చూసింది. నేను ఒక్కసారిగా ఆలోచించా. తనకు డైరెక్ట్ గా ఎం చెప్పినా కూడా తను విన్నట్లే విని మళ్ళీ నన్ను డైవర్ట్ చేయాలి అనే చూస్తుంది అలాంటప్పుడు చెప్పినా వేస్ట్ కదా అని అనిపించి వెంటనే తనను వేరే విధంగా అప్రోచ్ అవుదాం అని అనిపించింది. 
ఒకసారి నాకూ రూప కు మధ్య జరిగినవి అన్నీ గుర్తు తెచ్చుకున్నా తనని ఎం జరిగినా వోడులుకోకూడదు అని ఒకసారి గట్టిగా అనుకుని రూప అమ్మ వంక చూసా. 
  తను నేను ఎం చెప్తానా అని చూస్తూ ఉంది. తనలా ఎం చెప్తానా అని చూస్తూ ఉండడం చూసి నేనే కావాలని పైకి లేస్తూ నా రూం వైపు నడిచా. నేను అలా చేయడం చూసి నేనేదో చెప్తా అని ఎక్స్పెక్ట్ చేసిన మా అమ్మ రమేష్ ఇంకా రూప అమ్మ ముగ్గురు నేనలా సైలెంట్ గా వెళ్ళడం చూసి విచిత్రంగా చూసారు. నేను మౌనంగా నా రూం వైపుకు కదిలా. నేను అనుకున్నట్లు గానే రూప అమ్మ గొంతు పెగిలింది. వినయ్ అంటూ..
నేను మనసులో నవ్వుకున్నా. 
రూప అమ్మ : ఏమైంది ?
నేను : ఎం లేదు లే ఆంటీ
రూప అమ్మ : మరి ఎందుకు అలా వెళ్ళిపోతున్నావ్ ?
నేను : ఎం లేదులే ఆంటీ
రూప అమ్మ (నా దగ్గరికి వస్తూ) : చెప్పు రా ఏమైంది ?
ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నావా ? చెప్పు పర్లేదు
నేను : లేదు లే ఆంటీ, నేనేమ్ చెప్పలేను,
ముఖ్యంగా మీకు అయితే అస్సలు చెప్పలేను అన్నా 
(రూప అమ్మ అర్దం కానట్లు చూసింది)
నేను అది చూసి మీకు కావలసినట్టు గానే చేసుకోండి ఆంటీ మీ ఇష్టం నేనేం అడ్డు చెప్పను అంటూ మళ్ళీ రూం దగ్గరికి వెళ్ళా వెళ్తున్న నన్ను అర్దం కానట్లు గా చూస్తూ వచ్చి ఆపింది. ఆపి నన్ను చూసి అసలు ఏమైంది చెప్పు అంది. నేను మనసులో ప్లాన్ వర్కవుట్ అవుతుంది లే అని అనుకుంటూ తనని చూసి ఇద్దరు ఆడ మగ కలిసి ఉంటే తప్పుగా అర్ధం చేసుకోవడం కంటే గొప్పగా ఆలోచించ లేని మీకు నేను ఎం చెప్పగలను లే ఆంటీ నన్ను క్షమించండి అంటూ పక్కనే ఉన్న రమేష్ గాడి వంక కూడా చూసి సారీ రమేష్ మీ చెల్లి తో అలా ఉన్నందుకు అంటూ ఇద్దరి వంక చూసి ఇకపై మీరు చెప్పినట్లు గానే రూప తో దూరంగా ఉంటాను అంటూ వాళ్ళ రియాక్షన్ పట్టించు కోకుండా నా రూం లోకి వచ్చేశా. 

రూప అమ్మ, రమేష్ ఇంకా మా అమ్మ ముగ్గురు ఒకరినొకరు ఎం అర్దం కానట్లుగా చూసుకున్నారు. కాసేపు అయ్యాక నా రూం తలుపు తెరుచుకుంది. రూప అమ్మ, మా అమ్మ రమేష్ ఇంకా మా అక్క మొత్తం నలుగురు లోపలికి వచ్చారు. నేను ఇటు వైపుకు తిరిగి కూర్చున్నా. రూప అమ్మ నా దగ్గరికి వస్తున్న శబ్దం వచ్చింది. తను నన్ను కన్విన్స్ చేయడానికి వస్తున్నట్లుగా అనిపించింది ఎందుకో సడెన్ గా భయం వేసింది. ఒకవేళ నేను అనుకున్నట్లు కాకుండా రూప ను నిజంగానే తన అమ్మ దూరం చేస్తుందా అని అనిపించింది. ఎందుకో రూప అమ్మ ను చూడలేక పోయాను భయం వేసింది. తల తిప్పేసుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నా. మనసులో ఒకటే నడుస్తుంది ఒకవేల రూప ను నిజంగా నా నుండి దూరం చేస్తుందా ? అని. ఎందుకు అంటే రూప కూడా చాలా సార్లు చెప్పింది. నన్ను నిన్ను మా అమ్మ దూరం చేస్తుంది అని ఇంకా తనని హాస్టల్ కు కూడా పంపించాలని చూస్తుంది అని. అదే భయం నాకు మొదలు అయ్యింది. ఒకవేళ అలా చేస్తే రూప ను ఇకపై రోజూ చూడలేను. తనతో ఎప్పటిలా గొడవ పడలేను. తనతో చనువుగా తిరగలేను, తన కేరింగ్ ఇంకా లవ్ రెండూ దూరం అవుతాయి. అలా జరిగితే నేను ఉండగలనా అని అనిపించింది. తను లేకుండా ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని మనసు పడే పదే అంటూ ఉండగా ఒక్కసారిగా ఆ భయానికి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అలా ఊహించని విధంగా కళ్ళలో నీళ్ళు రావడం తో రూప అమ్మకు కనిపించకూడదు అని వెంటనే పక్కకు జరగాలి అని చూసా. కానీ అంతలోనే రూప అమ్మ నా పక్కన వచ్చి కూర్చుని వినయ్ ఇటు చూడు అంది. నేను తల పక్కకు తిప్పుకున్నా నేను ఏడుస్తుంది కనిపించ కూడదు అని. కానీ రూప అమ్మ నా తల నిమురుతూ వినయ్ అంటూ మళ్ళీ పిలిచింది. నేనేం పలకలేదు. తను నా ముఖాన్ని కొంచెం కిందికి వంగి చూస్తూ ఎన్టీ ఏడుస్తున్నావా అంది నవ్వుతూ. అంతే వెంటనే నేను ఏడుస్తుంది తనకు కనిపించ కుండా తల పక్కకు తిప్పుకుంటూ ఇంకొంచెం పక్కకు జరిగా. నేను అలా జరగగానే తను కూడా నా పక్కకు వస్తూ ఎన్టీ రా దీనికే ఏడుస్తున్నావా ? అసలు ఏం అంత జరిగిందని ఏడుస్తున్నావు ? అంటూ నన్ను దగ్గరికి తీసుకుంది. తనలా తీసుకోగానే ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. (అప్పుడు పిల్లోడిని కదా కొంచెం భయం వేసింది రూప ఎక్కడ దూరం అవుతుందో అని అందుకే ఆ ఏడుపు) నేనలా ఒక్కసారిగా ఏడ్చే సరికి తను హయ్యో ఏంటయ్యా ఇది అంటూ నవ్వడం మొదలెట్టింది. తనలా నవ్వుతుంటే నాకు కోపం వచ్చింది కోపంగా తన వంక చూసి తన బుజాల మీద గట్టిగా పిడికిలి తో గుద్దుతూ రాక్షసి రాక్షసి అని అన్నా. నేనలా కొడుతుంటే తనకి నా ప్రవర్తన ముద్దొచ్చి నన్ను చూస్తూ నేను అలా కొడుతూ వుండగానే నన్ను దగ్గరికి తీసుకుని వాటేసుకుంది. నేను తనని విడిపించు కోవాలని చూసా. కానీ తను నన్ను గట్టిగా వాటేసుకుని నా చెంప మీద ముద్దు పెట్టుకుంది. నేను చాలా సేపు విడిపించు కోవడానికి చూసా. కానీ తను నన్ను వదలలేదు. కాసేపటికి సైలెంట్ అయిపోయాను. 
తను చిన్నగా నా వీపు తడుతూ మెల్లగా నాకు మీ ఇద్దరినీ దూరం చేయాలని లేదు రా, ఇంకా మీరిద్దరూ అలా కలిసి ఉంటేనే నాకు ఇష్టం కానీ అది హద్దు దాటుతుంది ఏమో అని చిన్న భయం అంతే అందుకే అలా చెప్పా అంది. నేను ఎం పలక కుండా ఉండిపోయాను. తను నన్ను తన కౌగిలి నుండి వేరు చేసి నా ముఖం లోకి చూసింది. నేను తల దించుకుని ఉన్నా. తను నన్ను చూసి మగాళ్లు ఎడ్వకూడదు తెలుసా అంది. నేను తల తిప్పుకున్నా. తను నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎందుకు రా అది అంటే నీకు అంత ఇష్టం అని అంది. నేను ఎం అనలేదు. తను ఇక నన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సరే పో ముందు పోయి ముఖం కడుక్కుని రాపో అని అంది. నేను కదలలేదు, కొంచెం సిగ్గు వేసింది. మొత్తం నలుగురి ముందు సిగ్గు లేకుండా ఎడ్చా కదా వాళ్ళ ముందు కదలాలి అంటే సిగ్గనిపించింది. వెంటనే మా అమ్మ నా దగ్గరికి వస్తూ నన్ను లేపింది. లేపి పద ముఖం కడుక్కో అంటూ నన్ను బాత్రూం దగ్గరికి తీసుకు వెళ్ళింది. నేను బాత్రూం లోకి వెళ్లి ముఖం కడుక్కున్నా. బయట మా అమ్మ ఇంకా రూప అమ్మ మాటలు వినిపించాయి. మా అమ్మ ఎందుకే వాడ్ని అలా ఏడిపించావ్ అని అంటూ ఉంటే రూప అమ్మ నాకేం తెలుసే మీ వాడు అంత సెన్సిటివ్ అని అంటూ నవ్వింది. మా అమ్మ దానికి పోనీలే ఇక వాడితో అలా అనకు అంటూ ఇంకేదో మాట్లాడుతూ ఉండగా నేను తలుపు తెరిచాను. వాళ్ళని చూడాలి అంటే సిగ్గు వేసింది. అందుకే తల వంచుకుని బయటకు వెళ్తుంటే రూప అమ్మ నన్ను దగ్గరికి లాక్కుంది. అలా లాక్కుంటూ మా అమ్మ ను చూసి నాకు ఇప్పుడు అర్దం అయ్యిందే, దానికి ఎందుకు వీడంటే అంత ఇష్టమో అని అంటూ నా ముఖం లోకి చూసి వీడిలా సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు అంటే దానికి మహా ఇష్టం అందుకే వీడంటే దానికి అంత ఇష్టం అంటూ మా అమ్మ ను చూసి కన్ను కొడుతూ అప్పుడేగా ఈసీ గా కంట్రోల్ చేయచ్చు అంది నవ్వుతూ..
అలా అని మళ్ళీ తిరిగి నన్ను చూస్తూ అయినా ఏంట్రా మగాడివే నా నువ్వు, అస్సలు సిగ్గు లేకుండా అలా ఏడుస్తారా ఎవరైనా అంది, అలా అంటూ నన్ను తన పక్కన కూర్చో పెట్టుకుంది. నాకు ఇంకో వైపు మా అమ్మ కూర్చుంది. మా అక్క ఇంకా రమేష్ గాడు ఇద్దరూ నన్నే చూస్తున్నారు. నేను తల దించుకుని ఉన్నా. రూప అమ్మ నన్ను చూస్తూ ఏమైంది రా నీకు అంత చిన్న విశయానికే ఎడుస్తారా ఎవరైనా అంది. నేను తన వంక తలెత్తి చూస్తూ నీకు చిన్న విషయమే ఆంటీ కానీ నాకు కాదు రూప అంటే నాకిష్టం అన్నా. తను నవ్వుతూ మరీ అంత ఇష్టమా అంది. నేను హ్మ్మ్ అన్నా. తను ఎందుకు రా అలా అంది. నేను మళ్ళీ వేరేలా చెప్తే తను ఇంకేదో లా అనుకుంటుదేమో అని భయం వేసి వెంటనే తనంటే నాకు ఇష్టం ఆంటీ, ఎందుకో తెలీదు, తను నన్ను కేర్ చేసే విధానం తను నన్ను ప్రేమగా చూసుకునే విధానం తను నాతో గొడవ పడే విధానం ఇంకా చెప్పాలంటే తను నన్ను ఒక తమ్ముడిలా ట్రీట్ చేసే విధానం అంటే నాకు చాలా ఇష్టం, తను చివరికి నన్ను కొట్టినా కూడా నాకు చాలా ప్రేమ గా అనిపిస్తుంది ఆంటీ అన్నా..
కావాలనే తమ్ముడిలా అనే పదం వాడాను. ఎందుకు అంటే మళ్ళీ నా కిష్టం అని అన్నందుకు తను వేరేలా అర్దం చేసుకుంటుంది ఏమో అని భయం వేసింది పైగా రమేష్ గాడికి కూడా డౌట్ వస్తుంది ఏమో అని అలా చెప్పా. నాకింకో ఫీలింగ్ లేనప్పుడు అక్కా అని చెప్పడానికి నాకేం సమస్య ? అందుకే అలా అన్నా పైగా చెప్పడం వరకే కాదు నిజానికి నాకు కూడా తన మీద వేరే లా ఎం అభిప్రాయం లేదు. తను చూపించే ప్రేమ కేర్ అంటే నాకు చాలా ఇష్టం. పైగా తనేమో నాకంటే పెద్దది కాబట్టి తమ్ముడి లా అని చెప్తే ఇక యే గొడవా ఉండదు లే అని అనిపించింది. అందుకే వెంటనే అదే చెప్పేశా. 
    "తను నాకు అక్క లాగా ఉంటుంది, నన్ను చాలా ప్రేమగా చూసుకుంటుంది అందుకే నాకు ఇష్టం అంటూ ప్లీజ్ ఆంటీ దయచేసి తనని హాస్టల్ కు పంపించకండి, తను లేకుండా నేను ఉండలేను అని అన్నా. 
నేను ప్రేమ ఇంకా ఇష్టం అనే పదాలు యుస్ చేసినా కూడా అక్క ఇంకా తమ్ముడు అనే పదాలు యూస్ చేయడం తో వాళ్ళు కామ్ అయిపోయారు. నా మీద అంత వరకు ఉన్న ఒపీనియన్స్ పోయి ఇంకో రకమైన ఒపీనియన్స్ వచ్చాయి వాళ్లకు. ముఖ్యంగా రమేష్ గాడికి ఇంకా రూప అమ్మ కు. 
 నేను అక్కా అన్నాక కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అని నేను అనుకోలేదు అందుకే అలా చెప్పా. వాళ్ళు కూడా నేను అలా అనేసరికి ఇంకేం అనలేక పోయారు. అప్పటి నుండి వాళ్ళు నన్ను ఇంకా రూప ను అక్కా తమ్ముడు లాగే చూసారు. మేమెంత క్లోజ్ గా ఉన్నా కూడా పెద్దగా పట్టించు కోలేదు. రమేష్ కూడా తరువాత నుండి పెద్దగా మమ్మల్ని పట్టించు కోలేదు అందుకే నాకు అప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పు అనిపించలేదు. ఎందుకు అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో రూప నాకు దగ్గరగా ఉండడం మాత్రమే నాకు కావాలి అది ఎలాంటి రెలేషన్ తో ఉందో నాకు అనోసరం కానీ నాతోనే ఉండాలి అదే నాకు ముఖ్యం. అందుకే నేను ఆ కారణం చెప్పా. కారణం ఒక్కటే చెప్పి నేను రూప తో మాత్రం ఇంకోలా ఎం ఉండడం లేదు తనని కూడా సేమ్ ఒక సిస్టర్ రిలేషన్ తోనే అనుకునే వాడ్ని అలా అని తనని అక్కా అని పిలిచే వాడ్ని కాదు జస్ట్ ఒక ఫీలింగ్ అంతే. నాకు యే రిలేషన్ అనేది ముఖ్యం కాదు తనతో ఉన్నానా లేదా అనేదే ముఖ్యం. అందుకే అలా చెప్పాను. కానీ అది తరువాత రూప అమ్మ భయపడిన విధంగానే మారుతుంది అని అప్పుడు నాకు తెలీదు. నేనేమో తను ఎప్పటికైనా వేరే వాడ్ని పెళ్లి చేసుకుంటుంది, అయినా కూడా నేను తనతో ఇప్పుడు ఉన్నట్లు గానే ఫ్రెండ్లీ గా క్లోస్ గా ఉందాం అని అనుకుంటూ ఉంటే తనేమో అలా ఆలోచించకుండా నన్నే పెళ్లి చేసుకుందాం అని ఆలోచించింది. ఇలా జరిగింది మొత్తం కథ. 

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#15

పైగా రూప నాన్న పెళ్లి గురించి వాళ్ళ ఫ్రెండ్ కు మాట ఇచ్చిన తరువాత రూప అమ్మ నాతో
రూప అమ్మ : వినయ్ తనకి పెళ్లి కూడా కుదిరింది ఈ టైం లో అయినా నువ్వు తనతో కాస్త చనువుగా ఉండడం ఆపితే బాగుంటుంది నాకు నీ మీద ఎలాంటి చెడు అభిప్రాయం లేదు కానీ ఎంతైనా వేరే వాళ్ళు చూసినప్పుడు అది తప్పుగానే కనిపిస్తుంది అందుకే చెప్తున్నా అర్దం చేసుకో
నేను : ఆంటీ మీరు అంతగా చెప్పాలా, కానీ రూప నే నా మాట వినదు ఆంటీ..
రూప అమ్మ : తన గురించి వదిలేయ్ వినయ్ నువ్వైనా కాస్త జాగ్రత్త గా ఉండు. నేను కూడా తనకి చెప్పడానికి ట్రై చేస్తా. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరు బాగున్నా మంచింది కదా అని నా ఉద్దేశం. అప్పుడంటే ఎదో చిన్న వయసు అని మిమ్మల్ని దూరం పెట్టలేదు. అప్పుడు నేను చేసిన సహాయానికి కృతజ్ఞతగా అయినా ఇప్పుడు మీరు నాకు ఈ సహాయం చేయండి.
నేను : ఎంత మాట ఆంటీ, అప్పుడు మీరు మమ్మల్ని దూరం పెట్టలేదు దానికైనా సరే మేము మీకు కృతజ్ఞతగా ఉంటాం ఇంతగా చెప్పాలా ఆంటీ...
ఇలా రూప అమ్మ నాతో మాట కూడా తీసుకుంది. ఇప్పుడేమో రూప వచ్చి ఐ లవ్ యూ అని అంటుంది. ఎం చెప్పాలి తనకు ?

ప్రస్తుతం పార్క్ లో...
తను కోపంగా పార్క్ నుండి బయటకు వెళ్ళాక ఎం చేయాలో తెలియలేదు నాకు. ఒక పక్క వాళ్ళ నాన్న ఇచ్చిన మాట, ఇంకో పక్క వాళ్ళ అన్న, ఇంకో పక్క నా ఫీలింగ్స్. ఇవ్వన్నీ నన్ను తను కోరుకున్న విధంగా చేయకుండా ఉండేలా చేస్తున్నాయ్. నిజమే నాకు తన మీద ప్రేమ ఉంది కానీ అది ఇంకో రకమైన ప్రేమ అని తనకు తెలియడం లేదు. నేనూ గట్టిగా చెప్పలేను. ఎందుకు అంటే తనంటే నాకు భయం. 
ఒకవేళ నేను ఇప్పుడు తన మాట విని తనని ప్రేమించినా వాళ్ళ అమ్మ కు వాళ్ళ అన్న కు ఎం అని సమాధానం ఇస్తాను ? ఒకప్పుడు వాళ్ళు ఇలా భయపడే కదా ఇద్దరినీ కాస్త దూరంగా పెట్టాలి అని చూసింది. కానీ అప్పుడేమో అక్కా తమ్ముడు అని చెప్పి ఇప్పుడేమో లవ్ చేసుకుంటున్నాం అంటే ఎలా ఉంటుంది ? 
ఈ విశయం రూప కు ఎలా అర్దం అవుతుంది..
ఏమైనా అంటే నేను పుట్టాక ఇవ్వన్నీ వచ్చాయా ? లేక ఇవ్వన్నీ ఉన్నందుకు నేను పుట్టానా ? అంటుంది. 
ఎలా ముందుకు ప్రొసీడ్ కావాలో కూడా అర్దం కావడం లేదు., అలా కాసేపు తిరుగుతూ ఆలోచించు కుంటు చివరికి బయటకు వెళ్లాను. అక్కడ రూప కార్ లో కూర్చుని కనిపించింది. నేను కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశా కానీ అది రాలేదు. తనని చూసి లాక్ తెరువు అన్నా. తను కోపంగా చూసి తల తిప్పుకుంది. నేను తెరువు ప్లీజ్ అన్నా. తను పలకలేదు. నేను డోర్ విండో గట్టిగా కొడుతూ హెలో మేడం చెప్పేది మీకే అని అన్నా. 
అంతే తను కోపంగా విండో వంక తిరిగి విండో కొంచెం ఓపెన్ చేసి, నన్ను ప్రేమించని వాళ్లకు నా కార్ లో స్థానం లేదు. ఐ లవ్ యూ చెప్పు తెరుస్తా అని అంటూ మళ్ళీ విండో క్లోస్ చేసి కోపంగా ఫేస్ పెట్టుకుని కూర్చుంది..
నేను కోపంగా తన వంక చూసా. తన నుండి ఎం రెస్పాన్స్ లేదు. కొద్దిసేపు వెయిట్ చేసి చూసా. కానీ నో రెస్పాన్స్. ఇక ఇలా కాదు అని తనతో, నువ్వు ఓపెన్ చేస్తావా ? లేక నన్ను వెల్లిపోమంటావా ? అన్నా. తను అయినా కూడా ఎం పలక లేదు. నేను అటు ఇటు చూసి ఇక కోపంగా కార్ ను ఒకసారి కాలు తో తన్ని అక్కడ నుండి వచ్చేశా. పార్క్ అవతల బస్ స్టాప్ ఉండడం తో అక్కడకు వెళ్ళా. బస్ కోసం వెయిట్ చేస్తున్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. 
"నువ్వొచ్చి చెప్పేంత వరకు కార్ కదలదు అర్దరాత్రైనా" అని ఉంది దాంట్లో. నేను కోపంగా దూరంగా ఆగి ఉన్న కార్ ను చూసా. అంతలోనే బస్ వచ్చిన సౌండ్ వినిపించింది. 

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#16

(04-12-2021, 02:32 PM)Siva Narayana Vedantha Wrote:  కథ బాగుంది. ఇంకా రొమాన్స్ మోడ్`లోకి రాలేధు

3rd update lone start chesevanni 
Kani konchem time pattindi 
Madyalo business works vachhayi
Next update lo romance pakka 
Actually last dantlone undali kani update marii peddaga avuthundi emo ani cut chesi update chesa 
Next dantlo nundi start avuthundi 


Updates twaraga ivvananduku as usual redu tittukuni satisfy avvandi 
Pani lo padi rayadam ledu

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 2 users Like dom nic torrento's post
Like Reply
#17

(21-11-2021, 05:32 PM)Eswar P Wrote:  చాలా బాగుంది డోమ్ బ్రో.త్వరగా ఇంకోటి ఇవ్వండి . horseride

ఇవ్వాళ ఇస్తాను

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 3 users Like dom nic torrento's post
Like Reply
#18

EPISODE 6

కార్ దగ్గరకు వెళ్ళాల్లా లేక బస్ ఎక్కాలా ? అని ఆలోచిస్తున్న నాకు బస్ ఎక్కడమే నయం అనిపించింది. కానీ నేను అలా చేస్తే రూప తరువాత ఎం అంటుందో అన్న భయం కూడా లేక పోలేదు. తను ఏమంటుందో అని ఆలోచిస్తున్న నేను బస్ హార్న్ మోగగానే ఈ లోకం లోకి వచ్చా. ఇక ఏమైతే అది అవుతుంది లే అని అనిపించి వెంటనే బస్ ఎక్కా. బస్ ఎక్కి ఇంటికి వెళ్తున్న మాటే గానీ నా మనసంతా రూప మీదనే ఉంది. తను పంతం ఆపి ఇంటికి వస్తే బాగుంటుంది అని అనుకున్నా. కానీ ఒక పక్క నా బుద్ధి చెప్తూ ఉంది. తను పట్టిన పట్టు వదిలే రకం కాదు అని. ఇంటికి వెళ్ళిన నాకు మనసు మనసులో లేదు. అటు ఇటూ తిరుగుతూ రూప వచ్చిందా లేదా అని రూం విండో నుండి వాళ్ళ ఇంటి వైపుకు చూస్తూ ఉన్నా.  అరగంట గడిచింది. తన జాడ లేదు.

నాకు ఇక ఇంట్లో ఉండబుద్ది కాలేదు. తన దగ్గరికి వెళ్దామా అని ఆలోచించు కుంటూ ముందుగా ఫోన్ చేసి చూద్దాం అని తనకు కాల్ చేసా, రింగ్ అయ్యింది కానీ లిఫ్ట్ చేయలేదు. నేను మళ్ళీ ట్రై చేశా. సేమ్ రెస్పాన్స్.. 
ఇక తను ఎత్తదు లే అని అనుకుంటూ కాల్ కట్ చేస్తుంటే అప్పుడే తను కాల్ లిఫ్ట్ చేసింది. నేను వెంటనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటూ హెలో అన్న తను పలకలేదు. ఇంకోసారి హెలో అన్నా. తను ఎం పలకలేదు. నేను తన రెస్పాన్స్ కోసం చూడకుండా డైరెక్ట్ గా మాట్లాడుతూ రూపా ఇంటికి వచ్చేయి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం అన్నా. తను ఫోన్ కట్ చేసింది. నేను మళ్ళీ చేశా. తను ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసింది. నేను కోపంగా ఫోన్ ను జోబులో పెట్టుకుంటూ పార్క్ కు బయలుదేరా.  పార్క్ లో కార్ అక్కడే ఉండడం చూసి దాని దగ్గరకు వెళ్ళా. లోపల రూప సీరియస్ గా కూర్చుని ఎటో చూస్తూ ఉంది. నేను విండో పై తట్టా. తను తిరిగి చూసింది. నేను తెరువు అన్నట్లుగా చూసా. తను కొద్దిసేపు నా వైపు చూసి ఓపెన్ చేసింది. నేను తన పక్క సీట్ లో కూర్చుంటూ సీరియస్ టోన్ తో ఇంటికి పద అన్నా. తను నా వైపు ఒక చూపు చూసి మళ్ళీ అటు తిరిగింది. నేను కోపంగా తన చేయి పట్టుకుని నా వంక తిప్పుకుంటూ ఏం వినిపించడం లేదా అన్నా. తను కోపంగా చూసింది. చూసి నా చేతిని విదిలించి కొట్టి ఎందుకొచ్చావ్, వెళ్ళిపోయావ్ గా మళ్ళీ ఎందుకు వచ్చావ్ అంది. నేను తనని చూసి ఇది టైం కాదు, దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ముందు కార్ తీయి అన్నా. తను తల తిప్పుకుంటూ నా మీద ప్రేమ లేనప్పుడు నా మీద పెత్తనం చెలాయించే హక్కు నీకు లేదు అంది. దానికి నేను నువ్వు అనుకున్నదే ప్రేమ కాదు, ఒక స్నేహితుడి లా కూడా ప్రేమించొచ్చు, అయినా ఇప్పుడు ఎందుకు ఇలా బెట్టు చేస్తున్నావ్ ప్లీజ్ కార్ స్టార్ట్ చేయి అన్నా. 
తను కోపంగా నా వంక చూస్తూ ఇంకోసారి కార్ స్టార్ట్ చేయి అన్నావో జాగ్రత్త అంటూ కోపంగా అంటూ అయినా  ఏంట్రా నువ్వు ? అసలు నాకెందుకు ఇలా చిరాకు తెప్పిస్తున్నావ్, నేను బెట్టు చేస్తాను ఇంకేదైనా చేస్తాను, అది నా ఇష్టం, అసలు నా మీద ప్రేమ లేనప్పుడు నీకెందుకు రా ఇవన్నీ, నేనెలా చేస్తే నీకేంటి ? ఇష్టం ఉంటే చెప్పు లేదంటే వెళ్ళిపో అంతే కానీ ఇలా అటూ ఇటూ కాకుండా మధ్యలో ఉండకు నాకు చిరాకు వస్తుంది అంది. నేను కోపంగా చూసా. తను నా వంక చూడలేదు. నేను కార్ దిగా. అవతలకు వెళ్తూ విండో లో నుండి తనని చూసి ఒక్కటి చెప్తా చూడు రూపా, నువ్వేం చిన్న పిల్లవి కాదు బెట్టు చేస్తే నీకావల్సింది ఇవ్వడానికి., కొంచెం మెచ్యూరిటీ తో ఆలోచించు అంటూ చెప్తూ వుండగానే విండో మిర్రర్ క్లోజ్ చేసేసింది. 
నేను కోపంగా కార్ ను తన్నా. అలా తన్ని అక్కడే కోపంగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నా. కాసేపు అలా తిరగగా రూప నుండి మెసేజ్ వచ్చింది.  వెళ్ళిపో, లేదంటే నా మీద ప్రేమ ఉందనే అనుకుంటాను" అని ఉంది. నేను కార్ లో కూర్చున్న రూప ను చూసా. రూప నా వంక ఒకసారి చూసి తల తిప్పుకుంది. నేను ఇక తనకు ఆశలు పెంచక పోవడమే మంచిది అని అనిపించి అక్కడ నుండి వచ్చేశా..
గంట అవుతూ ఉండగా నాకు ఇంకో మెసేజ్ వచ్చింది. "వెళ్ళిపో అన్నాగా" అని ఉంది. నేను వెంటనే కాల్ చేశా. తను లిఫ్ట్ చేసింది. నేను ఇంట్లో ఉన్నాను అన్నా. తను ఎం పలకలేదు. నేను హెలో అన్నా. తను వెంటనే అబద్ధాలు చెప్పకు, నువ్వు ఇక్కడే ఉన్నావ్ నాకు తెలుసు అంది. నేను లేదు అంటూ ఉండగా అబద్ధాలు చెప్పకు అంటూ ఫోన్ పెట్టేసింది. నేను తనకు కాల్ చేయడానికి చూసా. కానీ ఎందుకులే అని సైలెంట్ అయిపోయా. తను మళ్ళీ ఇంకో మెసేజ్ పెట్టింది. "నువ్వు నిజంగా ఇప్పుడు ఇక్కడ ఉంటే నన్ను ప్రేమిస్తున్నట్లే, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా" అని ఉంది దాంట్లో. అది చదివి తల ఎత్తి దూరంగా రూప కూర్చున్న కార్ వంక చూసా. తను ఊహించింది నిజమే, నేను ఇంటికి వెళ్ళలేదు. తననే దూరంగా ఉండి గమనిస్తున్నా. తను పెట్టిన మెసేజ్ చూసి తనకు రిప్లై గా నేను ఇంట్లో సేమ్ డ్రెస్ తో దిగిన ఒక ఫోటో ని తీసి  పంపించా. తను అది చూసింది. కోపంగా ఉన్న సింబల్స్ పెడుతూ అబద్ధం అని పెట్టింది. అలా పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నేను కార్ వంక చూసా. అప్పుడే తను కిందికి దిగింది. దిగి చుట్టూ చూసింది. నేను తనకి కనపడని చోట ఉన్నా. తను చుట్టూ పరిశీలనగా చూస్తూ నేను కనిపించక పోయే సరికి భాధగా తల దించుకుంది. తన ముఖం లో బాధ స్పష్టంగా కనిపించింది. అది చూడగానే నాకే ఎలాగో అయ్యింది. పోయి సారీ చెప్పి ఐ లవ్ యూ చెప్దామా అని అనిపించింది. తను ఇంకోసారి చుట్టూ చూసింది. నేను కనిపించలేదు. అలాగే కాసేపు నిలబడింది. ఫోన్ తీసుకుని లాస్ట్ టైం ఒకసారి ప్రయత్నిద్దాం అని స్విచ్ ఆన్ చేసి నాకు కాల్ చేసింది. నేను లిఫ్ట్ చేశా. అవతల నుండి తను, నిజం చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా అంది. నేను ఎం పలకలేదు. తను చుట్టూ చూస్తూ నా మనసుకు తెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని ప్లీజ్ అబద్ధం చెప్పకు, ఇక్కడ లేను అని మాత్రం అబద్ధం చెప్పకు అంది కాస్త ఏడుపు గొంతు తో. నేను శ్వాస ను గాఢంగా వోదులుతూ నిన్ను డిసప్పైంట్ చేస్తున్నందుకు సారి రూపా నేను నిజంగా ఇంట్లో ఉన్నా అన్నా అలా అంటూ వుండగానే తను కోపంగా ఫోన్ పెట్టేసి లోపల పడేసింది. నేను అది చూసి తనకు మెసేజ్ పెట్టా. ' ఇప్పటికైనా అర్దం చేసుకో రూపా, అని. మెసేజ్ రావడం తో రూప చెక్ చేసుకుంది. నేను పెట్టింది చూడగానే కోపంగా అటు ఇటూ చూసింది. నేను ఏమైనా కనపడతాను ఏమో అని. కానీ నేను ఎక్కడా కనిపించక పోయే సరికి కోపంగా లోపల సెల్ పడేసి కంట్లో వస్తున్న నీటిని తుడుచుకుంటూ కార్ డోర్ గట్టిగా తీసింది.  అంతే అలా తీయగానే అక్కడే అటు వైపు నుండి వస్తున్న ఒక తాగుబోతు కు ఆ డోర్ తగిలింది. తగిలి వాడి చేతిలో ఉన్న మందు బాటిల్ పడిపోయింది. అది చూసి వాడు రూప వైపుకు చూసాడు. రూప అదంతా పట్టించుకునే స్థితిలో లేదు కార్ లోకి ఎక్కుతూ ఉంది. అలా కేర్ లెస్ గా ఎక్కుతూ ఉండడం చూసి ఆ తాగుబోతు పక్కన ఉన్న వాడి ఇంకో తాగు బోతు ఫ్రెండ్ కోపంగా రూప చేయి పట్టుకుని లాగాడు. అంతే వెంటనే నేను పైకి లేచా. అక్కడ వాడు రూప చేయి పట్టుకుని బయటకు లాగుతూ ఎంటే నీకంత బలుపు అంటూ ఉండగా నేను కోపంగా ముందుకు కదిలా. కానీ అంతలోనే ఇందాక జరిగింది గుర్తొచ్చి ఆగిపోయా. వెళ్తే మళ్ళీ ప్రేమా పెళ్లి అని అంటుంది ఏమో అని అనిపించి ఆగిపోయి అక్కడే నిల్చున్నా. కానీ అక్కడ ఉన్న వాళ్ళని మాత్రం కోపంగా చూస్తూ ఉన్నా. రూప చేయి పట్టుకోవడం తో రూప కు కోపం వచ్చి ఆ తాగుబోతు ఫ్రెండ్ అయిన ఇంకో తాగుబోతు ను గట్టిగా చెంప మీద కొట్టేసింది. అంతే అది చూసిన ఆ తాగుబోతుల ఇంకో ఫ్రెండ్ వాడికి వత్తాసుగా వచ్చాడు. ముగ్గురూ కలిసి రూప చుట్టూ నిల్చుని వాగుతున్నారు. రూప అప్పటికే నా ఆలోచనలతో వేరే స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉండడం తో వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేక పోతుంది. అది అంతా నేను దూరం నుండి చూస్తూ ఊరికే ఉండలేక పోయా. అందులో ఒకడు రూప ను కావాలనే టచ్ చేయాలని చూస్తున్నాడు. రూప ఇప్పుడు కొంచెం బాధ లో ఉండడం వల్ల వాళ్ళ ను అదుపు చేయలేక పోతుంది. నేను అది చూసి ఇక ఆగలేక పోయాను. రక్తం మరుగుతూ ఉండగా ముందుకు అడుగు వేసా. కానీ అంతలోనే ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు వెళ్తే తను మళ్ళీ ఎప్పటికీ నన్ను నమ్మదు. నేను ప్రేమ లేదు అంటే తను చంపేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళడం కంటే వెళ్లక పోవడమే మంచింది అనిపించింది. వెంటనే చుట్టూ చూసా. అక్కడ ఒక కానిస్టేబుల్ కనిపించాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్ళి అక్కడ ఎవరో అమ్మాయిని ఏడిపిస్తున్నారు అని చూపించా. అంతే వెంటనే అతను అక్కడికి వెళ్లి వాళ్ళని రోడ్ మీదనే కొట్టి రూప ను విడిపించాడు. వాళ్ళు కోపంగా రూప ను చూసారు. మమ్మల్నే కొట్టిస్తావా అన్నట్లుగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. నేను వాళ్ళ ఫేస్ లు గుర్తు పెట్టుకున్నా ఎందుకుంటే నేను ఇవ్వాల్సిన కోటింగ్ కూడా ఉంది కదా.  వాళ్ళని చూస్తూ ఉండగా వాళ్ళు కొంచెం దూరంగా వెళ్లి ఇంకో మందు సీసా ను తెచ్చుకుని తాగుతూ ఉన్నారు. నేను వాళ్ళని చూసి మీకు ఉంది లెండ్రా నా చేతిలో అని అనుకున్నా. 
ఇక్కడ రూప కళ్ళలో నీళ్ళు తుడుచుకుంటూ కార్ ఎక్కి కూర్చుంది. చాలా సేపు అయ్యింది. తను కార్ దిగలేదు. నేను కార్ నే చూస్తూ ఉన్నా. తన నుండి ఫోన్ కాల్ వచ్చింది. నేను లిఫ్ట్ చేశా.  రూప మాట్లాడుతూ నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని నాకు తెలుసు..
ప్లీజ్ రా అబద్ధం చెప్పకు అంది. నేను కొంచెం విసుగ్గా, నేను లేను అని ఒకసారి చెప్తే అర్దం కాదా అన్నా. తను సైలెంట్ అయిపోయింది. కాసేపు మౌనం తరువాత 
తను మాట్లాడుతూ., నాకెందుకో నువ్వు ఇక్కడే ఉన్నావ్ అని అనిపిస్తుంది రా, నా మనసు చెప్తుంది. నిజంగా ఇది తప్పే అయితే నువ్వన్నట్లే చేస్తా. కానీ నువ్వు ఇక్కడే ఉండి మాత్రం అబద్ధం చెప్పకు అంది. నేను నిజంగా లేను రూపా అన్నా. తను గట్టిగా అబద్ధం అంది. నేను మౌనంగా ఉన్నా. తను మాట్లాడుతూ ఒకవేళ నువ్వు లేకపోయినా సరే, నీకిదే చివరి అవకాశం  రాత్రి లోపు ఇక్కడికి వచ్చి నన్ను తీసుకువెళ్లు లేదంటే నేనీకెప్పుడు మళ్ళీ కనపడను అంది. అలా అంటూ ఫోన్ పెట్టేసింది. నేను ఎదురుగా ఉన్న కార్ వంక చూసా. 
ఒక్క క్షణం తననేందుకు బాధ పెట్టడం అనిపించింది.  కానీ అంతలోపే ఫ్యామిలీ గుర్తొచ్చి ఆగిపోయి, ఆలోచించడం మొదలు పెట్టా. 
ఇప్పుడు రూప కు నేను ఇక్కడ ఉన్నా అని తెలిస్తే ఎలా అయినా తన పట్టు తను సాధిస్తుంది. అదే నేను ఇక్కడ లేను అని తెలిస్తే అప్పుడు తనంతట తానే నన్ను వొదిలేసి అంకుల్ చెప్పిన పెళ్లి చేసుకుంటుంది అని అనిపించింది. అంతే వెంటనే తనకు కనిపించ కుండా అక్కడ నుండి వెళ్లిపోదాం అని అనుకున్నా. పడితే ఒక్క రోజు లేదా ఒక్క వారం బాధ పడుతుంది అంతే కదా, దాని కోసం ఇద్దరి ఫ్యామిలీ లను ఎందుకు బాధ పెట్టడం అని అనుకుని లేచి మెల్లగా తనకు కనిపించకుండా ఇంటికి వెళ్ళిపోయ..
ఇంటికి వెళ్ళి రాత్రి అయితే తనే వస్తుంది లే ఎలాగోలా అని అనుకుంటూ తినేసి కాసేపు టివి చూసి తొమ్మిది అవుతూ ఉండగా పడుకున్నా. పడుకునే ముందు ఒకసారి రూప ఇంటి వైపు చూసా. అక్కడ కార్ లేదు. తను ఇంకా వచ్చినట్లు లేదు. అది చూసి తనే వస్తుంది లే అని అనుకుని వెళ్లి పడుకున్నా. పడుకున్న మాటే గానీ రూప ఇంకా రాలేదు అనే ఆలోచనలే నన్ను చుట్టుముట్టేసాయి. కాసేపు అటూ ఇటూ దొర్లుతూ ఇక తట్టుకోలేక వెళ్లి రూప కు కాల్ చేశా. తను లిఫ్ట్ చేయలేదు. నేను మళ్ళీ చేశా. తను లిఫ్ట్ చేసింది. నేను తనతో ఇక చాలు ఇంటికి వచ్చేయి అన్నా. తను సైలెంట్ గా ఉంది. నేను కోపంగా రూపా అన్నా. తను పలకలేదు. ఇద్దరం సైలెంట్ గా ఉన్నాం. తను మెల్లగా మాట్లాడుతూ ఒక్కసారి నా కోసం రాలేవా అంది. నేను ఎం అనలేదు. తను ఏడుపు గొంతు తో వినయ్ ఆఖరిసారి అడుగుతున్నా అంది. నేను ఎం పలకలేదు. తన ఫోన్ విసిరి గొట్టిన శబ్దం వినిపించింది వెంటనే ఫోన్ కట్ అయ్యింది. నేను మౌనంగా కాసేపు ఉండిపోయా. కాసేపు ఆలోచించి వెళ్లకపోవడమే మంచింది అని అనుకుని కళ్ళు మూసుకున్నా. 
అలా మూసుకున్న కళ్ళు మళ్ళీ ఎదో ఫోన్ సౌండ్ వస్తే కానీ తెరుచుకోలేదు. కళ్ళు తెరిచి చూస్తే అప్పటికే పన్నెండు నర అయ్యింది. ఈ టైం లో ఎవరా అని ఫోన్ చూసా. రూప అమ్మ నుండి కాల్ వస్తుంది. నేను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశా. అవతల నుండి రూప అమ్మ వినయ్ రూప నీ దగ్గర ఉందా అంది. నేను లేదు ఆంటీ అన్నా. వెంటనే తను కొంచెం కంగారు గా అయితే ఎక్కడికి వెళ్లింది తను, తన ఫోన్ కూడా స్విచెడ్ ఆఫ్ వస్తుంది అంది. నేను అవునా అంటూ బెడ్ మీద నుండి లేచి కూర్చున్నా. తను కొంచెం కంగారు పడుతూ ఎక్కడికి వెళ్ళినా చెప్పే వెళ్తుంది, ఈ టైం అయినా కూడా ఇంకా ఎం కాల్ రాలేదు, పైగా ఇంట్లో మీ అంకుల్ కూడా లేడు అని కంగారుగా అంటూ ఉంటే నేను వెంటనే తనని చల్ల బరుస్తూ ఆంటీ ఆంటీ, కంగారు పడకండి నాకు గుర్తు వచ్చింది. తను తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తా అన్నట్లుగా చెప్పడం అని అన్నా. తను వెంటనే అవునా సూర్ కదా అంది. నేను అవును ఆంటీ మీరేం టెన్షన్ పడకండి కావాలంటే నేను కాసేపాగి కాల్ కూడా చేయిస్తా మీకు అన్నా. తను అయ్యో ఈ టైం లో ఎందుకు లే తను అయితే ఫ్రెండ్ ఇంట్లో ఉంది కదా అది చాలు లే అంటూ సరే పడుకో మళ్ళీ నీ నిద్ర ఎందుకు డిస్ట్రబ్ అని అంది. నేను అయ్యో పర్లేదు ఆంటీ అంటూ గుడ్ నైట్ చెప్పేసి ఫోన్ పెట్టేసా. ఫోన్ పెట్టేసిన క్షణం లోనే బెడ్ మీద నుండి కిందికి ఫాస్ట్ గా దూకి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ రూప సెల్ కు కాల్ చేయడం మొదలు పెట్టా. రూప అమ్మ ఏదైతే చెప్పిందో అదే రెస్పాన్స్ వస్తుంది. స్విచేడ్ ఆఫ్ అని. నేను కంగారు గా డ్రెస్ వేసుకుంటూ పరుగు లాంటి నడకతో బయటకు వెళ్ళా. వెళ్లి బ్లూటూత్ పెట్టుకుని రిపీటెడ్ గా కాల్ చేస్తూ బండి తీసా. నా గుండె కొట్టుకోవడం నాకు తెలుస్తూ ఉంది. బైక్ స్పీడ్ ను ఫుల్ గా పెంచా. ఫోన్ అలా చేస్తూనే ఉన్నా. ఇంకో కిలో మీటర్ దూరం ఉంది అనగా ఫోన్ స్విచ్ ఆఫ్ పోయి ఫోన్ రింగ్ అవ్వడం మొదలు అయ్యింది. అంతే వెంటనే మళ్ళీ మళ్ళీ డయిల్ చేయడం మొదలు పెట్టా. అలా చేస్తూ ఉండగా సడెన్ గా ఫోన్ లిఫ్ట్ అయ్యింది. నేను రూపా రూపా అన్నా. అవతల నుండి హెలో అని మగవాళ్ళ గొంతు వినిపించింది. అంతే నా గుండె ఆగినట్లైంది, నేను వెంటనే ఎవరు నువ్వు రూప ఎక్కడ అని అరిచినట్లు గా అడిగా. అవతల ఎవడో వాడు ఎదో గొణుక్కుంటూ హెలో అన్నాడు. నేను ఎవర్రా నువ్వు రూప ఎక్కడ అన్నా వాడు అవతల నుండి ఎవరు సారు నాకేమీ తెలీదు, ఫోన్ ఇక్కడ పడేసి ఉంటే చూసాను అంతే నాకేమీ తెలీదు అన్నాడు అలా అంటూ ఫోన్ పెట్టేసాడు. నేను వెంటనే మళ్ళీ ట్రై చేశా. వాడు మల్లీ ఎత్తాడు. నేను వెంటనే ఫోన్ పెట్టేయకు చంపేస్తా అని అంటూ అసలు నువ్వు ఎక్కడున్నావ్ అన్నా. వాడు భయపడుతూ సారు నాకేం తెలీదు నేను పార్క్ దగ్గర ఉన్నా కావాలంటే ఇది తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. నేను కోపంగా అసలు ఆ ఫోన్ ఎక్కడ దొరికింది రా నీకు, అసలు రూప ఎక్కడ అని అన్నా. దానికి వాడు ఏమో సారు నాకేం తెలీదు ఇక్కడ మందు సీసాల మద్యన పోను పడేసి ఉంది, అది ఆపు అయ్యి ఉంటే ఆను చేశా అంతే అన్నాడు. నేను మందు సీసాలా ? అసలు నువ్వు ఎక్కడున్నావ్ ? నీ ముందు కార్ ఏమైనా ఉందా ? అన్నా. వాడు కారా సారు ఏమో అంటూ కాసేపు ఆగి అవును సారు ఒకటి ఉంది అని అనగానే నేను ఊపిరి పీల్చుకుంటూ అక్కడ అమ్మాయి ఏమైనా ఉందా అన్నా. వాడు అమ్మాయా అంటూ చూస్తూ ఏమో కనిపించడం లెడు సారూ అంటూ అంతలోనే సారు సారు అమ్మాయి లేదు కానీ ఆ తాగు బొతు వాళ్ళు మాత్రం ఉన్నారు అన్నాడు. అంతే నాకు గుండె వేగం పెరిగింది. కొంచెం భయం కలిసిన గొంతు తో ముగ్గురున్నారా ? అన్నా. వాడు అవును సారు అంతే కాదు మీరు అడిగిన ఆ అమ్మాయి అని ఇంకా ఎదో చెప్తూ వుండగానే ఫోన్ కట్ అయ్యింది. నేను కోపంగా రెడైల్ చేశా. స్విచేడ్ ఆఫ్ వచ్చింది. బైక్ వేగం మాక్సిమం చేశా. ఫుల్ స్పీడ్ లో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటే వెళ్ళా. సాయంత్రం ఆ ముగ్గురే కదా రూప తో మిస్ బిహేవ్ చేసింది ఇప్పుడేమైనా వాళ్ళు అదే పని మీద ఉన్నారా అని ఆలోచన వచ్చింది. అంతే రక్తం మరిగిపోయింది. బైక్ ఇంకా ఎక్కువ స్పీడ్ గా పోనించా. నా అనుమానం బలం చేయడానికి ఆ ఫోన్ కూడా సరిగ్గా ఆ మందు బాటిల్స్ దగ్గరే దొరికింది వాడికి. అది గుర్తు రాగానే నా అనుమానం నిజమే అని అర్దం అయిపోయింది. చాలా స్పీడ్ గా నడుపుతూ పార్క్ దగ్గరికి ఎంటర్ అయ్యా. అక్కడ దూరంగా కార్ కనిపించింది. అది చూడగానే ఇంకా వేగం తో దాని దగ్గరకు వెళ్ళా. వెళ్లి బైక్ ను పక్కన పడేసి కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూసా. లోపల రూప స్టీరింగ్ మీద తల పెట్టుకుని పడుకోవడం కనిపించింది. తన కంట్లో నీళ్ళు కారుతున్నాయి. నేను గట్టిగా డోర్ ను తడుతూ యే రూపా, రూపా అంటూ పిలిచా. తను సడెన్ గా కళ్ళు తెరిచి నన్ను చూసింది. తనని చూస్తూ ఉంటే ఇక్కడ నేను అనుమానించింది ఎం జరగలేదు అని అర్దం అవుతూ ఉంది. అయినా కూడా నమ్మలేక తనని తెరువు అని అన్నా. తను నేను రావడాన్ని చూస్తూ కొంచెం ఆనందం తో తలుపు తెరిచింది. కానీ నేను ఉన్న పరిస్థితి తనకు తెలీదు. నేను కోపంగా తనని బయటకు లాగేసా. 
తను హేయ్ ఎన్టీ ఏమైంది అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంది. నేను తన డ్రెస్ ను బాడీ నీ పరికించి పరికించి చూస్తూ తనకెలాంటి హానీ జరగలేదు అని కంటితో కన్ఫర్మ్ చేసుకుంటూ ఉన్నా. తను నా వంక చూస్తూ నా ప్రేమను నిజం చేయటానికి నీకింత సమయం పట్టిందా అంది. ఆ మాట వినగానే నాకు చివ్వున కోపం వచ్చింది వెంటనే తలెత్తి తనని చూస్తూ తన చెంప మీద రెండు ఫట్ ఫట్ మంటూ కొట్టా. తనకి ఎం అర్దం కాలేదు. నేను తనని కోపంగా చూస్తూ నీ సెల్ ఎక్కడ అన్నా. తను తల దించుకుని ఎటో పడేశా అంది. నేను తనని చూసి బుద్ధి లేదు అంటూ ఇంకో రెండు సార్లు బలంగా కొట్టా. అలా కొడుతూ ఉంటే తన కంట్లో కన్నీళ్లు ఇంకా ముఖం లో ఆనందం రెండూ ఒకే సారి రావడం కనిపించింది. నేను అది చూసి కొడుతుంటే ఆ ఆనందం ఎంటే నీకు అన్నా. తను నా ముఖం లోకి చూస్తూ, నువ్విలా కొడుతుంటే నాకు నీ కోపం కాకుండా నీ ప్రేమ తెలుస్తూ ఉంది అంది.  నేను ఉఫ్ అనుకుంటూ కోపంగా తన వంక చూసా..
    చూస్తూ మనసులో అనుకున్నా నేను వచ్చిన పరిస్థితి ఏంటి ? తను ఎం వాగుతుంది అని. అలా అనుకుంటూ కోపంగా పక్కకు వచ్చి అక్కడే ఫుట్ పాత్ మీద కూర్చున్నా. తను కాసేపు ఆగి నా దగ్గరికి వచ్చింది. నేను తలెత్తి తనని చూసా. తను మౌనంగా ఉంది. నేను తనని కోపంగా చూస్తూ, అక్కడ ఒకపక్కఏమో మీ అమ్మ  ఫోన్ లో కంగారు పడుతూ ఉంటే, ఇక్కడ నీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంటే, అర్థరాత్రి నువ్వు ఒంటరిగా అదీ తాగుబోతులు తిరిగే చోట ఉన్నావ్ అని తలుచుకుంటూ ఉంటే నాకు ఒళ్ళంతా భయం తో చెమటలు పడుతుంటే కంగారు కంగారుగా ఇక్కడికి వచ్చా. వచ్చి నువ్వెలా ఉన్నావో చూస్తుంటే నువ్వేమో ప్రేమ దోమా అని అంటున్నావ్, నీకంత వెర్రి వాడిలా కనిపిస్తున్నానా నేను అన్నా. తను ఎం అనలేదు. నేను తన వంక అలాగే చూస్తూ  నీకేమైనా అవుతుందేమో అని నాకిక్కడ గుండె దడ పుడుతు ఉంటే నీకేమో ఆనందంగా ఉంది కదా, అవునా అన్నా వెటకారంగా చూస్తూ..
    తను ఎం అనలేదు. నేను పైకి లేస్తూ తనని చూసి, ఒక ఆడపిల్ల ఇలా అర్థరాత్రి వొంటరిగా ఉంటే అక్కడ అవతల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా ? ఎంత భయంగా ఉంటుందో తెలుసా ? అంటూ తనని చూసా. తనేం పలకక పొయే సరికి నేనే మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే లోపల నా గుండె ఎన్ని సార్లు ఆగినంత పని అయ్యిందో తెలుసా నీకు అన్నా. తను నా ముఖం లోకి చూసింది. నేను తనని చూస్తూ ముందే సాయంత్రం ఆ తాగుబోతుల తో గొడవ పడ్డావ్, వాళ్ళని అప్పుడే ఎం చేయలేక పోయావ్ అలాంటిది ఒంటరిగా అర్థరాత్రి ఒకవేళ వాళ్ళ చేతికి నువ్వు చిక్కి ఉంటే ? అప్పుడు ఏమయ్యేది ? అన్నా కోపంగా. తను తాగుబోతు లా అంటూ డౌట్ గా చూసింది నా వంక. నేను తనని చూసి గుర్తు లేదా సాయంత్రం వాళ్ళతో గొడవ పడ్డావ్ గా, వాల్లే అన్నా. తను దూరంగా నేల పై పడి ఉన్న మందు సీసాలను  చూపిస్తూ అక్కడ కూర్చుని తాగిన వాళ్ళ గురించా నువ్వు చెప్తుంది అంది. నేను కోపంగా కొడుతున్నట్లుగా చెయ్యి లేపుతూ సిగ్గు లేదు మళ్ళీ, ఆరా తీస్తున్నావ్ వాళ్ళ గురించా ? అని అంటూ అని తనని చూసి అవును వాళ్ళ గురించే అయితే ఎన్టీ ? ఒకవేళ వాళ్ళ చేతికి ఈ అర్థ రాత్రి నువ్వు దొరికి ఉంటే ఏమయ్యేది ? సాయంత్రం ఆ కానిస్టేబుల్ ఉండడం తో సరిపోయింది అదే ఇప్పుడు దొరికి ఉంటే ఏమయ్యేది ? అంటూ తనని కోపంగా చూసా. అలా చూస్తూ అటు వైపు తిరిగా. రూప ఎదో ఆలోచనలో పడింది. ఇద్దరి మధ్య కాసేపు మౌనం. కాసేపటికి రూప నోరు తెరుస్తూ ఆ ముగ్గురి గురించి ఆ కానిస్టేబుల్ గురించి నీకెలా తెలుసు అంది. నేను కోపంగా తన వంక తిరిగి చూస్తూ ఎందుకంటే ఆ కానిస్టేబుల్ ను పంపించింది నేనే కాబట్టి అన్నా. అంతే రూప ముఖం లో ఒక్కసారిగా వెయ్యి వాల్ట్స్ వెలిగినంత కాంతి వచ్చింది. నన్ను చూస్తూ అంటే నువ్వు అప్పుడు అక్కడే ఉన్నావా అంది. నేను చిరాకు కూడిన కోపం తో అవును ఉన్నా, నా కర్మ కొద్ది ఉన్నా అయితే ఎన్టీ అన్నా. నేను అలా అనగానే తన ముఖం లో ఎక్కడ లేని సంతోషం వచ్చింది. తన ముఖం ఆనందం తో వెలిగిపోయింది. 
    నేను అది చూసి సీరియస్ గా తనని చూసా. తను వెంటనే నా ఫీలింగ్ అర్దం చేసుకుని కాస్త సిగ్గు పడుతూ అవతల వైపుకు తిరిగింది. అటు తిరిగి సంతోషంగా కన్నీళ్లు తుడుచుకోసాగింది. అదంతా చూస్తున్న నాకు కాస్త చిరాకు వచ్చింది. రూప మాత్రం అటు వైపు తిరిగి సంతోషంగా ఆనంద బాష్పాలు వస్తుంటే తనలో తానే నవ్వుతూ ఉంది. నేను అది వెనుక నుండి చూసి కాస్త చిరాక్కా తన చేయి పట్టుకుని నా వైపుకు లాక్కున్నా. తను నా ముఖం లోకి చూసింది. తన ముఖం చాలా ప్రశాంతంగా హాయిగా సంతోషంగా ఉండడం కనిపించింది. నేను తిరిగి ఐ లవ్ యూ చెప్తే తనెంత ఆనందంగా ఫీల్ అవుతుందో అంతకు రెట్టింపు తనలో ఆనందం కనిపించింది. అది చూస్తూ నేను ఇక ఆపుతావా అన్నా. తను వస్తున్న ఆనందాన్ని కనిపించకుండా దాచిపెడుతూ సారి సారి అంది. నేను అది చూసి లేని కోపం తెచ్చుకుంటూ తన చేయి పట్టుకుని లాగుతూ కార్ దగ్గరికి తీసుకు పోయా. తీసుకు పోయి లేని కోపం తో ఇంకో సారి ఇలాంటి వేశాలు వేస్తే ఊరుకునేది లేదు రూపా అంటూ కార్ డోర్ తీసి తనని ఎక్కమన్నట్లు గా చూసా. తను నా వంక ఆనందంగా చూస్తూ కార్ ఎక్కింది.. 
 నాకెందుకో తన చూపులు కాస్త ఇబ్బందిగా అనిపించాయి. తను లోపల కూర్చో గానే డోర్ వేస్తూ,  దూరంగా అక్కడ నిలబడి ఉన్న ఒకతన్ని చూసి వాడి దగ్గరకు వెళ్ళా. వాడి చేతిలో మొబైల్ ఉంది. అది చూసి మొబైల్ తీసుకుని వాడికి డబ్బులు ఇచ్చి పంపించా. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవడం తో స్విచేడ్ ఆఫ్ అయ్యింది. ఫోన్ కు ఏమైనా డామేజ్ అయ్యిందేమో అని చూస్తూ  తిరిగి కార్ దగ్గరికి  వచ్చా. వచ్చి అక్కడే పడున్న బైక్ కు తాళం వేసి కార్ లోకి ఎక్కా. కార్ ఎక్కాక రూప చూపులు నన్ను గుచ్చుకున్నాయి. అవి గుచ్చుకుంటూ ఉంటే తన వంక చూసా. రూప నా వైపే సూటిగా చూస్తూ ఉంది. తన ముఖం లో ఎదో ఆనందం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నేను. చూపు తిప్పుకుని కార్ స్టార్ట్ చేశా. 
 కార్ ముందుకు పోనిస్తూ ఒకసారి తన వంక చూసా. తన ముఖం లో చాలా ఆనందం కనిపిస్తూ ఉంది. నేను కొంచెం సీరియస్ ముఖం పెడుతూ కాస్త ఊరికే ఉంటావా అన్నా. తను నేనేం చేశా అంది అమాయకంగా ముఖం పెడుతూ. నేను ఎం చెప్పలేక మళ్ళీ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టా. అలా నేను సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తుంటే సడెన్ గా రూప వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. అంతే నేను ఏంటిది అంటూ తనని కోపంగా చూసా. తను సారి సారి అంది వస్తున్న నవ్వును ఆపుకుంటూ. నేను మళ్ళీ డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టా. మధ్య మధ్యలో తనని చూస్తూనే ఉన్నా. తను తనలో తానే నవ్వుకుంటూ నన్ను చూస్తూ ఉంది. నేను మౌనంగా డ్రైవ్ చేస్తూ కార్ ఇంటికి పొనించా. ఇంటికి చేరుకున్నాక రూప ను చూసి వెళ్ళు ఇక అన్నా. తను వాళ్ళింటి వైపు ఒకసారి చూసి మళ్ళీ నా వైపు చూసి ఊహు నేను నీతోనే పడుకుంటా అంది చిన్నపిల్లలా ఫేస్ పెడుతూ. నేను లేని కోపం తో తనని ఎదో ఆనబోతూ ఎందుకు లే ఈ టైం లో అని అనిపించి సైలెంట్ గా కార్ దిగా. తను కూడా దిగింది. 
 ఇద్దరం ఇంట్లోకి వెళ్ళాం. తను డైరెక్ట్ గా నా గది లోకి వెళ్ళింది. నేను కూడా డోర్ వేసేసి నా రూం దగ్గరకు వెళ్ళా. అక్కడ రూప తన నైట్ డ్రెస్ వేసుకుంటూ కనిపించింది. (తన బట్టలు నా రూం లో స్టాక్ ఉన్నాయ్) నేను అది చూసి బయటకు వెళ్తుంటే రూప ఎన్టీ కొత్తగా ? అంది. నేను ఉఫ్ అనుకుంటూ లోపలికి వెళ్ళా. తను డ్రెస్ వేసుకుని నన్ను చూసింది. నేను ఇక పడుకో అన్నట్లుగా చూసా. తను తలూపి పడుకోవడానికి వెళ్తూ మళ్ళీ ఎదో గుర్తొచ్చిన దాని లా నన్ను చూసింది. నేను ఎన్టీ అని చూసా. తను దగ్గరికి వస్తూ సడెన్ గా నన్ను వాటేసుకుంది. నేను వదిలించు కుందాం అని చూసా. కానీ తను గట్టిగా పట్టేసుకుంది. అలా పట్టేసుకుని తల ఎత్తి నా వంక చూసింది. నేను ఏంటిది వదులు అన్నా. తను నవ్వుతూ థాంక్స్ అంది. నేను దేనికి అన్నా. తను నవ్వి నీ వల్ల ఈరోజు నీ మీద నాకెంత ప్రేమ ఉందో నాకు అర్దం అయ్యింది అంది. నేను ఎన్టీ అన్నట్లుగా చూసా. తను నా ఫీలింగ్ అర్దం చేసుకుని నువ్వు నా కంటికి కనిపించక పోయినా కూడా నువ్వు నా చుట్టు పక్కల ఉన్న విశయం నాకు తెలుస్తుంది అంటే నా ప్రేమ ఎంత బలమైనదో నాకు అర్దం అవుతుంది అంది. నేను ఉఫ్ అనుకుంటూ తనని నా నుండి కొద్దిగా జరిపా. తను ఒక అడుగు వెనక్కి వెళ్ళింది. నేను తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నువ్వెంత ప్రేమించినా, చివరికి అంకుల్ చూపించిన వాడే నీకు తాళి కడతాడు అన్నా. అంతే తను సీరియస్ గా చూసింది. చూసి నీతో కటీఫ్ అంటూ మూతి తిప్పుతూ వెళ్లి బోర్లా పడుకుంది.

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#19

తనలా మూతి తిప్పడం నాకు నచ్చింది. ముద్దుగా క్యూట్ గా అనిపించింది. తను అలా అలిగి వెళ్లి బోర్లా పడుకోవడం చూసి నేను తన దగ్గరికి వెళ్ళా పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేయడానికి. తను నేను ఏమైనా చెప్తాను ఏమో అని ఊహించి దిండు తో రెండు చెవులను మూసుకుని పడుకుంది. నేను అది చూసి నవ్వి అక్కడే ఉన్న బెడ్ షీట్ ను తీసుకుని తనకి కప్పబోయా. అప్పుడే ఒక అద్బుతం కనిపించింది నాకు. ఇప్పటికీ ఎన్నో సార్లు చూసినా కూడా నేను ఎప్పుడూ దాన్ని పెద్దగా పట్టించు కోలేదు. కానీ ఈసారి ఎందుకో యే మాయ చేసిందో కానీ తన పిరుదులు చూసి ఒక్క క్షణం ఆగిపోయా. చాలా సెక్సీ గా ఉంది అనిపించింది. వంట్లో ఎదో చలనం వస్తుంటే వెంటనే కంట్రోల్ అవుతూ చీ చీ తప్పు అనుకుని అక్కడే ఉన్న బెడ్ షీట్ ను తీసి కప్పా. కప్పే సమయం లో ఇంకోసారి చూసా. ఇసుక తిన్నెల్లా ఎత్తుగా ఉన్నాయ్ పిరుదులు, నైట్ డ్రెస్ వేసుకోవడం వల్ల షేప్ బాగా కనిపిస్తుంది. అది చూసి నవ్వుకుంటూ దీనికి ఎందుకు ఇంత కొవ్వో ఇప్పుడు అర్దం అవుతుంది అనుకున్నా. 
బెడ్ షీట్ కప్పి లైట్ ఆఫ్ చేస్తుంటే తను బెడ్షీట్ ను పక్కకు వేసేసింది. నేను తన వంక చూసా. ఇంకా బోర్లా పడుకునే ఉంది. వద్దన్నా కూడా కళ్ళు తన పిరుదుల మీదకు వెళ్తున్నాయి. ఇది తను నన్ను ఏమైనా టెంప్ట్ చేయడానికి చేస్తుందా అని డౌట్ వచ్చింది నాకు. అంతే వెంటనే వెళ్ళి హేయ్ ఎందుకే బెడ్షేట్ తీసేస్తున్నావ్ కప్పుకో అన్నా. తను అలాగే బోర్లా పడుకుని ఊహు అంటూ బాడీ ని ఊపింది. అలా ఊపగానే తన పిరుదులు అటు ఇటు ఊగాయ్. నైట్ ప్యాంట్ లో తన పిరుదులు ఊగడం చూడగానే నా వొంట్లో ఎదో చలనం వచ్చినట్లు అయ్యింది. నాకు అర్దం అయ్యింది ఇది నన్ను కావాలనే టెంప్ట్ చేస్తుంది అని. వెంటనే ఎలాగోలా చావు అని అంటూ వెళ్లి లైట్ ఆఫ్ చేశా.

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply
#20

Tq friends

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 6 users Like dom nic torrento's post
Like Reply




Users browsing this thread: 26 Guest(s)