13-01-2019, 05:19 PM
ఈ post అందరూ చదవండి దయచేసి...
కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు నేను నా పిల్లలతో థీయేటరుకు వెళ్ళాను.
' టిక్కెట్టు ఎంతండీ? " ఆని అడిగాను........
" కొత్త సినిమా కదా! అందులో ప్రముఖ హీరో సినిమా మరి.,.ఒక్కొక్క టికెట్టు 500 రూ. ఇవ్వమంటారా? " కౌంటరులోని వ్యక్తి.......ఒక్కనిమిషం ఆలోచించాను.......మేము నలుగురం . అంటే 2000 రూ. ఒక్క 2 గంటల సినిమాకు ఖర్చు........వెంటనే సినిమా హాలు బయటకు
వచ్చి ఆటో ఎక్కాను. ఆటోవాలా " ఎక్కడికి వెళ్ళాలి సార్ ?" అని అడిగాడు.
పిల్లలు.........భార్య కాస్త దిగులుగా ఉన్నట్టు అనిపించింది. అయినా
సరే అనుకుని ఆటోవాలాతో పక్కనే ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళమని
చెప్పేశాను. ఆటోవాలా కూడా మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు.
వృద్ధాశ్రమంలోకి వెళ్ళి ఒకపూట ఈ వృద్ధులకు భోజనానికి ఎంత అవుతుందని
అడిగాను.......ఆశ్రమంలోని వ్యక్తి 1500 రూ. అవుతుందని చెప్పగానే
" నా దగ్గర 2000 రూ. ఉన్నాయి........ఈ పూటకు ఈ పెద్దవాళ్ళకు
బోజనాలు పెట్టించండి....మరొక చిన్న విన్నపం.....నాకు నా తల్లిదండ్రులు
చిన్నప్పుడే చనిపోయారు. మేము కూడా ఈ రోజు ఇక్కడే భోంచేసి
మా పిల్లలు తాతయ్యలతో, నాన్నమ్మలతో, అమ్మమ్మలతో గడుపడానికి
మాకు అవకాశాన్ని ఇవ్వండి దయచేసి " అని అన్నాను.
సినిమాకు తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకుని వచ్చానని నాపై కాసేపు
అలిగినా........అక్కడ ఆ పెద్దలతో ఆటలు....పాటలు కథలతో
మా పిల్లలు ......మేము చాలా సంతోషంగా గడిపి వచ్చాము....
భోంచేసి బయటికి రాగానే ఒక పెద్దమ్మ నన్ను నా కుటుంబాన్ని ఇలా
దీవించింది.......
" మాకు కూడా మనవళ్ళు.........మనవరాళ్ళు ఉన్నారు. వారితో ఆడుకోవాలని
ఎన్నెన్నో కథలు చెప్పాలని ఉండేది ...మాకు భోజనాన్ని అందించడమే
కాకుండా మా సొంత కొడుకులా మాతో గడిపి వెళుతున్నందుకు మీరు
మీ కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళూ ఆనందంగా
ఉండాలని ఈ పండుటాకు దీవిస్తోంది. నీలాంటి వారికి దేవుడు అన్ని
విధాలుగా తోడుగా ఉంటాడు......జాగ్రత్తగా వెళ్ళిరండి "
నా భార్య కళ్ళల్లో ఓ గర్వంతో కూడిన ఆనందం......నా పిల్లల మొహంలో
సినిమాకు వెళ్ళినా కనపడని సంతోషం కనిపించింది.......మంచి పనిచేశానన్న
తృప్తితో ఇంటికి వచ్చాను...........
......
అందరికి తెలియాల్సిన సమాచారం...