Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
◆◆◆◆◆◆◆◆ 'అభినవ సీతమ్మ తల్లి' మహానటీమణి శ్రీమతి అంజలీదేవి 24-8-1927 13-1-2014 (ఈరోజు వారి వర్థంతి) ★★★★★
#1
కళాదీపికాంజలి'!
◆◆◆◆◆◆◆◆
'అభినవ సీతమ్మ తల్లి'
మహానటీమణి
శ్రీమతి అంజలీదేవి
24-8-1927    13-1-2014
(ఈరోజు వారి వర్థంతి)
★★★★★★★★★★★★★
అలవోకగా...
అన్నులమిన్నగా...
నవరసాలను
అన్నిటికీ మించి
కరుణ రసాన్ని
రసప్లావితంగా
ప్రేక్షక హృదయ
ఆ‍ర్ద్రంగా...
వెండితెరపై
ఆవిష్కరించిన
అలనాటి అందాల
అధ్బుత అభినేత్రి!
అభినవ 'సీత'!
అంజలీదేవి!

సినీ జగత్తులో ధృవతారలుగా వెలిగిన కొందరు నటీనటుల్లో అంజలీదేవిగారొకరు. 
గ్లామర్ అనే పదానికి కనపడనంత 
దూరంలో ఉండి,
తన అద్భుతమైన నటనతో 
తెలుగు ప్రజల మనస్సులో 
చిరకాలం నిలిచిపోయిన నటీమణి. 
'సీతమ్మగా', 'అనార్కలి'గా ఆమె నటన అద్భుతం. లవకుశ చిత్రంలో ఆమె పోషించిన 'సీత' పాత్ర నేటికి మన కళ్ల ముందు కదలాడుతుంది.  
తన వయసుకు మించిన పాత్రల్ని కూడా 
ఆ రోజుల్లోనే నటించి మెప్పించారు. 
ఆ రోజుల్లో అత్యధిక పారితోషకం తీసుకున్న 
తొలి నటి అంజలీదేవి గారే.

అంజలీదేవిగారు 1927, ఆగష్టు 24న తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం లో జన్మించారు . 
ఆమె అసలు పేరు అంజనీ కుమారి.అయితే దర్శకుడు సి. పుల్లయ్య గారు ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు. తన నట జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించి, ఆ తర్వాత సినీరంగం వైపు 
అడుగులు వేసారు. 

లవకుశ, సువర్ణ సుందరి, అనార్కలి, బండిపంతులు, భోగి మంటలు, వీరాంజనేయ, భక్త ప్రహ్లాద 
తదితర చిత్రాల ద్వారా చిరస్థాయి గుర్తింపు పొందారు.
 
1936లో 'రాజా హరిశ్చంద్ర'లో అంజలీదేవి గారు
చిన్న పాత్రతో పరిచయమయ్యారు. 
ఆ తరువాత కష్టజీవిలో నాయిక గా నటించారు. 1963లో 'లవకుశ'లో ఎన్.టి. రామారావు సరసన నటించిన 'సీత' పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. 
ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996 లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.  'సువర్ణసుందరి', 'అనార్కలి' లో 
ఆమె నటన మన్నన పొందింది.

అంజలీదేవి గారు నిర్మాతగా అంజలీ పిక్చర్స్ తరపున  అనార్కలి (1955) లో తాను నాయికగా అక్కినేని నాగేశ్వరరావు గారి జతన నటించిన సినిమాను నిర్మించారు. ఆ తరువాత భక్త తుకారాం (1973) మరియు చండీప్రియ (1980) నిర్మించారు. 
చండీప్రియ లో జయప్రద నాయికగా శోభన్ బాబు మరియు చిరంజీవి లతో నటించారు. 
మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించింది.

బృందావనం(1992), అన్న వదిన(1993) 
సెక్యూరిటీ అధికారి అల్లుడు(1994), బిగ్ బాస్. (1995)
ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.

తన నటనా ప్రతిభకు గుర్తింపుగా 
నాలుగు ఫిలింఫేర్ అవార్డులు
ఉత్తమ నటి - తెలుగు - అనార్కలి (1955)
ఉత్తమ నటి - తెలుగు - సువర్ణ సుందరి (1957)
ఉత్తమ నటి - తెలుగు - చెంచు లక్ష్మి (1958)
ఉత్తమ నటి - తెలుగు - జయభేరి (1959)
2005లో రఘుపతి వెంకయ్య అవార్డు, 
2006లో రామినేని ఫౌండేషన్ విశిష్ఠ పురస్కారం, 2008లో ఎఎన్నాఆర్ అవార్డును,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి 
గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.

'అభినవ సీత'గా,అసమాన నటీమణిగా 
అఖిలాంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన అంజలీదేవిగారు   జనవరి 13, 2014 లో 
తన 86వ ఏట చెన్నైలోని ఆమె స్వగృహంలో అనారోగ్యంతో తనవు చాలించారు.

Source:Internet
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.




Users browsing this thread: 1 Guest(s)