Thread Rating:
  • 5 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic సమాచారం... ఎంత భద్రం!?
#1
సమాచారం... ఎంత భద్రం!?


[Image: 10112019sun-cover1a.jpg]

* వాట్సాప్‌ హ్యాకింగ్‌...
* స్పైవేర్‌తో సైబర్‌ దాడి...
* వేలాది క్రెడిట్‌కార్డుల వివరాలు చోరీ...
* ఫేస్‌బుక్‌ ఫ్రెండే నిలువునా దోచేశాడు...
* ఒక్క ఈమెయిల్‌... ఖాతా ఖాళీ చేసింది...

ఈమధ్య మనం పేపర్లలో తరచూ చూస్తున్న వార్తలే ఇవన్నీ.
మన చేతిలో ఉన్న చిన్న ఫోనుమీదే ఇప్పుడు నేరగాళ్ల కళ్లన్నీ!
ఎన్నో పనుల్ని క్షణాల్లో చేసిపెట్టే అద్భుతమైన ఆ సాధనం ద్వారానే ఈ నేరాలన్నీ!





 horseride  Cheeta    
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
రవి ఆఫీసునుంచి అలసిపోయి ఇంటికి వచ్చాడు. ‘నాన్నా’ అంటూ కాళ్లని చుట్టేసిన కూతుర్ని ‘అన్నం తిన్నావా’ అని అడిగాడు.
‘నాకు అన్నం వద్దు. దోసె కావాలి’అంది ముద్దుగా ఆ చిన్నారి.
బయటికి వెళ్లి తెచ్చే ఓపిక లేదు, కూతురు అడిగితే కాదనలేడు. అందుకని ‘దోసె కావాలా... ఉండు ఆర్డర్‌ చేస్తా’ అంటూ ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు.

‘రవీ... మీరు దోసె ఆర్డర్‌ చేస్తున్నారా?’ అంటూ ఫోను తెర మీద నోటిఫికేషనూ ... ఆ వెంటనే ఫుడ్‌ డెలివరీ ఆప్‌ ప్రకటనా చూడగానే ఒక్కసారిగా వెన్నులోనుంచి వణుకొచ్చినట్లయింది రవికి. తను మాట్లాడింది అక్కడెలా ప్రత్యక్షమైందో అర్థం కాలేదు.
రవికే కాదు ఇలాంటి అనుభవాలు ఈ మధ్య చాలామందికి ఎదురవుతున్నాయి. ఫోను ఆన్‌లో లేకున్నా దాని ద్వారా మనని చూసేవారూ, మన మాటలు వినేవారూ, మన సమాచారాన్ని తీసుకునేవారూ... ఉన్నారు. మనకి కనపడకుండా, అసలేమాత్రం అనుమానం రాకుండా వాళ్లు అవన్నీ చేసేస్తున్నారు.


గూగుల్‌లో మనం దేని గురించైనా వెతికితే ఆ తర్వాత మనం ఏ వెబ్‌సైట్‌ తెరిచినా మనం వెతికిన విషయానికి సంబంధించిన వార్తలూ ప్రకటనలే కన్పిస్తాయి. మనకి కావలసింది తేలిగ్గా వెతుక్కోటానికీ వాళ్లకి ప్రకటనలు గిట్టుబాటవటానికీ అలా ప్రోగ్రామ్‌ చేసుకుని ఉంటారులే అనుకుని వదిలేస్తాం, దానివల్ల మనకేమీ హాని లేదు కాబట్టి. కానీ, మనం మాట్లాడుకున్నది వినడమూ ఎక్కడికి వెళ్తున్నదీ తెలుసుకోవడమూ ఏం చేస్తున్నదీ చూడడమూ అంటే... మన ఆంతరంగిక పరిధిలోకి చొచ్చుకురావడమే. మన వ్యక్తిగత స్వాతంత్య్రానికి భంగం కలిగించడమే. అందుకే రవికి ఎదురైన లాంటి అనుభవం ఎవరికైనా వణుకు తెప్పిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోంది, మన ఫోనులోని సమాచారాన్ని భద్రంగా ఉంచుకోవటం ఎలా అన్న సందేహాలను కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న సీ-డ్యాక్‌ సంస్థ నిపుణుల ముందు పెట్టగా వాళ్లేం చెబుతున్నారంటే...

[Image: 10112019sun-cover1b.jpg]
 horseride  Cheeta    
Like Reply
#3
ఫోను మన మాటలు వింటుందా?

మన స్మార్ట్‌ ఫోనులో ఉండే అన్ని ఆప్స్‌ వినగలవు. గూగుల్‌, ఫేస్‌బుక్‌ లాంటివి కూడా. అందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. ఓకే గూగుల్‌, సిరి, అమెజాన్‌ ఎకో లాంటివి మనం వాయిస్‌ కమాండ్‌ ఇస్తే రికార్డు చేస్తాయి కానీ అలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా ఫోనులో ఉన్న మైక్రోఫోన్‌ ద్వారా మన చుట్టూ విన్పిస్తున్న శబ్దాలను ఈ ఆప్‌లు రికార్డు చేస్తాయి. ‘ఆటోమేటెడ్‌ కంటెంట్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ’ ద్వారా విన్న శబ్దాల నుంచి జరుగుతున్న విషయాలను గ్రహించడానికి ప్రయత్నిస్తాయి. మనం టీవీ చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న ఫోను ఆన్‌ చేయకపోయినా టీవీ శబ్దాలను రికార్డుచేస్తుంది. దానిద్వారా ఏ సమయంలో ఏ కార్యక్రమాలు చూస్తున్నామో తెలుస్తుంది. ఒకవేళ మనం కారు కొనడానికి షోరూముకు వెళ్లామనుకోండి. దానికి ముందు ఏయే ప్రకటనలు చూశామూ ఫోన్లో ఏమేమి సెర్చ్‌ చేశామూ లాంటి సమాచారాన్నీ తీసుకుంటారు. ఈ సమాచారాన్నంతా క్రోడీకరించి మనం కారు కొనాలన్న నిర్ణయానికి రావడానికి దారితీసిన పరిస్థితులను బేరీజు వేస్తారు. ఇలా సేకరించిన సమాచారాన్ని ప్రకటనలూ మార్కెటింగ్‌ సంస్థలకు అమ్ముతారు. మన ఫోనులో ఉండే కొన్ని ఆప్స్‌ ద్వారా ఈ సాంకేతికతను ఉపయోగిస్తారు. వినటమే కాదు, మన ఫొటో తీసుకునే అవకాశమూ మన కదలికల్ని వీడియో రికార్డు చేసే అవకాశమూ కూడా ఈ ఆప్స్‌కి ఉంటుంది.
 horseride  Cheeta    
Like Reply
#4
వాటివల్ల ప్రమాదం లేకుండా చూసుకోవాలంటే...

* ఫోను సెట్టింగ్స్‌లోకి వెళ్లి మనం ఏయే ఆప్స్‌కి మైక్రోఫోన్‌ అనుమతి ఇచ్చామో చూడాలి. ఆ ఆప్‌ పనిచేయడానికి మైక్రోఫోన్‌ యాక్సెస్‌ తప్పనిసరి అయితే తప్ప లేకపోతే యాక్సెస్‌ తీసెయ్యొచ్చు.

* కొత్త ఆప్‌ ఏదైనా డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు అది మైక్రోఫోన్‌కి యాక్సెస్‌ అడుగుతుంటే ఆ అనుమతి ఇవ్వడం అవసరమా కాదా అన్నది ఆలోచించుకోవాలి.

* ఆప్స్‌ని వాడనప్పుడు మ్యూట్‌ చేసినా మైక్రోఫోన్‌ పనిచేయదు.

* అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌లాంటి వాటితో జరిపిన సంభాషణల రికార్డింగుల్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుని డిలీట్‌ చేసే అవకాశమూ ఫోనులో ఉంటుంది.

* ఫోన్లే కాదు, కొన్ని బ్రాండ్ల స్మార్ట్‌ టీవీలు కూడా చుట్టూ విన్పించే శబ్దాల్ని వింటాయి. శాంసంగ్‌ టీవీ వాడుతున్నట్లయితే స్మార్ట్‌ హబ్‌లోకి వెళ్లి టర్మ్‌ అండ్‌ పాలసీ కింద ‘సింక్‌ ప్లస్‌ అండ్‌ మార్కెటింగ్‌’ ఆప్షన్‌ని డిజేబుల్‌ చేయాలి. ఎల్జీ టీవీ అయితే ఆప్షన్లలో ‘లైవ్‌ప్లస్‌’ని ఆఫ్‌ చేయాలి.
 horseride  Cheeta    
Like Reply
#5
మరి మిగతా విషయాల్లో..?

సమాచారాన్ని భద్రంగా దాచుకోవడం నెటిజెన్‌గా మన బాధ్యత. మన నిర్లక్ష్యం కూడా చాలాసార్లు మోసపోవటానికి కారణమవుతుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చూపుతున్న ఉత్సాహాన్ని భద్రతపరంగా చూపకపోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతోంది.

ఈ సంఘటనలు చూడండి...
** హేమలత సొంతంగా కాలేజీ నిర్వహిస్తున్నారు. ఒకరోజు ఆమె పనిలో తలమునకలుగా ఉన్నప్పుడు ఫోనొచ్చింది. ‘మేడమ్‌ బ్యాంకునుంచి మాట్లాడుతున్నాను. కంప్యూటర్లు అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం, మీకో ఓటీపీ వస్తుంది. అది చెప్పండి’ అనగానే ఆవిడ మెసేజ్‌ చూసి ఓటీపీ చెప్పేసి తన పనిలో పడిపోయారు. వారం తర్వాత చూసుకుంటే నాలుగు దఫాలుగా ఐదు లక్షల సొమ్ము ఆమె ఖాతాలోనుంచి మాయమైంది.
కంప్యూటర్లూ ఖాతాల నిర్వహణ అంతా బ్యాంకు చేతిలో ఉన్నప్పుడు మనని ఎందుకు అడుగుతారూ అని కొంచెం ఆలోచించి ఉంటే ఆమె ఓటీపీ చెప్పేవారు కాదు.

** రమేశ్‌ తరచూ అమెజాన్‌లో షాపింగ్‌ చేస్తుంటాడు. ఒకసారి అతడికి ఫోన్‌ వచ్చింది. ‘అమెజాన్‌ నుంచి మాట్లాడుతున్నాం. మా విలువైన కస్టమర్లలో ఒకరైన మీకు సగం ధరకే ఐఫోన్‌ ఇవ్వాలనుకుంటున్నాం. సాయంత్రంలోగా ఈ ఎకౌంట్‌కి నలబైవేలు జమచేయండి’ అని చెప్పాడు ఫోనులోని వ్యక్తి. వెంటనే వాళ్లు చెప్పిన అకౌంట్‌లో డబ్బు వేశాడు రమేశ్‌. ఎన్నాళ్లైనా ఐఫోను రాలేదు. అప్పుడు కానీ తాను మోసపోయినట్లు తెలియలేదు రమేశ్‌కి. డబ్బు చెల్లించేముందు ఒక్కసారి అమెజాన్‌లో అలాంటి పథకం ఉందా లేదా అని కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేసి తెలుసుకోవాల్సింది.
 horseride  Cheeta    
Like Reply
#6
వీటన్నిటికి సొల్యూషన్ ఒకటే స్మార్ట్ ఫోన్ వాడటం ఆపేయడం అని చాలమంది చెప్తారు
కానీ అది మన జీవితం లో ఓక పార్ట్ ల కాకుండా అదే జీవితం ల తాయారు అయ్యింది
ఇక ఎలా వదులుకోవడం అనేదే ఓక చిక్కు ప్రశ్న
Like Reply
#7
** పదహారేళ్ల రజని ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్స్‌తో తరచూ చాటింగ్‌ చేసేది. ఒక ఫ్రెండ్‌ ఆమె అందచందాల్ని తెగ పొగిడేవాడు.
ఆ అమ్మాయి మురిసిపోయేది. రకరకాల డ్రెస్సుల్లో ఫొటోలు దిగి పంపమంటే అలాగే పంపించేది. కొన్నాళ్ల తర్వాత అతడు ఆ ఫొటోలను బయటపెట్టకుండా ఉండాలంటే డబ్బు పంపాలని డిమాండ్‌ చేయడం మొదలెట్టాడు. ముక్కూమొహం తెలియని వారికి ఫొటోల్ని పంపడం తప్పే కదా.


... ఇవన్నీ మన తెలుగు రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన కేసులే. సైబర్‌ క్రైమ్‌ ఇప్పుడొక వృత్తిగా మారిపోయింది. కష్టపడకుండా డబ్బు సంపాదించడానికీ అమ్మాయిలను లోబరుచుకోవడానికీ దీన్నో మాధ్యమంగా ఎంచుకుంటున్నారు. సాంకేతికంగా నైపుణ్యం ఉన్నవాళ్లు హ్యాకింగ్‌కి పాల్పడి బ్యాంకులూ వ్యాపారసంస్థలను మోసం చేస్తోంటే అంత నైపుణ్యం లేకుండానే చౌకబారు పనులతో అమాయకులైన మహిళల్నీ ఆడపిల్లల్నీ లక్ష్యం చేసుకుని డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. కంపెనీలు సైబర్‌ దాడుల్ని ఎదుర్కోడానికి తమ జాగ్రత్తలో తాముంటాయి. వ్యక్తులుగా మన జాగ్రత్తలో మనం ఉండాలి.
 horseride  Cheeta    
Like Reply
#8
ఏ విధంగా?

బ్యాంకు ఖాతాలూ కార్డులకు సంబంధించిన విషయాలు చెప్పమంటూ బ్యాంకుపేరుతోనో మరో సంస్థ పేరుతోనో ఈమెయిల్‌ కానీ సందేశం కానీ వస్తే... ఫిషింగ్‌ ఈమెయిల్స్‌ అంటారు వీటిని. సైబర్‌ నేరాల్లో 90శాతం వీటివల్లే జరుగుతాయి. నేరగాళ్లు బ్యాంకు పేరుతో మెయిల్‌ పంపుతారు. మీ ఖాతాకి సంబంధించి ఏదో సమస్య వచ్చిందనీ దాన్ని పరిష్కరించే క్రమంలో మీ పాస్‌వర్డ్‌ అవసరమనీ. బ్యాంకు వాళ్లే కదా అని మనం మరో ఆలోచన లేకుండా వెంటనే మన యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ టైప్‌ చేస్తాం. అది కాస్తా దొంగలకు చేరుతుంది. వాళ్లు మన ఖాతాలోకి లాగిన్‌ అయ్యి మన ఫోన్‌ నంబరు స్థానంలో వాళ్ల నంబరు మారుస్తారు. దాంతో ఖాతాలో జరిగిన లావాదేవీల గురించి ఫోనులో మనకి సందేశం రాదు. మనం చూసుకునేలోపే ఖాతా ఖాళీ అయిపోతుంది. ఈ మోసాలకు రాష్ట్రాలూ దేశాలన్న సరిహద్దులు ఉండవు. బ్యాంకులు ఎప్పుడూ అలాంటి సమాచారాన్ని అడగవన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.

పిన్‌, ఓటీపీ లాంటివి ఎవరికీ చెప్పకూడదు. ఆన్‌లైన్లో జరిపే ప్రతి లావాదేవీకీ ఓటీపీ పంపమని అడగాలి. ఎప్పుడూ కూడా కార్డు, పిన్‌ నంబర్లను బ్రౌజర్‌లో సేవ్‌ చేయకూడదు. వాట్సాప్‌లో, ఎస్సెమ్మెస్‌లో వాటిని మరొకరికి పంపకూడదు. ఫ్రీ వైఫై వాడుతున్నపుడు బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించకూడదు. రెండు క్రెడిట్‌ కార్డులు ఉంచుకుని ఒకటి బయటా ఒకటి ఆన్‌లైన్‌ షాపింగ్‌కీ వాడడం ఒక పద్ధతి. ఆన్‌లైన్‌కి వాడేదానికి తక్కువ మొత్తం పరిమితి పెట్టుకోవాలి. ఆలాగే ఆన్‌లైన్‌ లావాదేవీలకు డెబిట్‌ కార్డు వాడకుండా ఉండటమే మంచిది.
 horseride  Cheeta    
Like Reply
#9
ఫోనులో సమాచారాన్నీ దొంగిలిస్తారా?

[Image: 10112019sun-cover1d.jpg]


ఫోనులోకి చొరబడే అవకాశం కొద్ది సెకన్లు లభించినా చాలు నేరస్తులకి. మొత్తం సమాచారాన్ని తీసేసుకోగలరు. ఫోనులోకి చొరబడే అవకాశం వారికి ఇవ్వకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ పాస్‌వర్డులతో సమాచారానికి తాళాలు వేసుకోవాలి. వారం క్రితం ఇదే రోజున ఏం చేశావని అడిగితే సమాధానం చెప్పడానికి మనం తడుముకుంటాం కానీ, నెటిజెన్‌గా మారినప్పటినుంచీ మన చరిత్ర అంతా గూగుల్‌లో నిక్షిప్తమై ఉంటుంది. ఏమేం బ్రౌజ్‌ చేసిందీ, ఏయే సర్వీసుల్ని వాడుకుందీ యాక్టివిటీ చిట్టాలో నమోదవుతుంది. మెయిళ్లు, ఫొటోలు, కాంటాక్టులు... అన్నీ ‘టేక్‌అవుట్‌.గూగుల్‌.కామ్‌’లో నిక్షిప్తమై ఉంటాయి. గూగుల్‌ డ్రైవ్‌లో బ్యాకప్‌ అయ్యే వాట్సాప్‌ సందేశాలు మనకి అవసరం లేదనుకుంటే గూగుల్‌డ్రైవ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి బ్యాకప్‌ ఆప్షన్‌ తీసెయ్యొచ్చు.

సాధారణంగా స్మార్ట్‌ ఫోన్‌ వాడేవాళ్లందరూ పైకి కన్పించే కొన్ని అప్లికేషన్లను వినియోగించడం తప్ప ఫోనులో ఉన్న సౌకర్యాల గురించి లోతుగా తెలుసుకోరు. ఫొటోల్నీ, ముఖ్యమైన డాక్యుమెంట్లనీ గూగుల్‌డ్రైవ్‌లో సేవ్‌ చేసుకోవటమే కాదు, డ్రైవ్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడున్న ఆప్షన్లను తెలుసుకుని వినియోగించుకోవాలి. ఆప్స్‌ని మేనేజ్‌ చేసే ఆప్షన్‌ కూడా అక్కడ ఉంటుంది.
 horseride  Cheeta    
Like Reply
#10
పైన నేను అన్నదానికి సొల్యూషన్ ఇస్తున్నారా సరిథ్ గారు???
Like Reply
#11
ఆప్‌లతో భద్రత ఎలా?

అవసరం ఉన్న ఆప్‌లను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కొత్తగా ఉందనో, సరదాకోసమో డౌన్‌లోడ్‌ చేయకూడదు. ఈ మధ్య ఏ వయసులో మనం ఎలా ఉంటామో తెలిపే ఆప్స్‌ వచ్చాయి. ఒక పక్కన ఫేస్‌ రికగ్నిషన్‌ని వేలిముద్రలాగా వాడే ప్రయత్నాలు జరుగుతున్నపుడు ఇలా  మన ముఖం ఫొటోని అన్ని కోణాల్లో ఒక ఆప్‌ విశ్లేషించే అవకాశం ఇవ్వడం కోరి ప్రమాదాన్ని కొనితెచ్చుకోవటమే. అలాగే నకిలీ ఆప్స్‌ ఫోనులోకి రాకుండా జాగ్రత్త పడాలి. ప్లేస్టోర్‌, ఆప్‌స్టోర్‌ లాంటి అధికారిక సోర్స్‌ నుంచి మాత్రమే ఆప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. చాలాసార్లు ఒరిజినల్‌ ఆప్స్‌కి కొద్దిపాటి తేడాతో నకిలీ ఆప్‌లను తయారుచేస్తారు. అందుకని ఏ ఆప్‌ అయినా డౌన్‌లోడ్‌ చేసేముందు దాని తయారీదారు ఎవరో, ఎప్పుడు తయారైందో చూడాలి. రివ్యూలు చదివి ఆ తర్వాతే నిర్ణయించుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన మరొక్క విషయం...

ఉదాహరణకు మీరు స్కైప్‌ ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకుంటే అది ఎస్సెమ్మెస్‌లు, కాల్‌లాగ్స్‌, మీడియా ఫైల్స్‌లాంటి వాటికి యాక్సెస్‌ అడుగుతుంది. ఆ ఆప్‌ పనిచేయడానికి అవి అవసరం. కానీ ఏ గేమింగ్‌ ఆప్‌నో డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు అది కూడా వీటిని అడిగితే అది మంచి ఆప్‌ కాదని అర్థం. అవసరం లేని ఆప్‌లని ఫోన్లో ఉంచుకోకూడదు. అలాగే ఉదాహరణకి టాక్సీ ఆప్‌ని వాడేటప్పుడు ఫోనులో మన లొకేషన్‌ని ఎనేబుల్‌ చేయాల్సి వస్తుంది. అంతమాత్రాన అవసరమే కదా అని ఎప్పుడూ దాన్ని అలాగే ఉంచకూడదు. పని అయిపోగానే డిజేబుల్‌ చేయాలి. అలా చేయకపోతే మనం ఎక్కడ ఉన్నదీ ఎవరైనా తెలుసుకోవచ్చు. టికెట్‌ బుకింగ్‌, షాపింగ్‌, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు, మ్యాట్రిమోని సైట్లలో... ఇలా ప్రతి చోటా మన వ్యక్తిగత సమాచారం ఆన్‌లైన్లోకి వెళ్తుంది. ఆ సమాచారం అక్కడ భద్రంగా ఉండాలంటే ఫేక్‌ వెబ్‌సైట్లలోకి వెళ్లకుండా చూసుకోవాలి. అదెలా తెలుస్తుందీ అంటే- అడ్రస్‌ బార్‌లో వెబ్‌సైట్‌ పేరుకి ముందు తాళం గుర్తు ఉందో లేదో చూడాలి.
 horseride  Cheeta    
Like Reply
#12
ఇతరత్రా జాగ్రత్తలు ఇంకేమన్నా...

* అంతర్జాలంలోకి ఒకసారి ఫొటో వెళ్లిందంటే దాన్ని పూర్తిగా తొలగించడం అసాధ్యం. కాబట్టి ఏవి పెట్టవచ్చో ఏవి పెట్టకూడదో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి.
* ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నామన్న విషయాల్ని అనుక్షణం సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేయటం మంచిది కాదు.
* అపరిచితులతో చాటింగ్‌ చేయటమూ, వ్యక్తిగత వివరాలూ ఫొటోలూ షేర్‌ చేయడమూ ప్రమాదకరం.

* ఏ గ్యాడ్జెట్‌ను అయినా ముందు సెక్యూరిటీ సెట్టింగ్స్‌ అన్నీ సరిగ్గా తెలుసుకున్నాకే ఉపయోగించాలి.
* ఫోన్‌ స్క్రీన్‌ లాక్‌ పెట్టుకోవాలి. అవసరమైన ప్రతిచోటా బలమైన పాస్‌వర్డులు పెట్టుకుని ఆర్నెల్లకోసారి తప్పనిసరిగా మార్చుకోవాలి. అవి కుటుంబసభ్యుల పేర్లూ పుట్టిన్రోజులూ కాకూడదు.
* ఇంట్లో వాడే డెస్క్‌టాప్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో ‘సేఫ్‌ సెర్చ్‌’ ఆప్షన్‌ ఎంచుకోవాలి. ఆఫీసులో ఒకే కంప్యూటర్‌ని ఎక్కువ మంది వాడాల్సి వస్తే బ్రౌజింగ్‌ హిస్టరీని ఎప్పటికప్పుడు తొలగించాలి.

* ఈమెయిల్‌లో వచ్చిన లింకుల్ని క్లిక్‌ చేయకుండా కాపీ చేసుకుని అడ్రస్‌బార్‌లో పేస్ట్‌ చేసి తెరవాలి.
* ఆప్స్‌ ఏవీ వినియోగదారులకు మెయిల్‌, మెసేజ్‌, ఫోన్లు... చేయవు. వాటి పేరుతో బహుమతి వచ్చిందని మెయిలో ఫోనో వచ్చిందంటే అది మోసమే.
* వెబ్‌ క్యామ్‌ ఉపయోగించగానే కనెక్షన్‌ తీసేయాలి. కెమెరాని మూసెయ్యాలి. కనెక్ట్‌ అయివుంటే మన ప్రమేయం లేకుండా కెమెరాని ఆన్‌ చేసి మన కదలికల్ని రికార్డు చేసే ఆప్స్‌ ఎన్నో ఉన్నాయి.

* కంప్యూటర్‌ అయినా, ఫోన్‌ అయినా ఎప్పటికప్పుడు సమాచారాన్ని హార్డ్‌డిస్కులోకి కానీ, గూగుల్‌ డ్రైవ్‌లోకి కానీ బ్యాకప్‌ చేసుకుని గ్యాడ్జెట్‌లోనుంచి తీసేయాలి.
* ఫోన్‌ చార్జింగ్‌ పోర్టుల ద్వారా కూడా సమాచారాన్ని దొంగిలిస్తారు. వ్యక్తిగత చార్జరు వినియోగించాలి. దొరికిన పెన్‌డ్రైవ్‌లు వాడకూడదు.
* ఫోను పోయినప్పుడు వెంటనే సిమ్‌ లాక్‌ చేయించి, సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలి.

* * * * *

ఇంట్లో దొంగలు పడకుండా ఇంటికి తాళం వేస్తాం. అది సరిగ్గా పడిందో లేదోనని ఒకటికి రెండుసార్లు లాగి చూస్తాం.
అలాగే అంతర్జాల వేదికపై ఉండే ఎంతో విలువైన మన వ్యక్తిగత సమాచారాన్నీ నేరగాళ్ల నుంచి రక్షించుకోవాలి.
అందుకు వేసే తాళాలే ఈ జాగ్రత్తలన్నీ!
 horseride  Cheeta    
Like Reply
#13
Thanks for posting such a  very useful information
[Image: images?q=tbn:ANd9GcSggC7qnQ9n8KWxrlEw8nG...Wx6e6yqA&s]

visit my thread for E-books Click Here 

All photos I posted.. are collected from net
Like Reply
#14
సరిత్ గారు

చదువుతుంటే భస్మాసూరుడి వరంలా
కనపడుతుంది ఈ స్మార్ట్ ఫోన్ ......... yes కాస్త పరిజ్ఞానం ఉండాలి ...... very educating ....
ముఖ్యంగా నాలాంటి వారికి.....
థ్యాంక్యూ వెరిమచ్......
Keep up with good work
mm గిరీశం
Like Reply
#15
భయపెట్టి.. బుజ్జగించి.. ముంచి...
దిల్లీ సెక్యూరిటీ ఆఫీసర్లమంటూ రూ.7.71 లక్షలకు టోకరా

[Image: amr-GEN3A.jpg]
ఈనాడు డిజిటల్‌, విజయవాడ: ‘హలో నేను.. దిల్లీ సైబర్‌ క్రైం సెక్యూరిటీ అధికారి‌స్టేషన్‌ నుంచి అధికారిని మాట్లాడుతున్నాను. మీ ఫోన్‌ నంబరు నుంచి మహిళలను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. మీరు ఎక్కడ ఉంటారు.? ఏం చేస్తుంటారు.?’

విజయవాడ నగరంలోని కొందరికి ఇటీవల ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ పెరిగాయి. దీంతో ఈ ఫోన్‌ కాల్‌ రాగానే.. వెంటనే బెంబేలెత్తిపోయిన బాధితులు తమ పూర్తి వివరాలు చెప్పేసి.. తమకేం సంబంధం లేదంటూ భయంతో చెబుతుంటారు. కానీ.. వారికి తెలియని అసలు కథ.. ఇక్కడి నుంచే ఆరంభమవుతుంది. వారిని గుల్ల చేసేలా సైబర్‌ నేరగాళ్లు ఈ కొత్త పంథాలో తమకు అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. సెక్యూరిటీ ఆఫీసర్లమంటూ తొలుత భయపెట్టి.. ఆ తర్వాత వీళ్లు ఇటునుంచి బతిమాలుకోవడం ఆరంభించాక.. అటునుంచి అసలు డ్రామా మొదలుపెడుతున్నారు. సరే.. మీరు చెప్పేది మేం నమ్ముతున్నాం. మీరు మంచి వారే.. కానీ.. మీ సిమ్‌కార్డ్‌ను ఎవరో క్లోన్‌(డూప్లికేట్‌) చేశారు. ఆ నంబరు నుంచి వాళ్లు ఫోన్లు చేసి వేధిస్తుంటే.. ఆ నేరం మీపైకి వస్తోంది. అందుకే.. దీని నుంచి బయటపడాలంటే మేం చెప్పినట్టు చేయండి అంటూ.. అటునుంచి నమ్మిస్తున్నారు. ఆ తర్వాత బాధితుల చేతులతోనే వారి సెల్‌ఫోన్‌ను హ్యాక్‌ చేసి రూ.లక్షలతో ఉడాయిస్తున్నారు. తాజాగా విజయవాడలోని  ఓ బాధితుడికి ఇలాగే టోపీ పెట్టారు.

విజయవాడకి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు సంస్థలో మార్కెటింగ్‌ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇతని చరవాణికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి.. దిల్లీ సైబర్‌క్రైం సెక్యూరిటీ ఆఫీసర్లమంటూ పరిచయం చేసుకున్నారు. మీ నంబరు నుంచి పలువురి మహిళలను వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందిందని మీ చిరునామా చెప్పండంటూ దబాయించారు. దీంతో భయపడిన బాధితుడు తనకు ఏం తెలియదని, నేను ఎవరికీ ఫోన్‌ చేయలేదంటూ చెబుతుండగా.. వారికి కావాల్సిన వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. మీ నంబరును ఎవరో క్లోన్‌ చేసి వినియోగిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలంటే మేం చెప్పినట్టు చేయాలంటూ నమ్మించారు. మీరు ఏ ఫోన్‌ వాడుతున్నారంటూ అడగ్గా.. ఐఫోన్‌ అంటూ బాధితుడు తెలిపాడు. మీ నంబరును ఏదైనా ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వేయాలని సూచించారు. తాము కొన్ని కాంటాక్ట్‌లు, యాప్‌లు పంపిస్తానని వాటిని మీ ఫోన్‌లో నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో కొన్ని చరవాణి నంబర్లను సంక్షిప్త సందేశం రూపంలో పంపగా.. డీవోటీసెక్యూర్‌.ఏపీకే అనే అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోమని సూచించారు. అనంతరం సేవ్‌ చేసుకున్న చరవాణి నంబర్లను బ్లాక్‌ చేసుకోమని చెప్పి.. ఇక మీకేం ఇబ్బందులుండవని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. ఆ తర్వాతే అసలు కథ ఆరంభమైంది.

ఈ తతంగం మొత్తం దాదాపు గంట సేపు జరిగింది. ఈ సమయంలో బాధితుడి చరవాణిలో ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌ ద్వారా హ్యాక్‌ చేయడం మొదలు పెట్టారు. బాధితుడి క్రెడిట్‌ కార్డు నుంచి దాదాపు రూ.7,71,388లను కాజేశారు. మొత్తం ఐదు విడతల్లో ఈ మొత్తాన్ని వివిధ యాప్‌లకు బదలాయించారు. ఈ సొమ్ముతో దేశంలోని పలు ప్రాంతాలకు విమాన టిక్కెట్లను కొనుగోలు చేశారు. అనంతరం వీటిని అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. దీనిపై సైబర్‌సెక్యూరిటీ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తున్నారు.
 horseride  Cheeta    
Like Reply




Users browsing this thread: 1 Guest(s)