Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
శ్రావణసమీరాలు...by sameera
#1
        శ్రావణసమీరాలు
[Image: images-6.jpg]
                       ...by sameera
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
శ్రావణ్ ఊరెళ్లి నాలుగు రోజులయ్యింది. రెండు రోజుల్లో తిరిగొస్తానన్నాడు, ఇంకా రాలేదు. ఇలా ఆలోచిస్తూ ఆ రాత్రికి నిద్రపోయాను. ఉదయాన్నే లేచి కాలేజికి రెడీ అయ్యి లంచ్ బాక్స్ తీసుకుని బస్సు ఎక్కేసాను. As usual గా విండో దగ్గర కూర్చున్నాను. బస్సు కాలేజిలోకి వచ్చేసింది. అందరు దిగేస్తున్నారు. సరిగ్గా నేను లేవబోతున్న సమయానికి నా మొబైల్ మోగింది. చూస్తే శ్రావణ్ కాలింగ్. నాకు చాలా కోపం వచ్చింది. కాల్ lift చేసి చడామడా అరిచేశాను.అటువైపు నుండి మౌనం. నేను కాసేపు గ్యాప్ ఇచ్చాను. అప్పటికీ తను ఇంకా ఏమి మాట్లాడలేదు. "హల్లో శ్రావణ్" అన్నాను.
"అయిపోయిందా?" అన్నాడు.
"అవ్వలేదు" అన్నాను కోపంగా.
"సరే కానీ" అన్నాడు వెటకారంగా.
నాకు కోంచెం నవ్వు వచ్చింది ఆ మాట వినగానే. కానీ ఆ నవ్వును ఆపుకుంటూ "నాతో మాట్లాడొద్దు" అన్నాను లేని కోపం నటిస్తూ.
"సరే కాల్ కట్ చేయమంటావా?" అన్నాడు.
"చంపేస్తాను కాల్ కట్ చేస్తే" అన్నాను.
"మాట్లాడనంటావు అంతలోనే కాల్ కట్ చేస్తే చంపుతానంటావు. ఇలా ఐతే నీతో కష్టం సమీర. నన్ను మర్చిపో. నేను కూడా నిన్ను మర్చిపోతాను" అన్నాడు.
"ఇదిగో ఈ మాటలే నాకు కోపం తెప్పించేవి" అన్నాను.
"అదంతా వదిలెయ్. ఎలా ఉనావ్ సమీరా?"
"నా గురించి పక్కనపెట్టు నువ్వెలా ఉన్నావ్ రా? వెళ్తే ఫోన్ కూడా చెయ్యవు నువ్వు. నేను చేస్తే ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అని వస్తుంది"
"మన ఊరి గురించి తెలుసు కదా నీకు? అక్కడ network లేదు.సారీ రా" అన్నాడు.
"ఈ సారీలకేమీ తక్కువ లేదు" అన్నాను.
అటువైపు నుంచి మౌనం. "శ్రావణ్" అన్నాను.
"మ్మ్" అన్నాడు తను.
"నిన్ను చూడాలని ఉంది రా"
"నాకు కూడా నిన్ను చూడాలని ఉంది. కానీ నువ్వేమో అటువైపు తిరిగి మాట్లాడుతున్నావు"
"ఏం మాట్లాడుతున్నావు?" అర్థం కాక అడిగాను.
"వెనక్కి తిరుగు" అన్నాడు.
తిరిగి చూడగానే అప్పుడే బస్సు వెనుక డోర్ లో నుండి ఎక్కి నాకు కొద్ది దూరంలో నిలుచున్నాడు. వాన్ని చూడగానే చాలా ఆనందమేసింది. బస్సు కమ్మీలను అడ్డుకుంటూ పరుగెత్తుకుంటూ వాడి దగ్గరకు వెళ్లి వాన్ని గుండెలమీద చిన్నగా పిడిగుద్దులు గుద్దుతున్నాను. శ్రావణ్ నా దెబ్బలను కాచుకుంటూ "అబ్బా ఆగవే రాక్షసీ" అన్నాడు.ఇక కొట్టడం ఆపేసి "రెండు రోజుల్లో వస్తానని ఇప్పుడా వచ్చేది?" అన్నాను. కాస్త ఏడుపు ముఖంతో.
"సారీ....." అంటూ గుంజిళ్లు తీయసాగాడు. నేను వాడి భుజం మీద చిన్నగా కొట్టి "చాల్లే" అన్నాను అలిగినట్లు.
"అలిగితే ఎంత బాగుంటావో తెలుసా?" అన్నాడు.
"నాకు తెలీదు" అని వెనక్కి తిరిగి నడవసాగాను. వాడు నా వెనుక వస్తూ "నాక్కూడా తెలీదు" అన్నాడు నా చెవిలో.
"నిన్నూ....." అంటూ వాడి వైపు తిరిగి చెయ్యెత్తాను.
"సారీ...సారీ..." అంటూ వెనక్కి వంగాడు.
అలా వాణ్ని చూడగానే నవ్వొచ్చేసింది. చిన్నగా నవ్వేసాను.
"ఇది చూడాలని ఇంత సేపు అనుకుంటూ ఉంటే నువ్వేమో...." అన్నాడు.
"ఏం చూడాలని?" అన్నాను.
నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని "నవ్వుతున్న నీ అందమైన ముఖం చూడాలని" అన్నాడు.
నేను వాన్ని గట్టిగా హగ్ చేసుకున్నాను. వాడు కూడా నా చుట్టూ చేతులు వేస్తూ "లవ్ యూ సమీర" అన్నాడు. నాకు ఏడుపొచ్చేసింది.
"లవ్ యూ టూ" అన్నాను కాస్త ఏడుపు గొంతుతో. నా గొంతులో తడి అర్థమైనట్లు ఉంది నా తలెత్తి చూసి కాస్త నవ్వుతూ "ఇదిగో ఏడ్చావంటే వెళ్లిపోతాను చెప్తున్నా" అన్నాడు.
నేను వాన్ని నా వైపు లాక్కొని ఇంకా గట్టిగా హగ్ చేస్కుంటూ నవ్వుతూ "చంపుతా" అన్నాను.
"సరేగానీ క్లాస్ కు వెళ్దామా? అసలే నాకు 4 డేస్ ఆబ్సెంట్"
నేను నవ్వుతూ "అప్పుడేనా?" అన్నాను.
"అబ్బా చాల్లేవే" అన్నాడు నన్ను బలవంతంగా విడిపించుకుంటూ.
"నువ్వెప్పుడూ ఇంతే బావా" అన్నాను గోముగా.
అవును శ్రావణ్ నా బావ. నా గురించి చెప్పాలంటే నాకు శ్రావణ్ అంటే ప్రాణం. నా పేరు సమీర. నాదీ, శ్రావణ్ దీ ఒకే ఊరు. అది కర్నూలు జిల్లాలో ఒక ప్రాంతం. మేము ఇద్దరం హైదరాబాదులోని ఒక ఇంజినీరింగ్ కాలేజిలో సెకండ్ ఇయర్ చదువుతున్నాము.
Like Reply
#3
హైదరాబాద్ లోని ఒక ఏరియాలో నేను హాస్టల్లో ఉంటున్నాను. బావేమో అదే ఏరియాలో సింగిల్ గా రూంలో ఉంటున్నాడు.
ఇద్దరం బస్సు దిగి క్లాసులోకి వెళ్లాం. నేను ముందు, నా వెనుక బావ క్లాసులోకి వెళ్లిపోయాం. నేను వెళ్లి కావ్య పక్కన కూర్చున్నాను.(కావ్య మా క్లాస్ మేట్). కావ్య నన్ను చూసి నవ్వింది.
"ఎందుకు నవ్వుతున్నావే?" అని అడిగాను.
"నువ్వు చాలా అదృష్టవంతురాలివి" అంది.
"ఎందుకు?" అని ప్రశ్నించాను.
"శ్రావణ్ లాంటి వాడు నీకు బావైనందుకు" అంది.
నాకు కొంచెం గర్వంగా అనిపించింది.
"నువ్వెలా చెప్తున్నావే నా అదృష్టం గురించి?" అని అడిగాను.
"ఏం లేదు. నువ్వంటే శ్రావణ్ కి చాలా ఇష్టం కదా అందుకే" అని అంది.
ఆ మాట వినగానే నాకు చాలా ఆనందమేసి సడన్ గా బావ వైపు చూశాను. వాడు వాడి ఫ్రెండ్స్ తో నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇక ఆ రోజుకి క్లాసెస్ అయిపోయిన తరువాత నేను బావ సెల్ కు "నీతో మాట్లాడాలి కాసేపు ఆగు" అని మెసేజ్ పెట్టాను. అందరూ వెళ్లిపోయారు. క్లాస్ లో నేను బావ మాత్రమే ఉన్నాం.
"ఎందుకే ఆగమన్నావు?" అన్నాడు బావ.
"నీతో మాట్లాడాలని"
"ఏంటో చెప్పు"
నేను వెళ్లి బావ పక్కన కూర్చున్నాను. వాడి ఎడమ చేయి చంక కిందుగా నా చేతిని పోనిచ్చి, వాడి ఎడమ చేతిని పట్టుకున్నాను. నా తలను వాడి భుజంపై చిన్నగా వాల్చి "బావా" అన్నాను.
"మ్మ్" అన్నాడు.
"నా మీద కావ్యకి జెలసీగా ఉందంటా"
"ఎందుకు?"
"నీ వల్లే"
"నేనేం చేశాను" అన్నాడు లేవబోతూ.
"అబ్బా కూర్చో బావా" అన్నాను నా చేతిని ఇంకా గట్టిగా బిగిస్తూ.
"నేనేం చేసానో చెప్పు" అన్నాడు నన్ను చూస్తూ.
"నువ్వు దొరకడం నా అదృష్టం అంట. నీలాంటి బావ తనకి లేడని నేనంటే జెలసీ" అన్నాను.
"ఈ విషయం అందరికీ తెలుసు. కానీ అందరూ నాతో ఏమని అంటున్నారో తెలుసా?" అన్నాడు.
"ఏం అంటున్నారు?" అన్నాను అత్రుతగా.
"నీ టేస్ట్ ఎందుకు రా ఇంత బాడ్ గా ఉంది అని అంటున్నారు" అని అన్నాడు.
"నిన్నూ..... చంపేస్తాను" అంటూ బావ భుజంపై చిన్నగా కొరికాను.
"ఎందుకు కొరికావే రాక్షసీ?" అన్నాడు భుజంపై రుద్దుకుంటూ.
"వాళ్లలా అంటుంటే నువ్వేం మాట్లాడనందుకు" అన్నాను నా చేతులు వాన్ని వదిలేస్తూ.
"నేనేం మాట్లాడకుండా ఉండలేదు" అన్నాడు.
"ఏం అన్నావు?" అడిగాను ఇంకా ఆత్రుతతో.
బావ చిన్నగా జరిగి నా చెవిలో "విధి చేసే పనుల నుండి ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పాను" అన్నాడు.
ఆ మాట వినగానే నేను వాన్ని కొట్టబోయాను. వాడు లేచి పరిగెత్తాడు. నేను లేచి వాడి వెనుక పరుగెత్తబోతూ నా మోకాలికి బెంచ్ తగలడంతో "అమ్మా" అని అరిచి అక్కడే కూర్చున్నాను. నా అరుపుతో వెనక్కి తిరిగి చూశాడు. నేను నా మోకాలు పట్టుకుని కూర్చున్నాను. నా దగ్గరికి పరుగెత్తుకు వచ్చి కింద రెండు కాళ్ల మీద క్కొర్చుని నా మోకాలిని తాకాడు. నేను వెంటనే బావ చెవిని పట్టుకుని పిండేస్తూ "ఇప్పుడు చెప్పు ఏమన్నావో....విధి....ఇంకా ఏదేదో వాగావు?" అన్నాను.
"ఇస్స్....అబ్బా....రాక్షసీ నొప్పిగా ఉంది" అన్నాడు.
"మరేం పర్వాలేదు ఆ మాత్రం నొప్పి తెలియాలిలే" అన్నాను.
"నేనేదో జోక్ చేశానే వదులు" అన్నాడు.
"ఇప్పుడు చెప్పు ఏమన్నావో?" అన్నాను వాడి చెవిని వదిలేస్తూ.
దానికి తను "ఎవరూ నీ గురించి నా దగ్గర కామెంట్ చేయలేదు" అన్నాడు వాడి చెవిని రుద్దుకుంటూ.
"అంటే?" అన్నాను.
"ఇందాకా నీతో చెప్పిందంతా అబద్ధమే" అన్నాడు.
దానికి నేను "నన్ను ఎప్పుడూ ఏడిపించాలనుకుంటావు కదా నువ్వు?" అన్నాను నేను వాడి చేతి మీద చిన్నగా కొడుతూ. వాడు లేచి నిలబడి "ఇక వెళ్దామా?" అన్నాడు.
నేను టైం చూసి "కాలేజి బస్సు వెళ్లిపోయి ఉంటుంది. ఇప్పుడెలా?" అన్నాను.
"లేట్ అయ్యేలా చేసింది నువ్వు. నన్నడిగితే ఎలా?" అన్నాడు.
"సరేలే RTC బస్సులో వెళ్లిపోదాం" అన్నాను.
"రష్ బాగా ఎక్కువగా ఉంటుంది" అన్నాడు.
"అయితే రష్ తగ్గేవరకు ఇక్కడే ఉందాం" అన్నాను.
వాడు తల పట్టుకుని "నీతో చాలా కష్టం సమీరమ్మా" అన్నాడు.
"అవును చాలా కష్టం" అన్నాను నేను నవ్వుతూ.
వాడు నా వైపు నవ్వుతూ చూసి "నేను రష్ గా ఉన్నా బస్సులో వెళ్లిపోతాను" అన్నాడు.
(అలా అనేసి వాడు డోర్ దాకా వెళ్లాడు)
నేను "బావా" అని పిలిచాను. వాడు వనక్కి తిరిగి చూశాడు. నేను వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి వాడిని హగ్ చేసుకున్నా. వాడు కూడా నన్ను హగ్ చేసుకున్నాడు. నాకు చాలా హాయిగా అనిపించింది. కాసేపటి తరువాత బావ "ఏమైంది సమీర?" అని అడిగాడు.
"ఏం లేదు" అన్నాను నేను.
బావ తన కౌగిలిని కాస్త వదులు చేశాడు.నేను మాత్రం అలాగే హగ్ చేసుకొని తలెత్తి బావను చూశాను. వాడు నాకంటే ఒక అడుగు పొడవు. బావ తల దించి నన్ను చూశాడు.
"ఇంకాసేపు ఇక్కడే ఉందాం బావా" అన్నాను.
"రూంస్ అన్నిటికీ లాక్ చేస్తారు. ఇక్కడే ఉంటే ఎలా?" అన్నాడు.
"వాళ్లు వచ్చి లాక్ చేసేంతవరకూ ఇక్కడే ఉందాం" అన్నాను.
"సరే పద" అన్నాడు.
"ఎక్కడికీ?" అన్నాను.
"వెళ్లి కుర్చుందాం" అన్నాడు.
నేను వాడిని వదిలి నవ్వుతూ వాడితో పాటు వెళ్లి కూర్చున్నాను. మేము అలా వెళ్లి కుర్చోగానే "బాబు రూము లాక్ చెయ్యాలి" అంటూ వచ్చాడు వాచ్ మేన్.
ఇక తప్పదు అన్నట్లు ఇద్దరం లేచి బయటకు వచ్చాం.
"కాఫీ తాగుదామా?" అని అడిగాడు బావ.
(మొదట్లో నాకు కాఫీ అలవాటు లేదు. కానీ బావ కోసం అలవాటు చేసుకున్నా)
"పద వెళ్దాం" అన్నాను.
ఇద్దరం ఒకరి చేయి ఒకరం పట్టుకుని కెఫెటేరియా వైపు నడుచుకుంటూ వెళ్లాం. అక్కడ కాఫీ ఆర్డర్ చేసి, తీసుకుని వచ్చి టేబుల్ దగ్గర ఎదురెదురు కుర్చీలలో కూర్చుని కాఫీ తాగేసాం. బాగా లేట్ అయినందువల్ల క్యాంటీన్ లో పెద్దగా ఎవరూలేరు. ఇద్దరం బయటకి వచ్చి బస్ స్టాప్ లో నిల్చున్నాం. బస్సు రాగానే ఖాళీగా ఉండటంతో ఎక్కేసాం. ఎక్కికూర్చోగానే నాకు నిద్ర వెచ్చేసింది. మేము దిగాల్సిన చోటు రాగానే బావ నన్ను లేపి "పద వెళ్దాం" అన్నాడు.
ఇద్దరం బస్సు దిగి "బై" చెప్పుకుని అక్కడి నుండి వెళ్లిపోయాం.
ఇక ఆ రోజు బావతో జరిగిన విషయాలన్ని గుర్తు తెచ్చుకుని హాయిగా నిద్ర పోయాను.
Like Reply
#4
నెక్స్ట్ డే సండే కావడం వల్ల అలాగే పడుకుండిపోయాను. పొద్దున్నే ఒక ఫోన్ కాల్ తో మేల్కున్నాను. "ఎవరా?" అని చూస్తే అన్నయ్య.
(అన్నయ్య పేరు శివ. మేం ఇద్దరం కవల పిల్లలం. వీడు నాకంటే కొన్ని సెకండ్లు పెద్ద. వాడు తిరుపతిలో చదువుకుంటున్నాడు నాలాగే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారంటే అది అన్నయ్య, బావలే)
ఫోన్ లిఫ్ట్ చేసి "ఎలా ఉన్నావ్ రా?" అని అడిగాను.
"నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావ్?" అని అడిగాడు.
"ఏదో మీ దయ" అన్నాను.
"మాదేముందిలే" అన్నాడు.
"ఇంకేంటి రా?" అని అడిగాను.
"అమ్మా నాన్నా ఎలా ఉన్నారో తెలుసా? ఫోన్ ఏమైనా చేశారా?" అని అడిగాడు.
"ఏమో బావ ఊరెళ్లి నిన్నే వచ్చాడు. వాడిని అడిగి కనుక్కో" అన్నాను.
"వాడు మొన్నటిదాకా నా దగ్గరే ఉన్నాడు. ఊరెప్పుడు వెళ్లాడు?" అని అడిగాడు. "ఏం మాట్లాడుతున్నావ్ రా?" అర్థం కాక అడిగాను.
"ఐతే వాడు నీకేం చెప్పలేదా?" అన్నాడు.
"ఏం జరిగిందీ?" అని అడిగాను
"మొన్నటిదాకా వాడికి హెల్త్ సరిగా లేదు. నాలుగు రోజులు నా దగ్గరే ఉండి, ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుని మొన్న నేను వద్దంటున్నా వినకుండా బయల్దేరాడు. ఈ విషయం నీకు ఫోన్ చేసి చెప్పమంటే బాధ పడతావని చెప్పొద్దు అన్నాడు" అంటూ టూకీగా మొత్తం జరిగిందంతా చెప్పాడు.
ఇదంతా వినగానే నాకు బావను చూడాలనిపించింది.
"హల్లో" అన్నాడు అన్నయ్య.
"హా..." అన్నాను.
"ఏంటే ఏమైందీ?" అని అడిగాడు.
"ఏం లేదు?" అన్నాను.
"ఈ విషయాలన్ని నీతో చెప్పలేదా?" అని అడిగాడు.
"అస్సలు చెప్పలేదు రా" అన్నాను కాస్త బాధగా.
"ఐతే నువ్వు కూడా ఏమి తెలియనట్లే ఉండు. లేకపోతే వాడు నన్ను చంపేస్తాడు" అన్నాడు.
"సరే" అన్నాను.
"సరే ఐతే ఉంటాను రా" అన్నాడు.
"బై" అని చెప్పి ఫోన్ పెట్టేశాను.
(ఈ విషయాలన్ని నాతో చెప్పనందుకు బావ మీద పీకల దాకా కోపం వచ్చింది. అదే సమయంలో నేను బాధ పడతానని వాడు దాచినందుకు అంత కంటే ఎక్కువ సంతోషమేసింది)
వెంటనే బావకి కాల్ చేశాను."ఏంటే ఇంత పొద్దున్నే కాల్ చేశావు?" అన్నాడు.
వాడు చెప్పిన విధానం బట్టి ఇంకా నిద్ర లేచినట్లు లేడు.
"ఏంట్రా ఇంకా తెల్లవారలేదా?" అన్నాను.
"ఇది అడగడానికి కాల్ చేశావా? బయట చూడవే తెలుస్తుంది" అన్నాడు అదే టోన్ తో.
"ఈ వెటకారానికి ఏం తక్కువలేదు. నేను ఇంకో పది నిమిషాలలో నీ రూంలో ఉంటా. లేచి రెడీగా ఉండు" అన్నాను.
"అబ్బా పొద్దున్నే నా ప్రాణం తీయడానికి కంకణం కట్టుకున్నావా?" అన్నాడు.
"నూవ్వు ఏమైనా అనుకో నేను వస్తున్నా అంతే" అని కాల్ కట్ చేశాను.
అరగంటలో అన్ని కార్యక్రమాలు ముగించుకుని వాడి రూం కాలింగ్ బెల్ కొట్టాను. చాలాసేపటి తరువాత వచ్చి డోర్ తీశాడు. వాడి వాలకం చూస్తే ఇప్పటిదాకా ఇంకా పడుకునే ఉన్నట్లు ఉన్నాడు.
"ఏంట్రా నేనేం చెప్పాను?" అని అడిగాను.
"ఏమో గుర్తులేదు. గుర్తొస్తే చెప్తా" అంటూ మళ్లీ బెడ్ పై వాలాడు.
"ఏం అవసరం లేదు వెళ్లి ఫ్రెష్ అవ్వు" అంటూ వాడి భుజం పై చిన్నగా కొట్టాను.
"అబ్బా పడుకోనీవే" అన్నాడు వాడి పైకి దుప్పటి లాక్కుంటూ.
"ఏయ్ చెప్తే వినాలి" అంటూ దుప్పటి లాగేశాను.
"రాక్షసీ" అంటూ బాత్ రూంలోకి దూరాడు.
నేను నవ్వుకుంటూ బయట వెయిట్ చేయసాగాను. సరిగ్గా అరగంట తరువాత వచ్చాడు ఒంటి మీద టవల్ తో. వాడిని అలా చూస్తుంటే నాకు మా బాల్యం గుర్తుకొచ్చింది.
"చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడూ అలాగే ఉన్నావ్ రా" అన్నాను వాన్ని చూస్తూ.
"అవును నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను" అన్నడు తల మీది జుట్టుని స్టైల్ గా దువ్వుకుంటూ.
"చాల్లే వెళ్లి భట్టలు వేసుకుని రా" అన్నాను.
"నిన్నెవడు చేసుకుంటాడో గానీ నరకం చూస్తాడు" అంటూ బెడ్ రూం లోకి నడిచాడు.
"పొద్దున్నే నన్ను ఏడిపించకుండా నీకు రొజు స్టార్ట్ అవ్వదా?" అన్నాను కోపంగా.
"అవునవును ఎవరు ఎవర్ని ఏడిపిస్తున్నారో తెలుస్తూనే ఉంది" అన్నాడు వెటకారంగా.
"అంటే ఏంట్రా ఇప్పుడు నేను నిన్ను ఏడిపిస్తున్నానా?" అని అడిగాను కాస్త బుంగ మూతి పెట్టుకుని.
"ఈ అలకలకు ఏం తక్కువలేదు గానీ, టిఫిన్ తిన్నావా?" అని అడిగాడు.
"లేదు. బయట తిందాం పద" అన్నాను.
"సరే పద" అంటూ బయటికి వచ్చాడు.
"వెళ్దామా?" అని అడిగాను.
"పదండి మేడం" అన్నాడు.
"ముందు నువ్వు పద" అన్నాను.
వాడు రూం కీ అండ్ లాక్ తీసుకుని డోర్ వైపు నడవసాగాడు. నేను వాడిని అలాగే చూస్తూ "బావా" అని పిలిచాను.
'మ్మ్" అని వెనక్కి తిరిగాడు.
"నన్నెప్పుడూ విడిచిపెట్టవు కదా?" అన్నాను. ఆ మాట చెబుతుంటే నా కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి.
వాడు నా దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వచ్చి "ఏయ్ ఏమైందీ?" అని అడిగాడు.
"ఏం లేదు పద" అన్నాను కళ్లు తుడుచుకుంటూ.
"నా దగ్గరే సీక్రెట్సా?" అన్నాడు.
"నువ్వు దాచగా లేనిది నేను దాస్తే తప్పేంటి?" అని అడిగాను తల దించుకుంటూ.
వాడు నా తల పైకి ఎత్తి "ఏంటి మేడం ఏం జరిగింది? నీ దగ్గర నేనేం దాచానో చెప్పు?" అని అడిగాడు.
"పొద్దున్నే అన్నయ్య కాల్ చేశాడు" అని చెప్పాను.
వాడు కాస్త భయపడి "అంతా చెప్పేశాడా?" అని అడిగాడు.
"నువ్వెందుకు దాచావ్ రా?" అని అడిగాను.
"అది చెప్పుకునేంత పెద్ద విషయం కాదే" అన్నాడు.
"అది నీకు చిన్న విషయం కావచ్చు. కానీ నాకు చాలా పెద్దది. పొద్దున వాడు చెబుతుంటే నాకు ఎంత బాధేసిందో నీకేం తెలుసు" అని చెప్పాను.
"దీనికంతటికీ కారణం వాడు. ముందు వాన్ని తన్నాలి" అన్నాడు.
"తప్పు నువ్వు చేసి వాన్ని అంటావే" అన్నాను సీరియస్ గా.
"తల్లీ మా అన్నాచెల్లెల్లకు ఒక దండం. మీ ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు ఏ విషయాన్నీ దాచుకోరు అని తెలిసి కూడా వాడికి దాయమని చెప్పడం నా తప్పు" అని అన్నాడు చేతులు జోడిస్తూ.
"రేయ్ నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేస్తే చంపేస్తాను" అన్నాను.
"చంపెయ్యవే. అడగడానికి ఎవరూ లేరనే కదా లోకువ" అన్నాడు.
ఆ మాట వినగానే నాలో బాధా, కోపం కట్టలు తెంచుకున్నాయి.
"ఇంకోసారి ఇలా వాగావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు" అన్నాను అలాగే ఏడుస్తూ.
"ఐతే ఏం చేస్తావో ఒక క్లారిటీ తెచ్చుకో. తరువాత చూద్దాం" అన్నడు వెటకారంగా.
వాడు అలా అనగానే నేను వాన్ని కొట్టడం మొదలుపెట్టాను. వాడు అలాగే కొట్టించుకుంటున్నాడు. వాన్ని అలా చూడగానే నాకు బాధేసింది. వెంటనే వాన్ని గట్టిగా హగ్ చేసుకున్నా. వాడు కూడా నన్ను హగ్ చేసుకున్నాడు. వాడి కౌగిలి నాకు బాధ నుండి విముక్తి కలిగించే మందులా పని చేసింది. కాలం అక్కడే నిలిచిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. ఇంతలోనే వాడు ఏడుస్తున్నట్లు నాకు అనిపించింది. వాడి కౌగిలి నుండి బయటపడి వాన్ని చూస్తే వాడి కళ్లలో నీళ్లు.
"నువ్వెందుకురా ఏడుస్తున్నావు?" అని అడిగాను.
దానికి వాడు "ఏం లేదు?" అన్నాడు.
"అదిగో మళ్లీ ఏదొ దాచాలని చూస్తున్నావు?" అన్నాను కోపంగా.
"ఈ విషయం చెప్తే నీకు కోపం వస్తుంది" అన్నాడు.
"ముందు చెప్పు" అన్నాను.
"నాకు ఆరోగ్య బాగలేక పోతేనే ఇంత బాధపడ్డావే, ఒకవేళ నేను చనిపోతే ఏమైపోతావో? అని" అని అన్నాడు.
"ఏంట్రా ఆ మాటలు? ఇంకెప్పుడూ ఇలా మాట్లాడొద్దు" అన్నాను కోపంగా.
"అబ్బా ఆకలిగా ఉంది సమీరా" అన్నాడు.
"సరే పద ఏదైనా హోటల్ కు వెళ్లి టిఫిన్ తిందాం" అన్నాను.
ఇద్దరం బయటకి వచ్చాం. వాడు రూం లాక్ వేసి వచ్చాడు. ఇద్దరం నడుచుకుంటూ వెళ్తున్నాం.
"ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట వినకుండా తయారయ్యావు" అన్నాడు.
"దేని గురించీ?" అన్నాను.
"రూంకు రావద్దు ఎవరైనా చూస్తే బాగోదు అంటే వింటావా? వినవు." అన్నాడు.
"మా బావ రూం. నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చినప్పుడు వెళతాను మధ్యలో నీకేంటి?" అని అడిగాను.
"నాకు కాదు చూసేవాళ్లు తప్పుగా అనుకుంటారు" అన్నాడు.
"అనుకోనీ నాకేంటీ?" అంటూ వాడి చంక కిందుగా చేయి వేసి వాడి చేతిని పట్టుకుని నడవసాగాను.
అలా నడుచుకుంటూ హోటల్ కు వెళ్లిపోయాం.
Like Reply
#5
మేము క్యాంటీన్ కు వెళ్లి ఒక టేబుల్ చూసుకుని కూర్చున్నాం.
"ఏం తిందాం?" అని అడిగాడు బావ.
"నీ ఇష్టం" అన్నాను.
బావ టూ ప్లేట్స్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చాడు. ఇంతలో నాకు ఒక డౌట్ వచ్చింది. బావను అడగాలనిపించింది.
"బావా...!" అని పిలిచాను.
"ఆ.." అంటూ నా వైపు చూశాడు.
"నాకు ఊరెళ్తున్నాను అని చెప్పి అన్నయ్య దగ్గరికి ఎందుకు వెళ్లావ్ రా?" అడిగేశాను.
"ఒక పర్సనల్ పని మీద వెళ్లాను" అని చెప్పాడు.
"అంటే నాకు చెప్పకూడదా?" అని అడిగాను.
"దానికి అర్థం అదే కదా" అన్నాడు నవ్వుతూ.
"సరేలే. ఈ ప్రపంచంలో నువ్వొక్కడివే తెలివైనవాడివి" అన్నాను.
"మరేమనుకున్నావ్" అన్నాడు కాలర్ ఎగరేస్తూ.
"చెప్తావా? చెప్పవా?" అని అడిగాను.
"అది నీకు తప్పా ఎవరికైనా చెప్పొచ్చు. కానీ నీకు చెప్పాలంటే ఇంకా టైం ఉంది" అన్నాడు.
"ఐతే అన్నయ్యను అడిగేస్తాను" అన్నాను.
"నాకు వాడి మీద నమ్మకం ఉంది. ఈ విషయం మాత్రం నీకు చెప్పడు" అన్నాడు.
"సరే పో ఏదో టైం రావాలి అన్నావుగా, అప్పటివరకు వైట్ చేస్తా" అన్నాను.
ఇంతలో ఆర్డర్ చేసిన ఇడ్లీ వచ్చింది.
"టైం కాదు ఇడ్లీ వచ్చింది తిను" అన్నాడు.
నేను ఫక్కున నవ్వేసాను. నేను నవ్వడం చూసి వాడు కూడా నవ్వాడు. అలా నవ్వుకుంటూ టిఫిన్ తినేసి బయటికి వచ్చాం.
"తరువాత ఏంటి ప్రోగ్రాం?" అన్నాను కళ్లు ఎగరేస్తూ.
"ఏం లేవు. నువ్వు హాస్టల్ కు, నేను రూంకు" అంటూ నడవబోయాడు.
"నేను వాడి షర్ట్ పట్టుకుని వెనక్కి లాగి "పొద్దున్నే రెడీ అయ్యి నీతో ఉండాలని వస్తే నువ్వేంటి ర వెళ్లిపోదాం అంటావ్" అన్నాను.
"సరే ఎక్కడికి వెళదాం?" అన్నాడు.
నేను టైం చూస్తే 10:40 అవుతోంది.
"సినిమా కు వెళదాం" అన్నాను.
"ఇప్పుడేం మంచి సినిమాలు లేవుగా?" అన్నాడు.
"ఏదో ఒకటి వెళ్దాం" అన్నాను.
"సరే పద" అంటూ నడిచాడు.
ఇద్దరం అలా నడుచుకుంటూ బస్ స్టాప్ దాకా వచ్చాం. బస్సు రాగానే ఎక్కేసి థియేటర్ దాక వెళ్లాం. వెళ్లి చూస్తే అక్కడ హౌస్ ఫుల్ అని బోర్డ్ పెట్టేశారు. ఇద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. ఏం చేద్దాం అన్నట్లు సైగ చేశాడు బావ. ఏమో అన్నట్లు సైగ చేశాను నేను.
"పద వెళదాం" అన్నాడు బావ.
"ఎక్కడికీ?" అన్నాను.
"నేను రూంకి, నువ్వు హాస్టల్ కీ" అన్నాడు.
"ఉహూ...బావా" అన్నాను గోముగా.
"సరే ఏం చేద్దామో నువ్వే చెప్పు" అన్నాడు.
"ఐతే నాతో రా" అన్నాను.
"ఎక్కడికీ?" అని అడిగాడు.
"ఏం మాట్లాడకుండా రా బావా" అంటూ చేయి పట్టుకుని లాగాను.
"తప్పుతుందా? పద" అన్నాడు.
నేను బావను చికెన్ షాపుకి తీసుకెళ్లి అరకిలో చికెన్ తీసుకు రమ్మన్నాను. బావ ఏం మాట్లాడకుండా వెళ్లి తీసుకొచ్చాడు. ఇద్దరం మళ్లీ బుస్సు ఎక్కి మేముండే ఏరియాకి వెళ్లిపోయాం. అక్కడ ఒక చికెన్ మసాలా ప్యాకెట్ ఒకటి కొనుక్కుని ఇంకా కావలసిన కూరగాయలు కొని రూంకు వెళ్లిపోయాం. వెళ్లడం తోనే బాగా అలసిపోయిన వాడిలా బెడ్ రూంలో దూరి బెడ్ పై వాలాడు బావ. నేను వంట రూంలోకి వెళ్లి వంట చేయడం ప్రారంభించాను. సరిగ్గా 12:15 గంటలకు వంట చేయడం పూర్తి అయిపొయింది. నేను బావ దగ్గరికి వెళ్లి చూస్తే మొద్దు నిద్రలో ఉన్నాడు.
"బావా...బావా..." అంటూ లేపాను.
బావ లేచి నన్ను చూసి ఏంటి అన్నట్లు కళ్లు ఎగరేశాడు.
"భోం చేద్దాం రా బావ" అన్నాను.
"నువ్వు తినెయ్, నేను తరువాత తింటాను" అన్నాడు.
"అదేం కుదరదు. వెళ్లి ముఖం కడుక్కుని తినడానికి రా" అన్నాను.
"పోవే..." అంటూ కళ్లు మూసుకున్నాడు.
"లెయ్ బావా" అంటూ చేయి పట్టుకుని లేపాను.
దాంతో వాడు బెడ్ మీద కూర్చున్నాడు.
"హాలిడే రోజు కూడా నాకు ఏంటి టార్చర్" అన్నాడు.
"నాకు చెప్పకుండా అన్నయ్య దగ్గరికి వెళ్లావు కదా అందుకే" అన్నాను. వాడు నన్ను ఒకసారి చూశాడు.
"ఏంట్రా అలా చూస్తున్నావ్?" అని అడిగాను.
వాడు లేచి నిలబడి నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని "ఐ లవ్ యూ సమీరా" అన్నాడు.
"సరేలే వెళ్లి ముఖం కడుక్కుని రా" అన్నాను.
"ఛీ...కొంచెం కూడా రొమాన్స్ తెలీదు" అంటూ బాత్రూంలోకి వెళ్లిపోయాడు.
వాడు వెళ్లగానే నవ్వుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాను. వాడు వచ్చి టేబుల్ మీద ఉన్న చికెన్ చూసి రుచి చూద్దామని చేయి పెట్టాడు. బాగా వేడిగా ఉండడం వల్ల కాలిందనుకుంటా.
"అమ్మా...." అంటూ అరిచి చేతిని వెనక్కి తీసుకున్నాడు.
"అయ్యో బావా...ఏమయ్యింది?" అంటూ వాడి చేతిని తీసుకుని గాలి ఊపడం మొదలుపెట్టాను.
నాకు చాలా బాధేసి కళ్లలో నీళ్లు తిరిగాయి. వాడు నా తల మీద చిన్నగా కొట్టి "నాకేం కాలేదు లేవే ఆ కుళాయి కట్టేసెయ్" అన్నాడు నవ్వుతూ. నేను వాడి వైపు కోపంగా చూశాను. నా కళ్లలో ఇంకా నీరు కారుతున్నాయి. వాడు నన్ను చూసి భయపడినట్లు నటిస్తూ కుర్చీలో కుర్చున్నాడు. నేను వాడి పక్కనే కూర్ఛుని "ఎందుకు రా ఇలా చేశావ్?" అన్నాను చిన్నగా వాడి భుజంపై కొడుతూ. వాడు ఏం మాట్లాడకుండా అన్నం వడ్డించి నా చేతికి ఇచ్చాడు. "ముందు నువ్వు తిను, నేను వడ్డించుకుంటాలే" అన్నాను.
"అదేం కుదరదు" అంటూ అన్నం కలిపి నా నోటి దగ్గర పెట్టాడు. నేను నా కన్నీళ్లు తుడుచుకుని నోరు తెరిచాను. వాడు నాకు తినిపించడం ప్రారంభించాడు.
"ఇలా అలుగుతూ ఉంటే మా అన్నయ్యా కష్టపడిపోతాడు" అన్నాడు.
"అన్నయ్య ఎవరూ?" అని అడిగాను అనుమానంగా.
"నీకు కాబోయే మొగుడు" అన్నాడు.
"ఇదిగో ఇలా వాగావంటే వెళ్లిపోతాను" అంటూ లేవబోయాను.
"అన్నం తింటూ మధ్యలో ఆపితే పాపం" అంటూ నా చేయి పట్టుకుని గుంజి కూర్చోబెట్టాడు.
"తిరుపతిలో నాకు చరణి కనిపించింది" అన్నాడు.
(చరణి మా బాబాయ్ కూతురు. అది బయట పడదు కానీ దానిక్కూడా బావంటే ఇష్టమే. ఈ విషయం వాడికి తెలిసి కూడా నన్ను ఏడిపించడానికి దానితో క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు)
దాని పేరు వినగానే ఒళ్లంతా కంపరంగా అనిపించింది.
"దానికి అక్కడేం పని?" అని అడిగాను.
"చిన్న మావయ్యకి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యిందంటా. ఇప్పుడు వాళ్ల ఫ్యామిలీ అంతా తిరుపతికి షిఫ్ట్ అయ్యారు" అన్నాడు.
"అవునా...ఏం మాట్లాడింది?" అని అడిగాను.
"నన్ను, మీ అన్నయ్యను ఇంటికి భోజానికి పిలిచింది" అన్నాడు.
"అప్పుడు పక్కన అన్నయ్య కూడా వున్నాడా?" అని అడిగాను.
"హా..." అన్నాడు.
"పిలవగానే ఎగేసుకుంటూ వెళ్లిపోయారా?" అని అడిగాను.
"వాళ్లేమి పరాయి వాళ్లు కాదు కదా? అందులోనూ ఊరు కాని ఊళ్లో మన వాళ్లు ఉంటే కలవకపోతే బాగోదుగా?" అన్నాడు.
"వెళ్లి సుబ్బరంగా తిన్నారా?" అన్నాను.
"తను అంత "ప్రేమ" గా వడ్డిస్తే తినకుండా ఎలా ఉంటాం" అన్నాడు నవ్వుతూ.
"నవ్వకు నాకు మండుతోంది" అన్నాను.
వాడు ముసిముసిగా నవ్వుకుంటున్నాడు.
"ఇంకేం మాట్లాడలేదా?" అని అడిగాను.
"తినేసి, కాసేపు మాట్లాడి వెళ్లిపోయాం" అన్నాడు.
"అందుకేనేమో ఆరొగ్యం బాగలేక ఉండిపోయావు" అన్నాను.
"ఎంతైనా మీకు మీరే శత్రువులు" అన్నాడు.
ఇలా మాట్లాడుతూ తినేశాను. మధ్యమధ్యలో నేను కూడా బావకు తినిపిస్తున్నాను. ఇలా తినడం ముగించుకుని చేతులు కడుక్కుని నేను బెడ్ పై నడుం వాల్చగానే నిద్రొచ్చేసింది.
Like Reply
#6
సాయంత్రం లేచి టైం చూస్తే 5 గంటలు అవుతోంది. బావ కోసం చూశాను. కనిపించలేదు. లేచి వెళ్లి ముఖం కడుక్కుని హాల్లోకి రాగానే వంటింట్లో ఏదో చప్పుడైనట్లు అనిపించింది. అటుగా వెళ్లి చూస్తే బావ అప్పుడే రెండు కప్పుల్లో కాఫీ పోస్తున్నాడు.
"నీకెందుకు బావా? నేను చేసేదాన్ని కదా" అన్నాను.
"నువ్వు నిద్రపోతున్నావని నేను చేశాను లేవే. అయినా ఈరోజు నువ్వు చేస్తావు, రేపటి నుంచి నేనే చేసుకోవాలిగా" అన్నాడు కప్పులు తీసుకుని నా వైపు నడుస్తూ.
"ఒకప్పుడు కష్టమే తెలీకుండా పెరిగావు. ఇప్పుడేంటి బావా ఇలా?" అన్నాను బాధగా బావ చేతిలోని ఒక కప్పు తీసుకుంటూ.
"నిజమేనే....! అమ్మా, నాన్నా నాకు కష్టమే తెలీకుండా పెంచారు. ఇప్పుడు వాళ్లు లేరు. ఎందుకో ఒంటరిని అన్న ఫీలింగ్ వస్తోంది" అన్నాడు చెమ్మగిల్లిన గొంతుతో.
"అదేంటి బావా అలా అంటావ్? నీకు మేమంతా ఉన్నాం కదా" అన్నాను ఓదారుస్తున్నట్లు.
"నీకు తెలీదు సమీర నేను పడే బాధ. పైకి నవ్వుతున్నా లోపల ఏదో తెలియని ఫీలింగ్" అన్నాడు.
అది చెబుతుంటే వాడి కళ్లలో చిన్నగా కన్నీరు.
"ఏంటి బావా ఇది చిన్నపిల్లాడిలాగ?" అన్నాను వాడి కళ్లు తుడుస్తూ.
"అత్తయ్యలో అమ్మను, మావయ్యలో నాన్నను చూసుకుంటున్నాను, మీరు మాత్రం నన్ను దూరం చెయకండి సమీరా" అన్నాడు.
"ఏంట్రా ఆ మాటలు? కాఫీ తాగు చల్లారిపోతుంది" అన్నాను.
వాడు కాఫీ తాగడం మొదలుపెట్టాడు.
"మా అమ్మానాన్నలని నీ అమ్మానాన్నలుగా అనుకుంటే అనుకున్నావ్ గానీ, నన్ను మాత్రం నీ చెల్లెలి లాగా అనుకోవద్దు. చంపేస్తాను" అన్నాను వాడి వైపు అదోలా చూస్తూ.
వాడు నన్ను చూసి గట్టిగా నవ్వేశాడు. అలా నవ్వుకుంటూ ఇద్దరం కాఫీ తాగేశాం. నేను కప్పులు తీయబోతుంటే "కాఫీ ఎలా ఉంది?" అని అడిగాడు బావ.
"టానిక్ లాగ ఉంది" అన్నాను నవ్వుతూ.
"అంటే" అన్నాడు అనుమానంగా.
"ఇప్పటిదాక పడ్డ బాధనంతా మర్చిపోయేలా చేసింది" అన్నాను వంటింట్లోకి నడుస్తూ.
"సమీరా" అన్నాడు.
"ఏంటి బావా?" అన్నాను వెనక్కి తిరిగి.
"నన్నెప్పుడు విడిచి వెళ్లకే. పిచ్చోడిని అయిపోతాను" అన్నాడు నా చేతిని వాడిచేతిలోకి తీసుకుంటూ.
"ఇది నా డైలాగ్ నువ్వు చెప్పావేంటి?" అన్నాను.
"పడతాయ్ నీకు" అంటూ లేచాడు బావా.
నేను పరుగెత్తుకుంటూ వంటింట్లోకి దూరిపోయాను. కప్పులు కడిగి హాల్లోకి రాగానే బావా ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు.
"ఏంటి బావా ఆలోచిస్తున్నావ్?" అన్నాను.
"రేపు నువ్వు నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటా? అని" అన్నాడు.
బావ దగ్గరికి వెళ్లి నుదుటిమీద ముద్దు పెట్టుకుంటూ "నువ్వు వదిలినా, నేను వదలను బావా" అన్నాను. దాంతో బావ నన్ను గట్టిగా హగ్ చేసుకున్నాడు. నేను కూడ బావ వీపు పై చేతులు వేసాను. వాడి కౌగిలి నాకు ఊపిరి ఆడనివ్వట్లేదు కానీ బావ నాతో అలాగే ఉండిపోతే బాగుంటుంది అనిపించింది. కాసేపటికి బావే విడిపడి నన్ను చూస్తున్నాడు. వీడు ఇలాగే ఉంటే ఏడుస్తుంటాడు, లేదా నన్ను ఏడిపిస్తాడు అని అనిపించింది.
"బావా బయటికి వెళ్దామా?" అని అడిగాను.
"ఎక్కడికీ" అని అడిగాడు.
"రేపు ఫ్రెషర్స్ పార్టి ఉంది తెలుసా?" అని అడిగాను.
"అరే మర్చిపోయాను. ఐతే ఇప్పుడేంటి?" అని అడిగాడు.
"షాపింగ్ చేద్దాం" అన్నాను.
"సరే పద" అన్నాడు.
ఇద్దరం రెడీ అయ్యి ఒక అరగంటలో షాపింగ్ మాల్ కు చేరుకున్నాం.
"ముందు ఏం కొందాం?" అని అడిగాడు.
"నేను రేపు చీర కట్టుకుంటాను బావా" అన్నాను.
"నీకు బుద్ధుందా?" అని అడిగాడు బావ.
"అదేంటి, అలా అన్నావ్?" అని అడిగాను.
"లేకపోతే చీర లేడీస్ వేసుకుంటరు. నీకెందుకు?" అన్నాడు నవ్వుతూ.
"నిన్నూ...." అంటూ వాడి పైకి చెయ్యెత్తాను.
"ఓకే....ఓకే...పద" అంటూ నన్ను కొట్టకుండా ఆపి లోపలికి నడిచాడు.
నేను బావ వెనకే చిన్నగా నవ్వుకుంటూ మాల్ లోకి నడిచాను.
ముందు లేడీస్ వేర్ లోకి వెళ్లి నాకు చీర సెలెక్ట్ తీసుకున్నాం. అది సెలెక్ట్ చేయడానికి బావకి ఒక గంట టైం పట్టింది. తరువాత జెంట్స్ సెక్షన్ లోకి వెళ్లాం. అక్కడ బావకు ఒక ప్యాంట్ అండ్ షర్ట్ సెలెక్ట్ చేశాను. ఇది మాత్రం అరగంటలో అయిపోయింది. బయటికి వచ్చి చూస్తే చీకటి పడుతోంది. ఇక వెళ్లాలా అన్నట్లుగా చూసాను బావ వైపు.
బావ నన్ను చూసి "నెక్స్ట్" అన్నాడు.
"ఇంకేం లేదు బావ. నీకేమైనా కావాలా?" అని అడిగాను.
"నాకేమొద్దు" అన్నాడు.
ఇద్దరం అలా నడుచుకుంటూ వస్తున్నాం. దారిలో ఐస్ క్రీం పార్లర్ కనిపించింది.
"బావా ఐస్ క్రీం తిందామా?" అని అడిగాను.
"పద" అంటూ నడిచాడు.
లోపలికి వెళ్లి కూర్చున్నాం.
"ఏం తింటావు?" అని అడిగాడు.
"అదేంటి నువ్వు తినవా?" అని అడిగాను.
"ఐస్ క్రీం తిన్నందుకే తిరుపతిలో నాలుగు రోజులు మంచం మీద ఉండాల్సివచ్చింది" అన్నాడు.
"మరి అన్నయ్యకు జ్వరం రాలేదే?" అని అడిగాను.
"వాడు రాలేదు" అన్నాడు.
"మరి ఎవరితో వెళ్లావ్?" అని అడిగాను.
"చరణితో" అన్నాడు నవ్వుతూ.
"దానితో ఎందుకు వెళ్లావ్?" అని అడిగాను.
"పిలిస్తే వెళ్లాను" అన్నాడు.
"మరి అన్నయ్యను పిలవలేదా?" అన్నాను.
"పిలిచింది. కానీ వాడు ఏదో పని ఉందని రాలేదు" అన్నాడు నవ్వుతూ.
"నవ్వు ఎందుకొస్తోంది నీకు?" అని అడిగాను.
"నిన్ను చూస్తుంటే నవ్వు వస్తోంది" అన్నాడు.
"నవ్వింది చాల్లే. నాకు కాలుతోంది" అన్నాను.
"ఎక్కడ?" అన్నాడు.
"ఎక్కడైతే నీకెందుకు రా?" అన్నాను కోపంగా.
"ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేద్దామని" అన్నాడు.
"నిన్ను కొట్టడం లో తప్పులేదు" అంటూ వాడిని కొడుతున్నాను.
ఇంతలో వెయిటర్ వచ్చాడు.
"ఒక హనీమూన్ డిలైట్" అని చెప్పాను.
"మీకు సర్" అని బావను అడిగాడు వెయిటర్.
"నాకొద్దు. మేడం గారికి మాత్రమే" అన్నాడు నన్ను చూసి నవ్వుతూ.
నేను విసురుగా చూపుని వాడి వైపు నుండి పక్కకు తిప్పాను. కాసేపటికి ఆర్డర్ చేసిన ఐస్ క్రీం వచ్చింది. నేను ఏమి మాట్లాడకుండా తింటున్నాను. బావ నన్ను అలాగే చూస్తూ ఉన్నాడు.
"అలా చూడకు దిష్టి తగులుతుంది" అన్నాను.
దాంతో బావ నావైపు నుండి చూపుని పక్కకు తప్పించాడు. నేను చిన్నగా నవ్వుకుని తింటున్నాను. కాసేపటికి తినేసి ఇద్దరం బయటికి వచ్చేశాం. అలా నడుచుకుంటూ నేనుండే హాస్టల్ దాకా వచ్చేశాం.
"సరే బై సమీర" అన్నాడు బావ.
"బై బావ" అని బావ చేతిలోని నా శారీ ఉన్న కవర్ ని తీసుకుని లోపలికి వెళ్లిపోయాను.
నేనుండేది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చి బాల్కనీ లోంచి నా రూంలోకి వెళ్తూ బయటికి చూడగానే బావ నన్ను చూసి నవ్వుతూ చేయి ఊపుతున్నాడు. నేను కూడా చేయి ఊపాను. బావ అక్కడ నుండి వెళ్లిపోయాడు. నేను కూడా నా రూంలోకి వెళ్లిపోయాను. కాసేపటికి వెళ్లి తినేసి బావ తిన్నాడో లేదో అడగాలనిపించింది. వెంటనే బావకు కాల్ చేశాను.
"చెప్పు" అన్నాడు కాల్ లిఫ్ట్ చేసి.
"తిన్నావా?" అని అడిగాను.
"హా....నువ్వు?" అని అడిగాడు.
"ఇప్పుడే తినేశా" అన్నాను.
"సరే వెళ్లి పడుకో. పొద్దున్నే కాలేజ్ కి వెళ్లాలి" అన్నాడు.
"గుడ్ నైట్" అని చెప్పాను.
"ఓకే" అంటూ ఫోన్ పెట్టేశాడు.
నేను దుప్పటి కప్పుకుని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకుంటున్నా. బావ ఏడవడం గుర్తొచ్చింది. ఆ ఏడుపుకు సంబంధించిన గతంలోకి జారుకున్నాను.
[+] 1 user Likes Milf rider's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)